
దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారే నేరస్తులు
సేకరణ, ఆపరేషన్స్‌లోనే సగం మోసాలు
మేనేజర్/సూపర్‌వైజర్స్‌దే అధిక చేతివాటం
ఆఫీసుల్లో మోసాలపై కేపీఎంజీ నివేదిక
సాక్షి, స్పెషల్ డెస్క్: నమ్మితేనే కదా మోసం చేయగలిగేది.. అని సినిమా డైలాగ్. ఇది అక్షరాలా నిజ మని మరోసారి రుజువైంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో! ఆడిటింగ్, ట్యాక్స్, అడ్వైజరీ సేవల్లో ఉన్న ప్రముఖ కంపెనీ కేపీఎంజీ నివేదిక ‘గ్లోబల్ ప్రొఫైల్స్ ఆఫ్ ద ఫ్రాడ్‌స్టర్’ ఇదే చెబుతోంది. బయటి వ్యక్తులు కాదు.. సంస్థలో సుదీర్ఘకాలంగా, నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులే మోసాలకు తెగబడుతున్నారట.
మరీ ముఖ్యంగా ఈ మోసాల్లో మగాళ్లదే అందెవేసిన చేయి. కంపెనీలూ, ఆఫీసుల్లో ఇలా మోసం చేయడంలో మాత్రం అతివలు మగాళ్లతో పోలిస్తే చాలా వెనకబడ్డారనే చెప్పాలి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో జరి గిన మోసాలకు సంబంధించిన 669 వాస్తవ కేసుల ఆధారంగా కేపీఎంజీ రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

