బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత | Mamata Banerjee Claims BJP Plans To Trifurcate WB In Delimitation | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత

Apr 13 2026 6:24 AM | Updated on Apr 13 2026 6:32 AM

Mamata Banerjee Claims BJP Plans To Trifurcate WB In Delimitation

కోల్‌కతా: డీలిమిటేషన్‌ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్‌లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్‌ కబీర్‌ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement