సానుభూతి కోసం బాధిత కార్డు | Amit Shah criticised West Bengal Chief Minister Mamata Banerjee | Sakshi
Sakshi News home page

సానుభూతి కోసం బాధిత కార్డు

Apr 12 2026 6:21 AM | Updated on Apr 12 2026 6:21 AM

Amit Shah criticised West Bengal Chief Minister Mamata Banerjee

మమతపై అమిత్‌ షా ఫైర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్‌ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్‌ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.

 బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్‌ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్‌ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement