
బండి వెనుక బండెడు లోడు. ఇక మిగిలింది ఆయిల్ ట్యాంకే.. అక్కడ కూడా ఓ మహిళ ..అనంతపురం నుంచి సమీప గ్రామాలకు వెళ్లి ప్లాస్టిక్ సామానులు అమ్ముకునే ఈ చిరు వ్యాపారి మంగళవారం ఇలా ప్రమాదకర రీతిలో ప్రయాణం సాగించాడు. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
సాక్షి ఫొటోగ్రాఫర్ అనంతపురం
అల..మెరుపులా
విశాఖ సాగర తీరాన సరదాగా గడుపుదామని వచ్చే కొందరు అక్కడి రాళ్లపై కూర్చొని అలల సయ్యాటలను ఆస్వాదిస్తుంటారు. సెలీ్ఫలు దిగుతూ సరదాగా గడుపుతుంటారు. అయితే ఒక్కోసారి అలలు ఇలా ప్రమాదకరంగా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగా మారుతుంటాయి. ఆర్కేబీచ్‌లో సందర్శకులు ఇలా రాళ్లపై నిల్చొని సెలీ్ఫలు తీసుకుంటుండగా ఓ పెద్ద రాకాసి అల ఇలా విరుచుకుపడింది. చూస్తున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం
జడివాన
విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా గంటస్తంభం,నగర పాలక సంస్థ కార్యాలయం, రాజీవ్ క్రీడా ప్రాంగణానికి వెళ్లే రహదారిలో నీరు నిలిచిపోవడంతో వాహనాలపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం