‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’ | Misuse of govt machinery for political campaigns Mamata Banerjee | Sakshi
Sakshi News home page

‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’

Apr 19 2026 4:08 PM | Updated on Apr 19 2026 4:25 PM

Misuse of govt machinery for political campaigns Mamata Banerjee

కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్‌ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని,  కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 

ఆదివారం(ఏప్రిల్‌ 19వ తేదీ)  హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. 

మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.  తాము మహిళా రిజర్వేషన్‌ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్‌ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్‌ అంశం మోదీ పొలిటికల్‌ అజెండాగా మమతా అభివర్ణించారు.

శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా  ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. 

ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్‌ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement