breaking news
Sakshi Special
-
అమెరికా పొమ్మంటోంది... జర్మనీ రమ్మంటోంది!
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షలకుపైగా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో భారత విద్యార్థులు ఇతర దేశాలవైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయా దేశాలు ముందుకొస్తున్నాయి. మనదేశంలో ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కోర్సులను అందిస్తున్నాయి.ఈ క్రమంలో జర్మన్ యూనివర్సిటీలు, జర్మనీ ప్రభుత్వం భారతదేశ విద్యార్థులకు ఆహా్వనం పలుకుతున్నాయి. జర్మన్ యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్హతలు, వీసా ప్రాసెస్‌ను సులభతరం చేశాయి. ఇప్పటివరకు జర్మనీలో విద్యాభ్యాసం చేయాలంటే జర్మన్ రావడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను పక్కనపెట్టి ఆంగ్ల మాధ్యమంలోనూ కోర్సులను అందిస్తున్నాయి, తద్వారా జర్మన్ భాష వస్తేనే అక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలమనే భావనను చెరిపివేస్తున్నాయి. మెకానికల్, ఆటోమొబైల్ నుంచి ఏఐ వైపు..ఇప్పటివరకు జర్మనీ అంటే మెకానికల్, ఆటోమొబైల్ రంగాలకు మంచి పేరుండేది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ, ఎంఎల్ డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతుండటంతో జర్మనీలో ప్రముఖ కంపెనీలు కూడా వీటివైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ విద్యార్థులు, కంప్యూటర్ రంగ నిపుణులకు జర్మనీలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్న వేళ మరోవైపు జర్మనీలో అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్ ఖండంలోనే అతి పెద్ద ఆరి్థక వ్యవస్థ అయిన జర్మనీలో 65ఏళ్లు పైబడినవారు పెరుగుతున్నారు. దీంతో నిపుణులైన యువత అవసరం ఆ దేశానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అవకాశాలు సన్నగిల్లుతున్నవేళ మన విద్యార్థులకి జర్మనీ ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.జర్మన్ వర్సిటీతో కలిసి జేఎన్టీయూ–హెచ్ కొత్త కోర్సు⇒ జర్మనీలో విద్య, ఉపాధి అవకాశాలను తెలుగు విద్యార్థులు అందిపుచ్చుకునేలా జేఎన్టీయూ–హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇటీవల రెండు ప్రముఖ జర్మన్ యూనివర్సిటీలతో జేఎన్టీయూ–హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో ఒకటి ప్రపంచంలో మూడో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచిన జర్మనీకి చెందిన రాయుట్లింగ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కేఎఫ్‌ఆర్‌యూ). ఈ విద్యా సంస్థతో కలిసి జేఎన్టీయూ–హెచ్ కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ) విభాగంలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్(ఐఐబీఎంపీ) కోర్సును ప్రారంభించింది. ⇒ 2025–26 విద్యా సంవత్సరానికి ఈ కోర్సులో చేరడానికి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మొదటి విడత కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్‌తో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని జేఎన్టీయూ–హెచ్, కేఎఫ్‌ఆర్‌యూ నిర్ణయించాయి. ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటరీ్మడియెట్ లేదా సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ బోర్డుల ద్వారా ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఐఐబీఎంపీ కోర్సుకు అర్హులు. ⇒ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్(జేఈఈ మెయిన్)–2025 లేదా తెలంగాణ, ఏపీ ఎంసెట్–2025 ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ⇒ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 11. ⇒ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 12న హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ–హెచ్ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం 9044112999, 9044117999 నంబర్లలో సంప్రదించాలి. ⇒ దరఖాస్తులు, కోర్సు కరిక్యులమ్, ఇతర సమగ్ర వివరాల కోసం జ్టి్టpట://్జn్టuజి.్చఛి.జీn/, ఠీఠీఠీ.జ ౌb్చ pటౌజట్చఝట.జీnలో చూడొచ్చు. -
లో కార్బ్.. హై ఫ్యాట్!
రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హై ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు. – సాక్షి, సాగుబడిపిండి పదార్థాలను ఎక్కువగా తింటే..మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.» ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్‌గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది» గ్లైకోజెన్.. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.» గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం.» పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హై ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). ఎల్సిహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. 10 కిలోల బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..» నికర పిండి పదార్థాలు – 20 గ్రా. (పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి)» మాంసకృత్తులు – 70 గ్రా.» ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు ఉండాలి.» ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి.» ప్రతి మనిషికి.. వారివారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.నేనూ వాడి.. లబ్ధి పొందానునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే ఆహారం వాడకం ప్రపం^è వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచింది. నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ నుంచి తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించారో చాలా వీడియోలు కూడా చేశాను. - డా. పి.వి. సత్యనారాయణ, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎస్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ -
పేరుకుపోతున్న ఘన, బయో, నిర్మాణ, ఈ–వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్‌తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.పరిశ్రమల నుంచి కలుషిత జలాలు.. రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి. 3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.ఘన వ్యర్థాలూ ఘనమే.. రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.ఈ–వేస్ట్.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు జీడిమెట్ల, ఫతుల్‌గూడ, శామీర్‌పేట, శంషాబాద్‌లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది. -
ఎగుమతులకు టారిఫ్‌ల సెగ
భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్‌లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం. – బిజినెస్ డెస్క్రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్ (ఆర్‌ఎస్‌బీఎల్) ఎండీ పృథ్వీ రాజ్ కొఠారీ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 2.3 బిలియన్ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్‌లు తక్కువగా ఉన్న ఈక్విడార్తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్‌తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్‌ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫార్మా.. మెడికల్ డివైజ్‌లు.. చౌక జనరిక్స్ ఔష ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్ తీరుస్తోంది. టారిఫ్‌లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్ పడుతుందని భారతీయ మెడికల్ డివైజ్‌ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. అయితే, టారిఫ్‌లపరంగా చైనా, భారత్ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్ డివైజ్‌ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. » గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.వ్యవసాయ ఉత్పత్తులు.. » అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్‌లతో వల్ల వియత్నాం, బ్రెజిల్‌లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్‌కు అమెరికా కీలకంగా ఉంటోంది. » భారీగా ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్‌లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. » గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 87 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్‌కు సుమారు 41 బిలియన్ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్ పక్షాన సుమారు 2.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. అమెరికా టారిఫ్‌లు భారత్‌కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. టెక్స్టైల్స్/దుస్తులు రత్నాభరణాలు ఫార్మా వాహనాలు, ఆటో విడిభాగాలు ఎల్రక్టానిక్స్/మొబైల్ డివైజ్‌లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు/మెటల్స్ సీఫుడ్/అగ్రి ఎగుమతులుటెక్స్టైల్స్..టారిఫ్‌ల వల్ల భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. 17 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు.. టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్, సర్క్యూట్ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్‌ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్ విషయంలో మిగతా దేశాలతో భారత్ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు నెమ్మదించవచ్చు. -
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పెరిగిన పులుల సంఖ్య
అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో ప్రస్తుతం 36 పులులు, 2 పులి పిల్లలు ఉన్నాయి. ఇందులో 13 మగ, 20 ఆడ పులులు కాగా.. మరొకటి గుర్తించాల్సి ఉంది. అటవీశాఖ లెక్కల ప్రకారం 2023–24లో 33 పెద్దపులులు ఉండగా.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) 2024–25 ఫేజ్–4 మానిటరింగ్‌లో భాగంగా ఆటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పులుల పర్యవేక్షణ సర్వే ప్రకారం 36కు చేరింది. 2019 నుంచి వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో రెండు, మూడేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పులులు వేటాడి తమ ఆహారాన్ని సులభంగా సాధించుకునేలా జింకలు, దుప్పులు, గడ్డి క్షేత్రాలు, ఇతర జంతువులను పెంచాల్సిన అవసరం ఉంది.గణన ఇలా.. ఏటీఆర్ పరిధిలోని పది రేంజ్‌లను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. 2024, డిసెంబర్ 20 నుంచి 2025, మే 15వ తేదీల్లో 1,594 కెమెరా ట్రాప్‌ల ద్వారా పాదముద్రలను పరిశీలించారు. 797 లొకేషన్లలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక కెమెరా ట్రాప్ రికార్డ్ చేసి పులులకు సంబంధించి డేటాను విశ్లేషించారు. నాలుగు నెలల కాలంలో పులుల అడుగులు, ముద్రలు, విసర్జనలు, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. పెరుగుతున్న ఆడ పులులు నల్లమల అభయారణ్య ప్రాంతం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166,37 చదరపు కి.మీ. అభయారణ్యం, 445.02 చదరపు కి.మీ. బఫర్‌జోన్‌గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, కృష్ణానది జలపాతాలు, క్రూరమృగాలు, జంతువుల సందడికి నిలయం. ఈ అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా పులులు, చిరుతల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200లకు పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది.సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఏటీఆర్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20 ఆడపులులు.. రెండు పులి పిల్లలు ఉన్నాయి. సాధారణంగా పెద్దపులి దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లపై గుర్తులు, మూత్ర విసర్జన చేసి తన హద్దులను ఏర్పాటు చేసుకుంటుంది. ఎంచుకున్న సరిహద్దులో 25 చదరపు కిలోమీటర్ల మేర సంచరిస్తుంది. ప్రస్తుతం ఏటీఆర్‌లో పరహా, బౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19 పేర్లతో పులులకు నామకరణం చేశారు. పులికి సిగ్గెక్కువ కావడంతో ఒంటరిగా తిరిగేందుకు ఇష్టపడుతుంది. పెద్దపులి (Tiger) శాఖాహార జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. జనావాసాల తరలింపుపై కార్యాచరణ ఏటీఆర్‌లో పెద్దపులులకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. కోర్ ఏరియాలోని జనావాసాలను బయటకు తరలించేందుకు ఇప్పటికే తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, కొమ్మనపెంట గ్రామాలను పెద్దకొత్తపల్లి మండలం బాకారం గ్రామ సమీపంలో అటవీశాఖ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశలో వట్టువర్లపల్లి, తాటిగుండాలు, మరి కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఇతర చోట్లకు తరలించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆయా కుటుంబాలకు ప్యాకేజీలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. పులుల సంతానోత్పత్తికి అనువైన రోజులు కావడంతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాటి ఏకాంతతకు భంగం కలగొద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఈ మూడు నెలల పాటు అటవీ ప్రాంతంలోకి పర్యాటకులు, ఇతరులెవరినీ అనుమంతిచరు. ఏటీఆర్‌ను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు చేశారు. పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అభివృద్ధి, నిర్మాణాలు చేపట్టాలన్నా ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా అవసరం.పులుల వృద్ధికి ఏటీఆర్ అనుకూలం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో జీవవైవిధ్యంతో పాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 36 పులులు ఉన్నాయి. పెరుగుదల మా శాఖ ప్రణాళిక బద్ధంగా చేపట్టిన చర్యలకు ఫలితం. ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఈ అభయారణ్యం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. – గోపిడి రోహిత్‌రెడ్డి, డీఎఫ్ఓ గుర్తింపు ఇలా.. పెద్ద పులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్‌ల డేటాబేస్‌తో పాటు పులులు చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు మగ, ఆడ వాటిని వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు పులులను గుర్తించాక వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు మనుషుల వేలి ముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతీ పులికి ప్రత్యేకంగా ఉంటుందిచదవండి: చీరలు కట్టి.. చెట్లుగా మార్చారు! -
అనేక దేశాల్లో బిచాణ ఎత్తేసిన లులు
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆప్త మిత్రుడు యూసఫ్ ఆలీకి చెందిన లులు గ్రూపు (Lulu Group) రిటైల్ వ్యాపారంలో అనేక దేశాల్లో ఇప్పటికే బిచాణ ఎత్తేసింది. మలేషియా, ఇండోనేషియాల్లో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలిగిన లులు.. మిగిలిన దేశాల్లో కూడా వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ పెట్టే బేడా సర్దుకుంటోంది. అలాంటి కంపెనీకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలిచ్చి రెడ్ కార్పెట్ పరుస్తోంది. విశాఖలో, విజయవాడలో రూ.వేల కోట్ల విలువైన స్థలాలను అప్పనంగా కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చేయడం విస్తుగొలుపుతోంది. రిటైల్ వ్యాపార పరంగా ఎక్కడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేని లులు గ్రూపు.. మలేషియాలో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు జూన్‌లో ప్రకటించింది. మలేషియా రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించి పదేళ్లు దాటినా, లాభాల బాట పట్టకపోగా, నష్టాలు కొండలా పెరిగి పోతుండటంతో పెట్టే బేడా సర్దేసుకొని గుడ్ బై చెప్పేసింది. 2016లో మలేషియా రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఐదేళ్లలో 10 హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2022 వచ్చేసరికి కేవలం ఆరు స్టోర్లను మాత్రమే ప్రారంభించగలిగింది. 2025 నాటికి ఈ షాపుల ద్వారా నష్టం రూ.2,061 కోట్లు దాటి పోవడంతో ఇప్పట్లో రిటైల్ వ్యాపారంపుంజుకునే అవకాశం లేదంటూ వైదొలిగింది. మలేషియాలో క్యాప్స్క్వేర్, జకేల్ కేఎల్, అమెరికన్ మాల్, వన్ షామెలిన్ మాల్ వంటి చోట్ల లులు తన హైపర్ మార్కెట్లు ప్రారంభించినా, స్థానిక హైపర్ మార్కెట్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక చేతులెత్తేసింది. అంతకు ముందు ఇండోనేషియా నుంచి కూడా ఇదే విధంగా లులు గ్రూపు వైదొలిగింది. ఇండోనేషియా మార్కెట్లోకి 2016లో అడుగుపెట్టింది. ఇండోనేషియాలోని బానెటెన్ క్యూబిగ్ బీఎస్‌డీ సిటీలో ఉన్న హైపర్ మార్కెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూసివేసింది. మిగిలిన హైపర్ మార్కెట్లను మూసి వేయడానికి క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్లు స్థానిక పత్రికా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. నష్టాల్లోనే కొచ్చిన్ మాల్ 2013 మార్చిలో దేశంలోనే అతిపెద్ద మాల్ కొ చ్చి న్లో ఏర్పాటు చేసిన లులు గ్రూపు.. ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేకపోయింది. కొ చ్చి న్ మాల్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు దాటినా, ఏటా భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 2023 డిసెంబర్లో కొ చ్చి న్ మాల్ రూ.205.8 కోట్లు, 2024లో రూ.130.2 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. 2024లో కొ చ్చి న్ మాల్ వ్యాపారం రూ.4,384.8 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు ఈ మాల్‌పై రూ.1,600 కోట్లు వ్యయం చేసింది. అదే విధంగా 2021లో ప్రారంభించిన బెంగళూరు, 2023లో హైదరాబాద్‌లో ప్రారంభించిన లూలు మార్కెట్లు కూడా లాభాల బాట పట్టడానికి సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. ప్రసుత్తం ఇండియాలో లులు 12 మాల్స్‌ను నిర్వహిస్తోంది.ఏపీలో పరిస్థితి ఏంటి? హైపర్ రిటైల్ వ్యాపారం చేసే లులు, డీమార్ట్, రిలయన్స్, ఇన్ ఆర్బిట్ మాల్స్ వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా సొంతంగా లేదా ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఒక్క లులుకే రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ప్రభుత్వ స్థలాలను అత్యంత కారుచౌకగా కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియాల్లో లాగా వ్యాపారం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత బిచాణా ఎత్తివేస్తే ఈ ప్రభుత్వ స్థలాల పరిస్థితి ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.ఒకసారి దీర్ఘకాలిక లీజుకు ఇ చ్చి న తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది న్యాయపరంగా చాలా సంక్లిష్టమంటున్నారు. కార్పొరేట్ సంస్థలు ఒకసారి భూమి తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగిచ్చిన దాఖలాలు లేవని.. ఇప్పుడు తొలుత లీజు పేరిట తీసుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా యాజమాన్య హక్కులను దక్కించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మాల్‌కు ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారని, ఈ కంపెనీకి నష్టం వస్తే అదే గ్రూపునకు చెందిన ఇతర కంపెనీల నుంచి నయా పైసా కూడా రాదంటున్నారు. రిలయన్స్, డీమార్ట్లకు భూములు ఇవ్వనప్పుడు, ఒక్క లులుకే ఎందుకు ఇస్తున్నారని, దీని వెనుక ఉన్న కుంభకోణం ఏమిటని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. -
వాంగా చెప్పినట్టే ..ఐతే కొంచెం లేటుగా!
అవును. ఆమె చెప్పిందే జరిగింది. జపనీస్ బాబా వాంగా పేరిట ఫేమస్ అయిన మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి చెప్పింది అక్షరాలా నిజమైంది. జపా న్ తీరాలను పెద్ద సునామీ తాకింది. ఆమె చెప్పిన తేదీన కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది. జపాన్ తీరాన్ని జులై 5న సునామీ ముంచెత్తుతుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలైæ 30న ముంచుకొచ్చింది. దాంతో మాంగా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది. ఎవరీ రియో తత్సుకి?తత్సుకి సాధారణ మాంగా ఆర్టిస్ట్ కాదు. ఆమె కలల మధ్య నడిచిన సత్యమని చెబితే అతిశయోక్తేమీ కాదు. ‘ద ఫ్యూచర్ దట్ ఐ సా (నేను చూసిన భవిష్యత్తు)’ పేరిట 1990 దశాబ్దం చివరలో ఆమె ఓ పుస్తకం రాసింది! ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కలల్ని కథలుగా మార్చింది. అప్పట్లో దాన్నెవరూ పట్టించుకోలేదు. కామిక్ పుస్తకంగా భావించారు. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని పుస్తకంపై ఓ మాట ఉంది. అన్నట్టుగానే అదే నెలలో జపాన్ను భూకంపం, సునామీ వణికించాయి. దాంతో అంతా షాకయ్యారు. ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యద్దర్శన శక్తి ఉందని కొందరు నమ్మడం మొదలుపెట్టారు. తత్సుకి కలలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. ఆ పుస్తకానికి 2021లో మరో ఎడిషన్ తీసుకొచ్చిందామె. అందులో ఓ కొత్త తేదీ వేసింది. అదే 2025 జూలై 5. ఆ రోజు ఫిలిప్పైన్స్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతుందని, సముద్రం ఉప్పొంగిబోతుందని, వరుస భూకంపాలు రావొచ్చని చెప్పింది. 2011 సునామీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చంటూ డ్రాయింగ్ వేసింది. అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్ను సునామీ వణికించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ తియ్యని ప్రేమ.. తగ్గించండి!
పిల్లలు అడిగినా, అడక్కపోయినా స్వీట్స్, చాకొలేట్స్ వారి చేతుల్లో పెడతాం. హోమ్‌వర్క్ త్వరగా చేస్తేనో, అల్లరి చేయకుండా ఉంటేనో, ఫలానా పని చేస్తేనే.. ఐస్‌క్రీమ్, కేక్ అంటూ ఆఫర్లు ఇస్తుంటాం. అంతేకాదు ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు స్వీట్స్, చాకొలేట్స్ తీసుకొచ్చి వద్దు అంటున్నా నోట్లో పెట్టి మరీ వారి ప్రేమను చూపిస్తుంటారు. ఇంతటి ‘తీపి’ ప్రేమ పిల్లల పాలిట శత్రువు అవుతోందనే విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో చక్కెర వినియోగం పరిమితం చేయకపోతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చక్కెర తింటే శక్తి వస్తుందన్నది పాత మాట. ఇప్పుడు అదే అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పిల్లల్లో చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం వల్ల వారికి మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నేచర్ జర్నల్‌లో 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. చిన్నతనంలో చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కెర పానీయాలను అధికంగా సేవించడం వల్ల కడుపు ఉబ్బరం, కొన్ని సందర్భాల్లో పొట్టలో అసౌకర్యం కూడా సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల్లో సహజంగా లభించే చక్కెర కాకుండా అదనంగా పరిమితికి మించి చేర్చడం శ్రేయస్కరం కాదన్నది వారి మాట.ఇంకాస్త తగ్గించండి..ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సవరించిన మార్గదర్శకాల ప్రకారం రోజుకు శరీరానికి కావాల్సిన కేలరీల్లో చక్కెర నుంచి వచ్చేవి 5 శాతానికి మించరాదు. అంటే ప్రామాణిక 2,000 కిలో కేలరీల ఆహారంలో రోజుకు గరిష్ఠంగా అదనపు చక్కెర ఐదు టీస్పూన్లకు పరిమితం కావాలి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ వర్తిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.⇒ ఊబకాయం, మధుమేహం, దంత క్షయం ప్రమాదాన్ని తగ్గించడానికి పిల్లలు చక్కెర వినియోగాన్ని మరింత పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ రెండేళ్లకు పైబడిన పిల్లలకు అదనపు చక్కెర 2–4 టీస్పూన్లకు మించరాదని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ⇒ రెండేళ్లలోపు పిల్లలకు అదనపు చక్కెర ఇవ్వకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్పష్టం చేశాయి.బర్త్‌డే నాడు కేక్ చాలుచాలామంది పిల్లలు రోజూ 20–25 టీస్పూన్ల చక్కెర తీసుకుంటున్నారని, ఇది వాళ్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషన్స్ (ఐఏపీ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో వేడుకలు, విహారయాత్రల సమయంలో పిల్లలకు చక్కెర ఆధారిత ఆహారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘పిల్లలకు నెలకు రెండు చిన్న స్కూప్‌లకు మించి ఐస్‌క్రీం ఇవ్వకూడదు. పుట్టినరోజు పార్టీల సందర్భంలో కూల్డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకుల వంటివి అదుపు లేకుండా తింటుంటారు. ఇది మంచిది కాదు. కేక్ తింటారు కాబట్టి ఆ రోజంతా అదనపు చక్కెర ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు ’ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జాబితా పెద్దదేపండ్లు, పాల వంటి పదార్థాలలో చక్కెర సహజంగా ఉంటుంది. పాలలో లాక్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో వస్తాయి. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా వంట సమయంలో అదనంగా చేర్చిన చక్కెర.. కేలరీలను అందించినప్పటికీ విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఇన్ స్టంట్ నూడుల్స్, బ్రెడ్, బిస్కెట్లు, సాస్‌లు వంటి చాలా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో, శిశువులకు ఇచ్చే తృణ ధాన్య ఉత్పత్తులు, యోగర్ట్, పోషక/శక్తి పానీయాలు వంటి వాటిలో కూడా అదనంగా చేర్చిన చక్కెర ఉంటోంది.బడుల్లో షుగర్ బోర్డులు.. ఇటీవలి కాలంలో పిల్లల్లో మధుమేహం కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా టైప్ 2 మధుమేహం.. ఇటీవల పిల్లల్లోనూ కనిపిస్తుండటంతో సీబీఎస్ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాల్లో ‘షుగర్ బోర్డులు’ ఏర్పాటు చేస్తోంది. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. తద్వారా విద్యార్థుల చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు వీలవుతుందని సీబీఎస్ఈ భావిస్తోంది.ఆందోళన వ్యక్తం చేసిన సీబీఎస్ఈ..విద్యార్థులు తీసుకోవాల్సిన దానికంటే దాదాపు మూడురెట్లు ఎక్కువగా చక్కెర తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అని సీబీఎస్ఈ ఆందోళన వ్యక్తం చేసింది. ‘4 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు రోజూ చక్కెర నుంచి సగటున 13 శాతం కేలరీలు పొందుతున్నారు. 11 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువగా 15 శాతం వరకు ఉంది. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఇది 5 శాతానికి మించి ఉండకూడదు’ అని సీబీఎస్ఈ తెలిపింది. -
రింగ్ ఆఫ్ ఫైర్
ప్రకృతి ఓ దెయ్యంలా మెల్లగా ఒళ్లు విరుచుకుని అలా సాగర జలాల్లోకి కాలు పెట్టింది...! అంతే తీరాన్ని తుత్తునియలు చేసేలా అలలు మిన్నంటి మరీ ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి భూమి ఉలిక్కిపడింది. రష్యాను ఠారెత్తించిన బలమైన భూకంపం, ఆ వెంటనే విరుచుకుపడ్డ సునామీ హడలెత్తించాయి. ప్రపంచపు మోకాలిగా చెప్పదగ్గ ఆ రహస్య ప్రాంతంలో పుట్టిన మంటలు, ప్రకంపనలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమే ‘రింగ్ ఆఫ్ ఫైర్’. అగ్నిపర్వతాలు ఎందుకు అక్కడే ఉప్పొంగుతాయి? భూకంపాలు ఎందుకు అక్కడే ఠంచనుగా ప్రతి వారం సంభవిస్తాయి? ఈ వలయం, దాని తాలూకు విలయం వెనక దాగున్న రహస్యం ఏమిటి?సైలెంట్ కిల్లర్మౌనంగా కనిపించే మృగాలే మహా ప్రమాదకరం. రింగ్ ఆఫ్ ఫైర్‌లోని అగ్నిపర్వతాలు కూడా ఆ బాపతే. చూసేందుకు నిద్రాణంగా కనిపిస్తాయి కానీ, భూమి లోతుల్లో మంటలు ముదిరిన ప్రతిసారీ ఆ మౌనం పెను శబ్దంగా మారుతుంది. కొన్నిసార్లు విస్ఫోటనంలా బయటపడుతుంది. రష్యాలోని కమ్చా తీరంలో ఎగిసిపడి, ఇటు జపాన్తీరాన్ని కూడా తాకిన ఆ రాకాసి అలలకు కారణమదే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అచ్చం వలయంలా ఉంటుంది. అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రాన్ని అట్టడుగున కప్పేసే అగ్నివలయమిది. ఈ మంటల మార్గం దాదాపు 40 వేల కిలోమీటర్ల పొడవుంటుంది! దక్షిణ అమెరికా కొసన మొదలై ఉత్తర అమెరికా తీరాల దా కొనసాగుతుంది. అటు అలాస్కా ద్వీపాలను తాకి, బేరింగ్ సముద్రం దాటి, జపాన్ మీదుగా ఇటు న్యూజిలాండ్ వరకు వ్యాపించి ఉంది. దక్షిణ ధ్రువంలోని మంచు అగ్నిపర్వతాల వరకు చేరుతుంది. ఈ మార్గంలోని దేశాలు మనకు తెలియని ప్రమాదంతో నిత్యం మందుపాతరపై భయంభయంగా గడుపుతున్నాయి. చిలీ, పెరూ, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, న్యూజిలాండ్... ఇలా ప్రపంచంలోని అతి శక్తిమంతమైన అగ్నిపర్వతాలన్నీ ఈ వలయంలోనే ఉన్నాయి. భూకంపాలు, అగ్ని విస్ఫోటనలూ ఈ ప్రాంతంలోనే ఎక్కువ.పలకల్లో కలకలంరింగ్ ఆఫ్ ఫైర్‌లో జరుగుతున్నది భూమి లోతుల్లో భూ పలకల పోరాటం. బయటి నుంచి బలంగా, స్థిరంగా కనిపించే భూమి లోలోతుల్లో ఈ భూ పలకలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు భూమి కంపిస్తుంది. ఒక పలక కిందకి జారితే అక్కడ పెను మంటల్లాంటివి పుట్టుకొస్తాయి. రష్యాలో తాజా భూకంపానికి కారణం కూడా ఇదే. పసిఫిక్ ప్లేట్ తాలూకు ఒక పెద్ద భూ పలకం, ఉత్తర అమెరికా పలకం పరస్పరం ఢీకొన్నాయి. దాంతో భూమి లోతుల్లో ఒత్తిడి పెరిగి భూగోళం అంతటినీ ఊపేసింది. అందుకే కమ్చట్కా తీరంలో ఏకంగా 8.8 తీవ్రతతో నేల వణికిపోయింది. ఆ వెంటనే సముద్రం గర్జించి అలలుగా ఎగిసింది. ఇలాంటివి రింగ్ ఆఫ్ ఫైర్‌లో నిజానికి నిత్య సన్నివేశాలే.పసిఫిక్‌కు గుండెకాయ!పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక సువిశాల శరీరంగా భావిస్తే రింగ్ ఆఫ్ ఫైర్‌ను దాని గుండెగా చెప్పొచ్చు. అక్కడే శ్వాస, అక్కడే ధ్వని, అక్కడే మంట! ఈ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుందంటే చాలు... రష్యాలో అలలు ఎగసిపడతాయి. జపాన్ తీరాలు వణికిపోతాయి. అలాంటి గుండెపోటు ఇప్పుడు జరుగుతోంది. అదే కమ్చట్కాలో, జపాన్తీరాంలో సునామీ రూపంలో ఎగసిపడింది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మానవాళికి ఒక శక్తి, ఒక శాపం, ఒక శాస్త్రం. అది ఎప్పుడు, ఎక్కడ మళ్లీ పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. పుట్టిందంటే మాత్రం దాని దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడిపోవాల్సిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Tsunami waves: చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ
సునామీ.. 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించే దాకా ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చరిత్ర ఇప్పటిదాకా చవిచూసిన శక్తివంతమైన సునామీ ఏదో చూద్దాం.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్‌లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం వద్ద రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి.. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్ల(9-13 అడుగుల) ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాక సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్ట్‌లో.. ఇవాళ్టి రష్యా భూకంపానికి ఆరో స్థానం దక్కింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 2004.. ఇండోనేషియా (సుమాత్రా)లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2,30,000 మందిని బలిగొంది. 2011.. 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ (టోహోకు) తీరాన్ని ముంచెత్తించింది. ఈ ధాటికి ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు. 1960.. చిలీ (వాల్డివియా) 9.5 తీవ్రతతో భూకంపం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883.. ఇండోనేషియా (క్రాకటోవా) అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డారు. మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది!!.సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. 1896.. జపాన్ (సాన్రికు)లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22,000 మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి. చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ(Mega Tsunami).. 1958 అలాస్కా (లిటుయా బే)లో జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల (3000 అడుగుల) నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగ ఎగసిపడింది. సుమారు 1,720 అడుగుల (524 మీటర్లు) అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ!. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ (Lituya Glacier) వద్ద కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ.. ప్రధాన అలను ఏర్పరచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత.. అదీ ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించారు. వీళ్లంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం. 1868.. పెరూ(చిలీ) 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25,000 మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపెట్టింది. 1755.. పోర్చుగల్ (లిస్బన్)లో 8.5–9.0 భూకంపం సంభవించింది. 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50,000 మంది మృతి చెందారు. యూరోప్ అంతటా, అలాగే కరేబియన్ దీవులు, బ్రెజిల్‌ను ఈ సునామీ ప్రభావం తాకింది. ఈ భూకంప సునామీ చరిత్రలోనే తత్వవేత్తల రచనలతో.. అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది ఇది. -
హ్యూమనాయిడ్ రోబో కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్‌ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.గంటపాటు నిర్విరామంగా..» ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ. » వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్ ్స, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది. » కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం. » బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది. » మాన్యువల్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. » పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్‌ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రోజువారీ జీవితంలో మమేకం..» మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది. » కాఫీ మెషీన్ ను ఆన్ చేస్తుంది. » ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది. » ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్‌ను చదువుతుంది.» మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.» అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతై ్తన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. » ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
ఈ ఐటీకి ఏమైంది..?
2000 సంవత్సరంలో వై2కే, 2017లో క్లౌడ్.. ఇప్పుడు ఏఐ.. ఇలా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగులకు సరికొత్త సాంకేతికతలు పెను సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ కల్పవృక్షంగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక్కసారిగా ‘కోత’ల గుబులు మొదలైంది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పరిశ్రమకు షాక్ తగిలింది. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బ, మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల ఆదాయాలకు చిల్లు పడుతోంది. దీంతో వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పులిమీదపుట్రలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కూడా ఉద్యోగులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. టీసీఎస్ చర్యలు ఆరంభమేనని.. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చనేది విశ్లేషకుల మాట.దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగాల తొలగింపు వార్త అటు ఐటీ రంగాన్నే కాదు.. స్టాక్ మార్కెట్లను సైతం కుదిపేసింది. పరిశ్రమ లీడర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా కంపెనీలు ఎలాంటి చర్యలకు దిగుతాయోనన్న భయమే దీనికి కారణం. వాస్తవానికి ఐటీలో కొత్త ఉద్యోగాలు గత రెండు మూడేళ్లుగా పెద్దగా పెరగడం లేదు. టీసీఎస్‌నే తీసుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.14 లక్షల గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే, 2019–20లో 4.48 లక్షలుగా ఉన్న కంపెనీ సిబ్బంది సంఖ్య తదుపరి మూడేళ్లలో ఏకంగా 1.7 లక్షలు పెరగడం విశేషం. ఆపై క్రమంగా దిగజారుతూనే ఉంది. 2023–24లో 6.01 లక్షలకు పడిపోయింది. 13,249 మంది సిబ్బంది తగ్గిపోయారు. గతేడాది కాస్త పుంజుకుని 6.07 లక్షలకు చేరుకుంది. తాజాగా 2025–26 తొలి త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 5,090 మంది సిబ్బంది జతయ్యారు. అయినప్పటికీ మొత్తం సిబ్బంది సంఖ్య మూడేళ్ల క్రితం నాటి గరిష్ట స్థాయి కిందే కొనసాగుతోంది. ఇక మిగతా కంపెనీల విషయానికొస్తే, టాప్–5 కంపెనీలు కలిపి ఈ ఏడాది క్యూ1లో కేవలం 4,703 ఉద్యోగులను మాత్రమే నికరంగా జత చేసుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్ మినహా మిగతా మూడు కంపెనీల్లో సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఐటీ నియామకాల్లో మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... టీసీఎస్ ప్రకటించిన 12,000 మంది సిబ్బంది కోతల్లో అత్యధికంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం చూపనుంది. భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా తీర్చిదిద్దడం, టెక్నాలజీలో పెట్టుబడులపై మరింత ఫోకస్ చేయడం, ఏఐ వినియోగం, మార్కెట్ విస్తరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి విస్తృత వ్యూహాలను కంపెనీ దీనికి కారణంగా చెబుతోంది. అంటే, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాల వైపే నడుస్తాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ‘ఆర్థిక ఒత్తిళ్లతో పాటు క్లయింట్ల అంచనాలు, అలాగే చురుకైన, ఫలితాల ఆధారిత డెలివరీ విధానాల దిశగా పరిశ్రమలో వస్తున్న మార్పులు వంటి అనేక అంశాలు టీసీఎస్ సిబ్బంది కోత నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థలో రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వ్యాఖ్యానించారుబెంచ్ సిబ్బంది విషయంలో కఠిన పాలసీని కంపెనీలన్నీ అమలు చేస్తుండటాన్ని చూస్తుంటే, సిబ్బంది సేవలను పూర్తిగా సది్వనియోగం చేసుకోవడంపై ఐటీ సంస్థలు దృష్టి పెడుతున్నాయనేందుకు నిదర్శనం. అయితే, టీసీఎస్ మాత్రం ఏఐకి తాజా కోతలకు సంబంధం లేదని చెబుతోంది. కానీ టెక్ పరిశ్రమలో సిబ్బంది నియామకాలను ఏఐ, ఆటోమేషన్ అనేవి మరింత ప్రభావితం చేస్తున్న తరుణంలో టీసీఎస్ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోపక్క, ఇటీవలి ఐటీ కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదాయాల్లో ఏమంత పెద్ద పెరుగుదల లేదు. క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యయాల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు... మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు.. ఇప్పటికే ఉద్యోగుల తగ్గింపు బాట పట్టాయి. ముఖ్యంగా సరికొత్త డిజిటల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగ విధులు, నైపుణ్యాలను మదింపు చేస్తూ అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం.. లేదంటే వేటు వేయడానికీ వెనుకాడటం లేదు. ‘మన ఐటీ కంపెనీల విషయానికొస్తే.. సమర్థవంతమైన, పనితీరు ఆధారిత సిబ్బంది విధానాల వైపు మార్పునకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని పాఠక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ ఆసరాతో తక్కువ వ్యయానికి మరిన్ని సేవలు కోరుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సంస్థల సిబ్బంది కోతలకు ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ ఆధారిత ఐటీ వైపు మారుతోంది. ప్రస్తుత మానవ నైపుణ్యాలతో పోటీ పడే ఏఐ ఏజెంట్లు.. ఇప్పుడున్న కొంత మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ జోరందుకుంటుంది’ అని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైజల్ కవూసా అభిప్రాయపడ్డారు. ఐటీ డిమాండ్ తగ్గడం, క్లయింట్ల ప్రాధాన్యతలు మారడం వల్ల ఎదురవుతున్న మార్జిన్ ఒత్తిళ్లు.. సిబ్బంది కోతకు దారితీస్తున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు లేకుంటే ఇంటికే... కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు టీసీఎస్‌తో పాటు దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏఐ, ఆటోమేషన్ బాట పడుతున్నాయి. మార్జిన్లు పెంచుకోవడానికి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఫలితాలు పొందాలనేది వాటి తాజా వ్యూహం. ప్రతి కంపెనీలో సిబ్బంది, విధానాలు, టెక్నాలజీ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. ‘కంపెనీలన్నీ తమ ప్రస్తుత సిబ్బందితో పాటు కొత్తగా తీసుకునే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్కిల్స్ పెంచుకోకుండా, భవిష్యత్తు విధానానికి అనుగుణంగా లేనివారిపై వేటు తప్పదు. దీర్ఘకాలంలో కంపెనీల్లో అనేక సానుకూల మార్పులతో మాటు కొన్ని ప్రతికూలతలు కూడా తప్పవు’ అని శర్మ అభిప్రాయపడ్డారు.పరిశీలిస్తున్నాం: ఐటీ శాఖ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను కేంద్ర ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్), ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీసీఎస్‌కు నోటీసులు ఇవ్వాలని కోరింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సభలో సిందూరం
న్యూఢిల్లీ: పహల్గాం ఉదంతం, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి సోమవారం వివరణలతో చర్చను మొదలెట్టిన అధికార పక్షం, ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్షసభ్యులు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు లోక్‌సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను బలంగా వినిపించారు. ఇదేసమయంలో జైశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడం, అడ్డుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగానే బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైనా చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదాపడి చివరకు అర్థాంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడింది.పాక్ కాళ్లబేరానికి వచ్చిందితొలుత లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ముమ్మాటికీ చరిత్రాత్మకమైన సైనిక చర్య. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది. యుద్ధరంగంలో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ధైర్యవంతులైన సైనికులందరికీ నా సెల్యూట్. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌కు పథకరచన చేశారు. కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చాం. కేవలం 22 నిమిషాల్లో 9 కీలక ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి మన సత్తా చాటాం. ఊహించని మెరుపుదాడితో చేష్టలుడిగిన పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్వయంగా ఫోన్ చేసి తమకు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యంలేదని స్పష్టంచేశారు. ఆలోపు పాక్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులను మన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వీర్యంచేశాయి. మన దాడులకు ప్రతీగా పాక్ జరిపిన దాడుల్లో భారత్‌లో ఏ ఒక్క కీలక స్థావరం, ఆయుధాగారం దెబ్బ తినలేదు. ఉగ్రవాదుల స్థావరాలు, వాళ్లకు మద్దతిచ్చేవాళ్లను అంతంచేసేందుకే ఆ ఆపరేషన్. లక్ష్యం నెరవేరిన కారణంగానే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశాం. ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, ప్రమేయం లేవు. బయటిశక్తుల (అమెరికా, ట్రంప్) కారణంగానే పాక్‌పై మనం దాడులను ఆపేశామనడంలో వాస్తవం లేదు. భారత వాయుసేన అసాధారణ దాడులు, సరిహద్దు వెంట ఆర్మీ దీటైన జవాబుకు తోడు నావికాదళం దాడులకు దిగొచ్చన్న భయాలతో పాక్ కాళ్లబేరానికొచ్చింది’’ అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మమ్మల్ని విపక్షాలు అడగదల్చుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? అని ఒక్కటే ప్రశ్న వేయాలి. అందుకే మేం అవును అని సూటి సమాధానం చెప్తాం. పాక్ దాడుల్లో మన సైనికులెవరూ వీరమరణం పొందలేదు. ఏ పరీక్షలోనైనా ఫలితమే ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు పెన్సిల్ విరగడము, కలం కనిపించకుండా పోవడమూ సాధారణం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ముఖ్యం. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సైనికదళాలు 100 శాతం కచ్చితత్వంతో సాధించాయి. పాక్తోగానీ మరే ఇతర దేశంతోగానీ ఎప్పుడూ విజయవంతమైన ప్రభుత్వాల సారథ్యంలో స్నేహాన్నే భారత్ కోరుకుంటోంది. గతంలో భారత్ ‘లాహోర్ బస్సు యాత్ర’ బాషలో మాట్లాడితే ధూర్త పాక్‌కు బోధపడలేదు. వాళ్లకు అర్థమయ్యేలా ఈసారి మేం ‘బాలాకోట్ దాడి’ భాషలో మాట్లాడాం. భారత్ ఏ దేశంతోనైనా కరచాలనం కోసం స్నేహహస్తమే అందిస్తుంది. చేతిని మెలిపెట్టాలని చూస్తేమాత్రం ఆ చేతినే విరిచేస్తుంది. పౌరుల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుంతో ఆపరేషన్ సిందూర్ కళ్లకుకట్టింది. భారత్‌ను ఏనాటికీ ఓడించలేమని పాక్ పాలకులకు అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. కానీ అది వాళ్లనే మింగేస్తోంది. అమాయక పాక్ ప్రజలనూ చంపేస్తోంది. ఆపరేషన్ ముగియలేదు. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సిందూర్ మొదలవుతుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.వాణిజ్య అంశాల్లో సిందూర్ ప్రస్తావన రాలేదు: జైశంకర్‌ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. అమెరికాతో వాణిజ్యానికి, ఈ ఆపరేషన్‌కు సంబంధం లేదు. ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడంలో విజయంసాధించిన భారత దౌత్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మనం పాక్ నడిబొడ్డులోని బహావల్పూర్, మురిద్కేలోని స్థావరాలను నేలమట్టంచేయగలమని ఎవరైనా ఊహించారా?. పహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములేకాదు ఎన్నో దేశాలు ఖండించాయి. పాక్‌పై దాడిచేశాక దాడులను ఆపాలని పాక్ నుంచే అభ్యర్థన వచ్చింది. కానీ మేం పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి అభ్యర్థన వస్తేనే ఆపుతామని చెప్పాం’’ అన్నారు. ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం..విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తుంటే విపక్ష సభ్యులు పదేపదే అడ్డుత గిలారు. హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సభ్యులు అస్సలు విశ్వసించట్లేరు. బయటివాళ్లు (ట్రంప్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఎక్కువ. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువుందో ఇప్పుడే తెలుస్తోంది. మీ అభిప్రాయాలను పార్లమెంట్‌పై రుద్దకండి. విదేశీయులను నమ్మినందుకే మీరు విపక్షంలో కూర్చున్నారు. ట్రంప్ వంటి విదేశీయుల మాటలను ఇలాగే నమ్ము తూ పోతే మీరు ఇలాగే మరో 20 సంవత్సరాలు విపక్షంలోనే ఉండిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.ప్రశ్నలు కురిపించిన కాంగ్రెస్చర్చలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ‘‘ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్‌కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపాల్సి వచ్చింది?. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనంచేసుకుంటాం?. పాక్, భారత్ పరస్పర సైనిక చర్యలకు ముగింపు పలికింది తానేనని ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. భారత్, పాక్ యుద్దం ఆపితేనే వాణిజ్యం కొనసాగి స్తానని ట్రంప్ అమెరికా వాణిజ్య కత్తిని చూపి బెదిరించారా?. ఇంట్లో చొరబడి మరీ చంపుతామని ఇప్పటికి ఎన్నోసార్లు మోదీ అదే డైలాగ్‌లు కొడుతున్నారు. మరి సిందూర్ పరిసమాప్తంకాలేదని, పాక్ దాడిచేస్తే మళ్లీ మొదలవుతుందని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు సిందూర్ విజయవంతమైందని ఎలా అంటారు? యుద్ధం చేయడం తమ విధానం కాదంటారు? మరి సిందూర్వేళ చేసిందేంటి? వాళ్ల అధీనంలోని భూభాగాన్ని స్వాధీనంచేసుకోవడానికి సిందూర్ చేయలేదంటున్నారు. మరి దేని కోసం చేసినట్లు? సిందూర్ వేళ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయాం?’’ అని గొగోయ్ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్‌కు 26 నోటీసులుబిహార్ ఓటర్ల జాబితా అంశంతోపాటు ఇతర రాష్ట్రాల్లో బెంగాళీ వలసకూలీలు వివక్షను ఎదుర్కొనే పలు అంశాలపై రాజ్యసభలో చర్చించాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు మొత్తం 26 వాయిదా తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. జోరీఅవర్ సెషన్‌ను మొదలుపెట్టాలని నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తిని హరివంశ్ కోరగానే విపక్షసభ్యులు ఆందోళన పెంచారు. ఓటు చోరీని ఆపాలి అని నినాదాలుచేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్‌లోపే సభ రెండుసార్లు వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక సభను మంగళవారానికి వాయిదావేశారు. ó డీ చర్చ -
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్‌ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్‌తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్‌లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్‌లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్‌లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్‌లో నేపాల్‌లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్‌లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్‌లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. -
కనిపెట్టి.. కాపాడుదాం
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిలవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అంతేకాకుండా వ్యవస్థల స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ... విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఏయే స్థాయుల్లో, ఎలా వాటిని గుర్తించి నివారించవచ్చు? ఇందులో సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? విశాఖపట్నంలో ఓ కోచింగ్ సంస్థలో ‘నీట్’శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022లో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యల కేసులు నమోదైతే అందులో 7 శాతం విద్యార్థుల మరణాలే’అని అత్యున్నత న్యాయస్థానం గణాంకాలనూ ఉటంకించింది. 100 మంది విద్యార్థులు ఉన్న విద్య, శిక్షణ సంస్థలు, హాస్టళ్లలో సైకాలజిస్ట్, అర్హతగల కౌన్సిలర్, సామాజిక కార్యకర్తను నియమించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తేలిగ్గా తీసుకొనే మాటలు కావవి.. ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థి తన కష్టాన్ని, బాధను ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు. అది స్నేహితులు, బంధువులు, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు. అలాంటప్పుడు వారి మాటలను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. ⇒ ‘పరిస్థితులు ఎప్పటికీ బాగుపడవు.. ఇక నేను ప్రయతి్నంచడంలో అర్థం లేదు’ ⇒ ‘నా సమస్యలకు ఎవరూ సహాయం చేయలేరు.. నాకు మార్గం కనిపించడం లేదు’ ⇒ ‘నేను పనికిరాను, నేను ఎవరికీ ముఖ్యం కాదు’ ⇒ ‘ఇతరులకు భారంగా ఉన్నాను, నా మీద నాకు సిగ్గుగా ఉంది’ ఇలాంటి మాటలు విద్యార్థుల నోటి నుంచి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆ ప్రవర్తనలే హెచ్చరికలు తల్లిదండ్రులు, బడులు లేదా విద్యాసంస్థల్లోని టీచర్లు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికగా భావించాలి. ⇒ ఇటీవలి కాలంలో చదువులో మీ పిల్లలు వరుసగా వెనుకబడుతుంటే ⇒ ప్రతి చిన్న విషయానికీ కోపం, అసహనం ఎక్కువవుతుంటే ⇒నలుగురితో కలవకుండా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతుంటే ⇒ తన ఒళ్లు, ఆహారం, ఆరోగ్యం.. ఇలా దేనిమీదా శ్రద్ధ లేకుండా ఉంటే ⇒ తరగతిలో అజాగ్రత్తగా ఉండటం, మతిమరుపు ⇒ ఏదో తలచుకుని ఏడవడం ⇒ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం ఇలా బయటపడొచ్చు ఒత్తిడిని జయించడానికి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి జనరేషన్–జడ్, జె¯న్–ఆల్ఫా ఏం చేస్తున్నారంటే.. గేమింగ్, ఈ–స్పోర్ట్స్: పోటీతత్వాన్ని నేర్పుతుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.మ్యూజిక్, పాడ్‌కాస్ట్: భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి నుండి ఉపశమనం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ: సృజనాత్మకత, తన టాలెంట్‌ను నలుగురికీ తెలియజేయడం స్వచ్ఛంద సేవ, క్రియాశీలత: సంతృప్తి, సహానుభూతి, తన చుట్టుపక్కల వారితో అనుబంధం పెంచుకోవడానికి ఫిట్నెస్, యోగా: ఒత్తిడి నుంచి బయటపడేందుకు, సానుకూల దృక్పథం షాపింగ్ థెరపీ: ఒత్తిడి నుంచి ఉపశమనం సమయపాలన.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం ఇదే. సమయాన్ని సది్వనియోగం చేసుకోలేక, ఏ పనికి ఎంత సమయం కేటాయంచాలో అంచనా వేయలేక విద్యార్థులు ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ⇒ ప్రాధాన్యతను బట్టి ఏ పనికి ఎక్కువ సమయం, ఏ పనికి తక్కువ సమయం అన్న స్పష్టమైన విభజన చేసుకోవాలి. అది చదువు / సబ్జెక్ట్, ఆటపాటలు, షికార్లు /ఎంజాయ్మెంట్, వ్యాయామం.. అన్నింటికీ వర్తిస్తుంది. ⇒ ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి ⇒ మరునాడు చేయబోయే పనులకు సంబంధించి ముందురోజు రాత్రే టైమ్ టేబుల్ వేసుకోవాలి. అందులో ఎంత శాతం పూర్తిచేస్తున్నారో డైరీలో రాసుకోవాలి. 60, 70, 80, 90 శాతం వరకు వచ్చారంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరవాత అలా రాయాల్సిన అవసరమే ఉండదు. తల్లిదండ్రులూ.. పిల్లలు చెప్పేది వినండి పిల్లలు చెప్పేది వినడానికి చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తాము కష్టపడి, డబ్బు పెట్టి చదివిస్తుంటే... ఏ కష్టం చదవడానికి అనుకుంటారు. ఈ ధోరణి మారాలి. వాళ్లు జీవితంలో ఏ అనుభవమూ లేకనే సమస్యలు మీకు చెబుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్టే. పిల్లలూ.. స్క్రీన్ టైమ్ తగ్గించండి ఇటీవలి కాలంలో విద్యార్థులు చదువు కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ⇒ కొందరు విద్యార్థులు చదువుకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ⇒ షార్ట్స్, రీల్స్, వీడియోలను ఒకటి తరవాత ఒకటి.. చూడటానికి మెదడు అలవాటు పడితే.. చదవాలన్న తలంపే రాకుండా పోతుంది. దానివల్ల పరీక్షల వంటి కీలక సమయాల్లో ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలూ.. సిగ్గు, మొహమాటం వద్దు ⇒ స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లు, బంధువులు.. వీరిలో మీ మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు కచ్చితంగా ఉంటారు. మీకు ఏ సమస్య వచి్చనా నిర్మొహమాటంగా వారితో పంచుకోండి. ⇒ చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు మీ అమ్మ లేదా నాన్న కూడా కావచ్చు. కఠిన గ్రేడింగ్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే ఓదార్చేవారు లేకపోవడం, నిరంతర పోటీతత్వం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ముప్పును ముందే గుర్తించి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయిలో పాఠశాల, కళాశాల కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా, ఒత్తిడిని జయించి, ఆత్మహత్యలను నివారించేలా విద్యాసంస్థలు మేమున్నామనే భరోసా ఇవ్వాలి – నెల్సన్ వినోద్ మోసెస్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
పాములే ఆహారం.. వాగులే ఆవాసం
గిరినాగు (కింగ్ కోబ్రా) అత్యంత ప్రమాదకరమైన సర్పం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులకు ఇతర పాములే ఆహారం. వర్షాకాలంలో పాములను తినేందుకు ఇవి బయటకు వస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు సమీపంలో వీటి జాడ ఎక్కువగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అరుదైన గిరినాగులు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల మధ్య 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నిలయంగా ఉన్న ఈ అభయారణ్యంలో గిరి నాగుల సంచారం ఎక్కువగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు పరిమితమయ్యే ఈ సర్పాలు అత్యంత విషపూరితం. అలాగే ఇవి అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగులు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు పరిసర ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయని వైల్డ్ లైఫ్ అధికారులు అంటున్నారు.ఆహారం కోసం బయటకు.. మార్చి నుంచి జూలై వరకు గిరినాగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో జల వనరులు తగ్గినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. రబీ సీజన్ అనంతరం ఇతర పాములు పొలాల్లో ఉండటంతో ఆహారం కోసం వాటిని వెతుక్కుంటూ గిరినాగులు వస్తుంటాయి. గతేడాది వర్షాకాలంలో బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం సమీపంలో, ఇనుమూరు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అటవీ ప్రాంతంలో, ఇటీవల గడ్డపల్లి, ముంజులూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో గిరినాగులతో పాటు పది అడుగుల తాచుపాములు, రక్తపింజర వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. పట్టుకుని అడవిలో వదిలేస్తూ.. ఇటీవల కాలంలో వర్షాకాలంలోనూ గిరిజనులు పొలాల్లో సంచరిస్తున్నాయి. వీటి సమాచారం అందిస్తే ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇవి అరుదైన పాములు కావడంతో వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 20 అడుగుల పొడవు గిరినాగు పాము చాలా ప్రమాదమైంది. 20 అడుగుల పైగా పొడవు ఉంటుంది. బాగా ముదిరిన పాము చాలా డేంజర్. నేను చాలాసార్లు వాటిని చూశాను. అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అవి కనిపిస్తే పరుగులు తీసేవాళ్లం. –ఎస్.ప్రసాద్, బుట్టాయగూడెం మనుషులపై దాడి చేయవు గిరినాగులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే వాటిని భయపెట్టడం లేదా రెచ్చగొట్టడం చేస్తే కాలువేస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము. కాటు వేస్తే మరణమే తప్ప జీవించే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. –గంధం విక్టర్, బుట్టాయగూడెంసమాచారం ఇవ్వండి పశి్చమ ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. ప్రాణభయంతో పాములను చంపవద్దు. మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. ఈ పాములు అరుదైనవి. అభయారణ్యంలో వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –ఎస్కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరంఅత్యంత ప్రమాదకరం గిరినాగులు అత్యంత ప్రమాదకరం. వీటిని పట్టుకోవడం అంత సులువు కాదు. పాపికొండలు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నట్టు ఫోన్లు వస్తున్నాయి. గిరినాగు పాము కనిపిస్తే ఎవరూ చంపవద్దు. 8099855153 నంబర్‌కు ఫోన్ చేస్తే నేను పట్టుకుని అడవిలో వదిలేస్తా. –చదలవాడ క్రాంతి, స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, జంగారెడ్డిగూడెం -
పోషకాల‘పుట్ట’ గొడుగులు
కరకగూడెం: వర్షాకాలం ప్రారంభం కాగానే అటవీ ప్రాంతంలో పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. గ్రామాల్లో మొలిచే పుట్టగొడుగులతో పోలిస్తే అటవీ ప్రాంతంలో పెరిగేవి గిరిజన, ఆదివాసీల ఆహారంలో ఏళ్లుగా భాగమవుతున్నాయి. అంతేకాక వీటి అమ్మకం ద్వారా గిరిజనులు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుంటున్నారు. గిరిజన, ఆదివాసీలు పుట్టగొడుగులను సేకరించి చిన్న కట్ట రూ.50కి, కేజీ రూ.500–రూ.700 వరకు ప్రాంతాల ఆధారంగా విక్రయిస్తుంటారు. ఏటా ఈ సీజన్లో మాత్రమే దొరికేవి కావడంతో ఆదరణ కూడా బాగుంటోంది. పుట్టగొడుగుల రకాలు.. గుర్తింపు గిరిజన ప్రాంతాల్లో తెల్ల, నల్ల పుట్టగొడుగులు కనిపిస్తాయి. అయితే, ఇందులో తినదగినవే కాక విషపూరితమైనవి కూడా ఉంటాయి. వీటి మధ్య తేడాను గుర్తించే పరిజ్ఞానం గిరిజనులకు అనాదిగా వస్తుండటంతో సులువుగానే సేకరిస్తుంటారు. పుట్టగొడుగుల రంగు, ఆకారం, వానే కాక అవి పెరిగిన ప్రదేశం ఆధారంగా తినదగినవా, విషపూరితమైనవా అన్నది గుర్తిస్తారు. తేమతో కూడిన వాతావరణంలో చెట్ల మొదళ్ల వద్ద, కుళ్లిన కలపపై లేదా మట్టిలో మొలి చే పుట్టగొడుగులను జాగ్రత్తగా సేకరిస్తారు. వీటితో కూ ర, పులుసులు, వేపుళ్లు, కొన్ని ప్రాంతాల్లో పచ్చళ్లు చేసుకుంటుండగా.. ఎక్కువగా సేకరిస్తే సమీప సంతలు, పట్టణాల్లో అమ్ముతుంటారు. పోషకాల పవర్‌హౌస్ పుట్టగొడుగులు రుచికరమైనవే కాకుండా, ప్రొటీన్లు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ బీ, డీ,), సెలీనియం, కాపర్, పొటాíÙయం వంటి ఖనిజాలే కాక ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే కొన్ని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. తద్వారా వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులను సంప్రదాయ వైద్యంలో ఔషధాలుగానూ వినియోగిస్తారు. ఏటా ఎదురుచూస్తాం.. వర్షాకాలం వస్తుందంటే పుట్టగొడుగుల కోసం ఎదురుచూస్తాం. అడవిలోకి వెళ్లి సేకరించడం అలవాటు. వీటితో వండిన కూర రుచిగా ఉంటుంది. అందుకే చిన్నాపెద్దలు ఇష్టంగా తింటారు. ఎక్కువగా దొరికినప్పుడు అమ్ముకోవడం ద్వారా కాస్త డబ్బులు కూడా వస్తాయి. – సావిత్రి, మొగిలితోగు గ్రామస్తురాలు చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం.. చిన్నప్పటి నుంచి పుట్టగొడుగులు తింటున్నాం. ఏది తినాలి, ఏది విషపూరితమైనదో పెద్దల ద్వారా తెలుసుకున్నాం. వర్షాకాలంలో తినడానికే కాక అమ్ముతూ ఎంతో కొంత సంపాదిస్తాం. అడవిలో సహజంగా దొరికేది కావడంతో మాకు బలాన్ని ఇస్తుందని తప్పక తింటాం. – సమ్మయ్య, రేగళ్ల గ్రామస్తుడు ఆరోగ్యానికి ఎంతో మేలు పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెంచడం, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల కట్టడికి ఉపయోగపడతాయి. ఇందులో ఏవి తినదగ్గవో సరిగ్గా గుర్తించకపోతే ప్రాణాంతకం అవుతాయి. అందుకే ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. – రవితేజ, వైద్యాధికారి, కరకగూడెం పీహెచ్సీ -
కాదిక ఈ–'వేస్ట్'
ఎలక్ట్రానిక్స్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు ఏమీ కాదు. స్మార్ట్ ఉపకరణాలు.. ప్రధానంగా ఏఐ ఆధారిత గ్యాడ్జెట్స్ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ వినియోగానికి తగ్గట్టుగా ఉపకరణాల సంఖ్యా అధికం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే .. గుట్టలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. అయితే భారత్‌లో ఈ–వేస్ట్ పునర్వినియోగం పెరుగుతుండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2023–24లో 12,54,286 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. 2024–25లో ఇది 13,97,955 టన్నులకు చేరింది. అంటే ఏడాదిలో ఈ–వ్యర్థాలు 11.5 శాతం పెరిగాయన్న మాట. ఈ అయిదేళ్లలో అత్యధికంగా 2022–23లో 16.09 లక్షల టన్నులు పోగయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ వాటా మొత్తం వ్యర్థాల్లో 70.71 శాతం, 2023–24లో ఇది 61.94 శాతంగా ఉంది. రీసైక్లింగ్ వాటా ఏడాదిలో 14 శాతం అధికం కావడం సానుకూల అంశం. రాష్ట్రాల వారీగా చూస్తే రీసైక్లింగ్‌లో దేశంలో 3,88,160 మెట్రిక్ టన్నులతో ఉత్తర ప్రదేశ్ ముందుంది. ఈ–వేస్ట్ పోగవుతున్న నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, పుణే ఉన్నాయి. అపార అవకాశాలు..పరిమాణం పరంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్న దేశాల్లో చైనా, యూఎస్, భారత్ తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. ‘గ్లోబల్ ఈ–వేస్ట్ మానిటర్ నివేదిక 2024’ ప్రకారం.. ఈ–వేస్ట్‌లోని లోహాల ఆర్థిక విలువ సుమారు 91 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈ–వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహాల డిమాండ్‌లో 1 శాతం వరకు తీరుతుందట. అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిశ్రమలో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయన్నమాట. రీసైక్లింగ్ ఒక్కటే పరిష్కారంఅరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్స్) సరఫరాలో అగ్ర స్థానంలో ఉన్న చైనా ఎగుమతులను కట్టడి చేయడంతో.. ఈ కొరతకు పరిష్కారం కనుగొనడానికి మిగతా దేశాలన్నీ దారులు వెతుకుతున్నాయి. విదేశాల్లో అరుదైన లోహ ఖనిజ గనులను దక్కించుకోవడంతోపాటు దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించే పథకానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. విస్మరించడానికి వీలుకాని బంగారు నిక్షేపాలుగా ఈ–వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలతోపాటు స్కాండియం, సెరియం, యూరోపియం, లాంథనమ్ వంటి అరుదైన మూలకాలనూ ఉపయోగిస్తారు. ఈ–వ్యర్థాల నుంచి ఈ విలువైన లోహాలను సేకరించాలంటే సరైన రీతిలో రీసైక్లింగ్ ఒక్కటే కీలక పరిష్కారం. మైనింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఈ విధానం సాయపడుతుంది. గృహాల నుంచే ఎక్కువభారత్‌లో పోగైన ఈ–వ్యర్థాల్లో గృహాల నుండి సేకరించినవి 70% వరకూ ఉంటున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్స్ వంటివి వీటిలో ఉన్నాయి. మిగిలిన 30% వ్యాపార సంస్థల నుంచి సేకరించినవి. వీటిలో రిఫ్రిజిరేటర్లు, వాటర్ కూలర్లు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్లు, హాట్ అండ్ కోల్డ్ డిస్పెన్సర్లు, పారిశ్రామిక ప్రింటర్లు, కాపీయర్లు, వాణిజ్య వాషింగ్ మెషీన్లు, ల్యాబ్ పరికరాలు, ప్రొఫెషనల్ మెడికల్ పరికరాలు, కాఫీ మెషీన్లు, సర్వర్లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు వంటివి ఉన్నాయి. తగ్గుతున్న బరువుసాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాలు తేలికగా, చిన్నవిగా మారుతున్నాయి. సీఆర్టీ టీవీల నుండి ప్రస్తుతం సన్నని ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలకు మారడం వల్ల ఈ–వ్యర్థాల యూనిట్ బరువు గణనీయంగా తగ్గింది. అనేక ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇప్పుడు ఉక్కు, సీసం వంటి బరువైన లోహాలకు బదులుగా అల్యూమినియం, ప్లాస్టిక్‌ల వంటి తేలికైన, మరింత సమర్థవంతమైన పదార్థాలతో తయారవుతున్నాయి. ఈ మార్పు కారణంగా ఈ–వ్యర్థాల మొత్తం బరువు, పరిమాణం ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది.ఈ–వ్యర్థాలు..: పనికిరాని లేదా ఉపయోగించలేని ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఈ–వ్యర్థాలు అంటారు. కంప్యూటర్లు, మానిటర్లు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, టీవీలు, రేడియోలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ప్రింటర్లు, స్కానింగ్ చేసే పరికరాల వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. వీటిలో ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. అందువల్ల వాటిని పారేయకుండా రీసైకిల్ చేయాలి.గత ఆర్థిక సంవత్సరంలో ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ వాటా మొత్తం వ్యర్థాల్లో 70.71 శాతం. 2023–24లో ఇది 61.94 శాతంగా ఉంది. రీసైక్లింగ్ వాటా ఏడాదిలో 14 శాతం పెరగడం సానుకూల అంశం. -
అతివలను.. నిలువనివ్వని కొలువు
దేశంలోని కార్మిక, నైపుణ్య (బ్లూ, గ్రే కాలర్) ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా.. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికార సంస్థ ‘ఉదయతి ఫౌండేషన్’, ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ‘క్వెస్ కార్ప్’ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. రౌండేళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3 శాతం మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది.జీతం పెంచితే మళ్లీ వస్తాం..: 54 శాతం మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్పగా, వారిలో 80 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెబుతోంది. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42 శాతం మంది తమకు మెుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరుతామని చెప్పినట్లు నివేదిక తెలిపింది.రిటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పని చేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి, క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి ‘స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది బ్లూ–గ్రే కాలర్ వర్క్‌ఫోర్స్ 2025’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు, అన్ని కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. సురక్షితం కాని రాకపోకలు..: ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57 శాతం మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సజావైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. 11 శాతం మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లలో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలామంది హాస్టళ్లపై ఆధారపడతారు కానీ, ప్రయాణాల్లో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ఇంటికి దగ్గరగా ఉద్యోగావకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్తామని చెప్పారు.పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22 శాతం మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారట. 28 శాతం మహిళలు.. ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశామని చెప్పారు. వారిలో మూడింట ఒక వంతు మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవటమే కారణమన్నారు.67 శాతం మానేశారు⇒ బ్లూ–గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ–లెవల్ మహిళల్లో సగం మంది ఒక సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు.⇒ 2020–21లో 16 శాతంగా ఉన్న బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023–24లో 19 శాతానికి పెరిగినప్పటికీ, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం, గత ఆరు నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు.ఆ 5 కీలకం⇒ మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలవని నివేదిక గుర్తించిన 5 అంశాలు...⇒ మెరుగైన వేతనం సురక్షితమైన ప్రయాణ సదుపాయం⇒ అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు⇒ స్పష్టమైన వృద్ధి అవకాశాలు⇒ అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయ సంస్కృతిమహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలోనే ఉద్యోగం మానేస్తున్నారు– పూజా గోయల్, ఉదయతి ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓఎదిగే అవకాశాలు అస్పష్టం..: కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాన్ని వదిలేశామని 21 శాతం మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా బీ.ఎఫ్.ఎస్.ఐ. (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) టెలికం రంగాల్లో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని డేటా తెలిపింది. అయినప్పటికీ 11 శాతం మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు. -
భూమి.. వేగంగా తిరుగుతోంది!
ఈ మధ్య భూమి వేగంగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూభ్రమణం వల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. అంటే వేగం ప్రభావం కాలం మీదా పడుతుంది. టైమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు, జీపీఎస్ శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్ల వంటి ఆర్థిక వ్యవస్థలు.. అన్నీ ప్రభావితమవుతాయి. అంటే.. సుదీర్ఘకాలంలో మానవాళికి ఓ అకాల సమస్య సవాలు విసరనుందా?ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది. జూలై 10.. ఈ ఏడాదిలో అత్యంత పొట్టి రోజు. రోజుకు ఉండాల్సినవి 24 గంటలు. కానీ ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్, యూఎస్ నేవల్ అబ్జర్వేటరీల వంటి వాటి ప్రకారం ఆ రోజున 1.36 మిల్లీ సెకన్లు (0.00136 సెకన్లు) తక్కువయ్యాయి. జూలై 22, ఆగస్టు 5న కూడా ఇలాంటి పొట్టి రోజులే నమోదు కానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా 1.34, 1.25 మిల్లీ సెకన్లు ఈ రెండు రోజుల్లో లోటు పడతాయట.86,400 సెకన్లకు అటూ ఇటుగా..భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు లేదా 86,400 సెకన్ల సమయం పడుతుందని మనం చదువుకున్నాం. కానీ, చంద్రుడి గురుత్వాకర్షణ, భూ కేంద్రంలో మార్పుల ప్రభావం.. వీటన్నింటివల్ల కచ్చితంగా 86,400 సెకన్లు ఉండదు. కాస్త అటూ ఇటుగా ఉంటుంది. స్వల్పకాలంలో దీని ప్రభావం మనపై పెద్దగా కనిపించదు కాబట్టి మనకు తెలియదు.అణు గడియారాలుసమయాన్ని అత్యంత కచ్చితంగా కొలిచేందుకు రూపొందించినవే అణుగడియారాలు. ప్రతి అణువుకు ఒక నిర్దిష్ట పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉంటుంది. ఈ పౌనఃపున్యం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అణు గడియారాలు ఈ పౌనఃపున్యాన్ని ఉపయోగించి సమయాన్ని కొలుస్తాయి. ఈ సమయాన్నే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ) అని పిలుస్తారు. ఇది దాదాపు 450 అణు గడియారాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సమయపాలనకు ప్రపంచ ప్రమాణం, అలాగే మన ఫోన్ లు, కంప్యూటర్లు అన్నింటిలోనూ పొందుపరిచిన సమయం కూడా ఇదే.1972 నుంచి.. 1972 నుంచి భూమి భ్రమణ వేగం బాగా తగ్గింది. అణు గడియారాలతో పోలిస్తే.. ఈ సమయం తక్కువ కావడంతో యూటీసీకి ‘లీప్ సెకన్’ను జోడించాలని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ ఆదేశించింది. దీన్ని పాజిటివ్ లీప్ సెకన్ అని పిలుస్తారు. చెప్పాలంటే ఇది లీప్ ఇయర్ లాంటిది. 1972 జూన్ 30 నుంచి మొత్తం ఇలా 27 లీప్ సెకన్లను యూటీసీకి అదనంగా జోడించారు. కానీ, 2016 డిసెంబర్ 31 తరవాత మాత్రం ఒక్కటి కూడా అదనంగా చేరలేదు.ఎందుకు ఈ వేగం?డంకన్ ఆగ్నూ అగ్నూ అంచనాల ప్రకారం.. చంద్రుడు, సముద్ర అలల కారణంగా భూభ్రమణంలో అత్యంత స్వల్ప కాల మార్పులు సంభవిస్తున్నాయి. చంద్రుడు భూమధ్యరేఖకు పైన ఉంటే భూమి నెమ్మదిగా తిరుగుతోంది. వేసవిలో భూమి కాస్త వేగంగా తిరుగుతుంది.వాతావరణ మార్పులు కూడా లీప్ సెకన్‌కు కారణమవుతున్నాయి. గత ఏడాది ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమైన ఆగ్నూ అధ్యయనం ప్రకారం.. అంటార్కిటికా, గ్రీన్ల్యాండ్లలోని మంచు కరిగి సముద్రాల్లోకి కలిసి, సముద్ర మట్టాలు పెరిగి భూభ్రమణ వేగం తగ్గుతోంది. మంచు కరగడం భూమి అక్షంలో కూడా మార్పులకు కారణమవుతోందని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా పరిశోధనలో తేలింది. ‘సాధారణంగా చంద్రుడు భూభ్రమణాన్ని ఇంతవరకు ప్రభావితం చేస్తున్నాడు. కానీ, ఈ శతాబ్దం చివరి నాటికి.. భూమిపై గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు భారీగా పెరిగి అవి భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటున్నారు సోజా.లీప్ సెకన్కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ – యూటీసీ నుంచి ఒక సెకను తీసేస్తే నెగటివ్ లీప్ సెకండ్ అంటారు. పాజిటివ్ లీప్ సెకన్ అంటే యూటీసీకి ఒక సెకన్ను జోడిస్తారు. భూభ్రమణ వేగం పెరిగినప్పుడు నెగటివ్ లీప్ సెకన్ అవసరమవుతుంది. దీనివల్ల ఒక రోజు 86,400 సెకన్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.సాధారణంగా సమయాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో చెప్తాం. ఉదాహరణకు.. 23:59:59 తరవాత.. 00:00:00 వస్తుంది. కానీ పాజిటివ్ లీప్ సెకన్ ఉంటే..23:59:59, 23:59:60 తరవాత 00:00:00 వస్తుంది. అదే నెగటివ్ లీప్ సెకన్ అయితే... 23:59:57, 23:59:58 తరవాత 00:00:00 వస్తుంది.1949లో మొట్టమొదటి అణు గడియారం తయారైనప్పటి నుంచి చూస్తే 2024 జూలై 5ను శాస్త్రవేత్తలు అతి పొట్టి రోజుగా గుర్తించారు. ఈ రోజున 24 గంటల కంటే 1.66 మిల్లీసెకన్లు తక్కువ నమోదయ్యాయి.లీప్ సెకన్ ప్రభావం?టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్లు, ఆర్థిక లావాదేవీలు, ఎలక్ట్రిక్ గ్రిడ్లు, జీపీఎస్ శాటిలైట్లు వంటి అనేక వ్యవస్థలు సమయంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇంతవరకు ఇవి పాజిటివ్ లీప్ సెకన్నే చూశాయి. నెగటివ్ లీప్ సెకన్ వల్ల ఇవి ఎలా ప్రభావితమవుతాయో చెప్పడం కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు.ఉంచాలా.. తీసేయాలా?⇒ ‘లీప్ సెకన్ అనేది మనం సృష్టించింది. ఈ లీప్ సెకన్ పద్ధతినే తీసేస్తే గొడవ ఉండదు కదా’ అని వాదించేవారు లేకపోలేదు.⇒ ‘గడియారంలోంచి మనం తీసేయగలం. కానీ, భూభ్రమణంలో వచ్చే మార్పులను చెరిపేయలేం. సుదీర్ఘకాలంలో మానవాళిపై వాటి ప్రభావాన్ని తుడిచేయలేం. భూమి నెమ్మదిగానో వేగంగానో తిరుగుతోందని.. అందుకు భూతాపం వంటివి కారణమవుతున్నాయని తెలుసుకునేందుకు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉండాల్సిందే’ అని గట్టిగా వాదిస్తున్నవారూ ఉన్నారు. -
భూమి మీద నుంచే శాటిలైట్లపై దాడి!
ఎల్రక్టానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్సహా ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న చైనా ఇప్పుడు మరో అసాధారణ, శక్తివంతమైన ఆయుధ తయారీలో తలమునకలైంది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఎన్నెన్నో ఆవిష్కరణలు చేసిన చైనా ఇప్పుడు దేశ భద్రత, రక్షణే పరమావధిగా కీలక ఆయుధాన్ని సృష్టిస్తోంది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మకప్రాంతాల గుట్టుమట్టు చెప్పే విదేశీ, శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే లేజర్ కాంతి ఆయుధాన్ని అభివృద్ధిచేస్తోంది. కాంతి సాధారణ స్థాయిలోకాకుండా ప్రత్యేకమైన స్ఫటికాల గుండా ప్రసరించినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. అత్యంత తీక్షణతో ప్రసరిస్తూ ఆ లేజర్ కాంతి ఎంతటి కఠినమైన పదార్థాౖన్నైనా సునాయాసంగా కోసేస్తుంది. భవిష్యత్తులో పనికిరాకుండా సర్వనాశనంచేసేస్తుంది. లేజర్ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లేజర్ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల ఉపగ్రహాలపైకి చైనా ప్రయోగించనుంది. భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలను నేలమీద నుంచే గురిచేసి కొట్టడం అంత తేలికైనపని కాదు. అందుకే బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఎంత పెద్ద ఇనుపగుండుతో దెబ్బ కొడితే అంతగా బీభత్సం స్థాయికి పెరుగుతుంది. అలాగే బీజీసీఈ క్రిస్టల్ నుంచి వెలువడే లేజర్ కాంతి సృష్టించే వినాశనం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. సూక్ష్మం నుంచే సర్వనాశనం.. బీజీఈసీతో తయారైన లేజర్ కాంతి పుంజం వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. కత్తి అంచును ఎంత సానబడితే అంత పదునెక్కుతుంది. అలాగే ఈ స్ఫటికం ఎంత పారదర్శకంగా ఉంటే అందులోంచి వెలువడే లేజర్ కాంతి అంత ప్రాణాంతకంగా మారుతుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. అలా అది ఏకంగా ఉపగ్రహాలను సైతం ముక్కలుగా కోసేస్తుంది. స్వల్పశ్రేణి పరారుణకాంతి పుంజాలను అత్యంత సుదూరమైన లేజర్ కాంతి పుంజాలుగా, మారణాయుధాలుగా మార్చేందుకు బీజీఈసీ స్ఫటికం అక్కరకొస్తుంది. ‘‘చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 550 మెగావాట్ల లేజర్ కాంతిని ఈ స్ఫటికం ప్రసరింపజేస్తుంది. ఇంతటి తీక్షణత ధాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహ ఉపరితల పొరనైనా ముక్కలవడం ఖాయం. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రు ఉపగ్రహాలను ఉన్నచోటులోనే ఉన్నపళంగా నిరీ్వర్యంచేసే శక్తి ఈ క్రిస్టల్ పరారుణ కాంతి ఆయుధానికి ఉంది’’అని ప్రొఫెసర్ వూ హైక్సిన్ అన్నారు. ఈయన సింథటిక్ క్రిస్టల్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనాపత్రానికి ముఖ్యరచయితగా వ్యవహరించారు.అత్యంత సురక్షితం, అతి సామర్థ్యం.. ఇంతటి తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధవ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులురాకుండా దీనిని తయారుచేస్తున్నారు. గతంలో అమెరికా అచ్చం ఇలాంటి ప్రయోగమే చేసి చేతులుకాల్చుకుంది. 1997లో అమెరికా నావికాదళం మిడ్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్(మిరాకిల్) పేరిట ఒక ప్రయోగంచేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. కానీ ఆ లేజర్‌బీమ్‌ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా చైనా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా శాస్త్రవేత్తలే తొలిసారిగా 2010లో అభివృద్ధిచేశారు. వెంటనే దీనిని తమ ఆయుధవ్యవస్థల్లో అమర్చుకునేందుకు పలు దేశాల రక్షణశాఖలు ప్రయత్నించినా అది ఎందుకో సఫలంకాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ. 22,845 కోట్లు కొల్లగొట్టారు!
భారత్‌లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్లొకేషన్ ఇట్టే పట్టేస్తారుసైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.కట్టడికి కలిసికట్టుగా..న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్‌ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఐఆర్) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్ సీఆర్పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు. -
లక్ష ఏళ్లనాటి సమాధులు
ఇజ్రాయెల్‌లో ఏకంగా లక్ష ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శవాల దిబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆదిమ మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతల్లో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టిన్ష్మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవలే అకాడమిక్ జర్నల్‌లో ప్రచురించారు. చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషా లను అక్కడినుంచి తవ్వితీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లలో ఒకరు, హీబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నెర్ అన్నారు. ఈ దిబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి లక్ష నుంచి లక్షా 10 వేల ఏళ్ల నాటివని వివరించారు.గుహ మొదట్లోనే పుర్రెటిన్ష్మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచీ తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి గుండా బయటికి చొచ్చుకుని వచ్చినట్టుగా ఉన్న ఓ పుర్రెను గుర్తించారు. లోపల సమాధుల్లో శవాల పక్కన గులకరాళ్లు, జంతువుల అవశేషాల వంటివి కనిపించాయి. వీటిలో చాలావరకు నాటి రోజువారీ జీవితంలో ఉపయోగం లేనివే. దాంతో ఇవి అప్పటి ఆచారం ప్రకారం మృతుల గౌరవార్థం ఉంచినవేనని తేల్చారు. ఇవన్నీ రాతియుగం నాటివిగా, అంటే సుమారు 2.5 లక్షల నుంచి 30 వేల ఏళ్ల మధ్యనాటివిగా తేలింది. ఈ వివరాలను నేచర్హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించారు. ఇక్కడ రెండు అస్థిపంజరంతో కూడిన పూర్తిస్థాయి పుర్రెలు, మూడు పుర్రెలు, ఎముకలతో పాటు అలంకరణ సామగ్రి వంటివి కూడా దొరికాయి. అప్పట్లోనే మనిషి కేవలం తిండి, స్వీయరక్షణకు పరిమితం కాకుండా ఇతరత్రా అంశాలను కూడా నేర్చుకున్నట్టు దీన్నిబట్టి తెలుస్తోందని పురాతత్వవేత్తలు అభిప్రాయç ³డుతున్నారు. సున్నితత్వం దృష్ట్యా ఈ గుహ భాగాలను అతి చిన్న పరికరాలతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని పూర్తి విశేషాలు బయట పడాలంటే మరికొన్నేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇవి ఇజ్రా యెల్లోని 100 ఏళ్ల క్రితం స్కుల్లో, 50 ఏళ్ల నాడు ఖఫ్జేలో బయటపడ్డ గుహలను తలపిస్తు న్నాయి. మృతదేహాలను గాలికి వదిలేయకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపే ఆచారం బహుశా 2 లక్షల ఏళ్ల క్రితమే పురుడుపోసుకుని ఉంటుందని పురాతత్వవేత్తలు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రాండ్ పురుష్
మలయాళ సినీ హీరో మోహన్‌లాల్ నటించిన కొత్త పాత్ర ఒకటి ఇంటర్నెట్లో ఇప్పుడు ఆలోచన రేకెత్తిస్తోంది. అది సినిమా పాత్ర కాదు. ‘విన్స్మెరా’ బ్రాండ్ జ్యూయల్స్ యాడ్. ముచ్చటైన ఒక నెక్లెస్‌ను చూసి ఆగలేక, దాన్ని తన మెడలో వేసుకుని, అద్దంలో చూసుకుని మురిసిపోతున్న పురుషుడిగా మోహన్‌లాల్ అందులో నటించారు. ఊరికే మురిసిపోలేదు. స్త్రీ హృదయంతో పరవశించి నాట్య మయూరం అయ్యారు. ఆభరణాలను ధరించి మోహన్‌లాల్ మైమరిచిపోతే, ఆయన్ని చూసి నెటిజన్లు ముగ్ధులైపోయారు. అంతపెద్ద హీరో స్త్రీ మనోభావాలతో నటించటం విశేషమే అయినా, అలాంటి యాడ్‌ను ఒక బ్రాండ్ వాణిజ్య ప్రకటనగా విడుదల చేయటం సాహసమే.మగవాళ్లలో ధీరత్వం ఉండాలి. స్త్రీలలో లాలిత్యం ఉండాలి. ఇదీ శతాబ్దాలుగా మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్న భావన. ఇదే వ్యాపార ప్రకటనల్లోనూ ప్రతిఫలిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్లే స్త్రీ, పురుషులు వేర్వేరు ఉత్పత్తులకు ప్రచారం ఇస్తూ కనిపిస్తుంటారు. ఇప్పుడీ ధోరణిలో మార్పు వస్తోంది. మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లు తమ వ్యాపార ప్రకటనల్లో పురుష ధీరత్వాల తెరల్ని మెల్లగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ మార్కెటింగ్ డేటా విశ్లేషణ సంస్థ ‘కాంతార్’.. ఈ మార్పు వేగంగా జరగటం లేదని, గతేడాది 450 కంటే ఎక్కువ ప్రకటనల్లో దాదాపు 94 శాతం సంప్రదాయ పురుష మూస పాత్రలే ఉన్నాయని తన తాజా నివేదికలో వెల్లడించింది.ఒక శాతం గానే ప్రగతిశీలత..: గత ఏడాది యాడ్స్‌లో కనిపించిన పురుషాధిక్య మూసపాత్రల డేటాను విశ్లేషిస్తూ ‘ది ఇండియన్ మాస్క్యులినిటీ మేజ్’ పేరిట కాంతార్ ఈ నివేదికను విడుదల చేసింది. భారతీయ పురుషుల్లో స్వచ్ఛంగా ఇంటి బాధ్యతలను స్వీకరిస్తున్న ధోరణి కనిపిస్తున్నప్పటికీ వ్యాపార ప్రకటనలు 1 శాతం మాత్రమే ఆ ధోరణిని ప్రతిఫలిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ప్రకటనదారులు కొంత ప్రగతిశీలంగా మారిన మాటను కాదనలేమని, అందుకు నిదర్శనంగా రేమండ్, ఏరియల్, తనిష్క్, గుడ్‌నైట్, విమ్ వంటి బ్రాండ్లు గతంలో తయారు చేసిన వ్యాపార ప్రకటనల్ని చూడవచ్చని పరిశ్రమలోని వారు అంటున్నారు.‘పవర్’ వైపే బ్రాండ్ల మొగ్గు..: మార్కెట్లో ముఖ్యమైన బ్రాండ్లు తమ అమ్మకాలు పెంచుకోడానికి వ్యాపార ప్రకటనల్లో నేటికీ ‘స్టార్’ పవర్ పైనే ఆధారపడుతున్నాయి. ప్రేక్షకులు రణ్వీర్ సింగ్ లేదా విరాట్ కోహ్లీ వంటి ఇమేజ్ ఉన్న వారి పైనే మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు భిన్నంగా లక్స్ తన ప్రకటన కోసం షారుఖ్ ఖా¯Œ ను గులాబీ రేకులు ఉన్న బాత్ టబ్‌లో ఉంచటం చూస్తే.. ప్రకటనలు ఇప్పుడు పురుషత్వపు అతిశయోక్తి భావనల నుంచి దూరంగా జరిగే సాహసం చేస్తున్నాయని స్పష్టమౌతోంది. మోహన్‌లాల్‌తో విన్స్మెరా ప్రకటన ఇందుకు తాజా ఉదాహరణ.సంస్కరణలకు పిలుపు దేశంలోని ఎనిమిది నగరాల్లో 880 మంది పట్టణ భారతీయ పురుషులపై (18–45 సంవత్సరాల వయస్సు) కాంతార్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. 12 భాషల్లో 150కి పైగా చానళ్లలో ప్రసారమైన 450కి పైగా టీవీ ప్రకటనల్ని నిశితంగా పరిశీలించింది. ప్రపంచంలోనే అది పెద్ద మార్కెట్ అయిన భారత్‌లోని బ్రాండ్లు తాము రూపొందించే ప్రకటనల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని కనబరచవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారతీయ పురుషుల్లో ధీరత్వమే కాదు.. మహిళల్లా సుతిమెత్తనితనమూ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి పురుషుడిలోనూ స్త్రీత్వమూ ఉంది. ఎంతోమంది మగాళ్లు ఇంటి బాధ్యతలనూ పంచుకుంటున్నారు. కానీ ప్రకటనల ప్రపంచం ఈ మార్పులకు అనుగుణంగా లేదు.⇒ యువకులు (ముఖ్యంగా జెన్ జెడ్) భావోద్వేగాల పరంగా మునుపటి తరం కన్నా భిన్నంగా ఉన్నారు. మార్పునకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలం స్త్రీల బాధ్యతలు అనుకంటూ వస్తున్న పనులను తమకై తామే స్వీకరిస్తున్నారు. అయితే వ్యాపార ప్రకటనలు ఇంకా ఒకప్పటి మగధీరత్వాన్నే కీర్తిస్తూ ఉన్నాయి.⇒ మిలీనియల్స్‌లో 41 శాతం, జెన్ జడ్ పురుషుల్లో 31 శాతం మంది వ్యాపార ప్రకటనలలోని పురుష పాత్రలు తమ మనస్తత్వానికి పూర్తి భిన్నంగా, ప్రతికూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.⇒ అదే సమయంలో, ‘నిజమైన పురుషులు ఏడవరు’ అనే మాటను 71 శాతం మంది పురుషులు అంగీకరిస్తున్నారు.సర్వే హైలైట్స్⇒ ప్రకటనల్లో కేవలం 6% పురుష పాత్రలు మాత్రమే స్త్రీల పట్ల గౌరవాన్ని, భావోద్వేగ సహానుభూతిని చూపించాయి.⇒ 94% ప్రకటనల్లో సంప్రదాయ పురుష పాత్రలే ఉన్నాయి.⇒ ప్రకటనల్లో 43 % వాయిస్ ఓవర్లు పురుషులవే. స్త్రీలవి 31% మాత్రమే. మిశ్రమ కథనాల వాయిస్ ఓవర్లలో కూడా పురుషుల ఆధిక్యమే కనిపిస్తోంది.⇒ కేవలం 1% పురుషులు మాత్రమే ప్రకటనల్లో పిల్లల సంరక్షణ, ఇంటి పనుల్లో కనిపించారు. -
విశ్వానికి అంతముందా!
విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్ క్రంచ్’గా సదరు వ్యాసం పేర్కొంది. డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే (డీఎన్ఎస్), డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ (డీఈఎస్ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు. డార్క్ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్–డార్క్ ఎనర్జీ మోడల్ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే. ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుంది.ఆయువు 3,330 కోట్ల ఏళ్లువిశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరాలు... డ్రగ్స్ దందా... అక్రమ నివాసం... అసాంఘిక కార్యకలాపాలు... అనుమానాస్పద ప్రవర్తన... ఇలాంటి అనేక కారణాలతో చిక్కిన విదేశీయుల్లో కొందరిపై కేసులు నమోదు చేస్తుంటారు. మరికొందరిని తక్షణం వారి వారి దేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. డిపోర్టేషన్‌గా పిలిచే ఈ ప్రక్రియకు కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు వారిని డిటెన్షన్ సెంటర్లో ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం సెంట్రల్ జైలులో డిటెన్షన్ సెంటర్ ఉండేది. విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక సెంటర్ లేకపోవడంతో తాత్కాలికంగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆదీనంలో ఉంచారు. ఆపై వికారాబాద్, హైదరాబాద్‌లలో ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పుడది జోగిపేట సబ్ జైలుకు మారింది. ఆ దేశాలకు చెందిన వారే అధికం... ఇక్కడ ఉన్న అవకాశాల నేపథ్యంలో నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోస్ట్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు. వీరిలో కొందరు తమ వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవారు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇదే జరిగేది. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌కు అవకాశం ఉండేది కాదు. దీంతో పాటు కొందరు నల్లజాతీయులు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు. వీరు పట్టుబడినా, శిక్ష పూర్తి చేసుకున్నా, కోర్టు ఆదేశించినా డిపోర్టేషన్ చేయాల్సిందే. కొందరిపై నేరుగా డిపోర్టేషన్ ప్రక్రియ చేపడతారు. తాత్కాలికం అంటూ ఇప్పటి వరకు... ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న ఈ విదేశీయుల ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. దీనిని గుర్తించిన నగర పోలీసులు అక్రమంగా నివసిస్తున్న వారికి, అనుమానాస్పద కదలికలు కలిగిన వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి పైనే కేసు నమోదు చేసి, అరెస్టు తదితర వ్యవహారాలు చేస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరికి గుర్తింపు పత్రాలు, ఢిల్లీలోని కార్యాలయాల నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వారిని అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం వారిపై మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ తీసుకుని డిటెన్షన్ సెంటర్లో ఉంచుతారు. రాష్ట్ర విభజనకు ముందు ఇది విశాఖపట్నంలో ఉండేది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్‌ను డిపోర్టేషన్ సెంటర్‌గా మార్చినా ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతోంది. సీసీఎస్ మారినా సౌకర్యాల లేమి... ఒకప్పుడు సీసీఎస్ పబ్లిక్‌గార్డెన్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ఆనుకుని ఉండేది. అక్కడ ఐదుగురిని ఉంచడానికి సరిపోయే జైలు గదినే ఈ సెంటర్‌గా వాడారు. ఆపై సీసీఎస్ బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌కు వెళ్లింది. దీంతో అక్కడే ఓ గదిని లాకప్ కమ్ డిపోర్టేషన్ సెంటర్‌గా వాడుతున్నారు. ఒక్కోసారి పాత సీసీఎస్ లాకప్‌లోనే వీరిని ఉంచుతున్నారు. ఆయా విదేశీయులకు అనువైన ఆహారం అందించలేకపోవడం కొత్త సమస్యలకు కారణం అవుతోంది. దీంతో నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిటెన్షన్ సెంటర్ (detention center) కోరుతూ ఐదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వికారాబాద్‌లో ఈ సెంటర్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. దీనికి నిధుల కేటాయింపు జరగకపోవడంతో నిర్మాణం ముందుకు సాగలేదు. 2023లో ఈ అంశంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నగరానికి దూరంగా కాకుండా సిటీలోనే డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఎట్టకేలకు జోగిపేట సబ్ జైలులో... కొత్తగా డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న భవనాల్లో అనువైనది ఎంపిక చేసి అందులోనే దీని ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జోగిపేట సబ్ జైల్ అధికారుల దృష్టికి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న విదేశీయుల వ్యవహారం సున్నితమైంది, అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉన్నదని ప్రభుత్వ అభిప్రాయం. చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న e వ్యర్థాలుదీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం అందించే వంట వారితో పాటు ఇతర సౌకర్యాలు ఉండేలా ఆదేశించింది. ఈ సెంటర్ నిర్వహణతో పాటు డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన నిధులను అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో జోగిపేట సబ్ జైలులో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్న అధికారులు వీలైనంత త్వరలో ఈ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
కీబోర్డు, మౌస్ లేకుండానే.. కంప్యూటర్ పనిచేస్తుంది!
కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, వాయిస్ కమాండ్ల వంటివి లేకుండా కంప్యూటర్‌తో పనిచేయించడాన్ని ఊహించగలమా? స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో.. దాన్ని సుసాధ్యం చేయనుంది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ. కేవలం మన చేతివేళ్ల కదలికలతో, వాటి సంజ్ఞలతో కంప్యూటర్లూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను ఇకమీదట నియంత్రించవచ్చు! టెక్నాలజీ వాడకంలో ఇదో గొప్ప మలుపు కానుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వరం. మాట (వాయిస్) లేదా సాధారణ ఇన్పుట్ పద్ధతులు పనిచేయని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్‌కు అన్నీ చెప్పేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రహస్యమైన విషయాలను ఎవ్వరికీ తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు.. సెర్చ్ చేయొచ్చు.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ చేయొచ్చు. మెటా సంస్థ తయారుచేస్తున్న స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను మెటా రూపొందించింది.మెటా రియాలిటీ ల్యాబ్స్‌లో..: ఈ సాంకేతికతకు సంబంధించిన పురోగతిని ఇటీవల ప్రముఖ జర్నల్ ‘నేచరల్’లో మెటా ప్రచురించింది. మెటాకు చెందిన వ్యాపార, పరిశోధనా విభాగం ‘రియాలిటీ ల్యాబ్స్’లో ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మోడళ్లు వారి కండరాల సందేశాలను విజయవంతంగా గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్‌ని మెటా ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ‘ఓరియన్’తోనూ పరీక్షించారు.ఎలా పనిచేస్తుంది?..: మన మెదడు.. నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే రిస్ట్ బ్యాండ్‌ని మెటా కంపెనీ తయారుచేసింది. దీని సాయంతో కంప్యూటర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను నియంత్రించవచ్చు. ఇకమీదట కీబోర్డులు, మౌస్‌లు లేదా స్క్రీన్‌ను టచ్ చేయడం వంటివేవీ అవసరం ఉండదు. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులభతరం, సరళతరం కానుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేయడం విశేషం.ఏమిటీ సాంకేతికత?సాధారణంగా ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ‘ఉపరితల ఈఎమ్‌జీ (ఎస్‌ఈఎమ్‌జీ) సాంకేతికతగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మనం చేతిని కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ లేదా స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించి పనిచేయడం దీని ప్రత్యేకత. పెద్దపెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే వ్యవస్థలు మన సంజ్ఞలను గుర్తించి పనిచేస్తాయి. కానీ, మన కదలికలు స్పష్టంగా లేకపోతే ఇవి పనిచేయవు. కానీ, మన మెదడు – కంప్యూటర్ లేదా న్యూరో మోటార్ ఇంటర్‌ఫేస్‌లు.. అంటే మన శరీరం నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలతో పనిచేసే వాటితో ఈ సమస్య ఉండదని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు.దీంతో ఏమేం చేయొచ్చు?⇒ ఒక టేబుల్ లేదా మన తొడ లేదా డెస్క్ లాంటి దానిపై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి, మనం ఏం రాశామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది.⇒ మెసేజ్‌లు టైప్ చేయొచ్చు⇒ మెనూలు నియంత్రించ వచ్చు⇒ చేతుల కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్‌ను మనకు నచ్చినట్టు యాక్సెస్ చేయవచ్చుఎవరికి ఉపయోగం?దివ్యాంగులకు..⇒ శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు లేదా సంక్లిష్టమైన పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండానే.. వివిధ శారీరక సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు..⇒ సాధారణ ఇన్ పుట్ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి ..⇒ బహిరంగంగా లేదా ప్రైవేటుగా మాట్లాడలేని సందర్భాల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు..మరిన్ని ఆవిష్కరణల కోసం..ప్రస్తుతానికి ఈ సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కాలేదు. మన శరీరం నుంచి వచ్చే సంకేతాలను గుర్తించే పరికరాలను భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని మెటా చెబుతోంది. ఈ సాంకేతికతకు సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్ మోడళ్లు, డిజైన్ మార్గదర్శకాలను పరిశోధకులతో పంచుకునేందుకు మెటా ముందుకు వచ్చింది. తద్వారా.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే మరిన్ని సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందించనుంది. -
కలసి తింటూ.. బరువెక్కుతున్నారు
చుక్క లాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి! ఒకరితో ఒకరికి పెళ్లయింది. పెళ్లికి ముందు ‘ఎవరికి వారు’గా ఉన్నవారు, పెళ్లి తర్వాత ‘ఒకరి కోసం ఒకరు’ అన్నట్లుగా మారిపోయారు. మంచిదే కదా! మంచిదే కానీ.. వాళ్లలో మెల్లగా మార్పు మొదలైంది! గొడవలా? కాదు. మనస్ఫర్థలా? కాదు. ఉద్యోగాల్లో పడి ఒకరికొకరు టైమ్ ఇవ్వటం లేదా? కాదు.. కాదు! మరేంటి సమస్య? ఏంటంటే – ఇద్దరూ బాగా లావైపోయారు! అవునా!! అవును. దేశమంతటా ఇదే ధోరణి కనిపిస్తోందట! కలిసి తినటమే దంపతులను ఊబకాయులుగా మార్చేస్తోందట.⇒ అయ్యో రామా, భార్యాభర్తలు కలిసి తినటం కూడా తప్పేనా? తప్పు కాదు కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తమ ఆహారపు అలవాట్లు మార్చుకునే క్రమంలో ‘సయోధ్య’తో ఒకే రకమైన ఆహారం తీసుకోవటం వల్ల ఇద్దరూ కూడా క్రమేణా బరువు పెరిగే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అంటోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.) దగ్గరున్న డేటాలో 50 వేలమందికి పైగా దంపతుల ఆహార అలవాట్ల వివరాలను విశ్లేషించిన ఐ.సి.ఎం.ఆర్., ఆ దంపతులలో 27.4 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు కనుగొంది. ఈ ధోరణి ప్రధానంగా పట్టణ, సంపన్న వర్గాలలోని దంపతులలో కనిపించిందని తాజా అధ్యయనం వెల్లడించింది.⇒ దంపతుల ఆహార స్వేచ్ఛ..: సాధారణంగా భారతీయ కుటుంబాలలో అందరికీ కలిపి ఒకే మెనూ ఉంటుంది. అన్నం, నూనెతో వండే కూరలు, వేపుళ్లు ఉంటాయి. అయితే పెళ్లయిన వారికి కొత్తగా ‘ఆహార స్వేచ్ఛ’ వస్తుంది. దంపతులలో ఎవరికి ఇష్టాలు వారికున్నా, ఒకరికి ఇష్టమైన దానికి మరొకరు ఇష్టపడటంతో ఇద్దరూ కలిపి ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కారణంగా దంపతులు లావయ్యే అవకాశం ఉందని ఐ.సి.ఎం.ఆర్. అధ్యయనం విశ్లేషించింది.దాంపత్య భోజనంబు..అధ్యయనంలోకి తీసుకున్న ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఊబకాయులేనని ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది. భార్యాభర్తల్లో వివాహం ముందు వరకు ఆహారం, జీవనశైలుల విషయంలో ఎవరికి వారికి విభిన్న అభిరుచులు ఉంటాయి. వివాహం తర్వాత ఇదంతా మారిపోతుంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి, ప్రయాణ అసలట వారి వారి ఆహారపు అలవాట్లను కలగాపులగం చేసేస్తాయి. ఇద్దరూ ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించుకోవటం ఎక్కువౌతుంది. ఒకరి కోసం ఒకరు మేల్కొని ఉండటం, లేట్ నైట్ ఆఫీస్ ప్రజెంటేషన్లు ఇవ్వటం, వారాంతపు విహారాలు.. ఇలాంటివన్నీ కలిసి దంపతుల జీవన శైలిని మార్చేస్తాయి. దాంతో సరైన నిద్రా, తగిన శారీరక శ్రమా లేకపోవటంతో 30ల వయసుకే దంపతులు లావైపోతున్నట్లు ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది.అతి పెద్ద అధ్యయనం‘ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’, ‘టెరి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’, ఇతర సంస్థల పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (2019–21) దగ్గరున్న దేశవ్యాప్త డేటా నుంచి 52,737 జంటల ఆహార తీరుతెన్నులను, వారి ఆరోగ్యాలను విశ్లేషించారు. వారిలో 27.4 శాతం జంటల్లో ఊబకాయ స్థితి ఉండటాన్ని గమనించారు. ‘కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ న్యూట్రిషన్’లో ప్రచురణ అయిన ఈ అధ్యయన ఫలితాలు.. భారతదేశ దంపతులు కలిసి తింటూ, కలిసి బరువు పెరగటాన్ని గుర్తించింది. ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద అధ్యయనం.ప్రథమ స్థానంలో కేరళఅధ్యయనానికి ఎంచుకున్న అరలక్షకు పైగా జంటలలో ప్రధానంగా.. కేరళ, మణిపూర్, ఢిల్లీ, గోవా, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలోని పట్టణ, సంపన్న కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు లావు పెరగటం కనిపించింది. కేరళ దంపతులలో అత్యధికంగా 51.3 శాతం వరకు ఊబకాయులు ఉండగా ఆ శాతం జమ్మూ కశ్మీర్లో 48.5, మణిపూర్‌లో 47.9, ఢిల్లీలో 47.1, గోవాలో 45 శాతం, తమిళనాడులో 42.7, పంజాబ్‌లో 42.5గా ఉంది. అత్యంత ధనికులైన వారిలో దాదాపు సగం (47.6 శాతం) జంటల్లో అధిక బరువు లేదా ఊబకాయం కనిపించింది. పేదలలో అది కేవలం 10.2 శాతం మాత్రమే కావడం గమనార్హం.ఇద్దరూ లావవటం ఎలా సాధ్యం?భార్యాభర్తలు సాధారణంగా జన్యుపరంగా సంబంధం కలిగి ఉండరు. అయినప్పటికీ ఒకే విధమైన ఆరోగ్య పరిస్థితులలోకి – అది ఊబకాయం, రక్తపోటు, ఇతరత్రా – ఏదైనా కావచ్చు, ఇద్దరూ ఒకేలా ఎలా మారి పోతారు? దీనికి సమాధానంగా – ‘ఉమ్మడి జీవనశైలి (టీవీ చూడటం, వార్తా పత్రికలు చదవటం వంటి అలవాట్లను కూడా కలిపి), ఆహారం, సామాజిక–ఆర్థిక స్థితి, పర్యావరణం, భావోద్వేగ అంశాల కారణంగా ఇది జరుగుతుంది’ అని ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రధాన అధ్యయన రచయిత డాక్టర్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెబుతున్నారు. -
అరెస్ట్.. రిమాండ్.. ఇష్టా‘రాజ్యం’కాదు
అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు – పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది.కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీస్ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు. అరెస్టు అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా, అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.లా కమిషన్లు, పోలీసు కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ– సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తుచేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తుంటారు. అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది. అవమానాన్ని కలిగిస్తుంది. కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్–బెయిలబుల్ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం (నాన్–బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్– తీవ్రమైన) జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం. అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం.పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినపుడే అరెస్టు చేయడం సమంజసం, ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడంలేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడంలేదు.చివరకు పార్లమెంట్ రంగంలోకి దిగి, లా కమిషన్ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫార్సులకు అనుగుణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే లా కమిషన్ ఇదే సిఫార్సును 1994లో ఇచ్చిన 152,154వ నివేదికలలోనూ చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత (ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ) ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.వారెంటు లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) అలాగే సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి. ఇది నిందితుని హక్కు. ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచాలంటే, అది సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయడం అనేది చాలా బాధ్యతగల, సున్నితమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తుంటే, పలుమార్లు మేజిస్ట్రేట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, అషామాషీగా మంజూరు చేస్తున్నారు.మేజిస్ట్రేట్ సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం నిందితుడిని రిమాండు చేయాలంటే ముందుగా ఆ అరెస్ట్ చట్టబద్ధమైనదా? రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా? అనే విషయాలపై సంతృప్తి చెందాలి. పోలీసు అధికారి చేసిన అరెస్ట్ సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, మేజిస్ట్రేట్ అతనికి రిమాండు విధించకుండా విడుదల చేయాలి. అంటే, ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.ఉదాహరణకు, ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవడానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా నివారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ భావిస్తే, అలాంటి నిర్దిష్ట కారణాలు, ఆ ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలి. మేజిస్ట్రేట్ వాటిని పరిశీలించి, తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి పొందుతున్నట్లు లిఖితపూర్వకంగా నమోదు చేసిన తరువాత మాత్రమే రిమాండ్ విధించాలి.దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేసాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయ కూడదు. అలాంటి సందర్భాల్లో, పోలీసు అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి. అంటే..ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి,కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి,నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి,సాక్ష్యులను మోసం చేయకుండా నిరోధించడానికినిజాలు చెప్పదలచిన సాక్షులను భయపెట్టి, ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి,లేదా అతన్ని అరెస్టు చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు.. మాత్రమే.. అరెస్టు చేయవచ్చు. అయితే పోలీసు అధికారి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. అంతే కాదు, అరెస్టు చేయకపోతే కూడా, ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, పోలీసు అధికారి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి:ఎందుకు అరెస్టు? నిజంగా అరెస్టు అవసరమా? అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని, పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్టు అధికారం వినియోగించాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి. పోలీసులు ఎవ్వరినైనా అరెస్ట్ చేయాలంటే, కేవలం ఆ వ్యక్తి నేరం చేశారని అనిపిస్తే చాలదు. సీఆర్పీసీ 41 (ఏ)లో సబ్–క్లాజ్ (ఏ) నుండి (ఈ) వరకూ పేర్కొన్న పరిస్థితులు (అంశాల్లో) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో సంతృప్తి పొందుతున్నామా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని, అరెస్ట్ అవసరం అని తార్కికంగా తేల్చుకున్నప్పుడే అరెస్ట్ జరగాలి.ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ.. అనవసరమైన అరెస్టులను నివారించేందుకు, అరెస్ట్‌కు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినది. ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా సెక్షన్ 6 కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్ 41ఏ ఏమి చెబుతోందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం.41ఏ. పోలీసు అధికారి ముందు హాజరు కావాలనే నోటీసు :–(1) సెక్షన్ 41(1) ప్రకారం ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమాచారం అందిన మీదట, ఆ వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తింపదగిన తీవ్ర నేరం) చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి, సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీసు అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయాలి. ఈ నోటీసులో హాజరు కావాల్సిన తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా, పోలీసు అధికారికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్ చేయకుండా, ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి.(2) అలాంటి నోటీసు ఎవరైనా వ్యక్తికి జారీ అయినప్పుడు, ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడిన విధంగా సహకరించాలి. దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి.(3) అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ఆ నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరాదు. అయితే, ఆ వ్యక్తిని అరెస్టు చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసు అధికారి కలిగి ఉంటే, దానికి సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లిఖితపూర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు.(4) ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా అతను తనకు తాను పోలీసుల ముందు హాజరుకావడానికి ఇష్టపడకపోతే, అటువంటి సందర్భాల్లో, సంబంధిత నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి, ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే, పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు. పై విధానాన్ని బట్టి, సీఆర్పీసీ సెక్షన్ 41(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో, పోలీసు అధికారి తప్పనిసరిగా నిందితుడికి ఒక నోటీసు జారీ చేయాలి. అందులో పోలీసు అధికారిని ఎక్కడ, ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి. చట్టం ప్రకారం, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటించి పోలీసు అధికారిని కలవాలి. ఇకపోతే, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటిస్తే, సాధారణంగా అతన్ని అరెస్ట్ చేయకూడదు. అయితే, అరెస్టు అవసరమని పోలీసులు భావిస్తే, దానికి కారణాలు రాసి ఉంచాలి. ఈ దశలో కూడా, అరెస్టు చేయడానికి ముందు, సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న షరతులను పాటించాలి. న్యాయమూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి.మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మేము ప్రత్యేకంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, సీఆర్పీసీ సెక్షన్ 41లో పేర్కొన్న కారణాలను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహ పర్చాలి. విడనాడాలి.ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు మేము కింద సూచనలు ఇస్తున్నాము. ప్రతి పోలీస్ అధికారికి, సెక్షన్ 41(1)(బీ)(ఐఐ) కింద పేర్కొన్న నిర్దిష్ట ఉపఖండాలతో కూడిన తనిఖీ జాబితా (చెక్‌లిస్ట్) అందించాలి. ఈ చర్య, అరెస్టు చేసే సమయంలో అవసరమైన ప్రమాణాలను పోలీసులు గుర్తించేందుకు దోహదపడుతుంది. పోలీసు అధికారి నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నప్పుడు లేదా రిమాండ్‌ను కోరుతున్నప్పుడు అరెస్ట్ అవసరం అయిన కారణాలు అలాగే ఆధారాలను స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా, తనిఖీ జాబితాను సమర్పించి, దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి.నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు అనుమతి ఇచ్చే ముందు ‘పై విధంగా’ పోలీసు అధికారి సమర్పించిన నివేదికను మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరచి, లిఖితపూర్వకంగా నమోదుచేసిన తరువాత మాత్రమే, నిందితునికి రిమాండ్ విధించాలి. నిందితుడిని అరెస్ట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం, కేసు దాఖలైన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్‌కు పంపించాలి. అలాగే, ఒక నకలును మేజిస్ట్రేట్‌కి అందించాలి. అవసరమైతే, జిల్లాకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ లిఖిత రూపంలో కారణాలు నమోదు చేసి, ఆ గడువును పొడిగించవచ్చు.కేసు దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోగా నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం హాజరుకై నోటీసు జారీ చేయాలి. ఈ గడువును, అవసరమైతే, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లిఖితపూర్వకంగా కారణాలు నమోదు చేసి పొడిగించవచ్చు.పై సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది.సంబంధిత కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్ విధిస్తే, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్‌కు, అలాగే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌కు పంపించాలని మేము ఆదేశిస్తున్నాము. తద్వారా వారు దీన్ని ఇతరులకు పంపించి, అమలులోకి తీసుకురాగలుగుతారు.1. అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు– పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు.2. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభ దాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.3. పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు.4. దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేశాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు. 5. ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.6. మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా, అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.7. ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు కింద సూచనలు ఇస్తున్నాము.8. మా సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. – సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా -
గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
మీకు.. ఊబకాయం వస్తుందా?
సాక్షి, స్పెషల్ డెస్క్: ఊబకాయం.. దాదాపు ప్రతి ఇంటా వింటున్న ఆరోగ్య సమస్య. ఇదొక్కటే ఉండదు.. గుండెజబ్బులు, కేన్సర్లు, మధుమేహం లాంటి వాటినీ ఒంటికి తీసుకొస్తుంది. మరి, అలాంటి స్థూలకాయం మనకు వస్తుందో రాదో బాల్యంలోనే తెలిసిపోతే? ఎంచక్కా నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం సంస్థ, హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ భాగస్వామిగా ఉన్న ప్రపంచస్థాయి అధ్యయనం ఈ విషయంలో విజయం సాధించింది. వీళ్లు రూపొందించిన పాలిజెనిక్ రిస్క్ స్కోర్ (పీఆర్ఎస్).. స్థూలకాయం ముప్పును ముందే పసిగడుతుంది. పెరిగి పెద్దయ్యాక ఊబకాయం వస్తుందా రాదా అనే విషయాన్ని బాల్యంలోనే తెలుసుకునే కిటుకు దొరికింది. అంటే.. చిన్నప్పుడే తెలిస్తే.. భవిష్యత్తులో స్థూలకాయం రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా సాగిన సుదీర్ఘ అధ్యయనం సాధించిన విజయం. ఇందులో భాగంగా స్థూలకాయానికి జన్యుపరమైన కొత్త కారణాలు తెలుసుకునే తెలుసుకునేందుకు, ఐదు సంవత్సరాల వయసు నుంచే ఊబకాయం వచ్చే అవకాశాన్ని అంచనా వేయగల పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌ను (పీఆర్ఎస్) రూపొందించారు. ఇందులో మనదేశం నుంచి మైసూరు, ముంబై, పుణే నగరాలకు చెందినవారు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 51 లక్షల మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని ఉపయోగించి పీఆర్ఎస్ మోడల్ రూపొందించారు. గతంలో రూపొందించిన మోడల్స్ కంటే ఇది రెండింతలు ప్రభావవంతంగా ఉందని తేలింది. సీఎస్ఐఆర్–సీసీఎంబీతో సహాఊబకాయంపై చేపట్టిన ఈ అధ్యయనంలో హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్ఐఆర్– సీసీఎంబీ), ఎల్వీ ప్రసాద్ కంటి ఆసు పత్రి, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సహా ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 600 మందికి పైగా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 51 లక్షల మందిలో.. ఆఫ్రికన్లు (4.6%ప్రజలు), అమెరికన్లు (14.4%), తూర్పు ఆసియా (8.4%), ఐరోపా (71.1%), దక్షిణాసియా వాసులు(1.5%) ఉన్నారు. ప్రముఖ జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. జన్యువుల కారణంగానే ఊబకాయం ముప్పు అత్యధికంగా ఉందని వెల్లడించింది. అంటే తల్లి/తండ్రికి ఈ సమస్య ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశాలే అధికం. కానీ వీరు జీవనశైలి మార్పులతో దీన్ని దూరం చేసుకోవచ్చు. అంటే శారీరక శ్రమ చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వంటివి చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వీరు మానేస్తారో మళ్లీ వెంటనే తిరిగి బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది.ముందస్తు హెచ్చరికగా..ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒకరికి.. వారు యుక్త వయసుకు వచ్చేసరికి ఊబకాయం వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఈ స్కోర్‌కు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు హెచ్చరిక సాధనంగా పీఆర్ఎస్ పనిచేస్తుంది. అంటే సమస్య వస్తుందని తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, వ్యాయామం ద్వారా సమస్య నుంచి గట్టెక్కవచ్చన్నమాట. ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత విస్తృత విభిన్న తరాల అధ్యయనాలలో ఇది ఒకటి. యూరోపియన్లలో ఊబకాయానికి కారణమైన జన్యు రకాలు.. భారతీయులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. భవిష్యత్తులో భారతీయులకు ప్రత్యేకంగా పీఆర్ఎస్ రూపొందించాలని మన శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాదు, ఈ స్కోరుతో కేవలం ఊబకాయమే కాదు.. గుండె సంబంధ సమస్యలనూ పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, అందుకు పరిశోధనలు చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నవారి సంఖ్య 1990లో 92.9 కోట్లు. 2021 నాటికి 260 కోట్లకు పెరిగిందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ళీ 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువు, ఊబకాయం బారిన పడవచ్చని ప్రపంచ ఊబకాయ సమాఖ్య హెచ్చరించింది.అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దలలో సగం కంటే ఎక్కువ మంది చైనా, భారత్, యూఎస్, బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్ దేశాలలో నివసిస్తున్నారు.ళీ 2035 నాటికి 79% పెద్దలు, 88% మంది పిల్లలు ఊబకాయం, అధిక బరువుతో తక్కువ–మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తారు. 7% దేశాలు మాత్రమే ఊబకాయంతో ముడిపడిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తగిన ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉన్నాయి. -
ప్రపంచం మెచ్చినా.. పాలకులు మెచ్చలే..!
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిని ప్రపంచం మెచ్చినా మన పాలకులు మాత్రం మెచ్చలేదు. యునెస్కో అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ.. పోచంపల్లికి ఉత్తమ టూరిజం విలేజ్ అవార్డు అందజేసింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇక్కడ టూరిజం అభివృద్ధికి తీసుకొన్న చర్యలు శూన్యం. రూరల్ టూరిజం కేంద్రంగా పోచంపల్లి సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఈ సంవత్సరం మే 15న.. భూదాన్‌పోచంపల్లిలో 25 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారుల బృందం పర్యటించింది. స్థానిక టూరిజం పా ర్కులో చేనేత ఇక్కత్ వ్రస్తాలతో మోడల్స్‌తో ర్యాంప్‌వాక్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాకతో.. పోచంపల్లి ఇక్కత్‌కు మరింత గుర్తింపు వచ్చి కార్మికుల ఉపాధి మెరుగవుతుందని భావించారు. ప్రచార ఆర్భాటాలే తప్ప, కార్మికుల ఉపాధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మార్కెట్ మందగించి వ్రస్తాలను కొనుగోలు చేసేవారు లేక మాస్టర్‌వీవర్స్, ఇక్కత్ వస్త్ర వ్యాపారులు దివాలా తీస్తున్నారు. రూ.కోట్ల విలువైన వస్త్రాల నిల్వలు పేరుకుపోతున్నాయి. సహకార సంఘాల నుంచి టెస్కో అరకొర వస్త్రాలను కొనుగోలు చేస్తుండగా, సహకారేతర రంగాల్లోని వ్యాపారులు గిరాకీ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పేరుకే పర్యాటకం.. 2007లో పోచంపల్లి చెరువు సమీపంలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రెస్టారెంట్, సరైన వసతి సౌకర్యాలు కల్పించలేదు. దాంతో పోచంపల్లికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో పోచంపల్లిని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరిగా.. మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది, చెరువులో బోటింగ్, చెరువు మధ్యలో ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి, భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే విగ్రహాలను ఏర్పాటు చేసి లేజర్ షో నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వయా పోచంపల్లి మీదుగా యాదగిరిగుట్ట వరకు టూరిజం బస్సులను నడపడం ద్వారా.. పోచంపల్లి పర్యాటకానికి కొత్త ఊపు తీసుకురావాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. 75 దేశాలతో పోటీపడి.. భూదానోద్యమంతో చరిత్ర పుటల్లోకి ఎక్కి, ఇక్కత్ వ్రస్తాల తయారీ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన భూదాన్‌పోచంపల్లికి 2021లో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు వచ్చాయి. గ్రామీణ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసినందుకు.. మన దేశంలో తెలంగాణ నుంచి పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్‌గా అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 2, 2021లో స్పెయిన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తరపున.. స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్శేఖర్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పోచంపల్లిని తిలకించేందుకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లేక నిరుత్సాహంతో వెనుదిరిగి పోతున్నారు. ప్రభుత్వాలు పర్యాటక కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పర్యాటకాభివృద్ధి చేయాలి జాతీయ రహదారులు, ముఖ్య ప్రదేశాలలో పోచంపల్లి ప్రాధాన్యాన్ని తెలిపే హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. పోచంపల్లిలో చెరువుకట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలి. పర్యాటకులను ఆకర్షించేలా జాతీయ రహదారి నుంచి పోచంపల్లి పట్టణం వరకు రోడ్డు వెంట చేనేత ప్రాధా న్యం తెలిపే స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయాలి. పోచంపల్లి టూరిజం పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దాలి. – వేముల సుమన్, భూదాన్ పోచంపల్లిఇక్కత్పై ప్రచారం పెంచాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోచంపల్లి ఇక్కత్ వ్రస్తాలపై ప్రచారం పెంచాలి. టీవీ యాంకర్లు, సెలబ్రిటీలు, హీరోయిన్లను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించి వ్రస్తాలను ప్రమోట్ చేయాలి. ఎయిర్‌పోర్టుల వద్ద పోచంపల్లి ఇక్కత్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. ఇటీవల మిస్‌వరల్డ్ పోటీదారులు రావడం వల్ల పోచంపల్లికి పేరు వచ్చింది తప్ప, వ్యాపారం పెరగలేదు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా మేము నేసిన చీరలను ప్రదర్శిస్తూ అమ్ముకొంటున్నాం. – రచ్చ సురేశ్, చేనేత వ్యాపారి, భూదాన్ పోచంపల్లి -
జలజల..జలపాతాలు
సాక్షి, నెట్వర్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం జాలువారుతోంది. పాల నురుగలు కక్కుతూ ఎగిసి పడుతున్న తుంపరులతో కనువిందు చేస్తోంది. కాగా, బొగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్టు ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలోని భీమునిపాద జలపాతం జాలువారుతూ చూపరులను కనువిందు చేస్తోంది. బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం, చింతోనిగుంపు సమీపంలోని వంకమడుగు జలపాతం అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతోంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం పారుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మందగూడ పంచాయతీ పరిధిలోని చింతలమాదర(తిర్యాణి) జలపాతం జలకళను సంతరించుకుంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న నీళ్లు పాలధారను తలపిస్తున్నాయి. -
AP: ‘అయ్యా’ఎస్ అనేదే లే..!
సాక్షి, అమరావతి: తస్మదీయులను తన్ని తరిమేయడం. అస్మదీయులు, బంధువర్గాలకు అడ్డగోలుగా కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం తద్వారా ప్రజాధానాన్ని దోచుకోవడానికి తెగబడుతున్న పెదబాబు, చినబాబుల తీరుపై ఐఏఎస్‌లలోనూ వ్యతిరేకత మొదలైంది. జీ హుజూర్ అనే అధికారులకే పోస్టింగ్, కాదన్న వారికి ఊస్టింగ్ అన్నట్టుగా పరిస్థితులను మార్చేసిన సర్కారుపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐపీఎస్‌లు రాష్ట్రానికి బై చెప్పి కేంద్ర సర్వీస్‌లకు వెళ్లగా, యువ ఐపీఎస్ సర్వీస్‌కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఏఎస్ అధికారులూ అదేబాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో అంటకాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఓ యువ ఐఏఎస్ ఏకంగా సహాయ నిరాకరణ చేయడంతో ఆయన్ను ఏ పోస్టింగ్ లేకుండా ఇటీవల జీఏడీకి అటాచ్ చేసి ప్రభుత్వ పెద్దలు కక్ష సాధించారు. అడ్డగోలు టెండర్ విధానంపై అసహనం గత జనవరిలో ప్రజారోగ్య శాఖలోని ఓ విభాగానికి యువ ఐఏఎస్‌ను అధిపతిగా నియమించారు. ఇతను గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖతోపాటు, ఓ జిల్లాకు కలెక్టర్‌గా విజయవంతంగా పనిచేశారు. ఈయన ప్రజారోగ్య శాఖలో బాధ్యతలు స్వీకరించే నాటికే రూ.మూడు వేల కోట్ల విలువ చేసే అత్యవసర సేవల కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టడానికి పెదబాబు, చినబాబు రంగం సిద్ధం చేశారు. అడ్డగోలుగా రూపొందించిన టెండర్ మార్గదర్శకాలపై ప్రారంభంలోనే ఆ యువ ఐఏఎస్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టెండర్ ప్రక్రియలో నిర్వహించిన సమావేశాల్లోనూ అంటిముట్టనట్టుగానే ఉన్నారు. అయితే ముందే పక్కా ప్రణాళికతో మార్గదర్శకాలు రూపొందించడంతో తామనుకుంటున్న సంస్థకే ప్రభుత్వం దిగి్వజయంగా కాంట్రాక్ట్ కట్టబెట్టింది. సంతకం పెట్టేందుకు ససేమిరా ఐదేళ్లకు రూ.3 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది. చేసిన పనికి బిల్లులు ప్రాసెస్ చేయడం, ఫైన్లు వేయడం సహా మొత్తం కాంట్రాక్ట్ పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఆ యువ ఐఏఎస్ విభాగం కిందకే వస్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ ముగిశాక ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థతో చేసుకునే అగ్రిమెంట్‌పై విభాగాధిపతే సంతకం చేయాలి. గతంలో విభాగాధిపతులుగా పనిచేసిన ఐఏఎస్‌లే అగ్రిమెంట్‌పై సంతకాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువ ఐఏఎస్ అధికారి అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ససేమిరా అనేశారు. పైనుంచి వచి్చన ఒత్తిడికి తలొగ్గలేదు. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి ప్రభుత్వం అగ్రిమెంట్ తంతు ముగించింది. ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలని స్థితిలో.. వాస్తవానికి సదరు ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించే నాటికే ఈ విభాగంలో మంత్రుల సిఫార్సులతో తిష్ట వేసిన అధికారులు పెద్ద ఎత్తున అవినీతి దందా చేశారు. ప్రక్షాళనలో భాగంగా అవినీతి అధికారులను బయటకు పంపడానికి వీల్లేని పరిస్థితులు ఉండటంతో అయిష్టంగానే ఆ స్థానంలో కొనసాగుతూ వచ్చారు. ఇదిలా ఉండగా పేద ప్రజల ఆరోగ్య భద్రతకు గండి కొడుతూ మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం తేవాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ. వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు మళ్లించి తమ జేబులు నింపుకోవాలని పెద్దలు వ్యూహ రచన చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది నుంచే పథకాన్ని రూపొందించడంపై ప్రజారోగ్య శాఖలో కసరత్తు నడుస్తోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో మార్గదర్శకాలు ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం, ఆమోదం లభిస్తే టెండర్ పిలిచే దశకు పురోగతి చేరుకుంది. దీంతో ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంలో ఉన్న ఆ అధికారి సాధారణ పరిపాలన అంశాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఒక్క ఫైల్ ముందుకు కదలడం లేదని, ఈ పరిస్థితులను చక్కబెట్టడ్డానికి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే విభాగం ప్రధాన కార్యాలయానికి చేరుకుని గత నెలాఖరులో సమీక్ష నిర్వహించారు. పనులు ముందుకు సాగడం లేదని యువ ఐఏఎస్‌ను మందలించారు. అనంతరం కొద్ది రోజులకే యువ ఐఏఎస్ వ్యక్తిగత సెలవు పెట్టారు. సెలవు ముగిశాక యథా స్థానంలో చేరాలని తొలుత సీఎస్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఈ అధికారి అక్కడే కొనసాగితే తామనుకుంటున్న పనులు ముందుకు సాగవని భావించిన ప్రభుత్వ పెద్దలు మరుసటి రోజే జీఏడీకి అటాచ్ చేయిస్తూ ఆదేశాలు ఇప్పించారు. -
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
మీకు పొట్ట కాస్తో కూస్తో లేదా బాగా ముందుకు వచ్చో కనిపిస్తోందా? ఇలా పొట్ట ముందుకు వస్తే మొదట చూసుకోవాల్సింది కాలేయాన్ని! ఎందుకంటే.. పొట్ట పెరగడమన్నది ‘ఫ్యాటీ లివర్’ సమస్యకు ఒక సూచన కావచ్చు. అంటే కాలేయంలో క్రమక్రమంగా కాలేయ కణాల స్థానే కొవ్వు కణాలు వచ్చి చేరడం. ఈ ‘ఫ్యాటీ లివర్’.. డయాబెటిస్, రక్తపోటు లాగే ఓ జీవనశైలి (లైఫ్‌స్టైల్) సమస్య. ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. భవిష్యత్తులో పూర్తిగా కొవ్వు కణాలతో నిండిపోయి.. ఒక దశలో చివరి స్టేజ్ లివర్ డిసీజ్, లివర్ కేన్సర్‌కూ దారితీసే ముప్పునూ తప్పించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ అంటే...మన పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ మనం చేసే శారీరక శ్రమలో దహించుకుపోయినవి తప్ప మిగతావన్నీ కొవ్వు రూపంలో కాలేయంలోనే నిల్వ అవుతుంటాయి. ఇలా చక్కెరలు పెరగడమూ, శారీరక శ్రమ తగ్గడంతో క్రమంగా కాలేయంలో కొవ్వు కణాలు పెరిగిపోయి కాలేయ కణాలు తమ సహజ గుణాన్ని కోల్పోతాయి. ఆరోగ్యకరమైన లివర్ కాస్తా కొవ్వు పేరుకుపోతున్న ఫ్యాటీలివర్ కండిషన్ గా మారిపోతుంది. ఇలా కాలేయకణాలను కోల్పోతూ... కొవ్వుకణాలను నింపుకొంటున్న కండిషన్ నే ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయం 90 శాతం దెబ్బతినేవరకు తనకు సంబంధించిన లక్షణాలను బయటపడనివ్వదు. అంతేకాదు... జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ తనను తాను బాగుచేసుకోనూ గలదు. కారణాలేంటి?ఈ మధ్యకాలంలో ఎక్కువగా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం పెరిగింది. చక్కెర మోతాదులు చాలా ఎక్కువగా ఉండే వాటినీ తింటున్నారు. ఆ క్యాలరీలను దహించడానికి మాత్రం ఎలాంటి వ్యాయామాలూ చేయడం లేదు. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలూ, వృత్తులతో కూర్చుని కూర్చుని పొట్ట పెరుగుతోంది. మరికొందరికి మద్యపానం అలవాటు. ఇలాంటి జీవనశైలి మార్పులతో స్థూలకాయం, మధుమేహంతోపాటు ఫ్యాటీలివర్ కూడా చాలామందిలో కనిపిస్తోంది.ఇవీ గ్రేడ్స్..: ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రతను బట్టి ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కొంత నిరుపాయకరమని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. జీవనశైలిని మెరుగుపరచుకుంటూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ అలవరచుకుని కొంత క్రమశిక్షణతో మెలగడం, వ్యాయామం చేయడం ద్వారా మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ను అదుపులో పెట్టవచ్చు. మూడో గ్రేడ్, ఆపైన గ్రేడులకు చేరితే కాలేయమార్పిడి తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు.మొదటి దశ: ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొవ్వు చాలా పరిమితంగా ఉంటుంది.రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్ ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయి, గట్టిపడుతుంది.నివారించగల కారణాలుమద్యపానం చేసేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ అలవాటును మనం ప్రయత్నపూర్వకంగా పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇక వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవడమూ మన చేతుల్లో ఉన్నదే. అధిక రక్తపోటు ఉన్నవారు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధిక మోతాదులో మందులు వాడకాన్ని నివారించాలి. వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. నివారించుకోలేని కారణాలునివారించుకోలేనంత బరువు పెరగడం అన్నది మన చేతుల్లో ఉండదు. పొట్ట బాగా ముందుకు వచ్చినవాళ్లలోనూ, స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలోనూ మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో రెండో దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం మందిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఇవీ లక్షణాలుతొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంటే ఫ్యాటీలివర్ ఉనికి తెలుస్తుంది. ⇒ కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరగడమే ఇందుకు కారణం.క్యాన్సర్ ముప్పు కూడా... ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా కొందరిలో లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.నివారణ ఇలా : బరువు నియంత్రించుకోండి : మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనుగుణంగా శరీర బరువును నియంత్రించుకోవాలి.ఆరోగ్యకరమైన ఆహారం : ఆహారంలో తప్పనిసరిగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు మెత్తని మాంసంతో (లీన్) కూడిన చికెన్, చేపలు వంటివి తీసుకోవాలి. వంటల్లో నూనె వాడకం తగు మోతాదులో ఉండాలి. పొట్టుతీయని తృణ ధాన్యాలు ఎక్కువగా వాడాలి. ⇒ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి⇒ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. వ్యాయామం : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.చికిత్స⇒ ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి.⇒ చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.⇒ బాధితులు వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్లు మందులను మారుస్తారు.చివరిగా.. ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో చికిత్స కంటే నివారణ మేలు. -
వీనస్ దాకా వెళ్లే గీత లేదు మరి..
అరచేతి గీతల్లోనే అంతా ఉందంటారు.. గీత సరిగా లేకుంటే.. తలరాతే మారిపోతుందంటారు.. మనుషుల వరకూ ఓకే.. మరి ఇదే ‘గీత’ సిద్ధాంతం అంతరిక్ష నౌకలకు కూడా వర్తిస్తే.. గీత సరిగా లేక.. వాటి ‘బతుకు’ రాతే మారిపోతే.. సరిగ్గా 63 ఏళ్ల క్రితం జరిగింది ఇదే!! శుక్ర మహా‘దిశ’ సరిగాలేక... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. భూమికి ఆవల ఉన్న గ్రహాలపై తన తొలి ప్రయోగాలు కొనసాగిస్తున్న సమయం అది.. వీనస్(శుక్రుడు)పై అధ్యయనానికి మెరైనర్–1ను సిద్ధం చేసింది. శుక్ర గ్రహం మీద ఉన్న వాతావరణం, అక్కడి అయస్కాంత క్షేత్రాలు, రేడియేషన్ తదితరాలపై సమాచారాన్ని తెలుసుకోవడానికి దీన్ని తయారుచేశారు. 1962, జూలై 22న దీన్ని ప్రయోగించారు. మొదట్లో అంతా సరిగానే నడిచింది. తర్వాత రాకెట్ ప్రయాణించాల్సిన దిశ మారింది. అదలాగే కొనసాగితే.. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో నౌకలు అధికంగా తిరిగే ప్రదేశంలో పడే ప్రమాదం ఉంది. దీంతో రేంజ్ సేఫ్టీ ఆఫీసర్ దాన్ని ధ్వంసం చేయడానికి కమాండ్ ఇచ్చారు. ప్రయోగించిన 294 సెకన్ల తర్వాత మెరైనర్–1ను గాల్లోనే పేల్చేశారు. గీత మారిందిలా.. ఈ వైఫల్యానికి కారణంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. చివరికి ఓ చిన్న గీత.. మొత్తం అంతరిక్ష నౌక అదృష్ట గీతనే మార్చేసిందని తేల్చారు. రాకెట్ దిశను నిర్దేశించే సాఫ్ట్‌వేర్‌లో ఓవర్బార్(పైన రాసే గీత) మిస్ చేయడం వల్ల ఇది జరిగిందని గుర్తించారు. ఒక ఈక్వేషన్లో రేడియస్కు ఖకు బదులు ఖవచ్చింది. అంతే.. రాకెట్ దిశ మారిపోయింది. దీని వల్ల నాసా ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకుంది. ఈ ప్రయోగం కోసం ఖర్చు పెట్టిన రూ.160 కోట్లు పోవడం సంగతి పక్కనపెడితే.. కోడింగ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఉపగ్రహ ప్రయోగాల్లో చేసే చిన్నపాటి తప్పులు మొత్తం మిషన్ వైఫల్యానికి ఎలా దారి తీస్తాయన్నది తెలుసుకుంది. అయితే, మెరైనర్–1 వైఫల్యం భవిష్యత్ ప్రయోగాలకు బాగా పనికివచ్చింది. తదుపరి మిషన్లన్నిటిలోనూ ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం అన్నది పరిపాటిగా మారింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎగరకముందే.. చెక్ పెట్టేస్తారు!
మనం వాడే బండిని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాం. బ్రేకులు సరిగా పడుతున్నాయా, టైర్లలో గాలి ఉందా, సరిపడా ఇంధనం ఉందా అని రోజూ చెక్ చేస్తాం. అలాంటిది గాల్లో ఎగిరే విమానం అయితే? మనం మన వాహనాన్ని చెక్ చేసినట్టే విమానాన్ని ఒక్క పైలట్ చెక్ చేస్తే సరిపోతుందా? అస్సలు కాదు.. కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విమానయాన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీల నిఘా కళ్లు ప్రతి క్షణం పర్యవేక్షిస్తుంటాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం విమానాలు, విమానాశ్రయాలు, సర్వీసింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడమేకాదు.. ఆకస్మిక తనిఖీలూ చేసి ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఈ ఏడాది జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తాలూకా చేదు జ్ఞాపకాలు భారతీయుల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 275 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన నేపథ్యంలో దేశంలో అమలవుతున్న విమానయాన నిబంధనలు, భద్రత అంశం చర్చకు వచ్చింది. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, సాంకేతిక సమస్యనా అన్నది పక్కన పెడితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వంటి ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇందుకు ఈ సంస్థలు చేపట్టిన తనిఖీలే నిదర్శనం. 2023 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు 9,423 తనిఖీలు చేపట్టాలన్నది ప్రణాళిక కాగా రికార్డు స్థాయిలో 13,753 తనిఖీలు చేపట్టడం గమనార్హం. రెక్కలు కట్టేస్తారు..: డీజీసీఏ బృందం అన్ని విమాన సంస్థలకు చెందిన విమానాల తనిఖీ చేపడుతుంది. విమానం సురక్షితంగా ప్రయాణం సాగించే స్థాయిలో ఫిట్‌గా ఉందా లేదా అని పరీక్షిస్తారు. లోపాలు, ఉల్లంఘనలు బయటపడితే డీజీసీఏ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర లోపాలు, ఉల్లంఘనలైతే విమానాలకు భద్రతా ధ్రువీకరణను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అంటే విమానం ఎగరకుండా నిరోధిస్తారు. ఫిట్‌గా ఉందని తేలాకే సస్పెన్షన్ ఎత్తేస్తారు. అంతేకాదు, నిబంధనలను పాటించకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు. 2023 నుంచి 2025 జూలై 20 వరకు 597 విమానాలు సస్పెన్షన్ కు గురయ్యాయంటే ఏ స్థాయిలో తనిఖీలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. ఆకస్మిక తనిఖీలు..: విమానం, సిబ్బంది, ఆపరేటర్లు భూమిపై ఉన్నప్పుడు విమానయాన నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి డీజీసీఏ అధికారులు అప్రకటిత (ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స) తనిఖీలు నిర్వహిస్తారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తారు. ఇలా భారత్‌లోని విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న దేశ, విదేశీ విమానాలకు సంబంధించి 2023 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 1,188 ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స జరిగాయి. ఈ తనిఖీల్లో 338 లెవెల్–2 స్థాయి లోపాలను గుర్తించారు. ప్రతి ప్రయాణానికి ముందు విమానానికి తనిఖీలు తప్పనిసరి. విమానం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి పైలట్స్, నిర్వహణ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. అంతా బాగుంది అని నిర్ధారించుకున్నాకే విమానం గాల్లోకి లేస్తుంది. లేదంటే సర్వీస్ రద్దు అవుతుంది. విమానం వెలుపల: విమానం నిర్మాణం, బాహ్య, నియంత్రణ ఉపరితలాలపై ఏదైనా నష్టం, లీకేజీ, అరిగిపోయాయా అని చూస్తారు.అంతర్గత తనిఖీలు: కాక్‌పిట్‌లోని పరికరాలు, రేడియోలు, విద్యుత్ పరికరాలు, ఇతర ముఖ్యమైన భాగాల పనితీరును ధ్రువీకరిస్తారు.పత్రాల ధ్రువీకరణ: లైసెన్సులు, రిజిస్ట్రేషన్, బీమా వంటి అన్ని అవసర పత్రాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు.ఇంధనం స్థాయిలు: తగినంత ఇంధనం, చమురు, తగు పాళ్లలో, నాణ్యంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు.నియంత్రణ వ్యవస్థలు: విమాన నియంత్రణలు, బ్రేక్స్, ఇతర క్లిష్ట వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, కార్యకలాపాలను పరీక్షిస్తారు.వాతావరణ పరిశీలన: విమానం ఎగరడానికి, దిగడానికి అనుకూల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు. వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం వెళ్తుంది. -
మెదడుకు కాస్త... బ్రేక్ ఇవ్వండి
గంటల తరబడి కూర్చొని చేసే పని వల్ల కూడా అలసిపోతాం. ఈ అలసటనే వైద్య పరిభాషలో ‘కాగ్నటివ్ ఫెటీగ్’ (మానసిక అలసట) అంటారు. ఇలాంటి అలసట.. ఉపయోగకరమైన పనులకన్నా.. అంతగా ప్రయోజనం లేని సులభమైన పనులను ఎంచుకునేలా మన మెదడును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దైనందిన నిర్ణయాలను నిష్ప్రయోజనమైన పనుల వైపు దారి మళ్లించే ఈ మానసిక అలసటను.. సుదీర్ఘమైన పనులు చేసేటప్పుడు విరామాలు తీసుకోవటం ద్వారా నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆఫీసు నుంచో లేదా బయట పని పూర్తిచేసుకునో ఇంటికి వచ్చాక.. అందరూ చేసేది కుర్చీలోనో మంచం మీదనో కాసేపు అలా నడుం వాల్చడం. అలాంటప్పుడు మరో ముఖ్యమైన పని చేయాలన్నా ఆలోచిస్తాం. కానీ, ఫోన్లో ఏవైనా సరదా అంశాలు లేదా టీవీలో ఏదైనా ప్రోగ్రామో చూడటం మాత్రం మనకు కష్టంగా అనిపించదు. ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో తాజాగా అచ్చయిన అధ్యయన వివరాలను బట్టి – తక్కువ ప్రయోజనాలను అందిస్తున్నవే అయినప్పటికీ, మనం ఇలా సులభమైన పనులనే ఎంచుకోవటానికి ప్రధాన కారణం.. ‘మానసిక అలసట’.తక్కువ లాభం.. ఎక్కువ లాభం!కష్టమైన పని, తేలికైన పని జట్లలోని వారిని.. వాళ్ల పని అనంతరం, ఎంపిక చేసుకోటానికి మళ్లీ రెండు రకాల పనులు ఇచ్చారు.1. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పని.2. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పని.⇒ మానసికంగా అలసిపోయిన వారు.. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పనిని ఎంచుకున్నారు. ⇒ మానసికంగా అలసిపోని వారు.. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పనిని ఎంపిక చేసుకున్నారు.ఎవరికి తేలికైనవి వారుప్రతి ఒక్కరికీ పని చేయడానికి వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. ఒకరికి సులభంగా ఉండేది, మరొకరికి కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఎవరికి వారు ‘మానసిక అలసట’ తర్వాత తమకు సులభంగా ఉండే పనులను మాత్రమే ఎంచుకుంటారని ఈ అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడు, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన విక్రమ్ చిబ్ అంటున్నారు. మానసిక అలసట మన దైనందిన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించడానికి ఈ అధ్యయనం ఒక నమూనాను రూపొందించింది.తేలికైన, కష్టమైన పనులుఅధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యవంతులైన కొందరిని ఎంపిక చేసి, వారిని నిరంతర జ్ఞాపకశక్తి అవసరమైన పనిలో నియమించారు. ఒక స్క్రీన్‌పైన ఒకటి తర్వాత ఒకటిగా మెరుస్తున్న వేర్వేరు అక్షరాలపై దృష్టి పెట్టమని కోరారు. ఆ పనిని పరిశోధకులు ‘తేలికైన పని’, ‘కష్టమైన పని’ అని విభజించారు. తేలికైన పనిలో భాగంగా స్క్రీన్‌పైన మారుతున్న అక్షరాలలో అప్పటికి కనిపిస్తున్న అక్షరం, ఆ ముందు వచ్చి వెళ్లిన అక్షరంతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి.ఇక కష్టమైన పనిలో.. అప్పటికి వారు చూస్తున్న అక్షరం, ఆ ముందు చూసిన రెండు నుండి ఆరు అక్షరాల మధ్య స్క్రీన్‌పైకి వచ్చి వెళ్లిన అక్షరాలతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోగంలో – కష్టమైన రెండో పనిని వరుసగా చేసినవారు తాము మానసికంగా చాలా అలసిపోయినట్లు తెలిపారు. తేలికైన పని చేసినవారిలో అలసట కనిపించలేదు.ఫంక్షనల్ ఎమ్మారై పట్టేసిందిఅధ్యయనంలో పాల్గొన్నవారు తమ పనులను ఎంపిక చేసుకుంటుండగా, పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్–ఎంఆర్ఐ)ను ఉపయోగించి వారి మెదడులోని రసాయన చర్యల్ని నమోదు చేశారు. శరీరంలోకి పరికరాలను చొప్పించే అవసరం లేని ఈ ‘నాన్–ఇన్వేసివ్ టెక్నిక్’తో.. వాళ్లు ఒక పని చేస్తున్న సమయంలో మెదడులో చురుగ్గా ఉన్న ప్రాంతాలను గుర్తించారు.మానసికంగా అలసిపోయిన వారిలో – నుదుటి వెనుక ఉండే ‘డోర్సోలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ ఏరియా క్రియాశీలం అవటాన్ని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, మానసిక అలసట తర్వాత పనులను, ఎంపికలను నిర్ణయించుకున్నప్పుడు మెదడులోని ‘రైట్ యాంటీరియర్ ఇన్సులా’ (ఇన్సులా) అనే ప్రదేశం క్రియాత్మకం అయి కనిపించింది. ఈ ప్రదేశం, ఒక పనిని ‘అది ప్రతిఫలానికి తగిన పనేనా?’ అనే దాన్ని నిర్ణయిస్తుంది.పనితీరు సామర్థ్యం తగ్గలేదు..ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఒకదాని తర్వాత ఒకటి కష్టతరమైన పనులను చేస్తున్నప్పుడు తాము అలసిపోయినట్లు చెప్పినప్పటికీ వారి పనితీరు సామర్థ్యం కొంచెమైనా తగ్గలేదు. అంటే.. మానసిక అలసట అనేది పని అనంతరం విశ్రాంతినిచ్చే పనులను ఎంపిక చేసుకుంటున్నదే కానీ, అలసట కలిగిస్తున్న పనిని ఒళ్లు దాచుకోకుండా చేయటానికి మాత్రం అడ్డపడటం లేదన్నమాట.విరామాలతోనే నివారణ⇒ మన దైనందిన నిర్ణయాలను ప్రభావితం చేసే ఈ మానసిక అలసటనునివారించేందుకు ఒకే ఒక్క మార్గం.. కూర్చొని చేసే సుదీర్ఘమైన పనుల్లో తరచూ విరామాలు తీసుకుంటూ ఉండటమే అంటున్నారు డాక్టర్ చిబ్.⇒ అనేక నాడీ సంబంధిత, మానసిక పరిస్థితులలో మానసిక అలసట అనేది ఒక సాధారణ లక్షణం అని పరిశోధకులు చెబుతున్నారు.⇒ స్ట్రోక్ వచ్చినవారిలో, మల్టిపుల్ స్కె›్లరోసిస్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, ఒత్తిడి, ఆందోళన, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మానసిక అలసట ఉన్నట్లు కూడా తాజా అధ్యయనం కనుగొంది.⇒ ‘ప్రయత్నించటం’, ‘నిర్ణయం తీసుకోవటం’ అనే వాటిని మెదడు ఏ విధంగా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అధ్యయనవేత్తలు భావిస్తున్నారు. -
విదేశీ విద్య @ రూ. 3,78,400 కోట్లు
భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో రూ.3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి రూ.7,82,600 కోట్లకు చేరుతుందని లండన్ కు చెందిన పేమెంట్స్ కంపెనీ వైజ్, కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లుగా నమోద య్యాయి. ఏటా రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది.రూ.75 వేల వరకు...భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లు నమోదయ్యాయి. ఆరేళ్లలో ఇది రూ.4,300 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకుగాను బ్యాంకింగ్ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3–3.5% చార్జీ వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2–5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువుల కోసం రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజులపాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు. లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు.యూఎస్‌లో అనిశ్చితితో..రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్ ్స స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్‌లో రూ.1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ విద్యకు ఎల్ఆర్ఎస్ కింద చేసిన ఖర్చు మొత్తంగా 21% తగ్గి రూ.7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు.. తొమ్మిది నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్ఆర్ఎస్ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం రూ.2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్బీఐ అనుమతి ఇస్తోంది.ప్రపంచ సగటు 6.62%ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై–సెప్టెంబర్‌లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ చార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరస్పాండెంట్ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి.⇒ విదేశాల్లో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకు అయిన వ్యయంలో నాలుగింట ఒక వంతు.. అంటే రూ.94,600 కోట్లను భారత్‌లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు.⇒ ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యనిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే.⇒ విద్యార్థుల ప్రాధాన్యతలో యూఎస్, కెనడా, యూకే టాప్–3లో నిలిచాయి.⇒ వివిధ దేశాల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయుల వాటా 30–35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే.⇒ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరేళ్లలో 25 లక్షలు దాటొచ్చు. -
ఒక్క వానకే.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై వరద!
ఫ్లై ఓవర్‌పై వరద నీరు చేరడం కనీవినీ ఎరగం... కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఫ్లైఓవర్‌పై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.. ఫ్లై ఓవర్ కింద ఉన్న అండర్ పాస్ నీట మునగడం, మరో వైపు కొత్తగూడ జంక్షన్లో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు దిక్కుతోచలేదు. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లై ఓవర్, అండర్ పాస్, జంక్షన్ నీట మునగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి హైడ్రా మాన్సూన్, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు బాధ్యత వహించాల్సిందేనని వాహనదారులు పేర్కొంటున్నారు.. మ్యాన్‌హోల్స్ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ నేతృత్వంలో పని చేస్తున్న మాన్సూన్ బృందాలు, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జోనల్ కమిషనర్ అన్ని విభాగాల అధికారులతో వరద పరిస్థితులపై సమన్వయ సమావేశం నిర్వహించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంతో భారీగా వరద నీరు (Flood Water) చేరినట్లు స్పష్టమవుతోంది. ఫ్లై ఓవర్ పైన, అండర్ పాస్, జంక్షన్లో వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలో మీటరు ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగా పట్టిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదారిని తలపించిన ఫ్లై ఓవర్...అంజయ్యనగర్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు ఉన్న ఫ్లై ఓవర్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు చేరింది. ప్రతి ఫ్లై ఓవర్‌పై వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్లేలా ప్రతి 20 అడుగులకు ఓ రద్రం, కిందికి ఓ పైపును అమర్చుతారు. ఎంత భారీ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని నిర్వహణ లేకపోవడంతో చెత్త, ప్లాస్టిక్ కాగితాలతో నిండి పోయాయి. దాదాపుగా అన్ని రంద్రాలు నిండటంతో వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భారీ వర్షానికి ఫ్లై ఓవర్‌పై దాదాపు మూడు అడుగుల లోతు నీరు చేరింది. రాకపోకలకు వీలు లేకుండా మారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మోటార్లు కాలిపోవడంతో నీట మునిగిన అండర్ పాస్.. వరద నీటిని పరిగణలోకి తీసుకోకుండా సరైనా ప్లాన్ లేకుండా కొత్తగూడ జంక్షన్లో అండర్ పాస్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినప్పుడు వరద నీటితో నిండి పోవడం, వాహనాల రాకపోకలు స్తంభించడం జరుగుతూనే ఉంది. దీంతో అధికారులు కరెంట్ మోటార్లు బిగించి వచ్చిన వరద వచ్చినట్లే బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భారీ వర్షానికి వరద నీరు చేరింది. మోటార్లు కాలిపోవడంతో వరదను తొలగించే పరిస్థితి లేకపోవడంతో అండర్ పాస్ పూర్తిగా నిండిపోయింది. డీజిల్ ఇంజన్లతో రాత్రంతా వరద నీటిని తోడారు. వరద నీటి తొలగింపు పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంక్షన్ జామ్.. కొత్తగూడ జంక్షన్‌తో పాటు మియాపూర్ రోడ్డులో భారీగా వరద నీరు చేరింది. హర్ష టయోటా ముందు వరద పోటెత్తడంతో మియాపూర్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శుక్రవారం రాత్రి హైడ్రా మాన్సూన్ టీం వరదను తొలగించే ప్రయత్నాలు చేసినా గంటల తరబడి వాహనదారులు వరదనీటిలోనే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్, మాదాపూర్ వైపు, మాదాపూర్ నుంచి మియాపూర్ వైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చదవండి: అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. -
అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా..
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు విదేశీ విద్య ఆశలు కల్పించారు.. కానీ ఏళ్ల తరబడి ఫీజులు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఫీజు, ఇతర ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. 2022లో అప్పటి సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్ గురుకులాల విద్యార్థులకు అత్యున్నత విద్యనందించేలా శాట్ క్యాంప్ ద్వారా శిక్షణ ఇప్పించారు. అదే ఏడాది ఇంటర్ విద్యార్థులకు శాట్ పరీక్ష నిర్వహిస్తే 20 మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు అమెరికాలోని కుడ్జ్టౌన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు 2023 ఆగస్టులో ఇంజనీరింగ్ సీఎస్సీ బ్రాంచ్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొక్కెరగడ్డ అనూహ్య శాంతిశ్రీరాజ్, హైదరాబాద్‌కు చెందిన పి.సృజనసింహ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జి.అక్షయ చేరారు. రెండేళ్లయినా.. విదేశీ విద్యపై ఆశతో అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురికీ ఫీజు చెల్లించలేదు. ఏటా 6 వేల డాలర్ల చొప్పున రెండేళ్లకు ఒక్కొక్కరికి 12 వేల డాలర్లను రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌గా మంజూరు చేయాల్సి ఉంది. ఏటా ఆరు వేల డాలర్ల స్కాలర్షిప్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో విమాన టికెట్లు, ఫీజులకు అప్పులు చేసి పంపించారు. ఇప్పటికి ఒక్కొక్క విద్యార్థిపై సుమారు రూ.46 లక్షలు వెచ్చించినా.. ప్రభుత్వం నుంచి విడుదల కాక అప్పులు ఎలా తీర్చాలా? అని ఆందోళన చెందుతున్నారు.అధికారుల చుట్టూ తిరుగుతూ.. విదేశీ విద్య స్కాలర్షిప్లు (Overseas Education Scholarship) అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు రెండేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సచివాలయంలో ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకంటే ముందు బ్యాచ్‌కు స్కాలర్షిప్ ఇవ్వడంతో.. ఆ ఆశతోనే విదేశీ విద్య వైపు మొగ్గు చూపామని చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో.. చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. సీఎం జోక్యం చేసుకుంటేనే.. విదేశీ విద్య స్కాలర్షిప్కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపి ఎస్సీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినందున తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. చదవండి: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. కటాఫ్ తగ్గింది.. పోటీ పెరిగింది -
మన‘సారా’ ఒక్కటై.. అడవంతా ఆదర్శమై!
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇప్పటికీ వరకట్నం లేకపోవడం.. యువతీ యువకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం.. నిరాడంబరంగా తంతు ముగించడం విశేషం. ప్రకృతి ఒడిలో ఒక్కటై పచ్చని బంధానికి బలమైన పునాది వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – ఆత్మకూరు రూరల్కాలం మారుతోంది. కొన్ని కులాలు, మతాల్లో ఆచారాలు కనుమరుగు అవుతున్నా.. ఆదిమ గిరిజనులైన చెంచులు తమదైన నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి వివాహ పద్ధతి నాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరపడం విశేషం. చెంచు గిరిజన పెద్దలు తమ పిల్లల వివాహ విషయాల్లో వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతన్యత ఇస్తున్నారు. ఒకరినొకరు ఇష్ట పడి ఆ విషయాన్ని పెద్దలకు చెబితే చాలు.. వెంటనే వివాహ యత్నాలు మొదలవుతాయి. గూడెం పెద్దలతో కలిసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అబ్బాయి తరుఫు వాళ్లు తీసుకు వచ్చిన ఐదు సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే అమ్మాయి తరుఫు వారు మూడు సీసాల సారాను వరుడి వైపు వారు తెచ్చిన సారాయితో కలుపుతారు. ఇది రెండు కుటుంబాల కలయికకు, నూతన బంధానికి చిహ్నంగా భావిస్తారు. అలా ఒకటైన సారాయిని వచ్చిన పెద్దలకు తలా ఇంతా పంచుతారు. ఆ సమయంలోనే వివాహ దినాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. చెంచుల వివాహాల్లో వరకట్నం అన్న సాంఘిక దురాచారం కనపడదు. కొద్దిపాటి కన్యాశుల్కం ఉంటుంది. అది కూడా పూర్వపు రోజుల్లో అయితే అణాలలో ఉండేది. ఇప్పుడిప్పుడే రూ.11 దాకా పెరిగింది. ఈ మొత్తాన్ని వివాహ సమయంలో వరుడు వధువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కూతురింటిలో జరిగే తంతుకు కావాల్సినదంతా పెళ్లి కొడుకు తీసుకు రావాల్సిందే. పెళ్లి కూతురికి రెండు చీరలు, పెళ్లి కూతురికి తల్లికి ఒక చీరను తీసుకెళ్లాలి. వధువు తల్లిదండ్రులకు ఆరోజు పెట్టే పప్పన్నం మాత్రమే ఖర్చు. చెంచుల పురోహితుడు ‘కోలగాడు’ .. ఇరువురిని ఒకటి చేసి వారు దంపతులని సమాజానికి ప్రకటించే తంతే వివాహం. చెంచుల్లో వివాహం జరిపించేందుకు ప్రతి గూడెంలోనూ కోలగాడు అని పిలవబడే పురోహితుడుంటాడు. సగోత్రికులలో వివాహం నిషిద్ధమైన చెంచుల్లో పలు గోత్రనామాలు కలిగిన గుంపులుంటాయి. వాటిలో ఉత్తలూరు, పులిచర్ల, గుళ్ల, దాసరి, మాండ్ల, చిగుళ్ల, జళ్లి, భూమని, కుడుముల వంటి గోత్రాలు వాటిలో కొన్ని. వీటిలోని ఉత్తలూరు గోత్రానికి చెందిన వారిలో ఒకరిని ఆయా గూడేలలో పెళ్లి తంతు జరిపే పురోహితునిగా ఎంచుకుంటారు. చెంచు పురోహితున్ని ‘కోలగాడు’ అనిపిలుస్తారు. ప్రకృతి ఒడిలోనే ఏకాంతం.. పెళ్లయిన వధూవరులకు అనంతరం జరిగే శోభన కార్యక్రమం నాలుగు గోడల మధ్య జరగడానికి చెంచుల ఆచారాలు అనుమతించవు. పెళ్లయిన వధూవరులు ఆహార సేకరణ కోసం అడవుల్లోకి వెళతారు. అక్కడ ప్రకృతి ప్రసాదించిన ఏకాంతం, పచ్చటి పొదరింటి శయ్యాగృహమే నూతన వధూవరులకు శోభన వేదిక అవుతుంది. నూతన వధూవరులే కాదు.. ఏ చెంచు జంటకైనా రాత్రి శృంగారం నిషిద్ధం. విహారమైనా.. ఆహార సేకరణ అయినా.. శృంగారమైనా పగటి పూటే చెంచులకు ఆనవాయితీ. చెంచుల పెళ్లింట విశేషాలు..» వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు. » ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది. » గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు. » కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా తయారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది. » పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టి సంబరం జోరుగుంటుంది. » పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది. పాత ఆచారాలు మరచిపోలేం నాగరికతకు ఎంత దగ్గరైనా మా చెంచు వాళ్లు మాత్రం పాత పద్ధతులు ఆచారాలు వదలుకోలేదు. ఇప్పటికీ మా పెద్దోళ్లు చెప్పిన పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నాం. పద్ధతులు మారిస్తే మా పెద్దోళ్లు పైనుంచి కోపగించుకుంటారనే భయమూ ఉంది. పెళ్లంటే అన్ని ఖర్చులు మగపెళ్లి వాళ్లే పెట్టుకుంటారు. ఆడపెళ్లి వాళ్లకు ఎలాంటి ఖర్చు లేదు. – ఉత్తలూరి అంకన్న, కోలగాడు, నాగలూటి గూడెం పిల్లల ఇష్టాలతోనే మా గూడేల్లోకి చర్చీలు, ఆలయాలు వచ్చినా.. మా దేవుళ్లు అయిన ఈదన్న, గుగ్గిళ్ల బయ్యన్న, మంతనాలమ్మలను కొలవడంలో మాత్రం మార్పులేదు. అట్టాగే పెళ్లిళ్లు కూడా సంబరంగా జరుపుకుంటారు. పిల్లగాళ్ల ఇష్టాలతోనే పెద్దవాళ్లు జత కట్టిస్తారు. – వెంకటేశ్వర్లు, చెంచు దేవతల పూజారి, బైర్లూటి -
సము‘చీతా’ స్థానం
మన దేశంలో అంతరించిపోయిన చీతాలను పునరుద్ధరించడం కోసం చేపట్టిన ఆపరేషన్ చీతా ప్రాజెక్టును విజయవంతం చేయడానికి యత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల పునరావాసం కష్టమని తేలడంతో ప్రత్యామ్నాయంగా గుజరాత్‌లోని కచ్ జిల్లా బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు. దేశంలో చీతాల సంతతి పునరుద్ధరణ కోసం 2022లో ప్రాజెక్టు చీతా ప్రారంభించారు. నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 కలిపి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడతల వారీగా వదిలారు. కానీ కునో పార్కు చీతాలకు అనువైంది కాదని ఆ తర్వాత వెల్లడైంది. ఫలితంగా అవి మృత్యువాతపడడం మొదలైంది. కొన్ని చీతాలు పిల్లలు పెట్టినా చాలా వరకూ చనిపోయాయి. మొత్తం 10 చీతాలు చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆసియాలో జీవించిన చీతాలు, ఆఫ్రికన్ అడవుల్లోని చీతాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికితోడు కునో పార్కు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహాలో లేకపోవడం, పరిమితమైన అటవీ ప్రాంతం, వాటికి అవసరమైన ఆహార జంతువుల కొరత, అడవిలో గడ్డి పరిధి ఎక్కువగా ఉండడంతో చీతాల వేగానికి ఆటంకం కలగడం, వాతావరణ మార్పులతో ఇన్ఫెక్షన్లు సోకడం, మానవ జోక్యం ఎక్కువ కావడం వల్ల అవి జీవించలేకపోతున్నట్లు తేలింది. – సాక్షి, అమరావతిబన్ని గడ్డి మైదానాలే ఎందుకంటే?ఈ నేపథ్యంలో చీతాల సంరక్షణకు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహా ప్రాంతం కోసం అటవీ అధికారులు అన్వేషించారు. చివరికి కచ్ ప్రాంతంలోని బన్ని గడ్డి మైదానాలు అనువుగా ఉంటాయని తేల్చారు. ఇవి భారతదేశంలో ఉన్న అతి పెద్ద గడ్డి మైదానాలు. సుమారు 2,618 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.తక్కువ పొడవు ఉండే గడ్డి, మృదువైన నేల, ఎక్కువ ఎండ, తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం. అలాగే చీతాలకు ఆహారంగా జింకలు, దుప్పులు ఇతర జంతువులు సహా అనేక జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆఫ్రికాలో చీతాలు నివసించే సహజమైన గడ్డి మైదానాల మాదిరిగానే బన్ని గడ్డి భూములు ఉంటాయి. ఈ ప్రాంతంలో జనసాంద్రత కూడా తక్కువగా ఉండటం వల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.కునో పార్కులో మిగిలిన 24 చీతాలు ఈ నేపథ్యంలోనే చీతాలను అక్కడ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణుల ప్రధాన సంరక్షణాధికారి జైపాల్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటికే బన్ని గడ్డి మైదానాల్లో 500 ఎకరాల్లో బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు చీతాలు తిరగడానికి వీలుగా వలయాకారంలో భారీ ఫెన్సింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సరిపోయే ఆహార శ్రేణిని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్ మానిటరింగ్, సీసీ టీవీ వ్యవస్థలు, అటవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కునో పార్కులో 24 చీతాలు ఉన్నాయి. అందులో 12 పిల్లలు. మొదటి విడతగా పది చీతాలను బన్ని గడ్డి మైదానాల్లో వదలాలని భావిస్తున్నారు.కొత్త ప్రణాళికతో ముందుకు1952లోనే చీతాలు అధికారికంగా భారతదేశంలో అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. 70 ఏళ్ల తర్వాత 2022లో ప్రాజెక్టు చీతా ద్వారా మళ్లీ వాటిని ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి తీసుకురాగలిగారు. అయితే ఆఫ్రికన్, ఆసియా చీతా జాతుల మధ్య ఉన్న తేడాలు, వాటి ఆవాసానికి సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవడం, ప్రణాళికా లోపం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ మూడేళ్లలో ఎదురైన అనుభవాలతో ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే గుజరాత్ బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు. -
టెక్ బదిలీ.. ఆదాయం భళీ!
దివ్యాంగులకు వరమైన జైపూర్ ఫుట్ సాంకేతికత.. వరదల సమయంలోనూ, వ్యవసాయంలోనూ.. ఇలా అనేక సందర్భాల్లో అక్కరకొచ్చే లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) టెక్నాలజీ.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత..ఇలాంటి ఎన్నో అద్భుతమైన సాంకేతికతలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో తయారుచేసినవే. ఇవి దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆ సాంకేతికతలను పారిశ్రామిక రంగానికి, స్టార్టప్‌లకు బదిలీ చేస్తూ ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది ఇస్రో. ఒకపక్క దేశ రక్షణ, అభివృద్ధికి ప్రయోగాలు చేస్తూనే ఈ సాంకేతికత బదిలీ ద్వారా భారీగా ఆదాయాన్నీ ఆర్జిస్తోంది.ఇస్రో తన చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహన (ఎస్.ఎస్.ఎల్.వి.) సాంకేతిక పరిజ్ఞానాన్ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్.)కు రూ. 511 కోట్లకు బదిలీ చేసినట్లు ఇన్–స్పేస్ జూన్ నెలలో వెల్లడించింది. ఇస్రో తన లాంచ్ వెహికల్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఒక పరిశ్రమకు బదిలీ చేయటం ఇదే మొదటిసారి. చిన్న ఉపగ్రహాల తయారీ, ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువుగా మారటం వంటి లక్ష్యాలతో పురోగమిస్తున్న భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఈ సాంకేతికతల బదిలీ వ్యూహాత్మకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటికే హెచ్.ఎ.ఎల్., ఎల్ అండ్ టీ సంస్థలు ఇస్రోతో కలిసి పి.ఎస్.ఎల్.వి. (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)ల తయారీలో సాంకేతిక భాగస్వాములు అయ్యాయి.సాంకేతికత బదిలీఅంతరిక్ష ప్రయోగ వాహనాల సాంకేతికతల్ని బదిలీ చేయటానికి చాలాకాలం ముందు నుంచే ఇస్రో పౌర సేవల వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తోంది. 1970, 80లలోనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్లు వైద్య రంగానికి తమ పరిజ్ఞానాన్ని ఇచ్చాయి. ఇస్రో మొదటి పౌర సంబంధ పరిజ్ఞాన బదిలీ ‘పాలియురేథేన్ ఫోమ్ టెక్నాలజీ’. రాకెట్ మోటార్లలో ఉపయోగించే ఈ సాంకేతికతను కృత్రిమ అవయవాల తయారీకి అందించింది. ‘జైపూర్ ఫుట్’ను అభివృద్ధి చేయటానికి ఈ పరిజ్ఞానమే తోడ్పడింది. ఇస్రో డేటా ప్రకారం.. 2020 ముందు వరకు 400కు పైగా సాంకేతికతలను దాదాపు 235 పరిశ్రమలకు బదిలీ చేసింది. టెలికంకు కూడా ఇస్రో యాంటెన్నాలకు, గ్రౌండ్ స్టేషన్లను సాంకేతిక పరిజ్ఞానం అందించింది. ఎక్స్ కిరణాలు మరింత ప్రభావవంతంగా ప్రసరించేలా చేసే బెరిలియం ఎక్స్‌రే ట్యూబులు, ఆహార పర్యవేక్షణ డేటా సేకరణ వ్యవస్థలు, సిలికా థర్మల్ కవచాల వంటి ఎన్నో సాంకేతికతలను ఇస్రో బదిలీ చేసింది.ఇన్–స్పేస్‌తో కొత్త యుగంఇన్–స్పేస్ ప్రారంభం, ఆ తర్వాత మారిన భారతీయ అంతరిక్ష విధానం.. సాంకేతిక బదిలీలకు ఊపునిచ్చాయి. అంతరిక్ష రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించి, తత్సంబంధ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం 2020లో ఏర్పాటుచేసిందే ‘ఇన్ స్పేస్’. ఇది ఇప్పటివరకు 90కిపైగా సాంకేతికతల బదిలీలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 6 అంతరిక్ష సంబంధ స్టార్టప్‌లకు ఇన్ స్పేస్ గ్రాంట్లు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 330 పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఎమ్ఎస్ఎమ్ఈలు ఇన్ స్పేస్‌తో కలిసి పనిచేస్తున్నాయి.విదేశాలపై ఆధారపడటం తగ్గింది ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతల తాజా బదిలీల్లో ముఖ్యమైనవి – జూలై 3న భారతీయ పరిశ్రమలకు అందిన 10 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు. ఇందులో కొన్ని ప్రధానమైనవి.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత, లేజర్ గైరోస్కోప్‌లు, సిరామిక్ సర్వో యాక్సిలెరోమీటర్లు, గ్రౌండ్ స్టేషన్ కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతికతలు. ఉపగ్రహ ప్రయోగాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలు, జియోస్పేషియల్ అప్లికేషన్ ల వంటి కీలక రంగాలలో విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా దేశీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ఇస్రో ప్రాధాన్యం ఇస్తోంది. 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల విలువైన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవటంపై దృష్టి సారించింది. స్టార్టప్‌లకూ మార్గనిర్దేశనం చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్, హైదరాబాద్‌లోని స్కైరూట్ వంటి అంతరిక్ష సంబంధిత స్టార్టప్‌లు.. రాకెట్ల నిర్మాణంలో పనిచేస్తున్నాయి. అవి వాటి లాంచ్ ప్యాడ్లు శ్రీహరికోటలో నిర్మించుకోవడానికి ఇస్రో అనుమతిచ్చింది. అంతేకాకుండా ఆ స్టార్టప్‌లకు అవసరమైన మార్గనిర్దేశనం కూడా ఇస్రో చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.కు సాంకేతికత బదిలీ, అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్ వంటి వాటితో భాగస్వామ్యం.. ఇలాంటి చర్యలతో భారతీయ అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధి వేగం పుంజుకుంటోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా అంటున్నారు.న్యూ స్పేస్ ఇండియాఇస్రో, మన అంతరిక్ష విభాగం.. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ఎన్నో సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంటాయి. ఆ ఫలాలను దేశంలోని పారిశ్రామిక రంగానికి అందజేసి.. అవి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలి, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి జరగాలన్నదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) లక్ష్యం. ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని 2019లో ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దీని ఆదాయార్జన..150కిపైగా ఒప్పందాలుఈ మార్చిలో కేంద్రం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వేతర సంస్థలకు సాంకేతిక బదిలీకి ఇన్ స్పేస్ 75 ఒప్పందాలు చేసుకుంది. అలాగే ఎన్ఎస్ఐఎల్.. ఇస్రో సాంకేతికతలను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు 78 ఒప్పందాలు కుదుర్చుకుంది. -
‘దత్త’ పుత్రులు.. నిరీక్షిస్తున్నారు
‘దత్తత ప్రక్రియలో దీర్ఘ జాప్యం కారణంగా దత్తత తీసుకోవడానికి చట్టబద్ధంగా అర్హులని ప్రకటించిన పిల్లలకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల దత్తత కోసం పిల్లలను అక్రమంగా తరలించే ప్రమాదం ఉంది’– ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. దేశంలో దత్తతకు చట్టపరంగా ఏ అడ్డంకులూ లేని బిడ్డ కోసం దంపతులు.. సగటున మూడేళ్లకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలా ఆలస్యమయ్యేకొద్దీ కొన్నాళ్లకు వాళ్లకు దత్తతపై పూర్తిగా ఆసక్తిపోయే అవకాశం ఉంటుంది. ఇది అనాథలైన చిన్నారుల పాలిట శాపంలా మారుతుంది. వా రికొక కుటుంబం ఏర్పడే అవకాశాన్ని కాలరాస్తోంది. చిన్నారుల దత్తత ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లోనే ‘కేరింగ్స్’పోర్టల్ ద్వారా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దత్తత విధి విధానాలు శీఘ్రంగా అమలయ్యేందుకు కేంద్ర దత్తత వ్యవహారాల ప్రాధికార సంస్థ (కారా)ను ఏర్పాటుచేసింది. ఇది గత కొన్నేళ్లుగా దత్తతలను సమర్థంగా నిర్వహించలేకపోతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిమిత సంఖ్యలో మాత్రమే పిల్లలను దత్తత ఇవ్వటానికి చట్టబద్ధమైన అనుమతులు పొందగలుగుతోంది. దీనిపై గతంలోనే పార్లమెంటరీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దరఖాస్తుల వెల్లువ సమాచార హక్కు దరఖాస్తుల ద్వారా వెల్లడైన తాజా సమాచారం ప్రకారం 2021లో 26,734 మంది తల్లిదండ్రులు దత్తత కోసం ‘కారా’పోర్టల్‌లో నమోదు చేసుకోగా, 2,430 మంది పిల్లలు మాత్రమే చట్టబద్ధమైన దత్తతకు సిద్ధంగా ఉన్నారు. అంటే, ప్రతి బిడ్డకు 11 మంది తల్లిదండ్రులు ఎదురు చూశారన్నమాట. 2025 జూలై 19 నాటికి, దత్తత తీసుకునేందుకు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల సంఖ్య 36,433కి, పిల్లల సంఖ్య 2,777కి పెరిగింది. ప్రస్తుతం దత్తతకు యోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకు 13 మంది తల్లిదండ్రులు ఉన్నారు. 2025–26లో జూలై 19 వరకు 1,365 మంది పిల్లలు దత్తుకు వెళ్లారు.మూడేళ్లకు పెరిగిన జాప్యం 2025లో దేశం మొత్తం మీద దత్తత కోసం పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. దత్తతకు న్యాయపరమైన అన్ని ప్రక్రియలు పూర్తవటానికి 2017లో ఒక సంవత్సరంగా ఉన్న సగటు ఆలస్యం 2022 నాటికి మూడేళ్లకు, ప్రస్తుతం దాదాపు 3.5 సంవత్సరాలకు పెరిగింది. 34 శాతం వారే! ప్రస్తుతం దత్తత కోసం సిద్ధంగా ఉన్న పిల్లల్లో దాదాపు 34 శాతం మంది 14–18 సంవత్సరాల వయసువారే. ‘దత్తత తీసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. భారతీయ తల్లిదండ్రులు సాధారణంగా పెద్ద పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది’అని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అర్హత ప్రక్రియల్లో అస్పష్టత జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం (2021) ప్రకారం బాలల సంరక్షణ సంస్థలలో (సీసీఐలు) ఉండే పిల్లలను దత్తతకు అనుమతిస్తారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో సీసీఐలలో ఉండే పిల్ల ల సంఖ్యకు, దత్తతకు అర్హులుగా ప్రకటించే పిల్లల సంఖ్యకూ చాలా వ్యత్యాసం ఉంటోంది. పిల్లల సంఖ్య ఎక్కు వ ఉన్నప్పటికీ.. దత్తతకు అర్హులైన వారి సంఖ్య తక్కు వగా ఉంటోంది. 2025లో 22,000 కంటే ఎక్కువ మంది పిల్లలు సీసీఐలలో ఉన్నారని, చట్టబద్ధంగా దత్తతకు అర్హత ఉన్న పిల్లల సంఖ్య కంటే ఇది 8.5 రెట్లు ఎక్కువ అనీ సమాచార హక్కు డేటా చూపిస్తోంది. సీసీఐలలోని పిల్లల్లో అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవారు, బంధువులు తెచ్చి అప్పగించినవారు, సంరక్షకులు లేని పిల్లలు ఉంటారు. వారిలో దత్తతకు అర్హమైన పిల్లల్ని ప్రక టించే ప్రక్రియ ఇంకా అస్పష్టంగానే ఉంది. సంరక్షకులు / తల్లిదండ్రులు ఉండి కూడా ఏనాడూ తమ పిల్లల ముఖం చూడ్డానికి రాకపోవటం వల్ల కూడా చట్టబద్ధంగా వారిని దత్తత ఇవ్వటంలో అవాంతరాలు ఎదురౌతున్నాయి. -
Yoweri Museveni: 40 ఏళ్లుగా నాటౌట్!
వయసు 80 ఏళ్లు. అందులో దేశాధ్యక్షునిగానే ఏకంగా 40 ఏళ్లు! ఇదీ, ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి ముసేవేని ట్రాక్ రికార్డు! అయినా తనివి తీరలేదేమో, ఈ వయసులో కూడా మళ్లీ అధ్యక్ష బరిలో దిగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అని పాలక నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) పార్టీ ప్రకటించింది. అందుకు ముసేవేని అంగీకరించారు కూడా. ఎన్ఆర్ఎం గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 40 ఏళ్ల రికార్డను మరింత మెరుగు పరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరిలో ఎన్నికలు ఉగాండాలో 2026 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పాప్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాబీ వైన్ వాటిలో ముసేవేని ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. విపక్ష నేషనల్ యూనిటీ పార్టీ తనను నామినేట్ చేస్తే ముసేవేనిపై తలపడేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ‘‘దేశంలో అణచివేత పెరుగుతోంది. విపక్షాల్లో కొనసాగడమే దుర్భరంగా మారింది. విపక్ష నేతలపై నేరుగా ఉగ్రవాది ముద్ర వేస్తున్నారు’’ అన్నారాయన. వైన్ 2021 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బరిలో దిగినా ముసేవేని చేతిలో ఓటమి చవిచూశారు. మరో ప్రముఖ ప్రతిపక్షం ఫోరం ఫర్ డెమొక్రటిక్ చేంజ్ (ఎఫ్డీసీ) నేత కిజ్జా బెసిగ్యే దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ సైనికాధికారి అయిన ఆయన గత నవంబర్ నుంచి నిర్బంధంలో ఉన్నారు. పశుల కాపర్ల కుటుంబం యోవేరి ముసేవేని 1944లో ఉగాండాలోని ఎంబారా జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పశువుల కాపర్లు, పెంపకదారు లు. ఆయన మిషనరీ పాఠశాలల్లో చదివారు. టాంజానియాలోని దారెస్సలాం విశ్వవిద్యాలయంలో చదువుతుండగా ఆఫ్రికన్ విముక్తి ఉద్యమాలతో అనుబంధం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘానికి చైర్మన్ అయ్యారు. నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) ఆధ్వర్యంలోని సాయుధ దళమైన నేషనల్ రెసిస్టెన్స్ ఆర్మీకి నేతృత్వం వహించారు. 1980ల్లో నాటి అధ్యక్షుడు ఒబోటే పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. 1986లో తిరుగుబాటు నాయకుడిగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగడానికి వీలుగా రాజ్యాంగాన్ని రెండుసార్లు సవరించి మరీ వయో,, పదవీకాల పరిమితులను తొలగించారు! ఆ తర్వాత 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో ముసేవేని వరుస విజయాలు సాధించారు. 2017లో మరోసారి రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష అభ్యర్థుల వయో వయో పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. తద్వారా 2021లో తిరిగి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఉగాండాను ముసేవేని ప్రగతి పథంలోకి నడిపించారు. రాజకీయ స్థిరత్వం అందించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతిచ్చారు. ఇదంతా నాణేనికి ఒకవైపే ముసేవేనిపై తీవ్ర అవినీతి మచ్చలున్నాయి. దాంతో కొన్నేళ్లుగా ఆయన ఆదరణ, ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించడం, నిర్బంధించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉత్తర ఉగాండాను దశాబ్దాలుగా భయభ్రాంతులను చేస్తున్న లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ (ఎల్ఆర్ఏ)ని కట్టడి చేయడంలో విఫలమయ్యారని ముసేవేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోమాలి యాలో ఆఫ్రికన్ యూనియన్ దళానికి సైనిక సాయం చేసి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే 2013లో దక్షిణ సూడాన్ చెలరేగిన అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతిచి్చవిమర్శలపాలయ్యరు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ బిడ్డలం... బోనమందుకో తల్లీ...
తెలంగాణ ప్రాంతంలో పెద్దమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఆరె మైసమ్మ, గండి మైసమ్మ, మాంకాళమ్మ, నల్ల పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, జగదాంబిక పేర్లతో ప్రతి ఆషాఢమాసంలో అమ్మవార్లు బోనాలందుకుంటారు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు.... ప్రతి ఇంటా బోనాల హడావిడి కనిపిస్తుంది. ఆషాఢమాసం సందర్భంగా గత నెలలో ఆరంభమైన తెలంగాణ సాంస్కృతిక సంబురం బోనాల వేడుకలు ఆషాఢ బహుళ అమావాస్యతో ముగియనున్నాయి. నేడు పాతబస్తీలోని లాల్ దర్వాజాలో కొలువై ఉన్న సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.భక్తి, ఉత్సాహభరితమైన ఊరేగింపులు, సంబురాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందిన బోనాల పండుగ భాగ్యనగర వాసుల జీవితాలలో కొన్ని శతాబ్దాలుగా భాగమై ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలో అత్యధికులు ఎక్కువగా జరుపుకునే పండుగల్లో బోనాలు ముఖ్యమైనది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఈనాటిది కాదు, వందల ఏళ్లుగా వస్తున్నదే. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా, ఈ బోనాల వేడుకలు మాత్రం తమ వైభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.నవాబుల కాలం నుంచి...మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరదనీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకీ బోనాలు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. నియమనిష్ఠలతో అమ్మవారికి పసుపునీళ్లు, వే పాకులతో సాక పెడతారు. తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాల పాటలు ఆడామగా, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు ‘‘గండిపేట గండెమ్మా దండం బెడత ఉండమ్మా.., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే.., అమ్మా బైలెల్లినాదే... అమ్మా సల్లంగ సూడమ్మ... మైసమ్మా మైసమ్మా... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. పోతురాజుల చేతి కొరడా దెబ్బ... పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు తప్పక చూడతగ్గవి. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు. పోతురాజుల చేతి కొరడా దెబ్బతినడానికి చాలామంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే ఆ కొరడా దెబ్బ దుష్టశక్తులను, శారీరక రుగ్మతలను దూరంగా తరిమి కొడుతుందని వారి విశ్వాసం.గోల్కొండ జగదాంబికదే తొలిబోనంమొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్ర పారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.అమ్మ... ప్రతి ఇంటి ఆడపిల్లఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. అదే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.తొట్టెల సమర్పణతమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెను సమర్పించడం ఆచారంగా ఉంది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
ఆ పా‘పాలు’ మాకొద్దు!
ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారత్. అంతేకాదు వినియోగంలోనూ మనది అగ్రస్థానమే. అందుకే, మన డెయిరీ మార్కెట్లోకి ప్రవేశించాలని అగ్ర రాజ్యం ఉవ్విళ్లూరుతోంది. భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ‘మాంసాహార పాల’ అంశం తెరపైకి వచ్చింది. ఈ పాలను భారత్‌కు ఎగుమతి చేస్తామని యూఎస్.. కుదరదని మనదేశం పట్టుపడుతున్నాయి. మనదేశంపై ప్రతీకార సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆగస్టు 1 గడువు ముగిసేలోపు ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనడంలో ఇరుపక్షాలు తలమునకలయ్యాయి. వాణిజ్య చర్చల నేపథ్యంలో మన పాడి పరిశ్రమ తలుపులను అమెరికా దిగుమతులకు తెరవడానికి మనదేశం చూపుతున్న ప్రతిఘటన కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదన్నది మాత్రం సుస్పష్టం. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆవును గోమాతగా, ఆవు నుంచి వచ్చే పాలు, పేడ అన్నింటినీ అత్యంత పవిత్రమైన వస్తువులుగా భావించే దేశం మనది. రోజువారీ ఆహారంలోనూ, సనాతన ధర్మ సంప్రదాయాల్లోనూ పాలు, పెరుగు, నెయ్యికి ఉన్న విలువ అందరికీ తెలిసిందే. అలాంటి గోవుకు మనం గడ్డి, ఇతర శాకాహార దాణాను మాత్రమే వినియోగిస్తాం. కానీ, విదేశాల్లో అలా కాదు. జంతువుల ఆధారిత దాణా కూడా వినియోగిస్తారు. ఇప్పుడు ఇదే భారత్ – అమెరికా వాణిజ్యంలో చర్చనీయాంశంగా మారింది. దిగుమతి చేసుకునే పాలకు ‘జంతువుల ఆధారిత దాణా తీసుకోని ఆవుల నుండి సేకరించాం’ అన్న కఠిన ధ్రువీకరణ ఉండాలని భారత్ పట్టుపడుతోంది.అమెరికా ఏమంటోంది?మన డిమాండ్లను ‘అనవసర వాణిజ్య అవరోధం‘ అని అమెరికా పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వద్ద కూడా ఈ విషయాన్ని లేవనెత్తింది. 2024 నవంబర్‌లో అమలులోకి వచ్చిన ‘నవీకరించిన పాల ధ్రువీకరణ’లో అలాంటి ఆందోళనలను భారత్ పేర్కొనలేదని అగ్ర రాజ్యం అంటోంది.అదే జరిగితే..కుటుంబ వినియోగ వ్యయ సర్వే (2023–24 ప్రకారం) దేశంలో సుమారు 94% జనాభా పాలు, పాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ప్రపంచం డెయిరీ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యూఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడి మార్కెట్లోకి చవక పాలు, పాల ఉత్పత్తులు వెల్లువెత్తుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విశ్లేషణ ప్రకారం.. యూఎస్ డెయిరీ ఉత్పత్తుల దిగుమతులను ప్రభుత్వం అనుమతిస్తే భారత్ ఏటా ఏకంగా రూ.1.03 లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.మాంసాహార పాలు అంటే..మాంసం లేదా రక్తం వంటి జంతువుల ఆధారిత దాణాను ఆహారంగా తీసుకునే ఆవుల నుండి వచ్చేవే మాంసాహార పాలు. » వివిధ నివేదికల ప్రకారం.. యూఎస్‌లో పశువులకు ఆహారంగా జంతు ఆధారిత దాణా కూడా వాడుతున్నారు. » పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు లేదా కుక్కల మాంసం, వ్యర్థాల ఆధారంగా తయారైన దాణా వీటిలో ఉంది. » పశువులకు ప్రోటీన్ కోసం పంది, గుర్రపు రక్తాన్ని, అలాగే బలిష్టంగా తయారయ్యేందుకు పశువుల భాగాల నుండి తీసిన కొవ్వును ఆహారంగా ఇస్తున్నారట.ధ్రువీకరణ ఉండాల్సిందే..: ఆహార దిగుమతులకు భారత పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పశువైద్య ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. ఇది పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల ఉత్పత్తులు జంతువుల ఆధారిత దాణా తీసుకోని ఆవుల నుండి వచ్చాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధనను డబ్ల్యూటీఓ వేదికగా అమెరికా విమర్శించింది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్ఆర్టీ) నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ నివేదిక ప్రకారం.. జంతువుల ఆధారిత దాణా తీసుకున్న ఆవుల నుండి సేకరించిన పాలతో తయారైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై భారత్ తన నిషేధాన్ని కొనసాగిస్తోంది. సుంకాలు ఎక్కువే..: ప్రస్తుతానికి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది. చీజ్‌పై 30%, వెన్న 40%, పాలపొడిపై 60% సుంకం ఉంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల దిగుమతులు కూడా మనకు లాభదాయకం కావు.భారత్ – పాల ఉత్పత్తి» 1998 నుంచి ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మనమే నం.1. ప్రస్తుతం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% వాటా మనదే.» దేశంలో పాల ఉత్పత్తి 2014–15లో 146.31 మిలియన్ టన్నుల నుంచి 2023–24లో 239.30 మిలియన్ టన్నులకు పెరిగింది. ప్రపంచ దేశాల మొత్తం పాల ఉత్పత్తి 2023–24లో 981 మిలియన్ టన్నులు.» దేశంలో తలసరి పాల లభ్యత అప్పట్లో రోజుకు 319 గ్రాముల నుంచి ఇప్పుడు 471 గ్రాములకు చేరింది.» ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత 2024లో 329 గ్రాములు.» దేశ జీడీపీలో 4–5% వాటా డెయిరీ రంగానిదే.» కేంద్ర ప్రభుత్వ ‘ప్రాథమిక పశు సంవర్థక గణాంకాలు 2024’ ప్రకారం.. 2023–24లో దేశంలో పాల ఉత్పత్తిలో ఆవులదే అగ్రస్థానం. అన్ని రకాల గోవులూ కలిపి మొత్తం పాలలో సుమారు 55% ఉత్పత్తి చేస్తున్నాయి.» పాల ఉత్పత్తిలో మన తరవాత అమెరికా (11.04%), పాకిస్తాన్ (6.73%) ఉన్నాయి. -
ఏఐతో హోమ్‌వర్క్!
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్‌వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.మొత్తం 29 దేశాలు..‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రైట్చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్‌జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్‌లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.పిల్లలు – ఏఐ⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%⇒ 62% చాట్‌జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20% -
తోటపని.. పిల్లలకు మంచిదని!
దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు గాల్లోంచి వీచి పిల్లల్లో ప్రవేశించవు. తల్లి ఒడి నేర్పించాలి. తండ్రి తన భుజాల పైకి ఎక్కించుకుని లోకాన్ని చూపించాలి. గురువు చెప్పే గద్దింపు పాఠాలు నేర్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. ఎదిగేకొద్దీ ఒదుగుతాడు. అయితే ఇల్లు, బడి మాత్రమే కాకుండా బిడ్డకు బుద్ధులు నేర్పే పాఠాల్లో మరో ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే... తోట పని. తోటను చూస్తూ, తోటలో పని చేస్తూ పెరిగి పెద్దయిన పిల్లలు సాటి మనుషులకు చల్లని నీడ అవుతారని, మానవత్వానికి ఊడలు అవుతారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లలోనే పెరిగి పెద్దయి ఒకేసారి బయటికి అడుగు పెట్టే పిల్లల్లో ప్రకృతి సహజ లక్షణాలైన నెమ్మది, ప్రశాంతత ఉండవు. జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలవటం, కలుపుకొని పోవడం తెలియవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్లో దూసుకుపోతుంటారు కానీ, జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచపు రోబో పిల్లల్ని తోట పనికి పంపాలి. తోటపని పిల్లల్ని మలిచే కుమ్మరి వంటిది. పెద్దయ్యాక బతకటానికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలా బతకాలో చిన్నతనంలోనే తోట పని నేర్పిస్తుంది.తోటపనిలోకి ఎలా దింపాలి?ఆటలా ఉంటే చాలు, పిల్లలు దేనికైనా ‘సై’ అంటారు. కనుక తోటపనిని కూడా వాళ్లకు ఆటలా నేర్పించాలి. ఇందుకు మీరూ వాళ్లతో కలిసి ఆటలోకి దిగాలి. వంటింటి నుంచే మీ ఆటను మొదలుపెట్టండి. టమాటాను కోసి, అందులోంచి కొన్ని విత్తనాలను తీసి, ఎండబెట్టి, ఒక చిన్న కుండీలో నాటండి. ‘ఆహారం ఏదీ నేరుగా ప్యాకెట్లలో వచ్చేయదు. గింజ వేయటానికి నేల, మొక్క మొలిచాక సూర్యరశ్మి కోసం సూర్యుడు, మొక్క ఫలించటానికి కొంత సమయం, అప్పటి వరకు వేచి ఉండటానికి మనకు సహనం అవసరం’ అని పిల్లలకు నేర్పించటానికి ఇదొక చక్కని మార్గం.ఒక మొక్కను అప్పగించండిపాత టీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు లేదా టిన్ డబ్బాలలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను నాటండి. ఆ కప్పులు లేదా డబ్బాలకు మీ పిల్లల చేత వారికి చేతనైనట్లుగా అందమైన పెయింట్స్ వేయించండి. లేదా స్టిక్కర్లతో అలంకరించనివ్వండి. అలా ఒక రీసైకిల్ పాట్ గార్డెన్‌ను తయారవనివ్వండి. అప్పుడు వారు ఆ మొక్కల్ని తమ సొంతమైనవిగా భావిస్తారు. మొక్కకు వారినే ఏదో ఒక పేరు పెట్టమని చెప్పండి. అలా వాటితో అనుబంధం ఏర్పడుతుంది. వాటి ఆలనా, పాలనను వారే ఇష్టంగా తీసుకుంటారు. రోజూ ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఆ మొక్కను పలకరిస్తారు. చిన్నతనంలో మొక్కలతో ఏర్పడిన బాంధవ్యమే, పెద్దయ్యాక సాటి మనుషులతోనూ ఏర్పడుతుంది.సేంద్రియ ఎరువు తయారీవంట గది వ్యర్థాలు, తోటలో రాలిపడిన ఆకులు, మట్టి.. వీటన్నిటినీ ఒక పారదర్శకమైన సీసాలో ఒకదానిపైన ఒకటి పొరలుగా వేసి అవన్నీ కుళ్లిపోయి సహజమైన ఎరువుగా ఎలా మారుతుందో పిల్లలకు చూపించవచ్చు. నిజంగా అదొక అద్భుతమైన ప్రయోగంగా, మారువేషంలో ఉన్న ఒక సైన్స్ పాఠంలా పిల్లలకు అనిపిస్తుంది.విత్తనం నాటితే ఓర్పు మొలుస్తుంది⇒ తోటపని అంటే కేవలం మొక్కల పాదుల్ని శుభ్రం చెయ్యటం, మొక్కలకు నీళ్లు పెట్టటం మాత్రమే కాదు.⇒ మట్టిని తవ్వటం అనేది శ్రమించటాన్ని నేర్పిస్తుంది.⇒ విత్తనాలను నాటడం అన్నది ఆశగా⇒ ఎదురుచూడటం అలవరుస్తుంది.⇒ ఎదురుచూడటం అంటే తొందరపడకపోవటం. ఓపికపట్టడం. జీవితానికి అత్యంత కీలకమైన ఈ లక్షణాలను తోటపని బాల్యంలోనే అలవరుస్తుంది.⇒ ఇక మొక్కలకు నీళ్లు పెట్టటం బాధ్యత అవుతుంది. నీళ్లు పెట్టడం మర్చిపోయి, మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరువకూడదని తెలిసివస్తుంది.ఎదిగే దశలు ఉత్తేజపరుస్తాయితోటపని చేసే క్రమంలో మొక్కలు ఎదగటంలోని దశలు పిల్లలను ఉత్తేజపరుస్తాయి. మొక్కలు పెరగటానికి, పవ్వులు పూయటానికి, కాయలు కాయటానికి సమయం పడుతుందని వారు గ్రహిస్తారు. స్వయంగా నాటి, నీళ్లు పోసి, సంరక్షించిన మొక్కలు పుష్పించినప్పుడు, కాయలూ పండ్లూ కాసినప్పుడు తామే ప్రకృతిని పెంచి పెద్ద చేసిన గొప్ప ఆత్మవిశ్వాసపు భావన పిల్లల్లో అంకురిస్తుంది. వారిపై వారికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తోటపనిలోని ఈ అనుభవాలన్నీ జీవితంలో మున్ముందు అక్కరకు వస్తాయి.సృజనాత్మకత, సాత్విక గుణాలు⇒ తోటపని ప్రకృతితో పిల్లలకు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మొదట్లో భయపెట్టిన వానపాములు తరవాత నేస్తాలు అవుతాయి. వర్షం ఉత్సాహమై కురుస్తుంది.⇒ తూనీగలు మీదకొచ్చి వాలతాయి. సీతాకోక చిలుకలు తలపై ఎగురుతాయి.⇒ పక్షులన్నీ రాగాల కోయిలలే అవుతాయి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకతను, సాత్విక గుణాలను ప్రేరేపిస్తాయి. మున్ముందు జీవితంలో అలుముకునే నిరాశ, నిస్పృహలకు, అనిశ్చిత పరిస్థితులకు కూడా తోటపనే వైద్యం, చికిత్స నేర్పి పంపుతుంది.తోటపనితో ఏమేం తెలుస్తాయి?⇒ సమస్యలను ఎలా పరిష్కరించాలి?⇒ ప్రణాళికతో పనిచేయడం⇒ సమయం, వనరుల సద్వినియోగం⇒ లక్ష్యసాధన⇒ కష్టం విలువఏమేం పెరుగుతాయి?⇒ ఆత్మవిశ్వాసం⇒ ఆత్మగౌరవం⇒ ఓర్పు, సహనం⇒ బాధ్యత⇒ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు⇒ ఎలా చేస్తే పని విజయవంతమవుతుందన్న ఆలోచనా ధోరణి⇒ పర్యావరణ పరిరక్షణ స్పృహఏమేం తగ్గుతాయి?⇒ ఒత్తిడి, ఆందోళన⇒ కోపం, అసహనం⇒ ఒక పనిని గుడ్డిగా చేయడం⇒ మొక్కలను నరికేయడం/కొట్టేయడం -
స్మార్ట్ గూఢచారి!
అకస్మాత్తుగా మీ ఫోన్ దానంతటదే బ్లింక్ అవుతుంది. ఏదో మెసేజ్! తెరిచి చూస్తే అంకెలు, అక్షరాలు ఉంటాయి. అవేమిటో అర్థం కాదు. హఠాత్తుగా మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయి ఉంటుంది. నిజానికి అప్పటికి గంట క్రితమే మీరు మీ ఫోన్‌ని పూర్తిగా చార్జి చేసి ఉంటారు. మీ ఫోన్‌ని మీరు ఉపయోగించకుండానే వేడెక్కిపోతుంటుంది. ఏదో సాంకేతిక సమస్య అని మీరు పట్టించుకోక పోవచ్చు. కానీ అవన్నీ... స్పైయింగ్ సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో చొరబడి ఉండొచ్చనే దానికి సంకేతాలు కావచ్చునని అంటున్నారు నిపుణులు. మరోవైపు – స్మార్ట్ఫోన్ల ద్వారా నిఘా, గూఢచర్యం, సైబర్‌క్రైమ్‌లు పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్స్మార్ట్ఫోన్ లో మన వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడే అనేక యాప్‌లు.. మనకు సంబంధించిన కాంటాక్ట్‌లు, లొకేషన్ హిస్టరీ, ఫొటోలు.. ఇలా అన్నింటి యాక్సెస్ తీసేసుకుంటున్నాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లో మన జీవితం తెరిచిన పుస్తకం అయిపోయింది. ఎంతో అమూల్యమైన ఆ సమాచారాన్ని ఎవరో, ఎక్కడి నుంచో రహస్యంగా వెతుకుతూ ఉంటే? చూస్తూ ఉంటే? మనకు తెలియకుండా వేరెవరికో ఇచ్చేస్తే? సర్వం పోగొట్టుకున్నట్లే. జీవితమే తలకిందులైపోవచ్చు కూడా. అందుకే స్పైవేర్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ‘స్పైవేర్’ అనేది మన ఫోన్లోని విలువైన సమాచారాన్నంతా రాబట్టేందుకు రూపొందిన హానికరమైన సాఫ్ట్వేర్. మనకు తెలియకుండానే అది మన పాస్‌వర్డ్‌లన్నీ కనిపెట్టేస్తుంది. మన కదలికలన్నిటినీ గమనిస్తుంటుంది. మనం చేసిన కాల్స్‌నీ, మనకు వచ్చిన కాల్స్‌నీ రికార్డ్ చేస్తుంటుంది. మనకు తెలియకుండానే మన మైక్రోఫోన్, కెమెరాలను కూడా పని చేయించటం మొదలుపెట్టేస్తుంది.మనకెలా తెలుస్తుంది?..: మీ ఫోన్లో స్పైవేర్ చొరబడి మిమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి :ఫోన్ పనితీరులో ఆకస్మిక సమస్యలు: యాప్‌లు పని చేయటం మానేస్తాయి లేదా ఫోన్ బాగా స్లో అయిపోతుంది. బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవటం: స్పైవేర్ అన్నది ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంటుంది. ఫోన్ బ్యాటరీ మొత్తాన్ని తాగేస్తుంది. అంతుచిక్కని డేటా వినియోగం: మీ మొబైల్ డేటా బిల్లు మీ వాడకానికి మించి అమాంతం పెరిగిపోయిందీ అంటే స్పైవేర్ మీ డేటాను వేరొకరికి బదిలీ చేస్తోందని అర్థం!వేడెక్కడం: మీ ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటే వెనుక ఏదో స్పయింగ్ పని నడుస్తూ ఉండొచ్చు. వింత సందేశాలు: వింత అక్షరాలు లేదా లింక్‌లతో కూడిన టెక్స్ట్ మెసేజ్‌లు వస్తుంటే అవి మీ ఫోన్లోని స్పైవేర్‌కు అందుతున్న ఆదేశాలు / సందేశాలు కావచ్చు.స్పైవేర్‌ను వేటాడటం ఎలా?మీ ఫోన్లో స్పైవేర్ సంకేతాలు కనిపిస్తే కనుక మీరు దానిని వేటాడి మట్టుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. అయితే ఆ వేట మీది ఏ రకం ఫోన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీది ఆండ్రాయిడ్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి నుంచి యాప్స్‌లోకి వెళ్లండి. అక్కడ మీకేమైనా తెలియని యాప్‌లు కనిపిస్తున్నాయేమో చూడండి.» డివైజ్ అడ్మిన్ యాప్స్‌ని చెక్ చేసి, అక్కడ ఏయే పర్మిషన్లు హైలైట్ అయి ఉన్నాయో గమనించండి.» మాల్వేర్బైట్స్, లేదా అవస్త్ వంటి పేరున్న యాంటీ స్పైవేర్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోండి.» ఆ తర్వాత వైరస్ల కోసం పూర్తిగా స్కాన్ చెయ్యండి. కొత్త ఫైల్స్ ఏమైనా వచ్చి చేరాయా అని తెలుసుకోవటం కోసం డౌన్లోడ్ ఫోల్డర్స్ చెక్ చేయండి.» గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఆన్‌లో పెట్టుకోండి.మీది ఐఫోన్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి యాప్స్ పర్మిషన్స్ పరిశీలించాలి.» అక్కడి వి.పి.ఎన్. అండ్ డివైజ్ మేనేజ్మెంట్ ఆప్షన్లో అపరిచిత ఫైల్స్ ఉన్నాయేమో చూడాలి.» ముఖ్యంగా ఐఓస్ను అప్డేటెడ్గా ఉంచుకోవాలి. చాలావరకు స్పైవేర్లు సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని లోనికి ప్రవేశిస్తాయి.» సాధారణంగా యాపిల్‌లోని ‘వాల్డ్ గార్డెన్’ రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల స్పైవేర్ అంత ఈజీగా చొరబడలేదు. అలాగని స్పైవేర్ అటాక్ అసాధ్యం అని చెప్పలేం. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు పూర్తి నియంత్రణను, అధికారిక యాప్ స్టోర్ వెలుపల ఉన్న యాప్‌లను ఇన్ స్టాల్ చేసే సామర్థ్యాన్ని అందించడానికి ఫోన్ తయారీదారు విధించిన సాఫ్ట్వేర్ పరిమితులను తొలగించే ‘జైల్బ్రేక్’ మార్గాన్ని స్పైవేర్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.నివారణే ఉత్తమ పరిష్కారంస్పైవేర్ను గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ, దాన్ని నివారించడం మాత్రం సులభమే. అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్ స్టాల్ చేసుకోండి. ఎస్.ఎం.ఎస్., వాట్సాప్, లేదా ఈమెయిల్ నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని ‘జైల్బ్రేక్’ చేయకూడదు. అలా చేస్తే కీలకమైన భద్రతా కవచాలు తొలగిపోతాయి. అలాగే పటిష్టమైన, ఎవ్వరికీ ఊహకు కూడా అందని పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. సాధ్యమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. పబ్లిక్ వై–ఫైలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఓ ఫోన్‌ని తెరిచి పెట్టుకోకండి. ఫైళ్లు, సినిమాలు వంటి డౌన్లోడ్ చేయడం చేశారో.. మీ పని అయిపోయినట్టే. ఇక మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ని తొలగించి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను తిరిగి ఇన్ స్టాల్ చేయడం స్పైవేర్‌ను తొలగించడానికి మిగిలిన ఏకైక, ఉత్తమమైన మార్గం.కేంద్ర ప్రభుత్వ ఆందోళనడిజిటల్ గూఢచర్యానికి స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌లను సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు ఉన్నట్టే సోషల్ మీడియా సంస్థలకూ ఉండాలని కర్ణాటక హైకోర్టులో ‘ట్విట్టర్’ చేసిన వాదనలకు స్పందిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా డిజిటల్ గూఢచర్యం అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సెలబ్రిటీలు తమ కోసం వచ్చే సందర్శకులను ఫోన్లు బయటే పెట్టి రమ్మని విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి నేడు నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
మనకు బ్యూటిఫుల్ కాదు!
అమెరికాను మరింత గొప్ప (బిగ్)గా, మరింత చూడచక్కగా (బ్యూటిఫుల్)గా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ తెచ్చిన ‘ది వన్ బిగ్, బ్యూటిఫుల్’చట్టం అక్కడి భారతీయులకు పెను సమస్యగా మారేలా ఉంది. వలస, వలసేతర వీసాల ద్వారా అమెరికాలో కాలుపెట్టిన మనవాళ్లకు ఈ చట్టం సమస్యల స్వాగతం పలకడం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యంగా వేలాది భారతీయ అమెరికన్లకు వైద్య బీమా రక్షణ ఛత్రాన్ని ఈ చట్టం దూరం చేస్తోంది. శాశ్వత స్థిరనివాస హోదా అయిన గ్రీన్కార్డ్దారులకు కూడా ‘బ్యూటిఫుల్’కష్టాల నుంచి ఊరట దక్కడం లేదు. హెచ్–1బీ వీసాదారుతో పాటు విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చిన భారతీయులకు కూడా కొత్త చట్టం సమస్యాత్మకంగా మారుతోంది. ఏకంగా 20 లక్షల మంది భారత అమెరికన్లు దీని దెబ్బకు ఆరోగ్య బీమా సౌకర్యం కోల్పోయారు. ఖజానాపై ఏకంగా 1.7 లక్షల కోట్ల డాలర్ల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొత్త చట్టం తేవడం తెలిసిందే. ఉచితంగా, అన్యాయంగా వైద్య సేవలు, సాయం వాళ్లకు మాత్రమే కోతలు పెడతానని అమెరికా పౌరులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి వీసాపై అమెరికా వర్సిటీల్లో చదివే మనవాళ్లకు ఇన్నాళ్లూ కొనసాగిన వైద్య బీమా సదుపాయం ఎత్తేశారు. అది లేకపోతే అమెరికాలో వైద్య ఖర్చులకు చుక్కలు కనిపిస్తాయి. తమకిది పెను ఆర్థిక భారమేనని న్యూజెర్సీలోని రూత్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కాలేజీలో ఎలాగోలా నెట్టుకొస్తాం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుంది. ఆ వెంటనే ఉద్యోగం రాకుండా మరిన్ని ఇక్కట్లు తప్పవు’’అంటూ వాపోయారు. శరణార్థులకు అరిగోస! శరణార్థులుగా అమెరికాకు వచ్చిన వారిలో అత్యధికులు మెడిక్ఎయిడ్, ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ ప్రోగ్రాంతోనే లబ్ధి పొందుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం 2020లో 6,000 మంది భారతీయులు శరణార్థి హోదా పొందారు. 2023లో ఆ సంఖ్య 8 రెట్లు పెరిగి 51,000కు చేరింది. దాంతో శరణార్థుల్లో కొందరికే మెడిక్ఎయిడ్ను పరిమితం చేయాలని ‘బ్యూటిఫుల్’చట్టంలో పేర్కొన్నారు. మిగతా వారంతా వైద్య బీమాకు దూరం కానున్నారు. కనీసం 80,000 మంది భారత శరణార్థులకు బీమా సౌకర్యం దూరమవుతుందని చెబుతున్నారు. విద్యార్థులనూ కలుపుకుంటే కనీసం లక్ష మందికి పైగా భారతీయులు బీమాకు దూరమవుతున్నారు. బరాక్ ఒబామా హయాంలో గ్రీన్కార్డ్దారులు, శరణార్థులు, గృహహింస బాధితులు, హెచ్–1బీ వీసాదారులు, ఎఫ్–1 వీసా ఉన్న విద్యార్థులు ‘ఒబామాకేర్’పథకంలో భాగంగా వైద్య బీమా పొందేవాళ్లు. దీనికింద కుటుంబాలు, చిన్న వ్యాపారులకూ బీమా అందేది. వారికీ రెడ్ అలర్టే! గ్రీన్ కార్డు కేవలం శాశ్వతస్థిర నివాస హామీ మాత్రమే. అది లభించినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇవ్వరు. ట్రంప్ సర్కారు సరిగ్గా ఇదే పాయింటు పట్టుకుంది. పౌరసత్వంలేని వాళ్లకు మెడిక్ఎయిడ్ తెగ్గోయాలని చట్టంలో పేర్కొంది. తద్వారా గ్రీన్కార్డ్దారుల్లో అత్యధికులకు వైద్య బీమా ఎత్తేస్తోంది. మిగతా వారి అర్హతను కూడా ప్రతి ఆర్నెల్లకోసారి సమీక్షిస్తారు. ఆ లెక్కన త్వరలో వారికీ బీమా ఎత్తేయడం ఖాయమంటున్నారు. ‘నేను న్యూజెర్సీలో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను, నా భార్య కలిసి ఏటా 27,000 డాలర్లు పన్నుగా కడుతున్నాం. అయినా ట్రంప్ ప్రభుత్వం దృష్టిలో మేం తక్కువ పన్ను కడుతున్నట్టే లెక్క. నెలకు 450 డాలర్లున్న నా ఒక్కని నెలవారీ వైద్య బీమా ప్రీమియమే కొత్త చట్టంతో 1,200 డాలర్లకు పెరగనుంది’’అని సుహాస్ ప్రతాప్ అనే తెలుగు ఎన్నారై వాపోయారు. ఆయన హెచ్–1బీ వీసా మీద అమెరికాకు వచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్‌లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్‌తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్‌లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్‌ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్‌ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్‌లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్‌గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది. -
గాజా నేలమట్టం
డెయిర్ అల్ బలాహ్: గాజా స్వాదీన ప్రణాళికలను ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా అమలు చేస్తోంది. గత మార్చిలో కాల్పుల విరమణకు తెర దించిన నాటి నుంచీ గాజాపై భారీగా వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ అలా కూలిన భవనాలను కూడా తాజాగా నేలమట్టం చేస్తోంది. దాంతో రెండేళ్ల కిందిదాకా వేలాది మందితో కళకళలాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. దాడుల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది. నివాస భవనాలు, పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తోంది. తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ‘‘పౌర ప్రంతాల్లో హమాస్ ఉగ్ర సంస్థ ఆయుధాలను దాచింది. అందుకే వాటిని సైన్యం కూల్చేస్తోంది’’అని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) అంటోంది. కాల్పుల విరమణ తరువాత గాజాలో 40 ప్రదేశాల్లోని మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ఈజిప్టు సరిహద్దులో రఫా నగరంలో విధ్వంసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రఫాలోని అనేక ప్రాంతాలాను ఇజ్రాయెల్ సైనికులు, కాంట్రాక్టర్లు చదును చేశారు. ఏప్రిల్ నుంచి గాజాలో జరిగిన విధ్వంసంలో అత్యధికం ఈ ప్రాంతంలోనే చోటుచేసుకుంది. భవనాల కింద బాంబులు పెట్టి మరీ పేలుస్తున్నారు. అనంతరం బుల్డోజర్లతో ఆ ప్రాంతాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తున్నారు. రఫా నగరంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో ఒకటైన టెల్ అల్ సుల్తాన్‌లో ఓ పాఠశాలను కూల్చేసిన వీడియోను బీబీసీ విడుదల చేసింది. ఆ ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజాను సైతం ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. యుద్ధానికి ముందు ఈ పట్టణ జనాభా 11 వేలు. ఇక్కడ అత్యిధికం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. టమాటా, గోధుమలు, ఆలివ్ పంటలకు ప్రసిద్ధి చెందిన నేల. గత మే దాకా బాగానే ఉన్న ఆ పట్టణాన్ని జూన్ మధ్య నాటికి సగానికి సగం ఇజ్రాయెల్ కూల్చేసింది. ఏకంగా 1,200 భవనాలు విధ్వంసమయ్యాయి. అబాసన్ అల్ కబీరా పట్టణానిదీ అదే దుస్థితి! యుద్ధానికి ముందు 27,000 మంది నివసించిన ఈ పట్టణం మేలో బాగానే ఉంది. జూన్‌కు వచ్చేసరికి అక్కడి ముఖచిత్రమే మారిపోయింది. సగం పట్ట ణం ఆనవాలు లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌కు సరిహద్దుకు 7 కి.మీ. దూరంలో ఉన్న కిజాన్ అబు రష్వాన్లో కూడా విధ్వంసం జరిగింది. గత మార్చి దాకా పచ్చగా ఉన్న ఈ పట్టణం జూలై 4 నాటికి బూడిద కుప్పగా మిగిలింది. గాజాలో ఇజ్రాయెల్ కూల్చివేతల వేగం నానాటికీ పెరుగుతోంది! అమెరికా నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి డజన్ల కొద్దీ డీ9 బుల్డోజర్లు అందినట్టు అక్కడి మీడియా గత వారం తెలిపింది. కూల్చివేతల పనులకు కాంట్రాక్టర్లు కావాలంటూ ఫేస్బుక్లో పోస్టులు చేసింది. మే నుంచి వారిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకుంటోంది. శిథిలాలపై మానవతా నగరి! రఫా శిథిలాలపై మానవతా నగరాన్ని నిర్మిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. 6 లక్షల మంది పాలస్తీనియన్లకు అక్కడ ఆవాసం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికలపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది మానవతా నగరం కాదని, నిర్బంధ శిబిరమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎముద్ ఓల్మెర్ట్ అన్నారు! శాపాలస్తీనా ప్రజలు కొంతకాలానికి తిరిగొచ్చినా స్వస్థలంలో ఏమీ మిగల్లేదనే నిరాశతో తిరిగి వలస వెళ్లేలా చేయడమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాలస్తీనా ప్రజలు గాజాకు తిరిగి రాకుండా చేయడమే అసలు ప్రణాళిక అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఆ దేశ ఎంపీల బృందంతో అన్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాన్.. పాన్.. పాన్..
పాన్.. పాన్.. పాన్.. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలోని పైలట్ చాలా టెన్షన్‌తో అన్న మాట ఇది..వెంటనే ముంబై ఎయిర్‌పోర్టులో స్టాండర్డ్ ఎమర్జెన్సీ చర్యలను చేపట్టారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక దళం రన్‌వే వద్దకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 9.53 గంటలకు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 9.27 గంటల సమయంలో విమానం ఇంజన్–1లో సమస్య తలెత్తడంతో దాన్ని గుర్తించిన పైలట్.. ‘పాన్.. పాన్.. పాన్’ అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్లు అధికారులు తెలిపారు.పాన్ అంటే..?పాన్.. పాన్.. పాన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించే రేడియో కాల్. తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్ ఇది. ప్రాణాపాయం లేనప్పటికీ.. ఇది అర్జంట్.. దీనిపై వెంటనే దృష్టి సారించాలి అన్నది ఆ కాల్ అర్థం. విమానంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, ఇంజన్లలో సమస్యలు, తక్కువ ఇంధనం ఉండటం, తీవ్రత తక్కువ ఉండే మెకానికల్ సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. అంటే పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కాదు.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ స్టాఫ్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ‘పాన్’ కాల్ అలర్ట్ చేస్తుంది. పాన్ అనేది పాన్న్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం బ్రేక్‌డౌన్.మేడే.. మేడే.. మేడే..మేడే మేడే మేడే అని పైలట్ అన్నాడంటే.. తక్షణ ప్రాణాపాయం.. పూర్తిస్థాయి ఎమర్జెన్సీ అని అర్థం. అత్యవసర సాయం అందాలి. అన్ని రకాల సహాయక సిబ్బంది రంగంలోకి దిగాలి. వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వాలి. రన్‌వేపై దీనికి అడ్డు లేకుండా.. మిగిలిన విమానాలను తొలగించాలి. ఇంజన్లు మొత్తంగా ఫెయిల్ అయినప్పుడు, విమానంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, లో క్యాబిన్ ప్రెషర్(దీని వల్ల లోపల ఆక్సిజన్ తగ్గిపోతుంది), తీవ్రమైన మెకానికల్ సమస్య తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. మేడే అన్నది మేడి అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం నాకు సహాయం చేయండి అని.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మేడే మేడే మేడే అని అంటూ పైలట్ అత్యవసర సాయం కోసం అర్థించిన విషయం తెలిసిందే. మూడు సార్లు ఎందుకువిమాన, సముద్రయానాల్లో ఇదో ప్రామాణిక పద్ధతి. స్పష్టంగా వినిపించడం కోసం.. అర్థం చేసుకోవడం కోసం మూడుసార్లు చెబుతారు. అలాగే రెగ్యులర్ సంభాషణకు దీనికి మధ్య తేడాను గుర్తించడానికి.. పరిస్థితిని మామూలుగా తీసుకోకుండా వెంటనే స్పందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల పాన్‌కు బదులు మేడే అని.. మేడేకి బదులు పాన్ అని అపార్థం చేసుకునే ప్రమాదాన్ని కూడా నివారించినట్లు అవుతుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు. కొత్తగా అప్డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ జలపాతాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు!
చుట్టూ పచ్చని కొండలు.. గిరులపై నుంచి జాలువారే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వీటిని తిలకించేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న సందర్శకులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. డుడుమ జలపాతం 558 అడుగుల పైనుంచి మంచుతెరల మధ్య జాలు వారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. అల్లూరి జిల్లా మంచంగిపుట్టు మండలంలోని కుమడ పంచాయతీలో జడిగూడ జలపాతం కనువిందు చేస్తోంది. ముంచంగిపుట్టు– పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం ఎత్తయిన గిరులపై నుంచి జాలువారుతూ పాలనురగను తలపిస్తోంది. బరడ పంచాయతీ పరిధిలో హంశబంద, జర్జుల పంచాయితీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బూసిపుట్టు పంచాయతీ, సంతవీధి, దోనిపుట్టు గ్రామాల దగ్గర నెమలి జలపాతాలు ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని రంగినిగూడ జలపాతం ఉరకలు వేస్తూ కనువిందు చేస్తోంది. వీటి అందాలను తిలకించేందుకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు.వసతుల్లేక నరకంజలపాతాల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు రహదారి, కాటేజీల సౌకర్యం లేక, తినేందుకు ఆహారం దొరక్క నరకం చూస్తున్నారు.తారాబు జలపాతానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి బూసిపుట్టు మీదుగా గుంజువాడ చేరుకోవాలి. అక్కడి నుంచి జలపాతం వద్దకు రెండు కిలోమీటర్ల పొడవునా బురదలోంచి వెళ్లాలి. జలపాతం దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు కర్రలు ఏర్పాటుచేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడికి చేరుకుంటున్నారు. బూసిపుట్టు నుంచి పిట్టలబుర్ర వరకు రోడ్డు మంజూరైంది. పనులు మొదలుపెట్టి వదిలేశారు. జడిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి కుమడ చేరుకోవాలి. అక్కడ నుంచి భల్లుగుడ మీదుగా కిలోమీటరు మేర కాలినడకన వెళ్లాలి. తుప్పల మయంగా ఉండటంతో సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ స్థానికులు కొంతమేర రహదారి మార్గాన్ని రాళ్లతో మెరుగుపరిచారు. రంగినిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి లక్ష్మీపురం మీదుగా రంగినిగూడ వెళ్లాలి. అక్కడి నుంచి అరకిలోమీటరు దూరంలో ఉన్న జలపాతం వద్దకు వెళ్లేందుకు రహదారి లేదు. నెమలి జలపాతాలకు ముంచంగిపుట్టు నుంచి సరియాపల్లి మీదుగా వెళ్లాలి. అడవిమార్గంలో మూడు కిలోమీటర్ల మేర నడిచి కొండలపై నుంచి వెళ్లాలి. ఇబ్బందులు తప్పడం లేదు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డుడుమ, తారాబు జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ల సంఖ్య గత కొద్ది నెలలుగా పెరిగాయి. పర్యాటకులు ఉండేందుకు కాటేజీలు, జలపాతాలకు వెళ్లేందుకు రహదారులు లేవు. దీనివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటిని అందుబాటులోకి తెస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. – బాయన నాథ్, పర్యాటకుడు, విశాఖపట్నంకనీస వసతులు కరువు ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చాలా జలపాతాలు ఉన్నాయి. ప్రతి రోజు వీటిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. తారాబు,డుడుమ జలపాతాల వద్ద సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే కనీస వసతులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు సౌకర్యాలు కల్పిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – గంపరాయి అనిల్, ఫొటోగ్రాఫర్, ముంచంగిపుట్టుచదవండి: వానాకాలంలోనూ నీటి కోసం విలవిల -
ముగ్గురి డీఎన్ఏతో ముద్దుల పిల్లలు
వేలాది మంది మహిళలను మాతృత్వానికి దూరం చేస్తున్న మైటోకాండ్రియా సంబంధిత వంశపారంపర్య వ్యాధులకు బ్రిటన్‌లో జీవ శాస్త్రజ్ఞులు వినూత్న మార్గం ద్వారా చెక్ పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి డీఎన్ఏ సాయంతో శిశువుల పుట్టుకను సుసాధ్యం చేసి చూపించారు. వంశపారంపర్యంగా పిల్లలు మైటోకాండ్రియా లోపాలతో పుడుతున్న కుటుంబాలకు ఇది అక్షరాలా వరప్రసాదంగా మారింది. ఈ పద్ధతిలో బ్రిటన్‌లో ఇటీవలే తొలిసారిగా తొమ్మిది మంది పండంటి పాపాయిలు జన్మించారు. వీరిలో నలుగురు బాబులు కాగా ఐదుగురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు కవలలు కావడం విశేషం. తమ కుటుంబాలకు తరతరాల శాపంగా పరిణమించిన ప్రాణాంతమైక మైటోకాండ్రియా లోపాలేవీ లేకుండా వారంతా పూర్తి ఆరోగ్యంతో పుట్టడం విశేషం! దీన్ని వైద్య చరిత్రలోనే కీలక మైలురాయిగా భావిస్తున్నారు. మైటో లోపాలుంటే అంతే... మైటోకాండ్రియా లోపాలతో పుట్టే పిల్లల్లో జీవక్రియలకు కావాల్సిన ఎలాంటి శక్తీ ఉండదు. చివరికి కనీసం గుండె కొట్టుకోవడానికి అవసరమైన శక్తి కూడా ఒంట్లో లేకుండా పోతుంది. దాంతో కండరాలు అత్యంత శక్తిహీనంగా మారతాయి. దాంతో మెదడు దెబ్బ తినడం మొదలుకుని గుడ్డితనం దాకా నానారకాల వ్యాధుల బారిన పడతారు. చాలా కేసుల్లో ఇలాంటి పిల్లలు బతికి బట్టకట్టడం కూడా గగనమే. రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడి తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగులుస్తుంటారు. ఇంతటి విపత్తుకు కారణమయ్యే మైటోకాండ్రియా లోపాలు అత్యధిక కేసుల్లో తల్లి నుంచే నవజాత శిశువుకు సంక్రమిస్తుంటాయి. ప్రతి 5,000 మంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యలతో పుడుతుంటారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఏటా కనీసం 20 నుంచి 30 మంది దంపతులు ఈ సరికొత్త చికిత్స విధానంతో సంతానపు కలను నిజం చేసుకోనున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా సరిచేశారు... బ్రిటన్ జీవ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన కొత్త విధానంలో పాపాయిలు తమ డీఎన్ఏలో అత్యధిక శాతాన్ని తల్లిదండ్రుల నుంచే పొందుతారు. కాకపోతే దాతగా వ్యవహరించే మరో ఆరోగ్యకరమైన మహిళ నుంచి అత్యల్ప పరిమాణంలో, అంటే 0.1 శాతాన్ని అందుకుంటారు. మైటోకాండ్రియా పిల్లలకు కేవలం తల్లి నుంచే అందుతుంది. ఈ సరికొత్త డీఎన్ఏ తల్లి ద్వారా వంశపారంపర్యంగా వచ్చే మైటోకాండ్రియా లోపాలను పూర్తిస్థాయిలో అరికడుతుంది. తద్వారా పిల్లలు పూర్తి ఆరోగ్యంతో పుడతారు. సదరు డీఎన్ఏ మార్పు వారి వారసులందరికీ పారంపర్యంగా అందుతూ వెళ్తుంది. మైటోకాండ్రియా...కణంలో శక్తి భాండాగారం స్తూపాకృతిలో ఉండే మైటోకాండ్రియా సులువుగా అర్థమయేలా చెప్పాలంటే ఒక సూక్ష్మ కణాంగం. కణంలో జరిగే అనేకానేక జీవక్రియలకు అవసరమైన శక్తినంతటినీ సిద్ధం చేసి పెట్టేది ఇదే. అందుకే మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి భాండాగారమని చెబితే అతిశయోక్తి కాదు. అసలు మనం శ్వాసిస్తున్నామంటే అందుకు కారణం కూడా మైట్రోకాండ్రియానే. తినే ఆహారాన్ని ఇది శరీర క్రియలు జరిగేందుకు కావాల్సిన శక్తిగా మారుస్తుంది. అందుకోసం ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. పాక్షిక స్వయంప్రతిపత్తితో పని చేయడం వీటి ప్రత్యేకత. ఇవి రెండు పొరలతో కూడుకుని ఉంటాయి. చూసేందుకు ఇవి అచ్చం కణత్వచాన్ని తలపిస్తాయి.పదేళ్ల ముందే కనిపెట్టినా... నిజానికి ఈ ‘ముగ్గురి డీఎన్ఏ’ పద్ధతిని బ్రిటన్‌లోని న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయానికి చెందిన టైన్ హాస్పిటల్స్, ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ జీవ శాస్త్రవేత్తలు పది సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. భార్య అండంతో పాటు దాతగా వ్యవహరించే మరో ఆరోగ్యకరమైన మహిళ నుంచి సేకరించిన అండాన్ని కూడా భర్త వీర్యంతో లేబోరేటరీలో విడిగా ఫలదీకరణ చెందిస్తారు. అనంతరం రెండో పిండంలోని ఆరోగ్యకరమైన మై టోకాండ్రియాను భార్య పిండంలోకి చొప్పిస్తారు. తద్వారా పుట్టే పాపాయి జన్యుపరంగా తల్లిదండ్రుల లక్షణాలనే పుణికి పుచ్చుకుంటుంది. కానీ మైటోకాండ్రియా లోపా లేవీ లేకుండా ఆరోగ్యకరంగా పుడుతుంది.బ్రిటన్‌లోనే అనుమతి ఈ ‘ముగ్గురి డీఎన్ఏ’ విధానానికి ప్రస్తుతం కేవలం బ్రిటన్‌లో మాత్రమే అనుమతి ఉంది. ఈ మేరకు 2015 సంవత్సరంలోనే అక్కడి పార్లమెంట్ ఓ చట్టాన్ని ఆమోదించింది. కానీ ఇలా పుట్టే పిల్లల్లో 0.1 శాతం వేరే మహిళ డీఎన్ఏ ఉంటుంది. అది ముందు తరాలకు కూడా అవిచ్చిన్నతంగా అందుతూ వెళ్తుంది. మరోలా చెప్పాలంటే సదరు కుటుంబపు డీఎన్ఏలో శాశ్వత మార్పు లు చోటుచేసుకుంటాయి. దాంతో ఈ పద్ధతిపై అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాకిది కొత్త జీవితం ‘‘ఆరోగ్యకరంగా పిల్లలను కనడం ఈ జన్మకు సాధ్యం కాదన్న నిశ్చయానికి వచ్చి భారంగా బతుకీడుస్తున్నాం. ఎట్టకేలకు మా పాలిట వరప్రసాదంలా ఈ కొత్త తరహా చికిత్స అందివచ్చింది. పూర్తి జీవశక్తితో కళకళలాడుతూ ముద్దులు మూటగడుతున్న మా బుజ్జాయిని చూస్తుంటే ఆనందంతో నోటమాట కూడా రావడం లేదు. ఇది నిజమంటే ఇప్పటికీ ఓ పట్టాన నమ్మబుద్ధే కావడం లేదు’’ – ‘ముగ్గురి డీఎన్ఏ’ పద్ధతిలో పాపను కన్న మహిళల హర్షాతిరేకాలు (గుర్తింపును గోప్యంగా ఉంచేందుకని వారు తమ వివరాలను బయటపెట్టలేదు) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్‌గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్‌స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్‌నగర్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, హైటెక్‌సిటీ, కొత్తపేట్, కర్మాన్‌ఘాట్‌లలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్‌ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్‌గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్‌పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
ధరణిని దాటి శుక్రుడిని చూసి..
అప్పగించిన పనిచేయకుండా ఆవారాగా తిరిగితే ఎవరైనా తిడతారు. కానీ చెప్పిన పని చేస్తూనే మరో కొత్త విషయాన్ని కనిపెట్టినందుకు ప్రశంసలను అందుకున్నాయి రెండు జపాన్ ఉపగ్రహాలు. భూవాతావరణ విశేషాలను రాబట్టేందుకు ప్రయోగించిన హిమవరీ–8, హిమవరి–9 కృత్రిమ ఉపగ్రహాలు చివరకు శుక్ర గ్రహ మేఘావృత ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను వెల్లడించి ఇప్పుడు శెభాష్ అనిపించుకున్నాయి. శుక్రగ్రహం మీది వాతావరణ తరంగాల్లో మార్పులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవి సేకరించాయి. దశాబ్దకాల డేటా.. బిర్లాటెంపుల్ ముందు ఒక పేద్ద కుటుంబం ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు దిగుతుందనుకుందాం. అప్పుడు సమీపంలో గుర్తు తెలియని పిల్లాడు ఉంటే అతను ఈ ఫొటోలన్నింటిలోనూ పడతాడు. అతని హావభావాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అచ్చం అలాగే భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భూ వాతావరణ ఫొటోలు తీసేందుకు జపాన్ హిమవరి–8 ఉపగ్రహాన్ని 2014లో, హిమవరి–9 అనే ఉపగ్రహాన్ని 2016లో నింగిలోకి పంపింది. ఇవి 2015 నుంచి ఇప్పటిదాకా వేలాది ఫొటోలను తీశాయి. అయితే వీటిని గమనించగా అన్ని ఫొటోల్లోనూ ఒక మూలగా శుక్రుడు సైతం కనిపించాడు. దీంతో ఈ పదేళ్లకాలంలో శుక్రుని వాతావరణ మార్పుల వివరాలను సేకరించేందుకు సువర్ణావకాశం లభించింది. ఇది సువర్ణావకాశం ఎందుకంటే భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా శుక్రుడిని గమనించాలంటే భూవాతావరణం అంతగా అనుకూలించదు. పైగా అదే సమయంలో సూర్యుడి దేదీప్యమానమైన కాంతి ప్రభావం శుక్రునిపై ఉంటుంది. దాంతో భూమి నుంచి శుక్రుడిని గమనించడం కష్టం. ఇప్పటికే శుక్రుడి సంబంధింత వర్ణ తరంగధైర్ఘ్య సమాచారం సైతం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో అనుకోకుండా రెండు వాతావరణ ఉపగ్రహాల డేటాలో చిక్కిన శుక్రుని వివరాలు ఇప్పుడు ఆ గ్రహ వాతావరణంపై పరిశోధనకు అక్కరకొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు శుక్రునిపై మందపాటి కార్భన్‌డయాక్సైడ్ వాతావరణం పరుచుకుని ఉంటుంది. పైగా ఆకాశం సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలలతో కప్పబడి ఉంటుంది. గత పదేళ్లుగా హిమవరి 8, 9 ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు విశ్లేíÙంచారు. మల్టీస్పెక్ట్రల్ హిమవరి ఇమేజర్స్ సాయంతో రోజువారీగా, సంవత్సరాలవారీగా వాతావరణ మార్పులను సరిపోల్చిచూశారు. ‘‘గతంలో ఏ ఉపగ్రహాన్ని ఇలా పదేళ్లపాటు నిరాటంకంగా పరిశీలించలేదు. భూమి కోసం ఉద్దేశించిన ఉపగ్రహాలు అనుకోకుండా ఇలా శుక్రుని డేటాను ఒడిసిపట్టాయి. శుక్రుని వాతావరణంలో సూర్యకాంతి పరావర్తనం, గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వివరాలు తెల్సుకునేందుక ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉష్ణ తరంగాల్లో మార్పులనూ తెల్సుకోవచ్చు’’అని పరిశోధనలో కీలక రచయిత అయిన గక నిషయమ చెప్పారు. ‘‘విభిన్న తరంగధైర్యాలతో విస్తరించే పరారుణ కాంతిని ఒడిసిపట్టేందుకు హిమవరి శాటిలైట్లలోని సెన్సార్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మరో నాలుగేళ్లపాటు ఇవి సేవలందిస్తాయి. 2030దాకా ఏ దేశం కూడా శుక్రుని వాతావరణ పరిశోధన కోసం ప్రత్యేక ప్రాజెక్ట్చేపట్లేదు. ఈ నేపథ్యంలో హిమవరి శాటిలైట్ల తదుపరి డేటా సైతం కీలకంగా మారనుంది’’అని నిషయమ చెప్పారు. పరిశోధకులు 437 భిన్న వాతావరణ పరిస్థితుల్లో శుక్రునిపై మేఘాల పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. శుక్రుడు, భూమి వేర్వేరు కోణాల్లో సమీపానికి వచి్చనప్పుడు శుక్రుని వాతావరణంలో జరిగే మార్పులను తెల్సుకునేందుకు ఇప్పుడు అవకాశం చిక్కింది. హిమవరి అంటే జపాన్ భాషలో పొద్దుతిరుగుడు పువ్వు అని అర్థం. నిరంతరంగా భూమిని పరిశీలిస్తూ భూ స్థిర కక్ష్యలో తిరుగుతాయని, అందుకు గుర్తుగా ఈ పేరు ఎంపికచేసినట్లు ఆనాడు జపాన్ ప్రకటించింది. -
శుభ సప్తకం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించారు. యాగ్జియం –4 మిషన్‌లో భాగంగా శుభాంశు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగియటంతో ఇక ఇప్పుడు – ఐఎస్ఎస్లో ఉన్న ఈ 18 రోజుల్లోనూ ఆయన జరిపిన 7 ప్రధాన ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఇవి ఎంతో ఉపయుక్తమైనవి కావటం వలన కూడా ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో వివిధ జీవ, భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వంటి ప్రసిద్ధ భారతీయ పరిశోధన సంస్థలు రూపొందించిన ఆ ప్రయోగాలు ఏమిటో చూద్దాం. 1 టార్డిగ్రేడ్ ఏంటివి?: టార్డిగ్రేడ్లు అంటే నీటి ఎలుగు బంట్లు. ఎనిమిది కాళ్లుండే సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కువ కాలం జీవించగలవు. ఏంటి ఉపయోగం?: టార్డిగ్రేడ్లు అంతరిక్షంలో ఎలా మనుగడ సాగిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల అంతరిక్ష కార్యకలాపాల్లో వ్యోమగాముల రక్షణకు కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. శుభాంశు అంతరిక్షంలో భారత జాతి టార్డిగ్రేడ్లపై అధ్యయనం చేసి, అవి ఎలా మనుగడ సాగిస్తాయో, పునరుత్పత్తి చేస్తాయో, సూక్ష్మ గురుత్వాకర్షణకు (మైక్రోగ్రావిటీ) ఎలా స్పందిస్తాయో, రోజులు గడుస్తున్నకొద్దీ వాటిలో వచ్చే మార్పులు (ఏజింగ్ ప్యాటర్న్స్) పరిశీలించారు. ఈ అధ్యయనం వల్ల రక్షణ వ్యూహాలే కాకుండా.. అంతరిక్షంలో ఆహారాన్ని, జీవ నమూనాలను ఎలా నిల్వ చేయవచ్చో తెలుస్తుంది.2 మయోజెనిసిస్ఏంటిది?: మయోజెనిసిస్ అంటే కండరాల్లోని కణాల అభివృద్ధి/పెరుగుదల. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గుతుంటుంది. తద్వారా కండరాలు బలహీనమవుతాయి.ఏంటి ఉపయోగం?: కండరాల్లో కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణలో అధ్యయనం చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో, వాటిలో వచ్చే మార్పులేమిటో శుభాంశు నిశితంగా పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో కండరాల్లో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గకుండా నివారణోపాయాలను కనిపెట్టటానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.3 విత్తనాల పెరుగుదలఏంటిది?: అంతరిక్షంలోకి శుభాంశు పెసర, మెంతి విత్తనాలు తీసుకెళ్లి ట్రేలలో వాటిని ఉంచారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురు త్వాకర్షణ ప్రభావం మొలకలపైనా, విత్తనాల పెరుగుదలపైనా ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మొక్కలను పెంచడం వల్ల దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాము లకు స్థిరమైన ఆహార వనరు లభిస్తుంది.4 సైనోబ్యాక్టీరియాఏంటివి?: సైనోబ్యాక్టీరియా అనేవి ఆక్సిజన్‌ను, పోష కాలను ఉత్పత్తి చేయగల సూక్ష్మజీ వులు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై మొట్టమొదట ప్రాణ వాయువును ఉత్పత్తి చేసిన జీవులు ఇవి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సైనో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం ‘బయో రీజెనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ’లను అభివృద్ధి చేయవచ్చు. ఉన్న వనరులను రీ సైకిల్ చేసి ఆక్సిజన్, నీరు, ఆహారం వంటి వనరులను తయారు / ఉత్పత్తి చేయటం ద్వారా అంతరిక్షంలో మానవ మనుగడకు సహాయం చేసే కృత్రిమ వ్యవస్థలే ఈ బయో రీజెనరేటివ్ వ్యవస్థలు. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.5 మైక్రో అల్గేఏంటివి?: మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ, ఏకకణ జల జీవులనే సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) అంటారు. ఇవి పోషకాలను అందించగల ఆహారంగా స్వీకరించతగిన సూక్ష్మజీవులు. అలాగే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన బయో ఇంధనంగానూ ఉపయోగపడతాయి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సూక్ష్మ శైవలాలు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడం, వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ అధ్యయన లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని భావిస్తున్నారు.6 పంట విత్తనాలుఏంటిది?: ఈ ప్రయోగం ఆహార పంటల విత్తనాలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించింది. ఏంటి ఉపయోగం?: శుభాంశు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పంట విత్తనాల పెరుగుదల, దిగుబడులపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధానాలను తెలుసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపకరిస్తాయి. 7 వాయేజర్ డిస్ప్లేలుఏంటివి?: కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు. ఈ ప్రయోగంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, వాటి వాడకం వల్ల వ్యోమగాములపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శుభాంశు విశ్లేషించారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వ్యోమగాముల కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎన్ని గంటల పాటు వాటిని వినియోగించవచ్చు, అంతరిక్ష అవసరాల కోసం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కావాలి.. వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుంది. -
నాటోకు ఆ అధికారం ఎక్కడిది?
ప్రతిరోజూ మారుతున్న రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకోవడం, హెచ్చరికలు చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే ఏకంగా ఒక దేశంపై ఎలాంటి అంతర్జాతీయ అధికారిక అర్హతలు లేని వ్యక్తి సుంకాల సుత్తితో మోదుతానని, ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అన్ని దేశాలతో మైత్రీభావంతో మెలిగే భారత్‌ను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సెక్రటరీ జనరల్ హెచ్చరించడం అందరికీ విస్మయం కల్గిస్తోంది. కొన్ని దేశాలకే పరిమితమైన ఒక సైనిక కూటమికి సార్వభౌమ, గణతంత్ర దేశాన్ని హెచ్చరించే దమ్ము ఎక్కడిది? అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. నాటో సభ్య దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతినేలా దుస్సాహసానికి తెగించిన నాటో చీఫ్ మార్క్ రుట్టేపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత వాణిజ్య విధానాలను ప్రశ్నించే అధికారం నాటోకుగానీ, నాటో చీఫ్కుగానీ అస్సలు లేదని అంతర్జాతీయ నిపుణులు సైతం బల్లగుద్ది చెబుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష అధికారం నాటోకు లేదు నాటో అనేది కేవలం ఉత్తర అట్లాంటిక్ ఖండంలోని కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే. ప్రపంచదేశాలు కుదుర్చుకుని పొరుగు, స్నేహపూర్వక దేశాలతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాల్లో నాటోకు ఎలాంటి ప్రమేయం, హక్కులు ఉండవు. సార్వభౌమత్వాన్ని సంతరించుకున్న భారత్ ఏ దేశంతో వాణిజ్యంచేసినా అది పూర్తి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం. ఇందులో జోక్యంచేసుకునే కనీస హక్కు, అర్హత నాటోకు లేదు. నాటో తన పరిధి దాటి ప్రవర్తిస్తోందని అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ విధానాలకు నాటో తలొగ్గిందనేది బహిరంగ రహస్యం. మరోవైపు చైనా, భారత్ సారథ్యంలో మరింత పటిష్టమవుతున్న బ్రిక్స్ కూటమి ఇప్పుడు అంతర్జాతీయ మారకమైన డాలర్ ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవొచ్చనే భయాందోళనలు అమెరికాను వెంటాడుతున్నాయి. అందుకే నాటోతో ఇలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేయిస్తోందని భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీఓ) ఉండనే ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధుల్లోకి నాటో ఎందుకు తలదూర్చుతోందన్న విమర్శలు మొదలయ్యాయి. భారత్‌కు శాంతి సందేశాలు అక్కర్లేదు వేల సంవత్సరాల చరిత్రలో ఏనాడూ తనంతట తానుగా ఏ దేశం మీదా దండయాత్రకు దిగని దేశంగా భారత్ ఘనత సాధించింది. గతేడాది ఆగస్ట్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడిన మరుసటి రోజే పుతిన్‌తో మోదీ మాట్లాడి శాంతి ఒప్పందం చేసుకోవాలని సూచించిన విషయం తెల్సిందే. శాంతికాముక దేశంగా పేరొందిన భారత్‌కు ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో శాంతి ప్రబోధాలు నాటో వంటి సైనికకూటమి నుంచి వినాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ దౌత్యరంగ నిపుణులు చెప్పారు. భారత ఇంధన విధానాలు సర్వస్వతంత్రం ఏ దేశమైనా తమ ఇంధన అవసరాలకు తగ్గట్లు విదేశాంగ విధానాలను అవలంభిస్తుంది. భారత్ సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. ఫలానా దేశం(రష్యా) నుంచి మీరు ముడిచమురు, సహజవాయువు కొనడానికి వీల్లేదనే హక్కు నాటోకు లేదు. అందులోనూ వలసరాజ్యంగా కాకుండా పూర్తి సార్వభౌమత్వం ఉన్న భారత్‌ను ఒక సైనికకూటమి ఎలా ఇలాంటి ఆర్థికపర సూచనలు చేస్తుందన్న ప్రశ్నకు నాటో సభ్య దేశాల నుంచి సమాధానం లేదు. పునర్వినియోగ ఇంధన వనరులతో ఇంధన రంగంలో స్వయం సమృద్ది ఆత్మనిర్భరత దిశగా వెళ్తున్న భారత్ మరోవైపు భిన్న దేశాల నుంచి ముడిచమురు, సహజవాయువులను దిగుమతిచేసుకుంటోంది. రష్యా, అమెరికా మొదలు పశి్చమాసియా, ఆఫ్రికా దాకా వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి దిగుమతిచేసుకుంటోంది. భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక కూటమికి ఆ అధికారం ఎక్కడిది? అని పలువురు నిపుణులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. భారత్ గనక నాటో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటే నాటోసభ్యదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో దౌత్యబంధానికి స్వల్ప బీటలుపడే అవకాశం ఉంది.సైనిక కూటమికి వాణిజ్యంతో పనేంటి? ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో వేలుపెట్టి, బలవంతపు ఆదేశాలు జారీ చేసే హక్కు నాటోకు లేదు. తమ దేశాల రక్షణే లక్ష్యంగా ఏర్పడిన ఒక కూటమి(నాటో) ఇప్పుడు విదేశాల పరస్పర వాణిజ్య సంబంధాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమెరికా స్వప్రయోజనాలు కాపాడే డమ్మీ వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయిందని విమర్శలు పెరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వానాకాలంలోనూ నీటి కోసం విలవిల
సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్‌గా నలు దిక్కులా విస్తరిస్తున్న నగరాన్ని జలఘోష వెంటాడుతోంది. వేసవిలోనే కాదు.. వానా కాలంలో సైతం నిత్యావసరాలకు వినియోగించే నీటి కోసం విలవిలలాడే దుస్థితి నెలకొంది. అడుగడుగునా కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో భూమిలో వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. విచ్చలవిడిగా వందల మీటర్ల లోతుతో బోర్ల తవ్వకాలు నీటి మట్టాన్ని పాతాళంలోకి నెట్టేశాయి. తాజాగా తక్కువ వర్షాలతో భూగర్భజలాలు పైకి రాని పరిస్థితి నెలకొనడంతో ట్యాంకర్లపై ఆధారపడక తప్పడం లేదు. బహుళ అంతస్తు భవన సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీల నుంచి ట్యాంకర్లకు తాకిడి పెరిగింది. జలమండలి శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు శుద్ధి చేయని నీటిని సరఫరా చర్మ వ్యాధులకు గురి చేస్తోంది. బావురుమంటున్న బోర్లు.. బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరంలో సుమారు 3.29 లక్షల వరకు చిన్నా.. పెద్దా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలుండగా ఇందులో సుమారు 72 వేల సముదాయాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కేవలం నిత్యావసర నీటికి డిమాండ్ పెరగడంతో వేసవి మాదిరిగానే రోడ్లపై ట్యాంకర్ల పరుగులు కనిపస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో వేలాది సముదాయలకు వాటర్ బోర్డు నల్లా కనెక్షన్లు లేవు. బోరు బావుల్లో నీటి మట్టం పెరగకపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. 36 శాతం పెరిగిన బుకింగ్ జలమండలికి ఈ నెలలో ట్యాంకర్ తాకిడి బాగా పెరిగింది. గతేడాది జూలై మొదటి రెండు వారాలతో పోల్చితే 36 శాతం బుకింగ్ పెరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం 22 డివిజన్ పరిధిలో గతేడాది 63,724 ట్యాంకర్లు బుకింగ్ జరిగితే ఈసారి 86,520 ట్యాంకర్లు బుకింగ్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శివారు ప్రాంతల్లో 23 నుంచి 51 శాతం పెరగగా, ఎల్బీనగర్ పరిధిలో మాత్రం ఐదింతల ట్యాంకర్ల తాకిడి పెరిగింది. నారాయణగూడ డివిజన్లో 51 శాతం, పాత బస్తీలోని చార్మినార్, రియాసత్ నగర్ డివిజన్ పరిధిలో గతేడాది కంటే 117 నుంచి 257 శాతం పెరగడాన్ని బట్టి భూగర్భ జలాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోజువారీగా 5 వేల నుంచి 6 వేల ట్యాంకర్లు బుకింగ్ జరుగుతోంది. మొత్తమ్మీద దాదాపు 14.06 లక్షలకు పైగా కనెక్షన్లు ఉండగా.. అందులో కేవలం 42 వేల గృహ సముదాయాల నుంచి మాత్రమే వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఉంటుందని జలమండలి పేర్కొంటోంది. సుమారు 500 గృహ సముదాయాలు వేసవిలో 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేయగా, మిగిలిన 41,500 వేల సముదాయాలు 90 శాతం అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్లకు కాసుల పంట ప్రజల నీటి అత్యవసరం ప్రైవేట్ జల వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. వాటర్‌బోర్డు ట్యాంకర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ.. సరఫరాలో కొద్ది జాప్యం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. ఖాళీ ప్లాట్లతో పాటు చెరువుల సమీప స్థలాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు. నీరు నిత్యావసరం కావడం.. ట్యాంకర్ దొరికితే చాలన్న గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఎంత ధరయినా పెట్టి ట్యాంకర్లు తెప్పించుకోవడం సర్వసాధారణమైంది. వాటర్‌బోర్డు కస్టమర్ అకౌంట్ నంబర్ (సీఏఎన్) ద్వారా 5000 లీటర్ల వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసిన వారికి రూ.500కు లభిస్తోంది. సీఏఎన్ లేనివారికి అదే ట్యాంకర్‌ను రూ.850కు సరఫరా చేస్తోంది. అదే ట్యాంకర్‌ను ప్రైవేటులో తెప్పించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి, అత్యవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.వర్షాభావ పరిస్థితులతో.. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. సాధారణ వర్షపాతం సగటున సగం కూడా నమోదు కాకపోవడంతో భూగర్భజలాల పెరుగుదల లేకుండా పోయింది. గత నెలలో సాధారణ వర్షపాతం 40 శాతం మించకపోగా, ఈ నెలలో సైతం అదే పరిస్థితి పునరావృతమతోంది. వేసవి కంటే ముందు అడుగంటిన నీటి మట్టంలో వృద్ధి కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 8.3 సెంటీ మీటర్లకు మించలేదు. రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా.. నగర శివారులోని ఎనిమిది అర్బన్ మండలాల్లో 30 నుంచి 40 శాతం కూడా నమోదు కాలేదు. మేుడ్చల్– మల్కాజిగిరి జిల్లా సాధారణ వర్షపాతం (Rainfall) 56 శాతం తక్కువగా నమోదైంది. వేసవిలో సుమారు 10 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు చేరాయి. తాజా వర్షాభావ పరిస్థితులతో పలు ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్ల నుంచి సైతం నీటి చుక్కనీరూ పైకి రావడం లేదు.ఇంకుడు గుంతలు తప్పనిసరి.. భూగర్భ జలాల పెంపునకు 300 గజాలపైగా ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి. ఇప్పటికే సర్వే నిర్వహించి ఇంకుడు గుంతలు లేని సుమారు 16 వేల గృహ సముదాయాలకు నోటీసులు జారీ చేశాం. వర్షాకాలంలో 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తున్నాం. జలయజ్ఞంలో అందరి భాగస్వామ్యం అవసరం. – అశోక్ రెడ్డి, ఎండీ, జలమండలిచదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ క్రేజ్.. త్వరపడండి -
ఈ బతుకు సవారీ ప్రమాదకారి
బండి వెనుక బండెడు లోడు. ఇక మిగిలింది ఆయిల్ ట్యాంకే.. అక్కడ కూడా ఓ మహిళ ..అనంతపురం నుంచి సమీప గ్రామాలకు వెళ్లి ప్లాస్టిక్ సామానులు అమ్ముకునే ఈ చిరు వ్యాపారి మంగళవారం ఇలా ప్రమాదకర రీతిలో ప్రయాణం సాగించాడు. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. సాక్షి ఫొటోగ్రాఫర్ అనంతపురం అల..మెరుపులావిశాఖ సాగర తీరాన సరదాగా గడుపుదామని వచ్చే కొందరు అక్కడి రాళ్లపై కూర్చొని అలల సయ్యాటలను ఆస్వాదిస్తుంటారు. సెలీ్ఫలు దిగుతూ సరదాగా గడుపుతుంటారు. అయితే ఒక్కోసారి అలలు ఇలా ప్రమాదకరంగా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగా మారుతుంటాయి. ఆర్కేబీచ్లో సందర్శకులు ఇలా రాళ్లపై నిల్చొని సెలీ్ఫలు తీసుకుంటుండగా ఓ పెద్ద రాకాసి అల ఇలా విరుచుకుపడింది. చూస్తున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం జడివాన విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా గంటస్తంభం,నగర పాలక సంస్థ కార్యాలయం, రాజీవ్ క్రీడా ప్రాంగణానికి వెళ్లే రహదారిలో నీరు నిలిచిపోవడంతో వాహనాలపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం కంపెనీలు, ఆయా సంస్థల్లోని వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులుచేర్పులతో ఆర్థిక ఒత్తిళ్లు, సాంకేతికతలో పెరుగుతున్న వినియోగం, విధుల నిర్వహణలో సమర్థత సాధనకు కృషి అనే ఈ మూడు ప్రధాన అంశాల ప్రభావంతో సంస్థల నిర్మాణ విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల్లో మధ్యస్థ మేనేజర్ల (మిడిల్ మేనేజ్మెంట్) పాత్ర కొత్తగా నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. ఆ మార్పు ఉత్పత్తుల స్థాయిలోనే కాకుండా, సంస్థల అంతర్గత నిర్మాణంలోనూ జరుగుతోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ‘గ్రేట్ ఫ్లాటెనింగ్‘అన్న పదం సిలికాన్ వ్యాలీలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో మారుతున్న ట్రెండ్‌కు సంకేతంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మధ్యస్థ మేనేజ్మెంట్ స్థాయిని తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకునే మార్గాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో టెక్ దిగ్గజాలు ముందుకు సాగుతున్నాయి. టెక్ కంపెనీలు సైతం తాము స్టార్టప్‌ల సెటప్ మాదిరిగా పనిచేయాలనే మానసిక స్థితిలో చిన్న బృందాలుగా, తక్కువ సంఖ్యలో మేనేజర్లతో ఎక్కువ ఉత్పాదకతను సాధించే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. చాట్బాట్లు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వంటి వినియోగంతో మానవ వనరుల నిపుణుల అవసరం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదే బాటలో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, ఇంటెల్ వంటి కంపెనీలు సైతం సంస్థాగత వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ మార్పులు తీసుకొస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఇప్పటికే ఈ మార్పులకు అనుగుణంగా మధ్యస్థ మేనేజర్ల పాత్రను కొత్తగా రూపుదిద్దేలా చర్యలు చేపట్టాయి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి వాటిని ప్రవేశపెట్టి, మధ్యస్థ స్థాయి మేనేజ్మెంట్ పాత్రను తగ్గించేశాయి. దీని వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడడంతో పాటు మేనేజర్లను వ్యూహాత్మక విధానాల్లోకి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. అనుకూల అంశాలుసమర్థత, వేగవంతమైన నిర్ణయాలు: బ్యూరోక్రసీని తగ్గించి, చిన్న బృందాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయాలన్నదే లక్ష్యం. దీంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. మార్కెట్‌కు అనుగుణంగా వేగంగా స్పందించొచ్చువ్యయాల తగ్గింపు : ఉద్యోగుల జీతాలు, ముఖ్యంగా మేనేజ్మెంట్ స్థాయిలో అధికంగా ఉండటంతో వాటిని తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రయోజనాలు చేకూరుతాయి. తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఇది కీలకంగా మారింది.ఇన్నోవేషన్‌కు మద్దతు: మధ్యస్థ మేనేజ్మెంట్ లేకపోతే, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నేరుగా పనిచేసే ఉద్యోగులకు ఇవ్వొచ్చు.దీనివల్ల సృజనాత్మకత పెరిగే అవకాశముందిప్రతికూల అంశాలు మిగిలిన మేనేజర్లపై పనిభారం : తగ్గిన మేనేజ్మెంట్ వ్యవస్థకు ప్రత్యా మ్నాయం లేకపోవడం వల్ల మిగిలిన వారిపై అధిక పనిఒత్తిడి పెరుగుతోంది. ఇది ‘బర్నౌట్’కు దారితీయొచ్చునాయకత్వలోపం : తొలగించిన మేనేజ్మెంట్ల స్థాయిల కారణంగా లీడర్ షిప్ గ్యాప్ ఏర్పడి, టీమ్‌ల పనితీరు దెబ్బతినే అవకాశముందిసీనియర్ స్థాయిలో మైక్రో మేనేజ్మెంట్ : మధ్యస్థ స్థాయి లేకపోతే, టాప్ లెవల్ లీడర్íÙప్ చిన్న విషయాల దాకా జోక్యం చేసుకోవడం వల్ల ఇది వ్యతిరేక ఫలితాన్నే కలిగించొచ్చు.ప్రమోషన్ అవకాశాల తగ్గుదల : మంచి ప్రతిభ కనబరిచే వారికి మధ్యస్థ మేనేజర్ స్థాయికి చేరే అవకాశాలు తగ్గి.. కెరీర్ ఎదుగుదలకు బ్రేకులు పడే ప్రమాదం. సవాళ్లు ఎదురవుతున్నా.. అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి కంపెనీలు, సంస్థలు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తూ, కార్యకలాపాల్లో సమర్థత పెంపుదల కోసం మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు ఫ్లాట్ (అంటే తక్కువ మేనేజ్మెంట్ లేయర్లతో కూడిన) సంస్థలుగా మారుతున్నాయి. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో మధ్యస్థ మేనేజర్లు అధికంగా ›ప్రభావితం అవుతున్నారు. వారికి సవాళ్లు ఎదురవుతున్నా, అనేక అవకాశాలు కూడా అందుబాటులో వస్తున్నాయి. – వెంకారెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీ జీల్ ఐఎన్‌సీ -
నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్‌ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్వర్క్లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.బాధితులే ఉద్యోగులు..విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్‌లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్‌లో ఐదు, మయన్మార్‌లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి. బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.ఘోస్ట్ సిమ్ కార్డులతో..ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది. నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్‌లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్‌లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.బాధితులే ఉద్యోగులు..సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. దేశాలను దాటి..సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్‌కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది. ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండితక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది. -
ఓటీటీ.. ఏమిటీ ట్రాప్!
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. ఓటీటీలోకి వస్తోందని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలియగానే ఆరోజు కోసం ఎదురు చూసేవారెందెరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేవారూ ఉన్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ను రద్దు చేయాలంటే? సైన్ అప్ చేసినంత సులభం కాదని ఇటీవలి సర్వే వెల్లడించింది. అంతేకాదు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటోందట.సినిమాలూ, వెబ్ సిరీస్‌ల వంటివి చూపే ఓవర్ ద టాప్ (ఓటీటీ) యాప్‌లలో సబ్స్క్రిప్షన్ ను (చందా) రద్దు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులలో డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్స్ ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదని సర్వేలో పాలుపంచుకున్నవారు తెలిపారు. యాప్ లేదా వెబ్సైట్లో ఆ ఆప్షన్ ఎక్కడో ఉండటం వల్ల దాన్ని కనుక్కోలేకపోయామని వినియోగదారులు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా 353 జిల్లాల్లోని 95,000కుపైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్‌సర్కిల్స్ ఈ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్‌ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు, నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.ఆసక్తి లేకపోయినా..ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్లలో సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసినా.. కాల పరిమితి ముగియగానే సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతోంది. అన్ సబ్స్క్రయిబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోంది. దీంతో వినియోగదారులు వారు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి, సబ్స్క్రిప్షన్ రీచార్జ్ అయినట్టుగా చాలా మంది తెలిపారు. కొన్ని సందర్భాల్లో అదనపు యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం, లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఓటీటీ సేవలకు అవసరం లేని చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటోంది. ముఖ్యం కాకపోయినా సబ్స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరి అని చెప్పి పూర్తి చేయిస్తున్నాయి.లోపించిన పారదర్శకత..సబ్స్క్రిప్షన్ సమయంలో కంపెనీలు ఒక ధరను ముందుగా ప్రదర్శిస్తున్నాయి. చెక్ అవుట్ ప్రక్రియ సమయంలో తప్పనిసరి రుసుములు, ఛార్జీలను జోడిస్తున్నాయి. ఈ తరహా మోసానికి గురైనట్టు చందాదారులు చెబుతున్నారు. ఓటీటీ సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని 53% మంది వినియోగదారులు వెల్లడించారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే ఈ అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కంపెనీల్లో పారదర్శకత లోపించిందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. దృష్టి మరల్చడానికి.. వినియోగదారుల దృష్టి మరల్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన గమ్మతై ్తన నేవిగేషన్, రంగు రంగుల సంకేతాలతో కూడిన ఇంటర్‌ఫేస్‌లను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆఫర్స్‌ను తిరస్కరించడం, ట్రయల్స్‌ను నిలిపివేయడం, చందా రద్దు (క్యాన్సిలేషన్) మార్గాన్ని కనుగొనడం కష్టతరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నామని 86% మంది వినియోగదారులు చెప్పారు. ‘కంపెనీలు ఒక ఆఫర్ లేదా సేవను ప్రమోట్ చేస్తున్నాయి. సైన్ అప్ చేసిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ చూడండని ఊదరగొట్టి ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అదనంగా చెల్లించకపోతే ప్రకటనలను కొనసాగిస్తున్నాయి’ అని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.రద్దు చేసినా చార్జీలు..సబ్స్క్రిప్షన్ ను రద్దు చేసిన తర్వాత కూడా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 24% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి అలర్ట్, వివరణ లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతోందని వారు అంటున్నారు. సబ్స్క్రిప్షన్ గడువు అయిపోయిందని, ఇక డబ్బు చెల్లించనక్కర్లేదని భావించినప్పటికీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోందని వారు చెబుతున్నారు.కంపెనీల ఈ డిజైన్ వ్యూహాలు స్వల్పకాలంలో ప్లాట్‌ఫామ్‌లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతాయని లోకల్‌సర్కిల్స్ స్పష్టం చేసింది. సౌలభ్యం తగ్గిందని, ప్రకటనలు ఎక్కువయ్యాయని, గందరగోళమైన బిల్లింగ్ ఉంటోందన్నది కస్టమర్ల వాదన. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు కంపెనీల నుంచి సహాయం, స్పష్టత పొందలేకపోయామని వినియోగదారులు తెలిపారు.అయినా మారలేదు..ఈ సమస్యలను పరిష్కరించడానికి 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు డిజిటల్ పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అవి ఈ–కామర్స్ సేవలకు మాత్రమే వర్తిస్తాయని వాదిస్తున్నాయి. అయితే కంపెనీల మోసపూరిత విధానాలపై కన్నెర్ర చేసిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2023 నవంబర్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ఇంటర్‌ఫేస్‌లను తొలగించడానికి కంపెనీలకు మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ తరవాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదని లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో స్పష్టమైన నియమాలు, బలమైన అమలు వ్యవస్థ ఉండాలని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
కొలనుపాక సోమేశ్వరునికి మహర్దశ
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి పురాతనమైన కొలనుపాకలోని శైవ, జైన దేవాలయాల ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. ఈ క్షేత్రాన్ని కేంద్రం స్వదేశీ దర్శన్ ప్రసాద్ 2.0 (తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకంలో చేర్చనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారు. తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాలను సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నాగార్జునసాగర్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టింది. ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయాలని.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తూ సంరక్షించడానికి అవసరమైన నిధులను పీఆర్ఏఎస్ఏడీ 2.0 (ప్రసాద్ 2.0) పథకం కింద విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరారు. కొలనుపాకకు చారిత్రక ప్రాధాన్యం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కల్యాణ చాళుక్యుల కాలం (7 – 10వ శతాబ్దం) నాటి ప్రాచీన శైవ ఆలయం. చాళుక్యుల అనంతరం కాకతీయుల కాలంలో (12వ – 13వ శతాబ్దం) అత్యంత ప్రాధాన్యమున్న శైవ క్షేత్రంగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ ఆలయం చాళుక్య శిల్పకళా నైపుణ్యం, కాకతీయుల శిల్ప సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉజ్జయినీ జగద్గురు శ్రీ సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య స్వామీజీ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.ఎక్కడ ఉందంటే.. కొలనుపాక ఆలయం జాతీయ రహదారి 163 (హైదరాబాద్–వరంగల్ మార్గం)లో ఉంది. సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో.. ఆలేరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటా వేలా ది మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి ఆలయాన్ని శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ప్రాచీన విగ్ర హాలు, కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాల (శిలాశాస నాలు)తో రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది.మఠాలకు నెలవు కొలనుపాక గ్రామంలో అనేక సామాజిక ఆదారిత మఠాలను ని ర్మించారు. ఈ ప్రాంతం మతపరమైన ప్రా« దాన్యాన్ని మరింతగా పెంచింది. కులాల వా రీగా ఉన్న మఠాలతో సోమేశ్వర ఆలయ ప్రాంగణం గొప్ప శివ క్షేత్రంగా పేరొందింది.శివలింగ రూపంలో దర్శనం శతాబ్దాలుగా ప్రముఖ శైవ క్షేత్రంగా కొలనుపాక గ్రామం పేరొందింది. సోమేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్వేతాంబర జైన దేవాలయం ఉంది. జైన తీర్థంకరులు ఈ దేవాలయంటో ఉన్నారు. రోజూ వేలాది మంది జైనులతోపాటు ఇతర మతస్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మౌలిక సదుపాయల లేమి ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మౌలిక సదుపాయాల లేమి ఉంది. సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి నిధుల కొరత ఉంది. ప్రధానంగా ఆలయంలో ఎన్నో విశిష్టమైన శిల్పకళా, శాసనాలు ఆలనా పాలనా లేకుండా పడిఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలి. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, రోడ్లు, వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఆలయ పరిసరాల సుందరీకరణ, విద్యుత్ వెలుగులు, పార్కులు, ఆలయ విశిష్టతను తెలిపే మార్గదర్శక ఫలకాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని ఇతర వారసత్వ ప్రాంతాలతో కలిపి కొలనుపాకను.. మతపరమైన, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి. గ్రామానికి వచ్చే సందర్శకుల్లో సాంస్కృతిక అవగాహన పెంచేందుకు మ్యూజియాన్ని డిజిటలైజేషన్ చేయాలి. ఇందుకోసం ఈ చారిత్రక యాత్రాక్షేత్రం పునరుజ్జీవానికి.. ప్రసాద్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కోరారు. కొలనుపాకకు కేంద్రం నిధులు ప్రసాద్ 2.0 పథకంలో కొలనుపాకను చేర్చడానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తాం. కొలనుపాక దేవాలయాల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మే నెలలో లేఖను అందజేశాను. కొలనుపాక దేవాలయాల అభివృద్ధికి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. సోమేశ్వరాలయానికి, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య సాంకేతిక సమస్యలను తెలుసుకుని వాటిని కూడా పరిష్కరిస్తాం. – చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ భువనగిరిచదవండి: శతాబ్దాల చరిత్ర ఆదరణ లేక దీనావస్థ -
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
ఆర్కిటిక్‌పై నియంత్రణకు పోటీ
భూమి ఎగువ భాగమైన ఉత్తర ధ్రువంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అర్కిటిక్‌పై నియంత్రణ కోసం గ్రీన్‌లాండ్‌ను స్వా«దీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. మరోవైపు రష్యా ఆర్కిటిక్‌లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇంకోవైపు చైనా ఐస్ బ్రేకర్లు అక్కడ సరికొత్త మార్గాలు తెరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది. ఆర్కిటిక్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ పోటీ ఎందుకో అర్థం కావాలంటే ఆ ప్రాంతాన్ని భూగోళం పై నుంచి చూసి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభంలో గ్రీన్‌ల్యాండ్æకు ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతంలో థూలే అనే ప్రదేశంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా ఆ ప్రదేశ ప్రాముఖ్యత తగ్గలేదు. గ్రీన్లాండ్ ఇప్పటికీ డెన్మార్క్‌లో భాగంగా అ«దీనంలోనే ఉంది. దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎప్పటినుంచో యోచిస్తోంది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు. అమెరికా రక్షణకోసం గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవస్థకు ముందస్తు హెచ్చరిక సైట్లు చాలా ముఖ్యమైనవి. అలా రక్షణ, దాడి రెండింటికీ పనిచేసే స్థావరంగా గ్రీన్‌లాండ్‌ను అమెరికా చూస్తోంది. ఇది చాలాకాలంగా రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఏదైనా ముందడుగు వేస్తే అత్యంత ప్రభావితమయ్యేది రష్యానే. రష్యా భూభాగంలో ఐదో వంతు ఆర్కిటిక్‌లో ఉంది. ఇక ఆ దేశ తీరప్రాంతంలో సగానికి పైగా ఆర్కిటిక్ వెంబడే ఉంది. అందుకే అర్కిటిక్‌లో రష్యా కొన్నేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది. నాగూర్స్కోయ్ వంటి ౖతన వైమానిక స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే నిర్వహిస్తున్న ఆ స్థావరాలను భారీ విమానాలను కూడా ఆపరేట్ చేయగలిగేలా తీర్చిదిద్దుతోంది. రష్యా అణు జలాంతర్గామి దళంలో ఎక్కువ భాగం కోలా ద్వీపకల్పంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యరి్థపై దాడికి వీలుగా వాటిని ఆర్కిటిక్‌లో మంచు కింద నిలిపి ఉంచుతుంది. ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. దాంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించడంపై నార్వే దృష్టి పెటింది. ఆర్కిటిక్‌లో మరో కీలక ప్రాంతం స్వాల్బార్డ్ దీవులు. వాటిని నార్వే నియంత్రిస్తుంది. అయినా రష్యాతో సహా అనేక దేశాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్య ఖాళీ ప్రదేశం కూడా కీలకమే. అట్లాంటిక్‌ను చేరుకోవడానికి రష్యన్ ఉత్తరాది నౌకాదళం ఈ జలాలను దాటాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ యు–బోట్లను ఎదుర్కోవడానికి గ్రీన్లాండ్లో అమెరికా సైనిక స్థావరాన్ని స్థాపించడానికి ఈ జల సంధే కారణం. రేసులోకి బ్రిటన్ ఇటీవలి కాలంలో బ్రిటన్ కూడా ఆర్కిటిక్‌పై దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ మే చివరలో ఆర్కిటిక్‌ను సందర్శించారు. అక్కడ శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఐస్‌లాండ్‌తో కలిసి ఉమ్మడి పథకాన్ని ప్రకటించారు. రష్యన్ జలాంతర్గాములు, పడవలను ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. కానీ జలాంతర్గాములు, సముద్ర గస్తీ, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానాలు బ్రిటన్ లేని నేపథ్యంలో ఈ యత్నాలేవీ ఫలించేలా లేవు. ఇక ఆర్కిటిక్‌కు చాలా దూరంలో ఉన్న చైనా, తనను తాను ఆ ప్రాంతానికి అతి సమీప దేశంగా చెప్పుకుంటోంది. ఇటీవలి కాలంలో అక్కడ దూకుడు పెంచింది. అక్కడ మంచు విపరీతంగా కరగడం వల్ల ఉత్తరాది అంతటా కొత్త వాణిజ్య మార్గం ఏర్పడుతుండటం చైనాకు బాగా కలిసొస్తోంది. సూయజ్ కాల్వతో పోలిస్తే ఈ మార్గం దానికి బాగా అనుకూలం. అక్కడ విద్యుత్తు ప్రొజెక్ట్ ఏర్పాటుకూ చైనా ప్రయతి్నస్తోంది. అక్కడ ఐస్బ్రేకర్ల సముదాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. మైనింగ్ సంస్థలు, విద్యా పరిశోధనల మాటున ఆర్కిటిక్‌లో చైనా గూఢచారులు బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ అమెరికా, రష్యాల్లో ఆందోళన పెంచుతున్నాయి. డేంజర్ బెల్స్ ఇలా ఆర్కిటిక్‌పై పట్టు కోసం ఏ దేశానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. ఇలా మంచు కరగడం వల్ల్ల ఖనిజాలు, చేపలు, ఇతర సముద్ర సంపద కోసం పోటీ పెరుగుతుంది. మరోవైపు షిప్పింగ్‌కు దారులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పోటీ పెద్ద దేశాల మధ్య మరిన్ని తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. రష్యా ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు పదోవంతు ఆర్కిటిక్ సహజ వనరుల నుంచే వస్తుంది. అక్కడ మంచు విపరీతంగా కరుగుతుండటం రష్యా భద్రతను డోలాయమానంలో పడేస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
టాప్ – 8 గోల్కొండ కోట
దేశంలో ఇప్పటికీ అత్యధికులకు సందర్శనకు ఇష్టమైన ప్రదేశం తాజ్‌మహల్. 2025 జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించింది తాజ్నే. దాని దరిదాపుల్లో మరేవీ లేవు.దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ – 10 ప్రదేశాల జాబితాలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోట 8వ స్థానంలో నిలిచింది. -
వేలానికి అరుదైన అంగారక శకలం
భూమిపై ఉన్న అతిపెద్ద, అరుదైన అంగారక గ్రహ శకలం మార్టిన్ ఉల్క (ఎన్డబ్ల్యూఏ 16788) వేలానికి వెళ్లనుంది. ఈ శకలం సుమారు 25 కిలోల బరువున్నది. ఇది 2023లో సహారా ఎడారిలో దొరికింది. అంగాకరక గ్రహం నుంచి భూమిపై ఇప్పటివరకూ పడ్డ ఇతర శకలాల కంటే దాదాపు 70% పెద్దది. దీనిని న్యూయార్క్‌లోని సోతేబైస్‌లో జూలై 16న వేలం నిర్వహించనున్నారు. ఇది సుమారు రూ. 33.4 కోట్లకు అమ్ముడుపోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్టిన్ ఉల్కలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పటివరకూ భూమిపై అధికారికంగా కనుగొన్న 77,000 గుర్తించిన ఉల్కలలో ఇవి కేవలం 0.6 శాతం మాత్రమే. ఏదైనా ఆస్టరాయిడ్ మార్స్‌ను ఢీకొట్టడం వల్ల ఇది అంతరిక్షంలోకి వచ్చి ఉంటుంది. 225 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి చివరికి భూమికి చేరుకుంది. ‘ఇది కేవలం ఒక అద్భుత ఆవిష్కరణ మాత్రమే కాదు, మన పొరుగున ఉన్న అంగారక గ్రహం రహస్యాలను తెలుసుకోవడానికి సహాయపడే భారీ డేటాసెట్’ అని సోథెబైస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ వైస్ చైర్మన్ కాసాండ్రా హాటన్ అన్నారు. ఎన్‌డబ్ల్యూ 16788పై భూసంబంధమైన వాతావరణం కనిపిస్తోందని, అన్ని మైళ్ల ప్రయాణం తరువాత కూడా దాని భౌతిక, రసాయన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందని తెలి పారు. అయితే.. వేలం ద్వారా విలువైన పరిశోధనా సామగ్రి ప్రైవేట్ చేతులకు వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్‌పూర్‌లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్‌బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్‌మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్‌పూర్‌కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్‌పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్‌లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్‌సింగ్‌కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్‌ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌బాగ్ ప్యాలెస్‌కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్‌లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్‌పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్‌పూర్‌లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్‌సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్‌సైట్‌గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్‌పూర్‌కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్‌పూర్‌లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్‌మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్‌మంతర్‌ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్‌బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్‌పూర్‌కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్‌పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్‌లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్‌కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్‌పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్‌కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్‌ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్‌మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొని తాజ్ మహల్‌కు ఓటు వేసి గెలిపించారు. తాజ్‌మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్‌కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్‌ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్‌తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్‌ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్‌ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్‌ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్‌ఖండ్‌ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్‌లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
సారే జహాసె అచ్ఛా ఇండియా
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) సోమవారం వీడ్కోలు పలుకబోతున్నారు. ఐఎస్ఎస్కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ అస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగిరాబోతున్నారు. యాక్సియోమ్ మిషన్–4(ఏఎక్స్–4) ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆదివారం ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. ‘‘భారతదేశం ఈరోజు అంతరిక్షం నుంచి నిర్భయంగా, పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోంది. సారే జహాసె ఆచ్ఛా ఇండియా. ఇదొక అద్భుతమైన, నమ్మశక్యంకాని ప్రయాణం. ఐఎస్ఎస్లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈరోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిసింది. కానీ, భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పని చేస్తే అనుకున్నది సాధించగలం. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం మనం ఐక్యంగా కృషి చేయాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఈ ప్రయోగం సఫలం కావడానికి, నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్ఎస్లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వారు నా అంతరిక్ష యాత్రను అందమైన అనుభూతిగా మార్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది. భూమిని చూసిన ప్రతిసారీ మాయజాలాన్ని చూస్తున్నట్టే ఉంది. నాకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనలకే కాకుండా మన దేశాలకు, మానవాళి ప్రగతికి తోడ్పడతాయి’’ అని శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సహచర వ్యోమగాములు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. శుభాంశు శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సైతం మాట్లాడారు. తమ అనుభవాలు పంచుకున్నారు. → ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా గత నెల 26న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు బయలుదేరిన సంగతి తెలిసిందే. → ఐఎస్ఎస్ నుంచి వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. భూమి చుట్టూ 96,56,064 కిలోమీటర్లు ప్రయాణించారు. → అంతరిక్ష కేంద్రంలో 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కీలకమైన సమాచారం అందించారు. → స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్ నుంచి శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు భూమిపైకి తిరిగిరాబోతున్నారు. వారి రిటర్న్ షెడ్యూల్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారికంగా ధ్రువీకరించింది. → భారత అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. ఆయన ప్రయా ణం కొత్త తరం భారతీయ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.ఘనస్వాగతానికి ఏర్పాట్లు→ అంతరిక్ష యాత్ర పూర్తికావడంతో నలుగురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంటారు. ప్రి–ఫ్లైట్ తనిఖీలు నిర్వహిస్తారు. → అమెరికాలోని కాలిఫోరి్నయా సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పసిఫిక్ సముద్ర తీరంలో నలుగురు వ్యో మగాములు భూమిపై దిగే అవకాశం ఉంది. → అమెరికాలో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి చేరుకొనే శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
మినిమం బాదుడుకు బైబై!!
మినిమం బ్యాలెన్స్ నిబంధన.. బ్యాంకు ఖాతా నుంచి ఆఖరు రూపాయి కూడా ఊడ్చేసినా ఖర్చులు తీరని సామాన్యులకు, వేతన జీవులకు కంగారెత్తిస్తుంది. చెప్పిన దానికన్నా ఖాతాలో ఏ కాస్త తక్కువైనా సరే బ్యాంకులు పెనాల్టీ చార్జీల కింద బాదేస్తుంటాయి. అప్పటికి కట్టలేకపోతే, ఆ తర్వాత ఖాతాలోకి డబ్బు క్రెడిట్ కావడమే తరువాయి.. లాగేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు సరే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని వందల వేల కోట్ల రూపాయలు రాబట్టాయి. దీనిమీద చాలాకాలంగా విమర్శలు వస్తున్నా, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు మనసు, రూటు మార్చుకుంటున్నాయి. ఎస్బీఐ కోవలో మరో 5 బ్యాంకులు ఈ ‘మినిమం’ నిబంధనను ఎత్తివేసి, మ్యాగ్జిమం ఊరటనిచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ఒక్కో ఖాతాదారువారీగా చూస్తే పెనాల్టీలు నామమాత్రంగా వందల రూపాయల స్థాయిలోనే కనిపిస్తాయి. కానీ, కోట్ల మంది పరంగా చూస్తే వేల కోట్ల రూపాయలు బ్యాంకులు వసూలు చేశాయి. ఆర్థిక శాఖ గతేడాది ఇచ్చిన గణాంకాల ప్రకారం మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలా వసూలు చేసింది ఏకంగా రూ.5,614 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో 11 పీఎస్‌యూ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2,331 కోట్లు మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల కింద వసూలు చేశాయి. 2023లో వసూలు చేసిన రూ.1,855 కోట్లతో పోలిస్తే ఇది 25.6 శాతం అధికం! చాలా మటుకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని అల్పాదాయ కస్టమర్లు ఏటా రూ.360–720 వరకు, పట్టణ ప్రాంతాల్లోని వారు ఏటా కనీసం రూ. వెయ్యి అయినా చెల్లించుకోవాల్సి వస్తోందని అంచనా. ఇంతకీ ఎందుకీ చార్జీలు?2000కు ముందు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ తర్వాత పెద్ద ప్రైవేట్ బ్యాంకులు వచ్చినప్పట్నుంచి ఇవి సర్వసాధారణమైపోయాయి. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చార్జీలను రద్దు చేసినప్పటికీ 2017లో మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో కోట్లాది ఖాతాదారుల మీద ప్రభావం పడి చర్చకు దారి తీసింది. దీంతో కాస్త తగ్గించి, ఆ తర్వాత 2020లో కోవిడ్ సమయంలో పూర్తిగా తొలగించింది. వాస్తవానికి కస్టమర్ల ఖాతాల (సేవింగ్స్ అయినా, కరెంట్ అయినా) నిర్వహణ కోసం బ్యాంకులకు కాస్తంత ఖర్చవుతుంది. అంటే ఏటీఎం విత్‌డ్రాయల్స్, కార్డుల నిర్వహణ, పాస్‌బుక్ ప్రింటింగ్, బ్రాంచ్ సర్వీసులు, ఆన్ లైన్/మొబైల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు మొదలైనవి కల్పించడానికి ఖర్చులవుతాయి. కస్టమర్లు కనీసం కొంతైనా బ్యాలెన్స్ ఉంచితే ఆ ఖర్చులను కవర్ చేసుకోవచ్చనేది బ్యాంకుల ఆలోచన. అదొక్కటే కాదు..» ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుకే డిపాజిట్లను సమీకరించుకున్నట్లు అవుతుంది. అలా చౌకగా వచ్చిన మొత్తాన్ని అధిక వడ్డీ రేటుపై రుణాలివ్వొచ్చు లేదా పెట్టుబడులకు వాడుకోవచ్చు.» పెనాల్టీలనేవి బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ వనరులాగా కూడా ఉపయోగపడతాయి. » బ్యాలెన్స్ లేని ఖాతాల వల్ల తమకు ఉపయోగం లేకపోయినా తప్పనిసరిగా కేవైసీ, ఆడిట్లాంటివన్నీ చేయాలి. కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు పెనాల్టీలు విధిస్తే కస్టమర్లు ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడమో లేదా మూసివేయడమో చేస్తారు కాబట్టి భారం కాస్త తగ్గుతుంది. » హై–వేల్యూ కస్టమర్లు, లో–వేల్యూ కస్టమర్లను గుర్తించేందుకు, ఖాతాదారులను బట్టి ప్రీమియం సర్వీసుల్లాంటివి ఆఫర్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.ఎందుకు తొలగిస్తున్నాయంటే?కరువు.. ఆపై అధిక మాసంలాగా అసలే చేతిలో డబ్బు లేకపోగా.. పెనాల్టీల భారం కూడా తోడు కావడమనేది సామాన్య ఖాతాదారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీన్ని భరించే బదులు ఖాతానే వాడటం మానేస్తే పోతుందని వదిలేస్తున్నారు కూడా. దీన్ని పరిష్కరించుకోవడంతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటంతో దానికి తగ్గట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే తీసుకున్న ఈ నిర్ణయంతో.. సాధారణంగా కనీస బ్యాలెన్స్‌లను పాటించడం కష్టంగా ఉండే విద్యార్థులు, రైతులు, మహిళలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లోని పేదలు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది.వ్యాపార వ్యూహాలు..: ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో బ్యాంకుల వ్యాపా ర వ్యూహాలు కూడా ఉన్నాయి. పెనాల్టీల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నప్పటికీ బ్యాంకుల కోణంలో చూస్తే వాటికి వచ్చే వడ్డీ ఆదాయంతో పోలిస్తే ఇలా వచ్చే ఆదాయం చాలా తక్కువే. దీనికి తోడు చెడ్డ పేరు ఒకటి. దీంతో ఆ కాస్త మొత్తాన్ని వదులుకున్నా, కస్టమర్ల నమ్మకాన్ని పొందవచ్చనేది ఒక ఆలోచన. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ భారం లేదు కాబట్టి ఖాతాదారులు ఎంతో కొంతైనా వేస్తూ, తీస్తూ ఉండటం వల్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉంటాయి. అలాగే పాతబడిన ఖాతాలపై పెనాల్టీలు వేయొద్దన్న నియంత్రణ సంస్థ ఆదేశాలను కూడా పాటించినట్లవుతుంది. జీరో–బ్యాలెన్స్, డిజిటల్ ఖాతాల్లాంటివి అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న కొత్త తరం సంస్థలతో పోటీపడేందుకు వీలవుతుంది.ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633.4 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్లు ఇలా పెనాల్టీల కింద వసూలు చేశాయి. -
ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్‌పేషెంట్ కవర్‌తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్‌బిల్ట్‌గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్‌ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్‌కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్‌మెంట్‌కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్‌ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్‌లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్‌లాంగ్ ‘ఎల్డర్‌కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్‌బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్‌కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్‌కు యాడాన్‌గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్‌ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్‌లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్‌లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్‌ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్‌కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
నెటిజన భారత్!
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ . అవసరానికే కాదు వినోదానికీ ఈ ఉపకరణమే. మెసేజింగ్, కాలింగ్ యాప్స్, సామాజిక మాధ్యమాలు జీవితంలో భాగం అయిపోయాయి. ఇంకేముంది.. డేటా, అన్ లిమిటెడ్ ప్యాక్స్‌తో జనం సింపుల్‌గా మొబైల్‌తో ‘రీచార్జ్’ అవుతున్నారు. దేశంలో సగటున ఒక్కో నెల మొబైల్ కస్టమర్లు 21.53 జీబీ డేటాను ఆస్వాదిస్తున్నారు. మూడేళ్లలో సగటున నెలకు డేటా వినియోగం 44.59% పెరిగిందంటే నెట్లో ఏ స్థాయిలో విహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.దేశంలో వైర్లెస్ డేటా చందాదారుల సంఖ్య 2025 మార్చి నాటికి 93.9 కోట్లు. అంతకుముందు ఏడాదిలో ఇది 91.3 కోట్లు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల్లో వైర్లెస్ వాటా ఏకంగా 95 శాతానికిపైగా ఉంది. ఇక వైర్లెస్ డేటా వినియోగం 1,94,774 పెటాబైట్స్ నుంచి ఏడాదిలో 17.46 శాతం అధికమై 2,28,779 పెటాబైట్స్‌కు ఎగసింది. అంటే 2,28,77,90,00,000 జీబీ అన్నమాట. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన 2024–25 గణాంకాల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎల్టీఈ (4జీ) వాటా 64.2 కోట్లు కాగా, 5జీ చందాదారుల సంఖ్య 24.4 కోట్లకు చేరింది. 100 మంది జనాభాలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 68.63 శాతం ఉన్నారు. ఇంటర్నెట్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల వాటా ఏకంగా 96 శాతం ఉంది. మిగిలినది ప్రభుత్వ టెలికం సంస్థలది. వైర్లెస్ డేటా వినియోగం ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీలకు ప్రతి నెలా సగటున 2023–24లో రూ.211.36 సమకూరితే.. 2024–25లో అది రూ.231.64కి పెరిగింది. 2021–22లో ఇది రూ.147.94 మాత్రమే. -
60-70లలోనూ.. అంతే ఆరోగ్యంగా!
చూడటానికి ఇరవై ఏళ్లు తక్కువ వాళ్లలా కనిపించే 60–70 ఏళ్ల వాళ్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది! వాళ్ల ఫిట్నెస్, ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాం. క్రమబద్ధమైన వ్యాయామం, కొలతల ప్రకారం ఆహారం, కంటి నిండా నిద్ర, జిమ్ము, స్విమ్మింగ్ ఇవన్నీ కారణాలు కావచ్చు. ‘ప్రధాన కారణం మాత్రం వాళ్లు తీసుకుంటున్న ఆహారమే’అని తాజా అధ్యయనం చెబుతోంది. 40, 50లలో మీరేం తింటున్నారన్నది 60, 70లలో మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోందో నిర్ణయిస్తుంది అని పరిశోధకులు అంటున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’తాజా సంచికలో వచ్చిన ఈ అధ్యయన వ్యాసం వృద్ధాప్య ఆరోగ్యానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ మనం తినే ఆహారమే.. మన ఆలోచనను, ఆరోగ్యాన్ని, ఆయుష్షును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా 40–50లలో ఉన్నప్పుడు ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయాన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. నడి వయసులో ఉన్నప్పుడు ఎంచుకున్న ఆహారం.. మిమ్మల్ని ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి తీసుకెళ్తుంది, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంచుతుంది అని అధ్యయనంలో పాల్గొన్న హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్; కోపెన్‌హెగెన్, మాంట్రియల్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘాయుష్షుకు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఆహారమే కీలకం అని తాము కనుగొన్నట్లు వారు తెలిపారు. లక్షకుపైగా వ్యక్తులపై అధ్యయనం ఆరోగ్యకరమైన ఆహారానికి, దీర్ఘాయుష్షుకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోటానికి పరిశోధకులు హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన రెండు అధ్యయనాల డేటా పరిశీలించారు. అందులో మొద టిది పూర్తిగా మహిళలపై చేసిన ‘నర్సెస్ హెల్త్ స్టడీ’, రెండోది పురుషులపై చేసిన ‘హెల్త్ ప్రొఫెషనల్స్ ఫాలో అప్ స్టడీ’. 30 సంవత్సరాల కాలంలో, 39–69 ఏళ్ల మధ్య వయసు కలిగిన లక్షకుపైగా మహిళలు, పురుషుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్య ఫలితాలు ఆ డేటాలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఆరోగ్యకర ఆహార సూచీ, కేవలం మొక్కల ఆధారిత ఆహార సూచీ, అధిక మధుమేహాన్ని తగ్గించే ఆహార సూచీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గించే ఆహార సూచీ.. ఇలా 8 రకాల ఆహార విధానాలతో కూడిన ఆరోగ్య సంబంధ ప్రశ్న పత్రాలు ఇచ్చి, వాటిలో వేటిని పాటించారో రాయమని కోరినప్పుడు వచ్చిన సమాధానాలతో ఆ డేటా తయారైంది. దాన్నే యూనివరటీ పరిశోధకులు విశ్లేíÙంచి, ‘ఆహారమే దీర్ఘాయుష్షుకు కారణం’అని కనిపెట్టారు. విశ్లేషణలో ఏం వెల్లడయింది? పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకుని.. ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర ఉండే పానీయాలు, ఉప్పు, రిఫైన్డ్ ధాన్యాలు లేదా గింజలు తక్కువగా తీసుకునే ‘ప్రత్యామ్నాయ ఆరోగ్యకర ఆహార సూచీ’అన్నింటికంటే అత్యుత్తమమైనదని అధ్యయనంలో తేలింది. భవిష్యత్ దీర్ఘకాలిక తీవ్ర వ్యాధులను నివారించటంలో ఇది మంచి తోడ్పాటును ఇచ్చిoది. 70 ఏళ్ల వయసులోనూ దిటువుగా ఉన్నవారు ఈ విధానంలో 86 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. తక్కిన విధానాలతో పోలిస్తే ఇది 2.2 రెట్లు ఎక్కువగా వృద్ధాప్యపు ఆరోగ్యానికి ఉపయోగపడింది. అదే సమయంలో కృత్రిమ పదార్థాలు, అధిక చక్కెరలు, సోడియం, సంతృప్త కొవ్వులు, అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నవారి ఆరోగ్య స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గమనించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 9,771 మంది (9.3 శాతం) తమ వృద్ధాప్యంలోకి చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యంతో ప్రవేశించారు. శాకాహారమే వృద్ధాప్య బలం దీర్ఘాయుష్షు అంటే పరిశోధకుల ఉద్దేశంలో ఎన్నేళ్లు జీవించామన్నదొక్కటే కాదు.. ఎంత నాణ్యంగా జీవించామన్నది కూడా. శాకాహారాన్ని సమృద్ధిగా తీసుకుంటూ; మాంసాహారాన్ని, అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్‌ను మితంగా తీసుకోవటమే శారీరకంగానూ, మానసికంగానూ వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణకు కీలకం అని అధ్యయనం స్పష్టం చేసింది. వృద్ధాప్యానికి చేటు తెచ్చేవి అ్రల్టా–ప్రాసెస్డ్ ఆహారాలు.. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం; చక్కెర ఉండే, డైట్ పానీయాలు ఎక్కువగా తీసుకున్నవారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందే భాగ్యం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ‘వ్యక్తుల ఆరోగ్యం, ప్రజారోగ్య వ్యవస్థ రెండింటికీ చాలా ప్రాధాన్యం ఉంటుంది కనుక ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మీద పరిశోధనలు చాలా అవసరం. భవిష్యత్ ఆహార మార్గదర్శకాలను రూపొందించటానికి ఇవి సహాయపడతాయి’అని కోపెన్‌హెగెన్ విశ్వవిద్యాలయ ప్రజారోగ్య విభాగం ప్రొఫెసర్, హార్వర్డ్ చాన్ స్కూల్లోని పోషకాహార పాఠ్యాంశ నిపుణురాలు మార్తా గ్వాష్ ఫెర్రీ అంటున్నారు. అయితే ‘మంచి ఆహారం’అని తాము గుర్తించినది అందరి విషయంలో ఒకే విధంగా ప్రభావం చూపించకపోవచ్చని, అది వ్యక్తుల శారీరక, మానసిక స్వభావాలను బట్టి ఉంటుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సహ పరిశోధకురాలు యానీ జూలీ టెస్సియర్ చెబుతున్నారు.‘ప్రత్యామ్నాయ ఆహార విధానం’ భవిష్యత్ దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో అధికంగా తోడ్పడిన విధానం ఇవి ఎక్కువ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇవి తక్కువ ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర ఉండే పానీయాలు, ఉప్పు, రిఫైన్డ్ ధాన్యాలు లేదా గింజలు దీర్ఘాయువుకు శత్రువులు » అ్రల్టా–ప్రాసెస్డ్ ఆహారాలు » ప్రాసెస్డ్ మాంసం » చక్కెర ఉండేవి, డైట్ పానీయాలు -
ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి పుష్కరం గడిచింది. అతని సమకాలీకులు రాహుల్ ద్రవిడ్ (2012లో ఆఖరి మ్యాచ్), సౌరవ్ గంగూలీ (2008లో) తమ ఆటను ముగించి చాలా కాలమైంది. ఈతరం దిగ్గజం ధోని కూడా మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు. కానీ క్రికెట్ అభిమానుల్లో వీరందరి పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆటకు సంబంధించిన లేదా క్రికెటేతర కార్యక్రమం అయినా సరే...వీరు హాజరైతే చాలు, దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ దిగ్గజ క్రికెటర్లకు వాణిజ్యపరంగా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పని చేస్తుండటం విశేషం. పైగా ఆయా బ్రాండ్లకు అంబాసిడర్లుగా మాత్రమే కాకుండా చాలా వ్యాపారాల్లో సహ భాగస్వాములుగా తాము కూడా మార్కెట్‌ను శాసిస్తున్నారు. – సాక్షి, క్రీడా విభాగంముగ్గురూ ముగ్గురేసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం 25 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో 10 కంపెనీల్లో అతను సహ భాగస్వామి. సగం వాటిలో అతను కేవలం పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టగా... మరో సగం కంపెనీ వ్యవహారాల్లో తన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ చురుకైన భాగస్వామిగా ఉన్నాడు.మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా 42 బ్రాండ్స్‌తో జత కట్టాడు. రెగ్యులర్‌గా ప్రకటనల్లో కనిపించే బ్రాండింగ్ కాకుండా ప్రీమియం స్పోర్ట్స్ టూరిజం కంపెనీ ‘డ్రీమ్ సెట్ గో’ను సొంత వ్యాపారంలా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ వీరిలో మరింత ప్రత్యేకం. ఈ మిస్టర్ డిపెండబుల్ కనీసం సోషల్ మీడియాలో కూడా లేడు. కానీ 24 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా నెమ్మదైన స్వభావానికి బ్రాండ్ అంబాసిడర్‌లాంటి ద్రవిడ్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ‘క్రెడ్’కోసం ‘నేను ఇందిరానగర్ గూండాను..’అంటూ చేసిన యాడ్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరు ప్రఖ్యాతలే పెట్టుబడిగా...క్రికెట్ నుంచి తప్పుకొని చాలా రోజులైనా ఈ మాజీలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. దీనిపై వ్యాల్యుయేషన్ రంగంలో నిష్ణాతులైన హర్‡్ష తలికోటి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కెరీర్లో వారు సాధించిన ఘనతలతో వచ్చిన పేరుప్రఖ్యాతులే కాదు.. ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్లీన్ ఇమేజ్, అభిమానులకు వారంటే ఉన్న గౌరవం, ఏళ్లు గడిచాక కూడా తమను తాము మార్చుకుంటూ ప్రస్తుత సెలబ్రిటీల్లో కూడా తమ ప్రత్యేకత నిలబెట్టుకోవడమే అందుకు కారణం’అంటాడు. పైగా తాము నమ్మిన, విశ్వాసం ఉన్నవాటితోనే జత కట్టడానికి వీరు సిద్ధమవుతారు. ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌ను తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా వాడుతున్నాను కాబట్టి దానికి ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు ద్రవిడ్ చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.ధోని, విరాట్, రోహిత్ఈతరం అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లి ప్రస్తుతం చెరో 45 బ్రాండ్లతో కలిసి పని చేస్తుండటం విశేషం. ఇటీవల ‘ఎజిలిటాస్’స్పోర్ట్స్ కంపెనీలో కోహ్లి రూ.40 కోట్లతో భాగస్వామిగా చేరి అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. 10 స్టార్టప్‌లలో అతను పెట్టుబడులు పెట్టాడు. ధోని కూడా ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరో స్పేస్ కంపెనీల్లో భాగమయ్యాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా క్రేజ్ తగ్గలేదు. అడిడాస్, సియట్, నిస్సాన్ వంటి అనేక ప్రముఖ కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్నాడు. సుమారు 20 బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నాడు.ఉభయతారక ఒప్పందాలుభారత్లో క్రికెటర్లకు పాన్ ఇండియా విలువ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఒక్కో ప్రాంతం లేదా భాషకే పరిమితమయ్యే సినిమా తారలతో పోలిస్తే క్రికెటర్ల ప్రకటనలే పెద్ద సంఖ్యలో జనానికి చేరతాయని ప్రకటన రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు ఉభయతారకంగా ఉంటూ అటు ప్లేయర్లకు, ఇటు కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉండటం కారణంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ కాలపు అనుబంధం కొనసాగుతోంది.ధోని బ్రాండింగ్ చేస్తున్న ఏరో స్పేస్ కంపెనీ ‘గరుడ’ఆదాయం ఏడాది తిరిగే లోగా రూ.15 కోట్ల నుంచి రూ. 123 కోట్లకు చేరగా, తర్వాతి సంవత్సరమే కంపెనీ పూర్తిగా లాభాల్లోకి మళ్లింది. కోకాకోలాతో గంగూలీ అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగుతుండగా, పవర్ కంపెనీ ల్యుమినస్ 15 ఏళ్లుగా సచిన్‌తో కలిసి ఉంది. ఆటకు గుడ్‌బై చెప్పినా మార్కెటింగ్, బ్రాండింగ్‌ను తాము శాసించగలమని ఈ దిగ్గజాలంతా నిరూపిస్తున్నారు.⇒ ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌కు చెందిన ల్యూబ్రికెంట్స్ యాడ్‌లో ద్రవిడ్ నటించిన తర్వాత అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయని స్వయంగా కంపెనీ వెల్లడించింది. కర్ణాటకలో ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌తో ద్రవిడ్ జతకట్టిన తర్వాతే అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి.⇒ ‘గరుడ’బ్రాండ్‌తో వచి్చన డ్రోన్ల వ్యాపారం పెరుగుదలకు ధోని మాత్రమే కారణమని ఆ సంస్థ సీఈఓ అగీ్నశ్వర్ వెల్లడించడం ‘కెప్టెన్ కూల్’విలువేమిటో చెబుతుంది. -
Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు
వారాల తరబడి వేచి ఉన్నాక, ప్రాథమిక దర్యాప్తు జరిగాక నివేదిక వెలువడితే ఆ విమానప్రమాద రహస్యాలు బయటికొస్తాయని అందరూ ఆశించారు. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తాలూకు నివేదిక అందుకు భిన్నంగా మరిన్ని చిక్కుముడులు వేసేలా వెలువడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వేపై పరుగెత్తి ఆకాశంలోకి ఎగిరేదాకా పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ]ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. అయితే స్విచింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్ చేయడాన్ని గమనించి పైలట్ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగనతలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్‌ను మార్చి, కూల్చేసేందుకు పాక్ సైబర్ దాడులను యత్నిస్తోందన్న కథనాల నడుమ ఈ నివేదిక విడుదలైంది. అయితే ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేముందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. అయితే పైలట్లను ఈ నివేదిక ఎక్కడా తప్పుబట్టకపోవడం విశేషం. అలా అని ఇది పూర్తిగా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్య కారణంగా జరిగిందనీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో ముగించింది. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్ చేశారా? లేదంటే స్విచింగ్ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమా? విమానం సెకన్ల వ్యవధిలో నేలరాలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్ ఈ రెండు ఫ్యూయల్ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్ చేయడం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఫ్యూయల్ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్ చేయడం అంత సులభంకాదు. వీటికి లీవర్–లాక్‌లు ఉంటాయి. స్విచ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ భద్రతా ఫీచర్ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్ గార్డ్ బ్రాకెట్స్ అనేవి కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్/ఆఫ్ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాటి పొజిషన్ మారి ఉంటుంది’’అని ఆ నిపుణుడు వివరించారు. 737 మోడల్లో లాకింగ్ ఫీచర్లో సమస్యలు! బోయింగ్ 737 రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్‌లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను 2018 డిసెంబర్లో విడుదలచేసింది. అందులో బోయింగ్ 737లోని ఫ్యూయల్ స్విచ్‌లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్ డిజైన్‌ను బోయింగ్ 787–8 రకం విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన వీటీ–ఏఎన్‌బీ విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది. మొత్తం ఆడియో ఎందుకు బయటపెట్టలేదు? నువ్వెందుకు స్విచ్ ఆఫ్ చేశావని ఒక పైలెట్‌ను మరో పైలట్ అడగడం, నేను ఆఫ్చేయలేదని అతను బదులివ్వడం తప్పితే మరే ఇతర ఆడియో వివరాలు బహిర్గతం చేయకపోవడం సైతం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వే అటు కొనకు చేరుకుని రన్‌వేపై ప్రయాణించి, గాల్లోకి లేచి, కూలిపోయే చిట్టచివరి సెకన్ దాకా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్ అయంది. అలాంటప్పుడు మొత్తం ఆడియోను విడుదలచేస్తే నిపుణులు విశ్లేషించి ప్రమాదంపై ఓ అంచనాకు రాగలరు. వాళ్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలుస్తాయి’’అని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ గోయెల్జ్ చెప్పారు. ఏమిటీ ఇంధన స్విచ్‌లు విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, లేదా షట్‌డౌన్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. టేకాఫ్ సయయంలో స్విచ్‌లను అచేతనావస్థలో (ఆఫ్ చేసి) ఉంచడం అత్యంత అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఇదే కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ముంబై: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉన్నాయని భారతీయ ఎయిర్‌లైన్ పైలెట్ల సంఘం(ఏఎల్పీఏ) వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఏఎల్పీఏ అధ్యక్షుడు కెప్టెన్ శ్యామ్ థామస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘పైలెట్లదే తప్పు అని తేల్చేలా దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఇలాంటి నిర్ణయానికి రావడం విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు? ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం శోచనీయం. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల సంఘ ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అప్పుడే దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయి. ఫ్యూయల్ స్విచ్ గేట్స్ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల పొజిషన్లు మారడం సైతం ప్రమాదానికి కారణం కావచ్చని అమెరికాలోని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. భారత్‌లో దర్యాప్తు జరుగుతుండగా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాకముందే అందులోని అంశాలు ఎలా లీకయ్యాయి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య ఉందా? ‘‘విమానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య కారణంగా ఫ్యూయల్ స్విచ్ పొజిషన్ మారిందా లేదా అనేది తెలియల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే’’అని భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ దర్యాప్తు నిపుణుడు కెపె్టన్ కిశోర్ చింతా అన్నారు. ‘‘ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. రెండో ఇంజిన్‌నూ స్టార్ట్చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్ చేస్తే మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ అ«దీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు’’అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ విమానంలో ఫ్యూయల్ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు నివేదికలో లేకపోవడం సైతం ఫ్యూయల్ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పారిపోయి రైలెక్కేస్తున్నారు!
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఆగింది. అక్కడ 26 మంది చిన్నారులతో ఎనిమిది మంది వ్యక్తులు రైలెక్కారు. వారు సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంది. సాధారణంగా రైలెక్కినప్పుడు చిన్నారుల్లో ఓ సంబరం కనిపిస్తుంది, కిటికీల్లోంచి చూస్తూ కేరింతలు కొట్టడం సహజం. కానీ, ఈ చిన్నారుల్లో ఎక్కడా చలాకీతనం లేదు, దిగాలుగా కూర్చున్నారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైలు సికింద్రాబాద్‌లో ఆగగానే, రైల్వే భద్రతా దళ సిబ్బంది కోచ్‌లోకి వచ్చి వారందరినీ అదుపులోకి తీసుకుంది. ఆరా తీస్తే.. ఆ 26 మందిని హైదరాబాద్ శివారులోని పరిశ్రమల్లో బాలకార్మికులుగా వెట్టి చేయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. పిల్లలను తరలిస్తున్న వారిని అరెస్టు చేసి.. ఆ బాలలకు స్వేచ్ఛ కల్పించారు. - సాక్షి, హైదరాబాద్ముంబై వెళ్లే రైలు జనరల్ కోచ్ ఎక్కిన ఇద్దరు 13 ఏళ్ల బాలికలు, రాత్రి వేళ స్లీపర్ కోచ్‌లోకి చేరుకున్నారు. వారి వద్ద అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే ఉండటంతో టీసీ నిలదీశాడు. పొంతనలేని సమాధానం చెప్పటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన సమాచారమిచ్చాడు. వారు బాలికలను అదుపులోకి తీసుకుని విచారిస్తే, చదవడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.బడికి వెళ్లటం ఇష్టం లేక కొందరు.. తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో విసిగిపోయి మరికొందరు.. సినిమాల్లో నటించాలని ఇంకొందరు.. కిడ్నాప్‌నకు గురై మరికొందరు.. ఇలా అనేక కారణాలతో తరచూ రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తు్తన్న బాలలను రైల్వే రక్షక దళం సిబ్బంది కాపాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గత రెండున్నరేళ్లలో 3,433 మంది ఇలాంటి చిన్నారులను రక్షించారు. ఇది పెద్ద సంఖ్య కావటంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తోంది.రైళ్లెక్కేస్తున్నారుఇళ్ల నుంచి పారిపోయే చిన్నారుల్లో అత్యధికులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసు తనిఖీలు ఉంటాయన్న ఉద్దేశంతో, పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు కూడా రైళ్లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు ఇప్పుడు రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ, నాందేడ్ డివిజన్‌హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా చైల్డ్ హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేశారు.ఇళ్లనుంచి పారిపోయి రైలెక్కుతున్న చిన్నారులు, అక్రమ రవాణాలో భాగంగా తరలిస్తున్న పిల్లలను గుర్తించి రక్షించటమే ఈ డెస్క్‌ల పని. రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచడం, సంబంధిత విభాగాలతో సమన్వయం చేయడం, కోచ్లూ స్టేషన్లలో గుర్తించిన పిల్లలకు తక్షణ సంరక్షణ క ల్పించటం, ప్రజలలో అవగాహన క ల్పించడం ద్వారా ఈ డెస్‌్కలు అలాంటి చిన్నారులు ఆపదల్లో చిక్కుకోకుండా చూడగలుగుతున్నాయి. ఈ పిల్లలను గుర్తించేందుకు రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల సంఖ్య కూడా పెంచుతున్నారు.ప్రత్యేక కార్యక్రమాలురైల్వే భద్రతా విభాగం ‘ఆపరేషన్ నన్హే ఫరిõÙ్త’, ‘ఆపరేషన్ – యాక్షన్ అగైనస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్’వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఒంటరిగా రైళ్లలో సంచరించే చిన్నారులు, బలవంతంగా వారిని తరలించేవారిని గుర్తించి వివరాలు వాకబు చేసి ప్రమాదంలో ఉన్న చిన్నారులను రక్షించి తిరిగి ఇళ్లకు తరలిస్తున్నారు. ఇళ్లకు వెళ్లేందుకు నిరాకరించే వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలకుగాను పోలీసులకు అప్పగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేసే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులకు ఇప్పుడు ఇలాంటి చిన్నారులను గుర్తించి కాపాడే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ‘బచ్పన్ బచావో ఆందోళ¯న్’అనే సంస్థతో కలిసి జోనల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి.దేశవ్యాప్తంగా 16వేల మంది⇒ 2024 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 16వేల మంది చిన్నారులను కాపాడింది. వీరిలో 3,000 మంది అమ్మాయిలే. నన్హే ఫరిõÙ్త కార్యక్రమం ద్వారా ఒక్క 2024లోనే 10వేలకుపైగా కుర్రాళ్లను కాపాడారు. ఈ ఏడాది జూన్ వరకు 6వేలకుపైగా చిన్నారులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చారు.⇒ రైల్వే కోచ్‌లు, స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరిగే చిన్నారులు; ఆందోళనగా కనిపించే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు @RailMinIndia, @SCRailwayIndia, @Gmscrailway తదితర ఎక్స్ హ్యాండిల్స్‌లో కూడా పోస్ట్ చేయవచ్చు.139కి సమాచారమివ్వండి‘ఇళ్ల నుంచి పారిపోయే చిన్నారులు, చైల్డ్ ట్రాఫికింగ్‌కు బలయ్యే బాలలను రక్షించే సామాజిక బాధ్యతతో రైల్వే శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ విషయంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి వేలాది బాధిత చిన్నారులను రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. రైల్వే చొరవకు ప్రజల సహకారం తోడైతే మరింత మందిని రక్షించవచ్చు. రైలు ప్రయాణికులు పరిసరాలను గమనిస్తూ అనుమానం ఉన్న చిన్నారుల విషయాన్ని 139 ద్వారా గాని, రైలు మద్దతు పోర్టల్ ద్వారా గాని సమాచారం అందిస్తే రైల్వే సిబ్బంది వెంటనే స్పందిస్తారు’. – ఎ.శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి -
ఈవీకి సాటి రావు ఏవీ!
సాక్షి, అమరావతి: వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం వల్ల ఉద్యోగాలు, ముఖ్యమైన సేవలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. కానీ.. దానికి మించి ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లు కూడా పెరిగిపోతాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్‌లో వాహనాలకు హైడ్రోజన్ ఇంధనం తోడు కానుంది. అది కాలుష్యాన్ని నియంత్రించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహనరంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీలకు పెరిగిన డిమాండ్ మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతం అని లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది. ఇందులో ముంబైలో ఏటా 5,100 మరణాలు, కోల్‌కతాలో 4,678 మరణాలు, చెన్నైలో 2,870 మరణాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించే ప్రజా రవాణా వ్యవస్థలపై నగరాలు దృష్టి సారించాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ పెరిగింది. 2023లో మొత్తం వాహన అమ్మకాలలో ఈవీల వాటా దాదాపు 5 శాతంగా ఉంది. మొత్తం కార్ల అమ్మకాలలో కేవలం 10 శాతం వృద్ధితో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల రిజి్రస్టేషన్లు ఏటా 70 శాతం పెరిగి 80 వేల యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, అత్యంత వేగవంతమైన వృద్ధి త్రీ వీలర్ విభాగంలో ఉంది. ప్రపంచ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అమ్మకాలలో దాదాపు 60 శాతం వాటా భారత్‌కు ఉంది. వాస్తవానికి 2023లో మనదేశం చైనాను అధిగమించి 5.80 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలతో అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా నిలిచింది. 8.80 లక్షల వాహనాలను విక్రయించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌గా మనదేశం అవతరించింది. దూసుకొస్తున్న హైడ్రోజన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ.. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్‌సీఈవీ) ఈవీలకు ప్రత్యామ్నాయంగా దూసుకొస్తున్నాయి. ఇవి అధిక శక్తి సాంద్రత కారణంగా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. బ్యాటరీతో నడిచే వాహనాల కంటే తేలికగా ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలుగుతాయి. అయితే, ఎఫ్‌సీఈవీలు ప్రస్తుతం చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 93 వేల వాహనాలే ఉన్నాయి. దీనికి కారణం అధిక ధర, నిర్వహణ ఖర్చులుగా చెప్పుకోవచ్చు. ఇంధన సెల్ బస్సులు, ట్రక్కులు వాటి బ్యాటరీ, ఎలక్ట్రిక్ కౌంటర్ పార్ట్‌ల కంటే 20–30 శాతం ఎక్కువ హైడ్రోజన్ వాహనాలకు ఖర్చవుతాయి. అయినప్పటికీ, సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. దిగిరానున్న ఖర్చులు డీజిల్ బస్సులకు కిలోమీటర్‌కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 మాత్రమే ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ కిలోమీటర్‌కి రూ.71.73 ఖర్చవుతుంది. అదే గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక వనరుల నుండి తీసుకుంటే కిలోమీటర్‌కు రూ.77.69 ఖర్చవుతుంది. హైడ్రోజన్ వాహనాల ప్రారంభ ధర రానున్న ఐదేళ్లలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ధరతో సమానంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వాటి నిర్వహణ ఖర్చులు 2030 తర్వాత కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. భారీ లక్ష్యానికి తోడ్పాటు కాలుష్యం లేని భారత్ కోసం ‘నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్’కి మన దేశం రూపకల్పన చేసింది. నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీని, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచటం, వాహన కాలుష్యాన్ని తగ్గించటం వంటి లక్ష్యాలతో ఈ ప్రణాళికను తీసుకొచ్చారు. దేశంలో ఎక్కువ మంది ఫ్యూయెల్ బేస్డ్ వాహనాలే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. భవిష్యత్‌లో మన దేశంలో విద్యుత్ వాహనాలను మాత్రమే నడపాలని కేంద్రం భావిస్తోంది. పొల్యూషన్ ఫ్రీ ఇండియాను, ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితులను చూడాలన్నదే తన ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. హైడ్రోజన్ వాహనాల వినియోగం ఇందుకు తోడ్పాటు అందించనుంది. -
హల్వాదే హవా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్‌లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్ఎస్లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు! తనతో పాటు ఐఎస్ఎస్లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్‌తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు. చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్‌గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి. శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్ రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు. ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బయట పెట్టారు. జూన్ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్–9 రాకెట్ తాలూకు బూస్టర్‌లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్ 10 సాయంత్రం గమనించింది. అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్‌ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్ ఎక్స్ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.కుటుంబంతో శుభాంశు మాటామంతి శుభాంశు శుక్రవారం లఖ్‌నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్ఎస్లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శతాబ్దాల చరిత్ర.. ఆదరణ లేక దీనావస్థ
నాగర్‌కర్నూల్ జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు, చరిత్రను తెలియజేసే శిలాశాసనాలకు రక్షణ కరువవుతోంది. అధికార యంత్రాంగం వీటిపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కేవలం ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే పట్టించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆలయాల నిర్వహణతోపాటు పురావస్తు విగ్రహాలు, శాసనాల రక్షణకు నిధుల లేమి ప్రధాన సమస్యగా మారింది. అయితే సోమశిల సర్క్యూట్ డెవలప్మెంట్లోభాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. – కొల్లాపూర్శాసనాలు, శిల్పాలు.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. ఇటీవల పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ శాసనాన్ని సందర్శించారు. చరిత్రను తెలియజేసే శాసనాలను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లాపూర్‌లోని ఆర్ఐడీ కళాశాల సమీపం, పలు ప్రాంతాల్లో సురభి రాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నాయి. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. మరికొన్ని చెట్లకిందే ఉన్నాయి. అయితే వాటి విశిష్టతను తెలియజెప్పేవారు లేరు. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలాచోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. ప్రచారం కల్పిస్తే గుర్తింపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. కృష్ణానది తీరం వెంట శతాబ్దాల కాలం కిందటే మునులు, రుషులు ఆలయాలను నిర్మించారు. వీటికి తగిన ప్రచారం కల్పిస్తే పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేదీప్యమానంగా వెలుగొందిన జటప్రోలు మదనగోపాలస్వామి వంటి ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాస్కీ నిధులపైనే ఆశలు.. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను పరిశీలించేందుకు ఇటీవల మంత్రి జూపల్లి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కొల్లాపూర్‌లో పర్యటించారు. సోమశిల, అమరగిరి, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతో చేపట్టబోయే పనుల ద్వారా పురాతన ఆలయాలు, శిలాశాసనాలకు తగిన గుర్తింపు లభించవచ్చని స్థానికులు భావిస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలున్నాయి. అవన్నీ చరిత్రకు సాక్ష్యాలు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి రక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేయాలి. – శివకృష్ణయాదవ్, కొల్లాపూర్ అధికారులు దృష్టి సారించాలి మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతనమైన కాలభైరవ, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలున్నాయి. వీటిని పరిరక్షించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న విగ్రహాలు, ఆలయాలు, శాసనాలు ధ్వంసం కాకుండా కాపాడాలి. వీటి రక్షణకు చర్యలు చేపట్టాలి. – అశోక్నంద, మల్లేశ్వరం అద్భుతమైన శిల్పకళతో.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలు సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల కిందట సురభి రాజవంశస్తులు అద్భుతమైన శిల్పకళతో మదనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా నెలరోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. దాదాపు వంద గ్రామాల ప్రజలు వచ్చేవారు. ప్రతివారం పెద్దఎత్తున పశువుల సంత సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. కాలక్రమేణా ఆలయాన్ని జటప్రోలులో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగాయి. రానురాను తన ప్రాభవాన్ని కోల్పోయింది. చివరికి ధూప, దీప, నైవేద్యాలు పెట్టేవారు కూడా కరువయ్యారు. ఏడేళ్ల కిందట దేవాదాయశాఖ అధికారులు ఒక పూజారిని ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల రాకమాత్రం పూర్తిగా తగ్గిపోయింది. జటప్రోలులోనే ఉన్న అగస్తేశ్వరాలయం, 19 మూకగుడుల నిర్వహణను పట్టించుకునేవారే లేరు. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందిన ఈ ఆలయం పూర్వవైభవానికి నోచుకోవడం లేదు. మరికొన్ని ఆలయాలు ఇలా.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్త్యం ఉన్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయం ధూప, దీపాలకు నోచుకోవడంలేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్టించిన మల్లయ్యస్వామి (మల్లయ్యసెల) గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శివాలయం, చిన్నంబావి మండలంలోని బెక్కెం సమీపాన సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో శివాలయం, నందీశ్వరాలయం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నందివడ్డెమాన్‌లో ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. -
చైనాలో ప్రాణాంతక మైనింగ్
అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మినరల్స్)... రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి దారితీస్తున్న అంశమిది. తమకు తక్కువ ధరకే ఈ ఖనిజాలు సరఫరా చేయాలని చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, డ్రాగన్ దేశం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎంతో అరుదైన, విలువైన ఈ ఖనిజాలు చైనా గడ్డపై ఉండడం, అవి తమకు సులువుగా దక్కకపోవడం సహజంగానే అమెరికాకు రుచించడం లేదు. అందుకే చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాను చైనా బహిరంగంగా ధిక్కరిస్తోంది అంటే అందుకు కారణం ఈ ఖనిజాలే అనే చెప్పొచ్చు. ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సోలార్ ప్యానెళ్లు, ఎంఆర్ఐ మిషన్లు, జెట్ ఇంజన్లు, విదుŠయ్త్ పరికరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు చైనా పంట పండిస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఖనిజాల్లో సగానికిపైగా చైనా నుంచే వస్తున్నాయి. అరుదైన ఖనిజాల మైనింగ్, శుద్ధి, ఎగుమతుల విషయంలో చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఏముందో చూస్తే... నీరు, భూమి కలుషితం చైనాలో ఉత్తరాన ఉన్న ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని బయాన్ ఓబో, దక్షిణాన జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గాంగ్ఝౌలో రేర్ ఎర్త్ ఖనిజాల గనులున్నాయి. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలు, వాహనాల రొదతో అవి నిత్యం దద్దరిల్లుతుంటాయి. పొరలు పొరలుగా భూమిని పెకిలించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతోపాటు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న గనులు స్థానికులకు మాత్రం నరకానికి నకలుగా మారిపోయాయి. పచ్చని మైదానాలు మసిబారిపోయాయి. గడ్డి భూములు ప్రమాదకరమైన దుమ్ము ధూళితో నిండిపోయాయి. లోతైన గనుల నుంచి దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమాతకు గాయాలవుతూనే ఉన్నాయి. గాలి, నీరు, భూమి దారుణంగా కలుషితం అవుతున్నాయి. చట్టవిరుద్ధంగా తవ్వకాలు గనుల నుంచి వెలువడే రేడియోయాక్టివ్ బురదను నిల్వ చేయడానికే సమీపంలో కృత్రిమంగా సరస్సులు నిర్మించారు. కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పెద్దలకు క్యాన్సర్లతోపాటు శిశువులకు పుట్టుకతో లోపాలు పరిపాటిగా మారాయి. ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అపరిచితులను గనుల వైపు అనుమతించడం లేదు. మైనింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. గనుల తవ్వకంతో వెలువడే మట్టి, బురదలో ప్రాణాంతకమైన భార లోహాలు, రేడియోయాక్టివ్ అవశేషాలు ఉంటున్నాయి. టన్నుల కొద్దీ అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్తోపాటు ఇతర రసాయనాలు భూ ఉపరితలంపై పేరుకుపోతున్నాయి. చైనాలో వేలాది మైనింగ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చట్టవిరుద్ధమైనవే ఎక్కువ. ఒక చోట తవ్వకానికి అనుమతులు తీసుకొని మరికొన్ని చోట్ల అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ లైసెన్స్‌ల సంఖ్య తగ్గించింది. అయినప్పటికీ అక్రమ గనులు సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక టన్ను ఖనిజాలు కావాలంటే ఏకంగా 2,000 టన్నుల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. గ్రామాలకు గ్రామాలే ఖాళీ గనుల వల్ల జరగాల్సిన నష్టం చాలావరకు ఇప్పటికే జరిగిపోయింది. మైనింగ్ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోయాయి. భూముల్లో గోతులే మిగిలాయి. నదులు, పంట పొలాలు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా తవ్వకాలు సాగిస్తుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మైనింగ్ కంపెనీలు రైతుల పొలాలను కూడా వదలిపెట్టడం లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. బడా కంపెనీలపై చట్టపరంగా కోర్టుల్లో పోరాడే శక్తి లేక మిన్నకుండిపోతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గనుల తవ్వకం ఆపాల్సిందేనని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సహజ వనరుల లైఫ్‘లైన్’!
‘దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయి. హార్ముజ్ మార్గం బందైనా భారత్‌కి ఇబ్బంది లేదు. వేరే మార్గాల్లో భారత్‌కు క్రూడాయిల్ వస్తుంది’ – ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మార్గం మూసేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇటీవల చెప్పిన మాటలివి. ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికే మనదేశం ప్రపంచంలోనే అతిపొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇలాంటి పైప్లైన్లే ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల వంటి ఇంధనాలు అందిస్తున్న ప్రాణవాయువులు. ఈ పైప్లైన్లు ప్రపంచ దేశాలను చుడుతూ భారీగా విస్తరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల పొడవుతో గ్యాస్ పైప్‌లైన్ అందుబాటులో ఉందో తెలుసా? 14.2 లక్షల కిలోమీటర్లు.అంటే భూమిని 35సార్లు చుట్టొచ్చన్న మాట. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ) పైప్లైన్ల సామర్థ్యం 5 బిలియన్ (500 కోట్ల) టన్నులు. అలాగే చమురును సరఫరా చేసే పైప్లైన్ల పొడవు 5,04,000 కిలోమీటర్లు.చమురు, సహజ వాయువు.. ప్రపంచాన్ని నడిపిస్తున్న సహజ ఇంధన వనరులు ఇవి. ఆర్థిక వ్యవస్థ రథచక్రాలివి. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన వనరుల పంపిణీకి చమురు, సహజ వాయువు పైప్లైన్లు కీలకమైనవి. ‘అన్నింటా మనం’ అన్నట్టు చమురు, సహజ వాయువు రంగంలో భారత్ సైతం తనదైన ముద్రవేస్తోంది. ప్రపంచంలో అతిపొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) పైప్‌లైన్ ప్రాజెక్టుకు మన దేశం శ్రీకారం చుట్టింది.టాప్–5లో గెయిల్గ్యాస్ సరఫరా కోసం చైనాలో 21.9 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 17,800 కిలోమీటర్లు, భారత్‌లో 20.7 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 14,300 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లో అభివృద్ధి దశలో ఉన్న మొత్తం పైప్‌లైన్ కంటే ఈ రెండు దేశాలు నిర్మిస్తున్నవే అధికం కావడం విశేషం. గ్యాస్ పైప్లైన్స్ను అభివృద్ధి చేస్తున్న టాప్–5 మాతృ సంస్థలు ప్రభుత్వ రంగానికి చెందినవి కావడం విశేషం. రష్యాలో గ్యాస్ప్రామ్, చైనా–పైప్చైనా, భారత్–గెయిల్, నైజీరియా–ఎన్ ఎన్ పీసీ, ఇరాన్ లో చమురు మంత్రిత్వ శాఖ వీటిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న అత్యంత పొడవైన గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు 2,775 కిలోమీటర్ల ఇరాన్–పాకిస్తాన్ పైప్‌లైన్, అలాగే భారత్‌లో 2,655 కిలోమీటర్ల జగదీష్పూర్–హల్దియా–బొకారో–ధమ్రా సహజ వాయువు పైప్‌లైన్. నిర్మాణంలో ఉన్న అతి పొడవైన చమురు పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో ఆఫ్రికాలోని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలోని 1,950 కిలోమీటర్ల నైజర్–బెనిన్ ఆయిల్ పైప్‌లైన్, భారత్‌లో నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన 1.635 కిలోమీటర్ల పారాదీప్ నుమాలిఘర్ క్రూడ్ పైప్‌లైన్ (పీఎన్ సీపీఎల్) టాప్–2లో నిలిచాయి.అగ్రదేశాల సరసన మనమూ..అమెరికాకు చెందిన ప్రముఖ ఇంధన రంగ విశ్లేషణ సంస్థ ‘గ్లోబల్ ఎనర్జీ మానిటర్’ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా 59,100 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్‌లైన్స్ నిర్మాణంలో ఉన్నాయి. మరో 1,51,300 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటన్నింటి అంచనా వ్యయం 533.6 బిలియన్ డాలర్లు. అభివృద్ధి చేస్తున్న పైప్లైన్ల పరంగా చైనా, రష్యా, భారత్, ఆస్ట్రేలియా, యూఎస్ ముందున్నాయి. చమురు సరఫరా కోసం 9,100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణంలో ఉంది. మరో 21,900 కిలోమీటర్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2023 మే నాటికి 25.3 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న మొత్తం చమురు సరఫరా పైప్‌లైన్స్‌లో 49 శాతం ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో విస్తరించాయి. ఈ ప్రాంతాలు 4,400 కిలోమీటర్ల ముడి చమురు సరఫరా పైప్లైన్స్ను నిర్మిస్తున్నాయి. అలాగే 10,800 కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి.2,800 కి.మీ. పొడవు!ప్రపంచంలో అతిపొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టును భారత్ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా ఐహెచ్బీఎల్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. ప్రాజెక్టు కోసం 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. 2,800 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్ ప్రాజెక్టులో గుజరాత్‌లోని కాండ్లను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తో అనుసంధానిస్తారు. ఏటా 83 లక్షల టన్నుల ఎల్పీజీని రవాణా చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది దేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో 25 శాతం. -
‘స్వ’యంకృతం
రీల్స్, షార్ట్స్ చూడందే పొద్దు గడవని రోజులు వచ్చేశాయి. ఎక్కడ చూడండి, ఎవరిని చూడండి, ఎప్పుడు చూడండి.. వీటిలోనే లీనమైపోయి కనిపిస్తుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అతుక్కుపోతున్నారు. ఒకసారి ఈ రీల్స్ లేదా షార్ట్స్ ప్రపంచంలోకి వెళ్లామంటే.. వరుసపెట్టి ఎన్ని చూస్తామో మనకే తెలీదు. ఈ షార్ట్ వీడియోలు మనల్ని ఎందుకు ఇంతలా కట్టిపడేస్తున్నాయి? ఎందుకంటే అవి మనల్ని నవ్విస్తాయి. కవ్విస్తాయి. కబుర్లు చెబుతాయి. చాలావాటిలో మన చుట్టుపక్కల వాళ్లే కనిపిస్తారు. అన్నిటినీ మించి – సెకన్లలో, నిమిషాల్లో కొద్దిపాటి నిడివితో ముగుస్తాయి. ఒకప్పుడు కాలక్షేపంతో మొదలైన ఈ వీక్షణ ఇప్పుడు ఓ వ్యసనంలా మారింది. స్వ.. షార్ట్ వీడియోల వ్యసనం (ఎస్వీఏ) అని పిలిచే ఈ వ్యసనం వల్ల మన మెదడు పనితీరే మారిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి బాంబును పేల్చింది. రీల్స్, షార్ట్స్, వగైరాలను చూసే అలవాటు కనుక మితిమీరితే మెదడులోని ‘రీవైరింగ్’ ప్రక్రియ గతి తప్పి మనిషి మనస్తత్వంలో ప్రతికూల మార్పులు సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘న్యూరోఇమేజ్’లో వచ్చిన ఈ పరిశోధనా వ్యాసం ప్రధానంగా షార్ట్–ఫామ్ వీడియోల వ్యసనం (ఎస్వీఏ – స్వ) వల్ల ప్రవర్తనల్లోని పెను మార్పుల గురించి చర్చించింది. ‘స్వ’ మెదడు కార్యకలాపాలను తారుమారు చేయగలదని, వాటికి అలవాటు పడిన వారిని మరింత ఉద్వేగభరితంగా, ఆర్థిక నష్టాలను సైతం పట్టించుకోనంతగా మొద్దుబారేలా చేస్తుందని ఈ కొత్త బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, ఇలాంటివారు తొందర పడి తక్షణ నిర్ణయాలు తీసుకుంటారని, ఆ నిర్ణయ దుష్ఫలితాల పట్ల కూడా అవసరమైన స్పందన చూపించరని పేర్కొంది. తద్వారా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ వారి అభివృద్ధి కుంటు పడుతుందని తెలిపింది.మెదడు దారి తప్పుతోంది..‘స్వ’ అన్నది జూదం, మాదకద్రవ్య వినియోగం వంటి వ్యసనాల కంటే తక్కువేమీ కాదని తెలిపింది. ఈ రెండు రకాలైన వ్యసనాల్లోనూ వ్యక్తులు దీర్ఘకాలిక పరిణామాలను విస్మరించి, తక్షణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా – నిర్ణయాలు తీసుకోవటానికి, నియమాలను పాటించటానికి కారణమయ్యే మెదడులోని ప్రదేశాలు తమ తీరు మార్చుకుని దారి తప్పుతున్నట్లు అధ్యయనం కనిపెట్టింది. ఊటబావుల్లాంటివి షార్ట్–ఫామ్ వీడియోలు ఊటబావుల వంటివి. స్క్రోలింగ్ చేయటానికి ఓపిక ఉండాలే కానీ వాటిల్లో అంతులేని కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ కూడా మనకు నచ్చేలా, మనకు సంబంధించిన విషయమని అనిపించేలా ఉంటుంది. వాటి వల్ల తక్షణ మానసిక సంతృప్తి లభిస్తుంది. అదొక తీరని దాహం అవుతుంది. దీంతో మెదడు ఒత్తిడికి గురై, మెదడు ‘రీవైరింగ్’ పని తీరులో మార్పులు సంభవిస్తాయి. పర్యవసానంగా ప్రమాదాలను పసిగట్టే, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ‘చివరికి అది ఎంతవరకు దారి తీస్తుందంటే – బతుకు బండిని నడిపించే డబ్బు విషయాల్లో జరిగిన నష్టాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు’ అని అధ్యయనం తెలిపింది. మెదడు ‘రీవైరింగ్’ అంటే? రీవైరింగ్నే మెదడు పునఃశిక్షణ, న్యూరోప్లాస్టిసిటీ అని కూడా అంటారు. మెదడు నిరంతరం, జీవితాంతం కొత్త నాడీ సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఆ విధంగా తన పునర్వ్యవస్థీకరణ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. మనిషి తన అనుభవాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి, గాయాల నుంచి కోలుకోవటానికి; అలవాట్లను, ఆలోచనా విధానాలను మార్చుకోవటానికి అనుమతిస్తుంది. అయితే షార్ట్–ఫామ్ రీల్స్‌ను అదేపనిగా చూసే అలవాటు మెదడు ఇలా రీవైరింగ్ చేసుకోవటాన్ని నిరోధిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.నిద్రలేమి... నిరాశ నిస్పృహలు‘స్వ’.. మొత్తం ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది. తాజాగా అధ్యయనం జరిగిన చైనాలో వినియోగదారులు సగటున రోజుకు 151 నిమిషాలు ఈ వీడియోలనే చూస్తూ గడుపుతున్నారు. దాదాపు 95.5 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు వీటిలోనే నిమగ్నమై ఉంటున్నారు. ఈ తీవ్రత.. ఏకాగ్రత, నిద్ర, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, నిరాశాæ నిస్పృహలను దరిచేర్చే ప్రమాదం ఉందని చైనాలోని టియాంజిన్ నార్మల్ విశ్వవిద్యాలయం సైకాలజీ ప్రొఫెసర్, అధ్యయన కర్త కియాంగ్ వాంగ్ అంటున్నారు. ఎందుకు స్పందించడం లేదు?ముఖ్యంగా, ‘స్వ’ ఉన్నవారిలో ఆర్థిక నష్టాల పట్ల పట్టింపు ఎందుకు ఉండటం లేదో కనుగొనాలని పరిశోధనా బృందం ప్రయత్నించింది. లాభాల కంటే నష్టాలకు ఎక్కువగా స్పందించే ధోరణిని.. నిర్ణయం తీసుకోవడంలో ముందు జాగ్రత్త లక్షణంగా పరిగణిస్తారు. ఈ లక్షణం ప్రమాదకర ప్రవర్తనను నివారించడానికి సహాయపడుతుంది.జూదం, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన వారు తమ ఆర్థిక నష్టాల పట్ల కాస్తయినా స్పందనను చూపుతుండగా, షార్ట్–ఫామ్ వీడియో వ్యసనంలో ఇందుకు భిన్నంగా ఉండటానికి కారణాన్ని మాత్రం అధ్యయం కచ్చితంగా తేల్చలేకపోయింది. దానిని కనిపెట్టటానికి వారు ఈ రెండు రకాల వ్యసనాల కంప్యూటేషనల్ మోడలింగ్ (డీడీఎం), న్యూరోఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ)లను ఆశ్రయించారు. కారణాల కోసం అన్వేషిస్తున్నారు. యువతపై తీవ్ర ప్రభావంఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ గతంలో నిర్వహించిన అధ్యయనంలో యుక్త, మధ్య వయస్కుల్లో.. షార్ట్స్, రీల్స్ చూడటం వల్ల ఒక పని మీద ధ్యాస, శ్రద్ధ ఉండకపోవడం గమనించారు. ముఖ్యంగా రకరకాల అంశాలకు సంబంధించిన చాలా స్వల్ప వ్యవధి వీడియోలు మార్చి మార్చి చూడటం వల్ల... యువత ఒక సమయంలో ఒకే పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది. దేశంలోని నెట్ వినియోగదారుల్లో 80 శాతానికిపైగా షార్ట్ ఫామ్ వీడియోలు రోజూ వీక్షిస్తున్నారు. ఇండియాలో నెట్ యూజర్లు రోజుకు గంటకుపైగానే షార్ట్–ఫామ్ వీడియోలు చూస్తున్నారని ఒక అంచనా. -
చందమామను గ్రహశకలం ఢీకొట్టిన వేళ
చిన్నతనంలో చేసే అతి అల్లరికి అమ్మ ఎప్పుడో ఒకసారి గట్టిగానే కొట్టి ఉంటుంది. అలాగే చల్లని వెన్నెలను మనకు అందించే చందమామ కూడా ఒకప్పుడు భారీ దెబ్బతిన్నాడు. అంతరిక్షంనుంచి విరుచుకుపడిన ఒక ఖగోళ వస్తువు సృష్టించిన పెను ఉత్పాతమది. సౌర కుటుంబ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ తాడనంగా నమోదైంది. గ్రహశకలం లేదంటే తోకచుక్క అనూహ్యంగా దిశ మార్చుకుని వచ్చి చంద్రుడి ఉపరితలంపై అత్యంత వినాశనం సృష్టించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో విరుచుకుపడి మారణహోమానికి పాల్పడింది. అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే ఏకంగా లక్ష కోట్ల అణుబాంబులకు సమానమైన శక్తితో ఆ గ్రహశకలం/తోకచుక్క చంద్రమామను ఢీకొట్టింది. దీంతో మనం లెక్కించడానికి, ఊహించడానికి కూడా సాధ్యంకానంతటి స్థాయిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి చంద్రుని ఉపరితలంపై 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. అంటే టెక్సాస్ రాష్ట్రంలోని వాకో సిటీ నుంచి వాషింగ్టన్ డీసీ నగరానికి ఉన్నంత దూరం స్థాయిలో ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు ఏకంగా 13 కిలోమీటర్లు. ఇంతటి పెనువినాశనం ఇప్పుడు జరగలేదు. 380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అరుదైన ఖగోళ ఘటన జరిగింది. మరి ఇప్పుడెందుకీ బిలం గోల?చంద్రుడు ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడిన బిలం కావడంతో ఆనాటి ఘటన తాలూకు అవశేషాలు సజీవ సాక్ష్యాలుగా అక్కడే ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆనాటి ఘటన తాలూకు ఆధారాలు అలాగే ఉంటాయనడానికి బలమైన కారణం ఉంది. చందమామపై ఎలాంటి వాతావరణం లేదు. గాలులు, వరదలు, కాలుష్యం వంటి కారణంగా అక్కడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు సంభవించబోవు. ఆ లెక్కన ఆనాటి ఖగోళ రహస్యాలు అలాగే భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకే చంద్రుడు ఆవిర్భవించాడు. ఈ లెక్కన అవని ఆవిర్భావ రహస్యాలు చందమామపై ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు చైనా రంగంలోకి దిగింది. ఈ బిలం ఉన్న ప్రాంతానికి ‘సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్’గా పిలుస్తారు. ఇది భూమి మీద నుంచి చూస్తే కనిపించదు. చంద్రుని ఆవలి వైపు ఎప్పుడూ చిమ్మచీకట్లో ఉంటుంది. దీంతో ఇక్కడి శాంపిళ్లను తీసుకురావడం సవాల్‌తో కూడిన పని. ఇంతటి అసాధ్యమైన పనిని చైనా సుసాధ్యంచేస్తూ ఛాంగ్–6 వ్యోమనౌక ద్వారా గత ఏడాది జూన్ 25వ తేదీన అక్కడి నుంచి 1,935 గ్రాముల నమూనాలను తీసుకొచ్చింది. ఈ శాంపిళ్లపై ఏడాదికాలంగా చేసిన పరిశోధన తాలూకు తాజా వివరాలు ‘‘నేచర్’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్విమ్మింగ్ పూలే ఆఫీసు
సిబ్బంది ఒత్తిడిని దూరం చేయడం కోసం కొన్ని సంస్థలు ఆఫీసులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తుంటాయి. కానీ.. ఓ చైనీస్ కంపెనీ మాత్రం.. స్విమ్మింగ్ పూల్‌నే ఆఫీసుగా మార్చేసింది. ఆఫీస్‌గా మారిన పూల్ ఫొటోలు, వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ.. ఫ్లోర్ సాకెట్లు, ఎక్స్టెన్షన్ కేబుళ్లతో ఉన్న వర్క్‌స్టేషన్ ఇప్పుడు ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు రేకెత్తించడంతో చివరకు ఖాళీ చేయాల్సి వచి్చంది. చైనాకు చెందిన లుబాన్ డెకరేషన్ గ్రూప్ అనే డెకరేషన్ కంపెనీ ఖాళీగా ఉన్న ఈత కొలనును తాత్కాలిక వర్క్‌స్పేస్‌గా మార్చింది. జిమ్ పక్కన ఉన్న గాజు తలుపు నుంచి పూల్ ఆఫీస్‌లోకి వస్తారు. పూల్‌లో ఉన్న సైడ్ నిచ్చెనలు ఉపయోగించి తమ డెస్క్ దగ్గరకు వెళ్తారు. అలాగే.. వాటి ద్వారా తిరిగి బయటికి వస్తారు. సిబ్బంది రెండు నెలలుగా అక్కడ పనిచేస్తున్నారు. ఈ విచిత్రమైన సెటప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సిబ్బంది ఆన్లైన్లో పెట్టడంతో చర్చనీయాంశమైంది. ఉద్యోగులు తన డెస్క్ నుండి కిందికి చూస్తే, కనిపించే పూల్ లేన్ గుర్తుల కారణంగా వారు చిన్న డైవింగ్ ట్యాంక్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. తాము ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్లు అనిపిస్తుందని, వింతగా ఉన్నప్పటికీ బాగుందని తెలిపారు. కొందరు ఇది సృజనాత్మకంగా ఉందంటే.. మరికొందరేమో ఉద్యోగుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో తరలింపు మార్గాలు లేకపోవడం, అవసరమైన అగి్నమాపక భద్రతా లక్షణాలు లేకపోవడం ఆన్లైన్లో చర్చకు దారితీసింది. పూల్ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు తలెత్తాయి. ‘ఈ కార్యాలయ సెటప్ నిజంగా ప్రత్యేకమైనది. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కష్టమే’అని కొందరు, ‘ఈ కార్యాలయం ట్రెండీగా కనిపించవచ్చు, కానీ తేమ వల్ల రుమాటిజం రావచ్చు. లోతైన చివరలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కీళ్ళకు నష్టం జరగుతుంది’అని మరికొందరు హెచ్చరించారు. అయితే.. ఆఫీస్ పునరుద్ధరణ కారణంగా పూల్‌కు మార్చా మని, ఈ సెటప్ తాత్కాలిక పరిష్కారమేనని సంస్థ తెలిపింది. అయినప్పటికీ.. కంపెనీ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన స్థానిక అగి్నమాపక విభాగం ఆ స్థలాన్ని ఖాళీ చేయించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
యూఎస్‌లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.ప్రాసెసింగ్‌కు సమయం.. విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్‌కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.మనవాళ్లే ఎక్కువ.. వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. తనిఖీలు కఠినం ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు. విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది. -
నమ్మించి మోసం..!
సాక్షి, స్పెషల్ డెస్క్: నమ్మితేనే కదా మోసం చేయగలిగేది.. అని సినిమా డైలాగ్. ఇది అక్షరాలా నిజ మని మరోసారి రుజువైంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో! ఆడిటింగ్, ట్యాక్స్, అడ్వైజరీ సేవల్లో ఉన్న ప్రముఖ కంపెనీ కేపీఎంజీ నివేదిక ‘గ్లోబల్ ప్రొఫైల్స్ ఆఫ్ ద ఫ్రాడ్‌స్టర్’ ఇదే చెబుతోంది. బయటి వ్యక్తులు కాదు.. సంస్థలో సుదీర్ఘకాలంగా, నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులే మోసాలకు తెగబడుతున్నారట.మరీ ముఖ్యంగా ఈ మోసాల్లో మగాళ్లదే అందెవేసిన చేయి. కంపెనీలూ, ఆఫీసుల్లో ఇలా మోసం చేయడంలో మాత్రం అతివలు మగాళ్లతో పోలిస్తే చాలా వెనకబడ్డారనే చెప్పాలి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో జరి గిన మోసాలకు సంబంధించిన 669 వాస్తవ కేసుల ఆధారంగా కేపీఎంజీ రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. -
అప్పులే అప్పులు
అనుకుంటాంగానీ.. అప్పులేనిదే అమెరికాకూ గడవదు. ప్రపంచంలోసంపన్నదేశం, అగ్రరాజ్యం అని చెప్పుకొనే అమెరికానే.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పు చేసిన దేశం కావడం విశేషం. ఐక్యరాజ్యసమితివాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పులప్రపంచం 2025’ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా 102 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనాలదే. 2010 నుంచి చూస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతోంది. దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపెడవుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికా. దాని అప్పు 35 ట్రిలియన్ డాలర్లు. ఆ తరువాతి స్థానంలో చైనా ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. మొత్తం ప్రపంచ అప్పులో సుమారు 70 శాతం అభివృద్ధి చెందిన దేశాలదే అయితే అందులో అమెరికా, చైనాలదే సగభాగం. ఆ తరువాత సుమారు 25 శాతం ఆసియా, ఓషనియా దేశాలది. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో 31 శాతం. ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పుల ప్రపంచం 2025’ నివేదికలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. వడ్డీల భారం తడిసిమోపెడు అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024లో రికార్డు స్థాయిలో 921 బిలియన్ డాలర్లు కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి. 2017తో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2023తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 61 దేశాలు.. ప్రభుత్వ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ కేవలం తీసుకున్న రుణానికి వడ్డీకింద చెల్లిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు విరివిగా ఖర్చు చేయాలి. కానీ, వడ్డీల భారం అందుకు అవకాశం ఇవ్వడం లేదు. 2011–13 నుంచి 2021–23 మధ్య విద్య కోసం ఈ దేశాలు చేసిన వ్యయం 52 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు 77 శాతం పెరిగింది. కానీ, తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఏకంగా 84 శాతం ఎగబాకింది. ఇలా విద్య, ఆరోగ్యం కంటే వడ్డీలకే ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల్లో నివసిస్తున్న జనాభా దాదాపు 340 కోట్లు. జీడీపీలో 60 శాతం!అభివృద్ధి చెందుతున్న సుమారు 60 దేశాల్లో.. జీడీపీలో అప్పు వాటా ఏకంగా 60 శాతానికి చేరిపోయింది. 2020లో ఆఫ్రికా, ఆసియా, ఓషనియా, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఇలాంటి దేశాల సంఖ్య 67 కాగా.. తరువాత స్వల్పంగా తగ్గుతూ 2024 నాటికి 58కి చేరింది. 2010లో ఈ సంఖ్య 35. 2013తో పోలిస్తే ప్రైవేటు సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకుపైగానే పెరిగింది. ఆఫ్రికా దేశాల్లో ఇది 42 శాతం, ఆసియాలో 61, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఏకంగా 71 శాతం.8.6 శాతం అప్పుల కోసమే..అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగానికిపైగా దేశాల మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయంలో.. ఆయా దేశాల బహిరంగ రుణం విలువ దాదాపు 88 శాతం. అంటే.. దాదాపుగా వస్తు, సేవల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమంత అప్పు అన్నమాట! ఈ దేశాలు తమ మొత్తం ఆదాయంలో 8.6 శాతాన్ని అప్పు కోసమే (అసలు, వడ్డీ ) కేటాయిస్తున్నాయి. 2010తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. దీనివల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు, మూలధన వ్యయానికి సరిపడా నిధులు ఉండటం లేదు. వడ్డీ కూడా ఎక్కువేఅభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. మరి ఈ దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే.. వస్తోంది. కానీ.. రాయితీ రుణాల రూపంలో! గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్తా ఇప్పుడు మారిపోయింది. 2011–13 మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో 28 శాతంగా ఉన్న ఈ రుణం 2021–23 మధ్య 33 శాతానికి పెరిగింది. -
వ్యాసాయ విష్ణు రూపాయ...
మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. అందుకే గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తాం. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతోపవిత్రమైనది. ఈ రోజు అష్టాదశ పురాణాలను మనకు అందించిన వ్యాసభగవానుని జన్మదినం కారణంగా గురుస్థానంలో ఆ వ్యాసభగవానుని స్మరించుకునే పర్వదినం. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి. అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి. ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైంది. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచింది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన ఒక చక్కని కథను తెలుసుకుందాం. ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు. కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ‘‘శిష్యా! నీవు నన్ను దర్శించాలని కుతూహలంగా ఉన్నావు గనుక విను. ఎవరైతే పురాణగాథలను, వేద గాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, వారిని సాక్షాత్తు వ్యాస మూర్తిగా భావించి పూజింపవలసినది. నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను’’ అని అంటారు. అందువల్ల పౌరాణికులు, కథకులు, బోధకులు అందరూ గురువులే. పురాణాలలో నిగూఢంగా ఉన్న విషయాలను తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను పూజించి తగిన విధంగా సత్కరించాలి. హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు. తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాధన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం. గురువులుగా ప్రసిద్ధిగాంచిన ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషిరిడీ సాయినాథుడు మొదలైనవారిని ఈరోజు కొలుస్తారు. ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు. అఙ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు. మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు. సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతుడై జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగివున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. మనమందరం గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం. విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.– డా. దేవులపల్లి పద్మజ -
అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!
గుజరాత్లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్‌ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్ స్పాట్‌గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్‌పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్‌గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా. -
పోషకాహార లోపాన్ని.. ఏఐ పట్టేస్తుంది
దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 50 శాతంపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి ఆరు వారాలు కీలక సమయం. చాలా మంది శిశువులకు ఈ సమయంలో ఆరోగ్య సంబంధ తనిఖీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేదలుండే ప్రాంతాలలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఎదుగుతున్న తీరు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నదీ లేనిదీ సరైన సమయంలో గుర్తించి సమస్యను పరిష్కరించలేకపోవడంతో శిశువులు పోషకాహార లోపం బారిన పడుతున్నారు. దీనికి విరుగుడుగా పలు సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాలతో రంగంలోకి దిగాయి. వీటిలో ఐఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతమై, పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి వస్తే ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు పడినట్టే.శిశువులు పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం.. బాల్యంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శిశువులు ఎదుగుదల నిలిచిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో కేలరీల లోపం వల్ల సన్నబడడం; ప్రొటీన్ లోపం వల్ల కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఈ సమస్యలను గుర్తించడం ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం. శిశువు పుట్టిన మొదటి ఆరు వారాలలో తరచూ పర్యవేక్షణ చేపట్టడం వల్ల సమస్య ఏదైనా ఉంటే.. ఆలస్యం కాకముందే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు ఏఐ తన వంతు సాయం చేస్తోంది.ఐఐఐటీ హైదరాబాద్ సైతం..నవజాత శిశువులు మొదలుకుని అయిదేళ్లలోపు పిల్లల వరకు ఏఐ సాంకేతిక సాయంతో బరువు, పొడవు, ఎత్తు.. అలాగే తల, ఛాతీ కొలతల ఆధారంగా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి.. వారిని ఆరోగ్యవంతంగా ఎదిగేలా చేయాలన్నది ఈ ప్రాజెక్టుల లక్ష్యం. పిల్లల ఎత్తు, బరువు కొలిచేందుకు సంప్రదాయ సాధనాల అవసరం లేకుండా తక్కువ సమయంలో, కచ్చిత సమాచారాన్ని అందించడంలో ఈ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్లకు పని భారం సైతం తగ్గుతుండడం కలిసి వచ్చే అంశం. వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ, రెవల్యూషనైజ్, వెల్ట్ హంగర్ లైఫ్ / మైక్రోసాఫ్ట్‌తోపాటు ఐఐఐటీ హైదరాబాద్ సైతం ఈ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థల జాబితాలో ఉంది.శిశు మాపన్ : వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు. 42 రోజుల లోపు వయసున్న నవజాత శిశువుల బరువు, పొడవు, తల, ఛాతీ చుట్టుకొలతను ఈ యాప్ ద్వారా తెలుసుకుంటారు. ఈ యాప్‌ను ఇంటర్నెట్ లేకపోయినా వాడొచ్చు. శిశువును ఓ వస్త్రంపై పడుకోబెట్టి, పక్కన స్కేల్ ఉంచి షార్ట్ వీడియో తీస్తే చాలు.. వివరాలు యాప్‌లో ప్రత్యక్షం అయిపోతాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ , తక్కువ వెలుతురులోనూ ఇది పనిచేస్తుంది. డామన్ –డయ్యూలో 2024 నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇప్పటికే 30,000 పైచిలుకు పిల్లల కొలతలను తీసుకున్నారు. గృహ – ఆధారిత నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆశ కార్యకర్తలు ఇంటికే వచ్చి పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. పోషకాహార లోపం గుర్తిస్తే ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాలతో తల్లులను అనుసంధానిస్తారు.ఎంఏఏపీ: పోషకాహార లోపం అంచనా, కార్యాచరణ ప్రణాళిక పేరుతో రెవల్యూషనైజ్ అనే కంపెనీ రాజస్తాన్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల నుంచి అయిదేళ్ల వయసున్న పిల్లల ఎత్తును అంచనా వేయడానికి, పోషకాహారలోప ప్రమాదాలను గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్ తో తీసిన ఫొటోలను ఉపయోగిస్తారు. ఎత్తు, పోషకాహార స్థాయికి తగ్గట్టుగా ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. దీనికి కూడా ఇంటర్నెట్ అవసరం లేదు. ఆరోగ్య కార్యకర్తలు మారుమూల పల్లెల్లో కూడా వెళ్లి పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను గుర్తించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. ప్రభుత్వ వైద్య శాఖలకు ఈ యాప్‌ను ఉచితంగా అందజేస్తామని కంపెనీ చెబుతోంది.ఐఐఐటీ–హైదరాబాద్: నవజాత శిశువులతోపాటు అయిదేళ్లలోపు పిల్లలు.. వెయింగ్ మెషీన్, హైట్ చార్టుల వద్ద ఉన్నప్పుడు ఫొటోలు తీస్తారు. వాటిని యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ ఎత్తు, బరువులు ఆరోగ్యకరమైనవి ఉన్నాయా లేదా అని విశ్లేషిస్తారు. ఈ యాప్‌ను ఐ–సాక్షమ్ సహకారంతో తెలంగాణలో పరీక్షిస్తోంది. ప్రొటోటైప్ ప్రస్తుతం పైలట్ దశలో ఉంది.వెల్ట్ హంగర్ లైఫ్ /మైక్రోసాఫ్ట్: ఈ సంస్థలు అభివృద్ధి చేసిన చైల్డ్ గ్రోత్ మానిటర్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల ఎత్తు, బరువు, శరీర కొలతల కోసం 3డీ ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 10,000కు పైచిలుకు స్కాన్ ్స పూర్తి చేశారు. గ్రోత్ మానిటర్ ఫలితాల్లో కచ్చితత్వం ఉంది. హార్డ్‌వేర్ ఖరీదు కావడం, సెన్సార్లపై ఆధారపడి పని చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో వినియోగాన్ని పరిమితం చేస్తోంది. -
రైజింగ్ ‘గ్రాండ్’ స్టార్
టెన్నిస్ రాకెట్ చేతపట్టిన ప్రతి ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వింబుల్డన్‌కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్‌కు చేరిన రిత్విక్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్‌గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్అంటున్నాడు. – సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్చౌదరీ కెరీర్లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్ తొలినాళ్లలో సింగిల్స్‌పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్‌కు మారడం పరిపాటి. అయితే రిత్విక్మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్ అతడి ఖాతాలో చేరాయి. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్‌లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రిత్విక్ వింబుల్డన్‌లో మాత్రం రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ కాదని... క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్పసితనంలో అన్నీ చేస్తూ హైపర్ యాక్టివ్‌గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు.సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ మైదానం సమీపంలోని ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లో కోచ్ సీవీ నాగరాజ్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్అండర్–12, అండర్–16 స్థాయిలో జాతీయ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్‌కప్‌లో, గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన సాకేత్ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లోనే శిక్షణ తీసుకున్నారు. కోచ్ నాగరాజ్ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్ టోర్నీలు ఉన్నా వింబుల్డన్ మాత్రం ప్రత్యేకమని రిత్విక్తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్ అధికారిక వెబ్సైట్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్ సంప్రాస్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... టెన్నిస్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్‌కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘వింబుల్డన్ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్ విజయానంతరం రిత్విక్అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంటోస్తో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన రిత్విక్... రెండో రౌండ్లో ఆరో సీడ్ జోడీ జో సాలిస్బరీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. రిత్విక్వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా... వింబుల్డన్ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్‌లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్తల్లి రిత్విక్ప్రొఫైల్పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్ ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 85 కేజీలు ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2022 డబుల్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్: 65 (మార్చి;2025లో) ఏటీపీ టూర్లో నెగ్గిన డబుల్స్ టైటిల్స్: 2 (అల్మాటీ ఓపెన్–250 టోర్నీ; చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ) ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్స్: 5 ఐటీఎఫ్ సర్క్యూట్లో నెగ్గిన టైటిల్స్: 6 -
రెడీ టు కుక్... ఓ నయా ట్రెండింగ్...!
సాక్షి, హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో వేగం పెరుగుతున్న కొద్దీ, మన ఆహార అలవాట్లు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. దీనికి తోడు రోజురోజుకూ విస్తరిస్తున్న పట్టణీకరణతో పాటు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో డబ్బు ఖర్చుకు వెనకాడకపోవడం...ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే తొందర, రోజంతా పనిచేశాక సాయంత్రం పూట ట్రాఫిక్ రద్దీతో చికాకుతో ఇళ్లకు చేరినపుడు అలసిపోయిన మనుషులకు, అప్పటికప్పుడు తక్కువ సమయంతో రుచికరమైన వంటలు తయారుచేసుకునే ‘రెడీ టు కుక్ అండ్ ఈట్’ఉత్పత్తులు ఒక వరంగా మారుతున్నాయి. దోశల నుంచి ట్రెండీ కేక్ మిక్స్‌ల దాకా... తాజాదనంతో పాటు, ఆరోగ్యంపై దృష్టితో సాంప్రదాయిక దోశ, ఇడ్లీ, వడలు మొదలు ట్రెండీ కేక్ మిక్స్‌ల దాకా ఇప్పుడు మార్కెట్లో ఎన్నోరకాల రెడీ టూ కుక్ మిక్స్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేశాయి. మొదట్లో పెద్ద నగరాల్లో...మరీ ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులకు ఇలాంటివి అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా ‘రెడీ టు కుక్’ఆహారపు అలవాట్లు, అభిరుచులు విస్తరించేశాయి. గృహిణులు మొదలు విద్యార్థులు, ఉద్యోగులు, బ్యాచిలర్లు ఇలా అన్ని వర్గాల వారికి ఈ రెడీ టు కుక్ వంటకాలు ఆహారం తయారు చేసే సమయాన్ని ఆదా చేస్తూ, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా కూడా ఈ విభాగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండేందుకు ఉపయోగించే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) లేకుండా, తక్కువ ప్రాసెసింగ్‌తో తయారయ్యే, ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై వినియోగదారులు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రకరకాల ఉత్పత్తులతో ఐడీ ఫ్రెష్, ఎంటీఆర్ ఆశీర్వాద్, జిట్స్ వంటి కంపెనీలు మన మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం చూస్తే...ఇండియాలో రెడీ టు కుక్ విభాగం 2023లో రూ.5 వేల కోట్ల మార్కెట్‌ను దా టి 2027 నాటికి రూ.8 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2024లో రెడీ ›టు కుక్ కేటగిరీ 58 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడైంది. 2 ఏళ్లలో 1.8 కోట్ల కుటుంబాలు యాడ్... తాజాగా కాంటార్ వరల్డ్ ప్యానెల్ విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే...గత రెండేళ్లలో రెడీ టు కుక్ కేటగిరీలో అమ్మకాలు అనేవి రెండింతలు పెరగడమే కాకుండా 1.8 కోట్ల కొత్త కుటుంబాలు ఈ తరహా ఆహారపు రకాలు, కేటగిరీల వైపు ఆకర్షితులైనట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో రెడీ టు ఈట్ సెగ్మెంట్ అనేది క్షీణతను నమోదు చేయడంతో వినియోగదారులు ‘హోమ్–కుక్డ్ మీల్స్’వైపు ఆకర్షితులవుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద కంపెనీలు సైతం రంగంలోకి... ప్రముఖ కంపెనీల బ్రాండ్లు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేస్తూ, కొత్త వంటకాలను ప్రవేశపెడుతున్నాయని కాంటార్ తన అధ్యయనంలో పేర్కొంది. ఉదాహరణకు, ఇప్పుడు కేవలం దోస మిక్స్ మాత్రమే కాదు, బిర్యానీ కిట్స్ వంటివి ఇంకా ప్రాంతీయ అభిరుచులు, ప్రత్యేకతలకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేశాయి.ఈ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఆయా కేటగిరీల వస్తువుల ద్వారా పెరుగుతున్న ఆదాయాన్ని చూశాక పెద్ద కంపెనీలు కూడా ఈ తరహా ఆహార ఉత్పత్తుల తయారీ వైపు దృష్టిని నిలుపుతున్నట్టుగా స్పష్టమవుతోంది. అదే సమయంలో కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే విషయంలో ఉత్సాహం చూపడంతో పాటు ముందువరసలో నిలుస్తున్నాయి. ఈ ఉత్పత్తులు ఇప్పుడు కేవలం స్వదేశీయ మార్కెట్‌కే పరిమితమవ్వకుండా జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ విస్తరిస్తున్నాయి. అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఉత్పత్తులను తక్కువ సమయంలో ఇంటికే డెలివరీ చేస్తూ మార్కెట్ విస్తరణకు దోహదపడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత విస్తరణ... ఇన్నాళ్లు సాంప్రదాయికంగా తయారయ్యే వంటకాలను కేవలం అమ్మమ్మలే చేస్తారని భావించిన మనం, ఇప్పుడు అవే వంటకాలను అయిదు నిమిషాల్లో రెడీ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాము. దీనిని ప్రతికూల మార్పుగా కాకుండా కాలానుగుణంగా భోజన అలవాట్లు, అభిరుచుల్లో వచ్చిన మార్పుగా భావించాల్సి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ‘రెడీ టు కుక్’విభాగం మరింత విస్తరిస్తూ.. సంప్రదాయ రుచులను కొత్త ప్యాకేజింగ్‌లో అందించే ఒరవడి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేçస్తున్నారు. -
అతడు వదిలి వెళ్లిన పాఠాలు
గురుదత్ను సర్వోన్నత దర్శకుడిగా ప్రపంచం గుర్తిస్తుంది. ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ వంటి క్లాసిక్స్ తీసి గ్రేట్ మాస్టర్ అనిపించుకున్నాడు. వహిదా రెహమాన్ వంటి నటిని ఇంట్రడ్యూస్ చేశాడు. నేటి తరానికి అతని సినిమాలు పాఠాలే. అలాగే అతని వ్యక్తిగత జీవితం కూడా కుటుంబ జీవితాన్ని ఎలా పదిలపరుచుకోవాలో హెచ్చరించే పాఠం. మరణించి దశాబ్దాలు గడిచినా నేటికీ స్మరణకు నోచుకుంటున్న గురుదత్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.గురుదత్‌కు చిన్నప్పటి నుంచి దృష్టి సమస్య ఉంది. రెండు గజాల అవతల ఏముందో కళ్లద్దాలు లేకుంటే చూడలేడు. గురుదత్ తాను హీరోగా నటించిన చాలా సినిమాల్లో కళ్లద్దాలు వాడలేదు. ఇప్పుడు మీరు అతని సినిమాలు చూడండి. ఆ సినిమాలన్నింటిలోనూ అతడు ఎదురుగా ఏముందో కనపడకనే నటించాడు. డైలాగులు చెప్పాడు. నృత్యాలు చేశాడు. క్లోజప్స్ ఇచ్చాడు. కళ్లు కనపడుతున్నట్టుగానే ప్రేక్షకులకు భ్రాంతి కలిగించాడు. గురుదత్ అంత గొప్ప మేధావి. నిపుణుడు. నటుడు. కళాకారుడు.గురుదత్ (Guru Dutt) తెలిసిన వాళ్లకు పరిచయం చేయనక్కర్లేదు. తెలియని తెలుగువారికి ‘మల్లెపూవు’ సినిమాను గుర్తు చేయాలి. శోభన్‌బాబు నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ‘చిన్నమాటా... ఒక చిన్నమాటా...’ ‘మల్లెపూవు’కు ఒరిజినల్ గురుదత్ క్లాసిక్ ప్యాసా’. గురుదత్ను పరిచయం చేయాలంటే తెలుగు లింక్ ఇంకోటి చెప్పాచ్చు. మన తెలుగమ్మాయి వహీదా రహెమాన్‌ను సూపర్‌స్టార్‌ను చేసింది అతడే. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన దర్శకుడు శ్యాం బెనగళ్‌కు గురుదత్ దగ్గరి బంధువు. గురుదత్ చేతుల్లో పడి స్టార్ కమెడియన్ అయిన బస్ కండక్టర్ జానీ వాకర్. ఇతని తండ్రి మిల్లు టెక్నిషియన్‌గా మూడేళ్ల పాటు వరంగల్‌లో పని చేశాడు.హీరోలకు విశేషమైన ప్రత్యేకతలు ఉండాలి. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్... ఈ ముగ్గురిలో ప్రేక్షకులు మెచ్చే ప్రత్యేకతలు ఉన్నాయి. చూపులకు వీరు అందగాళ్లు. మాట తీరు, నడక, నటన... ఏదో స్పెషల్. కాని వీరిమధ్య ఏ ప్రత్యేకతలు లేనట్టుగా కనపడుతూ ప్రత్యేకత చాటుకున్న హీరో గురుదత్. ఒక రకంగా ఇతను రాజ్‌కపూర్‌కు క్లాసిక్ వెర్షన్. రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించాడు. గురుదత్ కూడా అలాగే చేశాడు. రాజ్‌కపూర్ పాపులర్ స్టయిల్లో సినిమా మేకింగ్ చేస్తే గురుదత్ క్లాసిక్ స్టయిల్ లో చేశాడు.ఇద్దరూ పాటలు తీయడంలో మాస్టర్స్. కాని రాజ్‌కపూర్ పాటలకు ప్రిలూడ్ ఉండాలి. ‘ఆవారా హూ’... మొదలవ్వాలంటే మొదట సంగీతం వినిపించాలి. ఈ సంగీతాన్ని కట్ చేసి నేరుగా పాటను మొదలెట్టి షాక్‌కు గురి చేశాడు గురుదత్. అతని సినిమాల్లోని పాటలు ప్రిలూడ్స్ లేకుండా మొదలవుతాయి. పాట పాడాలంటే వెంటనే పాడొచ్చు కదా... మొదట సంగీతం వినండి అని ఆగడం ఎందుకు అన్నట్టుగా ఉంటుంది అతని ధోరణి. మిస్టర్ అండ్ మిసెస్ 55లో ‘అయ్ జీ దిల్ పర్ హువా ఐసా జాదూ’ పాట చూడండి.గురుదత్ అసలు పేరు వసంత కుమార్ పడుకోన్. కొంకణి ్రపాంతం వీళ్లది. మంగుళూరు. కోల్‌కతాలో బాల్యం గడిచాక, కాలేజీ చదువు చదివే వీలు లేక, నెలకు 30 రూపాయలకు టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేశాడు. తర్వాత పండిట్ రవి శంకర్ సోదరుడు ఉదయ్ శంకర్ దగ్గర కొరియోగ్రఫీ నేర్చుకున్నాడు. పూణె వెళ్లి ప్రభాత్ స్టూడియోలో ఉద్యోగిగా సినిమా జీవితం మొదలుపెట్టాడు. అక్కడే దేవ్ఆనంద్ మొదటి సినిమా ‘హమ్ ఏక్ హై’ చిత్రీకరణ జరిగింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. దేవ్ ఆనంద్ హీరో అయ్యాక గురుదత్‌కు దర్శకుడిగా అవకాశం ఇస్తే ‘బాజీ’ (1951) తీసి క్రైమ్ థ్రిల్లర్స్ ఇలా కూడా తీయొచ్చా అని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాజీ సూపర్ హిట్. అప్పటికి గురుదత్ వయసు సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ వయసుకే అతడు స్క్రీన్ మీద మాస్టర్ స్టోరీ టెల్లర్ అయ్యాడు.గురుదత్‌కు ఒక టీమ్ ఉంది. అతడు సినిమా ఇండస్ట్రీలో అందరినీ కలిసే వ్యక్తి కాదు. అందరూ కలవడానికి వీలు ఇవ్వడు. కమెడియన్ జానీ వాకర్, సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, నటుడు రహెమాన్, రచయిత అబ్రార్ అల్వీ.. ఇలా కొంతమంది మాత్రమే అతనికి దగ్గరగా ఉండగలిగారు. ఈ టీమ్‌తోనే అతడు గొప్ప సినిమాలు తీశాడు. నిర్మించాడు. నటించాడు. గురుదత్తో ప్రమేయం ఉన్న సినిమాలు మొత్తం 15. అతను దర్శకత్వం వహించింది కేవలం 8. అయినా సరే నేటికీ అతడు భారతదేశం చూసిన గొప్ప దర్శకుల్లో ఒకడు.సినిమా నేల విడిచి సాము చేయకపోవడం... వర్తమానంలో ఉండటం... పాత్రలు తమ బలాలు బలహీనతలతో కనపడటం... వాటి మనసుల్లోని వెలుగు నీడల వలే దృశ్యాల్లో కూడా వెలుగు నీడలు పరవడం, మంచి సంగీతం, నటన... న్యాయమైన కొన్ని ఆలోచనల ప్రతిపాదన... అంతే గురుదత్ సినిమాలు. అయినా సరే నిలిచాయి. మిస్టర్ అండ్ మిసెస్ 55లో అతడు కార్టూనిస్టుగా కనిపిస్తాడు. ఆ రోజుల్లో కార్టూనిస్టును హీరోగా ఊహించగలమా? ప్యాసా’లో అతడు కవి. ‘కాగజ్ కే ఫూల్’లో సినిమా దర్శకుడు. గురుదత్ తను కళాకారుడు కనుక కళా ప్రపంచంలో ఉండే పాత్రలే అతడి సినిమాలను లీడ్ చేశాయి. సమాజం వేరు... ఆదర్శం వేరు... ఆదర్శాన్ని చావుదెబ్బ తీయడమే సమాజం పని... ఇక ఆదర్శవంతమైన కళను అది ఎంత హేళన చేయాలో అంతా చేస్తుంది. ఎందుకంటే ఆదర్శాన్ని చూస్తే సమాజానికి భయం. ఆదర్శాన్ని ఊతంగా చేసుకుని విలువలు పాటిస్తే ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లవు. డబ్బులు రాలవు. మేడలు నిలవవు. కాని ఆదర్శం అంటే తనకు ఇష్టమని చెప్పుకోవడానికి సమాజం నటిస్తుంటుంది. ఆ నటన మీద గురుదత్ గట్టిగా ప్రకటించిన నిరసన, ఊసిన ఉమ్ము ప్యాసా’. గురుదత్, వహీదా రహెమాన్, సాహిర్ లూధియాన్వీ, ఎస్.డి.బర్మన్, వి.కె.మూర్తి... వీరందరి ఉత్కృష్ట కళాప్రకటన అది. ఈ సినిమాతో వచ్చిన ఖ్యాతితో గురుదత్ తీసిన మరో క్లాసిక్ ‘కాగజ్ కే ఫూల్’. అయితే రాజ్ కపూర్‌కు ‘మేరా నామ్ జోకర్’ వల్ల ఏం జరిగిందో గురుదత్‌కు ‘కాగజ్ కే ఫూల్’ వల్ల అదే జరిగింది. కాలం కంటే ముందు తీసిన ఈ సినిమా గురుదత్ను ఆ రోజుల్లో ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. 18 లక్షలు నష్టం. సినిమా ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్లు ఎలా ఉంటాయో ఇగోలు మనుషుల్ని ఎలా బలిచేస్తాయో చూపిన ఈ సినిమా నేడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచినా గురుదత్ను దర్శకత్వం కుర్చీని వదిలిపెట్టేలా చేసింది.గురుదత్ ఆ తర్వాత కూడా ‘చౌదవీ కా చాంద్’, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’లను నటించి, నిర్మించి చాలా డబ్బు చేసుకోగలిగాడు. అతడు ఆర్థిక కష్టాల వల్ల చనిపోలేదు. ఆత్మిక కష్టాల వల్ల వెళ్లిపోయాడు. 39 ఏళ్లకు 1964లో మరణించినా నేటికీ గురుదత్ ఫెస్టివల్స్ జరుగుతూనే ఉన్నాయి. గురుదత్ సినిమాలు పాఠ్యాంశాలుగానే ఉన్నాయి. గురుదత్ మరో వందేళ్లు ఉంటాడు. – కె.కళ సరే... ఇంటి మాట ఏమిటి?గురుదత్ను ఎవరో నిర్మాత ‘మిస్సమ్మ’ సినిమా చూడమని హైదరాబాద్‌కు పిలిపించాడు. గురుదత్‌కు నచ్చితే హిందీలో రీమేక్ చేయించాలని. హైదరాబాద్‌కు వచ్చిన గురుదత్‌కు ‘మిస్సమ్మ’ నచ్చలేదు కాని అంతకుముందు సంవత్సరం రిలీజై హిట్ అయిన ‘రోజులు మారాయి’లో డాన్స్ చేసి గుర్తింపు పొందిన వహీదా రహెమాన్‌ను పరిచయం చేస్తే ఆమె నచ్చింది. నాలుగు సినిమాల కాంట్రాక్ట్ మీద బొంబాయి తీసుకెళ్లిన గురుదత్ ఆమెను ‘సి.ఐ.డి’ నుంచి ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ వరకూ గట్టి పాత్రలు ఇచ్చి ఆమె కెరీర్‌ను కుదుట పరిచాడు. ఆ పరిచయం అతని వివాహ జీవితంలో దుమారం రేపింది.అప్పటికే ప్రసిద్ధ గాయని గీతాదత్ను వివాహం చేసుకుని, ముగ్గురు పిల్లల తండ్రి అయిన గురుదత్ అటు ఆమె నిరసనను, ఇటు వహిదా పట్ల ఆకర్షణను నిర్వహించలేక చతికిల పడ్డాడు. గురుదత్ వల్ల గీతాదత్ గాయనిగా తన కెరీర్‌ను పోగొట్టుకుంది. ఒక గొప్ప గాయని భర్తగా ఆమెను ఎలా చూసుకోవాలో గురుదత్‌కు తెలియలేదు. అలాగే సాటి నటీమణి ఆకర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియలేదు.ఈ కారణం చేత గురుదత్ అకాలమరణం సంభవించింది. ఇతను మరణించిన రెండేళ్లకే గీతాదత్ మరణించింది. ముగ్గురు పిల్లలు అనాథలవగా వారిలో ఒక కుమారుడు తర్వాతి కాలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కెరీర్‌ను, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ దేనికి విరామం ఇవ్వాలో తెలుసుకుని జీవించకపోతే ఎవరైనా ఒడిదుడుకులు ఎదుర్కొనక తప్పదు అని గురుదత్ జీవితం విలువైన పాఠం చెబుతూనే ఉంటుంది. వక్త్ నే కియా క్యా హసీన్ సితమ్ హమ్ రహే నా హమ్ తుమ్ రహే నా తుమ్ -
అందమైన శత్రువు..
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి.. పాదరసం కలిసిన సౌందర్య సాధనాల ఉత్పత్తులపై నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని జూన్17న జరిగిన సమావేశం మినిట్స్‌లో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ధ్రువీకరించింది. చట్టప్రకారం కాస్మెటిక్స్‌లో పాదరసం నిర్దేశిత మోతాదుపై ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. సౌందర్య సాధనాల తయారీపై నిఘాను కఠినతరం చేయనుంది. అసలింతకీ ప్రమాదకర లక్షణాలు పాదరసంలో ఏమున్నాయి.. ఇంతకూ దాన్ని సౌందర్య సంబంధ ఉత్పత్తుల్లో ఎందుకు వాడతారు? – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో కాస్మెటిక్స్ అన్నది సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం. అమ్మకాల పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ మనది. చాలా సౌందర్య సాధనాల్లో స్వల్ప స్థాయుల్లో పాదరసం వినియోగిస్తారు. అయితే పాదరసం మానవ ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ రెండింటినీ ప్రభావితం చేసే విషపూరిత మూలకం. అందుకే కాస్మెటిక్స్ తయారీలో ఈ లోహం వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.2013 ‘మినామాటా కన్వెన్షన్ ’..: పాదరసం, పాదరస సమ్మేళనాల హానికర ప్రభావాల నుండి మానవాళిని, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో 2013లో జపాన్ వేదికగా ‘మినామాటా కన్వెన్షన్ ’ (మినామాటా అంతర్జాతీయ ఒప్పందం) కుదిరింది. దాని ప్రకారం సౌందర్య సాధనాలలో 1 పీపీఎం (ఒక పార్ట్స్ పర్ మిలియన్ – అంటే 0.0001 శాతం) కంటే ఎక్కువ పాదరసం ఉండకూడదు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పరిమితి దాటి పాదరసం ఉన్న కాస్మెటిక్స్ ఎగుమతులను, దిగుమతులను, తయారీని, ఇంకా ఇతర లోపాలను గుర్తించేందుకు డీసీజీఐ 2024లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. మనదేశంలోని ప్రస్తుత కాస్మెటిక్స్ చట్టం.. ‘మినామాటా కన్వెన్షన్ ’ ఒప్పందానికి లోబడే ఉందని ఆ ఉపసంఘం నివేదిక పరిశీలించిన డీసీసీ స్పష్టం చేసింది.దిగుమతులే ఆధారంమనదేశం పాదరసం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశం 32.77 లక్షల డాలర్ల విలువైన 73,085 కిలోల పాదరసం దిగుమతి చేసుకుంది. మనకు ఎగుమతి చేసే ప్రధాన దేశాలు పెరు, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, యూకే. మనదేశ నిబంధనల ప్రకారం కంటి ప్రాంతంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో కలిపే పాదరసం స్థాయి 70 పీపీఎంలకు (అంటే 0.007 శాతం) మించకూడదు. ఇతర సౌందర్య సాధనాలలో ఇది 1 పీపీఎంను దాటకూడదు.అన్ని రంగాల నిపుణులతో..‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేసిన సిఫారసుల కమిటీకి చైర్మన్‌గా – ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎన్. భట్టాచార్య, సభ్యులుగా ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగాల వైద్య నిపుణులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు. ‘అందానికి’ పాదరసం ఎందుకు?పాదరసాన్ని సాధారణంగా చర్మాన్ని తెల్లగా చేసే ఉత్పత్తుల్లో వాడతారు. చర్మాన్ని కాంతిమంతం చేసే క్రీములు; చర్మంపై చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను పోగొట్టే సౌందర్య సాధనాలు; వయసును కనపడనీయని యాంటీ–ఏజింగ్ సొల్యూషన్ లు, ఇంకా కొన్ని రకాలైన మేకప్ పదార్థాలు.. పాదరసాన్ని కాస్తయినా కలపకుండా తయారు కావు. చర్మం రంగు నల్లగా ఉండటానికి చర్మంలోని ‘మెలనిన్’ కారణం. పాదరసం ఆ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నల్లదనం తగ్గుతుంది. అలాగే పాదరసం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపగలదు. కొన్ని సౌందర్య సాధనాలలో సంరక్షణకారిగానూ ఉపయోగపడుతుంది.చాలా ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ పాదరసాన్ని అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 రసాయనాల జాబితాలో చేర్చింది. పాదరసం కలిసి ఉన్న కాస్మెటిక్స్‌ను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాదరసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదరసం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. » ఒంటిమీద దద్దుర్లు, రంగు పోవడం» జీర్ణ సంబంధమైనవి» వ్యాధి నిరోధక శక్తి తగ్గడం» ఆందోళన, ఒత్తిడి» నాడీ సంబంధమైనవి» జ్ఞాపకశక్తి సమస్యలు» భావోద్వేగాల్లో అనూహ్యమైన మార్పులుభారీగా పెరిగిన కాలుష్యంపాదరస ఉద్గారాలు 1960తో పోలిస్తే 2021లో 3.3 రెట్లు పెరిగాయి. మొత్తం ఉద్గారాల్లో చైనా, భారత్, ఇండోనేషియా, పెరు, బ్రెజిల్‌ల వాటా దాదాపు 50 శాతం. – ప్రపంచంలో అత్యధిక పాదరస కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఆ తరవాతి స్థానంలో మనదేశం ఉంది.» బంగారు ఆభరణాల తయారీలో, బంగారం తవ్వకాలు వంటి వాటిలో పాదరసాన్ని విరివిగా వినియోగిస్తారు.» కొన్ని రకాల పరిశ్రమలు, సిమెంటు తయారీ, ఈ–వేస్ట్ వంటి చెత్తను కాల్చడం, బొగ్గును కాల్చడం.. ఇలా పాదరసం అనేక కారణాల వల్ల వాతావరణంలోకి చేరుతోంది.ఇలా చూసుకోవచ్చు|మనం కొనే ఉత్పత్తుల్లో మెర్క్యురస్ క్లోరైడ్, క్యాలొమెల్, మెర్క్యురిక్ అయోడైడ్ అనే పేర్లు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇవన్నీ పాదరస సంబంధమైనవే. -
ల్యాబ్ వజ్రం.. జిగేల్!
కోట్ల కొద్దీ సంవత్సరాలుగా రసాయనిక చర్యలకు గురై, ఎక్కడో భూమి లోతుల్లో నిక్షిప్తమై అత్యంత అరుదుగా లభించే వజ్రాలు.. ఇప్పుడు ప్రయోగశాలల్లో కూడా తయారవుతున్నాయి. సహజమైన వజ్రాలకు చౌక ప్రత్యామ్నాయమైన ఈ వజ్రాలను ల్యాబ్ గ్రోన్ డైమండ్లుగా (ఎల్జీడీ) పిలుచుకుంటున్నారు. సహజ వజ్రాల ధరలు పెరుగుతుండటంతో, బడ్జెట్ గురించి ఆలోచించే వర్గాల్లోనూ, యువతలోనూ ఈ ఎల్‌జీడీలకు ఆదరణ పెరుగుతోంది. ల్యాబ్‌లలో తయారు చేసే ఈ వజ్రాల ధర, సహజ డైమండ్లతో పోలిస్తే దాదాపు 70–90 శాతం తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణ అనుకూలమైన విధానంలో తయారు చేస్తుండటం కూడా ఇందుకు కారణాలు. ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ ప్రకారం అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2024లో సుమారు 26 బిలియన్ డాలర్లుగా ఉండగా 2032 నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ కటింగ్, పాలిషింగ్‌కి పేరొందిన భారత్ ఇప్పుడు ఎల్జీడీ రంగంలో కూడా కీలకంగా మారుతోంది. దేశీయంగా ఏటా 8–10 శాతం పెరుగు తున్న రత్నాభరణాల మార్కెట్ దాదాపు 80–85 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో సహజ వజ్రాభరణాల వాటా సుమారు 10 శాతంగా ఉంటోంది. గతేడాది ఎల్జీడీల మార్కెట్ 600–700 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. ఇలా ఎల్జీడీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలు దిగ్గజ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు ట్రెంట్ ఇటీవలే తమ ఎల్జీడీ బ్రాండ్ ‘పోమ్’తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఎల్జీడీ మార్కెట్లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సెనెస్ ఫ్యాషన్ అనే అనుబంధ సంస్థ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌తో పాటు పర్ఫ్యూమ్లు, లెదర్ యాక్సెసరీల్లాంటి లగ్జరీ ఐటమ్స్పైనా దృష్టి పెడుతోంది. ఇలా ఎల్‌జీడీలకు ఆదరణ పెరగడం ఒక కోణం అయితే ఇవి మిగతా సెగ్మెంట్లకు పోటీ కావడం మరో కోణంగా మారుతోంది. ఎల్జీడీలతో వివాహ ఆభరణాల సెగ్మెంట్‌కి వచ్చే నష్టమేమీ పెద్దగా లేకపోయినా.. రోజువారీ ఉపయోగించుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాలకు ఇవి పోటీగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో దాదాపు రూ. 150 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌జీడీలకు గత కొన్నాళ్లు గా డిమాండ్ పెరుగుతోంది. దీంతో లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, లాదియా తదితర సంస్థలు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సుమారు రూ. 100–150 కోట్ల వరకు మార్కెట్ ఉంటుందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్న లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ సంస్థ ఇన్వెస్టర్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇది ఏటా 15–17 శాతం వరకు వృద్ధి చెందుతోందని చెప్పారు. ఎక్కువగా 18–30 ఏళ్లు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారు వీటిపై మక్కువ చూపిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా రూ. 20–25 వేల వరకు సగటు ధర ఉండే రింగులు, పెండెంట్లు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోందని పేర్కొన్నారు. తమ స్టోర్లు ఒక్కొక్కటి ప్రతి నెలా సుమారు రూ. 20–25 లక్షల వరకు సేల్స్ సాధిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కూడా గణనీయంగా వృద్ధి చెందుతోందని వివరించారు. అక్కడి వినియోగ ధోరణులను పరిశీలిస్తే పొరుగు రాష్ట్రాన్ని కూడా త్వరలోనే అధిగమించే అవకాశం ఉందన్నారు. సిసలైన డైమండ్‌తో పోలిస్తే ఎల్జీడీలు దాదాపు పదో వంతుకే లభిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఉదాహరణకు సిసలైన డైమండ్ ఖరీదు రూ. 9 లక్షలుగా ఉంటే ఎల్జీడీ దాదాపు రూ. 1 లక్షకే లభిస్తుందని వివరించారు. ఎల్జీడీల కు ఎక్సే్చంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పా రు. ఇలా అందుబాటు ధరలో లభిస్తుండటం, పర్యావరణహితమైనవి కావడంలాంటివి ఎల్‌జీడీలకు సంబంధించి ఆకర్షణీయమైన అంశాలుగా ఉంటున్నాయి. ఆదరణ ఎందుకంటే .. → గనుల్లో నుంచి తవ్వి తీసే సహజ వజ్రాల కన్నా పర్యావరణానికి అనుకూలమైన, నైతికంగా తయారు చేసే ప్రత్యామ్నాయాలుగా ఎల్జీడీలు ఆదరణ పొందుతున్నాయి. → కొంత ఖర్చు చేయతగిన విధంగా ఆదాయాలు, విలువైన డైమండ్లపై పెట్టుబడి మీద అవగాహన పెరుగుతుండటం. → వినియోగదారుల్లో, ముఖ్యంగా యువత అభిరుచి మారుతుండటం, ఎల్జీడీలతో మరింత కస్టమైజ్డ్ జ్యుయలరీ డిజైన్లను తయారు చేసేందుకు వీలుండటం. → సహజమైన డైమండ్లతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయాలకే, చాలా తక్కువ సమయంలోనే ఉత్పత్తి చేయడం వల్ల నాణ్యమైన ప్రత్యామ్నాయ వజ్రాలు చౌకగా లభ్యమవుతుండటం → ప్రభుత్వం కూడా వీటి తయారీని ప్రోత్సహించే దిశగా ఎల్జీడీ సీడ్స్‌పై కస్టమ్స్ సుంకాలను అయిదు శాతం నుంచి సున్నా స్థాయికి తగ్గించింది. ఏమిటీ ఎల్జీడీలు.. → కార్బన్‌తో కూడుకున్న సహజసిద్ధమైన వజ్రాలను గనుల నుంచి వెలికితీస్తా రు. డైమండ్ సీడ్‌ను ఉపయోగించి ఎల్జీడీలను హై–ప్రెజర్, హై టెంపరేచర్ (హెచ్‌పీహెచ్‌టీ), కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడీ) అనే పద్ధతుల్లో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చంగా సహజమైన డైమండ్లలాగే ఉంటాయి. ఒరిజినల్ డైమండ్‌ని, వీటిని పక్కపక్కన పెడితే పలు సందర్భాల్లో నిపుణులు సైతం ప్రత్యేక పరికరాలు లేకుండా వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. → సహజమైన రఫ్ డైమండ్ల సరఫరా ప్రస్తుతం సుమా రు ఏటా 125 మిలియన్ క్యారట్లుగా ఉండగా 2050 నాటికి 14 మిలియన్ క్యారట్లకు పడిపోతుందని అంచనా. మరోవైపు డిమాండ్ మాత్రం 292 మిలియన్ క్యారట్లకు పెరుగుతుందని అంచనా. → మన దగ్గర సూరత్, ముంబై ప్రధాన ఎల్జీడీ హబ్‌లుగా ఉంటున్నాయి. ఎల్జీడీ ఉత్పత్తిలో దాదాపు 98 శాతం వాటా వీటిదే ఉంటోంది. → డైమండ్ విలువను నిర్దేశించేవి 4 ఇలు. కలర్ (రంగు), క్లారిటీ (స్వచ్ఛత), కట్, క్యారట్ బరువు. ఈ అన్ని ప్రమాణాల్లోనూ సహజ వజ్రాలకు ఎల్జీడీలు గట్టి పోటీనిస్తున్నాయి. మలినాలు లేని, అత్యంత స్వచ్ఛమైన ‘టైప్ 2ఏ’ రకం డైమండ్ల తరహా వజ్రాలను కూడా తయారు చేస్తున్నారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు 7.5 క్యారట్ల ఎల్జీడీని బహూకరించారు. ఇది అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే టైప్ 2ఏ కోవకు చెందిన వజ్రం. ఇలాంటివి ఎంత అరుదైనవంటే.. గనుల్లో నుంచి వెలికి తీసే వజ్రాల్లో 1–2 శాతం మాత్రమే ఈ కోవకి చెందినవై ఉంటాయి. → సహజమైన వజ్రాలు ఏర్పడటానికి 100 కోట్ల నుంచి 330 కోట్ల సంవత్సరాలు పట్టగా, ఎల్జీడీలను ల్యాబొరేటరీల్లో కేవలం 2 వారాల నుంచి 10 వారాల్లోనే తయారు చేయొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విదేశీ పండ్లపై పెరుగుతున్న మక్కువ
మనదేశంలో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నా ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మన వాళ్లకు పరదేశి పండ్లపై మోజు పెరుగుతోంది. ఒకప్పుడు భారీ మాల్స్, సూపర్ మార్కెట్లకే పరిమితమైన విదేశీ పండ్లు ఇప్పుడు రోడ్ల వెంబడి దుకాణాలనూ ఆక్రమించాయి. దేశీయ పండ్లతో పోలిస్తే వీటి ధరలు కాస్త ఎక్కువే అయినా.. పోషకాలు అధికంగా ఉంటాయన్న ప్రచారం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఫలితంగా వీటి అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.సాక్షి, అమరావతి: కరోనా తర్వాత పండ్ల వినియోగం పెరగ్గా.. విదేశీ పండ్లకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా కేవలం ఆరేళ్లలో దిగుమతుల విలువ 82 శాతం పెరిగింది. 1970 దశకంలోనే విదేశీ పండ్ల దిగుమతులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో యాపిల్స్, ఖర్జూర మాత్రమే విదేశాల నుంచి అతికొద్ది పరిమాణంలో దిగుమతి అయ్యేవి. స్వేచ్ఛా వాణిజ్యం అమలులోకి వచ్చాక 1991 నుంచి విదేశీ వస్తువులతోపాటు విదేశీ పండ్ల దిగుమతులు పెరిగాయి.అప్పట్లో మెట్రో నగరాల్లో హై ఎండ్ సూపర్ మార్కెట్లలో మాత్రమే విదేశీ పండ్లు విక్రయించేవారు. 2015 తర్వాత నగరాలు, పట్టణ ప్రజల జీవన శైలిలో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుణ్యమాని ఆరోగ్య అలవాట్లలో మార్పులు వచ్చి పండ్ల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ఈ కారణంగా దేశీయంగా లభించే పండ్లతోపాటు విదేశీ పండ్ల వినియోగం పెరిగింది. ఫలితంగా విదేశీ పండ్ల దిగుమతుల విలువ రూ.వందల కోట్ల నుంచి రూ.వేల కోట్లకు చేరింది. వివిధ దేశాల నుంచి.. వేర్వేరు పండ్లుకశ్మిర్ యాపిల్‌కు అమెరికా, న్యూజిలాండ్, చిలీ, ఇరాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్ పోటీగా నిలుస్తోంది. న్యూజిలాండ్, ఇరాన్, ఇటలీ నుంచి కివీ పండ్లు, చిలీ, దక్షిణాఫ్రికా నుంచి ద్రాక్ష, చైనా, అమెరికా, బెల్జియం నుంచి పియర్స్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి ఖర్జూర, వియత్నాం, థాయ్‌లాండ్ నుంచి డ్రాగన్ ఫ్రూట్స్, యూరప్, అమెరికా దేశాల నుంచి బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ పండ్లను, న్యూజిలాండ్, కెన్యా, పెరూ, ఇండోనేషియా నుంచి అవకాడో, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్, ఇటలీ దేశాల నుంచి బత్తాయి, ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఆరేళ్లలో 82 శాతం పెరుగుదలవ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) లెక్కల ప్రకారం జాతీయ స్థాయిలో తొలిసారి వాణిజ్యపరంగా 1991లో కేవలం రూ.120 కోట్ల విలువైన 40 వేల టన్నుల విదేశీ పండ్లను దిగుమతి చేసుకున్నారు. 2000–01 నాటికి రూ.480 కోట్ల విలువైన 1.20 లక్షల టన్నుల పండ్లు దిగుమతి చేసుకోగా.. 2010–11లో రూ.2,800 కోట్ల విలువైన 2.5 లక్షల టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయి. 2015–16లో రూ.7,300 కోట్ల విలువైన 3.8 లక్షల టన్నుల పండ్లు దిగుమతి చేసుకున్నారు. 2019 తర్వాత విదేశీ పండ్ల దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి.2019–20లో రూ.14,137 కోట్ల విలువైన 5 లక్షల టన్నుల విదేశీ పండ్లను దిగుమతి చేసుకోగా.. 2024–25లో పండ్ల దిగుమతుల విలువ రూ.25,770 కోట్ల చేరింది. దిగుమతుల పరిమాణం 8.50 లక్షల టన్నులకు పెరిగింది. విలువపరంగా చూస్తే 82 శాతం పెరిగితే పరిమాణం పరంగా 65 శాతం పెరిగింది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లన్నీ దశాబ్ద కాలంగా దేశీయంగా ఉత్పత్తి అవుతున్నా దిగుమతులు తగ్గడం లేదు.కారణాలివీ..ఒకే రకం పండ్లు విదేశాల్లో ఏడాది పొడవునా లభ్యమవుతున్నాయి. మన దేశంలో వివిధ పండ్లు ఆయా సీజన్లలో మాత్రమే పండుతాయి. విదేశీ పండ్లు ఆఫ్ సీజన్లో సైతం లభ్యం కావడం, నాణ్యతకు ఢోకా లేకపోవడం, పోషక విలువలు ఎక్కువగా, రసాయన అవశేషాలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల వాటిపై ఇక్కడి ప్రజలు మోజు పడుతున్నారు. విదేశీ పండ్లు వివిధ రంగుల్లో ఆకర్షణీయమైన ఆకృతుల్లో లభించడంతోపాటు రుచిలో వైవిధ్యంగా ఉండటం కూడా వాటిని మనవాళ్లు ఇష్టపడటానికి మరో కారణం. అంతేకాకుండా విదేశీ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల వీటిని దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. -
ఇక నన్నెవరూ చూడలేరు!
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు అలికిడి వినపడటంతో దాక్కోవాలనుకుంది. అదెదో పొదల్లోనో, చెట్టుమాటునో కాదు. దానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించింది. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుంది. అంతేకాదు.. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. దాక్కునేందుకు జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నం వాహనంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. వెంటనే క్లిక్ మనిపించి.. ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. జరిగిన విషయాన్నంతా జోడించారు. ఆ పిల్ల ఏనుగు అమాయక చర్య ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఫొటో చూసినవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. థాయ్‌లాండ్‌లో కనిపించిన ఈ ఏనుగు భారతీయ సంతతికి చెందింది. ఆసియా ఏనుగుల ఉపజాతి. వాటికున్న చిన్న చెవులే.. ఆఫ్రికన్ ఏనుగుల నుంచి వీటిని వేరుగా చూపిస్తాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాటి జనాభా పెరగడం, అటవీ ప్రాంతాలు తరుగుతుండటంతో ప్రమాదకరంగా మారింది. గత సంవత్సరం, ఏనుగులకు సంబంధించిన 4,700 ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. వాటి కారణంగా 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని 594, ఆస్తి నష్టం కలిగించాయని 67 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏనుగులను చంపడం కఠినమైన నేరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌లో 81 కోట్ల మందికి ఉచిత ఆహారమే గతి!
భారత్.. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సంపదలో ప్రజల మధ్య అంతరం మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఇక పేదరిక నిర్మూలన అనేది సుదూర కల. ఎందుకంటే.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా చెప్పుకుంటున్న జీడీపీ వృద్ధిరేటు ఈ అసమానతలను తగ్గించడం లేదు. దీంతో ఆదాయ ఆసమానతలను రూపుమాపకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది. జీడీపీలో పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉచిత ఆహార పథకం మీద 81 కోట్ల మంది ఆధారపడి ఉన్నారంటే.. దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే.. కార్మి క చట్టాల అమలుతోపాటు అనేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ధనిక దేశంలో పేద విధానాలు దేశంలో విధానపరమైన లోపాలు పేద, ధనిక అంతరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిలో అగ్రవాటా దేశంలోని కేవలం 5శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొంటున్న భారత్‌లో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద.. 81.35 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు చెల్లించాల్సి వస్తుందంటే మన అభివృద్ది నమూనా ఎలాంటిదో అర్థమవుతుంది. అమలు కాని కనీస వేతన చట్టం.. కనీస వేతనాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) చట్టాల కింద యజమానులు సమర్పించిన రిటర్న్‌లు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇంకా కొన్ని విభాగాల్లోని కార్మికులు ఈ రెండింటిలో నమోదే కాలేదు. 1970 కాంట్రాక్ట్ లేబర్ నియంత్రణ, రద్దు చట్టం వచ్చింది. కానీ.. ఐదు దశాబ్దాలైనా పరిశ్రమల్లో అమలు కాలేదు. అంతర్–రాష్ట్ర వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భలంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం, ప్రయాణ చెల్లింపులు, వసతి, ఉచిత వైద్య సౌకర్యాలు వంటివి కాగితాలకే పరిమితమయ్యాయి. చెల్లింపులో లింగ అంతరం.. వేతనాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. జెండర్‌తో సంబంధం లేకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని 1976 సమాన వేతన చట్టం చెబుతున్నా... దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పులున్నా.. వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని రంగాలలో మహిళలు ఒకే పనికి పురుషుల కంటే తక్కువ సంపాదిస్తూనే ఉన్నారు. ఈ అంతరాలు పోవాలంటే.. విధానాలు, చట్టాల అమలులో కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అపరిమిత పని గంటలు.. దేశంలో జీడీపీ పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 17.9%, గ్రామీణ ప్రాంతాల్లో 13.7% ఉందని గణాంకాల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మే నెలలో తెలిపింది. కార్మికులకు 8 పని గంటలకోసం ఎన్ని ఉద్యమాలు జరిగాయో తెలిసిందే. అయినా.. ఇప్పటికీ అసంఘటిత, అనధికారిక రంగాల్లోని కార్మికులు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తారు. వీటికి అదనపు చెల్లింపులేమీ ఉండవు. చట్టం ప్రకారం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల పని గంటలను రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు పరిమితం చేస్తే ఎక్కువ మందికి ఉపాధిని కల్పించవచ్చు. పేదరికాన్ని తగ్గించాలంటే.. కనీస పెన్షన్‌ను పెంచాలంటున్నారు నిపుణులు. 2004లోనే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ దీనిని సిఫార్సు చేసింది. రెండు దశాబ్దాలు దాటినా.. పెన్షన్ రూ.1,000 దగ్గరే ఉంది. కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న సామాజిక పెన్షన్ రూ. 4,000 కంటే కూడా చాలా తక్కువ. ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్లు డిమాండ్ చేసినట్లుగా రూ. 7,000కి పెంచడం వల్ల లక్షలాది మంది జీవిత చరమాంకంలో గౌరవంగా జీవించగలుగుతారు. ఉపాధి హామీ పథకం పని రోజులను 150కి పెంచాలని, వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక శత్రు డ్రోన్లు ఢమాలే..
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శత్రు దేశాల డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జలసమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాది దేశం పాకిస్థాన్ భారత్‌పై డ్రోనాస్త్రాలు సంధించగా వాటిని తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆదర్శంగా తీసుకుని సముద్ర జలాల్లో శత్రుదేశాల మానవ రహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి.. వాటిని జల సమాధి చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థని యుద్ధ నౌకల్లో ఏర్పాటుకు హిందూస్థాన్ షిప్‌యార్డు పెంటగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. షిప్‌యార్డు సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రీ నేతృత్వంలో పీఆర్ఎస్ సంస్థ ఎండీ డాక్టర్ స్వామినాథన్ మణికందన్, షిప్‌యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.30 కి. మీ దూరంలోనే పసిగట్టేలా..ప్రస్తుతం కొన్ని యుద్ధ నౌకల్లో షార్ట్ రేంజ్ కమ్యునికేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. వీటి ద్వారా నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని పసిగట్టి సమాచారాన్ని ప్రధాన కేంద్రానికి అందిస్తుంటాయి. కానీ.. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.యుద్ధ నౌకలకు డ్రోన్ ముప్పు ఉండదికసముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు ఈ ఒప్పందం ద్వారా సమగ్ర రక్షణ లభిస్తుంది. దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ వ్యవస్థని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం. రక్షణ రంగ సాంకేతికతలో షిప్‌యార్డు భాగస్వామ్యం మరింత పెరుగుతోంది. వచ్చే త్రైమాసికంలో ఇంటిగ్రేషన్ ట్రయల్స్‌ని ప్రారంభిస్తాం. తర్వాత తొలి విడతలో ఫ్రంట్‌లైన్ యుద్ధ నౌకల్లో ఈ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హెచ్ఎస్ఎల్యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రత్యేకతలివీ⇒ రియల్‌టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లనూ సులువుగా గుర్తించవచ్చు. ⇒ ఒక్క అడుగు కూడా కదలనియ్యకుండా ధ్వంసం చేయొచ్చు. ⇒ 400 ఎంహెచ్‌జెడ్ 6గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు, నౌకాదళ కేంద్రాలకు ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ శత్రుదేశాల సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది. -
ఎలా... ఏ పాత్రలో.. వంట ఆరోగ్యకరం?
అల్యూమినియం వంట పాత్రలకూ ఎక్స్‌పెయిరీ ఉంటుందని.. వాటిని సుదీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని బ్యూరో ఆర్ ఇండియన్ స్టాండర్డ్స్ వెల్లడించింది. ఆరోగ్యదాయకమైన జీవనం కోసం ఏం తింటున్నాం అనే దానితో పాటు దాన్ని ఎలా వండుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యమైన విషయం. ఆహారోత్పత్తులను అధిక ఉష్ణోగ్రతలో వండితే పోషకాలు నష్టపోవటంతో పాటు, హానికారక పదార్థాలు ఏర్పడతాయని మీకు తెలుసా? వంట అనేక పద్ధతుల్లో చేస్తుంటాం. ఇంతకీ, ఏ పద్ధతిలో వండితే మంచిది? ఏయే పాత్రల్లో ఎలా వండితే మంచిదో తెలుసా? భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఏం చెబుతోందంటే..ముంబైలో 50 ఏళ్ల వ్యక్తికి మతిమరుపు విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైన అలసట, ఒళ్లంతా నొప్పులు ఎక్కువయ్యాయి. ఆసుపత్రిలో చేరిన అతడికి మెటల్ స్క్రీనింగ్ చేస్తే.. శరీరంలో సీసం స్థాయిలు భారీగా పెరిగిపోయాయని తేలింది. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అతడి భార్య ఇంట్లో 20 ఏళ్లుగా ఒకే ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తోందట! ఆమ్లగుణం ఉన్న ఆహార పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండేటప్పుడు అందులో సీసం, అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వంట చేసే పద్ధతితో పాటు ఏ పాత్రలో వండుతున్నాం అన్నదాన్ని బట్టి ఆహారంలో పోషకాల సాంద్రత, నాణ్యత ఆధారపడి ఉంటుంది.మట్టి పాత్రలు..: వంటకు ఇవే అత్యుత్తమం. ఇవి పర్యావరణహితమైనవే కాదు, వాటిల్లో వండే ఆహారంలో పోషకాలను చెక్కు చెదరకుండా ఉంచుతాయి. మట్టి పాత్రల గోడల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా అధిక వేడి బయటకు పోతుంది కాబట్టి ఉడికే ఆహారంలో పోషకాలకు నష్టం వాటిల్లదు.రాతి పాత్రలు..: గ్రానైట్ స్టోన్ పాత్రలు సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేస్తాయి. టెఫ్లాన్ పూతలు లేనివి వంటకు మంచివి. ఈ పాత్రలకు.. మంట మధ్యస్థానికి–అధికానికి మధ్యలోనే ఉంచాలి.లోహ పాత్రలుఅల్యూమినియం, ఇనుము, ఇత్తడి, కంచు, రాగి వంటి లోహ పాత్రల్లో ఆహారం వండినా, నిల్వ చేసినా ఆ లోహాలు ఆహారంలో కలుస్తాయి. ⇒ నిల్వ పచ్చళ్లు, చట్నీలు, సాంబారు వంటి ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను అల్యూమినియం, ఇనుము; లోపలి పూత లేని ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ చేయడం మంచిది కాదు.స్టీలు పాత్రలుఇవి వంటకు బాగా అనువైనవి. ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వంటకు స్టీల్ గిన్నెలు వాడుతున్నారు. ఎక్కువ కాలం మన్నిక, తుప్పు పట్టకపోవటం, ఆహార పదార్థాలు ఉంచినప్పుడు రియాక్షన్ లేకపోవటం వంటి సానుకూల అంశాలు ఉండటమే ఇందుకు కారణం. నాన్‌స్టిక్ పాత్రలుపాలీ టెట్రా ఫ్లోరో ఇథిలిన్ (పిటిఎఫ్ఇ/టెఫ్లాన్) అనే పదార్థంతో లేపనం చేసిన పాత్రలను నాన్ స్టిక్ పాత్రలు అంటారు. 170 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ పాత్రల్లో వంట చెయ్యకూడదు. అలా చేస్తే టెఫ్లాన్ కోటింగ్ ఊడి వచ్చేసి విషతుల్యమైన వాయువులు వెలువడతాయి. టెఫ్లాన్ పొర ఊడిపోతే ఇక ఆ పాత్రలను వాడకూడదు.ఎలా వండితే మంచిది?మూత పెట్టి/పెట్టకుండా వంట: మూత పెట్టకుండా వండితే పోషకాలు కొన్ని గాలిలో కలిసిపోతాయి. ఎంత తక్కువ సమయం వండితే పోషకాల నష్టం అంత తగ్గుతుంది. మూత పెట్టి వండితే త్వరగా పూరై్త, పోషకాల నష్టమూ తగ్గుతుంది.ఉడకపెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వంట:పప్పుల్లో జీర్ణం కాకుండా అడ్డుకునే యాంటీ–న్యూట్రిషనల్ ఎంజైములు ఉంటాయి. ఎక్కువ నీరు పోసి ఉడకబెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వండటం వల్ల ఇవి నశించి, జీర్ణమయ్యే గుణంతో పాటు మాంసకృత్తుల లభ్యత పెరుగుతుంది. ⇒ ధాన్యాలు, పప్పుల్లో ఫైటిక్ ఆమ్లాలు ఉంటాయి. ఎక్కువ నీటిలో ఉడికించినప్పుడు లేదా కుక్కర్లో వండినప్పుడు ఇవి చాలా వరకు తగ్గిపోతాయి. తద్వారా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మపోషకాలు మనకు ఎక్కువగా లభిస్తాయి.⇒ పప్పులను ఎక్కువ నీటితో ఉడకబెట్టి, ఆ నీటిని పారేస్తే ఫోలేట్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లను నష్టపోతాం. ఎక్కువ సేపు ఉడకబెడితే మాంసకృత్తుల నాణ్యత క్షీణిస్తుంది.ఆవిరిపై వంట: ఆకుకూరలు, కూరగాయలను ఆవిరిపై వండటం ఉత్తమం. ⇒ నీటిలో కరిగిపోయే విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఆవిరి వంట వల్ల బీటా కెరోటిన్, లుటీన్లు సులభంగా శరీరానికి వంటపడతాయి.నూనెలో వేపుడు: ఎక్కువ ఉష్ణోగ్రతపై, ఎక్కువ నూనెలో ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాల్లో మార్పులొస్తాయి. ⇒ నీరు ఆవిరైపోవటం వల్ల విటమిన్ సి వంటి నీటకరిగే పోషకాలు నష్టపోతాం. ⇒ అధిక ఉష్ణోగ్రత, గాలి, నూనె కలిసినప్పుడు విష పదార్థాలు ఉత్పత్తయ్యే ప్రమాదం ఉంది. ⇒ ఒకసారి వేపుడు కోసం వాడిని నూనెను మళ్లీ వేపుడుకు వాడటం గానీ, వాడని నూనెతో కలపటం గానీ ప్రమాదకరం.లోతు తక్కువ గిన్నెలో వేపుడు: తక్కువ లోతున్న గిన్నెలో తక్కువ నూనెతో, ఎక్కువ మంటపై ‘షాలో ఫ్రైయింగ్’ చేయటం వల్ల పోషకాల నష్టం ఎక్కువ. డీప్ ఫ్రైతో పోల్చితే.. ఎక్కువగా ఆక్సీకరణానికి గురైనందున కొవ్వులు, నూనెల నాణ్యత దెబ్బతింటుంది.వేగంగా తిప్పుతూ వేపటం: కూరగాయలు లేదా మాంసం ముక్కలను కొద్దిపాటి నూనె వేసి అధిక మంటపై వేగంగా తిప్పుతూ వేపటాన్నే స్టిర్ ఫ్రైయింగ్ అంటారు. ఎక్కువ నూనెలో వేపుడుతో పోల్చితే ఈ పద్ధతిలో పోషకాల నష్టం తక్కువే.మైక్రోవేవ్ కుకింగ్మైక్రోవేవ్లో చాలా తక్కువ సమయంలో, కొద్దిపాటి నీటితోనే వంట పూర్తవుతుంది. మిగతా పద్ధతులతో పోలిస్తే ఇందులో విటమిన్లు, ఖనిజాల నష్టం చాలా తక్కువ.నెమ్మదిగా వండటం: తక్కువ వేగంగా, తక్కువ వేడిపై వండే పద్ధతి ఇది. ఇలా నూనెలో మాంసాన్ని వేపినప్పుడు పోషకాల నష్టం చాలా తగ్గుతుంది. ⇒ టమాటాలు, మొక్కజొన్న, పాలకూర వంటి వాటిని ఇలా వండితే వాటి కణాల గోడలు ఛిద్రమై శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విడుదలై శరీరానికి ఎక్కువగా అందుతాయి.ఎయిర్ ఫ్రైయింగ్⇒ తక్కువ నూనెతో డీప్ ఫ్రైయింగ్ చేయడం. దీనివల్ల ఊబకాయం సమస్య రాదు. ⇒ బంగాళదుంపలు వంటి స్టార్చ్ ఎక్కువ ఉండే ఆహారానికి ఇది నప్పుతుంది. ⇒ అయితే, చేప ముక్కలను ఎయిర్ ఫ్రైయింగ్ చేస్తే వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తగ్గిపోతాయి. వాపు (ఇన్ఫ్లమేషన్) కలిగించే మూలకాలు పెరుగుతాయి. -
10,500కు పైగా ఖాళీలు
ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారతీయులను ఉలిక్కిపడేలా చేసింది. 275 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన ఇది. ఈ నేపథ్యంలో మనదేశంలో విమానయాన నిబంధనలు, భద్రతపై అందరూ చర్చించుకుంటున్నారు. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషాదానికి మూడు నెలల ముందు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వంటి విమానయాన సంస్థలలో దీర్ఘకాలంగా సిబ్బంది కొరత ఉందని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక వెల్లడించింది. అత్యంత కీలక విభాగాలైన ఈ మూడు సంస్థల్లో 2025 మార్చి నాటికి 10,500లకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రధానంగా భద్రతా సమస్యలను పర్యవేక్షిస్తుంది. దేశీయంగా, అలాగే భారత్‌కు రాకపోకలు సాగించే విమాన రవాణా సేవలను నియంత్రించడం, పౌర విమానయాన నిబంధనలు, ప్రమాణాల అమలుకు ఇది బాధ్యత వహిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థతో (ఐసీఏఓ) అన్ని నియంత్రణ విధులను సమన్వయం చేస్తుంది. ఇలాంటి డీజీసీఏలో ఖాళీల సంఖ్య 2021తో పోలిస్తే రెట్టింపు అయింది. 2021–25 మధ్య డీజీసీఏకు మంజూరైన ఉద్యోగుల సంఖ్య 1,233 నుంచి 1,692కి పెరిగింది. అయినప్పటికీ 2025 మార్చి నాటికి కేవలం 878 మాత్రమే భర్తీ అయ్యాయి. విమానాశ్రయ భద్రతకు బాధ్యత వహించే బీసీఏఎస్‌కు 598 మంది సిబ్బందిని మంజూరు చేయగా అది 374 మంది సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏఏఐలోనూ మంజూరైన 25,730 పోస్టుల్లో 9,500కుపైగా ఖాళీలు ఉన్నాయి.‘ప్రమాణాలకు దెబ్బ’దీర్ఘకాలిక సిబ్బంది కొరత.. విమానయాన రంగంలో నియంత్రణ పరంగా పర్యవేక్షణ, ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ సంస్థలలో దీర్ఘకాలిక సిబ్బంది కొరత భద్రత, సేవా ప్రమాణాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. డీజీసీఏ రెండేళ్లలో 49 మందిని మాత్రమే కొత్తగా చేర్చుకుంది. బీసీఏఎస్ గత ఏడాది 139, ప్రస్తుత సంవత్సరం కేవలం ఐదు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. 2022లో 952 మందిని నియమించుకున్న ఏఏఐ.. ఈ ఏడాది 15 మందికే ఉద్యోగావకాశాలు కల్పించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో..సిబ్బంది కొరతను అధిగమించడానికి ఏఏఐ 1,098 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. 2025 ఆగస్టు–నవంబర్ మధ్య మూడు దశల్లో నియామకాలు చేపట్టనుంది. సాధారణ నియామకాలలో జాప్యాలను నివారించడానికి డీజీసీఏ, బీసీఏఎస్ కాంట్రాక్టు నియామకాలకు నడుం బిగించాయి. ఈ ఏడాది డీజీసీఏ 107 మంది కన్సల్టెంట్లు, ఫ్లైట్ ఆపరేషన్ ్స ఇన్ స్పెక్టర్లను నియమించుకుంది. అలాగే బీసీఏఎస్ 14 మంది కన్సల్టెంట్లను చేర్చుకుంది.తగ్గిన నిధులు..దేశంలో విమానయాన నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఈ రంగంలో మూలధన వ్యయం కూడా తగ్గుతోంది. పౌర విమానయానానికి మూలధన వ్యయం 2023–24లో రూ.755.18 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.70 కోట్లకు పరిమితమైంది. ఇందులో డీజీసీఏకు రూ.30 కోట్లు, బీసీఏఎస్ రూ.15 కోట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు (ఏఏఐబీ) రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉడాన్ వంటి పథకాల కింద మౌలిక సదుపాయాలు పెరుగుతున్నప్పటికీ.. ప్రమాద దర్యాప్తు, విమానయాన భద్రతకు నిధులు తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.‘ఉడాన్ ’కు తగ్గట్టుగా..సామాన్యులకూ విమానయానం అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2016లో ఉడాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాలను పెద్ద నగరాలతో అనుసంధానించడం ద్వారా విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా, విస్తృతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 619 మార్గాల్లో విమాన రాకపోకలు సాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరగడం, చిన్న నగరాలకూ ఈ రంగం విస్తరిస్తున్నందున అత్యవసర సిబ్బంది నియామకాల వంటివి చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది.బీసీఏఎస్: దేశంలోని విమానాశ్రయాలలో పౌర విమానాల భద్రత ప్రమాణాలు, చర్యలను నిర్దేశించడం దీని ప్రధాన బాధ్యత. భద్రతా నియమాలు, నిబంధనల అమలును పర్యవేక్షించడం, భద్రతా అవసరాలపై సర్వే నిర్వహించడం; భద్రతా నియంత్రణలను అమలు చేసే వ్యక్తులు తగిన శిక్షణ పొందారని, విధులను నిర్వర్తించడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడం; విమానయాన భద్రతా విషయాల ప్రణాళిక, సమన్వయం; భద్రతా సిబ్బంది వృత్తిపరమైన సామర్థ్యం, అప్రమత్తతను పరీక్షించడానికి ఆకస్మిక తనిఖీలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది.ఏఏఐ: దేశంలోని మొత్తం విమానాశ్రయాల నిర్వహణ ఇదే చూస్తుంది. ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టెర్మినల్, కార్గో సౌకర్యాల సమగ్ర అభివృద్ధి, విస్తరణ, ఆధునికీకరణ పనులను చేపడుతుంది. ఐసీఏఓ ఆమోదించిన విధంగా దేశ ప్రాదేశిక పరిమితులకు మించి విస్తరించి ఉన్న భారత వైమానిక ప్రాంతం నియంత్రణ, నిర్వహణ బాధ్యతలూ ఈ సంస్థవే. -
మా కాలంలో ఇలా లేదమ్మా..
మీ పిల్లలు ఫోన్లలో లేదా రీల్స్‌లో మునిగిపోయినప్పుడు.. ఈ స్మార్ట్ ఫోన్ అన్నదే లేకుంటే బాగుణ్ను.. వీళ్లు బాగుపడేవాళ్లు అని అనుకున్నారా? లేదా మా కాలంలో ఇలాంటి అడిక్షన్లు ఉండేవి కావు.. చక్కగా బయట ఆడుకునేవాళ్లం అని క్లాసులు పీకారా?అలాగే మీ పిల్లలు ఎదిగే క్రమంలో సోషల్ మీడియా కావొచ్చు.. వీడియో గేమ్స్ కావచ్చు.. ఇవన్నీ వాళ్ల భవిష్యత్తుకు ప్రతిబంధకాలు అని అనుకుంటున్నారా? చాలామంది అనుకునే ఉంటారు.. మనమే కాదు.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి.. ఇటీవల అమెరికాలో ఓ సర్వే జరిగింది. అందులో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లల ఎదుగుదల లేదా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు.. వీటిని కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని వేటి గురించి అనుకున్నారు అని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఆన్లైన్లోని అడల్ట్ కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే.. ప్రత్యేకంగా ఒక్కొక్కటిగా ప్రశ్నించినప్పుడు టిక్‌టాక్ కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అన్నారు. ఇంతే శాతం మంది ‘ఎక్స్’(ట్విట్టర్) విషయంలోనూ చెప్పారు. ఇన్‌స్ట్రాగాం లేకుండా ఉంటే బాగుండేదని 56 శాతం మంది అన్నారు. ఆధారం: ది హారిస్ పోల్–మార్కెట్ రీసెర్చ్ కంపెనీ.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఉద్యోగార్థులను ఆకర్షించడంలో చెన్నై, హైదరాబాద్ టాప్
ఉద్యోగార్థులను ఆకర్షించడంలో దక్షిణాది నగరాలైన చెన్నై, హైదరాబాద్ ముందంజలో ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు ఎక్కువగా లభిస్తుండటం, ప్రారంభ వేతనాలు మెరుగ్గా ఉండటం, నివాస వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలు. ఈ విషయాన్ని ఇండీడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘పే మాప్’ సర్వే నివేదికలో వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి ఆలోచనల్లో చాలా మార్పులు వస్తున్నాయని, అధిక నివాస వ్యయం ఉన్న సిటీల కంటే, తక్కువ ఖర్చు అయ్యే నగరాల్లోనే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపింది.ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాలు కంటే హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేయడానికి కొత్తవారు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. అత్యధిక ఉద్యోగాలు అందిస్తున్న రంగంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలే ముందంజలో ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత తయారీ, టెలికాం రంగాలు ఉన్నాయని వివరించింది. గతేడాదితో పోలిస్తే కొత్తగా ఉద్యోగంలో చేరే వారి జీతాలు 15 శాతం పెరిగినట్లు తెలిపింది. ఢిల్లీలో అత్యధిక వ్యయం ⇒ ఐటీ, తయారీ, టెలికాం రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి సగటున రూ.26,300 నుంచి రూ.30,100 వరకు ప్రారంభ వేతనాలు లభిస్తున్నాయి. ⇒ హైదరాబాద్‌లో ప్రారంభ వేతనం రూ.28,500 ఉండగా, రూ.30,100తో చెన్నై మొదటి స్థానంలో నిలిచింది.⇒రెండేళ్లు అనుభవం దాటిన వారి జీతాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి హైదరాబాద్‌లో సగటున నెలకు రూ.47,200 జీతం వస్తుండగా, ఐదేళ్లు దాటిన వారికి రూ.69,700 వరకు లభిస్తోంది. ⇒ మెట్రో సిటీల్లో పెరుగుతున్న ఖర్చులకు, జీతాలకు పొంతన కుదరడం లేదని 69 శాతానికి పైగా ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.⇒ ఢిల్లీలో నివాస వ్యయం చాలా ఎక్కువని 96 శాతం మంది తెలియజేశారు. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (95శాతం), పుణె (94శాతం), బెంగళూరు (93శాతం) ఉన్నాయి. ⇒ చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో నివాస వ్యయం మధ్య తరగతి వారికి అనుగుణంగా ఉందని అధిక శాతం ఉద్యోగులు చెప్పడం విశేషం. -
ఖరీదైనవే కొంటున్నారు..
భారతదేశంలో ‘మాస్–మార్కెట్’ అన్నది క్రమంగా ‘పాష్–మార్కెట్’గా మారుతోంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు వినియోగదారులు ‘ఉన్నంతలోనే’ సరిపెట్టుకోవటం లేదు. ఖరీదైనవాటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఖరీదైన కార్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే పెరగడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్2025 జనవరి – ఏప్రిల్ మధ్య మొత్తం స్థూల అమ్మకాల్లో ఖరీదైన టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కన్జ్యూమర్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘నీల్సన్ఐక్యూ’ వెల్లడించింది. 2025 తొలి నాలుగు నెలల్లో 55 అంగుళాల 4కె రిజల్యూషన్ టీవీల అమ్మకాలు.. మొత్తం టీవీల మార్కెట్ అమ్మకాలలో 41 శాతం. గత ఏడాది ఇదే కాలానికి ఇది 38 శాతం. అలాగే 8 కిలోలు, ఆపై సామర్థ్యం గల ఫ్రంట్–లోడింగ్ వాషింగ్ మెషీన్ల అమ్మకాలు 11 నుండి 16 శాతానికి, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 9 శాతం 10 శాతానికి పెరిగాయని ‘నీల్సన్ ఐక్యూ’ తెలిపింది. ఫోనంటే అల్ట్రా ప్రీమియమే! ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ సంస్థ డేటా ప్రకారం స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఏడాది జనవరి–మే మధ్యకాలంలో రూ.45,000కుపైగా ధర ఉన్న అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో 20 శాతం, రూ. 30,000కుపైగా ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్లో 2 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధోరణి అన్ని రకాల ఉత్పత్తుల సగటు అమ్మకపు ధర (ఎ.ఎస్.పి.) పెరగటానికి దోహదపడింది. స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఎ.ఎస్.పి. ఈ ఏడాదిలో మొదటిసారిగా రూ.26 వేలకు చేరుకుంది. గతేడాది ఇది రూ.25వేలు. ధర తక్కువ కార్ల స్పీడు తగ్గిందిమరోవైపు – దిగువ, మధ్య ఆదాయ తరగతుల వారు.. తమ వేతనాల్లో తక్కువ పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా ఎంట్రీ–టు–మిడ్ సెగ్మెంట్ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవటంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎలక్ట్రానిక్స్, కార్ల మార్కెట్లలో అమ్మకాలు స్పల్పంగా తగ్గాయి. ఫలితంగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు జనవరి–మే కాలంలో.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 51.4 శాతానికి పడిపోయాయని ‘జాటో డైనమిక్స్’ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2024 మొదటి 5 నెలల్లో ఇది 53.4 శాతం.పుంజుకోనున్న అమ్మకాలు» ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటం, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రేట్లు తగ్గటం వంటి కారణాల వల్ల రాబోయే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటాయని మార్కెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. » అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ ఉన్న హై–ఎండ్ కార్ల అమ్మకాల వాటా 2023లో 2.8 శాతంగా ఉండగా, 2024లో ఐదింతలు పెరిగి 15 శాతానికి చేరుకుంది.» రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు 2020తో పోలిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు రెండింతలయ్యాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో 2020లో ఇవి 25 శాతమే. 2024లో 47 శాతానికి పెరిగాయి.» ఈ ఏడాది కార్ల మార్కెట్ స్వల్పంగా తగ్గటంతో పాటు, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు క్షీణతను చవి చూడటంతో మొత్తంగా ఎలక్ట్రానిక్ అమ్మకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. అయితే అదే సమయంలో కన్సూ్యమర్ ఫైనాన్స్ వచ్చి, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. -
ఖరీదైనవే కొంటున్నారు..
భారతదేశంలో ‘మాస్–మార్కెట్’ అన్నది క్రమంగా ‘పాష్–మార్కెట్’గా మారుతోంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు వినియోగదారులు ‘ఉన్నంతలోనే’ సరిపెట్టుకోవటం లేదు. ఖరీదైనవాటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఖరీదైన కార్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే పెరగడమే ఇందుకు నిదర్శనం.2025 జనవరి – ఏప్రిల్ మధ్య మొత్తం స్థూల అమ్మకాల్లో ఖరీదైన టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కన్జ్యూమర్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘నీల్సన్ఐక్యూ’ వెల్లడించింది. 2025 తొలి నాలుగు నెలల్లో 55 అంగుళాల 4కె రిజల్యూషన్ టీవీల అమ్మకాలు.. మొత్తం టీవీల మార్కెట్ అమ్మకాలలో 41 శాతం. గత ఏడాది ఇదే కాలానికి ఇది 38 శాతం. అలాగే 8 కిలోలు, ఆపై సామర్థ్యం గల ఫ్రంట్–లోడింగ్ వాషింగ్ మెషీన్ల అమ్మకాలు 11 నుండి 16 శాతానికి, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 9 శాతం 10 శాతానికి పెరిగాయని ‘నీల్సన్ ఐక్యూ’ తెలిపింది.ఫోనంటే అల్ట్రా ప్రీమియమే! ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ సంస్థ డేటా ప్రకారం స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఏడాది జనవరి–మే మధ్యకాలంలో రూ.45,000కుపైగా ధర ఉన్న అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో 20 శాతం, రూ. 30,000కుపైగా ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్లో 2 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధోరణి అన్ని రకాల ఉత్పత్తుల సగటు అమ్మకపు ధర (ఎ.ఎస్.పి.) పెరగటానికి దోహదపడింది. స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఎ.ఎస్.పి. ఈ ఏడాదిలో మొదటిసారిగా రూ.26 వేలకు చేరుకుంది. గతేడాది ఇది రూ.25వేలు. ధర తక్కువ కార్ల స్పీడు తగ్గిందిమరోవైపు – దిగువ, మధ్య ఆదాయ తరగతుల వారు.. తమ వేతనాల్లో తక్కువ పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా ఎంట్రీ–టు–మిడ్ సెగ్మెంట్ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవటంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎలక్ట్రానిక్స్, కార్ల మార్కెట్లలో అమ్మకాలు స్పల్పంగా తగ్గాయి. ఫలితంగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు జనవరి–మే కాలంలో.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 51.4 శాతానికి పడిపోయాయని ‘జాటో డైనమిక్స్’ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2024 మొదటి 5 నెలల్లో ఇది 53.4 శాతం.పుంజుకోనున్న అమ్మకాలు⇒ ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటం, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రేట్లు తగ్గటం వంటి కారణాల వల్ల రాబోయే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటాయని మార్కెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ⇒ అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ ఉన్న హై–ఎండ్ కార్ల అమ్మకాల వాటా 2023లో 2.8 శాతంగా ఉండగా, 2024లో ఐదింతలు పెరిగి 15 శాతానికి చేరుకుంది.⇒ రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు 2020తో పోలిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు రెండింతలయ్యాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో 2020లో ఇవి 25 శాతమే. 2024లో 47 శాతానికి పెరిగాయి.⇒ ఈ ఏడాది కార్ల మార్కెట్ స్వల్పంగా తగ్గటంతో పాటు, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు క్షీణతను చవి చూడటంతో మొత్తంగా ఎలక్ట్రానిక్ అమ్మకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. అయితే అదే సమయంలో కన్సూ్యమర్ ఫైనాన్స్ వచ్చి, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. -
స‘జీవ’ శిల్పాలు!
పాల్వంచ రూరల్: మొసళ్లు, అడవి దున్నలు, కణుజులు, కోతులు.. ఇలా వన్యప్రాణులను చూడాలంటే అటవీ ప్రాంతానికి వెళ్లాలి లేదా జూలో చూడాలి. కానీ భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానికి వెళ్తే ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తాయి. వీటిలో జీవం ఉండదు.. కానీ జీవకళ ఉట్టిపడుతుంటుంది. అంతలా ఆకట్టుకునేలా వన్యప్రాణుల బొమ్మలను ఏర్పాటు చేసిన ఇక్కడి మ్యూజియానికి పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పర్యాటక ప్రాంతం.. పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరాన కిన్నెరసాని కేంద్రంగా అభయారణ్యం ఉండగా.. నిర్వహణ కోసం ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణ విభాగం (వైల్డ్‌లైఫ్) ఏర్పాటు చేశారు. అంతేకాక కిన్నెరసాని రిజర్వాయర్, ఇక్కడి డీర్ పార్క్‌లోని చుక్కల దుప్పులను వీక్షించేందుకు వారాంతాల్లోనే కాక ఇతర రోజుల్లోనూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. రిజర్వాయర్‌లో బోటు షికారు చేసి చుక్కల దుప్పులను వీక్షించాక.. ఇంకాస్త సమయం గడపడానికి తొలినాళ్లలో ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి కావు. దీంతో అధికారులు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేలా పరికరాలతో ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశారు. ఆతర్వాత మ్యూజియం కూడా ఏర్పాటుచేసి అందులో నిజమైన జంతువులను తలపించేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ విభాగం (వైల్డ్‌లైఫ్) ఆధ్వర్యాన రాజస్తాన్‌కు చెందిన కళాకారులు ఈ బొమ్మలను రూపొందించారు. రూ.20 లక్షలతో.. కిన్నెరసాని డీర్ పార్క్ సమీపాన రూ.20 లక్షల వ్యయంతో పర్యావరణ విద్యాకేంద్రం, మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే వన్యప్రాణుల బొమ్మలను అచ్చం అలాగే చేయించారు. వీటిని వీక్షించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఈ విద్యాకేంద్రాన్ని సందర్శించి వన్యప్రాణుల బొమ్మల వద్ద ఫొటోలు దిగుతుంటారు. రూ.6.50 లక్షల వ్యయంతో డీర్‌పార్క్ వద్ద చిన్నారులు ఆడుకునే సామగ్రిని ఏర్పాటు చేయడంతో సందడిగా ఉంటోంది. అరుపు వినిపిస్తే.. సమాచారం చెట్లపై పక్షులు, నేలపై అనకొండ, నెమళ్లు, కొంగలే కాక.. మొసళ్లు, అడవి దున్నలు, చిరుతపులులు, కణుజులు, కోతుల బొమ్మలు మ్యూజియంలో కొలువుదీరాయి. ప్రతీ వన్యప్రాణి బొమ్మ వద్ద దాని అరుపులు వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఆ ప్రాణి ప్రత్యేకతలు, వివరాలతో ఈ మ్యూజియం పర్యావరణ విద్యాకేంద్రంగా విలసిల్లుతోంది. -
షుగర్ డ్రింక్స్, మద్యం, పొగాకుపై... పన్నుల మోత మోగించండి!
నానాటికి మారుతున్న జీవన శైలి ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. డయాబెటిస్, కేన్సర్వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్తరకం ప్రతిపాదన చేసింది. ‘‘చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు ధరలు రాబోయే పదేళ్లలో కనీసం 50 శాతం పెరగాలి. వాటిపై ఆ మేరకు పన్నులు పెంచండి’’ అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్పెయిన్‌లోని సెవిల్లెలో జరిగిన ఫైనాన్స్ ఫర్æ డెవలప్మెంట్ సమావేశం ఈ మేరకు సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాటిపై పన్నులను మరింతగా పెంచితే మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. ‘‘దేశాల దగ్గరున్న అత్యంత సమర్థమైన నియంత్రణ సాధనాల్లో పన్నులు ముఖ్యమైనవి. ప్రజారోగ్యమే లక్ష్యంగా చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు వంటివాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్, వ్యాధి నివారణ విభాగం అసిస్టెంట్ డెరెక్టర్ జనరల్ జెరెమీ ఫర్రార్ అన్నారు. ఆ దేశాల్లో సత్ఫలితం కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ దిశగా చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చింది. అదనపు పన్నులతో పొగాకు తదితరాల ధరలు విపరీతంగా పెరగడంతో వాటి వాడకం బాగా తగ్గింది. అయితే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులను పొగాకు తదితర పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘చక్కెర, తీపి పానీయాలపై పన్నుల వల్ల ఏ దేశంలోనూ ఆరోగ్య ఫలితాలు మెరుగుపడలేదు. ఊబకాయం వంటివి తగ్గలేదు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలను డబ్ల్యూహెచ్ఓ విస్మరించడం ఆందోళనకరం’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆ‹ఫ్ బెవరేజెస్ అసోసియేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్మాన్ విమర్శించారు. మరోవైపు, ఇది ప్రజారోగ్యం సాకుతో పన్నుల భారం పెంచే యత్నమని కూడా విమర్శలొస్తున్నాయి. పన్నులు పెంచడం ఆల్కహాల్ సంబంధిత హానిని నివారిస్తుందనడం పక్కదారి పట్టించడమేనని డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్లో సైన్స్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమండా బెర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్లూంబర్గ్, ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పన్ను పెంపు ప్రతిపాదనను సమరి్థంచాయి. ఇందుకు ముందుకొచ్చే దేశాలకు తోడ్పడతామని చెప్పుకొచ్చాయి. 2012–22 మధ్య దాదాపు 140 దేశాలు పొగాకు ఉత్పత్తులపై పన్నులను 50 శాతం పైగా పెంచాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపైనా పన్ను పెంచే యోచనలో ఉన్నాయి. భారత్‌లో ఇలా... భారత్‌లో కూడా కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలపై ఆరోగ్య పన్ను విధించాలని వైద్య నిపుణుల నేతృత్వంలోని జాతీయ కన్సారి్టయం సూచించింది. అంతేగాక పిల్లల ఆహార పదార్థాల మార్కెటింగ్‌పై కఠినమైన నియమాలు విధించాలని కోరింది. భారత్‌లో కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం బాగా పెరుగుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆ‹ఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ‹ఫ్ న్యూట్రిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. యువత ఆహారపు అలవాట్లను మార్చడానికి, మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. క్యాంటీన్లలో, విద్యా సంస్థల సమీపంలో కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్‌కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది. -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్‌లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్‌కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్‌కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్‌పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్‌ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్‌మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్‌కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్‌లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్‌లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్‌తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్‌లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్‌లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్‌ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్‌కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్‌లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్‌ను విడిచి భారత్‌కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్‌లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టేకు ఆకుతో లేజర్ తీవ్రతకు చెక్..!
టేకు అనగానే.. అందమైన ఫర్నీచర్‌లో ఇమిడిన విలువైన కలప గుర్తొస్తుంది. టేకు చెట్టులో కలప తప్ప ఆకులు ఎందుకూ పనికిరావని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లు. కానీ ఈ పత్రాలకు కూడా గొప్ప ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తీవ్రమైన లేజర్ కిరణాల రేడియేషన్‌ను అడ్డుకునే శక్తి టేకు ఈ ఆకుల్లో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లోనూ.. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ.. టేకు ఆకుల్లోని ప్రత్యేక శక్తిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యంత ప్రభావశీలమైన లేజర్ కిరణాల రేడియేషన్ నుంచి చర్మాన్నీ, కంటినీ, సున్నితమైన ఆప్టికల్ పరికరాలను సైతం రక్షించే శక్తి టేకు ఆకులకు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లో లేజర్ రేడియేషన్దే ప్రధానపాత్ర. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ లేజర్ కిరణాలే కీలకం. అయితే, వీటిని ఉపయోగించే సమయంలో పొరపాటున ఆ కిరణాలు మనుషుల కళ్లకు, శరీరానికి హాని జరగనీయకుండా అడ్డుపడే కవచాన్ని రూపొందించేందుకు టేకు ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులతో పరిశోధనలు చేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)’ శాస్త్రవేత్తల పరిశోధనలో టేకు ఆకు ప్రయోజకత్వం వెల్లడైంది. ఆర్ఆర్ఐను ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ స్థాపించారు.ప్రత్యేక లక్షణాలు టేకు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని ప్రత్యేక రసాయనాల్లో నానబెట్టి, శుద్ధి చేసిన తర్వాత గోధుమ–ఎరుపు రంగు ద్రవాన్ని వెలికితీశారు. ఈ వర్ణద్రవ్యానికి లేజర్ కాంతి లక్షణాలు మార్చి, తీవ్రతను తగ్గించే నాన్‌లీనియర్ ఆప్టికల్ (ఎన్ఎల్ఓ) గుణాలు ఉన్నట్టు ఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక తీవ్రతల వద్ద కాంతి ప్రసారాన్ని తగ్గించడానికి.. మన శరీరం, కళ్ళను కాపాడటానికి నాన్ లీనియర్ వస్తువుల్లో ఉండే ఆప్టికల్ పవర్ లిమిటింగ్ ఉపయోగపడుతుంది. ఇవే లక్షణాలు టేకు ఆకుల్లోనూ ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.‘సింథటిక్’ పదార్థాలకు బదులుగా..ఇప్పటివరకు వాడుతున్న గ్రాఫీన్, ఫుల్లెరెన్స్, మెటల్ నానోపార్టికల్స్ వంటి ప్రకృతికి హాని కలిగించే ఖరీదైన సింథటిక్ ఆప్టికల్ పదార్థాలకు బదులు టేకు ఆకుల్లోని రంగులను వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహజమైన, కుళ్లి ప్రకృతిలో కలిసిపోయే పర్యావరణ ప్రియమైన, విరివిగా లభించే టేకు ఆకులను ఉపయోగించటం ద్వారా లేజర్ రక్షక కళ్లజోళ్లు, ఇతర ఆప్టికల్ పరికరాలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.లేజర్ రేడియేషన్ ఉపయోగాలులేజర్ రేడియోషన్ లేదా లేజర్ కాంతి ఎంత ప్రయోజనకరమైనదో అంతే ప్రమాదకరమైనది. దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించాలి. లేజర్ కాంతి కంటిని నేరుగా తాకితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక శక్తి గల లేజర్లు చర్మాన్ని కూడా కాల్చేయగలవు. దీన్ని అనేక రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.» వైద్యరంగంలో కన్ను, చర్మ సంబంధ శస్త్ర చికిత్సలు; డయాగ్నొస్టిక్స్‌లో...» పరిశ్రమల్లో కటింగ్, వెల్డింగ్, లేజర్ మార్కింగ్, లేజర్ స్కాన్లలో..» శాస్త్రీయ పరిశోధనలో కాంతి లక్షణాలను అధ్యయనం చేయడానికి..» సీడీ ప్లేయర్లు, లేజర్ పాయింటర్లు, బార్కోడ్ స్కానర్ వంటి వినియోగదారుల ఉత్పత్తుల్లో..» రక్షణ రంగంలో కమ్యూనికేషన్, శత్రువుల క్షిపణులను కూల్చడం వంటి వాటికి.. » వినోద రంగంలో లేజర్ లైట్ షోలు, స్పెషల్ ఎఫెక్టుల కోసం.. -
మహిళల మెదడు సేఫ్!
‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అన్నారు ఆచార్య ఆత్రేయ. సుఖం ఉండకపోగా, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ ఉండొచ్చు. ‘యాంటీడిప్రెసెంట్స్’లు వాడి ఆ డిప్రెషన్ నుంచి∙బయట పడొచ్చనుకోండీ.. అయితే వాటిని వాడితే మెదడుపై దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్ర పరిశోధకులు కనిపెట్టారు. ‘ఇందులో కొత్తేముందీ!’ అంటారా? ఉంది. యాంటీడిప్రెసెంట్లు వాడితే మెదడుపై పడే దుష్ప్రభావాలు మగవాళ్లలోనే కానీ, ఆడవాళ్లలో కాదట!మానసిక రుగ్మతలకు వైద్యులు సిఫారసు చేసే ‘యాంటీడిప్రెసెంట్’ ఔషధాలు దీర్ఘకాలంలో పురుషుల మెదడుపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉండగా, మహిళల్లో అలాంటి ప్రభావం దాదాపు లేదని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే యాంటీడిప్రెసెంట్లు పురుషుల మెదడుపై ఈ విధంగా ప్రభావాన్ని చూపటం అన్నది వారి వయసుపై కూడా ఆధారపడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.యాంటీ డిప్రెసెంట్లు ఏం చేస్తాయి?సెరటోనిన్ అనే న్యూరోహార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ హార్మోన్‌ను నియంత్రించటమే యాంటీడిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరోసైకియాట్రిక్ వ్యాకులతలకు వైద్యులు ప్రధానంగా ‘సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లు’ (ఎస్.ఎస్.ఆర్.ఐ.లు) సిఫారసు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్ అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడతాయి.మగ ఎలుకల్లోనే మార్పులుఎస్.ఎస్.ఆర్.ఐ.లలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఔషధం ‘ఫ్లూఆక్సిటీన్’. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు సహా అన్ని వయసుల వారికి వైద్యులు సిఫారసు చేసే ఈ ఫ్లూఆక్సిటీన్ దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న విషయమై ఎలుకల మెదడుపై జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన సంగతులు వెల్లడయ్యాయి. ఫ్లూఆక్సిటీన్ను ఇవ్వడం వల్ల మగ ఎలుకల మెదడులో విస్తృతమైన వ్యతిరేక మార్పులు కనిపించాయి. పుట్టిన కొద్ది రోజుల వయసున్న ఎలుకలకు యాంటీడిప్రెసెంట్లను ఇచ్చినప్పుడు క్రమేణా ఆందోళన స్థాయిలు పెరిగాయి.లైంగిక పరిపక్వతకు చేరుకున్న దశలో ఉన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి తక్కువ ఆందోళనను కనబరిచాయి. ఈ మందు ఇచ్చిన ఆడ ఎలుకల ప్రవర్తన, మెదడు నిర్మాణం, మైటోకాండ్రియా లేదా జన్యు వ్యక్తీకరణలలో మార్పులేమీ కనిపించలేదు. బహుశా ఇందుకు ఈస్ట్రోజెన్, ఇతర స్త్రీ హార్మోనుంచి రక్షణ లభిస్తుండవచ్చునని తెలిపారు. జెండర్ క్రోమోజోమ్‌లు, జన్యుపరమైన వ్యత్యాసాలపై మరింత అధ్యయనం జరిపితే దీనిపై నిర్ధారణకు అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.అత్యంత సాధారణ ఔషధం‘ఫ్లూఆక్సిటిన్’ అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి, గర్భిణులకు చికిత్సపరంగా మంచి ఫలితాల కోసం ఇచ్చే అత్యంత సాధారణ ఔషధం. ప్రొజాక్, ఫ్లూడాక్ వంటి బ్రాండ్పేర్లతో ఇది లభిస్తోంది. అయితే దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’ అని తాజా పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ముఖ్య అధ్యయనకర్త ఉత్కర్షా ఘాయ్ అంటున్నారు. ఘాయ్ ముంబైలోని టి.ఐ.ఎఫ్.ఆర్. (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్) లో పీహెచ్‌డి, బెంగళూరులోని నిమ్హాన్స్లో పోస్ట్‌డాక్టరల్ రీసెర్చ్ చేశారు. అధ్యయనం జరిగిన విధానంఫ్లూఆక్సిటిన్ తీసుకున్న తర్వాత.. సెక్సువల్ హార్మోన్లు క్రియాశీలకం కావడానికి ముందు, తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు టి.ఐ.ఎఫ్.ఆర్. శాస్త్రవేత్తల బృందం ఎలుకల్ని రెండు జట్లుగా విభజించింది. ఒక జట్టు : ఎలుకలు 2 నుండి 21 రోజుల వయసున్నవి. ఇంకో జట్టు : 28–48 రోజుల వయసున్నవి. అప్పుడే పుట్టిన ఎలుకల్లో ఈ మందు వాడకంతో ఆందోళన క్రమంగా పెరిగింది. అదే రెండో జట్టు ఎలుకల్లో ఒత్తిడి, ఆందోళన స్వల్పంగా తగ్గాయి. ఈ అధ్యయన ఫలితాలను మానవుల్లోనూ అవే రెండు దశలుగా శైశవ దశ నుంచి శరీరంలో సెక్సువల్ హార్మోన్లు కనిపించే వయసు వరకు; టీనేజీ నుంచి 25 ఏళ్ల వరకు ఈ బృందం అన్వయించింది. సహాయకారిగా విటమిన్ బి3యాంటీడిప్రెసెంట్ల వాడటం వల్ల కొందరి మెదడుపై కనిపించే దుష్ప్రభావాలను తగ్గించేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ బృందం విటమిన్ బి3 (నికోటినమైడ్)ని ఎలుకలకు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, పుట్టి కొద్ది రోజులే అయిన ఎలుకలలో గమనించిన అనేక ప్రతికూల ప్రభావాలు బి3 ప్రభావంతో ఉపశమించాయి. వాటి జీవక్రియ పునరుద్ధరణ జరిగింది. వాటి నిరాశ, నిస్పృహల ప్రవర్తనలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.దీంతో వైద్యులకు ఒక ఆశారేఖ దొరికినట్టయింది. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉండి.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానసిక స్థితి ఉన్న గర్భిణులకు ఎస్ఎస్ఆర్ఐలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. కానీ, విటమిన్ బీ3 వాడితే... ఆ ప్రభావం తగ్గుతుందని ప్రస్తుత పరిశోధనల్లో కొంత వరకు తేలింది. ఇది గర్భిణులందరికీ గొప్ప శుభవార్తే. కాకపోతే పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. -
పైరసీ.. సినిమా చూపిస్తోంది!
⇒ సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు గత ఏడాది రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి? పైరసీ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. బీమా సంస్థలు మాత్రం.. నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టమంటూ బీమా కవరేజ్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.⇒ పుష్ప–2, కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, తండేల్, సింగిల్.. మొన్నటికి మొన్న కన్నప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. చిత్ర పరిశ్రమను పైరసీ భయం వెంటాడుతోంది. ప్రధానంగా పెద్ద బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఆందోళనగా ఉన్నారు. పైరసీ సంబంధ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. అయితే కవరేజ్ విషయంలో బీమా సంస్థలు వెనుకాడుతున్నాయని సినీ పరిశ్రమ చెబుతోంది.⇒ వ్యవస్థాగత మార్పులతో..: బీమా కవరేజ్‌పై ఆధారపడటం కంటే వ్యవస్థాగత మార్పుల ద్వారా పైరసీని ఎదుర్కోవాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. పైరసీ కవర్‌తో నష్టాలను తిరిగి పొందే బదులు కఠిన చట్టాలను తీసుకురావడం ద్వారా పైరసీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నది వారి ఆలోచన. మరికొందరు మాత్రం పైరసీ కవర్‌తో నష్టం కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.⇒ నిధుల సవాళ్లు ఉన్న సమయంలో పైరసీ కవర్ కోసం అదనపు ఖర్చు అనేది నిర్మాతలకు భారమయ్యే వ్యవహారమే. సినీ రంగానికి ‘పరిశ్రమ’ హోదా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిత్ర నిర్మాతలు పైరసీ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేక బీమా ఉత్పత్తుల కంటే ప్రధానంగా యాంటీ–పైరసీ అమలుపై ఆధారపడుతున్నారు. అంటే కాపీరైట్ కలిగిన కంటెంట్‌ను అనధికారికంగా వినియోగం, పంపిణీని అడ్డుకోవడానికి వ్యూహాలు, చర్యలను అమలు చేస్తున్నారు.⇒ రెండు ప్రధాన బీమాలు..: మన చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా రెండు బీమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చిత్ర నిర్మాణం కోసం కాగా, మరొకటి పంపిణీ కోసం. నిర్మాణంలో ఆలస్యం; తారాగణం, సిబ్బంది అనారోగ్యం; పరికరాల నష్టం, ప్రొఫెషనల్ సేవల్లో లోపాలు తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా క్లయింట్‌కు కలిగే ఆర్థిక నష్టాలకు ‘చలనచిత్ర నిర్మాణ బీమా’ కవరేజీని అందిస్తోంది. ఫిల్మ్ ప్రింట్లు, డిజిటల్ మాస్టర్స్ నష్టం, థియేటర్లలో విడుదల జాప్యం, వ్యాపార అంతరాయాలు, విడుదలకు ముందు లేదా డిజిటల్ విడుదల ప్రారంభ దశలలో లీక్ లేదా పైరసీ నుండి ఉత్పన్నమయ్యే నష్టాల నుండి ‘చలనచిత్ర పంపిణీ బీమా’ రక్షిస్తుంది.పైరేటెడ్ మూలాల నుండి..అధిక బడ్జెట్‌తో నిర్మాణాలు చేపట్టే స్టూడియోలు పైరసీ కవర్ కోసం బీమా సంస్థలను సంప్రదిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే కంటెంట్ లీక్ అవుతోందనే భయం నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో పెరుగుతోందని బీమా కంపెనీ ‘అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్’ చెబుతోంది. ‘మీడియా పార్ట్నర్స్ ఆసియా’ ఇటీవలి నివేదిక ప్రకారం.. పైరసీ అదుపు చేయకపోతే భారత్‌లో డిజిటల్ వీడియో పరిశ్రమకు ఆదాయ నష్టాలు ప్రస్తుత రూ.10,260 కోట్ల నుంచి 2029 నాటికి రెండింతలై రూ.20,520 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి తర్వాత సబ్స్క్రిప్షన్ ఆదాయంలో 150 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. దేశంలోని 51 శాతం మీడియా వినియోగదారులు పైరేటెడ్ మూలాల నుండి కంటెంట్‌ను వినియోగిస్తున్నారని ‘ఈవై–ఐఏఎంఏఐ’ రిపోర్ట్ వెల్లడించింది. బీమా కంపెనీలతో చర్చలు..ఈ నష్టం ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా డిజిటల్ వీడియో పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. ఉద్యోగ నష్టాలకు దారితీస్తోంది. ‘ఆదాయాలపై పైరసీ ప్రభావం చూపుతూనే ఉంది. సినిమా పంపిణీకి బీమాను ఎంచుకునేటప్పుడు.. పైరసీ నష్టాలు, నిరోధక చర్యలకు కూడా కవరేజ్ ఉండాలి’ అని నిర్మాతలు అంటున్నారు. సినిమా పైరసీ నుంచి రక్షణ పొందడానికి నిర్మాతలు, బీమా కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పైరసీకి కవరేజ్ అత్యవసరం అన్న డిమాండ్ పెరుగుతోంది. బీమా సంస్థలు మాత్రం పైరసీ నష్టాలకు బీమా కవరేజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టం అనేది వాటి వాదన. -
అంతరిక్షంలో అతిథి
భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. దీనికి 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ –ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్(అట్లాస్) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్‌డీగో కౌంటీలోని పాలమార్ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్‌లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులుప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు. తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఫస్ట్‌టైమర్లే విన్నర్లు!
బిహార్‌లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్‌లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు. కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే.. బిహార్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్‌లకు కష్టకాలమే రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్లుండే మెగా సునామీ?
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రండింగ్‌లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్‌కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్‌పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్‌పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్‌పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్‌పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్‌పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్‌పింగ్‌కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్‌పింగ్‌ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్‌పింగ్‌కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్‌పింగ్‌ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్‌పింగ్‌కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్‌పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్‌కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్‌పింగ్‌ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్‌పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్‌యాంగ్ త్వరలో జిన్‌పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్‌కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆషాఢం.. వైవిధ్యం
ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.దోషాలు పోతాయని మా నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలంపూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్‌లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్‌ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్‌గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్‌కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్‌లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్‌కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్‌లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్‌కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్‌గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్‌కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ-1 రూట్లో యూఎస్‌కు!
అగ్ర రాజ్యంలో ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది కల. యూఎస్ వర్క్ వీసా పొందడం ఆషామాషీ కాదు. ఈ వీసా కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండడం, వలసలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. వెరసి అమెరికాలో ఉద్యోగ అవకాశాలను కోరుకునే నిపుణులకు ఓ–1 వీసా ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం), కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, సినిమా, టెలివిజన్ రంగంలో ‘అసాధారణ సామర్థ్యం‘ కలిగిన వ్యక్తులకు తాత్కాలిక నివాసం కోసం ఈ ప్రత్యేక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా జారీ చేస్తారు. తీవ్ర పోటీ ఉన్న హెచ్–1బీ వీసాకు ప్రత్యామ్నాయంగా ఓ–1 వీసా వినుతికెక్కుతోంది. అయితే లాటరీ లేకుండానే వీసా పొందే అవకాశం ఉండడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు; చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలో అసాధారణ విజయాల రికార్డు ద్వారా.. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించే వ్యక్తులకు యూఎస్‌లోకి ఓ–1 వీసా తాత్కాలిక ప్రవేశాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే దరఖాస్తుదారులు ప్రముఖ అవార్డులు, విద్య పరిశోధన ప్రచురణలు, వారున్న రంగానికి చేసిన సేవల వంటి ఎనిమిది కఠిన ప్రమాణాలలో కనీసం మూడింటిని కలిగి ఉండాలి.కఠిన పరిశీలన కారణంగా కేవలం 37 శాతం మాత్రమే దరఖాస్తులు ఆమోదం పొందుతున్న హెచ్–1బీ వీసా మాదిరిగా కాకుండా.. అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు వ్యవస్థాగత అడ్డంకులను దాటడానికి ఓ–1 వీసా వీలు కల్పిస్తోంది. అర్హతల విషయంలో ఇది దరఖాస్తుదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే కనీస జీతం లేదా అధికారిక డిగ్రీ అవసరం లేదు. సాధించిన విజయాలకు రుజువుగా అంతర్జాతీయ అవార్డులు, మీడియా కవరేజీ పొందుపరిస్తే చాలు.మూడవ స్థానంలో మనమే..: ఓ–1 వీసాలు పొందిన దేశాల జాబితాలో గ్రేట్ బ్రిటన్, బ్రెజిల్ తర్వాత మూడవ స్థానంలో భారత్ నిలిచింది. 2022–23లో భారతీయులు 1,418 ఓ–1 వీసాలు దక్కించుకున్నారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి, కొనసాగడానికి టెక్నాలజీ కంపెనీలు దృష్టిసారించాయి. అమెరికా ప్రస్తుతం భారీగా నిపుణుల వేటలో ఉంది. ప్రధానంగా ఏఐ నిపుణుల అవసరం పెరిగింది. దీంతో విదేశీ పరిశోధకులు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌ను పెంచుతోంది. వీరిలో అత్యధికులు యూఎస్‌లోకి సులభ మార్గాన్ని ఓ–1 వీసా అందిస్తుందని భావిస్తున్నారు.చాలా ఖరీదు... ఓ–1 వీసా దరఖాస్తు సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు కంటే చాలా ఖరీదైనది. దీని ఖర్చులు 10,000–30,000 డాలర్ల వరకు ఉంటాయి. హెచ్–1బీ ఫీజుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. కానీ సక్సెస్ రేట్ 93 శాతం ఉంది. తొలుత గరిష్టంగా మూడేళ్ల వరకు యూఎస్‌లో నివాసానికి అనుమతిస్తారు. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కొనసాగించినంత వరకు సంవత్సర కాల పరిమితితో అభ్యర్థి కోరినన్నిసార్లు గడువు పొడిగిస్తారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక డేటా ప్రకారం మంజూరైన ఓ–1 వీసాల సంఖ్య 2019–20లో 8,838 మాత్రమే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రెండున్నర రెట్లకుపైగా పెరిగింది.దిగ్గజ కంపెనీల క్యూ..గూగుల్, ఓపెన్ ఏఐ, టెస్లా, మెకిన్సే వంటి దిగ్గజ కంపెనీలు భారత్ నుండి కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెడీ అయ్యాయి. ఈ కంపెనీలు సేవలందిస్తున్న రంగాల్లో బాగా స్థిరపడిన అభ్యర్థులను వారి యూఎస్ ప్రధాన కార్యాలయానికి ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. హార్వర్డ్, యేల్, కొలంబియా వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకులను, పరిశోధకులను నియమించునే పనిలో ఉంటున్నాయి.ఏటా పెరుగుతున్నాయ్..హెచ్1–బీతో పోలిస్తే ఓ–1 వీసాల సంఖ్య తక్కువగా ఉంది. 2023–24లో మొత్తం 2,25,957 హెచ్1–బీ వీసాలకు ఆమోద ముద్రపడింది. ఓ–1 వీసాల విషయంలో ఈ సంఖ్య 22,669 మాత్రమే. హెచ్1–బీ డిమాండ్ తగ్గుతున్న ధోరణిలో ఉన్నప్పటికీ.. ఓ–1 వీసాలు సంవత్సరానికి దాదాపు 10% పెరుగుతున్నాయి. ఓ–1 వీసాలకు అయ్యే ఖర్చు ఎక్కువైనప్పటికీ కంపెనీలు, వ్యక్తులు ఇప్పటికీ ఇంత పెద్ద మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
డబ్బులు వచ్చిపడుతున్నాయ్!
రూ.11.6 లక్షల కోట్లు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు 2024–25లో మనదేశానికి పంపిన డబ్బులివి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్‌లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యూఎస్ నుంచి రెమిటెన్స్‌ల వరద పారుతోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మనదేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపే భారతీయులు కోటిన్నరకు పైగానే ఉంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలలోని స్వదేశీయుల నుంచి భారత్‌కు బట్వాడా అయిన స్థూల నగదు విలువ 135.46 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.11.6 లక్షల కోట్లకుపైనే) చేరుకుందని భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తాల్లో ఇదే అత్యధికమని, మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువని కూడా ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. 2023–24లో ఇలా అత్యధిక మొత్తం అందుకున్న దేశం మనదే.ఆ మూడు దేశాల నుంచే...నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే దేశాలన్నిటి కంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులను అందుకుంటోంది. గత ఎనిమిదేళ్లలో భారత్‌కు ఈ నగదు ప్రవాహం రెట్టింపు అయింది. 2016–17లో మన దేశానికి అందిన నగదు మొత్తం 61 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండటం గమనార్హం. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే.. ఏటా భారత్‌కు బట్వాడా అవుతున్న నగదు మొత్తంలో ఈ మూడు దేశాల నుంచే దాదాపు 60 శాతం మనదేశానికి వస్తోంది. ఇదే సమయంలో జి.సి.సి. (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతోంది. (ఆధారం : ఆర్బీఐ)ప్రధానంగా ఇంటి ఖర్చులకేప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2024లో మెక్సికో 68 బిలియన్ డాలర్ల అంచనా మొత్తంతో రెండవ స్థానంలో, చైనా 48 బిలియన్లతో మూడవ స్థానంలో ఉంది. భారత్‌కు ప్రధానంగా వివిధ దేశాలకు వెళ్లిన స్వదేశీయుల నుంచే నగదు అందుతోంది. ఇలా దేశాలకు బట్వాడా అయే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండు రకాలుగా వర్గీకరించింది. ఒకటి ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇళ్లకు పంపిస్తున్నవి, రెండు.. ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాల బదిలీలు (ఉదా: విరాళాలు, నగదు సహాయాలు వగైరా..) భారత్ విషయంలో – నగదు బట్వాడాలు అన్నవి ప్రధానంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవేనని ఆర్బీఐ 2025 మార్చిలో తన నెలవారీ బులెటి¯Œ లో పేర్కొంది.పెట్టుబడుల కంటే ఎక్కువ!నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండే దేశాలలో భారత్ నేటికీ ఒకటిగా కొనసాగుతోందని ఆర్బీఐ డేటా వెల్లడించింది. ‘భారత్‌కు అందుతున్న నగదు మొత్తం భారత్‌కు వస్తున్న స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది. దాంతో బయటి నుంచి వచ్చే నగదు భారత్‌కు ఒక స్థిరమైన వనరు అయింది’ అని ఆర్బీఐ సిబ్బంది సర్వే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఆ మొత్తాలు భారతదేశ వాణిజ్య లోటు నిధుల భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రవాహం దేశంలోని 287 బిలియన్ల వాణిజ్య లోటులో దాదాపు సగంగా (47 శాతం) ఉంది. -
పక్షులకూ భూతాపం సెగలు
ఆచార వ్యవహారాలు, సంస్కృతికి పట్టు గొమ్మ ల్లాంటి పల్లెటూర్లలో ఉదయం వెచ్చటి సూర్య కిరణ కాంతులు ఎంతటి హాయి గొల్పుతాయో అక్కడి పక్షుల కిలకిలారావాలు అంతకంటే ఎక్కువగా మనల్ని మైమరపింపజేస్తాయి. ఎలాంటి బాదరబందీలేకుండా స్వేచ్ఛగా విహరించే అలాంటి పక్షిజాతులకు ఇప్పుడు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత తదితరాలతో భూగోళం మండిపోతోంది. భూతాపోన్నతి ఏటికేడు పైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు.ఈ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఇప్పుడు పక్షులపై పడ్డాయి. అన్నెంపున్నెం ఎరుగని పక్షులను వాతావరణమార్పుల మాటున పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న కఠోర వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. వాతావరణ మార్పుల కారణంగా 500కుపైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే ప్రమాదపుటంచునకు చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అడవుల నరికివేత కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోతున్న వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు. మూడు రెట్లు పెరిగిన ముప్పుగతంలోనూ వ్యాధులు ప్రబలడం, సహజావరణంలో ఆహారం, అస్తిత్వం కోసం పోటీ, కొత్త ప్రాంతాలకు వలసలు.. ఇలా పలు కారణాల కారణంగా కొన్ని పక్షిజాతులు అంతర్థానమయ్యాయి. అయితే 1500 సంవత్సరం నుంచి చూస్తే నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణాలతో అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.ఒంటె మెడ గొడుగు పక్షి, హెల్మెటెడ్ హార్న్‌బిల్ వంటి ప్రఖ్యాత పక్షిజాతులు సైతం అంతరించిపోయే ప్రమాదముంది. ‘‘ ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి. అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలి. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలి’’ అని పరిశోధనలో కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్ వ్యాఖ్యానించారు. విస్తృతస్థాయిలో పరిశోధనవాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఏఏ జాతి పక్షులపై అత్యధికంగా ఉందనేది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు పెద్ద కసరత్తే చేశారు. అంతరించిపోయే ప్రమాదమున్న శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, పక్షుల జాబితాను తెప్పించి అందులోని 10,000కుపైగా పక్షిజాతులపై సమగ్రస్థాయిలో అధ్యయనం చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు లోనయ్యే పెద్ద రెక్కల పక్షులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పెద్ద రెక్కల పక్షులు ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఈ పక్షులుండే అటవీ ప్రాంతాలు సైతం గనుల తవ్వకం, నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో కనుమరు గవుతు న్నాయి. ‘‘ ఆధునిక ప్రపంచంలో పక్షిజాతుల అంతర్థానం అనేది మరో అతిపెద్ద ముప్పు.అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం’’ అని స్టీవార్ట్ అన్నారు. ‘‘ అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలి. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయి. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయి. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయి. రోజు లెక్కలేనన్ని కీటకాలను తిని పురుగుల అతి బెడదను నివారిస్తాయి. ఆకుల్ని, పూతను తిని చెట్లను నాశనంచేసే చిన్న కీటకాలను పక్షులు వేటాడి ఆయా ప్రాంతాల్లో చెట్లను పరోక్షంగా కాపాడతాయి. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూత, కాతకు కారణమవుతాయి.అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన వందలాది పక్షిజాతులు కనుమరుగైతే జరిగే జీవావరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే తక్షణం అడవుల అనవసర నరికివేతకు స్వస్తి పలకాలి. వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలి. అరుదైన పక్షులను ప్రత్యేకంగా పెంచి వాటి సంతతిని వృద్ధి చెందించాలి’’ అని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి, ప్రొఫెసర్ మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు. -
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్‌ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌కు అత్యంత బరువైన వార్‌హెడ్‌ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్‌ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్‌బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్‌కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్‌లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్‌ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
రండి.. చదువుకోండి
భారతీయ విద్యార్థుల ఆకర్షణే లక్ష్యంగా జర్మనీ పని చేస్తోంది. విద్యార్థుల ప్రవేశాలకు వీలైనంత సౌలభ్యాన్ని కల్పిస్తామంటూ హామీ ఇస్తోంది. విద్యార్థుల సామాజిక మాధ్యమాలతో పనిలేదంటూ, వారి ఖాతాలు తనిఖీ చేయబోమంటూ వెసులుబాటు కల్పిస్తోంది. తమ దేశంలో చదువుకోవాలంటూ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం జర్మనీకి వెళ్లి చదువుకోవాలనుకునే యువతకు ఉపశమనాన్ని కలిగించింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో వీసా అడ్డంకులు పెరుగుతున్నందున సురక్షిత గమ్యస్థానంగా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే గడిచిన రెండు నెలల్లో 35 శాతం మేర ప్రవేశాల దరఖాస్తులు పెరిగినట్టు ప్రకటించింది.చదువు తర్వాత వెసులుబాటు..⇒ వాస్తవానికి జర్మనీ అనేక రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. భారత్, జర్మనీ మధ్య విద్యా, పరిశోధనల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు నడుస్తున్నాయి. భారత్ నుంచి ప్రతిభావంతులైన మానవ వనరులు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది.⇒ ప్రస్తుతం 2,300 కంటే ఎక్కువ ఇంగ్లిష్–బోధన కార్యక్రమాలను ఆ దేశం అందిస్తోంది.⇒ చదువు పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణ కోసం 18 నెలల స్టే–బ్యాక్ పీరియడ్ –ఉపాధి లభించిన తర్వాత నివాస అనుమతి పొడిగింపు విద్యార్థులకు కలిసొచ్చే అంశాలు.జీవన వ్యయం, ఫీజులు తక్కువే! గత దశాబ్దంలో భారతీయ విద్యార్థులకు అగ్ర గమ్యస్థానాల్లో జర్మనీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 2025లో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.ఇందుకు పలు కారణాలున్నాయి1. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు ఉండటం 2. తక్కువ ట్యూషన్ ఫీజు 3. ఉన్నత విద్య, పరిశోధన–ఆవిష్కరణలపై ప్రాధాన్యత కల్పించడం 4. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) రంగాలతో పాటు ఆంగ్లంలో అందించే అనేక కార్యక్రమాలు 5. జీవన వ్యయం తక్కువ 6. సమృద్ధిగా స్కాలర్షిప్లు 7. మేటి ఉద్యోగావకాశాలు ఏటా విద్యా వీసాలు పెరుగుదల.. జర్మనీలో దాదాపు 425 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 305 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,భారత్ విద్యార్థుల ఉన్నత చదువులకు గమ్యస్థానంగా జర్మనీ నిలుస్తోంది. మరోవైపు వీసాల జారీలోనూ నిబంధనలను జర్మనీ సరళతరం చేస్తోంది. వాటి సంఖ్య ఏటా పెంచుకుంటూ వస్తోంది. జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వీసాల జారీ చూస్తే.. సంవత్సరం వీసాల సంఖ్య 2021 63,000 2024 90,0008 మందిలో ఒకరు మనోళ్లే న్యూఢిల్లీలోని జర్మన్ అకడమిక్ ఎక్సే్ఛంజ్ సర్విస్ (డీఏఏడీ) నివేదిక ప్రకారం జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4.05 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం. ప్రస్తుతం 50 వేల మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు భారత్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు. -
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...మదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఐటీ ఉద్యోగితో పోలిస్తే వారికి రెట్టింపు ఆదాయం
కెరీర్‌కు బంగారు బాటగా ఇంజనీరింగ్‌ను పరిగణించే మన దేశంలో.. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడానికి దాదాపు రూ.10-20 లక్షలు ఖర్చు చేయాలి. అంతేకాదు జీవితంలో విలువైన 4 సంవత్సరాలు వెచ్చించాలి. ఇంత వ్యయ ప్రయాసలకు ఓరి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరితే చేతికి వచ్చే జీతం ఎంతో తెలుసా? సగటున గంటకు రూ.139-186 మాత్రమే. అదేదో చిన్నాచితకా కంపెనీల్లో వీరు ఉద్యోగం చేస్తు న్నారా అంటే అదీ కాదు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో! ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్ల వంటి నిపుణులైన కార్మికుల కంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుకునే వేతనం తక్కువ.-సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ఎంట్రీ-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సగటు జీతం 2007-2010 కాలంలో సంవత్సరానికి దాదాపు రూ.3.5 లక్షలుగా ఉండేది. అప్పటితో పోలిస్తే 2024లో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలూ పెరిగోయి, కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాలామంది ప్రెసర్ల వేతనాల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. అర్బన్ కంపెనీ, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేస్తున్న కార్మికులైతే బీటెక్ గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలకుపైనా ఆదాయం అందుకుంటున్నారని ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ 'కెరీ ర్స్ 360' నివేదిక చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్స హించాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.బీటెక్ చదువు ఖర్చు పెరిగింది... రోజుకు 9 గంటల చొప్పుననెలలో 20 రోజుల పని దినాలకు అంటే నెలలో 180 గంటలు విధులు నిర్వర్తించారని భావిస్తే.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లో ఫ్రెషర్లు అందుకునే వేతనం కంపెనీని బట్టి గంటకు రూ. 130 నుంచి రూ.180 మధ్య ఉంది. బీటెక్ డిగ్రీ దశాబ్దన్నర క్రితం రూ.1-2 లక్షల్లో పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లకుపైనే ఖర్చు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తమ నాలుగేళ్ల చదువు కోసం అధిక సమయం. కృషి, డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, చదువు పూర్తై పట్టా చేతికొచ్చాక.. కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరితే జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.రికవరీకి 6-8 ఏళ్లు..అర్బన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన కార్మికులు సగటున గంటకు రూ.311 సంపాదిస్తున్నారు. ప్లంబర్లు. ఎలక్ట్రిష్ యన్స్, టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, డ్రైవర్లు, మసాజ్ థెరపిస్ట్ వంటి నైపుణ్యం కలిగిన ఈ కార్మి వీలు నెలకు సగటున 160 గంటలు పనిచేస్తే.. పన్నులు. కమీషన్, మెటీరియల్ వ్యయాలు పోను నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదిస్తున్నారు.ఇది కేవలం జీతాల పోలిక కాదని కెరీర్స్ 300 అంటోంది. 2010 పూర్వం బీటెక్ విద్యార్ధి తన డిగ్రీకి అయిన ఖర్చును తిరి రాబట్టుకోవడానికి రెండు మూడేళ్లు పట్టేది. ఇప్పుడు తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. ఏకంగా 5 ఏళ్లకుపైనే: పడుతోంది. మరోవైపు గగ్ ఎకానమీలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి అవకాశాలను వేగంగా, తక్కువ అడ్డంకులతో సాధిస్తున్నారని కెరీర్స్.. 360 చెబుతోంది. -
సాంకేతిక మార్గదర్శకులు!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్‌ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఆస్టరాయిడ్ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం కితాబిచ్చింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్ కంపెనీ ఈక్వల్ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..అగ్నికుల్ కాస్మోస్: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్‌ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్ లాంచ్‌ప్యాడ్‌ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్‌ప్యాడ్ ఉండేది. అగ్నిబాణ్‌ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ‘అగ్నిలెట్’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది.సైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేసైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ): టరీ): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.డెజీ: స్మైల్స్.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్‌లో 2018లో స్థాపించారు.ఈక్వల్: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్‌తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పూర్తి అయ్యే ఈ–పంప్స్ (చార్జింగ్ స్టేషన్) తయారు చేస్తోంది.ఫ్రేట్ టైగర్: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవలు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్‌తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ వేదికను రూపొందించింది.గెలాక్స్ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్. ఐదుగురు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్ ఇమేజింగ్ శాటిలైట్‌ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.సోలార్‌స్క్వేర్: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్ సేవలను అందిస్తోంది.ది ఈ–ప్లేన్ కో: ఐఐటీ మద్రాస్‌లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్ ట్యాక్సీని తొలుత మానవ పైలట్‌తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. పైలట్ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. -
స్కోరుంటేనే.. లోన్
తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్ స్కోర్ మార్చేసింది. క్రెడిట్ స్కోర్ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్ డెస్క్నాకు లోన్ కావాలి. క్రెడిట్ స్కోర్ ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్?ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్ యాప్ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా.. వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్ స్కోర్. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్.. సిబిల్ స్కోర్‌గా జనంలో బాగా పాపులర్ అయింది.నా క్రెడిట్ స్కోరు తక్కువైతే రుణం రాదా? ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ/క్రెడిట్ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్ ఇస్తున్నాయి. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఏ కంపెనీలు ఈ స్కోర్ ఇస్తున్నాయి? వాటికి ఆర్బీఐ అనుమతి ఉందా?క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు, కంపెనీల కోసం క్రెడిట్ కంపెనీ రిపోర్ట్లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్, కంపెనీలకు క్రెడిట్ ర్యాంక్‌లను జారీ చేస్తాయి. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు భారత్‌లో ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్ ఇండియా, ఎక్స్పీరియన్ ఇండియా, సీఆర్ఐఎఫ్ హై మార్క్. ఆర్బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్ ఉంది. స్కోర్ ఎక్కువగా ఉన్నవారికే లోన్ లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్ లోన్స్‌కు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్ లోన్స్‌కు క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.నాకు క్రెడిట్ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్ వస్తుందా?క్రెడిట్ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్‌ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.ఏది మంచి స్కోర్ ?851-900 (అద్భుతం)బకాయిలు లేని రుణగ్రహీతలు.751-850 (మంచిది)సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు.651-750 (సగటు)తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.501- 650 (పేలవమైనది)సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్నవారు.300 - 500 (చాలా పేలవమైనది)బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు.రూ.50 లక్షల వరకు.. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్–ఏ ప్లస్ విభాగంలో ఉండి, స్కోర్ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరే ముఖ్యం. – సాయి కుమార్ మామిడి, ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సేల్స్ అడ్వైజర్, హైదరాబాద్ -
కలిసి తింటే.. కలదు సుఖం
‘కలిసి తినే కుటుంబం కలిసి ఉంటుంది’ అని సామెత. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని, భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పూర్వీకులు తమ అనుభవంతో ఏర్పరచిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు వైద్య పరిశోధకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం – కలసి తింటే కలదు ఆరోగ్యం’ అని నిర్ధారణగా చెబుతున్నారు. చక్కటి భోజన సంభాషణ మనిషిలోని నిస్సత్తువను పోగొడుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయని మానసిక, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆస్వాదనతో పాటు అనుభూతీ!కుటుంబ సభ్యులను అత్మీయతలతో పెనవేసే అనేక అంశాలలో ‘అందరూ కలిసి భోజనం చేయటం’ అనే అలవాటు ముఖ్యమైనది. భోజనాన్ని ఆస్వాదిస్తూనే, సంభాషణలను అనుభూతి చెందే అవకాశం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కుటుంబానికి ఇంతకంటే ముఖ్యమైన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ మరొకటి ఉండదు. ఉల్లాసకరమైన మాటలు వస్తాయి. ఉత్తేజకరమైన నవ్వులు పూస్తాయి. ఆహ్లాదం ఘుమఘుమలాడుతుంది. సందట్లో ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం. అందుకే భోజన సంభాషణ అంటే కేవలం ఒక మంచి విషయం మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా అంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు. – సాక్షి, స్పెషల్ డెస్క్జెన్–జి తరానికి తప్పనిసరిభోజన సంభాషణలు కేవలం ఆచారాలు కావు. ఇవి రోజువారీ నిస్సత్తువను పోగొట్టి, మానసిక ఆరోగ్యాన్నిచ్చే సందర్భాలు కూడా. భారతీయ సంస్కృతిలో అంతర్లీనమైనదిగా ఉన్న ప్రియ భోజన భాషణ ఇప్పటి జెన్–జి తరానికి తప్పనిసరి అవసరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం చేసే సమయంలోని మనోల్లాసమైన సంభాషణలు మెదడును నెమ్మదింపజేస్తాయి. నాడీ వ్యవస్థను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. అయితే ఆధునిక జీవన శైలిలోని ఉరుకులు పరుగుల వల్ల వ్యక్తిగత జీవితంలోకి వృత్తిపరమైన బాధ్యతలు చొరబడి, ఇంటిల్లపాదీ కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయం నెమ్మదిగా అంతరించిపోతోంది.ఆసక్తి ఉన్నా అవకాశం లేదుఈ తరం పిల్లలు భోజనానికి కలవరు. ఇంటి సంభాషణలపై ఆసక్తి చూపరు. అలాగని కుటుంబ సంబంధాలు, కుటుంబ భోజనాలపై వారు మరీ అంత నిర్లిప్తంగా కూడా ఏమీ లేరు. 1996 తర్వాత జన్మించిన 2,000 మందిపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 64 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో భోజన సంభాషణలను జరపటంలో ఆసక్తి చూపారు. అదే సమయంలో.. అందుకు అవకాశం ఉండటం లేదని అన్నారు. ఎవరికి వారుగా భోజనం ముగించే వ్యక్తిగత వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో.. కుటుంబ బంధాలు మెరుగవ్వాలంటే కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.భోజన సమయ బంధుత్వాలు..: చిన్న కుటుంబాల్లో పెద్దవాళ్లకు చోటు ఉండదు. కానీ భోజన సమయంలో పెద్దవాళ్ల గురించిన కథలకు చోటు లేకుండా ఉండదు. తరాల కథలు మాటల్లోకి వస్తాయి. పారంపర్య కుటుంబ గాథలు ఇష్టమైన భోజనంలా అనిపిస్తాయి. ‘మరి కాస్త వడ్డించు’ అని అడిగినట్లుగా వంశవృక్షంలోని తాత ముత్తాల గురించి ‘ఇంకా చెప్పు’ అని కుతూహలంగా అడిగి మరీ చెప్పించుకుంటారు. ఎంతో ముఖ్యమైన రేపటి ఆ ‘ముఖ్యమైన సమావేశం’ గురించిన ఆలోచన మదిలోకే రాదు. అంతా కలిసి భోంచేస్తున్నారు కదా పాపం.. అని డెడ్లైన్లు డైనింగ్ హాల్ బయటే ఉండిపోతాయి. ఇక భోజన సమయంలో ‘నో–ఫోన్ పాలసీ’ పెట్టుకుంటే కడుపు నిండా కబుర్లు.. కళ్ల నిండా కమ్ముకునే నిద్ర మేఘాలు. ‘బర్నౌట్‌కు’ తగిన చికిత్స..: ఒత్తిడి, అలసట. శక్తి క్షీణత.. అన్నీ కలిసి ప్రపంచాన్ని ఇప్పుడు ‘బర్నౌట్’ చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బర్నౌట్ను ‘పని ఒత్తిడి సిండ్రోమ్’గా వర్ణించింది. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచంలో బర్నౌట్ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 2024 సెప్టెంబర్‌లో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం.. 58 శాతం మంది భారతీయులు పనిలో అమితంగా బర్నౌట్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ బర్నౌట్ నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, సానుకూల భోజన సంభాషణలు.. ఒత్తిడికి మూలమైన ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ‘ఆక్సిటోసిన్’ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఆక్సిటోసిన్ సామాజిక బంధాలకు, సంతానోత్పత్తికి దోహదపడుతుంది. లైంగిక సామర్థ్యం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. మాటలు ప్లేట్లు దాటకూడదు!..: భోజన సంభాషణలు తేలికగా ఉన్నప్పుడే కలిసి భోజనం చేయటం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే, ఒంటరిగా తినడమే నయం అనే నిస్పృహలోకి వెళ్లిపోతారు. పచ్చళ్ల దగ్గర మొదలై పంతాలూ పట్టింపుల వరకు వెళ్లిపోతే.. కలిసి భోజనం చేయకపోతేనే ఉత్తమం. చాలా వరకు సంభాషణ ఆహార పదార్థాల చుట్టూరానే తిరగాలి. మాటల్లోనే మాధుర్యం ఒలకాలి. ఇంట్లో ఎవరు ఏది ఇష్టంగా తింటారో సరదాగా చర్చించుకోవాలి. రుచికరమైన వంటకాలు చేసిన వారిని ప్రశంసించడం.. ఈ చర్చా కార్యక్రమాన్ని రక్తికట్టించే అసలైన ప్రధాన ముడిసరుకు. అది మన అభిరుచిని తెలియజేయడమే కాదు.. మనకు ప్రేమగా వండిపెట్టిన వారి నైపుణ్యానికి కూడా దక్కాల్సిన కితాబు. వంటంతా ఒక ఎత్తయితే.. వడ్డన మరో ఎత్తు. ప్రేమగా, కొసరి కొసరి వడ్డిస్తుంటే.. ఎవ్వరూ నో చెప్పలేరు. అందుకే, అలా ప్రేమగా వడ్డించినవారిని కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. కిందటి రోజు చూసిన సినిమా, ఆవకాయ పచ్చళ్లపై చర్చ, వంశపారంపర్య విశేషాల ప్రస్తావన.. కాదేదీ ప్రస్తావనకు అనర్హం. ఇలాంటి మంచి విషయాల చుట్టూ మాటలు సాగితే మనసుకు, దేహానికి మంచి మెడిసిన్ పడినట్లే. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్‌కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎగిరే ట్యాక్సీలు
పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా జూన్ 3న అమెరికాలో ‘అలియా సీఎక్స్300’ అనే విద్యుత్ విమానం ఐదుగురు ప్రయాణికులతో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. 130 కి.మీ. ప్రయాణానికి దీనికి పట్టిన సమయం 35 నిమిషాలు కాగా, ఇంధనానికి (విద్యుత్‌కు) అయిన ఖర్చు సుమారుగా రూ.700. అంత చౌకగా విమానయానాన్ని సాధ్యం చేయటంలో కొత్త శకానికి నాంది పలికిన ఈ విమానం.. మనదేశ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అభివృద్ధి ప్రయత్నాలకూ పరోక్షంగా ప్రోత్సాహాన్నిచ్చింది. అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)లో భాగంగా ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిన మనదేశం వచ్చే ఏడాది నాటికి ఈ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తోంది.2023లో బెంగళూరులో జరిగిన ఒక అధ్యయనంలో.. ప్రైవేటు వాహనాలు వాడే ఉద్యోగుల్లో 57 శాతం, ప్రజా రవాణా ద్వారా ప్రయాణించే ఉద్యోగుల్లో 55 శాతం మంది కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారని తేలింది. ఆలస్యం కారణంగా ఏడాదిలో సుమారు 7 లక్షల పని గంటలు నష్టపోయారని అంచనా. 2023లో ట్రాఫిక్ రద్దీ కారణంగా కోల్పోయిన పని గంటల వల్ల ఒక్క బెంగళూరు నగరమే 200 బిలియన్ డాలర్లు నష్టపోయింది.పట్టణాల్లో ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు తక్కువ వ్యవధిలో గమ్యానికి చేర్చే అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్) ఎంతో ఉపయోగపడుతుందని ‘స్కై వేస్ టు ద ఫ్యూచర్ – ఆపరేషనల్ కాన్సెప్ట్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ఇన్ ఇండియా’ నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.అంతర్జాతీయ సంస్థలతో కలిసి..మానవ రహిత ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ మొబిలిటీలో నూతన ఆవిష్కరణల కోసం.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, ఈ వ్యవస్థ నిర్వహణ కోసం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ), అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటితోనూ మనదేశం కలిసి పనిచేస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలపై అధ్యయనం చేసేందుకు డీజీసీఏ 7 వర్కింగ్ గ్రూపులను ఏర్పాటుచేసిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రూపులు దృష్టి సారిస్తున్న అంశాల్లో ప్రధానమైనది వెర్టిపోర్టులు (ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రత్యేకించిన ఎయిర్‌పోర్టులు. సాధారణ హెలికాప్టర్ మాదిరిగానే ఎయిర్ ట్యాక్సీలు నిలువుగా టేకాఫ్ అవుతాయి. అదే విధంగా ల్యాండ్ అవుతాయి.). ఇంకా అటానమస్ డ్రోన్ల ట్రాఫిక్ వ్యవస్థ, ఎయిర్ ట్యాక్సీల నిర్వహణ, మరమ్మతులు, నియంత్రణ మార్గదర్శకాలు, సురక్షిత ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతుల వంటి అంశాలపై ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి.రెండు దశల్లో విస్తరణభారత్లో తొలి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ 2026 అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీలు 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలను మొదట ఢిల్లీ–ఎన్ సీఆర్, ముంబై, బెంగళూరులలో ప్రారంభించి, తదుపరి దశలో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరింపజేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల విధి విధానాలు ఖరారు అయ్యాక ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఐజీఇ), అమెరికా ఎయిర్ ట్యాక్సీ తయారీ కంపెనీ ‘ఆర్చర్ ఏవియేషన్’తో కలిసి ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుందట. చార్జీలు ఎంత ఉండొచ్చు?ఎయిర్ ట్యాక్సీ చార్జీలు ప్రస్తుతం ఉన్న క్యాబ్ చార్జీల కంటే కాస్త మాత్రమే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం క్యాబ్‌లో ఢిల్లీ నుండి గుర్గావ్కు ఒక మనిషికి రూ. 1,500–2,000 చార్జీ అవుతుండగా, దీనికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువగా రూ. 2,000–3,000 వరకు ఎయిర్ ట్యాక్సీ చార్జీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఏమని పిలవాలి?విద్యుత్ ఎయిర్ ట్యాక్సీని సాంకేతికంగా ‘ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్’ (ఇ.వి.టి.ఓ.ఎల్.) ఎయిర్‌క్రాఫ్ట్ అంటున్నారు. మొత్తంగా ఈ రవాణా వ్యవస్థని ‘అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)’ అంటారు. – సాక్షి, స్పెషల్ డెస్క్పనిచేస్తున్న 2 సంస్థలుడీజీసీఏ రికార్డుల ప్రకారం ప్రస్తుత దేశంలో పౌర విమానయాన రంగంలో ఎయిర్ ట్యాక్సీల తయారీకోసం 2 సంస్థలు పనిచేస్తున్నాయని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. అవి చెన్నైకి చెందిన ‘యుబిఫ్లై టెక్నాలజీస్’ లేదా ఈ–ప్లేన్ కంపెనీ. ఐఐటీ మద్రాసులో ప్రాణం పోసుకున్న ఈ కంపెనీ ఎయిర్ ట్యాక్సీ, కార్గో ట్యాక్సీల తయారీలో పనిచేస్తోంది.చండీగఢ్‌కి చెందిన ‘నల్వా ఏరో’. ఇది కనీసం ఐదుగురు ప్రయాణించగలిగే ఎయిర్ ట్యాక్సీ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.ఎన్నో ప్రయోజనాలు» వెర్టిపోర్టులన్నీ సౌర, పవన విద్యుత్‌వంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో నడిచేలా చూడాలన్నది కేంద్రం ఆలోచన. అలాగే, ఇవి పూర్తిగా గ్రీన్ పోర్టులుగా పర్యావరణ హితంగా ఉండాలని యోచిస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.» రోడ్లమీద ట్రాఫిక్ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టొచ్చు» కాలుష్య కారక ఉద్గారాలను విడుదల చేయవు. శబ్ద కాలుష్యమూ ఉండదు.»ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు సరకు రవాణా, ఎమర్జెన్సీ సేవలకూ పనికొస్తుంది» అత్యాధునిక సాంకేతికత, ప్రమాణాలతో పనిచేస్తాయి కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ» సరికొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి» మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ట్యాక్సీ సేవలను అందించవచ్చు -
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్‌తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్‌లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్‌గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్‌లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్‌జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్‌లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్‌గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్‌తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్‌లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
కుర్చీకి అతుక్కోకు.. రోగాలు తెచ్చుకోకు
రోజులో గంటల తరబడి కూర్చుని ఉండేవాళ్లలో.. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు చాలా ఎక్కువట. అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ మే నెలలో విడుదల చేసిన అధ్యయనం చెప్పిన విషయమిది. ఎక్కువసేపు కూర్చుని ఉండే ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు వస్తున్నాయని ఫిబ్రవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన వెల్లడించింది. రోజులో 8 గంటలు అంతకుమించి ఎక్కువ సమయం కూర్చుని ఉండిపోయేవాళ్లు మానసిక అనారోగ్యాలు, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్లు, ఒత్తిడి.. ఇంకా అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎక్కువసేపు కూర్చోవడం అన్నది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుందట. – సాక్షి, స్పెషల్ డెస్క్గంటల తరబడి.. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లంతా పారాహుషార్. కూర్చున్నంతసేపూ సుఖంగానే ఉంటుంది కానీ.. తరువాత్తరువాత అనారోగ్యాలతో కష్టం తెలుస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు, పరిశోధకులు. ఎక్కువసేపు కూర్చోవడం లేదా శారీరక కదలికలు బొత్తిగా లేకపోవటం అన్నవి శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వైద్య పరిశోధకులు గుర్తించారు. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కేలరీలు కరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దాంతో బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగిస్తుంది. కొవ్వుల్ని, చక్కెరలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం తగ్గి అనారోగ్యాలు దరిచేరతాయి.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చేవి..హృద్రోగాలు..: రక్త ప్రవాహం తగ్గడం, రక్త నాళాలలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం రక్తపోటుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.టైప్ 2 మధుమేహం..: మన శరీరంలోని క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం లేదా ఈ రెండింటి వల్లా టైప్ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల దాహం, అలసట, మసక దృష్టి, పుండ్లు గాయాల వంటివి నెమ్మదిగా నయమవడం లాంటివి జరుగుతాయి.మస్క్యులోస్కెలెటల్ (అస్థి–కండరాల నొప్పి)..: కోర్ (ఉదరం, వీపు కటిభాగం సహా ప్రధాన దేహం), నడుము, కాళ్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో కదలికలు కష్టం అవుతాయి. వెన్ను, మెడ దృఢత్వాన్ని కోల్పోతాయి. వెన్నెముక అమరిక దెబ్బతింటుంది.రక్త ప్రసరణ, రక్తనాళ సమస్యలు..: రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దాంతో కాళ్లు, పాదాలలో రక్తం ఒక చోట చేరటం జరుగుతుంది. వాపు, కాళ్లలో ఉబ్బిన (వెరికోస్) సిరలు, రక్తం గడ్డకట్టటం లాంటివి సంభవించవచ్చు.కేన్సర్ ప్రమాదం..: పెద్దపేగు, రొమ్ము, మహిళల్లో గర్భాశయ సంబంధ కేన్సర్ల వంటివి వచ్చే ప్రమాదం ఉంది. తగ్గిన రక్త ప్రసరణ, జీవక్రియ మందగమనం కణుతుల పెరుగుదలకు, వ్యాప్తికి దోహదం చేయవచ్చు.మానసిక అనారోగ్యాలు..: ఎక్కువసేపు కూర్చోవటం అన్నది మొదట శరీరంపై ప్రభావం చూపి, మెల్లిగా మానసిక అనారోగ్యాల వైపు కూడా దారి తీయవచ్చు. మెదడు పరిమాణం తగ్గడం, (సెరిబ్రల్ ఎట్రొఫీ) మెదడు కుంచించుకుపోతుంది, మతిమరుపు వస్తుంది.వ్యాయామం చేస్తే సరిపోదా?సరిపోతుంది. అయితే అది కొంతవరకు మాత్రమే. ప్రతిరోజూ 60 నుంచి 75 నిమిషాలు తేలికైన లేదా కఠినమైన వ్యాయామం చేయగలిగిన వారు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇది వైద్యులు సాధారణంగా సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ వ్యాయామం. చాలామంది అంత చేయలేరు కూడా. అంత మాత్రాన నిరాశ చెందనవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయగలిగినా కూడా కూర్చోవటం వల్ల ముప్పిరిగొనే వ్యాధుల నుండి చాలావరకు తప్పించుకోవచ్చు. అయితే, అరగంట వ్యాయామం చేశాం కదా అని 6 గంటలపాటు కదలకుండా కూర్చుంటాం అంటే కుదరదు. రోజంతా కదులుతూ ఉండటం కూడా ముఖ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి. కనీసం అరగంటకోసారి లేచి నిల్చోవడం, కాసేపు నడవడం, ఫోన్ కాల్స్ సమయంలో నడుస్తూ మాట్లాడటం, ఒళ్లు సాగదీసుకోవడం వంటివి చేయాలి.ఏ యూనివర్సిటీ ఏం కనుగొంది?హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐటీ ఉద్యోగుల మీద ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి. ఎక్కువసేపు కూర్చోవటం, అధిక పనిగంటలు, పని ఒత్తిడుల కారణంగా వారిలో ఊబకాయం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీలివర్ – ఎమ్ఏఎఫ్ఎల్డి) వంటి సమస్యలతో బాధపడుతున్నారట.గంటల తరబడి కూర్చోవడాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏకంగా ధూమపానంతో సమానమని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని పేర్కొంది.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. ఎలాంటి సమస్యలు వస్తాయని వారు చెప్పారంటే..» యూనివర్సిటీ ఆఫ్ బెడ్‌ఫోర్డ్‌షైర్ (బ్రిటన్): హృద్రోగాలు, మధుమేహం» యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) : చురుగ్గా ఉండే యువతలోనూ గుండె జబ్బులు, ఊబకాయం. » హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (అమెరికా): టైప్ –2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్» యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ (బ్రిటన్) : టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు. » ఘెంట్ యూనివర్సిటీ (బెల్జియం) : (12–14 ఏళ్ల పిల్లల్లో) నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తక్కువ సేపు నిద్ర పోవడం» యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా) : ఊబకాయం, హృద్రోగాలు, టైప్ – 2 డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల కేన్సర్లు -
విమర్శల జడివానలో మమ్దానీ
అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నా గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న మమ్దానీ వైఖరిపై ఇప్పుడు న్యూయార్క్ నగరవ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరితో వార్తల్లోనేకాదు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లోనూ నిలిచి డెమొక్రటిక్ అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీని భారత్‌లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైనా మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తరచూ అబద్దాలు వల్లెవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలూ పెరిగాయి. మొదట్నుంచీ అతి వాగ్దానాలు డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న వెంటనే మమ్దానీని ‘నెరవేరని వాగ్దానాలుచేసే నేత’గా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ‘‘ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చు అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యం అని తెల్సికూడా ఇష్టమొచి్చన హామీలిస్తాడు’’అని ఎరిక్ ఆరోపించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మమ్దానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞచేశారు. ‘‘అపార్ట్మెంట్లలో అద్దెలను క్రమబద్దీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశుసంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరకు దుకాణాలు తెరుస్తానన్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా 10 బిలియర్ డాలర్లు ఖర్చువుతుందని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కు పిండిమరీ వసూలుచేస్తానన్నాడు. అయితే నగరంలో పన్నులు వసూలుచేసే అధికారం మేయర్‌కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు’’అని ఆడమ్స్ గుర్తుచేశారు. మమ్దానీ ప్రస్తుతం క్వీన్స్ 36వ జిల్లా నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పాలస్తీనాకు జై.. నెతన్యాహూకు నై పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ సేనల భీకర దాడులను ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు ఆదేశించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధనేరాలకు పాల్పడిన నేరస్తుడిగా మమ్దానీ అభివరి్ణంచారు. ‘‘యుద్దనేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహూపై 2024 నవంబర్లోనే అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అతను న్యూయార్క్‌కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా’’అని మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీపైనా విమర్శలు గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికను పంచుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మమ్దానీ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘‘నెతన్యాహూ మాదిరే మోదీ కూడా యుద్దనేరస్తుడే. గుజరాత్లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమే. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామ ని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు’’ అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలూ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. ‘‘మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్‌లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్‌పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్ నుంచి ఊహాత్మక అబద్దాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. నగరంలో మమ్దానీకి మద్దతుదారులు పెరిగితే చివరకు ‘జిహాదీ మేయర్’అవతరిస్తాడు అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మమ్దానీని విమర్శించే వాళ్లు అతని తల్లిదండ్రులపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘మమ్దానీ తండ్రి అసలైన మార్కిస్ట్కాదు. నిఖార్సయిన వ్యక్తికాదు. ఇక అతని తల్లి మీరా నాయర్ అసలైన కేరళ మలయాళీ నాయర్ కాదు. ఆమె పేరులో అక్షరదోషం ఉంది. ఆ పేరు నాయర్ కాదు పంజాబీ నయ్యర్. మమ్దానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని హిందువులన్నీ, యూదులన్నీ అస్సలు పడదు. వీళ్లపై జరిగే దాడులను సమర్థిస్తాడు’’అని మరో నెటిజన్ విమర్శించాడు. హిందూ వ్యతిరేకి? 2020 ఆగస్ట్‌లో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్ట్‌లు పెట్టారు. ‘‘భారత్‌లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే, ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధతో గుజరాతీలో భజనలు చేశారు. ఇలాంటి ఘన చరితను బీజేపీ తుడిచిపారేస్తోంది’’అని మమ్దానీ గతంలో ఒక ట్వీట్‌చేశారు. ‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్‌లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్ పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్ పెట్టారు. ఆధునిక నాగరికతకు నిలయమైన న్యూయార్క్‌కు అవకాశమొస్తే మేయర్‌గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్షధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్‌వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్‌ఫోన్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్ ఫోన్లూ భారత్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్ హబ్’గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏటా కొత్త మైలురాళ్లు..మొబైల్ ఫోన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్‌లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్‌లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. అయితే మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కారణం. 2024–25లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.ఈసీఎంఎస్‌తో ఊతం..విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం (ఈసీఎంఎస్) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, మల్టీ లేయర్ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం. అసెంబ్లింగ్‌ను మించితేనే..ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలంటే విడిభాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్ప్లేలు, హై–ఎండ్ బ్యాటరీ ప్యాక్‌లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్‌ను సైతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్ చేçస్తున్నారు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవాన్ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
అగ్రి రోబోటిక్స్.. ప్రణాళికతో సక్సెస్
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రోజులివి. వ్యవసాయ రంగం కూడా ఇప్పుడు ఈ డిజిటల్ మార్పులను స్వీకరిస్తోంది. కానీ, మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో రోబోలను విలాసవంతమైన ఆవిష్కరణగా మాత్రమే చూస్తున్నారు. ఈ దశలో తెలంగాణ రాష్ట్రం డిజిటల్ వ్యవసాయ విప్లవం దిశగా అడుగులు వేస్తోంది.ఈ కృషిలో తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎలా మారగలవన్న అంశంపై డిజిటల్ వ్యవసాయంలో ప్రపంచ స్థాయి పరిజ్ఞానం ఉన్న సీనియర్ శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి) సంచాలకులు డాక్టర్ షేక్ ఎన్.మీరాతో ‘సాక్షి’ ముచ్చటించింది. రోబోటిక్స్, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతపై స్పష్టమైన ప్రణాళికతో, సమగ్రమైన విధానంతో ముందడుగు వేస్తే రైతులకు మేలు జరుగుతుందని మీరా అంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వ్యవసాయ రోబోటిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.. ఎందుకని?వ్యవసాయ రంగంలోని ప్రధాన సమస్యలకు రోబోలు సమాధానంగా నిలుస్తున్నాయి. ఇవి కూలీల కొరతను పరిష్కరిస్తాయి. ఎరువులు, నీరు, పురుగుమందుల వంటి ఉత్పాదకాల వినియోగాన్ని తగ్గిస్తాయి. ఉత్పాదకతను పెంచుతాయి. అనేక దేశాల్లో ఇందుకు ఉదాహరణలు కనిపిస్తాయి:ఎకో రోబోటిక్స్ (స్విట్జర్లాండ్): గడ్డిపై కాకుండా ఇతర కలుపు మొక్కలపై మాత్రమే కలుపు మందులను పిచికారీ చేస్తూ 90% వరకు రసాయనాల వినియోగాన్ని ఈ రోబోలు తగ్గిస్తున్నాయి.అగ్రోబోట్ (స్పెయిన్): స్ట్రాబెర్రీలను సున్నితంగా, నాణ్యత పాడవకుండా కోసే సామర్థ్యం ఈ రోబోలకు ఉంది.ఇలాంటి రోబోలు ఖరీదైన ‘టాయ్స్’ కాదు. భారతీయ చిన్న రైతులకు సరిపోయేలా, సరసమైన వ్యయంతో మనమూ తయారు చేయవచ్చు.⇒ తెలంగాణ కోసం మీరు గతంలో సూచించిన ఐదు అంచెలవ్యూహం ఏమిటి?⇒ తెలంగాణకు ఉన్న ఉరిమే ఉత్సాహం క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావాలంటే ఈ ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలి:ఒక పనికి ఒక రోబో: ఉదాహరణకు.. మల్టీ టాస్కింగ్ రోబోలు కాకుండా, పసుపును ఉడకబెట్టే ఆవిరి యంత్రం, కలుపు తీసే యంత్రం, వరుసలుగా విత్తనాలు వేసే యంత్రం లాంటి చిన్న రోబోలను అభివృద్ధి చేయాలి.స్థానిక ఆవిష్కరణ – ప్రపంచ ప్రేరణ: ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, అగ్రి–స్టార్టప్‌లను ప్రోత్సహించి పత్తి తీయటం, మిరప కాయలు కోయటం, వరి నాట్లు వేయటం వంటి పనులు చేసే చిన్న రోబోలను స్థానికంగానే రూపొందించాలి. పైలట్ గ్రామాల్లో రోబోటిక్ జోన్లు: స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ కింద 20 గ్రామాలను ఎంచుకొని పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలి. ఈ గ్రామాల్లో ఫలితాలను బట్టి రాష్ట్రం అంతటా అమలు చెయ్యాలి. అద్దెకు రోబోలు: రోబోలను ట్రాక్టర్ల మాదిరిగా అద్దెకు ఇచ్చే విధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చెయ్యాలి. రోబోలను రైతులు మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఉండాలి.గ్రామీణ రోబోటిక్ వనరుల కేంద్రాలు: గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి.. రోబోల మరమ్మతులకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పించే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.ఇతర దేశాల్లో చిన్న రైతులకు రోబోల ద్వారా అందిస్తున్న అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సినవేమిటి? ప్రభుత్వాలు పరిశోధనలకు విధానాలు, పెట్టుబడుల ద్వారా అండగా నిలవాలి. సబ్సిడీలు అందించి, శిక్షణ సదుపాయాల ద్వారా అవసరమైన ఆధునిక నైపుణ్యాలను అందించాలి. ఇజ్రాయెల్: ప్రతి నీటి చుక్కను, పోషకాలను వృథా కాకుండా సూటిగా లక్ష్యానికి చేరేలా రోబో ఆధారిత ఎరువుల సరఫరా వ్యవస్థను ఇజ్రాయెల్ అమలు చేస్తోంది. మహబూబ్‌నగర్ వంటి కరువు ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరం. ఆస్ట్రేలియా: భారీ కమతాల్లో తమంతట తామే కలుపు తీసే అటానమస్ వీడర్లను ఆస్ట్రేలియాలో గతంలోనే అభివృద్ధి చేసింది. జపాన్, దక్షిణ కొరియా: వృద్ధ రైతులకు తోడ్పాటునందించే వరి నాట్లేసే రోబో యంత్రాల ఉత్పత్తిపై జపాన్, దక్షిణ కొరియా దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. రైతులు ఈ రోబోలను అద్దెకు తీసుకొని నాట్లు వేసుకుంటున్నారు. చైనా: రోబోలను చైనా ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఇస్తోంది. గ్రామీణ యువతకు ‘రోబో ఆపరేటర్లు’గా శిక్షణ ఇస్తోంది.తెలంగాణ ఉద్యాన తోటల సాగు రంగానికి రోబోలు ఎలా తోడ్పడగలవు?రాష్ట్రంలో భారీగా మామిడి, అరటి వంటి పండ్ల తోటలు, మిరప, పసుపు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. అరటి గెలలు కోసే రోబోలు, మామిడి కాయలను గ్రేడింగ్ చేసే రోబోలను అందుబాటులోకి తెస్తే నాణ్యత పెరిగి మంచి ధర వస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పాలీహౌస్ రైతులకు రోబోలను అందిస్తే తక్కువ ఖర్చుతోనే పనులు చకచకా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోగలుగుతారు.కానీ, ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి కదా?అవును. ప్రధానంగా రోబోల ధరలు. రోబో ధర రూ. 8–10 లక్షలు ఉంటే రైతులకు అందుబాటులో ఉండదు. రూ. 50 వేల నుంచి లక్ష పరిధిలో దొరికేలా మార్గాలు చూడాలి.⇒ స్థానికంగా మరమ్మతులు చేసే వ్యవస్థ ఉండాలి. ⇒ రోబోలు వస్తే ఇక తమకు ఏమీ పని ఉండదని రైతులు భావిస్తున్నారు. అవి మనుషులకు ప్రత్యామ్నాయం కాజాలవని, రైతు కూలీలకు సహాయంగా ఉండే సాధనాలు మాత్రమేనని చెప్పి, వారిలో నమ్మకం కల్పించాలి. క్షేత్ర ప్రయోగాల్లో రోబోలు వాడి చూపించి రైతుల్లో రోబోల ప్రయోజకత్వంపై నమ్మకం కలిగించాలి.రోబోలతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయంపై ప్రభావం ఎంత ఉండొచ్చు?పురుగుమందులు, ఎరువుల వాడకం 30–40% తగ్గిపోతుంది. పనులు ఒత్తిడి ఉండే కాలంలో కూలీల శ్రమ 20–25% వరకు తగ్గుతుంది. విత్తనాలు వేయటం, నాట్లు వేయటం, పంటల కోతలో సామర్థ్యం 50% పెరుగుతుంది. రోబోలను నడపటం, మరమ్మతు చేయటం, డిజైన్లపై పనిచేయటం ద్వారా గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.విశేష అనుభవంసీనియర్ వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తగా అపారమైన క్షేత్రస్థాయి అనుభవంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం డాక్టర్ షేక్ ఎన్.మీరాకు ఉంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఫాడ్)లో సీనియర్ డిజిటల్ అగ్రికల్చర్ నిపుణుడిగా ఈజిప్టు రాజధాని కైరో నగరం కేంద్రంగా గతంలో అనేక సంవత్సరాలు పనిచేశారు.‘అటారి’ అంటేభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్–ఐకార్), పరిశోధనా సంస్థలు కాలానుగుణంగా చేసే పరిశోధనల ఫలితాలను సాధారణ రైతులకు చేర్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేలు) వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక కేవీకే ఉంటుంది.స్థానిక వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మార్గనిర్దేశనం చేయటంలో కేవీకేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేవీకేల వ్యవస్థపై పర్యవేక్షణకు జోన్ల వారీగా 11 అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి)లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కేవీకేలు హైదరాబాద్ అటారి అజమాయిషీలో పనిచేస్తుంటాయి. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్‌కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్‌ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్‌లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్‌లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్‌లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్‌హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్‌ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్‌వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్‌కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్‌నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్‌హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్‌గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్‌యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్‌కు పైలట్‌గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్‌మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్‌నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్‌మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్‌గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్‌ను భారత్‌కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు. -
ఆ ఐదింటిలో... టాప్–10లో భారత్
సాక్షి, స్పెషల్ డెస్క్ : కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్ టాప్–10లో చోటు సంపాదించింది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌కు చెందిన బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ అనే సూచీని రూపొందించింది. ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, అంతరిక్షం, క్వాంటమ్ టెక్నాలజీ విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరుల వంటి అంశాల ఆధారంగా దేశాలకు స్థానాలు కేటాయించారు.ఏఐలో దూసుకుపోతూ..కృత్రిమ మేధ విభాగంలో భారత్ దూసుకుపోతోందని చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం.. అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ ఏఐ విభాగంలో జపాన్ , తైవాన్ , దక్షిణ కొరియా కంటే మనం ముందున్నాం. బయో టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్ అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో నంబర్ వన్. ఈ సూచీలోని బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, తైవాన్ , దక్షిణ కొరియాలను మనం అధిగమించాంసిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో.. సెమీకండక్టర్ల తయారీలో వాడే సిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్ వినియోగంలో 10 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. చిప్ డిజైన్ సౌకర్యాలలో ప్రపంచంలో 7% మాత్రమే భారత్ కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్‌లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు యూఎస్, యూరప్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్ విభాగంలో మనం ఫ్రాన్స్కంటే ముందున్నాం. 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రోఅంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ‘మంగళ్యాన్’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి అడుగుపెట్టిన దేశం భారత్. ఈ సూచీలో అంతరిక్ష విభాగంలో జపాన్ , దక్షిణ కొరియా, తైవాన్ కంటే మనదేశం ముందుంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మనదేశం 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటమ్ టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ మించిపోవడం గమనార్హం.ఏయే అంశాల ఆధారంగా స్కోర్‌ను నిర్ణయించారంటే...ఏఐటాప్ మోడల్స్ కచ్చితత్వం, డేటా, ఆల్గరిధమ్స్, కంప్యూటింగ్ పవర్, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు.బయోటెక్నాలజీ జన్యు ఇంజనీరింగ్, ఔషధాల తయారీ, వ్యాక్సిన్ పరిశోధన, వ్యవసాయ సాంకేతికత, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.సెమీకండక్టర్స్అసెంబ్లింగ్, టెస్టింగ్, ఎక్విప్మెంట్, తయారీ–ఫ్యాబ్రికేషన్ , చిప్ డిజైన్ – టూల్స్, ప్రత్యేక ముడిపదార్థాలు–వేఫర్స్, నియంత్రణ, అంతర్జాతీయంగాస్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు. స్పేస్రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్ ్స, పొజిషనింగ్–నావిగేషన్ –టైమింగ్, సైన్ ్స– అంతరిక్ష పరిశోధన, దేశీయంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు క్వాంటమ్క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ , సెన్సింగ్,ప్రభుత్వ విధానాలు, అంతర్జా తీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు. -
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్‌కు కేరాఫ్‌గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్‌లోని హనుమాన్, శంకర్‌గంజ్‌లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్‌కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్, అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్.. టెస్లాతోపాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్స్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్‌ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. దశలవారీగా మయామీ, ఆస్టిన్, శాన్ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్‌పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్ తీరుతెన్నులు, పికప్.. డ్రాప్ఆఫ్ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్‌ను కాస్తా సైబర్ క్యాబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. మానవ డ్రైవర్ల పరిస్థితి?జూక్స్, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. ::గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos/Videos Credits: zoox.com/newatlas.com