రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం | Cash liquor drugs worth Rs 181 crore seized in west Bengal | Sakshi
Sakshi News home page

రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం

Mar 24 2026 7:48 PM | Updated on Mar 24 2026 8:24 PM

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో  ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో  బెంగాల్‌లో ఎన్నికల నియమావళి అమల్లోకి  వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. 

జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు  అధికారులు  వెల్లడించారు.  ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్‌ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్‌ మిస్టరీ

ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి  కోల్‌కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్‌లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement