మమతా సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ప్రధాని మోదీ | Pm Modi Fires On Mamata Banerjee Government | Sakshi
Sakshi News home page

మమతా సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ప్రధాని మోదీ

Apr 19 2026 1:15 PM | Updated on Apr 19 2026 1:30 PM

Pm Modi Fires On Mamata Banerjee Government

బిష్ణుపూర్‌: బెంగాల్‌ మహిళలు రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్‌లోని బిష్ణుపూర్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై మమతకు చురకలు అంటించారు. మహిళలు ఎమ్మెల్యేలు కావడం టీఎంసీకి ఇష్టం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తో కలిసి టీఎంసీ కుట్ర చేసిందన్న మోదీ.. మమతా సర్కార్‌పై బెంగాల్‌ ప్రజలు కోపంతో ఉన్నాయన్నారు. మమతా సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకున్నారు. 2029 నుండి ఇది అమలు కావాలని బెంగాల్ మహిళలు ఆకాంక్షించారు. మహిళ రిజర్వేషన్లకు మేం కృషి చేశారు. కానీ టీఎంసీ.. కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్నింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకుంది’’ అని మోదీ మండిపడ్డారు.

మమతా సర్కార్‌ను కనికరం లేని ప్రభుత్వంంగా మోదీ అభివర్ణించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాతావరణం, ఉత్సాహం, ప్రేమ, ఆనందం మమతా ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి చిహ్నాలు. ఇది మా శారదా దేవి నడయాడిన పవిత్ర భూమి, ఇక్కడ ఎంతో మంది మహిళలు హాజరయ్యారు. బీజేపీ అంటేనే మహిళా సాధికారత, రక్షణకు మారుపేరు, అందుకే మహిళలు బీజేపీని ఎక్కువగా దీవిస్తారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర మరింత విస్తరించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement