‘ఝాల్‌మురీ’కి విశేష స్పందన | PM Narendr Modi Jhamuri video is a MASSIVE hit on Instagram | Sakshi
Sakshi News home page

‘ఝాల్‌మురీ’కి విశేష స్పందన

Apr 21 2026 4:45 AM | Updated on Apr 21 2026 4:45 AM

PM Narendr Modi Jhamuri video is a MASSIVE hit on Instagram

ఇన్‌స్టాలో 10 కోట్ల వ్యూస్, ఫేస్‌బుక్‌లో 9 కోట్ల మంది వ్యూస్‌

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్‌మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్‌బుక్‌లో 9 కోట్ల వ్యూస్‌ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్‌ సెర్చ్‌లో ‘ఝాల్‌మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్‌మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement