
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కోనసీమలో కలకలం రేపుతోంది. రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.
ప్రియురాలు పుష్పను వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలంటూ ప్రియుడు బలవంతం చేశాడు. నిరాకరించిన పుష్పను షేక్ షమ్మ దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడినీ కూడా గాయపరిచి నిందితుడు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.