ల్యాండింగ్‌కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు | Heavy rain creates panic as Mamata Banerjee aircraft circles | Sakshi
Sakshi News home page

ల్యాండింగ్‌కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు

Mar 27 2026 5:09 AM | Updated on Mar 27 2026 5:09 AM

Heavy rain creates panic as Mamata Banerjee aircraft circles

మమత ప్రయాణిస్తున్న విమానానికి వాతావరణ తిప్పలు

కోల్‌కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారర్యాలీల్లో పాల్గొని కోల్‌కతాకు ఛార్టెర్డ్‌ విమానంలో తిరుగుపయనమైన మమతకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అననుకూల వాతావరణం స్వాగతం పలికింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో విమానం గంటకుపైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. 

తర్వాత ఎట్టకేలకు 5.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్‌ అయింది. పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని అణ్డాల్‌ నగరంలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో మమత బయల్దేరారు. అరగంటలో కోల్‌కతాలోని నేతాజీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ అప్పటికే ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతమంతా పెద్ద గాలివానలో చిక్కుకుంది. దీంతో విమానాల రాకపోకలను నిలిపేశారు. చేసేదిలేక విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టి గంట తర్వాత దిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం, ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement