
అమెరికాలో భారతీయ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు
జర్మనీలో కోర్సుల అర్హతలు, వీసా ప్రాసెస్ సులభతరం
రెండు ప్రముఖ జర్మన్ వర్సిటీలతో జేఎన్‌టీయూ–హెచ్ ఒప్పందం
సీఎస్‌ఈలో ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షలకుపైగా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో భారత విద్యార్థులు ఇతర దేశాలవైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయా దేశాలు ముందుకొస్తున్నాయి. మనదేశంలో ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కోర్సులను అందిస్తున్నాయి.
ఈ క్రమంలో జర్మన్ యూనివర్సిటీలు, జర్మనీ ప్రభుత్వం భారతదేశ విద్యార్థులకు ఆహా్వనం పలుకుతున్నాయి. జర్మన్ యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్హతలు, వీసా ప్రాసెస్‌ను సులభతరం చేశాయి. ఇప్పటివరకు జర్మనీలో విద్యాభ్యాసం చేయాలంటే జర్మన్ రావడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను పక్కనపెట్టి ఆంగ్ల మాధ్యమంలోనూ కోర్సులను అందిస్తున్నాయి, తద్వారా జర్మన్ భాష వస్తేనే అక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలమనే భావనను చెరిపివేస్తున్నాయి.
మెకానికల్, ఆటోమొబైల్ నుంచి ఏఐ వైపు..
ఇప్పటివరకు జర్మనీ అంటే మెకానికల్, ఆటోమొబైల్ రంగాలకు మంచి పేరుండేది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ, ఎంఎల్ డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతుండటంతో జర్మనీలో ప్రముఖ కంపెనీలు కూడా వీటివైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ విద్యార్థులు, కంప్యూటర్ రంగ నిపుణులకు జర్మనీలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్న వేళ మరోవైపు జర్మనీలో అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్ ఖండంలోనే అతి పెద్ద ఆరి్థక వ్యవస్థ అయిన జర్మనీలో 65ఏళ్లు పైబడినవారు పెరుగుతున్నారు. దీంతో నిపుణులైన యువత అవసరం ఆ దేశానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అవకాశాలు సన్నగిల్లుతున్నవేళ మన విద్యార్థులకి జర్మనీ ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
జర్మన్ వర్సిటీతో కలిసి జేఎన్‌టీయూ–హెచ్ కొత్త కోర్సు
⇒ జర్మనీలో విద్య, ఉపాధి అవకాశాలను తెలుగు విద్యార్థులు అందిపుచ్చుకునేలా జేఎన్‌టీయూ–హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇటీవల రెండు ప్రముఖ జర్మన్ యూనివర్సిటీలతో జేఎన్‌టీయూ–హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో ఒకటి ప్రపంచంలో మూడో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచిన జర్మనీకి చెందిన రాయుట్లింగ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కేఎఫ్‌ఆర్‌యూ). ఈ విద్యా సంస్థతో కలిసి జేఎన్‌టీయూ–హెచ్ కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ) విభాగంలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్(ఐఐబీఎంపీ) కోర్సును ప్రారంభించింది.
⇒ 2025–26 విద్యా సంవత్సరానికి ఈ కోర్సులో చేరడానికి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మొదటి విడత కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది.
⇒ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్‌తో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని జేఎన్‌టీయూ–హెచ్, కేఎఫ్‌ఆర్‌యూ
నిర్ణయించాయి.
⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటరీ్మడియెట్ లేదా సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ బోర్డుల ద్వారా ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఐఐబీఎంపీ కోర్సుకు అర్హులు.
⇒ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్(జేఈఈ మెయిన్)–2025 లేదా తెలంగాణ, ఏపీ ఎంసెట్–2025 ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
⇒ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 11.
⇒ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 12న హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ–హెచ్ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం 9044112999, 9044117999 నంబర్లలో సంప్రదించాలి.
⇒ దరఖాస్తులు, కోర్సు కరిక్యులమ్, ఇతర సమగ్ర వివరాల కోసం జ్టి్టpట://్జn్టuజి.్చఛి.జీn/, ఠీఠీఠీ.జ ౌb్చ pటౌజట్చఝట.జీnలో చూడొచ్చు.