‘ఝాల్‌మురీ’ ఓ డ్రామా: మమత | Mamata Banerjee reacts to PM Narendra Modi jhalmuri break | Sakshi
Sakshi News home page

‘ఝాల్‌మురీ’ ఓ డ్రామా: మమత

Apr 21 2026 4:51 AM | Updated on Apr 21 2026 4:51 AM

Mamata Banerjee reacts to PM Narendra Modi jhalmuri break

కోల్‌కతా: ఝార్‌గ్రామ్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ దుకాణం వద్ద ఆగి ‘ఝాల్‌మురీ’ని కొనుగోలు చేయడం ఒక డ్రామా అని సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ‘అదంతా ప్రణాళికతో చేసిందే. అనుకోకుండా జరిగితే∙అక్కడికి అన్ని కెమెరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ప్రధాని వెంట ఉండే భద్రతాధికారులే వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీ తన జేబు నుంచి రూ.10 నోటు బయటకు తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఇదంతా నమ్ముతారా? మొత్తం డ్రామయే’ అని ఆమె అన్నారు. ‘మీకు అకస్మాత్తుగా ఝాల్‌మురీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను చేపలు, మాంసం తినకుండా అడ్డుకోవడాన్ని ఏమంటారు?’ అంటూ మోదీని సీఎం ప్రశ్నించారు.  

Advertisement
 
Advertisement
Advertisement