Live Updates
Bengal Elections: పోటెత్తిన ఓటరు.. రికార్డు పోలింగ్
సాయంత్రం 6 గంటల వరకూ 91. 35 శాతం పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకూ 91. 35 శాతం పోలింగ్
- 6 గంటలకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
- మరింత పోలింగ్ పెరిగే అవకాశం
- పోలింగ్ శాతం భారీగా పెరగడంతో పార్టీల్లో టెన్షన్ వాతావరణం
ముగిసిన పోలింగ్..
- ముగిసిన తొలి విడత పోలింగ్
- క్యూలైన్లలో ఉ న్న వారికి ఓటు వేసే అవకాశం
- రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన ప్రధాని మోదీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
బెంగాల్‌లో పోటెత్తిన ఓటరు
- వెస్ట్ బెంగాల్‌లో రికార్డు స్థాయి పోలింగ్
- పోటెత్తిన ఓటరు.. పోలింగ్ జోరు
- సాయంత్రం 5గంటల వరకూ బెంగాల్‌లో 90 శాతం పోలింగ్
- ఆరు గంటల వరకూ క్యూలైన్లలో ఉన్న వారికి అవకాశం
- పోలింగ శాతం మరింత పెరిగే అవకాశం
భారీ పోలింగ్ దిశగా వెస్ట్ బెంగాల్
- వెస్ట్ బెంగాల్‌లో భారీగా పోలింగ్
- మద్యాహ్నం 3 గంటల వరకూ 78.7 శాతం పోలింగ్ నమోదు
- ఇంకా రెండు నుంచి మూడు గంటల సమయం ఉండటంతో పోలింగ్ 85 శాతం దాటే అవకాశం ఉందనే అంచనాలు.
బీజేపీ అభ్యర్థి సువేందుపై దాడి
- కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై దాడి
- దారుణంగా కొట్టి తరిమేసిన స్థానికులు
- తనపై టీఎంసీ దాడి చేసిందన సువేందు ఆరోపణ
- ముందస్తు వ్యూహంలో భాగాంగానే తనపై దాడి
BREAKING : Mood of Bengal 🔥
BJP candidate from Kumarganj, Suvendu Sarkar literally beltéd and kicked out by locals, imagine the anger against BJP on ground
Yet BJP thinks Godi Media & ECI is enough to flip results 🤣🤣🤣 pic.twitter.com/OPO6tC1wei— Ankit Mayank (@mr_mayank) April 23, 2026
బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి
- బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి
- ఎమ్మెల్యే అగ్నిమిత్ర కారుపై దాడి
బెంగాల్‌లో 60 శాతం దాటిన పోలింగ్
- బెంగాల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్
- మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 62.18 శాతం పోలింగ్
నందిగ్రామ్‌లో హైటెన్షన్
- పోలీసులపై సువేందు సంచలన ఆరోపణలు.
- ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
- టీఎంసీ గూండాలతోనే నా పోరాటం.
- బీజేపీ ఏజెంట్ అరెస్ట్.
VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,
"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026
ముర్షిదాబాద్‌లో ఆగని హింసాకాండ
- ముర్షిదాబాద్‌లో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ మద్దతుదారులకు చెందిన ఒక కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
- ముర్షిదాబాద్‌లో రాళ్ల దాడి.
- కేంద్ర బలగాలు జోక్యం.. లాఠీచార్జీ
- కూచ్ బెహార్‌లో రహదారిని దిగ్బంధించిన టీఎంసీ కార్యకర్తలు
కూచ్ బెహార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్లు 47, 48 వద్ద ఉద్రిక్త పరిస్థితులు
#WATCH | West Bengal Elections 2026 | TMC workers smashed the car of a worker of the Aam Janata Unnayan Party (AUJP) as a clash broke out between the TMC and Aam Janata Unnayan Party (AUJP) party workers in Murshidabad. pic.twitter.com/2XKV0Y4rZ3
— ANI (@ANI) April 23, 2026
11 గంటల నాటికి 41.11% పోలింగ్
- పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 11 గంటల నాటికి 41.11% పోలింగ్
- చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడి.
- పశ్చిమ్ మేదినీపూర్‌లో అత్యధికంగా 44.69 శాతం పోలింగ్
- కూచ్ బెహార్ 38.67%, అలీపుర్దువార్ 38.8%,
- జల్పాయిగురి 39.51%, కాలింపాంగ్ 39.61%,
- డార్జిలింగ్ 39.72%, ఉత్తర దినాజ్‌పూర్ 39.04%,
- మాల్దా 38.22, ముర్షిదాబాద్ 41.59%
వాతావరణ శాఖ హెచ్చరికలు
- పశ్చిమ బెంగాల్‌కు భారత వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక
- 12 జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని అంచనా వేసింది.
- ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
- వరుసలో వేచి ఉన్నప్పుడు తలను వస్త్రంలో కప్పుకోవాలని సూచన
- ఒక వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోండి.
- లేత రంగు కాటన్ దుస్తులను ధరించండి.
- వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వైద్య సిబ్బందిని సంప్రదించండి.
West Bengal recorded a turnout of 18.76 % of 3.60 crore voters in the first two hours of voting in the first phase of the assembly polls on Thursday, according to the Election Commission. Polling started at 7 am in 152 assembly constituencies across 16 districts amid… pic.twitter.com/sgPKo8oURv
— Deccan Chronicle (@DeccanChronicle) April 23, 2026
సిలిగురిలో కార్యకర్తల ఘర్షణ
- సిలిగురిలో తృణమూల్ కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- జగదీష్ చంద్ర విద్యాపీఠంలో ఘటన.
- రంగంలోకి దిగిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు.
- బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్ సమక్షంలో ఘర్షణ
- పోలింగ్‌కు స్వల్ప అంతరాయం.
ఈవీఎంలో సాంకేతిక లోపం
- ఈవీఎంలో సాంకేతిక లోపంతో ఇబ్బందులు
- ఓటు వేయలేకపోయానన్న సూరి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ అధికారి.
- జిల్లా మేజిస్ట్రేట్, స్థానిక పోలింగ్ అధికారికి ఫిర్యాదు.
- ఇప్పటివరకు ఆ యంత్రాన్ని బాగుచేయలేదు.
- పోలింగ్ కేంద్రం ముందు వందలాది మంది ఓటర్లు వెయిటింగ్.
- పోలింగ్ సుమారు గంట పాటు నిలిచిపోయింది.
VIDEO | West Bengal election: JUP and TMC workers engage in a stone pelting fight in Murshidabad as central forces try to control the situation, and open lathi charge. #AssemblyPollsWithPTI #WestBengalPollsWithPTI
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aSutjGOosp— Press Trust of India (@PTI_News) April 23, 2026
ఉదయం 9 గంటలకు 18.76% ఓటింగ్
- పశ్చిమ బెంగాల్‌లో ఉదయం నుంచే చురుగ్గా పోలింగ్.
- ఉదయం 9 గంటలకు రాష్ట్రంలో 18.76% ఓటింగ్.
- మధ్యాహ్నం, సాయంత్రం పోలింగ్ గణాంకాలపై ఆసక్తి.
- అధిక ఓటింగ్ శాతంపై అంచనాలు.
- అవకతవకలకు ఆస్కారం లేకుండా 100 శాతం వెబ్‌కాస్టింగ్.

ఏపీలో పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్‌కు నిరాశ
- పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిలాల్ షేక్..
- ఆంధ్రప్రదేశ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
- ఓటు హక్కును వినియోగించుకునేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లారు.
- మాల్దాలోని ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాక షాక్
- ‘ప్రత్యేక ఓటరు జాబితా సవవరణలో తన పేరు తొలగించినట్లు గుర్తించిన బిలాల్ షేక్
- ఓటు వేయకుండానే వెనుదిరిగిన బిలాల్ షేక్
అగ్నిమిత్ర పాల్ కీలక వ్యాఖ్యలు
- ఓటువేసిన అసన్సోల్ బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్
- బెంగాల్ ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారు
- టీఎంసీని అధికారం నుండి తొలగించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు.
- మమతా బెనర్జీ వాడుతున్న భాష అవమానకరం.
- ఇటువంటి అగౌరవాన్ని ఎంతమాత్రం సహించం.
VIDEO | West Bengal Election 2026: Several people injured as unidentified people hurled crude bomb in Nowda, Murshidabad district. More details are awaited.#AssemblyPollsWithPTI#WestBengalPollsWithPTI
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/W7G5A9OqR6— Press Trust of India (@PTI_News) April 23, 2026
శివ్‌నగర్, ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తత
- నవదా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శివ్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం
- ఎన్నికల ముందు రోజు ముర్షిదాబాద్‌లో బాంబు దాడి
- ఒక రహదారిపై పలు బాంబులను పేల్చినట్లు సమాచారం.
- ఈ పేలుడులో ఒక మహిళకు గాయాలు
- పోలింగ్ సమయంలో భద్రతపై ఓటర్లలో ఆందోళన
CEO West Bengal inspecting the ongoing poll process from State control room for web casting & media monitoring at Integrated Command Control Centre at CEO Office, West Bengal.#WBLA2026 #Phase1@ECISVEEP@SpokespersonECI@PIBKolkata@airnews_kolkata pic.twitter.com/aKL894bXel
— CEO West Bengal (@CEOWestBengal) April 23, 2026
పోలింగ్‌లో పాల్గొనాలని బెంగాల్ గవర్నర్ పిలుపు
- గవర్నర్ ఆర్ఎన్ రవి ఓటర్లకు కీలక విజ్ఞప్తి
- మహిళలు,యువత పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి.
- ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని, ఓటు హక్కును వినియోగించుకోవాలి.
#WATCH | West Bengal Elections 2026 | People queue up outside a polling station in Siliguri as they await their turn to cast a vote. pic.twitter.com/ErAYLLXSTq
— ANI (@ANI) April 23, 2026
ఓటర్లకు మల్లికార్జున్ ఖర్గే వినతి
- పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
- పౌరులందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేయాలి.
- మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసే శక్తులకు భయపడకండి.
- మీ ఓటే మీ గళం. దానిని అది గట్టిగా వినిపించాలి.
- ‘ఎక్స్’లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోస్ట్
As West Bengal votes in the first phase of Assembly Elections today, I sincerely urge all citizens to step out and participate in large numbers. Do not be deterred by forces that seek to discourage you. Your vote is your voice, and it must be resoundingly heard.
Follow the path…— Mallikarjun Kharge (@kharge) April 23, 2026
ఓటు వేసిన సువేందు అధికారి
- నందిగ్రామ్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.
- విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి.
- మేము హిందువులం. మేము సనాతనులం.
- నేను ప్రార్థనలు చేశాను. మా నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడాను
- పోలింగ్ ప్రశాంతంగా జరగాలి.
#WATCH | West Bengal Elections 2026 | State LoP & BJP Candidate from Nandigram & Bhabanipur, Suvendu Adhikari casts his vote at a polling station in Nandigram
West Bengal CM Mamata Banerjee is contesting against him from the Bhabanipur Assembly Constituency. pic.twitter.com/pEEbueML2b— ANI (@ANI) April 23, 2026
అమ్మను గౌరవించడానికి ఓటు వేయండి
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వినతి.
ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలి.
మన అమ్మను గౌరవించడానికి ఓటు వేయండి.
మన మట్టిని రక్షించడానికి ఓటు వేయండి.
మన మనుషులను కాపాడటానికి ఓటు వేయండి.
ఓటు హక్కు వినియోగించుకున్న ఏజేయూపీ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్
ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
- ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలి.
- బెంగాల్ ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఖప్తి
- పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్ ఈ రోజు జరుగుతోంది.
- ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొనాలి.
- యువ మిత్రులు, మహిళలు భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఈ స్థానాలు కీలకం...
తొలి దశలో రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను 152 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇందులో ఉత్తర బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాల్లోని మొత్తం 54 స్థానాల్లో ఎన్నికలు.
ముర్షిదాబాద్, నాడియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లోని పలు స్థానాలు కీలకం.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై,
సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
West Bengal: Voting for the first phase of the West Bengal elections is underway. Long queues are seen in front of a polling booth in the English Bazar constituency of Malda. #WestBengalElections #Phase1Voting #Malda #EnglishBazar #VotingDay #PollsWithAkashvani pic.twitter.com/nLX7kgAFP7
— All India Radio News (@airnewsalerts) April 23, 2026
పోలింగ్ ప్రారంభం..
- పోలింగ్ ప్రారంభమైంది..
- బెంగాల్‌లో తొలివిడత ఎన్నికలు..
- అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్
- ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు
- 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత
- 8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
#WATCH | West Bengal Elections 2026 | Long queues of voters formed outside a polling station in Asansol as polling for the first phase of State Assembly elections gets underway. pic.twitter.com/IsaBE2PTNt
— ANI (@ANI) April 23, 2026


