పశ్చిమబెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల | West Bengal Assembly Elections 2026: BJP Manifesto Released | Sakshi
Sakshi News home page

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల

Apr 10 2026 1:24 PM | Updated on Apr 10 2026 2:16 PM

West Bengal Assembly Elections 2026: BJP Manifesto Released

కోల్‌కాతా: పశ్చిమబెంగాల్‌లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్‌ షా.. బెంగాల్‌లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.

వికసిత్‌ బెంగాల్‌ రోడ్‌మ్యాప్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ అమలు చేస్తామన్న అమిత్‌ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్‌లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.

భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్‌ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్‌ షా తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement