కోల్‌కతాపై దాడి చేస్తామంటే ప్రధాని ఏం చేస్తున్నారు?: మమతా బెనర్జీ | mamata hits out at pm modi silence on pakistans threat | Sakshi
Sakshi News home page

కోల్‌కతాపై దాడి చేస్తామంటే ప్రధాని ఏం చేస్తున్నారు?: మమతా బెనర్జీ

Apr 6 2026 4:25 PM | Updated on Apr 6 2026 7:03 PM

 mamata hits out at pm modi silence on pakistans threat

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్‌కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్‌ ప్రగల్భాలు పలుకుతుంటే  మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) ‍నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్‌కతా  (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎ‍న్నికల సభలో బెంగాల్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడే మోదీ కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్‌ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదే ఏవరైనా భారత్‌ అదే విధంగా కోల్‌కతాను టార్గెట్‌ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement