అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది  | SCI Dismisses Plea Challenging ECI Transfer Of Bengal IAS And IPS Officers | Sakshi
Sakshi News home page

అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది 

Apr 17 2026 4:43 AM | Updated on Apr 17 2026 4:43 AM

SCI Dismisses Plea Challenging ECI Transfer Of Bengal IAS And IPS Officers

ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు 

బెంగాల్‌లో అధికారుల బదిలీపై సుప్రీం అసహనం 

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఉన్నపళంగా సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సహా 1,000 మందికిపైగా ఉన్నతాధికారులను రాత్రికి రాత్రే ఈసీ బదిలీచేసిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. అయితే ఈ ఘటనలో తాము జోక్యంచేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని  ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ఈసీ నిర్ణయాన్ని సమరి్థస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

 ‘‘ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదిస్తే సముచితంగా ఉంటుంది. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల బేధాలతో అఖిలభారత సర్వీసుల అధికారులు నలిగిపోతున్నారు. ఆలిండియా సర్వీసెస్‌ ఏర్పాటు ఉద్దేశం నిష్ఫలమవుతోంది. ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం లోపించిన నేపథ్యంలో సమన్వయం కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)సర్వే కోసం న్యాయాధికారులను మేం నియమించాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement