మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ మహిళా నేతల నిరసన | YSRCP Women Leaders Protest In Front Of Minister Kollu Ravindra House | Sakshi
Sakshi News home page

మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ మహిళా నేతల నిరసన

Jul 17 2025 4:01 PM | Updated on Jul 17 2025 4:40 PM

YSRCP Women Leaders Protest In Front Of Minister Kollu Ravindra House

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు.

మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే  ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.

మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లో వాళ్లేనా.. రెచ్చిపోయిన మహిళలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement