breaking news
Hyderabad
-
Patancheruvu: పోలీసుల ఓవరాక్షన్
పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్‌లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
అలాంటి అధికారుల ఫొటోలు ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి: తెలంగాణ హైకోర్టు
తరాలు మారుతున్నా మున్సిపల్ అధికారులు పని తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడమేగానీ, సమస్యను వెంటనే పరిష్కరిద్దాం అనే ఆలోచన చేయరని తప్పుబట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా వ్యవహరిస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశి స్తూ.. విచారణ వాయిదా వేసింది. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తాలూకా ఖానామెట్‌లోని తమ భూమిలో రాయపాటి ప్రతిభ, రాయపాటి శ్రీహర్ష, జీబీ ప్రసాద్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ సయ్యద్ రహీమున్నిసా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘నోటీసులిస్తారు కూల్చి వేతలు ఉండవు. వచ్చే సోమవారం నుంచి ప్రతీ వారం చేపట్టిన కూల్చివేతల వివరాలు కోర్టు ముందు ఉంచేలా స్టాండింగ్ కౌన్సెళ్లకు ఆదేశాలిస్తా. అనధికారిక నిర్మాణాలకు, నగర విధ్వంసానికి ఈ స్టాండింగ్ కౌన్సెళ్లు, అధికారులే బాధ్యులు. ఎవరికి వారు మా పని మేం చేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు. స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని స్టాండింగ్ కౌన్సెళ్లు.. ఉత్తర్వులిచ్చాం, టాస్ఫోర్స్కు బదిలీ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్.. ఈ లేఖను పోలీసులకు అందజేశామని టాస్‌ఫోర్స్.. శాంతిభద్రతల్లో తలమునకలై మేం ఆ పనిని వాయిదా వేశామని పోలీసులు.. ఇలా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అధికారులు, స్టాండింగ్ కౌన్సెళ్ల పేర్లు రాత్రి పూట కూడా స్పష్టంగా కనిపించేలా ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్‌పై విద్యుత్ దీపాలతో పోస్టర్లు వేయించాలి’అని అసహనం వ్యక్తంచేశారు. -
మా కొడుకు జాడ చెప్పండి
భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన మందల చిన్న సమ్మిరెడ్డి కుమారుడు రాజు 2013, జూన్ 20వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పటినుంచి అతడు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి చిన్న సమ్మిరెడ్డి 2017, జూన్ 20న భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుమారుడి గురించి ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు బదిలీ చేయగా, విచారణ జరిపిన పోలీసులు 2021లో రాజు ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. కొడుకు ఆచూకీ కోసం తాము వెతికామని, కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని రాజు తండ్రి .. కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట వాపోయారు. గత ప్రభు త్వం తమ కుమారుడిని తెలంగాణ అమరవీరుడిగా గుర్తించిందని, అయినా ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. ఉండటానికి ఇల్లు, తమ కూతురికి ఉద్యోగ అవకాశం కలి్పంచాలని సమ్మిరెడ్డి కోరారు. -
ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద శబ్దం..ఒక్కసారిగా మంట లు వచ్చాయి. మొత్తం పొగ..దుమ్ము.. ఏం జరుగు తోందో తెలియలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. మా కళ్ల ముందే పేలుడు జరిగింది..మా ముందే చాలామంది చనిపోయారు. కొందరు మహిళ లు మంటలు అంటుకుని కాపాడాలంటూ వేడుకుంటు న్న అరుపులే ఇంకా గుర్తొస్తున్నాయి. మా చిన్నాన్నలు, అన్నలు, స్నేహితులు కనిపించకుండా పోయారు.వాళ్లు బతికి ఉన్నారో..? లేదో..? తెలియడం లేదు.. పొద్దుటి నుంచి వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాం..ఎప్పు డు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది..’అని పాశమైలారం సిగాచి ఫ్యా క్టరీలో ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు ‘సాక్షి’వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా వాళ్ల జాడ చెప్పండి సారూ’అంటూ బాధితుల బంధువులు అక్కడికి వచి్చ న అధికారులను బతిమాలుకుంటున్న తీరు కంట తడిపెట్టించింది. తమ వాళ్ల గురించి ఎందుకు చెప్ప డం లేదంటూ కొందరు మహిళలు ఏకంగా రాళ్ల ను తీసుకుని అధికారులపై దాడి చేసినంత పని చేశా రు. వారి కుటుంబీకుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు..ఆగ్రహావేశాలు సైతం అందరినీ కలిచి వేశాయి. వాష్‌రూంలో ఉండగా పెద్ద శబ్దం నేను ఉదయం షిప్ట్‌లో ఉన్నా. పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా డ్రయింగ్ యూనిట్ దగ్గరే పనిచేస్తున్నా. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లి పక్కన వాష్‌రూంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. బయటికి వచ్చి చూసే సరికి పెద్దగా మంటలు..పొగ..దుమ్ము ఏమీ కనపడ లేదు. వాష్‌రూంకు వెళ్లకపోతే చనిపోయేవాడిని. – చందన్ గౌర్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ నేను రియాక్టర్ దగ్గరే పని చేస్తున్నా నేను రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. ఉదయం పేలుడు జరిగినప్పుడు రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న. మొదట ఎయిర్ బ్లోయర్ పేలింది. దానివల్ల నేను పనిచేస్తున్న రియాక్టర్ కూడా పెద్ద శబ్దంతో పేలింది. అయితే పక్కనే గది నుంచి మెట్లు ఉన్న విషయం నాకు ముందు నుంచి తెలుసుకాబట్టి ఆ దారి వెతుక్కుంటూ బిల్డింగ్ పైకి వెళ్లిన. అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. వెంటనే కూలిన ఒక గోడ పట్టుకుని పాకుతూ మొదటి అంతస్తులోకి కిందికి వచి్చన. అక్కడ కిటికిలోంచి కిందికి దూకిన. నా పక్కనే రెండు శవాలు పడి ఉన్నాయి. వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చేశా. పేలుడు జరిగినప్పుడు కనీసం 30 నుంచి 45 మంది అక్కడ ఉన్నారు. వాళ్లంతా చనిపోయే ఉంటారు. – పవన్ ఇసాద్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ మా ఇద్దరు చిన్నాన్నలు చిక్కుకున్నారు ఏడేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు నేను రియాక్టర్ రూం దగ్గరే పనిచేస్తున్న. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో కిందికి పారిపోయిన. కానీ మా చిన్నాన్నలు శశికుమార్, లఖ్నజీత్ ఇద్దరు లోపలే చిక్కుకున్నారు. ఒకరి శవం దొరికింది. ఇంకొకరు ఏమయ్యారోఏమో.. – విజయ్, బక్సర్ జిల్లా బిహార్ ముగ్గురిని కాపాడినం.. నేను ప్రమాదం జరిగినప్పుడు పక్కన బిల్డింగ్‌లో టిఫిన్ చేస్తున్న. బయటికి వచ్చేసరికి మొత్తం పొగ ఉంది. ఏం కనిపించలేదు. కాసేపటికి అంతా అటు ఇటు ఉరుకుతున్నరు. పక్కన అడ్మిని్రస్టేషన్ బిల్డింగ్ దగ్గర కొంతమంది కాపాడాలని అరుస్తున్నారు. నేను, ఇంకో ఇద్దరం కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లినం. పైన ఫ్లోర్ నుంచి మెల్లగా కిందికి దింపి ముగ్గురిని కాపాడినం. – శివ, కార్మికుడు, ఒడిశా డ్యూటీలోనే దూరంగా ఉన్నా.. నేను ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్న. కానీ స్పాట్‌కు దూరంగా ఉన్న. పె ద్ద శబ్దం వచి్చంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన. ఎవరెరు చనిపోయారో అర్థం కాలేదు. అనేకమంది గాయపడ్డారు. – సంతోష్ కుమార్, ఉద్యోగి, ఏపీ ఆచూకీ లేనివారు ఎంతమంది?సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం పరిశ్రమలో విధులకు వెళ్లినవారు ఇంటికి తిరిగి రాక.. ఆసుపత్రుల్లోనూ కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో అసలెంత మంది ఉన్నారు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఎంతమంది.. అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా పోయింది.ఒకవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శిథిలాల కింద ఎంతమంది ఉండి ఉంటారనే దానిపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలిసింది. రెండు మృతదేహాలు శిథిలాల కింద లభ్యమైనట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యుల డీఎన్ఏలతో పోల్చాకే మృతదేహాలను అప్పగించనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు ముగ్గురిని గుర్తించినట్లు తెలుస్తుండగా.. దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 10 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. కంపెనీ డ్రైవర్ సమయస్ఫూర్తి8 మంది క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలింపుసాక్షి, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే జరిగిన ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్న కంపెనీ బస్సు డ్రైవర్ లాల్‌రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పేలుడు కారణంగా బస్సు ధ్వంసమైనా వెనుకడుగు వేయకుండా బాధితులను ముత్తంగిలోని ఆసుపత్రికి తరలించారు.ఘటన జరిగిన తీరును ఆయన ‘సాక్షి’ కి వివరించారు. ‘నేను జనరల్ షిప్ట్ వాళ్లను కంపెనీకి తీసుకువచ్చి న తర్వాత బస్సును పార్క్ చేసి కూర్చుని ఉన్నా. కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దం విని్పంచింది. కాసేపటికి అంతా గాయాలతో బయటికి వస్తున్నారు. ఇంకా అంబులెన్స్‌లేవీ రాలేదు. నేను వెంటనే 8 మందిని బస్సులో ఎక్కించుకుని ముత్తంగి ఆసుపత్రికి తీసుకెళ్లిన. అక్కడి నుంచి మదీనగూడ ఆసుపత్రికి తీసుకొచి్చన. ఆషాక్ నుంచి బయటికి రాలేకపోతున్నా..’అని లాల్‌రెడ్డి వివరించారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామీకరణతోపాటు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రమాదాలు కార్మికుల ప్రాణాలు, వారి జీవన స్థితిగతులతోపాటు పరిశ్రమల భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపే రీతిలో ఉంటున్నాయి. రసాయన, ఔషధ, టెక్స్టైల్, ఆహార సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కు వగా చోటుచేసుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏటా ప్రమాదాలు నమోదవుతున్నాయి.హైదరాబాద్ పరిసరాల్లోని జీడిమెట్ల, జిన్నారం, గడ్డపోతారం, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, పటాన్చెరు, సంగారెడ్డి తదితర పారిశ్రామిక వాడల్లో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఔషధ తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో పేలుళ్లు, రసాయనాల లీకేజీలు, షార్ట్ సర్క్యూ ట్లు, అగ్ని ప్రమాదాలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల మూలంగా కార్మీకుల ప్రాణాలు గాల్లో కలుస్తుండగా, భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. పారిశ్రామిక రంగంలో ఫార్మాస్యూటికల్స్, కెమికల్ యూని ట్స్‌ను హైరిస్క్ పరిశ్రమలుగా పరిగణిస్తూ ఉంటారు. తెలంగాణలో హైరిస్క్ యూనిట్లు 4,130 వరకు ఉన్నా వాటిలో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో ఇన్స్పెక్టర్లు 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పరిశ్రమల సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను తరచూ తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.రెండు రోజులకో ప్రమాదం..⇒ రాష్ట్రంలో సగటున ప్రతీ రెండు రోజులకో ప్రమాదం జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో 600కు పైగా పారిశ్రామిక ప్రమాదాలు జరగ్గా 1,116 మరణాలు సంభవించినట్లు సమాచారం. గత పదేళ్లలో ఫార్మా యూనిట్లలో 102 భారీ అగ్ని ప్రమాదాలు జరగ్గా.. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ లెక్కలు చెప్తున్నాయి. రియాక్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, ముడి సరుకులు, ఉత్పత్తుల నిలువ, రవాణాలో అజాగ్రత్తలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో భారీ యంత్రాల చుట్టూ రక్షణ చర్యలు, పిట్స్, సంప్స్ వద్ద జాగ్రత్తలు, యంత్ర భాగాల తనిఖీలు, పరిశుభద్రత, సరైన గాలి, వెలుతురు, ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవడం. హానికర రసాయనాలను సురక్షితంగ పారవేయడం వంటి వాటిలో నిర్లక్ష్యం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగులు, కార్మీకులకు సరైన నైపుణ్య శిక్షణ లేకపోవడం, తక్కువ వేతనాలు ఇచ్చే ఉద్దేశంతో నైపుణ్యం లేని కార్మీకులను విధుల్లోకి తీసుకోవడం, ప్రమాదకర రసాయనాల గురించి వారికి అవగాహన లేకపోవడం, కాలం చెల్లిన యంత్రాలను మార్చకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిరంతర ఆడిట్ లేనందునే.. ⇒ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు నామమాత్ర తనిఖీలు, నోటీసుల జారీతోనే సరిపెడుతున్నట్లు విమర్శలున్నాయి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలతోపాటు ఫైర్ ఆడిట్స్ను ఏటా నిర్వహించాల్సి ఉండగా.. అవి మొక్కుబడిగా సాగుతున్నాయి. భద్రతా ఆడిట్లు, కార్మీకులకు నిరంతర శిక్షణ, పర్యావరణ నియమాలు పాటించడం, సాంకేతికంగా నవీకరణ, అత్యవసర స్పందన కోసం పరిశ్రమల్లో అగ్నిమాపక, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవడం తదితరాలపై దృష్టి పెట్టాలనే డిమాండ్ కార్మీకుల నుంచి వినిపిస్తోంది. -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్‌లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్‌ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్‌లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్‌కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్‌కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్‌రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్‌కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్‌కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్‌సరీ్వసెస్‌అడిషనల్‌డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, గోల్కొండ, మెహిదీపట్నం, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, రాజేంద్రనగర్, వికారాబాద్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, మియాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. -
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని.. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.కాగా, రాజాసింగ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా.. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
Raja Singh: ఆ గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది..
రాజాసింగ్.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్.. ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్ బై అంటూ ప్రకటించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్‌కు గ్యాప్ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..ఆనాటి గ్యాప్.. కొనసాగుతూనే వచ్చింది..!రాజాసింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట. అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్. 2022లో నుపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్‌ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. 2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ 22వ తేదీన రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్‌కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్‌ను హైదరాబాద్ నుంచి పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. సస్పెన్షన్ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్-అధిష్టానం మద్య గ్యాప్‌కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్‌కు భిన్నంగా రాజాసింగ్ వ్యవహరించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్ మద్దతు పలికారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్‌కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
ఢిల్లీ: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు,…— PMO India (@PMOIndia) June 30, 2025 -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్‌కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
Hyderabad: ఓఆర్ఆర్పై ఒకదానికొకటి ఢీకొన్న10 కార్లు..
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. 10 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి చెన్నమ్మ హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న 10 కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్‌లో న్యూస్‌రీడర్, యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
Land Cruiser: రూ.3కోట్ల కారు.. ఊడిపోయిన టైరు
కోరుట్ల: ఆ కారు ఖరీదు ఇంచుమించు రూ.3 కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పేరున్న కారు. ఏదైనా ప్రమాదం జరిగి.. కారు పల్టీలు కొట్టినా పది ఏయిర్ బ్యాగులు తెరుచుకుని భద్రత విషయంలో ఏ మాత్రం బెదిరిపోవాసిన అవసరం లేదన్న ప్రచారం ఉంది. దీనికితోడు బులెట్ ప్రూఫ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖరీదైన కారు టైరు చిన్నపాటి ప్రమాదంలో ఎలా ఊడిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. కారులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. అదే సమయంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కారు భద్రతపై మాత్రం లెక్కలేని సందేహాలు వస్తున్నాయి.అసలేం జరిగింది..?శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అడ్లూరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోరుట్ల వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో మెట్పల్లి నుంచి తిరిగి ధర్మపురి వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. 15 నిమిషాల్లో కారు మెట్పల్లిదాటి మారుతీనగర్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో దెబ్బతిన్న ఓ కారును కోరుట్లలోని మెకానిక్ షెడ్ నుంచి నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి తీసుకువెళ్తున్న టోచన్ వాహనం ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలు ఎదురెదురుగా చిన్నగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా మంత్రి కారు టైర్ ఊడిపోయింది. కారు టైర్ ఊడిపోవడం మినహా మంత్రి కారుకు ఎక్కడా ఎలాంటి గీత పడకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మంత్రి అడ్లూరి క్షేమంగా బయటపడగా.. టోచన్ వాహనంతో కారును తెస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే మెట్పల్లి పోలీసులు వచ్చి రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. భద్రత సంగతి దేవుడెరుగు..మంత్రి కారులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఏ పరికరంలోనైనా విడిభాగాలను బిగించే చిన్న చిన్న నట్లు, స్క్రూలు, ఇతరత్రా పరికరాల్లో కొంచెం తేడా వచ్చినా.. లూజు అయినట్లు ఉన్నా ప్రమాద సూచికలు ఇస్తుందని సమాచారం. శనివారం రాత్రి జరిగిన చిన్నపాటి ప్రమాదానికే ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉన్న మంత్రి కారు టైరు ఎలా ఊడిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కారు టైర్ ముందుగానే కాస్త లూజ్ అయి ఉంటే దానికి సంబంధించిన ప్రమాద సూచికలు ఎందుకు రాలేదన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాద సంకేతాలు వచ్చినా డ్రైవర్ సరిగా దృష్టి పెట్టలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా ప్రమాదాన్ని నివారించే టెక్నాలజీ వ్యవస్థ సైతం ఈ కారులో ఉంది. అంతే కాకుండా ఈ వాహనం భద్రతా రేటింగ్ 5 స్టార్ కావడం గమనార్హం.అవే కార్లు...గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల కోసం ఇదే రకం 22 కార్లను కొనుగోలు చేసిన విషయం తెలి సిందే. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా లో టు ఉన్నా ఇంత లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవే కార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు కేటాయిస్తున్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటా యించిన కారు కూడా అదే కావడం గమనార్హం. -
‘బేగంపేట’.. ఉత్కంఠ!
హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో గౌరవ విమానయాన శాఖ ముందస్తు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. పౌర విమానాల రాకపోకలకు అడ్డుగా ఉండే భవనాలు చెట్ల తొలగింపులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ’భారతీయ వాయుయాన్ అదినీయం’, 2024 (16 ఆఫ్ 2024)లో కీలక సవరణలు చేపట్టింది. ఈ చట్టంలోని సెక్షన్ 34 పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు నోటీసుల జారీ ప్రక్రియలో పలు సవరణలు చేశారు. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ రూల్స్‌తో ఈ నెల 18న ప్రత్యేక గెజిట్ ప్రచురించింది. ఈ గెజిట్ ప్రచురితమైన 21 రోజుల తర్వాత సంబంధిత రూల్స్ వినియోగంలోకి రానున్నాయి. ఈ గడువులోపు సంబంధిత రూల్స్‌పై అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో బస్తీలు, కాలనీల్లోని వేలాది నిర్మాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. రసూల్‌పురా, అన్నానగర్ పరిధిలోని వేలాది నిర్మాణాలు పూర్తిగా ఎయిర్‌పోర్టు స్థలాల్లోనే వెలసినవి కావడం గమనార్హం. కంటోన్మెంట్ పరిధిలోని కాలనీల్లో నిర్మాణాలకు ముందస్తుగానే ఎయిర్‌పోర్టు అథారిటీ ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది.ఏమిటీ సవరణలు.. ⇒ ‘భారతీయ వాయుయాన్ అదినీయం’, చట్టం సెక్షన్ 18 (1), (3) ప్రకారం సంబంధిత అధికారి విమాన యాన రాకపోకలకు అడ్డంకిగా ఉండే భవనాలు, చెట్ల తొలగింపు నోటీసు జారీ చేస్తారు. ⇒ నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు సంబంధిత భవనం, చెట్ల యజమాని పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును మరో 60 రోజుల వరకు పెంచే వెసులుబాటు ఉంది. ⇒ నిర్దేశిత గడువులోపు సంబంధిత యజమాని కోరిన వివరాలు సమరి్పంచకపోతే, అధికారులు ఇచ్చిన సమాచారాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ విమానయాన రాకపోకలకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించిన ఏదైనా భవనం లేదా చెట్టును సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నివేదిక రూపొందిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు యజమానులు పూర్తిస్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. ⇒ పౌర విమానయాన శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు స్పందించని యజమానులపై జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేసి, తదుపరి చర్యలు చేపడతారు. ఆ బస్తీల మనుగడ ప్రశ్నార్థకం ఈ నిబంధనలపై విమానాశ్రయాల సమీపంలోని భవనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని యజమానులు నిరసన వెలిబుచ్చుతున్నారు. కంటోన్మెంట్లో భవన నిర్మాణాలకు పౌర విమాన యాన శాఖ నుంచి ముందస్తుగానే ఎన్ఓసీలు తీసుకుంటారు. వారు సూచించిన ఎత్తుకు లోబడే మెజారిటీ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని నిర్మాణాలు మాత్రమే నిర్దేశిత ఎత్తుకంటే ఎక్కువ మోతాదులో ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయం చుట్టూ ఉన్న కంటోన్మెంట్ పరిధిలోని నిర్మాణాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే వేలాది నిర్మాణాలకు ఎయిర్ పోర్టు ఎన్ఓసీ నిబంధన అమల్లో లేదు. పౌర విమానయాన శాఖ తాజా ఉత్తర్వులతో బేగంపేట ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఉన్న వేలాది నిర్మాణాలు పాక్షికంగా కూలి్చవేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నగరం నడి»ొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయంలో సాధారణ పౌరుల విమానాల రాకపోకలు కొన్ని ఏళ్ల క్రితమే నిలిచిపోయాయి. కేవలం చార్టెడ్ ఫ్లైట్లు, రక్షణ శాఖ విమానాలు మాత్రమే బేగంపేటకు వస్తున్నాయి. వీటి కోసం వేలాది భవనాలను కూల్చివేసే బదులు, ఈ విమానాశ్రయాన్నే తరలించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టును తరలించండి: వికాస్ మంచ్ సామాన్య పౌరుల రాకపోకలు నిలిచిపోయిన బేగంపేట ఎయిర్‌పోర్టును పూర్తిగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చార్టెడ్, వివిధ సంస్థలకు చెందిన విమానాల కోసం మాత్రమే వినియోగిస్తున్న బేగంపేట ఎయిర్‌పోర్టును దుండిగల్ లేదా హకీంపేటకు తరలించాలని కోరారు. -
ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసిన కాసేపటికే కబళించిన మృత్యువు
మూసాపేట: కాసేపట్లో ఇంటికి వస్తున్నానంటూ ఫోన్ చేసి చెప్పిన కుమారుడు.. అంతలోనే చనిపోయాడని పోలీసులు ఫోన్ చేయడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజీవ్ నగర్‌కు చెందిన తిరుపతయ్య కుమారుడు సురేష్ (24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి షాపింగ్ చేసుకుని వస్తానని శనివారం సాయంత్రం 5 గంటలకు బోడుప్పల్ నుంచి బయలుదేరాడు. రాత్రి 10 గంటలకు ఆలస్యం కావడంతో రాత్రి ఫ్రెండ్ వద్ద ఉండి ఉదయం వస్తానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు వస్తున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడు. 5 గంటలకు కూకట్పల్లి పోలీసులు ఫోన్ చేసి కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద మెట్రో పిల్లర్ నెంబర్ 839 వద్ద రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత
సాక్షి, మాదాపూర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది.వివరాల ప్రకారం.. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇక, 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది.కూల్చివేతల సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల అక్రమం. మేము రిజిస్టర్ చేసుకున్న భూములు ఇవి. 1956 నుండి మాకు పత్రాలు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కో-ఆపరేటివ్ సోసైటీ విక్రయిస్తేనే కొనుగోలు చేశాం. ప్రతీ ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను కడుతున్నాం. మరి హైడ్రా ఏ విధంగా మా భూములు లాక్కుంటుంది. మాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ కబ్జా చేసి కట్టిన వారిని ఏమనడం లేదు. కోర్టులో పోరాడుతున్నవారిని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కి ప్రభుత్వమే ఇది 15 ఎకరాలు సున్నం చెరువు అని రిపోర్ట్ ఇచ్చారు. చెరువు అల్లాపూర్ బాలానగర్‌లో ఉండగా శేరిలింగంపల్లిలో ఉన్నట్లు చూపిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాదాపూర్‌లో గల సున్నం చెరువు నీరు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ చెరువు నీటిలో పరిమితికి మించి ఏకంగా 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు తేలింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సహకారంతో చెరువులోని నీటి నమూనాలను సేకరించి, శాస్త్రీయంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమైంది. అత్యంత హానికరమైన సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నీటిని తాగవద్దని, కనీసం రోజువారీ అవసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక, హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రధాన చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సున్నం చెరువుపై దృష్టి సారించింది. -
బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బన్సీలాల్‌పేట్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి బోనాల వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఫి షరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి ఘటం తయారీ వస్తువులు, ఆభరణాలను ఫౌండర్ ట్రస్టీ ఫ్యామిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల వేడుకల సందర్భంగా ఆ లయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవా దాయ, పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్తు, సాంస్కృతిక, రవాణా, వైద్య ఆరోగ్య విభాగాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిష నర్ వెంకట్రావు, ఈవో మనోహర్ రెడ్డి ఉన్నారు.డప్పుల దరువులకు స్టెప్పులేసిన పొన్నం..మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు చప్పుళ్లకు ఆనందంతో పోతురాజుల ఈరగోళలను తీసుకొని నృత్యం చేశారు. మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అంతకు ముందు అమ్మవారి ఆలయాన్ని శ్రీ విద్యా శంకర భారతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి ఘటం ఉత్సవాల ఎదుర్కొలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సనత్‌నగర్ కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ కోట నీలిమ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్‌రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్‌ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
రేవంత్ సర్కార్‌పై దర్యాప్తు ఎందుకు చేయించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐ, ఈడీలతో వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట రాహుల్–రేవంత్ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన ప్రధాని మోదీ, ఇప్పటి వరకు దర్యాప్తునకు ఆదేశించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. దేశ ప్రధాని హోదాలో మోదీ, కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా తెలంగాణకు వచ్చి సీఎంపై కేవలం అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి హోదాలో విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాల న్నారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అమిత్‌షా బురద జల్లడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా, ఆఫీసుకు రిబ్బన్ కట్ చేస్తే నయాపైసా ప్రయోజనం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.పసుపు బోర్డు కార్యాలయా నికి సొంత భవనం నిర్మించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈ జనవరి 14న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తే, ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరోసారి అమిత్ షా ప్రారంభించడం బీజేపీ చేసే జుమ్లా పనులకు, చెప్పే జూఠా మాటలకు నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. నదుల అనుసంధానం ముసుగులో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమే అని కేటీఆర్ మండిపడ్డారు. -
కాచుకొని.. కాపాడుతారు
బోధన్: బతకడానికి ఏ దారీ లేనప్పుడు గోదారే దిక్కు అని.. ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడేవారికి ఆ గ్రామ యువకులు బతుకుపై ఆశలు కలిగిస్తున్నారు. చావుకు, బతుక్కు మధ్యలో నిలిచి ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. వారే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామ యువత. యంచ గ్రామం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. అక్కడికి కిలోమీటర్ దూరంలో నది నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను వేరు చేస్తుంది. నదికి ఇటువైపు నిర్మల్ జిల్లా బాసర ఆలయం ఉంది. ఈ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు వంతెన కొంతకాలంగా ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలకు కేంద్ర బిందువుగా మారింది.అక్కడే యంచ గ్రామ యువకులు నిత్యం కాపుకాసి ఎందరినో రక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఐదేళ్లలో వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సుమారు 450 మందిని రక్షించారు. ఇందులో మత్య్సకారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. యంచ గ్రామ యువకులు ప్రవీణ్, వినోద్, మహిపాల్, భూంరాజ్, క్రిష్ణ, యోగేష్, ప్రణయ్, ప్రణీత్, లింగన్న, భోజన్న, ప్రశాంత్, శ్రీకాంత్, బాబు, బేగరి సాయిలు, విజయ్, కిషోర్, రామక్రిష్ణ, నగేష్, సాయి శంకర్, సాయిబాబా ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడారు. వాట్సాప్ గ్రూప్‌లో ఏకమై.. యంచ గ్రామంతోపాటు సమీపంలోని అల్జాపూర్ యువకులు గ్రామ పంచాయతీ (జీపీ) పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసుకున్నారు. నది వంతెన దాటి బాసర ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం యంచ గ్రామ రైతులు వెళ్లి వస్తుంటారు. వంతెనపై ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం చేరవేస్తారు. దీంతో గ్రామంలో ఎవరు అందుబాటులో ఉన్నా వెంటనే వంతెన వద్దకు చేరుకుంటారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసేవారితో మాట్లాడి, మనసు మార్చి.. నవీపేట, బాసర పోలీసుల సహకారంతో వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.బలవన్మరణాలు వేదన కలిగిస్తున్నాయి పురాతన ఆలయాలతో పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న మా ఊరు తీరాన బలవన్మరణాలు వేదన కలిగిస్తున్నాయి. గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వంతెన మీద ఇనుప కంచెను, సీసీ కెమెరాలు, పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలి. నేను 50 మంది ప్రాణాలు కాపాడాను. – ప్రవీణ్, యంచ మాజీ సర్పంచ్ భర్త25 మంది ప్రాణాలు కాపాడానునాలుగేళ్లలో వంతెనపై నుంచి నదిలో దూకేందుకు వచి్చన 25 మందికి పైగా వ్యక్తులను అడ్డుకుని ప్రాణాలు రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాను. – మహిపాల్ యంచ గ్రామ యువకుడునిత్యం కనిపెడుతుంటానునిత్యం వంతెన మీదుగా బాసర ట్రిపుల్ ఐటీకి విధుల కోసం రాకపోకలు సాగించే సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను కనిపెడుతుంటాను. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలతో వంతెన పై నుంచి దూకేందుకు రాగా వారిని అడ్డుకుని తిరిగి పంపించాను. – ప్రణీత్, యంచ గ్రామం, బాసర ట్రిపుల్ ఐటీ ఉద్యోగినదిలో మునిగి పోతున్నవారిని బయటకు తెచ్చాం – సుమన్, శ్రీకాంత్, భోజన్న, సురేష్, లింగం యంచ గ్రామ మత్స్యకారులు -
దక్షిణ ‘రింగు’.. కేంద్రానిదా, రాష్ట్రానిదా?
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భాగం కూడా అధికారికంగా ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విజన్–2047 జాబితాలో అది కొనసాగుతోంది. సాధారణంగా ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఆ విభాగమే పర్యవేక్షిస్తుంది. వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండదు. అందుకే, దక్షిణ భాగానికి సంబంధించి ఢిల్లీ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్లలో ఒకదాన్ని ఎంపిక చేయగా, తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికీ, ఢిల్లీ సంస్థతో ఎన్హెచ్ఏఐ ఒప్పందం కొనసాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో కన్సల్టెన్సీతో అలైన్‌మెంట్‌ను రూపొందింపజేసి ఆమోదం కూడా తెలపడం చర్చనీయాంశంగా మారింది.కేంద్రమే కొనసాగించాలంటూ లేఖ ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.21 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనాలున్నాయి. ఉన్న నిధులల్లో సింహభాగం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకే కేటాయించాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో దక్షిణ రింగును సొంతంగా చేపట్టడం అసాధారణ విషయమే. అందుకే దక్షిణ రింగును కూడా కేంద్రమే కొనసాగించాలని లేఖ రాసింది. ఇదే సమయంలో ఎన్హెచ్ఏఐ అ«దీనంలోని ఆ ప్రాజెక్టుకు తాను సొంతంగా అలైన్మెంట్, డీపీఆర్ తయారీ చేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. దీంతో అసలు ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉందా, రాష్ట్రం పరిధిలో ఉందా అన్న సందిగ్ధత నెలకొంది. రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమేంటో మాకు తెలియదు: ఎన్హెచ్ఏఐ ‘దక్షిణ రింగుకు రాష్ట్ర ప్రభుత్వంఅలైన్మెంట్ చేసుకోవటం, డీపీఆర్ తయారు చేస్తుండటం ఎందుకో మాకు తెలియదు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా మాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందో మాకు తెలియదు’అని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. జాప్యం జరుగుతోందని మేం చేస్తున్నాం: రాష్ట్ర ప్రభుత్వ అదీనంలోని ఎన్‌హెచ్ ‘దక్షిణ రింగు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో భూముల ధరలు పెరిగి భూసేకరణ భారం పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను రూపొందించుకుంటోంది. డీపీఆర్ కూడా తయారు చేస్తోంది. ఇదంతా ఎన్హెచ్ఏఐ నిబంధనలననుసరించే జరుగుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి’అని రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టమని కోరే అవకాశం ఉత్తర–దక్షిణ రింగులను తనే చేపట్టేందుకు గతంలోనే కసరత్తు ప్రారంభించిన ఎన్హెచ్ఏఐ దాన్ని కొనసాగిస్తోంది. అయితే, ప్రాధాన్యతాక్రమంలో ఉత్తర రింగుకు ముందు ఓకే చెప్పింది. ట్రాఫిక్ రద్దీ దక్షిణ రింగుపై అంతగా ఉండదని భావిస్తూ దాన్ని తదుపరి చేపట్టేందుకు తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది. అప్పట్లో ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్తో విభేదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, తాను కోరుకుంటున్నట్టు ఫ్యూచర్ సిటీకి అనుసంధానమయ్యేలా కొత్త అలైన్‌మెంట్‌ను తానే రూపొందించి, దాని ప్రకారం రోడ్డును నిర్మించాలని కేంద్రాన్ని కోరబోతున్నట్టు తెలిసింది. దీనికి కేంద్రం ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగంతోపాటే దక్షిణ భాగ నిర్మాణం కూడా చేపట్టండి. ఈ ప్రాజెక్టులో జాప్యం లేకుండా చూడండి – ఇది గతేడాది చివరలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి చేసిన విన్నపం. ఢిల్లీలో కేంద్రమంత్రిని స్వయంగా కలిసి ఓ లేఖ కూడా రాశారు. రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగానికి ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ రూపొందించిన 208 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌కు వారం రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు దాని డీపీఆర్ తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడీ రెండు విరుద్ధ అంశాలు ఇటు ఎన్హెచ్ఏఐ, అటు రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ యంత్రాంగంలో అయోమయానికి కారణమవుతోంది. -
పైసా ఆదాయం పెరగలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఖజానాకు అంతగా కలిసిరావడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో నెలలో కూడా ఆదాయ పరిస్థితిలో మార్పు రాలేదు. రాష్ట్ర సొంత పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులు, అప్పులు, పన్నేతర ఆదాయాలు.. అన్నీ కలిపి ఏప్రిల్ నెల తరహాలోనే మే నెలలోనూ రూ.16 వేల కోట్లు మాత్రమే సమకూరాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం మే–2025 నాటికి రాష్ట్ర రాబడులు, వ్యయాలపై ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏప్రిల్ నెలలో మొత్తం రూ.16,473.99 కోట్లు ఖజానాకు సమకూరగా, మే నెలలో రూ.16,349.46 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి రెండు నెలల్లో రాబడులు రూ. 32,823.45 కోట్లు కాగా, వ్యయం 31,740.08 కోట్లుగా నమోదైంది. అయితే, ఇందులో అప్పులే రూ.10 వేల కోట్ల వరకు ఉండగా, గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాకపోవడం వల్ల కూడా ఖజానా కళ తప్పిందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. పన్నేతర ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల వాటాలో కూడా పెద్దగా మార్పు లేకపోవడంతో వరుసగా రెండో నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, రాబడులకు మధ్య వ్యత్యాసం రూ.9 వేల కోట్లు కొనసాగుతుండడం గమనార్హం. -
జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి : ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ఇంటర్న్‌షి ప్ చేస్తున్న వైద్య విద్యార్థులతోపాటు పీజీ వైద్యవిద్య అభ్యసిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్న్‌షి ప్ విద్యార్థులతోపాటు పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్‌ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో 90ను విడుదల చేసూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్వర్వులిచ్చారు. మరోవైపు పెంచిన స్టైపెండ్స్‌ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైపెండ్స్ చెల్లించేందుకు అవసరమైన బీఆర్వోను (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) అధికారులు విడుదల చేశారు. పెండింగ్ స్టైపెండ్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పెరగనున్న స్టైపెండ్ ప్రస్తుతం హౌస్‌సర్జన్ (మెడికల్, డెంటల్)కు ప్రతినెలా రూ.25,906 స్టైపెండ్ ఉండగా, ఇక నుంచి ప్రతినెలా రూ.29,792 అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.64,767 ఉండగా, ఇప్పటి నుంచి రూ. 74,482 స్టైపెండ్ ఆయా మెడికోలకు అందనున్నది. పీజీ డిప్లమో విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032 స్టైపెండ్ రానున్నది. సెకండ్ ఇయర్లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ. 70,757 చొప్పున స్టైపెండ్ రానున్నది. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు రూ.లక్ష పైనే.. మరోవైపు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.92575 ఉండగా, అది రూ. 1,06,461కి పెరిగింది. సెకండ్ ఇయర్లో రూ. 97,204 ఉండగా, ఇక నుంచి రూ.1,11,785 అందనుంది. థర్డ్ ఇయర్లో రూ.1,01,829 ఉండగా, ఇక నుంచి రూ, 1,17,103కి చేరనున్నది. ఎండీఎస్ ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ. 67,032 ఇవ్వనున్నారు.సెకండ్ ఇయర్లో రూ. 61,528 ఉండగా, ఇక నుంచి రూ, 70,757, థర్డ్ ఇయర్లో రూ.64,767 ఉండగా, ఇక నుంచి రూ.74,482కి పెరగనున్నది. సీనియర్ రెసిడెంట్స్‌కు రూ.92,575 ఇక నుంచి రూ.1,06,461 చేరనున్నది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని విద్యార్థులు తమకు కనీస స్టైపెండ్ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జూడాలతో చర్చలు సఫలంజూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సంగారెడ్డిలోని తన నివాసానికి జూడాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించారు. జూడాల డిమాండ్లను దశల వారీగా నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేయడంతో వారు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జూడాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, జూడాల రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్, డాక్టర్లు కీర్తన ,గిరిప్రసాద్, సందీప్, అవినాశ్ పాల్గొన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. -
పదోన్నతుల్లో పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధమైంది. పదవీ విరమణ పొందిన, మరణించిన వారి వల్ల ఏర్పడిన ఖాళీలన్నీ భర్తీ కానున్నాయి. పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గత వారం ప్రభుత్వానికి పంపింది. రెండు, మూడురోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) నుంచి గెజిటెడ్ హెచ్ఎం (జీహెచ్ఎం)లుగా పదోన్నతులు పొందుతున్న వాళ్ళు దాదాపు 700 మంది వరకూ ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) స్థాయి నుంచి ఎస్‌ఏగా పదోన్నతి పొందుతున్న వాళ్ళు 1,500 వరకూ ఉంటారు. హైదరా బాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 750 వరకూ జీహెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతుందా? అనే సందేహాలు విద్యాశాఖను వెంటాడుతున్నాయి. జీహెచ్‌ఎంల నుంచి అభ్యంతరాలు ముందుగా బదిలీలు చేపట్టకుండా, పదోన్నతులు కల్పించనుండటంపై జీహెచ్ఎంలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియపై న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత 2023లో ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో 994 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్ పదోన్నతి కావడంతో వీరంతా సొంత జిల్లాల నుంచి రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అన్ని ప్రాంతాల వాళ్ళూ 100 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తోంది. కాగా జీహెచ్ఎం బదిలీ కోరుకోవాలంటే పనిచేస్తున్న స్కూల్లో కనీసం రెండేళ్ళ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. గరిష్టంగా 5 ఏళ్ళు నిండితే ప్రభుత్వమే బదిలీ చేయడానికి హక్కు ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పదోన్నతుల ద్వారా 2023లో దూర ప్రాంతాలకు వెళ్ళిన టీచర్లకు ఇంకా రెండు నెలలు పూర్తయితేనే బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత వస్తుంది. ఈ నేపథ్యంలోనే పదోన్నతులపై జీహెచ్ఎంలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకెళ్ళే యోచనలో హెచ్ఎంలు ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని జీహెచ్ఎంలు అంటున్నారు. ఇప్పుడు తమకు బదిలీ అవకాశం ఇవ్వకపోతే కొత్తగా పదోన్నతులు పొందేవారు జీహెచ్ఎం పోస్టుల్లో భర్తీ అవుతారని, అప్పుడు తాము సొంత జిల్లాలకు రాకుండా దూర ప్రాంతాల్లోనే రిటైర్ అవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. 2023లో ప్రమోషన్లు ఇచ్చేనాటికే 90 శాతం హెచ్ఎంలు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారని, వయోభారంతో ఉన్న వాళ్ళు దూర ప్రాంతాల్లో ఎలా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, కుటుంబాలు సొంత జిల్లాల్లో ఉండగా, తాము పనిచేసే ప్రాంతాల్లో ఒంటరిగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటుందని భావించామని, కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో కోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తున్నారు. ముందుగా బదిలీలు చేపట్టాలి ముందుగా బదిలీలు చేపట్టాలి. ఆ తర్వాతే పదోన్నతులు ఇవ్వాలి. 2023లో దూర ప్రాంతాలకు వెళ్ళిన హెచ్ఎంలకు బదిలీల్లో అవకాశం కల్పించాలి. కనీస అర్హత వయసును ఏడాదికి తగ్గించాలి. ఇంకో రెండు నెలల్లో వీరి బదిలీకి అర్హత వస్తుందని తెలిసీ, ఎస్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం అన్యాయం. దీనివల్ల అనేక మంది హెచ్ఎంలకు ఇబ్బంది కలుగుతుంది. – ఆర్.రాజగంగారెడ్డి (తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు) ప్రమోషన్ల హక్కును అడ్డుకోవద్దు గెజిటెడ్ ఉపాధ్యాయుల డిమాండ్ ఆమోదయోగ్యమే. దూర ప్రాంతాల హెచ్ఎంలు సొంత జిల్లాలకు రావాలనుకోవడమనేది వారికున్న ఒక హక్కుగానే చూడాలి. కానీ కొత్తవారికి ప్రయోషన్లు కూడా వారి హక్కు అని మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా బదిలీలు చేపట్టాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కానీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉపాధ్యాయ సంఘాల భిన్న వాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. – డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ (పాఠశాల విద్య డైరెక్టర్) -
కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్‌షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్‌కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్‌బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్‌షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్‌షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘నేను కూడా అధ్యక్ష పదవి అడగాలనుకుంటున్నా’
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు(సోమవారం, జూన్ 30వ తేదీ) నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఎవరికి వారే తానే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. తనకు అనేక మంది కార్యకర్తలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారన్నారు. మనం ఎందుకు ప్రెసిడెంట్‌గా పోటీ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారన్నారు. అందుకే తాను కూడా అధ్యక్ష పదవి అడగాలని అనుకుంటున్నానని తెలిపారు. చాలా మంది కార్యకర్తల మనస్సులో ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలో అనుకునే విషయాన్ని రాజాసింగ్ పేర్కొన్నారు‘బీజేపీకి వీఐపీ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఉండకూడదు. కార్యకర్తలు అన్న అని పిలిచే ప్రజల మనిషి అయిన వారు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ప్రెసిడెంట్ అయితే గోరక్ష కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేస్తా. బీజేపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తా.. నేరుగా కలిసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్టైల్ లో ముందకు వెళ్తాం. యోగి పేరు వింటే దొంగలు, గూండాలు, రౌడీలు యూపీ వదలి వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఆ సిస్టమ్ ను తెలంగాణలో అమలు చేస్తాం. రాజాసింగ్ ప్రెసిడెంట్ కావాలి అనుకునే వాళ్లు నా పేరును కేంద్ర నాయకులకు చెప్పండి’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. -
రామగుండం నుంచి ప్రపంచ వేదికకు..
హైదరాబాద్: టెక్ విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్, ఎన్ఐఏటి సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరికి అరుదైన గౌరవం లభించింది. చైనా లోని టియాన్జిన్లో జరిగిన 'ఆన్యువల్ మీటింగ్ ఆఫ్ ది న్యూ చాంపియన్స్'కి రాహుల్ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానించింది. ఈ మీటింగ్‌ని సమ్మర్ దావోస్ అని కూడా అంటారు. అధునాతన టెక్నాలిజీలతో వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్లో, ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై పడుతున్న ప్రభావం గురించి, యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై ఆయన ప్రసంగించారు.తెలంగాణలోని రామగుండానికి చెందిన రాహుల్ అత్తులూరి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదివారు. ఇప్పుడు దేశ విద్యా రంగాన్ని టెక్నాలజీతో మెరుగుపరుస్తున్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల యువతకు ప్రేరణగా నిలిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) అనే సంస్థ స్విట్జర్లాండ్‌లోని కోలోగ్నీ వేదికగా ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తుంది. ఈ వేదికలో జరిగే వార్షిక సమావేశానికి ప్రపంచ నేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, పాలసీ రూపకర్తలు, పరిశోధకులు హాజరవుతారు. ప్రపంచ ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలపై చర్చలు జరుగుతాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, డోనాల్డ్ ట్రంప్, సత్య నాదెళ్ల, సుందర్ పిచై, ఎలాన్ మస్క్ లాంటి అగ్ర నాయకులు గతంలో ఈ వేదికపై ప్రసంగించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమాలలో ప్రభుత్వాల మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల CXO లు కూడా పాల్గొంటుంటారు."కెరీర్ పాత్‌వేస్ రీవైర్డ్" సెషన్లో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, "భారతదేశ జనాభాలో 60 శాతం మంది యువతే. ఇది రెండు వైపులా పదును ఉన్న ఖడ్గం లాంటిది. వీరి ప్రతిభను చక్కటి మార్గంలో మలిచితే, ఇది ఒక పెద్ద వరం. లేదా అవకాశాన్ని వదిలేసినట్లైతే ఒక పెద్ద భారంగా మారుతుంది." అని రాహుల్ పేర్కొన్నారు. "టెక్నాలజీ మార్పుల ప్రభావం ఎప్పుడూ జే అక్షర రూపంలో ఉండే కర్వ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న దశలో ఉన్నాం. చాలా కంపెనీలు హైరింగ్‌ను ఆపేసాయి. కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఏఐతో పనులు వేగంగా చేసుకుంటున్నాయి," అని రాహుల్ అన్నారు.అయితే ఇవన్నీ తాత్కాలికంగా జరిగే మార్పులేనని రాహుల్ స్పష్టం చేస్తూ, "మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఏఐ స్కిల్స్ ఉన్న వారి కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. జనరేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయి. దానికి భారత్ సిద్ధంగా ఉండాలి. ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ పనులు వేగంగా ఆటోమేట్ అవుతున్నాయి. దీని ఫలితంగా, సంప్రదాయ ఉద్యోగ మార్గాలు మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలసి పని చేయడం చాలా కీలకం.డిగ్రీలతో పాటు స్కిల్స్‌కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. స్కిల్ క్రెడెన్షియల్స్పై మరింత దృష్టి పెట్టాలి' అని అన్నారు. అలాగే, విద్యలో ఏఐ పాత్ర గురించి మాట్లాడుతూ, "విద్యార్థులు ఏఐని ఏఐ సహాయంతోనే నేర్చుకోవాలి. కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలను స్పష్టంగా వెల్లడించాలి. ఇలా చెయ్యడంతో, విద్యార్థులు రాబోయే ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తయారవుతారు" అని అన్నారు భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి.. యువతకు ఏఐ యుగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు విస్తృతమైన చర్యలు చేపడుతున్నట్లు రాహుల్ అత్తులూరి వివరించారు. అలానే యువత కేవలం ఏఐ స్కిల్స్ మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అవసరం అన్నారు. అలాగే, ఏఐలో ప్రావీణ్యం సాధించి పరిశ్రమలో విలువైన వ్యక్తులుగా ఎదగాలి అని వివరించారు. "ప్రస్తుతం ఉన్న డిజిటల్ డివైడ్‌ను నివారించాలంటే, విద్యలో ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు ఏఐ టూల్స్ అందుబాటులో ఉండాలి.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ చేరువలో ఉండాలి. ప్రత్యేకంగా, నో-కోడ్ లేదా లో-కోడ్ టూల్స్‌తో విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు బిల్డ్ చెయ్యాలి, ఏఐ ఏజెంట్లను ఉపయోగించాలి. ఇలా నేర్చుకోవడం వల్ల ఇండస్ట్రీలోకి ప్రవేశించే సమయానికి చక్కటి స్కిల్స్ తో సిద్ధంగా ఉంటారు." అని రాహుల్ అత్తులూరి అన్నారు. 2024లో నెక్స్ట్ వేవ్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) టెక్నాలజీ పయనీర్‌గా గుర్తించింది. ఈ గౌరవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవలం 100 సంస్థలకు మాత్రమే దక్కుతుంది. గతంలో గూగుల్, స్పోటిఫై, ఎయిర్ బీఎన్బీ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లాంటి సంస్థలు. ఇదే గుర్తింపు పొందాయి. తర్వాత అవన్నీ ప్రపంచాన్ని మార్చిన టెక్ కంపెనీలుగా నిలిచాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మర్ దావోస్‌లో రాహుల్ అత్తులూరి పాల్గొనడం నెక్స్ట్ వేవ్‌కి కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. ఏఐ ఆధారితంగా, స్థానిక భాషల్లో నేర్చుకునేలా రూపొందించిన నెక్స్ట్ వేస్ లెర్నింగ్ ప్లాట్ఫారం వినూత్న విధానం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. -
తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెరిగింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని సైతం ప్రభుత్వం పెంచింది.ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది.సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. -
పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్‌లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్‌లో నానక్‌రాంగూడ ప్రధాన హాట్‌స్పాట్‌గా నిలిచింది. లాంచింగ్స్‌లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్‌స్పాట్‌గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్‌లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్‌లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్‌లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్‌రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్‌లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్‌లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్‌కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్‌ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్‌లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. -
నిర్మాణం.. మరింత భారం
సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి.2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్‌లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలి. హైదరాబాద్‌లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది. ‘పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మీడియాతో పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్మరోవైపు పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్‌ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు. -
రియల్‌ఎస్టేట్‌లోకి ‘కొత్త’ కస్టమర్లు..
హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ కస్టమర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్తతరం కస్టమర్లకు విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లను కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగినట్టుగానే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రధాన నగరంలో కష్టమే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్‌లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్య, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లలు సంపాదన కూడా తోడైంది. 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని, దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
నేటి నుంచి ఉజ్జయినీ మహంకాళి ఘటోత్సవాలు
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బోనాల జాతరకు 15 రోజుల ముందు (ఘటోత్సవం) ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకువస్తారు. వీధి వీధికి అమ్మవారి దర్శనం ముస్తాబైన ఘటాన్ని సోమవారం నుంచి వివిధ ప్రాంతాల్లోని భక్తులకు దర్శనం గావిస్తారు. జూలై 11 వరకు ఆయా ప్రాంతాల్లో దర్శనం ఇచ్చి 12న దేవాలయానికి తీసుకువస్తారు. 13న బోనం, 14న రంగం, భవిష్యవాణి అనంతరం అంబారీ ఊరేగింపుతో అమ్మవారి ఘటాన్ని మెట్టుగూడలోని అమ్మవారి ఆలయానికి సాగనంపుతారు. బోనాలకు అంతా సిద్ధం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని ఆలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. దేవాలయానికి 80 శాతం రంగుల పనులు పూర్తయ్యాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఘటోత్సవానికి హాజరవుతారని చెప్పారు. అనువంశిక ధర్మకర్తలు సురిటి రామేశ్వర్, కామేశ్వర్ పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. కాల పరిమితి విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ చేపట్టనున్న పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లోయర్ మానేరు రిజర్వాయర్‌పై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, మల్లన్నసాగర్‌పై నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లకు ఇరిగేషన్ శాఖ అనుమతుల కోసం లేఖలు రాయాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఐదు జిల్లాలలో ఏర్పాటు చేయనున్న 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించిన డీపీఆర్‌లను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. రామగుండం–1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని నీటిసంపు ఆధారంగా నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1,500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆ రాష్ట్రంలోని సోలార్ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటుచేసే 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుపైనా కూలంకశంగా చర్చించారు. వీటితోపాటు సింగరేణి ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టం వంటి ఇతర పనులపైనా భట్టి సమీక్షించారు. ఇంధన శాఖలోని అన్ని విభాగాల పనితీరును, చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్, తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్ అనీలా, సింగరేణి ఉన్నతాధికారులు ఎస్.డి.ఎం సుభానీ, చిరంజీవులు, జానకిరామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ఉద్యోగి కుటుంబానికి రూ.1.2 కోట్ల ప్రమాద బీమా చెక్కు అందజేత సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఓ కారి్మకుడి కుటుంబానికి రూ.1.2 కోట్ల బీమా సొమ్ము చెక్కును శనివారం మహాత్మా జ్యోతిబాఫపూలే ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో రామగుండం–1 ఏరియాకు చెందిన సపోర్టు మెన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య లతకు అందజేశారు. సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్‌కు ఎస్బీఐలో వేతన ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా కింద అందించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ అనీలా, ఎస్బీఐ డీజీఎం నీలాక్షి సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ బోర్డు కార్యదర్శి గోపాకాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 17. వైద్య విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మెడికల్ కాలేజీల్లో మరో 714 అసెస్టింట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయడం ద్వారా ఇప్పటికే విధుల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. 2,258 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి క్యాడర్ స్ట్రెంత్‌ను 3,696గా లెక్క తేల్చారు. ప్రస్తుతం 1,390 మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా రెగ్యులర్ బేసిస్‌లో పనిచేస్తున్నారు. మరో 985 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో ఉన్నారు. కాగా 34 వైద్య కళాశాలలకు 2,288 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. దీంతో మొదటగా 607 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మరో 714 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1,321 మంది కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధుల్లో చేరుతారు. ఆ వెంటనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలో అర్హులైన 231 మందిని అసోసియేట్ ప్రొపెసర్లుగా నియమిస్తారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉన్నవారిలో 308 మందిని ప్రొఫెసర్లుగా నియమించనున్నారు. డీపీసీ ప్యానల్ 349 మందిని పదోన్నతులకు అర్హులుగా గుర్తించినప్పటికీ, తొలుత 308 మందికి మాత్రమే పదోన్నతులు కల్పించనున్నారు. కాగా, ఇప్పుడున్న ప్రొఫెసర్లలో 44 మందిని అదనపు డీఎంఈలుగా పదోన్నతి కల్పించి, బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లుగా, ప్రిన్సిపాళ్లుగా నియమిస్తారు. రెండు రోజుల క్రితమే 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 2 స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, గడిచిన 17 నెలల్లో ఆరోగ్య శాఖలో 8 వేలకు పైగా వివిధ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవి కాకుండా మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1,931 మల్టీ పర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. -
ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే వినూత్న కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో జిల్లా అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాలతో ఇళ్ల నిర్మాణాలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. జిల్లాలో మొత్తం 405 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్ప టి వరకు 281 మందికి అందించారు. శరవేగంగా ఎంపికలు.. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా తొలుత 860 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అర్హతల మేరకు ఎంపికలు జరిగాయి. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుండగా.. అన్ని అర్హతలున్న వారికి మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. అయితే, ఇల్లు మంజూరైనా కొందరి వద్ద డబ్బు లేకపోవటంతో నిర్మాణం మొదలు పెట్టలేదు. ఇటీవల అధికారులు ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు వెళ్లగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలు తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన జిల్లా అధికారులతో చర్చించి స్వయం సహాయక సంఘాలను ఇందులో భాగస్వాములను చేశారు. ఇళ్ల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘంలో సభ్యులైతే వారికి రుణం అందించేలా ఆయా సంఘాలను ఒప్పించారు. 860 మందిలో 405 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 281 మందికి రుణ సౌకర్యం కల్పించారు. మరో 124 మందికి రుణాలు అందించాల్సి ఉంది. రూ.లక్షన్నర రుణం తీసుకొని.. తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామానికి చెందిన రేఖ విజయకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే, డబ్బు లేక ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఐకేపీ సాయంతో రూ.50 వేలు ముద్ర లోన్ తీసుకున్నారు. అలాగే ఆమె అత్త డ్వాక్రా సభ్యురాలు కావడంతో రూ.లక్ష రుణం తీసుకున్నారు. ఈ సొమ్ముతో నిర్మాణం ప్రారంభించడంతో పునాదుల తర్వాత ప్రభుత్వం తొలి విడత బిల్లు చెల్లించింది. ఆ తర్వాత రూఫ్ లెవెల్ వరకు పూర్తి కావడంతో ఇప్పటివరకు రూ.2 లక్షల బిల్లు వచి్చనట్లు విజయ తెలిపింది. -
కొండా లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా.. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు. అయినా ప్రకాశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్‌ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు. మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదుతాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్‌లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
భారత్‌కే ఫ్యూచర్: సీఎం రేవంత్
చందానగర్: హైదరాబాద్‌ను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని.. ప్రపంచమంతా మెచ్చేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా.. మూడు ప్రాంతాలుగా విభజించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్ర సమ్మిళిత, సమగ్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9లోగా విడుదల చేస్తామని వెల్లడించారు. గచ్చిబౌలిలో కొండాపూర్ నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు రూ. 182.72 కోట్ల వ్యయంతో, ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్దన్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు సెమీ–అర్బన్‌గా, రీజనల్ రింగ్‌రోడ్డు అవతలి భాగాన్ని గ్రామీణ ప్రాంతంగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ ఆవలి వైపున 30 వేల ఎకరాల్లో ప్రపంచశ్రేణి భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించామని.. అందులో క్రీడలు, ఏఐ, ఐటీ, కాలుష్యరహిత ఫార్మా రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. వచ్చే వందేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దేలా.. ‘వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో బెంగళూరు, వరదలతో చెన్నై నగరాలు అతలాకుతలమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో కాలుష్యాన్ని నివారించాలన్న లక్ష్యంతోనే విద్యుత్ వాహనాలపై రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరుగుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో వచ్చే ఏడాదిలోగా 3 వేల విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మోదీ, కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం ఇచ్చారు, తెచ్చారు? రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చింది, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెచ్చింది ఏముందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి యుమునా ఫ్రంట్, గుజరాత్‌కు నర్మదా రివర్ ఫ్రంట్ ఇచ్చారని.. తెలంగాణకు మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం ఎందుకివ్వరని నిలదీశారు. చెన్నై, బెంగళూరు, ఏపీకి మెట్రో ఇచ్చారని.. కానీ హైదరాబాద్ మెట్రో రెండో దశకు మాత్రం మొండిచేయి చూపారని మండిపడ్డారు. తెలంగాణపై ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపడితే దీన్ని కొందరు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. 2028 వరకు రాజకీయాలు వద్దని.. వచ్చే మూడేళ్లపాటు రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత అనంతరం సినీనటుడు నాగార్జున అభివృద్ధిలో భాగస్వామినవుతానని ముందుకొచ్చారని సీఎం గుర్తుచేశారు. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి చెరువును అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పారన్నారు. 1992లోనే ఐటీ రంగానికి పునాది హైదరాబాద్‌లో 1992లోనే హైటెక్ సిటీకి రాజీవ్‌గాంధీ టెక్నాలజీ పేరిట పునాది పడిందని.. అందుకోసం దివంగత పీజేఆర్ నాయకత్వంలో అప్పటి సీఎం నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆ తర్వాత కాలంలో హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ అభివృద్ధి చెందాయన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే కారణమన్నారు. పేదల సమస్యలు తీరుస్తూ జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. పీజేఆర్ పేరును ఫ్లైఓవర్‌కు పెట్టుకోవడం సముచితమన్నారు. తగిన స్థలం గుర్తిస్తే పీజేఆర్ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాడు భయం.. నేడు కళకళ గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతంలో ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే జనసంచారం లేక అక్కడ నివసించే వారు భయపడే పరిస్థితి ఉండేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ఫార్చూన్ 500 కంపెనీలతో కళళలాడుతోందని చెప్పారు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అక్కడి భూముల అభివృద్ధికి ఏర్పడిన ఆటంకాలు తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. కొత్త కంపెనీల ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మరింత మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే రూ. 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తమ ప్రభుత్వం సాధించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, మేయర్ విజయలక్షి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు, పీజేఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
డీపీఆర్‌లో స్పష్టత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి.ముఖ్యంగా ఎల్ అండ్ టీ సంస్థ నెట్‌వర్క్‌పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవై) ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఎల్ అండ్ టీ నెట్‌వర్క్‌పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతు న్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే మెట్రో ఫేజ్–2 డీపీఆర్‌ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) కేంద్రానికి సమర్పించింది. అయితే, పుణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డీపీఆర్‌లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేంద్రం లేవదీసిన కొన్ని ప్రశ్నలు..» మొత్తం 76.4 కి.మీ. నిడివితో 5 కారిడార్లతో రూ.2,269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డీపీఆర్‌లో ప్రస్తావించారు. అయితే, ఎల్ అండ్ టీ నెట్‌వర్క్‌పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదు. » 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్అండ్టీ నెట్ వర్క్‌పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలి. ఇలాంటి సేవల వల్ల ఎల్ అండ్ టీకి పరోక్షంగా లాభం కలుగుతోంది. కానీ, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. » ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై మూడు కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ, డీపీఆర్‌లో దీనిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ అండ్ టీతో చర్చించిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.» జూన్ 3వ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ పాల్గొన్నారు. ఖర్చు పంచుకోవడం, ఆపరేషనల్ అంశాలపై ఇంకా అంగీకారం లేదు. ఫేజ్–2 అమలయ్యాక ప్రభుత్వ సంస్థతో లాభాలు పంచుకోలేం అని ఆయన స్పష్టంగా తెలిపారు అని కేంద్రం పేర్కొంది. -
రాష్ట్ర ఈవీ రంగానికి ఆర్ఈఈల కొరత
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలకమైన అరుదైన భూగర్భ ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఆర్ఈఈ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణలో సంబంధిత రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఆందోళన నెలకొంది. ఎలక్ట్రానిక్స్, ఈవీల ఉత్పత్తికి అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, ముడిపదార్థాలు, రసాయనాలను ఎక్కువగా చైనా నుంచే తెలంగాణ దిగుమతి చేసుకుంటోంది. అయితే అమెరికాతో ట్రేడ్ వార్‌లో భాగంగా ఆర్ఈఈల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 4న మొదలైన నిషేధం మరింతకాలంపాటు కొనసాగితే తెంలగాణలో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ఈఈలు లభ్యమయ్యే ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రణాళికలు, వ్యూహాలు లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యే సూచన కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఈఈల ఉత్పత్తి పెంచేందుకు రూ. 5 వేల కోట్లతో కేంద్రం ప్రకటించిన దీర్ఘకాలిక పథకంతో తక్షణ ఉపశమనం లభించే అవకాశం కనిపించకపోవడంతో ఈవీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ఎలక్ట్రానిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లతోపాటు విండ్ టర్బైన్లకు అవసరమయ్యే శాశ్వత మ్యాగ్నెట్ల తయారీలో నియోడిమియం, డిస్ప్సోసియం, టెర్బియం వంటి అరుదుగా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యంత కీలకం. ప్రపంచంలోకెల్లా ఈ ఆర్ఈఈల వెలికితీత, శుద్ధి, ఎగుమతుల్లో 80 శాతం మార్కెట్‌ను చైనా నియంత్రిస్తోంది. గతేడాది చైనా నుంచి భారత్ 2,270 టన్నుల ఆర్ఈఈలను దిగుమతి చేసుకుంది. చైనా విధించిన ఆంక్షల మూలంగా ఆర్ఈఈల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలను తెలంగాణ పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతను ఇస్తుండగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అవసరాల మేరకు దిగుమతులు లేకపోవడంతోపాటు ఉత్పాదనలో ఆలస్యం వల్ల నష్టాలు పెరిగి ఉద్యోగ కల్పనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అంటున్నాయి. దీర్ఘకాలంపాటు ఇదే పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడలేమనే భయం పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఫలితమిచ్చేనా? ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను 3 బిలియన్ డాలర్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు 2030 నాటికి ప్రజారవాణా రంగంలో వంద శాతం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగం ద్వారా 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల నుంచి ఆర్ఈఈల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల వినతిపత్రం ఇచ్చారు. -
విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. కాల పరిమితి విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ చేపట్టనున్న పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లోయర్ మానేరు రిజర్వాయర్‌పై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, మల్లన్నసాగర్‌పై నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లకు ఇరిగేషన్ శాఖ అనుమతుల కోసం లేఖలు రాయాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఐదు జిల్లాలలో ఏర్పాటు చేయనున్న 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించిన డీపీఆర్‌లను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. రామగుండం–1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని నీటిసంపు ఆధారంగా నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1,500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆ రాష్ట్రంలోని సోలార్ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటుచేసే 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుపైనా కూలంకశంగా చర్చించారు. వీటితోపాటు సింగరేణి ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టం వంటి ఇతర పనులపైనా భట్టి సమీక్షించారు. ఇంధన శాఖలోని అన్ని విభాగాల పనితీరును, చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్, తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్ అనీలా, సింగరేణి ఉన్నతాధికారులు ఎస్.డి.ఎం సుభానీ, చిరంజీవులు, జానకిరామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ఉద్యోగి కుటుంబానికి రూ.1.2 కోట్ల ప్రమాద బీమా చెక్కు అందజేత సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఓ కారి్మకుడి కుటుంబానికి రూ.1.2 కోట్ల బీమా సొమ్ము చెక్కును శనివారం మహాత్మా జ్యోతిబాఫపూలే ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో రామగుండం–1 ఏరియాకు చెందిన సపోర్టు మెన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య లతకు అందజేశారు. సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్‌కు ఎస్బీఐలో వేతన ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా కింద అందించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ అనీలా, ఎస్బీఐ డీజీఎం నీలాక్షి సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’ పుస్తకాల దందా!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావటంతో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. ప్రభుత్వ అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్షీట్ల పేరుతో లెక్కాపత్రం లేకుండా తామిచ్చే పుస్తకాలే కొనాలని స్కూళ్ల యాజమాన్యాలు హుకుం జారీచేస్తుండటంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్ పుస్తకాల కొనుగోలు విషయం తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1,000 లోపు ఖర్చుతో పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాదిపాటు చెల్లించే ట్యూషన్ ఫీజులో కనీసం మూడో వంతు భరించాల్సిన పరిస్థితి వస్తోంది. దండుకోవడమే లక్ష్యం.. రాష్ట్రంలో 41,628 పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,454. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 34,92,886 మంది ఉంటే.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు 3,55,254 మంది ఉన్నారు. నర్సరీ నుంచి పదోతరగతి వరకు 38,48,140 మంది ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు విక్రయిస్తున్నాయి. వీటిని పుస్తకాల పబ్లిషర్లతో కలిసి రూపొందిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి.. ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర)పైఒక్క పైసా తగ్గించకుండా బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. సగటున ఒక్కో తరగతికి రూ.6,370 చొప్పున పాఠ్యపుస్తకాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల విక్రయాలను లెక్కిస్తే ఏటా దాదాపు రూ.2 వేలకోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు స్పష్టమవుతోంది. బిల్లుకు చెల్లు.. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే 85 శాతం విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే, ఈ ‘ప్రైవేటు’పుస్తకాల విక్రయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఎక్కడా లెక్కా పత్రం కనిపించకుండా జాగ్రత్తపడుతున్నాయి. చాలా స్కూళ్లలో పుస్తకాలకు నగదు మాత్రమే స్వీకనిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఇవ్వటంలేదు. పుస్తకాలు కొనుగోలుకు సంబంధించిన బిల్లులు (రసీదు) కూడా ఇవ్వటం లేదు. దీంతో ఈ వ్యాపారం గుట్టుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పుస్తకాల విక్రయంపై ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించటంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పుస్తకాల వ్యాపారంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాదాపు రూ.457 కోట్లు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ఖాతాలోకే చేరుతున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో తరగతులవారీగా విద్యార్థుల సంఖ్య ఇలా... తరగతి విద్యార్థుల సంఖ్య 1 4,40,556 2 3,91,179 3 3,70,029 4 3,81,757 5 3,52,503 6 3,37,579 7 3,26,280 8 3,26,280 9 2,83,494 10 2,83,229 పుస్తకాల ధరలు రెట్టింపు చేశారు... నాకు ఇద్దరు పిల్లలు. 4, 5వ తరగతి చదువుతున్నారు. వీరికి గతేడాది పుస్తకాల కోసం రూ.8 వేలు ఖర్చు చేస్తే... ఈసారి ఏకంగా 15 వేలు చెల్లించాల్సి వచ్చింది. గతేడాది 4వ తరగతి విద్యార్థికి రూ.4 వేలు పుస్తకాలకు చెల్లిస్తే... ఈ ఏడాది రూ.8 వేలు అయ్యింది. అనవసరమైన పుస్తకాలు కట్టబెడుతున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి బోధన, అభ్యసన మాత్రం పట్టించుకోరు. చివరకు పాతసామాను వాడికి అమ్ముకోవాల్సిందే. – అఖిల, విద్యార్థి తల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న పుస్తకాల బ్యాగులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఆ పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేసినవారికి ఈ బ్యాగులో పెట్టి ఇస్తున్నారు. పుస్తకాల కోసమే స్కూలు యాజమాన్యం ఈ బ్యాగులు ప్రింట్ చేయించింది. అయితే, పుస్తకాలు కొనుగోలుకు సంబంధించి బిల్లు(రసీదు) మాత్రం ఇవ్వడం లేదు. రసీదు ఇవ్వాలని విద్యార్థుల తల్లదండ్రులు అడిగితే... రసీదు పుస్తకాలు లేవంటూ తెల్లకాగితంపై చీటీ రాసి చేతులు దులుపుకుంటున్నారు. తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాలు విక్రయించటం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ లేదా దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. – రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి, వికారాబాద్ జిల్లా ప్రభుత్వంలో 3.. ప్రైవేటులో 6..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు 3 పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ మాత్రమే ఉంటాయి. 3, 4,5వ తరగతుల విద్యార్థులకు నాలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ ,ఈవీఎస్ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) పుస్తకాలు ఇస్తారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ఆరు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో మూడు లాంగ్వేజెస్, మూడు ఆప్షనల్స్ ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పుస్తకాలకు బదులు ప్రైవేట్ పాఠశాలలు సబ్జెక్టువారీ పుస్తకాలను ఎంపిక చేసుకొని అమలు చేస్తున్నారు. దీంతో ఒకటో తరగతి నుంచే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్. సైన్స్, సోషల్ పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పుస్తకాలను అనుసరిస్తూ వాటికి వర్క్ బుక్‌లను కూడా అదనంగా జోడిస్తున్నారు. -
‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’
హైదరాబాద్: చక్కటి సందేశాన్నిచ్చే జ్యోతిరావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈరోజు(శనివారం, జూన్ 28) పంజాగుట్ట పీవీఆర్ సినిమాస్‌లో జ్యోతిరావు ఫూలేచిత్రాన్ని చూసిన మహేష్ కుమార్ గౌడ్.. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లుగా పూలే చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే జ్యోతి రావు పూలే తన భార్యను చదివించాడు. మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి నూతన ఒరవడి సృష్టించారు. నేడు బహుజనులు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చామంటే జ్యోతి రావు పూలే కృషి వల్లే. పూలే చిత్ర నిర్మాతలు డైరక్టర్ చిత్రంలోని నటీనటులకు అభినందనలు. రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పులే చిత్రాన్ని వీక్షిస్తున్నారు. మన రాష్ట్రంలో పులే చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. మన భవిష్యత్తుకు ఆనాడు పూలే ఎంత కృషి చేశారో ఈ చిత్రం ద్వారా అర్ధం అవుతుంది’ అని అన్నారు. -
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్‌హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతోంది. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.మేడ్చల్ క్లస్టర్ హవా.. నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, శామీర్‌పేట్, పటాన్చెరు ఇండ్రస్టియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. 👉 ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భూముల ధరలు.. ఆకాశం వైపు..మేడ్చల్ క్లస్టర్లో వేర్‌హౌస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. డిమాండ్ ఎందుకంటే.. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ న్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. -
కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా సున్నం చెరువు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని సున్నం చెరువు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందులోని నీరు మరిగించినా తొలగిపోని కారకాలతో నిండిపోయింది. ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేస్తు న్నారు. ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుర్తించింది. నమూనాలు సేకరించి, కాలుష్య నియంత్రణ మండలితో (పీసీబీ) పరీక్షలు చేయించి మరీ నిర్థారించింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన... సున్నం చెరువు శేరిలింగంపల్లి–కూకట్పల్లి మండలాల సరిహద్దులో ఉన్న గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం కాలుష్య కాసారంలా మారిన ఈ చెరువు సమీపంలోకి వెళ్లినా భరించ లేని దుర్వాసన ఉంటోంది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి దరు ఆ నీటిని తాగునీటిగా పేర్కొంటూ ట్యాంకర్ల ద్వారా పరిసరాల్లోని విక్రయిస్తున్నారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా పరీక్షలు... నగరంలోని తమ్మిడికుంట, బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, బుమ్రకుద్దీన్ దౌలా చెరువులతో పాటు సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. సున్నం చెరువులో మంచి నీరు నిలువ ఉండేలా చేయడానికి దాదాపు రూ.10 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తోంది. ఆ చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడి భూగర్భ జలాల నమూనాలు సేకరించి, పీసీబీ ద్వారా పరీక్షలు చేయించింది. తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలకూ పరీక్షలు చేయించింది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిలో నికెల్, కాడ్మియం. సీసం లోహాల మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిన మోతాదులో కాకుండా.. 2 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పీసీబీ నివేదిక రూపొందించింది.ప్రమాదకర స్థాయిలో సీసం... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో సీసం 0.01 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో ఇది 0.073 నుంచి 0.122 వరకు ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఇలాంటి నీరు పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపి, వారి జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుందని, రక్తహీనతకు కారణం అవుతుందని హైడ్రా స్పష్టం చేసింది. లీటరు నీటిలో కాడ్మియం 0.003 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు పరిసరాల్లోని బోర్ల నీటిలో ఇది 0.007 నుంచి 0.010 మిల్లీ గ్రాముల వరకు ఉన్నట్టు వెల్లడైంది. ఇలా అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.చదవండి: బిల్డ్‌నౌతో వేగం పెరిగినా.. తగ్గని పైరవీలు లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల వరకు నికెల్ ఉండొచ్చు. ఈ నీటిలో ఇది 0.038 నుంచి 0.046 మిల్లీ గ్రాముల వరకు ఉంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరగబెట్టినా ఫలితం ఉండదు... సాధారణంగా నీటిని మరగబెట్టి, చల్లార్చి తాగితే అందులో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు కొన్ని కాలుష్య కారకాలు పోతాయి. అయితే సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రమాదమే అని వైద్యులు చెప్తున్నారు. మరగటం వల్ల అందులోని సూక్ష్మక్రిములు పోయినా... సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద బోర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించింది. -
హైదరాబాద్‌లో భూముల ధరలు.. ఆకాశం వైపు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కేపీహెచ్బీలో చదరపు గజం ధర రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.ఐటీ హబ్‌కు చేరువలో ఉండటం వల్లే ఈ భూములకు అత్యధిక డిమాండ్ ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఐటీ నిపుణులు, సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ఇన్వెంటరీ, అందుబాటుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో బ్రాండెడ్ డెవలపర్లు కానీ ప్రాజెక్ట్‌లలో కూడా అపార్ట్మెంట్ల ధరలు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్నాయంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మెరుగైన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల విస్తరణ, కనెక్టివిటీ, కొత్త మెట్రో లైన్లు, ఎక్స్‌ప్రెస్ వేస్, ఐటీ పార్క్‌లతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతో నగరంలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తుండటంతో కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.👉 ఇదీ చదవండి: మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్ -
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 1.2 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్) ఫ్లైఓవర్‌ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఫ్లైఓవర్ విశిష్టతలు.. ఫైనాన్షియల్ డిస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనాఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు వెడల్పు 12 మీటర్లు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్‌లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా -
‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ బాస్‌లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్ లేదా జవహర్‌గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025 -
హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్..!
హైదరాబాద్: 'హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రిలీజ్ చేశారు. ఈ రోజు(శనివారం, జూన్ 28) తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్‌ను హరీష్ రావు విడుదల చేశారు. దీనిలో భాగంగా హరీష్ రావు మాల్లాడుతూ.. ‘ ఉస్మానియా యూనివర్శిటీ, అశోక్ నగర్ నుంచి పెద్ద ఎత్తును నిరుద్యోగులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జూలై 4వ తేదీన ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం కార్యక్రమంకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.నిరుద్యోగుల ఛలో సచివాలయంకు CPM పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. బీఆర్ఎస్ హయంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ ఇది దగా క్యాలెండర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు.ఎన్నికల సమయంలో ఇందిరమ్మ నమరాలుగా మాట ఇస్తున్న అని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు.యూత్ డిక్లరేషన్ లో 5 అంశాల చెప్పిన ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీ అంటే నాకు ఇష్టమని చెప్పిన ప్రియాంక గాంధీ, మహిళ స్టూడెంట్స్ కి ఇస్తామన్న స్కూటీ ఏమైందొ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చెప్పిన ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నిరుద్యోగ భృతి అతి గతి లేదు. యూత్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చిన ప్రియాంక గాంధీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మొట్టి కాయలు వెయ్యడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనురి మురళీ, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుంది. నిరుద్యుగులరా మీరు పోరాడుతూనే ఉండండి. మీ న్యాయ బద్ధమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ ఇస్తుంది. రేపటి తరమైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్‌తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025 -
ఔటర్లో అడ్రస్ ఉంటేనే ఆటో
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో నివాసం ఉండే డ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. కొత్త ఆటోరిక్షాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ 65 వేల పరి్మట్లను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10 వేల సీఎన్జీ ఆటో పర్మిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రోఫిట్మెంట్లు అమర్చు,కొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు కొత్త ఆటో పరి్మట్లపై రవాణా కమిషనర్ కె.సురేంద్రమోహన్ తాజాగా విధివిధానాలు విడుదల చేశారు. డాక్యుమెంట్లు తప్పనిసరి... ఆటో కొనుగోలు చేసే వ్యక్తి ఔటర్ పరిధిలో తన అడ్రస్‌ను నిర్ధారించే రెండు డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. కొనుగోలుదార్ల అడ్రస్ నిర్ధారణ బాధ్యత డీలర్లదేనని తెలిపారు. దరఖాస్తుదారు పూర్తి వివరాలతో పాటు ఆటో లేదా కారు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పుట్టిన తేదీ, ఔటర్ పరిధిలో రెండు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలతో ఆటోరిక్షా డీలర్లను సంప్రదించాలి. ఈ మేరకు డీలర్లు సీఎఫ్ఎస్టీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను ఆర్టీఏకు అందజేయాలి. ఇలా డాక్యుమెంట్లతో సహా తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి 24 గంటల్లో ఆర్టీఏ అధికారులు అనుమతులు అందజేస్తారు. అనుమతుల ఆధారంగా డ్రైవర్లు 60 రోజుల్లో కొత్త ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ గడువు ప్రకారం కొనుగోలు చేయలేకపోతే ఆ అనుమతులకు చెల్లుబాటు ఉండదని కమిషనర్ తెలిపారు. కొత్తగా 65 వేల పరి్మట్లను విడుదల చేసిన దృష్ట్యా పాత పర్మిట్లను రద్దు చేశారు. ఈ మేరకు పాత ఎల్పీజీ, డీజిల్, సీఎన్జీ పర్మిట్లపై కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు వీలులేదని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తెరపడేనా? ఆటో పర్మిట్లు నగరంలోని ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సుమారు 80 వేల పాత ఆటో పరి్మట్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న వ్యాపారులు ఒక్కో పరి్మట్‌ను రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాత పరి్మట్లపైనే ఆటోడ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఏటా భారీ ఎత్తున అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వం ఈసారి ఏకంగా 65 వేల కొత్త ఆటోలకు అనుమతినిచి్చన దృష్ట్యా ఇప్పటికైనా ఫైనాన్షియర్ల దోపిడీ ఆగిపోవాలని ఆటో సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి. -
Hyderabad: కోడలితో అఫైర్.. ప్రాణం తీసింది
కుషాయిగూడ(హైదరాబాద్ ): వరుసకు కోడలయ్యే యువతితో సన్నిహితంగా ఉన్నాననే విషయం బయట పడిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్ (30) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. దమ్మాయిగూడకు చెందిన పెయింటింగ్ కాంట్రాక్టర్, వరుసకు బావ అయ్యే వ్యక్తి వద్ద పని చేస్తూ చర్లపల్లి ఐజీ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బావ కూతురితో పరిచయం పెరిగి ఆమెకు సన్నిహితమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి, అతడి భార్య గురువారం రాత్రి భానుచందర్‌కు ఫోన్ చేసి మందలించారు. ఈ విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టామని భార్యాభర్తలిద్దరూ హాజరు కావాలని చెప్పినట్లు మృతుడి భార్య పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భానుచందర్ శుక్రవారం పిల్లలను స్కూల్ పంపి పంచాయితీకి వెళ్దామంటూ భార్యకు చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్లింది. దీంతో బాత్రూం బయట నుంచి గడియ పెట్టిన భానుచందర్.. నలుగురిలో తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాత్రూం తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరు గు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా భానుచందర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న భానుచందర్‌ను కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తికర వాతావరణల నెలకొంది. హైదరాబాద్‌లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పు పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.జీహెచ్ఎంసీ కార్యాలయానికి రెండు వైపులా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం, ఆఫీసు గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి అన్నపూర్ణ క్యాంటీన్ ముద్దు.. ఇందిరమ్మ క్యాంటీన్ వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించి నినాదాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..‘హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే GHMC కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు..అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు?. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు. -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్‌గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
పీజేఆర్ ఫ్లైఓవర్‌పై.. రయ్ రయ్
గచ్చిబౌలి: ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ విశిష్టతలు.. ూ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ూ శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు ూ ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా ూ ఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ూ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ూ ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు ూ త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు ూ క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ ూ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు ూ వెడల్పు 12 మీటర్లు ూ ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్‌లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా ఫ్లైఓవర్ పరిశీలన.. శుక్రవారం పీజేఆర్ ఫ్లైఓవర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాం«దీ, అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్‌రావు, ప్రాజెక్ట్ సీఈ భాస్కర్‌రెడ్డి, ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ, ఇతర అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు పీజేఆర్ సతీమణి ఇందిర శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లై ఓవర్‌కు దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి పేరు పెడుతున్నట్లు జీఓ విడుదల చేయడంతో ఆయన సతీమణి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచి్చందన్నారు. ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవానికి వచ్చి సీఎం, మంత్రులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోతున్నానని ఆమె తెలిపారు. మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం హర్షణీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద మరో ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటం సంతోషంగా, గర్వంగానూ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం పీజేఆర్ (శిల్పా లే ఔట్ ఫేజ్–2) ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఫ్లై ఓవర్ వీడియోను శుక్రవారం ఆయన షేర్ చేశారు. ఎస్సార్డీపీలోని 42 ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. -
అడుక్కోవద్దు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరోసారి బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోంలకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బల్దియా ప్రకటించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలమేరకు ఇప్పటికే అన్ని సర్కిళ్లలో.. ప్రధానంగా బషీర్ బాగ్, సెక్రటేరియట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లోని జంక్షన్లలోని యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండేవారిని గుర్తించి జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని తమ సొంత ఊళ్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నా రు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం అందుకొని, వారిని వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. 221 మంది గుర్తింపు.. ఇప్పటి వరకు 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలకు తరలించగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారివారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండేవారిని షెల్టర్ హోంలకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా.. తాజాగా నాంపల్లి మెట్రోస్టేషన్,ఎస్సార్‌నగర్ మెట్రో జంక్షన్, శిల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువ మందిని గుర్తించారు. సాగేనా.. ఆగేనా? నగరాన్ని బెగ్గర్ ఫ్రీ చేయడమనేది ప్రహసనంగా మారింది. గతంలోనూ ప్రయత్నాలు చేసినా మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. 2017 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న (ప్రస్తుతం సైతం ఆయనే) డొనాల్డ్ ట్రంప్ కుమార్తె నగరానికి వచ్చే ముందు యాచకులు లేకుండా చేశారు. మున్ముందు బిచ్చగాళ్లు అనేవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించి కొన్ని నెలల వరకు కొనసాగించారు. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో యాచన చేస్తున్న వారిని నగర శివార్లలోని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. ఈ వృత్తిని నిర్మూలిస్తామని అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ప్రకటించారు. వారిలో చాలామంది ఫేక్ అని, దాదాపు మూడువేల మంది పసిపిల్లలతో దందా నడిపిస్తున్నారని, దాన్ని అరికడతామన్నారు. నిజంగా యాచన తప్ప ఏపనీ చేయలేని అసహాయులను అన్నివిధాలా ఆదుకుంటామని, పనిచేసే శక్తి ఉన్నవారికి అవసరమైన వారికి తగిన శిక్షణ నిప్పించి ఉపాధి కలి్పస్తామన్నారు. కానీ.. అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి బెగ్గర్ ఫ్రీ నగరంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఏమవుతుందో కొన్నాళ్లయితే కానీ తెలియదు. రూ. 300 కోట్లకు పైగా సంపాదన వివిధ సర్వేల మేరకు నగరంలోని యాచకులు ఏటా రూ. 300 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.నకిలీలే అధికం.. గ్రేటర్లో ఇరవై వేల మందికి పైగా ఈ వృత్తిలో ఉండగా, వీరిలో కేవలం పదిశాతం మాత్రమే నిజంగా అశక్తులు. బిహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా వీరిలో ఉన్నారు. జంక్షన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు వీరి అడ్డాలు. వీరిలో చాలామందికి మద్యం, ఇతరత్రా మత్తుపదార్థాల వ్యసనం ఉంది. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున రూ. 500 వరకు ఆర్జిస్తున్నారు. ఈ పని చేస్తున్న మహిళల్లో కొందరు పగటి పూట యాచన చేస్తూ, రాత్రి వేళల్లో సెక్క్ వర్కర్లుగా మారుతున్నారు. యాచకుల్లో 90 శాతానికి పైగా పునరావాసం కలి్పస్తామన్నా, వృద్ధాశ్రమాలు/విద్యాసంస్థలు/ ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో చేరుస్తామన్నా నిరాకరిస్తున్నట్లు వివిధ సర్వేల్లో వెల్లడైంది. -
బొగ్గుబాయిలో బకాయిల బూడిద
గోదావరిఖని: దేశంలోని మహారత్న సంస్థలకు దీటుగా ముందుకు సాగుతున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థను బకాయిల బెంగ వెంటాడుతోంది. సంస్థ వరుస లాభాలార్జిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతోంది. సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కానీ వినియోగదారుల నుంచి రావల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు సుమారు రూ.26 వేల కోట్ల వరకు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు నగదు నిల్వలను తమ బ్యాంకుల్లో జమ చేయాలని బ్యాంకర్లు సింగరేణికి క్యూకట్టగా.. బకాయిల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తన అవసరాల కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల సంస్థ ప్రత్యక్షంగా సుమారు 42వేల మంది శాశ్వత ఉద్యోగులు, దాదాపు 25 వేల మంది ప్రైవేట్ కార్మికులు, పరోక్షంగా మరో లక్షమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు సౌర, థర్మల్ విద్యుదుత్పత్తిలోనూ అగ్రభాగాన నిలుస్తూ ఏటా లాభాలు సాధిస్తోంది. రాబోయే రోజుల్లో జలవిద్యుదుత్పత్తి చేసేందుకూ సన్నాహాలు చేస్తోంది.క్రిటికల్ మినరల్ అన్వేషణ ద్వారా కొత్త వ్యాపారంలోకి అడుగిడాలని చూస్తోంది. ఈక్రమంలో సంస్థకు ఆర్థిక వనరులు ఇబ్బందిగా మారుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.19 వేల కోట్లు బకాయి పడగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు దాదాపు ఏడాదిన్నరలోనే సుమారు రూ.7వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా సింగరేణి సంస్థకు సుమారు రూ.26 వేల కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని తెలిపాయి.విస్తరణకు నిధుల కొరత..ప్రస్తుతం సింగరేణి సంస్థ విస్తరణ తప్పనిసరిగా మారింది. కొన్ని గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోతున్నాయి. మరికొన్ని గనులకు ఆధునిక సాంకేతికత అవసరం ఉంది. సంస్థకు రావలసిన బకాయిలు ఎప్పటికీ వసూలు కాకపోవడంతో సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే విస్తరణకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రమంలో త్వరగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. బకాయిల జాబితాలో విద్యుత్ సంస్థలుసింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు అందజేస్తోంది. అలా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు సరఫరా చేస్తోంది. ఈక్రమంలో సుమారు రూ.12వేల కోట్లు బొగ్గు బకాయిలే ఉన్నట్లు చెబుతున్నారు. రూ.14వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావలసి ఉంది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.వెయ్యి కోట్ల బకాయిలను చెల్లించినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది.వెంటనే చెల్లించాలిసింగరేణి సంస్థ భవిష్యత్ కోసం ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి. బకాయిల ప్రభావం సంస్థ అభివృద్ధిపై పడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ నేతలు చొరవ తీసుకోవాలి. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీఏడాదిన్నరలో రూ.7వేల కోట్లుగత ప్రభుత్వం పదేళ్లలో రూ.19వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రూ.7వేల కోట్లు నిలిపివేసింది. ఈ విషయంలో ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించి సంస్థ భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి. దీనిద్వారా కొత్తగనుల ఏర్పాటు, సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుంది. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు,టీబీజీకేఎస్రూ.వెయ్యి కోట్ల చెల్లింపుప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. మరికొన్ని త్వరలో రానున్నాయి. బకాయిలతో సంబంధం లేకుండా సంస్థ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. సంస్థ విస్తరణలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నాం. – ఎన్.బలరాం,సీఎండీ,సింగరేణి -
సంక్షోభంలో సాగునీటి రంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ రంగానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి బాగు చేస్తే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి మేడిగడ్డపై దు్రష్పచారం మానుకోవాలని, ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హరీశ్‌రావు విమర్శించారు. ‘ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. నల్లగొండలో సుంకిశాల కుప్ప కూలింది. పాలమూరులో వట్టెం పంప్ హౌస్ జలమయమైంది. నల్లగొండలో ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయి. మంజీర డ్యామ్ ఆప్రాన్ వరద ధాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్‌లలో పగుళ్లు వచ్చాయి. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ఈ ప్రమాదాలు జరిగినా ఎన్డీఎస్ఏకు కనిపించవు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. బనకచర్ల ద్వారా ఏపీకి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. రాజకీయ ఎజెండాల కోసం తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని బలి చేయొద్దని హరీశ్‌రావు హితవు పలికారు.కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జరిగిన 142 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. పటాన్చెరు ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని వారు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం రేవంత్ ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని హరీశ్ డిమాండ్ చేశారు. -
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar)(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం...ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు కూడా.చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ.. అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
భూభారతిలో ‘డిజిటల్’ సమస్య
సాక్షి, హైదరాబాద్: భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడంలో సిబ్బంది అవగాహన లేమి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. వ్యవసాయ భూములపై కోర్టులు ఇచ్చే తీర్పులు అమలుచేసే సమయంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్ల విషయంలో కొందరు రెవెన్యూ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా పాత పట్టాదారు పేరు మీదనే డిజిటల్ సంతకాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తహసీల్దార్ల డిజిటల్ సంతకం వరకు సాఫీగానే సాగుతోందని, ఆ తర్వాత జరగాల్సిన అప్డేషన్ జరగడం లేదని సమాచారం.రికార్డుల్లో పేరు మార్పు జరగడం లేదని చాలా కాలంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే, ఈ కోర్టు కేసుల అమలు విషయంలో డిజిటల్ సంతకాలు చేసే సమయంలో ఆర్డీఓలు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందని, పట్టాదారు మారుతున్నాడనే ఆప్షన్‌ను ఎంచుకుంటేనే కొత్త పట్టాదారుకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌కు అవకాశం వస్తుందని, లేదంటే పాత పట్టాదారు పేరు మీదనే ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తోందని సమాచారం.ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భూభారతి సదస్సుల్లో 20 వేలకు పైగా కోర్టు కేసులు/పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. కోర్టు కేసులను పరిష్కరించే లాగిన్ ఉన్న ఆర్డీఓలు డిజిటల్ సంతకాలు చేసే సమయంలో ఆప్షన్లను సరిగా ఎంచుకోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నెమ్మదిగా రిజిస్ట్రేషన్లు.. గత ఐదు రోజులుగా భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. స్లాట్ బుకింగ్ సవ్యంగానే జరుగుతున్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు సర్వర్ నెమ్మదిగా సాగుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. డిజిటల్ సంతకాలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటోందని.. దీంతో 15–20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియకు 40–45 నిమిషాలు పడుతోందని చెబుతున్నారు.ఈ విషయంపై హైదరాబాద్‌లోని మెయిన్ సర్వర్ కార్యాలయాన్ని సంప్రదించగా సాంకేతిక సమస్య ఉందని, నాలుగైదు రోజుల్లో సర్దుకుంటుందని చెబుతున్నారు. పోర్టల్ అప్డేట్ అవుతున్న సందర్భంలో కొన్ని సమస్యలు వస్తాయని, వాటంతట అవే సర్దుకుంటాయని చెబుతున్నట్లు సమాచారం. -
మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు..ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తెలుసుకొని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ నిర్మల్ నటరాజ్‌నగర్‌కు చెందిన రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్, ఎస్ఈసీ తీరు చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 243 యూ, 243 జెడ్‌ఏలను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019లోని నిబంధనలను ప్రభుత్వం పాటించకపోవడం, మూడు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఎలా ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రశ్నించారు.కేంద్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందా అని అడిగారు. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్సీఐ పాత్ర ఉండదన్నారు. వార్డుల రిజర్వేషన్లు సహా అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాతే కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని చెప్పారు. దీనిపై ఏజీపీ సౌమ్య స్పందిస్తూ.. సర్కార్ నుంచి సూచనలు తీసుకొని చెప్పేందుకు రెండు వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి.. విచారణను వాయిదా వేస్తూ, ఆ లోగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, నిర్మల్ కలెక్టర్, కమిషనర్, ఎస్ఈసీలకు నోటీసులు జారీ చేశారు. -
సామాన్యుడి దగ్గరే రుబాబు బడా బాబుల దగ్గర బాబ్బాబు!
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు కరెంట్ బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్ చేసే విద్యుత్ అధికారులు.. బడాబాబులు రూ.కోట్లలో బకాయి పడ్డా వారి జోలికి వెళ్ల డం లేదు. ఏళ్ల తరబడి బిల్లులు పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ధైర్యం చేసి ఎప్పుడైనా బిల్లు కోసం వెళ్తే బడా సంస్థలు ‘కడతాం లే’అంటూ విద్యుత్ అధికారులను గేటు బయట నుంచే పంపేస్తున్నాయి. పలు సంస్థలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవటంతో ఇప్పుడు ఆ బకాయిలు ఏకంగా రూ.529.22 కోట్లకు చేరాయి. ఇది దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోది మాత్రమే.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైదరాబాద్ పరిధిలోని 725 కనెక్షన్ల మొండి బకాయిల రికార్డు ఇది. బకాయి పడ్డ సంస్థలన్నీ మామూలువేం కాదు. కార్పొరేట్ ఆస్పత్రులు, కోట్లలో వ్యాపారం చేసే టెలి సర్వీసెస్ కంపెనీలు, స్టార్ హోటళ్లు, పెద్దపెద్ద రిసార్టులు... మార్గదర్శి వంటి ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీలు విద్యుత్ బిల్లులు బకాయి పడ్డ సంస్థల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లుంటే, హైదరాబాద్‌లోనే 1.20 లక్షలున్నాయి. అంతేకాదు 1,700 హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో వాడే వ్యవసాయేతర విద్యుత్‌లో 70 శాతం జంట నగరాల్లోనే వినియోస్తున్నారు. ఇందులోనూ బడాబాబుల చేతుల్లో ఉన్న సంస్థలే దాదాపు 50 శాతం విద్యుత్ వాడుతున్నాయి. గట్టిగా మాట్లాడితే కోర్టుకెళ్తాం బకాయిల వసూళ్లపై దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఎండీ ముషారఫ్ ఆలీ ఫారూఖీ ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జోన్ల విద్యుత్ అధికారులతో ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బకాయిల వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హెచ్‌టీ కనెక్షన్లకు నిర్ణీత విద్యుత్ ఛార్జీలు ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పెరుగుతుంటాయి. డిస్కమ్‌లు వివిధ సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. కొన్నిసార్లు ముందుగా వేసిన అంచనాల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని గృహ విద్యుత్ వినియోగదారులపై వేయడం భారంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్రాస్ సబ్సిడీ పేరుతో హెచ్‌టీ కనెక్షన్‌దారుల నుంచి పెరిగిన విద్యుత్ భారాన్ని వసూలు చేస్తారు.విద్యుత్ ఆదాయ, అవసరాల నివేదికలోనూ దీన్ని పేర్కొంటారు. బకాయిలు పడ్డ సంస్థలు ఈ వాదనతో ఏకీభవించడం లేదు. క్రాస్ సబ్సిడీని సవాల్ చేస్తూ అవి కోర్టుకు వెళ్తున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని బకాయిలు చెల్లించడం లేదని క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే నెల వరకు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఉన్న ఈ కేసులపై న్యాయ పరమైన చిక్కులను పరిష్కరించేందుకు సీఎండీ కృషి చేస్తున్నారు. కంపెనీ న్యాయవాదులతో ఆయన ఇటీవల సమావేశమై జాతీయ స్థాయిలో క్రాస్ సబ్సిడీపై కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.ప్రత్యేక దృష్టి పెట్టాం మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంత పెద్దవాళ్లయినా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది. రూ.కోట్ల వ్యాపారం చేసే వ్యక్తులే బిల్లులు కట్టకపోతే ఎలా? బకాయిల వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే బకాయిల వసూళ్లలో పురోగతి సాధిస్తాం. ఇప్పటికే కొన్ని సంస్థల నుంచి సగం వరకు బకాయిలు వసూలు చేశాం. – ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ,దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ. -
3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. శనివారం నుంచే విద్యార్థులు ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. 3 విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు23 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ శుక్రవారం మండలి కార్యాలయంలో సమావేశమైంది. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ప్రొ. ఎస్కే మహమ్మూద్, మండలి కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి, రిజి్రస్టార్ ప్రొ. వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 176 కాలేజీల్లో ప్రవేశాలు: రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు చెందిన కాలేజీలు 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ఏడాది రెండు ప్రైవేటు కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, కొత్తగా పాలమూరు, శాతవాహన, కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ లెక్కన ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 176 కాలేజీలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి.గత సంవత్సరం కన్వినర్ కోటా కింద 89,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త యూనివర్సిటీలు రావడంతో ఈసారి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 6వ తేదీ నాటికి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాతోపాటు, అందులో సీట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2022లో నిర్ణయించిన ఫీజులే ఈ ఏడాది కూడా వసూలు చేయాలని ఇప్పటివరకు నిర్ణయం జరిగిందని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈసారి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జోసా కౌన్సెలింగ్ తరహాలో మౌక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
ఐఏఎంసీకి భూకేటాయింపు చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నంబర్83/1లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనా ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్టు బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికా రం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధన క్లాజ్ 6 (డీ)ను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు బట్టింది.తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ చెల్లింపును తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్స్–1975ను ఈ భూ కేటా యింపు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్ట బద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని.. అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చిచెప్పింది. గత నాలుగేళ్లలో ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవి ష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని (అందులో 11 అనుకూలంగా)... 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమి త్తం ఏటా రూ. 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమ తిస్తూ జారీ చేసిన జీవోలు 76, 365లను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించినా.. ఓ ప్రైవేట్ సంస్థకు అది శాశ్వతంగా ఉండ కూడదని హితవు పలికింది. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది.ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవీ.. ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటా యిస్తూ 2021 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు 76, 365లను, కేసుల కేటాయింపునకు జీవో 6ను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొనేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఎ.వెంకట్రామిరెడ్డి, వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను దాఖలు చేశారు.ఓ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని.. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్లపై జనవరిలో వాదనలు ముగించిన జసిŠట్స్ కె.లక్ష్మణ్, కె.సుజన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.వాదనలు సాగాయిలా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రూ. 350 కోట్లకుపైగా విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం రాష్ట్రానికి తీరని నష్టం. ఓ ప్రైవేట్ ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడమే కాకుండా నిర్వహణ పేరిట ఏటా రూ. 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేట్‌సంస్థకు భూకేటాయింపు జరిపారు’ అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ‘ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ఇలాంటి వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నాయి. ఐఏఎంసీతో వివాదాలు పరిష్కారమైతే కోర్టులపైనా భారం తగ్గుతుంది. ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఐఏఎంసీ ట్రస్ట్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయీ దుర్వినియోగం కాలేదు’ అని నివేదించారు.ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయిందన్న ధర్మాసనం‘ప్రభుత్వాల నుంచి నిరంతర ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) తన లక్ష్యాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో మేము ఎత్తి చూపాలనుకుంటున్నాం. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి 1995లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఏడీఆర్ ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది. దాని ప్రారంభం నుంచి ఐసీఏడీఆర్ 49 మధ్యవర్తిత్వ కేసులనే స్వీకరించిందని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక పేర్కొంది.ఆర్థిక సహాయం ఉన్నా కేసుల పరిష్కారం నామమాత్రంగానే ఉన్నందున ఐసీఏడీఆర్‌ను స్వాధీనం చేసుకోవాలని.. దానికి మంజూరు చేసిన శాశ్వత లీజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎంసీ అలా మారదని మేము ఆశిస్తున్నాము. అయితే మూడేళ్లుగా ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం, ఉచిత కార్యాలయ స్థలాన్ని అందించినా ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన మేరకు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే సంకేతాలను చూపించలేకపోయింది. ఐఏఎంసీ ప్రారంభానికి మద్దతు సమర్థనీయమే.కానీ అలాంటి సంస్థలకు నిరంతర, శాశ్వత ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఐఏఎంసీ పనితీరును ఏటా సమీక్షించి, దాని ఖాతాలను తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) లేదా మరే ఇతర సమర్థ అధికారి ద్వారా ఆడిట్ చేయించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. గత ఒప్పందం మేరకు ఐదేళ్ల తర్వాత ఐఏఎంసీ పనితీరుకు లోబడి నిధుల విడుదల ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిధుల కేటాయింపునకు పనితీరే కొలమానం..‘ప్రభుత్వ వివాదాలన్నీ ఐఏఎంసీలోనే పరిష్కరించుకునేలా ఇచ్చిన జీవో సమర్థనీయమే అయినా.. పలు సూచనలు చేయాల్సి ఉంది. రూ. 3 కోట్లకుపైగా విలువైన అన్ని వివాదాలను ఐఏఎంసీకి మధ్యవర్తిత్వం కోసం సూచించాలనే ప్రభుత్వ నిర్ణయం విధానపరమైనది. అయితే ప్రజాధనంతో ఈ అంశం ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి సూచించడం, దానికయ్యే ఖర్చులను పరిశీలించాల్సి ఉంటుంది. ఐఏఎంసీ ద్వారా మధ్యవర్తిత్వ ఖర్చు ఎక్కువగా ఉందని.. ఖజానాపై గణనీయమైన భారం పడుతున్నట్లు గురిస్తే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత పిల్లను పాక్షికంగా అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది.మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాలి..‘కేంద్ర న్యాయ శాఖ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఐసీసీ కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ), లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ (ఎల్‌సీఐఏ), హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (హెచ్కెఐఏసీ)ల మాదిరిగానే మధ్యవర్తిత్వ సేవలను అందించే సంస్థలను స్థాపించాలని సిఫార్సు చేసింది.సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను వివరించింది. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సులభతరం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మధ్యవర్తిత్వ సంస్థల నిర్వహణకు ప్రారంభ మూలధనం అవసరమని.. దాన్ని ప్రభుత్వం అందించవచ్చని పేర్కొంది. మధ్యవర్తిత్వ సంస్థలకు ప్రభుత్వాలు మద్దతివ్వడం సంతృప్తికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
యువ ఇన్నోవేటర్స్‌ను ప్రోత్సహించేలా హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డీట్) గుర్తింపు ఫౌండేషన్, వీవ్ మీడియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైడియాథన్ పోస్టర్ లాంచ్ స్థానిక డీట్ ఆఫీసు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో డీట్ డైరెక్ట్ ఈ ఆర్ జనార్దన్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ పీఆర్ వంశీ, వీవ్ మీడియా టీం లాంచ్ చేశారు. వీ హబ్ సీఈఓ సీత చేతుల మీదుగా వీ హబ్‌లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 18-30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, యువ ఇన్నోవేటర్స్ ఈ కాంపిటీషన్ పాల్గొనవచ్చని ఫౌండేషన్ డైరెక్టర్ నరేంద తెలిపారు. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు , అప్ స్కిల్లింగ్, ఇంకుబేషన్ సపోర్ట్, ఫండింగ్ సపోర్ట్ అందిస్తున్నామని ‘గుర్తింపు ఫౌండేషన్’ డైరెక్టర్ నరేంద తెలిపారు. -
HMDA: బిల్డ్ నౌతో వేగం పెరిగినా..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రణాళికా విభాగంలో పారదర్శకత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సకాలంలో అనుమతులు లభించకపోవడం వల్ల దరఖాస్తుదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొని ఉండగా, మరోవైపు కన్సల్టెంట్లు, లైజనింగ్ సిబ్బంది ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రమే త్వరితగతిన మోక్షం లభిస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను మరింత వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా ఇచ్చేందుకు కొత్తగా బిల్డ్‌నౌ సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ జాప్యాన్ని నివారించ లేకపోవడం గమనార్హం.బిల్డ్‌నౌ (BuildNow) వెబ్సైట్ ద్వారా క్షణాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం లభించింది. కానీ, ఫైళ్లను పరిష్కరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు అందజేయడంలో మాత్రం జాప్యం కొనసాగుతోందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అనుమతుల్లో ఉద్దేశపూర్వకమైన జాప్యాన్ని అరికట్టేందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకొనేవారు. జరిమానాలు విధించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడం వల్ల కూడా పారదర్శత కనిపించడం లేదు. మరోవైపు ఈ పరిణామం వల్ల నిజాయతీగా పని చేసే అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సైతం అప్రతిష్టను మూట గట్టుకోవలసి వస్తోందని ప్రణాళికా విభాగానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు.రియల్ పరుగులు... కొంతకాలంగా నగరంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయి. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ వెలుపల బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. అదే సమయంలో భారీ లే అవుట్లు సైతం వెలుస్తున్నాయి. దీంతో అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తులు కుప్పలుగా వస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది నిర్మాణ రంగంలో అనుమతులు రెట్టింపు అయినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. శంషాబాద్, అమీన్పూర్, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి (Bachupally) తదితర ప్రాంతాల్లో హైరైజ్డ్ టవర్లు, బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగినట్లు అంచనా. మరోవైపు టీజీ బీపాస్ కంటే బిల్డ్‌నౌ వెబ్సైట్లో వెంటనే ‘కీ’లు లభించడం వల్ల కూడా దరఖాస్తు ప్రక్రియ సులభతరమైంది. వివిధ రకాలుగా వచ్చిన మార్పులు ఇటు కన్సల్టెంట్ల రూపంలో ఉండే మధ్యవర్తులకు, లైజనింగ్ సిబ్బంది పేరిట పైరవీలు చేసేవారికి చక్కటి అవకాశంగా మారింది.ట్రిపుల్ ఆర్ వరకు అనుమతులు హెచ్ఎండీఏ (HMDA) పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. గతంలో డీటీసీపీ నుంచి అనుమతులు పొందిన ప్రాంతాలన్నీ ఇప్పుడు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్తగా విలీనమైన 11 జిల్లాల పరిధిలోని 3,550 గ్రామాల్లో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి నిర్మాణ సంస్థలకు ఊరట లభించింది. చదవండి: సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలుఇదివరకు డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న అపరిష్కృత ఫైళ్లు సైతం హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. అన్ని విధాలుగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, నిర్మాణరంగంలో మార్పులు చోటుచేసుకొని వేగం పెరిగింది. అదేస్థాయిలో హెచ్ఎండీఏకు వచ్చే ఫైళ్లు సైతం గణనీయంగా నమోదవుతున్నాయి. అందుకనుగుణంగానే హెచ్ఎండీఏ కార్యాలయంలో ప్రణాళికా విభాగం కొలువుదీరిన నాలుగు, ఐదు, ఏడో అంతస్థులు పైరవీకారులతో సందడిగా మారడం గమనార్హం. -
‘నేను కదా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ములాఖత్ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్‌కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్‌రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. -
పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సమయం లేక కొంతమంది.. ఆర్థిక స్తోమత లేక మరి కొంతమంది చేయలేని పరిస్థితి.. అలాంటివారు ఏమాత్రం అవకాశం దొరికినా తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ధర్మారావు.. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం తన వంతు సాయంగా సేవ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.. – మోతీనగర్ ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన బి.ధర్మారావు ప్రస్తుతం మూసాపేట డివిజన్ మోతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం 1996లో కృష్ణాజిల్లా నుంచి నగరానికి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ జులైలో 2004లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం ఆయన సతీమణి దివంగత బి.హైమావతి కోరిక మేరకు 2004 నుంచి నేటి వరకూ నిరంతరాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు. ఆమె ఆలోచన నుంచే.. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డాం. ఈ నేపథ్యంలో నా భార్య హైమావతి ఆలోచన నుంచే ఉద్యోగ విరమణ అనంతరం మా వంతు సాయం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం విద్యార్థులకు తోచిన విధంగా పరితోషికాన్ని సాయం చేస్తున్నా. అపార్టుమెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ పిల్లలకు నోటు పుస్తకాలు అందజేస్తున్నా. రానున్న రోజుల్లో హైమావతి జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేపడతా. – ధర్మారావు, రిటైర్డ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ భార్య జ్ఞాపకార్థం.. ప్రస్తుతం చిన్నకుమారుని వద్ద నివాసం ఉంటున్న ధర్మారావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2020లో ఆయన భార్య మరణానంతరం హైమావతి జ్ఞాపకార్థం.. 2021 నుంచి పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీతో పాటు మూసాపేట డివిజన్లోని బబ్బుగూడ, యూసఫ్‌గూడ, వెంగళరావునగర్, ఇస్నాపూర్, శ్రీరామ్‌నగర్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలు, శ్రీరామ్ నగర్‌లోని ఉర్దూ మదరసాల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చప్పున ఫీజులను చెల్లిస్తున్నారు. గత ఐదేళ్లుగా పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన, 500కు పైబడి మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. -
మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
కొండంత బోనం.. కోటంత సంబురం
గోల్కొండ/చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బోనాల నిర్వహణ ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు గోల్కొండ చౌరస్తా వద్ద ఘటాలకు స్వాగతం పలికారు. కాగా.. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాల్లో భాగంగా జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, గాజుల అంజయ్య, రాకేష్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్, జనగామ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నుంచి తల్లిని గెంటేసిన కుమారులు.. షాకిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తోంది. చివరికి తమను కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తుంది. అయితే వృద్ధాప్యంలోనూ తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు ఓ తల్లి తగిన బుద్ధి చెప్పింది. జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో ఎట్టకేలకు తన సొంతింటిని తాను సొంతం చేసుకుంది.మూసారాంబాగ్ డివిజన్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన శకుంతులా బాయి (90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన నివాసంలో కొడుకులతో కలిసి ఉండేది. కొంత కాలం తర్వాత తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తల్లిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపేశారు. దాంతో గత్యంతరం లేక వృద్ధురాలు ఏడాదిన్నరగా సైదాబాద్‌లోని చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటుంది.తన బాగోగులు చూడని కొడుకులు తన ఇంట్లో ఉండ కూడదని నిర్ణయించుకుంది. సీనియర్ సిటిజెన్స్ అసోషియేషన్ ప్రతినిధులతో కలిసి వెళ్లి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను 2024 ఫిబ్రవరిలో తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆర్డీఓ ఆమె ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంటిని తల్లికి ఇవ్వడానికి మొదట ఇద్దరూ అంగీకరించారు. అయితే నెలలు గడుస్తున్నా వారు ఇంటిని ఖాళీ చేయడం లేదు.ఆర్డీఓ ఆదేశాల మేరకు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించ లేదు. దాంతో తహసీల్దార్ మూడు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఫైనల్ నోటీసులు ఇచ్చారు. దాంతో వారు ఇంటికి తాళం వేసి సమాచారం ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయారు. గురువారం సైదాబాద్ తహసీల్దార్ సిబ్బందితో వచ్చి ఇంటిని సీజ్ చేసారు. శకుంతలా బాయికి ఇల్లు అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు. -
నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను www.bse. telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 38 వేల మంది హాజరయ్యారు. -
రూ.180 కోట్ల మెడికల్ బిల్లులు క్లియర్
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉ న్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు మోక్షం కలిగింది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి రూ.180.38 కోట్లను గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉరట లభించినట్లయింది. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన వెంటనే ఉద్యోగులకు 2023 మార్చి నుంచి ఈనెల 20 వరకు వచ్చిన మెడికల్ బిల్లులన్నింటినీ చెల్లించడం విశేషం.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నా రు. ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను పెంచుతూ ఈనెల 13న ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నా రు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరిందన్నారు.డీఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 200 కోట్ల లెక్కన ఏడాదికి రూ. 2,400 కోట్ల భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికా రుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజి స్తున్నామన్నారు. వీటితోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవు తోందని వెల్లడించారు. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీల ఏర్పాటు వేగవంతమైందని చెప్పారు. కేవలం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావ డంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫేక్ ఫ్యాకల్టీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదు రవుతున్నాయి. షెడ్యూల్ ప్రకటిస్తున్నప్పటికీ కౌన్సెలింగ్ ఏ మేరకు ముందుకెళ్తుందనేది అనుమానంగానే ఉంది. తాజాగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో నకిలీ అధ్యాపకులు ఉన్నారని జేఎన్టీయూహెచ్ అధికారులే అను మానం వ్యక్తం చేశారు. పీజీఈసెట్ ఫలితాల ప్రకటన సందర్భంగా వర్సిటీ రెక్టార్ డాక్టర్ విజయకుమార్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘అధ్యాపకుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కొంత మంది అప్లోడ్ చేయలేదు. కొన్ని అస్పష్టంగా ఉన్నాయి.అవి నకిలీవో లేక అస లువో పరిశీలించాలి’ అని ఆయన అన్నారు. ఆ తర్వాతే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తా మని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజ మాన్యాలు అర్హులైన అధ్యాపకుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి బోధన మాత్రం అనర్హులతో చేయిస్తున్నాయనే ఫిర్యాదులు ఏటా వస్తున్నా యి. వాటిని పరిశీలించడంపై జేఎన్టీయూ హెచ్ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడు? కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేదెప్పుడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జూలై తర్వాతే గుర్తింపు జాబితాఅఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త బ్రాంచీలు, అదనపు సీట్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొన్ని సీట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చే వీలుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరం ఒక్క సీటు కూడా పెంచేందుకు అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ నెల 30 వరకు కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఏఐసీటీఈ కల్పించగా ఆ తేదీ తర్వాతే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు.దీంతోపాటు కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలికవసతుల లోపం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 80 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చారు. కాలేజీల నుంచి వచ్చిన సమాధానాలను జూలై మొదటి వారంలో పరిశీలించి ఆ తర్వాతే గుర్తింపు ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చినా ఆప్షన్లు పెట్టుకొనే గడువు మాత్రం జూలై రెండో వారం తర్వాతే ఉండే వీలుంది.ప్రైవేటుకు ముకుతాడు వేయడం ఎలా?ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది ఫీజులు పెంచకూడదని స్పష్టం చేసింది. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే దీనిపై ప్రైవేటు కాలేజీలు కోర్టుకెళ్లే యోచనలో ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇటీవల అధికారులతో చర్చించారు.దీన్ని ఎదుర్కోవడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని అధికారులకు చెప్పారు. గతంలో వేసిన టాస్క్‌ఫోర్స్ నివేదికలోని అంశాలు ఏ మేరకు కోర్టులో వినిపించవచ్చో ఆలోచించాలన్నారు. అయితే ఈ పరిణామాలపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కూడా అంతే పట్టుదలగా ఉన్నాయి. ఏఎఫ్ఆర్సీ అధికారాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని కోర్టులో సవాల్ చేయాలనుకుంటున్నాయి. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ప్రకటించారు. జేఎన్టీయూహెచ్లో జరిగిన పీజీఈసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా కౌన్సెలింగ్‌పై ఆయన ప్రకటన చేశారు. వాస్తవానికి జూలై మొదటి వారంలో షెడ్యూల్ ఇస్తామని ఆయన కొన్ని రోజుల క్రితం చెప్పారు. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తేదీలను అనుసరిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన బుధవారం చెప్పారు.ఈ నెల 30 తర్వాతే షెడ్యూల్ వెలువడుతుందనే సంకేతాలిచ్చారు. కానీ ఊహించని విధంగా శుక్రవారం నాడే షెడ్యూల్ ఇస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ విషయంలో సాంకేతిక, విద్యాశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఆగమేఘాల మీద షెడ్యూల్ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం.ఎవరికి వారే..కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇవ్వబోతున్నామని మీడియాకు తెలియజేసేందుకు సాంకేతిక విద్య అధికారులు గురువారం ప్రెస్‌నోట్ సిద్ధం చేశారు. ఈలోగానే జేఎన్టీయూహెచ్లో మండలి చైర్మన్ షెడ్యూల్ ఇస్తున్న విషయాన్ని ప్రకటించారు. దీంతో సాంకేతిక, విద్యాశాఖ ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలకు రావాలంటూ కబురు అందడంతో సాంకేతిక విద్య అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘మేమెందుకు.. షెడ్యూల్ మీరే ఇచ్చుకోండి. మీ ఆఫీసుకొచ్చి కూర్చోవడం తప్ప ఏం చేయాలి..’ అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు ఉన్నత విద్యామండలి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందడంతో షెడ్యూల్ విడుదల కార్యక్రమానికి వెళ్లాలంటూ సాంకేతిక, విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలిసి షెడ్యూల్ విడుదల చేస్తారా? ఉన్నత విద్యా మండలి అధికారులే ఇస్తారా? అనే సందిగ్ధత నెలకొంది.అసలేం జరుగుతోంది?: సీఎంవిద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ.. మండలి అధికారుల మధ్య సమన్వయ లోపంపై ముఖ్య మంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది. సీఎం సలహా మేరకు ఓ ప్రత్యేక బృందాన్ని ఈ పని కోసం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. సమీక్షకు పిలిస్తే చాలు మండలి అధికారులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా సాంకేతిక, విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం సీఎంవో వర్గాలను నివ్వెరపరుస్తోంది. దీంతో ఆయా విభాగాల మధ్య అసలేం జరుగుతోందో అని సీఎంవో ఆరా తీస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాలతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
డేంజర్లో మంజీర!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు రోజూ 100 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేసే మంజీర బరాజ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. మేడిగడ్డ బరాజ్ తరహాలో..మంజీర బరాజ్ నుంచి విడుదలైన వరద ఉధృతికి డ్యామ్ దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన అప్రాన్ కొట్టుకుపోయింది. అప్రాన్కి సంబంధించిన కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బరాజ్ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి. మిగిలి ఉన్న అప్రాన్ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చు అన్నట్టు బలహీనంగా ఉంది.అడ్డగోలుగా తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో బరాజ్ మట్టి కట్టలు బలహీనమయ్యాయి. ఏళ్ల తరబడిగా మరమ్మతులు లేకపోవడంతో గేట్లతో పాటు స్పిల్‌వేలోని కొంత భాగం కూడా దెబ్బతింది. బరాజ్‌కు తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) తేల్చి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్–2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్ఓ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గత మార్చి 22న బరాజ్‌ను పరిశీలించి ఈ మేరకు ఓ నివేదికను సమర్పించింది. కాళేశ్వరం బరాజ్‌ల తరహాలో..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు దిగువన రక్షణగా ఉన్న అప్రాన్ వరద ధాటికి కొట్టుకుపోగా, ఆ తర్వాత కాలంలో మేడిగడ్డ బరాజ్ కుంగిపోయింది. మిగిలిన రెండు బరాజ్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే తరహాలో మంజీర బరాజ్ అప్రాన్ సైతం కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘మంజీర బరాజ్ నుంచి విడుదలయ్యే వరద ఉధృతి దిగువ భాగంలో నిరంతరం బరాజ్‌కు నష్టం కలిగించనుంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. లేనిపక్షంలో కోత క్రమంగా డ్యామ్ వరకు విస్తరించి దాని భద్రతకే ముప్పుగా పరిణమించనుంది..’ అని నివేదికలో ఎస్డీఎస్ఓ పేర్కొంది. మట్టికట్టలపై అడవిలా తుమ్మ చెట్లుబరాజ్ మట్టికట్టలపై పెద్ద మొత్తంలో తుమ్మ చెట్లు పెరిగి వాటి దృఢత్వాన్ని బలహీనపరుస్తున్నాయని ఎస్డీఎస్ఓ తేల్చింది. అడవి తరహాలో తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో 1.5 కి.మీ మేర కట్టలను పరిశీలించకపోయినట్టు పేర్కొంది. తుమ్మ చెట్లతో డ్యామ్ రివర్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. బరాజ్ పియర్లకు పగుళ్లు..మంజీర బరాజ్ పియర్లు దూరం నుంచి దృఢంగానే కనిపిస్తుండగా, సూక్ష్మంగా పరిశీలించి చూస్తే వాటికి పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ పరిశీలనలో బయటపడింది. తట్టుకునే సామర్థ్యానికి మించిన వరద ఒత్తిడిని ఎదుర్కోవాల్సిరావడంతోనే ఈ పగుళ్లు వచ్చాయని తేల్చింది. మంజీర రాతి ఆనకట్ట కావడంతో స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది. బరాజ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది అని అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల కోసం మంజీర బరాజ్‌లో ఏడాది పొడవునా నీళ్లను నిల్వ చేసి ఉంచుతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్వర్యంలో బరాజ్‌ను పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపించాలని సిఫారసు చేసింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ ప్రణాళిక, బరాజ్‌తో ఉండనున్న ముప్పుపై అధ్యయనం, బరాజ్ భద్రతపై సమగ్ర అధ్యయనాన్ని సీడబ్ల్యూపీఆర్ఎస్తో జరిపించాలని కోరింది. -
కావాల్సింది 2.48 లక్షల మెట్రిక్ టన్నులు.. ఉన్నది 1.47 ఎల్‌ఎంటీనే
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలై నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరి యా కోటా రాకపోవడంతో వచ్చే రెండు నెలల ను తలచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్రానికి జూన్ వరకే 5 లక్షల మెట్రి క్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్ప టి వరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్ర మే వచ్చింది. వచ్చిన కోటాలోనూ ఇప్పటికే 1.28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న యూరియా కేవలం 1.47 లక్షల మె ట్రిక్ టన్నులే. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఇప్పటికే వరినాట్లు మొదలుకాగా, జూలై మొదటి వారంలో రాష్ట్రమంతటా నాట్లు మొదలవుతాయి. ఇప్పటికే సుమారు 25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసి యూరియాను ఉపయోగిస్తున్నారు. వచ్చే నెల మొదటివారం కల్లా మరో 25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వరినాట్లు ఉధృతమైతే యూరియా కష్టాలు మొదలైనట్టే. కేటాయింపుల్లో ఇప్పటికే 2.25 ఎల్ఎంటీ కోతతెలంగాణలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతు న్నా, రాష్ట్రానికి కేటాయించాల్సిన యూరియా కోటాను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు. నెలనెలా పంపాల్సిన యూరియాను కూడా పంపించకపోవడంతో నాట్లేసిన తర్వాత రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడు తున్నారు. ఈ సీజన్లో రాష్ట్రానికి పంపాల్సిన కోటాను కోతలు లేకుండా ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి కోరినా ఫలితం లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.» ఏప్రిల్‌లో 1.70 ఎల్ఎంటీకి 1.22 ఎల్ఎంటీ యూరియా పంపిన కేంద్రం... మేలో 1.60 ఎల్ఎంటీకి గాను 87 వేల మెట్రిక్ టన్నులే పంపింది. » జూన్‌లో 1.70 ఎల్ఎంటీకి పంపించింది కేవలం 67వేల మెట్రిక్ టన్నులే. » మూడు నెలల కోటా కేవలం 2.75 లక్షల మెట్రిక్ టన్నులే రాగా, అందులో జూన్ నెలలో 1.28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. » వరి, పత్తి, మొక్కజొన్నకు జూలై నెలలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ఆగస్టులో మరో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే రెండు నెలల్లో అవసరమవుతుంది. కానీ అందుబాటులో ఉన్న 1.47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే. జూలైలో కేంద్రం పంపించే కోటాను బట్టి రైతు లకు యూరియా అందించాలని వ్యవసాయ శా ఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం పంపించిన యూరియా జూలైతో పాటు ఆగస్టు మొదటి వారానికి సరిపోతుందని మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగా ల భర్తీకి రెండు నోటిఫి కేషన్లు విడుదలయ్యాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్లను విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండ గా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, వి ద్యార్హత లు, ఇతర వివరాలను బోర్డు వెబ్సైట్లో (https://mhsrb. telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. మరో 6 వేల పోస్టుల భర్తీకి ప్రణాళికకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా భర్తీ చేయాల్సిన వాటి లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 1,284 ఉండగా, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ 1,930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) 2,322 పోస్టులు ఉన్నాయి. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
రూ. 1,393 కోట్లను తక్షణమే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్), తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన రూ. 1,393.65 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ ఈసీ) కోరింది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కా వడంతో ఈ నెల 6న ఆర్ఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జతీన్‌కుమార్ నాయక్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ రాశారు.ఈ లేఖను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియా కు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,393.65 కోట్ల బకాయిల్లో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ, కేఐపీసీఎల్‌కి సంబంధించి వరుసగా రూ. 319.75 కోట్లు, రూ. 292.75 కోట్లు గత 68 రోజులుగా మొండిబకాయిలుగా మారాయని, వాటిని వరుసగా ఈ నెల 28, 29 తేదీల్లోగా చెల్లించకుంటే ఇరు సంస్థల రుణాలూ నిరర్థక ఆస్తులుగా మారిపోతాయని ఆర్ఈసీ పేర్కొంది. రుణాల చెల్లింపుల్లో ఈ తరహా జాప్యం వల్ల ఇరు సంస్థలతోపాటు స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వ రుణ పరపతిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని.. రేటింగ్ పడిపోతోందని హెచ్చరించింది.మే 31 నాటికి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కేఐపీసీఎల్‌కి సంబంధించి వరుసగా రూ. 10,278 కోట్లు, రూ. 17,232 కోట్ల రుణాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని లేఖలో ఆర్ఈసీ గుర్తుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేఐపీసీఎల్‌కు రూ. 30,536 కోట్ల రుణాన్ని, దేవాదుల, సీతారామ, కంతనపల్లి తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌కి రూ. 13,517 కోట్ల రుణాలు కలిపి మొత్తం రూ. 44,053 కోట్ల రుణాలను ఆర్ఈసీ మంజూరు చేసినప్పటికీ అందులో కేఐపీసీఎల్‌కు రూ. 19,448 కోట్లు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌కు రూ. 12,618 కోట్లు కలిపి మొత్తం రూ. 28,995 కోట్లను మాత్రమే విడుదల చేసింది.ఈ రు ణాలను గడువులోగా తిరిగి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విఫలమవుతోందని పేర్కొంటూ గతేడాది నవంబర్ 5న సైతం ఆర్ఈసీ లేఖ రాసింది. రుణాలను గడువుకు 75–85 రోజుల తర్వాత చెల్లిస్తుండటంతో ప్రభుత్వంపై జరిమానా, వడ్డీల భారం పడుతోందని గుర్తుచేసింది. రుణాల పునర్వ్యవస్థీకరణ కుదరదు.. కేఐపీసీఎల్‌తోపాటు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు వ్యవధిని పెంచడంతోపాటు వడ్డీలను తగ్గించడం ద్వారా వాటిని పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్ఈసీ తిరస్కరించింది. రుణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రుణాల గడువును 2039–40 నాటికి పొడిగించాలని కోరుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.2030 నాటికి 9 శాతం, 2035 నాటికి 18 శాతం, 2036 నాటికి 27 శాతం, 2040 నాటికి 46 శాతం రుణాలను తిరిగి చెల్లించేలా గడువులను పొడిగించాలని కోరింది. అయితే అది కుదరదని గతేడాది నవంబర్ 5న రాసిన లేఖలో ఆర్ఈసీ తేల్చిచెప్పింది. రూ. 30 వేల కోట్ల ఆర్ఈసీ రుణాల్లో 71 శాతాన్ని 2029–30 నాటికి.. మిగిలిన 29 శాతాన్ని 2035 నాటికి చెల్లించాల్సి ఉంది. -
మత్తు ముఠాలూ.. ఈగల్ ఉంది జాగ్రత్త: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు ‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్‌ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’ ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా. కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ఎవరికీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్‌గా ఎదిగారు. రామ్‌చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను. విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు. కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్ ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది.. స్కూళ్ల వద్ద ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం. – రామ్చరణ్ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే.. సినిమాలు, షూటింగ్‌లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్‌తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్‌ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. – విజయ్ దేవరకొండ -
జూరాల భద్రమేనా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిదైన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పాలమూరు జిల్లా వరప్రదాయినిగా నిలుస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడు లక్షలకు పైగా ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ఏళ్ల తరబడి మర మ్మతులు కరువయ్యాయి. సుమారు ఏడాది కాలంగా గేట్ల నుంచి నీళ్లు లీకవుతుండగా, తాజాగా నాలుగో గేట్ ఇనుప రోప్ తెగిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జూరాల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..దెబ్బతిన్న రోప్‌లు, రబ్బరు సీళ్లు..జూరాల ప్రాజెక్ట్‌కు పై నుంచి వచ్చిన నీటిని గానీ, సాగు అవసరాలకు గానీ ఆపరేట్ (పైకెత్తడం) చేయడం ద్వారా దిగువకు నీరు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో మొత్తం 62 గేట్లను అర్ధ చంద్రాకారంల్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిని పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీళ్లు (రాపిడికి గురికాకుండా రక్షణ ఇచ్చేది), అడుగుభాగాన ఒక రబ్బర్ సీల్‌తో పాటు గేటుకు ఇరువైపులా రెండు, కింది భాగాన రెండు ఇనుప రోపులు అమర్చారు. వీటి సాయంతోనే రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకెత్తడం, దించడం జరుగుతుంది. అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం.. లేనిపక్షంలో నిలిపివేయడంలో ఇవి కీలకం. అలాంటి ఎనిమిది గేట్ల ఇనుప రోప్‌లు, 18 గేట్ల రబ్బర్ సీళ్లు దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడ్డాయి.40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. జూరాల ప్రాజెక్టు చరిత్రలో 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా అన్ని గేట్ల్లకు సంబంధించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు సుమారు నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రబ్బర్ సీళ్లు, రోప్‌లు, శాండ్ బ్లాస్టింగ్, గేట్ల బలోపేత, బకెట్ నిర్మాణాల మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టాలి. హైదరాబాద్‌కు చెందిన స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుంది. ఏడాది కాలపరిమితిలో పూర్తిచేసేలా ఒప్పందం కుదిరింది. ఏడాది గడువు ముగిసింది. మరోసారి పొడిగించారు. అయినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సగం శాతం పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. ప్రాజెక్టు పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడిŠజ్ గేట్ల వద్ద వాక్‌వే బ్రిడ్జికి సంబంధించి శాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరద వదలడంతో..తాజాగా గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 98 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. అయితే గురువారం ప్రాజెక్టు నాలుగో గేట్ ఇనుప రోప్ తెగిపోయి కన్పించింది. దీంతో ఆ గేట్ ఎత్తలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం, భద్రత తదితర అంశాలు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. 2009 మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులది పాత పాటే..జూరాల ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం, భద్రతపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా నాలుగో గేట్ రోప్ తెగిన నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులతో పాటు గద్వాల జిల్లా ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా.. గతంలో చెప్పిన సమాధానాలే చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు మెకానికల్ పనులు చేసే ప్రైవేట్ ఏజెన్సీలు తక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా నాలుగేళ్ల కిందట జూరాల మరమ్మతులకు నిధులు మంజూరు అయినప్పటికీ .. కాంట్రాక్టు ఏజెన్సీ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ప్రాజెక్టుకు పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రమాదమేం లేదు..’ అని చెప్పారు. అయితే మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.ముందస్తు వరదతో పనులకు ఆటంకంజూరాల ప్రాజెక్టు గేట్లు, రోప్‌లకు సంబంధించి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈసారి అన్ని రకాల సమస్యలను అధిగమించి మెకానికల్ పనులను వేగవంతంగా చేపట్టాలనుకున్నాం. అయితే ముందస్తుగా వరద రావడం ఆటంకంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. రేడియల్ క్రస్ట్ గేట్లు కావడంతో ఎంత పెద్ద వరద వచ్చినా కొట్టుకుపోయే అవకాశం లేదు.– రహీమొద్దీన్, సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ, జోగుళాంబ గద్వాలఇదీ ప్రాజెక్టు స్వరూపం.. జూరాల ప్రాజెక్టును 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. దీని పొడవు కిలోమీటర్, ఎత్తు 27.80 మీటర్లు. మొత్తం రాతికట్టడమే. ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఎడమ వైపున 1.74 కి.మీలు, కుడివైపున 1.84 కి.మీల మేర ఎర్త్‌డ్యాం నిర్మించారు. మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులతో నిర్మాణం చేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలు
ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం.. ఇప్పుడు ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’గా ప్రసిద్ధి చెందుతోంది. ఇంటిపంట కొత్త పుంతలు తొక్కుతోంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ, విదేశాలకు విస్తరించింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే సుమారు 70 వేల మందికి పైగా టెర్రస్ గార్డెనర్స్ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్లు అంచనా. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్‌లపై ఆరోగ్య సిరులు కురిపిస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆ్రస్టేలియా తదితర దేశాల్లోని తెలుగువాళ్లు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటిపంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్య దాటింది. వందల కొద్దీ వాట్సాప్ గ్రూపులు ఇంటిపంటల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను పరిచయం చేస్తున్నాయి. ఇంటిపంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. స్ట్రాబెర్రీ గ్రూపుతో ఆరంభం.. ‘మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం’ అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో ‘స్ట్రాబెర్రీ’ గ్రూప్ ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను టెర్రస్‌లపై పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హార్కర కన్వీకర్గా, ఈదల సరోజ కో– కన్వీనర్‌గా ఈ గ్రూపు సేవలు మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. స్ట్రాబెర్రీ గ్రూపు వేగంగా విస్తరించింది. ఈ సమూహమే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)గా అవతరించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్ తదితర నగరాలతో పాటు విదేశాలకు విస్తరించింది. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకొనేందుకు అవగాహనను పెంచుకొనేందుకు వేలాది మంది ఆసక్తి కనబర్చారు. సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో పాటు కూరగాయల్లోనే ఎంతో విలువైన ఆగాకర, కాసర దుంపలు, పెన్సిల్ దొండ పాదులు వంటి వెరైటీ మొక్కలను సీటీజీ హైదరాబాద్ గార్డెనర్స్‌కు పరిచయం చేసింది. వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరలలో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు.ఎన్నెన్నో వెరైటీలు.. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (city of terrace gardens) ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కింది. గ్రీన్ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన రెండు రకాల యాపిల్ మొక్కలను పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధ్రువీకరించిన లక్డంగ్ పసుపు హైదరాబాద్‌లో మిద్దెతోటలపై పండుతోంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవ రూప ఎరువులు సిటీ ఆఫ్ గార్డెనర్స్ అందజేస్తోంది. నగర వాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకొనేలా సీటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గార్డెన్ విజిట్స్, ఫార్మ్ విజిట్ ట్రిప్స్, ఫీల్డ్ ట్రిప్స్, సీడ్ బాల్స్ వంటి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పది పాదులు ఉంటే చాలు.. ‘కేవలం పది పాదులకు సరిపడా కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావాల్సినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకొనేలా ప్రత్యేమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు సీటీజీ కో– కన్వీర్ సరోజ. కొత్తగా ఇంటిపంట ప్రారంభించేవారికి శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ శిక్షణ దోహదంచేస్తోందని ఆమె చెప్పారు. కేబీఆర్ పార్కు, పబ్లిక్ గార్డెన్స్, అగ్రి–హార్టీకల్చరల్ సొసైటీ, తెలంగాణ ఉద్యానశాఖ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచాయి. సీటీజీ సమావేశాల్లో రిటర్న్ గిఫ్ట్‌ల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు.చదవండి: తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వున్న గింజలుఇంటింటా ఓ మిద్దెతోట.. నగరంలో మిద్దెతోట (Midde Thota) చాలాకాలంగా విస్తరిస్తోంది. కేవలం కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచితో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ధాన్యం పండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటిపంటల పట్ల అభిరుచి ఉన్నవాళ్లందరిని ఒక గొడుగు కిందకు తెచ్చి ఇంటిపంట సంస్కృతికి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నూతన ఒరవడిని తెచ్చింది.చాలా వెరైటీలు పెంచుతున్నారు హైదరాబాద్‌లో అన్నా వెరైటీ, హెచ్ఆర్ఎం యాపిల్ మొక్కలు పెంచారు. స్ట్రాబెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ దాల్చిన చెక్క ఆల్ స్పైసెస్ ప్లాంట్ వంటివి మన టెర్రస్‌లపై గుబాళిస్తున్నాయి. 2021 వరకు కూడా 5000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే 70 వేల మందికి పైగా చేరారు. – ఈదల సరోజ, కో– కన్వీనర్, సీటీజీ -
డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: యువత డ్రగ్స్‌కు బానిస అయితే దేశ మనుగడ కష్టమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్నారు. ఈరోజు(గురువారం, జూన్ 26) యాంటీ డ్రగ్ డేలో భాగంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. మరి అటువంటి తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.సే నో టు డ్రగ్స్.. సే యస్ టు స్పోర్ట్స్ : పుల్లెల గోపీచంద్సే నో టు డ్రగ్స్‌కు స్వస్థి చెప్పి.. సే యస్ టు స్పోర్ట్స్‌కి నాంది పలికాలన్నారు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్. ‘తెలంగాణలో స్పోర్ట్స్ కి చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి అనే ట్రైల్ ఎప్పుడూ వేయకండి. నా జీవితంలో ఒక్కసారి కూడా తప్పు బాటలో లేను’ అని తెలిపారు.ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే చట్ట రీత్యా నేరమే..డ్రగ్స్‌ను సేవించడమే కాదు.. డ్రగ్స్‌ను తీసుకున్నా నేరమేనన్నారు టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఒక్క గోవా లోనే ఒక్కో హవాలా ఆపరేటర్ 2 రోజుల్లో 50 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను అమ్ముతున్నారు. గతం లో డ్రగ్స్ కన్స్యూమర్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వాళ్ళం, కానీ పాలసీ లో మార్పులు తెస్తున్నామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కస్టడీకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాము. కన్స్యూమర్లును డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తాం’ అని తెలిపారు.రైజింగ్ తెలంగాణ స్పూర్తినిస్తుంది: రామ్ చరణ్కొన్ని సంవత్సరాలు క్రితం స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారనీ విన్నాను. 2014 లో 3, 4 క్లాస్ చదివే పిల్లలకు ఐస్ క్రీమ్ లలో డ్రగ్స్ ఇచ్చారని తెలిసి పేరెంట్స్ ధర్నాలు చేశారు. డ్రగ్స్ అంత డీప్ గా వెళ్లిపోయాయి. ఫిజికల్ వర్క్ అవుట్, ఒక షూటింగ్, కుటుంబంతో క్వాలిటీ టైమ్, స్పోర్ట్స్ ఒక రోజుకి ఇది చాలు. పిల్లలని స్కూల్స్ కు పంపాలంటే భయమేసే పరిస్థితులు ఉండకూడదు.. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బావున్నాయి. ప్రభుత్వానికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మా తోడ్పాటు ఉంటుంది’ అని రామ్‌చరణ్ తెలిపారు.ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదు: విజయ్ దేవరకొండఒక దేశాని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిషత్ నీ నాశనం చేయాలి అనుకుంటున్నారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే కోలుకోవడం కష్టం. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండండి. డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండండిడ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం: దిల్రాజుఇక మీదట ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న సినిమా రంగానికి చెందిన వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తున్నారని, ఇక్కడ కూడా త్వరలో అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
జూబ్లీహిల్స్‌పై కమలదళం గురి..
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. సమీప భవిష్యత్తులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉండగా, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ రెండింటిలో వచ్చే ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే అంచనాతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో గెలవడంతోపాటు జీహెచ్ఎంసీ (GHMC) పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడానికి మార్గం సుగుమం అవుతుందని గుర్తించిన పార్టీ పెద్దలు స్థానిక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ద్విముఖ వ్యూహం పాటిస్తోందని నేతలు పేర్కొంటున్నారు.పార్టీలో కొంతమంది నాయకులు అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరికొంత మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గత 11 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు గల్లీగల్లీలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్, జాతీయ రహదారులు, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలను వివరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో గ్రేటర్లో వార్డులవారీగా ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.దూకుడు పెంచిన నేతలు.. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నగరంలో కలియదిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరు నుంచి హైడ్రా (HYDRAA) కూల్చివేతల వరకు సమయం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మురికివాడల్లో తన బలగాన్ని వేసుకుని పర్యటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలపై పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఇన్నాళ్లు పార్టీకి కంటిలో నలుసుగా కనిపించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సైతం పార్టీ లైన్లోకి వచ్చినట్లేనని కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. గతంలో రాజాసింగ్‌ను బండి సంజయ్ కలిసి సర్దిచెప్పారు. ఇటీవల సంజయ్ వ్యాఖ్యలను రాజాసింగ్ బలపరుస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్భానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పార్టీలో కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.జూబ్లీహిల్స్‌పై గురి.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చెందడంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండేలా ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని అప్రమత్తం చేశారు. దీంతో బీజేపీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతోంది.చదవండి: జూబ్లీహిల్స్‌లో గెలిచే నాయకుడి కోసం హస్తం పార్టీ సర్వే -
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో పీజీఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ అరుణ కుమారి విడుదల చేశారు. 25, 335 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 22,983 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 16 నుంచి 19 వరకు పరీక్షలు జరిగాయి. ఉత్తీర్ణత శాతం 90.72 శాతంగా నమోదైంది.ఆర్కిటెక్చర్ ప్లానింగ్ విభాగంలో తురియా దీక్షిత్, ఏరోస్పెస్ ఇంజినీరింగ్‌లో శివ చరణ్, బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో హరిణి, బయో టెక్నాలజీలో తనుజా, సివిల్ ఇంజినీరింగ్‌లో వెంకటేష్, కెమికల్ ఇంజినీరింగ్‌లో అశుతోష్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షభిస్తా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో శివ ప్రసాద్ మొదటి ర్యాంక్‌లు సాధించారు.ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మహేష్, ఇన్స్ట్రునెంటేషన్ ఇంజినీరింగ్‌లో చంద్రసేన్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో ఉజ్వల, ఫుడ్ టెక్నాలజీలో నిఖిల్ కుమార్, జియో ఇంజినీరింగ్ జియో ఇన్ఫార్మటిక్స్‌లో డిలైట్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో సతీష్, మైనింగ్ ఇంజినీరింగ్ లో అనిల్, మెటాలర్జికల్ ఇంజినీరింగ్‌లో శ్రీ హర్షిణి, నానో టెక్నాలజీలో సాయి కృష్ణ, ఫార్మసీలో షేక్ అర్షియా కౌనేను, టెక్స్టైల్స్ టెక్నాలజీలో వర్ష మొదటి ర్యాంక్‌లు సాధించారు. -
TG: ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఒకే రోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 3,212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. -
తెలంగాణ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపించివేశారు. ఆర్టీఏ బ్రోకర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అవినీతికి పాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై ఏసీబీ రెండోసారి సోదాలు చేపట్టింది. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్స్ ద్వారా జరుగుతున్న పలు అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. అక్రమాలకుపాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై డేగ కన్ను వేసిన ఏసీబీ.. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన ఆర్టీఏలపై దృష్టిసారించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లను సైతం ఏసీబీ విచారిస్తోంది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో ఇద్దరు క్లర్క్‌లతో పాటు 10 మంది ఏజెంట్లు, ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది. -
కటకటాల్లోకి స్వీటీ తెలుగు కపుల్
హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోతున్న ‘స్వీటీ తెలుగు కపుల్’కు.. సడన్ ఎంట్రీతో పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నడిచిన ఈ లైవ్ సెక్స్ దందా బాగోతంలోకి వెళ్తే..సాక్షి, హైదరాబాద్: నగరంలో లైవ్ సెక్స్ దందా వెలుగు చూసింది. అంబర్‌పేటలో ఓ జంట.. తమ శృంగార కార్యకలాపాలను ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వ్యూయర్స్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్లో ఈ జంట.. ఆ ప్రైవేట్ లింక్స్‌ను గత నాలుగు నెలలుగా పంచుతూ ఈ దందా నడిపిస్తోంది. హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోసాగింది. నగ్న వీడియోలతో పాటు తమ శృంగార వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరింది.దీంతో అంబర్‌పేటలోని ఆ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ టీం రైడ్ చేసింది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ బూతు బాగోతం కోసం తాము ఉంటున్న ఇంటిపైన పరదాలతో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనపర్చుకున్నారు. టాస్క్‌ఫోర్స్ టీం ఈ దంపతులను అంబర్‌పేట పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వాళ్ల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37)కు తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకుంటున్న నిఖిల్ మదన్.. అదే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
వీడియో వైరల్: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, వికారాబాద్: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. -
రేవంత్.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.‘‘అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు.‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. -
భూముల ధరలు ఎంత పెంచొచ్చు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలను పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ప్రాంతంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఏ ప్రాంతంలో ఎంత మొత్తం ధరలు పెంచేందుకు వీలుంటుందనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల రిజిస్ట్రార్లను ఇప్పటికే ఆదేశించగా, అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విలువకు, మార్కెట్ విలువకు ప్రస్తుతం భారీ వ్యత్యాసం ఉంది. దీన్ని తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రాంతంలో భూముల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.ప్రతిపాదనల్లో కొన్ని..ట్రిపుల్ ఆర్ ప్రాంతంలోని సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో రిజిస్ట్రేషన్ రేటు చదరపు గజానికి రూ.1,700 (కమర్షియల్), రూ.1,100 (రెసిడెన్షియల్) ఉంది. దీనిని కమర్షియల్ ఏరియాలో చ.గజానికి రూ.3,500ల వరకు, రెసిడెన్షియల్ ఏరియాలో రూ.2,400 వరకు పెంచాలని ప్రతిపాదనలు పంపారు. అంటే ఈ ప్రాంతంలో సుమారు 200 శాతం వరకు భూముల ధరలు పెంచాలని భావిస్తున్నారు.సంగారెడ్డి జిల్లా కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెల, పాఠిఘనాపురం, కర్దనూరు, ముత్తంగి, పోచారం, పటేల్‌గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్, దయార, బొల్లారం వంటి గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ధరను 300 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు. రామచంద్రాపురంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ రేటు చదరపు గజానికి రూ.22,500 ఉంది. దీన్ని రూ.50 వేల వరకు ప్రతిపాదిస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అపార్ట్మెంట్లలో ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.2,250 వరకు రిజిస్ట్రేషన్ రేటు ఉంది. దీనిని రూ.3,500ల వరకు పెంచాలని భావిస్తున్నారు. -
భార్య ‘ఖులా’ విడాకులు కోరవచ్చు
సాక్షి, హైదరాబాద్: ఖులా విడాకులు కోరే సంపూర్ణ హక్కు ముస్లిం భార్యకు ఉంటుందని, భర్త డిమాండ్‌ను అంగీకరించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహ రద్దుపై న్యాయస్థానం ముద్ర మాత్రమే వేస్తుందని, దానికి కట్టుబడటం ఇరుపక్షాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తన భార్యతో వివాహాన్ని రద్దు చేయడంలో సదా ఈ హక్ షరాయ్ కౌన్సిల్ నిర్ణయాన్ని సమర్థించిన కుటుంబ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం సమగ్ర తీర్పును వెలువరించింది. భార్య వివాహ బంధాన్ని కొనసాగించకూడదనుకుని ముఫ్తీని సంప్రదించి ప్రైవేట్‌గా పరిష్కరించుకునే విధానమే ‘ఖులా’. షరియత్ ఆధారంగా ముఫ్తీ సలహా (ఫత్వా) ఇస్తారు. ఒకవేళ ప్రైవేట్‌గా పరి ష్కారం కాకపోతే.. వ్యాజ్యం దాఖలైతే న్యాయమూర్తి షరియత్ ఆధా రంగా తీర్పు ఇవ్వవలసి ఉంటుంది. ఈ కేసులో భర్త వేధింపులు భరించలేక భార్య ఖులా కోరారు. భర్త అంగీకరించకపోవడంతో సదా ఈ హక్ షరాయ్ కౌన్సిల్ ద్వారా ఖులానామా (విడాకుల పత్రం) పొందారు. దీనిని భర్త ఫ్యామిలీ కోర్టులో సవాల్ చేసినా ఊరట దక్కలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఖులా ద్వారా విడాకులు పొందవచ్చన్న ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. మెహర్ (కట్నం) మొత్తాన్ని, అందులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడంపై చర్చలు జరపడం తప్ప ఆమె డిమాండ్‌ను తిరస్కరించే హక్కు భర్తకు లేదని కోర్టు అభిప్రాయపడింది. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్‌పేట లాడ్జ్‌కి తీసుకెళ్లి..
హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్ పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్‌నగర్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్ ద్వారా అయిన భరత్‌రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్‌పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్‌రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్నగర్లోని భరత్‌రెడ్డి ఇంటికి వెళ్ళగా దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు. -
మద్యం తాగించి ఈవెంట్ డ్యాన్సర్‌పై లైంగిక దాడి
గచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం..సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పని చేసే ఓ యువతి (23) గచ్చిబౌలి జంక్షన్‌లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాష్ (32) అదే వైన్ షాపు వద్దకు వచ్చాడు. మద్యం తాగుతున్న యువతిని పరిచయం చేసుకొని..ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేవగా..ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి మోసం చేశావంటూ ప్రకాష్ తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్ తన మొబైల్లో తీసిన యువతి న్యూడ్ ఫొటోలు చూపించాడు. ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు. అయినా యువతి మాత్రం తాను ఇక్కడ ఉండనని గొడవ పడి ఫ్రెండ్‌కు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నేటి నుంచే గోల్కొండ కోట బోనాలు
గోల్కొండ: గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు. మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా అలంకరించిన దేవతా విగ్రహాల వాహనాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. జానపద కళాకారులు ప్రత్యేకంగా పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరుస్తారు. గోల్కొండ ప్రధాన రహదారి నుంచి తొట్టెల ఊరేగింపు వైభవంగా ప్రారంభమవుతుంది. కోటలోని జగదాంభిక, మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాధిగా భక్తులు తరలిరానున్నారు. వీరికి దారి పొడవునా దేవాదాయ శాఖ వారు స్వాగత వేదిక ఏర్పాట్లు చేశారు. ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు.. బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి విన్యాసాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి వీక్షిస్తుంటారు. ఓవైపు పోతరాజుల గీంకారాలు, కొరఢా చప్పుళ్లు మరోవైపు శివసత్తుల పునకాలతో మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకోనున్నాది. మెట్టు మెట్టుకు బొట్టు.. బుధవారం అమావాస్యను పురస్కరించుకుని కోట మెయిన్ గేటు నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను మహిళలు బొట్టు పెట్టి అలంకరించారు. నగరం నలుమూలల నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో మెట్లతో పాటు మెట్లను ఆనుకుని ఉన్న కోట గోడలకు సైతం బొట్లు పెట్టి అలంకరించారు. -
ముందొచ్చింది.. ముఖం చాటేసింది!
నైరుతి రుతుపవనాల కదలిక మందగించింది. సాగుకు కీలకమైన సమయంలో రాష్ట్రంలో వానలకు బ్రేక్ పడింది. సీజన్‌కు ముందు ఏప్రిల్, మే నెలల్లో భారీగా పడిన వర్షాలు.. తీరా వానాకాలం సీజన్ మొదలయ్యాక ముఖం చాటేశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి బుధవా రం (25వ తేదీ) నాటికి రాష్ట్రంలో సగటున 10.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, 6.72 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 36 శాతం లోటు నమోదు కావడం గమనార్హం.వర్షపాత లోటు ఇలా..సూర్యాపేట జిల్లాల్లో సాధారణం కంటే 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 72 శాతం, హైదరాబాద్ జిల్లాలో 70 శాతం లోటు వర్షపాతం ఉంది.పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో 60 శాతం పైబడి లోటు వర్షపాతం నమోదైంది.5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురిశాయి. 18 జిల్లాల్లో లోటు, మరో 10 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం, ములుగు, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి.పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.కారణాలు ఎన్నో..సాధారణంగా నైరుతి సీజన్లో వర్షపాతానికి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు కీలకం. కానీ, ఈ ఏడాది సీజన్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందుకే ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షాలు ఆశించినంతగా లేవు. ఉష్ణోగ్రతలు పెరగటంతో వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోతకు కారణమైంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఈ నెలలో వర్షాల నమోదు ఆశించినంతగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు రెండుమూడు రోజులకోసారి వర్షాలు కురవాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లో ఏకంగా ఏడు నుంచి పన్నెండు రోజులకు పైబడి డ్రై స్పెల్స్ నమోదయ్యాయి.జూలై నెల వానలే కీలకం..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా లేవు. సాధారణంగా ముందస్తుగా రుతుపవనాల రాకతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారం ముందే వచ్చి, మొదట్లో అత్యంత చురుకుగా కదిలినా.. ఆ తర్వాత కొంత అంతరం ఏర్పడింది. ఈ అంతరంతో వర్షాలకు కాస్త విరామం వచ్చినట్లైంది. కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి వర్షాలు ఆశించినంతగా ఉంటాయని అంచనా వేశాం. జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రావణిహైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి -
రీల్స్ మోజులో దుస్సాహసాలు!
సాక్షి, సిటీబ్యూరో: కంచన్‌బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రి మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. బేగంపేట–ప్రకాష్ నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేశారు. రేసింగ్‌తో పాటు వీళు చేసిన ఫీట్లు సోషల్‌మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. శంషాబాద్–రాజేంద్రనగర్ మార్గంలో ఈ–బైక్‌పై ప్రయాణించిన ఎనిమిది మంది రహదారిపై ఫీట్లు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి చేసిన ఈ దుస్సాహసం దాని ద్వారానే పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ...ఇవన్నీ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన స్టంట్లు. అయితే వీరి దృష్టిలో పడకుండా అనునిత్యం నగరంలోని అనేక ప్రాంతాల్లో యువత రెచ్చిపోతున్నారు. వాహనాలపై తిరుగుతూ ప్రమాదకరమైన స్టంట్లు, ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సోషల్‌మీడియా ప్రభావంతో రీల్స్ చేసి, లైక్స్ర్స్ పొందడానికి ఎక్కువగా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ... నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్‌తో పాటు రాజేంద్రనగర్, రాయదుర్గం, మాదాపూర్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, ఔటర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన సరీ్వస్ రోడ్డులోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు. జరిగిన తర్వాతే పట్టుకుంటున్నారు... ఈ స్టంట్ల విషయంలో పోలీసులు అవసరమైన స్థాయిలో ‘ముందస్తు’ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శ ఉంది. ఎప్పుడో అడపాదడపా మినహా ఎక్కువ సందర్భాల్లో ఫీట్లు పూర్తయిన తర్వాతే అది పోలీసుల దృష్టికి వెళ్తోంది. ఈ ఫీట్లు, స్టంట్లలో ఒకే వాహనంపై ఎక్కువ మంది ప్రయాణించడం, వెనుక చక్రంతో రోడ్డుపై రాపిడి కలిగిస్తూ పొగ వచ్చేలా చేయడం (వీలింగ్), వాహనం స్టాండ్‌తో పాటు ఇతర భాగాలు రోడ్డుకు తాకేలా చేసి, వేగంగా దూసుకుపోతూ నిప్పు రవ్వలు రప్పించడం (స్పార్కింగ్), ఆటోను ఓ వైపునకు ఎత్తేసి ప్రమాదకరంగా నడపటం వంటివి ఎక్కువగా జరుగున్నాయి. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన తర్వాతే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. దీంతో ఆయా వాహనాల నెంబర్ల ఆధారంగా ముందుకు వెళ్తున్న పోలీసులు వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ల సాయంతో నిఘా ఉంచితేనే... స్టంట్లు చేయడం పూర్తయిన తర్వాత వీడియోలు, సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యుల్ని పట్టుకోవడంతో ఫలితం లేదనే వాదన వినిపిస్తోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని, ఈ నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాలను ముందే గుర్తించి అణిచివేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం స్టంట్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ సిబ్బందితో పాటు డ్రోన్ల సాయంతో నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ నియంత్రణకు రెండు డ్రోన్లు వాడుతోంది. వీటిని రేసులు, స్టంట్ల నిరోధానికి వాడాలని కోరుతున్నారు. ఈ డ్రోన్లు గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతాయని, ‘28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి ద్వారా స్టంట్లకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్‌కు సంబంధించి బాధ్యులపై బీఎన్ఎస్తో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. -
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
జీడిమెట్ల(హైదరాబాద్): ప్రియుడు, అతని సోదరుడితో కలిసి పదో తరగతి బాలిక కన్నతల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. బుధవారం షాపూర్‌నగర్‌లో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరే‹Ùరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారిణి. అంజలి తన ఇద్దరు కుమార్తెలు (16), (12)లతో కలిసి షాపూర్‌నగర్‌లోని హెచ్ఎంటీ సొసైటీలో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)తో ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలుత అంగీకరించినా.. ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు చెబుతూనే ప్రేమ విషయంలో మందలించేది. తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు.. ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక తన సోదరిని తీసుకుని కట్టంగూర్కు వెళ్లి నాలుగు రోజులు ఉండి వచి్చంది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూర్‌లోని ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురుని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లి అంజలికి అప్పగించారు. అంజలికి అదే శాపమైంది.. ఈ నెల 22న తన చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షాపూర్‌నగర్ వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. దీనికి శివ అభ్యంతరం చెప్పడంతో.. అయితే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ... పదో తరగతి చదువుతున్న తన తమ్ముడి (16)ని తీసుకుని గత సోమవారం సాయంత్రం షాపూర్‌నగర్ వచ్చాడు. బాలిక ఇంటి బయట కాపలా కాయగా.. శివ, అతని సోదరుడు లోపలికి వెళ్లి అంజలి మెడకు చున్నీతో గట్టిగా ఉరి బిగించి హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో మంగళవారం తెల్లవారుజామున శివను కట్టంగూర్‌లో, అతని సోదరుడిని, బాలికను నగరంలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంజలిని తామే చంపినట్లు ఒప్పుకొన్నారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మొదటి నుంచీ తల్లి అంటే కుమార్తెకు గిట్టేది కాదు.. నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే గిట్టేది కాదు. 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ అప్పట్లోనే పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచంపల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. మూడు నెలల క్రితమే బాలిక తల్లి వద్దకు వచి్చనట్లు తెలుస్తోంది. బాలికకు మొదటి నుంచీ తల్లితో శత్రుత్వమే అని.. తరచూ తల్లి తరచూ తనపై చేయి చేసుకొంటోందని బాలిక తన గోడును స్నేహితులతో వెళ్లబోసుకునేదని తెలిసింది. కేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, సిబ్బందిని డీసీపీ అభినందించారు.అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి జీడిమెట్లలో అంజలి హత్యోదంతం కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమరి్థంచుకుంది. మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి.. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకొచి్చంది. తల్లికి తలకొరివి పెట్టిన చిన్నకూతురు కేసముద్రం: జీడిమెట్లలో హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో జరిగాయి. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో పాటు, వివిధ పారీ్టలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం తల్లి మృతదేహానికి చిన్న కుమార్తె మనస్విని తలకొరివి పెట్టింది. -
లాసెట్‌లో 30,311 మంది ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ లాసెట్)లో 30,311 (66.46 శాతం) అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ లాసెట్‌కు మొత్తం 57,715 మంది దరఖాస్తు చేయగా, 45,609 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 30,311 మంది అర్హత సాధించారు. లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి బుధవారం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే.మహమ్మూద్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82.19 శాతం ఉత్తీర్ణత సాధించగా, నిజామాబాద్ 59.24 శాతంతో ఆఖరి స్థానంలో ఉందని బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని కోర్సులకు కలిపి 31 కాలేజీలున్నాయని, ఇందులో 8,680 సీట్లు ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... బోథ్: తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఐదేళ్ల లా కోర్సులో టాప్ ర్యాంకు సాధించినట్టు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రుతిక తెలిపారు. లా చదవాలనే ఆకాంక్షతోనే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యానని చెప్పారు. సివిల్స్ టార్గెట్ సిద్దిపేటజోన్: మూడేళ్ల లా కోర్సులో మూడో ర్యాంకు సాధించిన సిద్దిపేటకు చెందిన మాడుగుల శిరీష్ శర్మ సివిల్స్ సాధించడమే తన టార్గెట్ అని చెప్పారు. బీటెక్ పూర్తిన చేసిన శిరీష్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే భాగంగానే లాసెట్ రాశాడు. ఆయన తండ్రి సిద్దిపేట రూరల్ ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. -
కీసర అధికారికి బాసర గుడి బాధ్యతలు
మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ఈఓగా పనిచేస్తున్న సుధాకరరెడ్డికి ఇటీవల బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు దేవాలయాల మధ్య దూరం దాదాపు 240 కి.మీ. నగరంలోని చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈఓగా ఉన్న అన్నపూర్ణకు తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ బాధ్యతలను అప్పగించారు. 100 కి.మీ.దూరంలో ఉన్న రెండు దేవాలయాలను నిర్వహించటం చాలా సులభమనే భావనలో దేవాదాయశాఖ ఉన్నట్టుంది. సాక్షి, హైదరాబాద్ : సమీపంలో ఉన్న అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించటం సహజమే, కానీ..వందల కి.మీ.దూరంలో ఉన్న కార్యాలయాల్లో విధుల నిర్వహణ ఎలా సాధ్యమో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. సిబ్బంది కొరతతో ఒకే అధికారికి పలు దేవాలయాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. పొరుగు దేవాలయాల బాధ్యతలు చూడటం కొంత సులభమే కానీ, వందల కి.మీ.దూరంలో ఉన్న దేవాలయాల పాలనావ్యవహారాల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఆ రెండు దేవాలయాల మధ్య ఆరేడు గంటల ప్రయాణ సమయం ఉంటోంది. వారంలో ఒకటి రెండు సార్లకు మించి వెళ్లటం సాధ్యం కావటం లేదు. ఓ దేవాలయానికి వెళ్లినప్పుడు మరో దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే ఏడెనిమిది గంటల తర్వాత గానీ చేరుకోలేని పరిస్థితి. దీంతో ఏ దేవాలయంపైనా వారు సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా రెండు దేవాలయాల్లో పాలన పడకేస్తోంది. ఇది నేరుగా ఆలయ పురోగతి, అక్కడి కైంకర్యాలు, భక్తుల వసతులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్సవాల సమయంలో, మరో దేవాలయాన్ని పూర్తిగా విస్మరించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఆ సమయంలో రెండో దేవాలయంలో అక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయి.కమిషనర్‌కూ తప్పని ‘అదనపు’తిప్పలుభక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రత్యేక రోజుల్లో 50 వేల వరకు చేరుకోవటంతో యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాలకమండలిని ఏర్పాటు చేసి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమించాలనుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఓ అధికారిని నియమించకుండా దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న వెంకట్రావుకే అదనపు బాధ్యత అప్పగించారు. దీంతో ఆయన వారంలో రెండుమూడు రోజులు యాదగిరిగుట్టలో ఉండాల్సి వస్తోంది. ఆ సమయాల్లో కమిషనర్ కార్యాలయంలో పనులు నిలిచిపోతున్నాయి. ఆయన కమిషనర్ కార్యాలయంలో ఉంటే, యాదగిరిగుట్టలో లోటు కనిపిస్తోంది. అధికారి స్థానికంగా ఉంటే సిబ్బందిలో భయభక్తులు ఉంటాయని, పూర్తిస్థాయి అధికారి లేకపోతే ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.» ఇటీవల యాదగిరిగుట్టలో కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎలాంటి జంకూ లేకుండా దేవాలయానికి సంబంధించిన చింతపండు బస్తాలను తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఇలాంటి చోరీలు ఎన్ని జరుగుతున్నాయో అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. » గతంలో మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయాలకు జాతర సందర్భంలో తప్ప మిగతా రోజుల్లో భక్తుల సంఖ్య అంత ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సాధారణ రోజుల్లో కూడా పోటెత్తుతున్నారు. దీంతో అక్కడ కచ్చితంగా ఈఓ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ప్రస్తుతం ఆ దేవాలయానికి ఖమ్మం ఏసీ వీరస్వామిని నియమించారు. ఆ అసిస్టెంట్ కమిషనర్ పోస్టు కూడా ఇన్చార్జ్ నియామకమే కావటం విడ్డూరం.ఆదిలాబాద్ జిల్లా సహాయ కమిషనర్‌గా ఉన్న విజయరామారావుకు ఇటీవల మెదక్ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 150 కి.మీ. -
ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బాధితుల్ని సాక్షులుగా పరిగణిస్తూ వారినుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వాళ్లు కచ్చితంగా న్యాయస్థానం వరకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయో చూపిస్తోంది. నేతలతో పాటు వారి కుటుంబీకులు, అనుచరుల సంభాషణల ఆడియోలను వినిపిస్తూ, సంబంధిత పత్రాలను చూపిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్‌రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. రాజకీయ నాయకులతో పాటు వారి సంబంధీకుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ ఆ ఆడియోలను ‘పెద్దలకు’ షేర్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. ప్రస్తుతం సిట్ సాక్షులకు ఈ ఆడియోలను వినిపించడంతో పాటు వివిధ లేఖల్ని చూపిస్తోంది. ఆ తర్వాతే వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వారి వాంగ్మూలం నమోదు చేస్తోంది. కొందరు సాక్షులు, నిందితుల్ని ఎదురెదురుగా పెట్టి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. అప్పటి ప్రభుత్వం దిగజారి వ్యవహరించింది..ప్రణీత్‌రావు బుధవారం మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో పాటు కామారెడ్డికి చెందిన వివిధ పార్టీల నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా ఫహీమ్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఫోన్ ట్యాప్ అయిందని డీసీపీ నుంచి సమాచారం అందింది. నా ఫోన్‌తో పాటు నా భార్య, డ్రైవర్ ఫోన్లనూ ట్యాప్ చేశారు. అధికారం కోసం నీచానికి దిగజారారు. బహుశా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే ఎన్నికల ముందు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు..’ అని చెప్పారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచానికి దిగజారింది. తల్లి, పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది..’ అని చెప్పారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం వరకు దాదాపు 235 మంది వాంగ్మూలాలను సిట్ నమోదు చేసినట్లు తెలిసింది. -
సీఎం రేవంత్‌రెడ్డికి టోనీ బ్లెయిర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ తయారీ పట్ల సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ విజన్‌ను ప్రశంసిస్తూ తాజాగా టోనీ బ్లెయిర్ ఆయనకు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన సీఎం రేవంత్.. ఆయనకు రైజింగ్ తెలంగాణ విజన్ ఉద్దేశాలను వివరించారు. విజన్‌లో భాగంగా 2024 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. విజన్ రూపకల్పన, అమలుకి సహకారం అందించడం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐజీసీ) సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం, టీబీఐజీసీలు పరస్పర అవగాహన లేఖలు (లెటర్ ఆఫ్ ఇంటెంట్)ను మార్పిడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రైజింగ్ తెలంగాణ విజన్ లక్ష్యాల సాధనకు టీబీఐజీసీ ప్రభుత్వానికి సహకరిస్తుందని టోనీ బ్లెయిర్ తెలిపారు. విజన్–2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. -
డెడ్‌లైన్.. సెప్టెంబర్ 30
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీ అందిన 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కారుకు స్పష్టం చేసింది. అప్పటి నుంచి 60 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. గత పంచాయతీల కాల పరిమితి ముగిసి 14 నెలలు దాటిందంటూ, అయితే ఇప్పుడు ‘ఆలస్యం’పై మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని హైకోర్టు పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టి ఆయా పక్షాల వాదనల అనంతరం గతంలో తీర్పు రిజర్వు చేసిన జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు. ‘ఆలస్యం’ జోలికి వెళ్లాలనుకోవడం లేదు..‘గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. రాజ్యాంగం ప్రకారం పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆ మేరకు పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం. పంచాయతీల పదవీకాలం ముగిసి 14 నెలల కంటే ఎక్కువ సమయమే గడిచింది. అయితే ఆలస్యం సమర్థనీయమా.. లేదా.. అనే అంశాల్లోకి ప్రస్తుతం వెళ్లదలుచుకోవడంలేదు. వార్డు సభ్యులు, సర్పంచుల సీట్ల రిజర్వేషన్లు సహా ఎన్నికల ప్రకియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం సముచితమని కోర్టు భావిస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఐదు దశల ప్రక్రియను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం..’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ఇలా..అంతకుముందు ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో 5 దశలు ఉండగా, 3 దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రెండు దశలను 20 రోజుల్లో పూర్తి చేస్తాం. పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బీసీ కులాల వారీగా రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు డేటా సిద్ధంగా ఉంది..’ అని చెప్పారు. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రిజర్వేషన్లు తేలకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ఎన్నికల నిర్వహణపై మేం నిర్ణయం తీసుకోలేం. ఎన్నికల ప్రక్రియకు సర్కార్ అంగీకరించిన నాటి నుంచి మాకు రెండు నెలల సమయం అవసరం..’ అని నివేదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఎస్ఈసీ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు. -
అంతా మీ ఇష్టమేనా..?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అధికారులే అడ్డు పడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయలోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని ఆయన అన్నట్టు సమాచారం. అసలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను ఎందుకు ఆపుతున్నారో చెప్పా లని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా సాంకేతిక విద్యామండలి, విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్‌పై సీఎం సీరియస్ అవ్వడంపై అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం... సమావేశంవివరాలు ఇలా ఉన్నాయి. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఉన్నతవిద్య అధికారులు అడ్డుపడటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఉన్నత విద్యామండలిపై నిందలెందుకు ? ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఇప్పటి వరకూ అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా నిర్వహించారని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు. కేవలం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ‘మండలి అధికారులు ఇష్టానుసారం చేస్తున్నారు’అంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించేలా చేయడం సరికాదని అన్నట్టు సమాచారం. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానని, ఆయన సంస్కరణలపై పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది. సాంకేతిక విద్య అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సెలింగ్ చేపడతామని ఉన్నత విద్యామండలి చెప్పడమే నేరంగా భావించడం సరికాదని సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై కమిటీ వేయాలనే ప్రభుత్వ ఆలోచన కూడా కౌన్సెలింగ్ జాప్యానికి కారణమన్న అధికారుల వాదనతో సీఎం ఏకీభవించలేదని తెలిసింది. అధికారులంతా ఒకసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడిబాటపై అసంతృప్తి బడిబాటపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మందిని చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాట ఆశించిన పురోగతి సాధించలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులే ఈ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నారని, ఇక క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందన ఉంటుందని సీఎం అన్నట్టు సమాచారం. ప్రభుత్వ బడులను అదనపు కలెక్టర్లు సందర్శించాలి : సీఎం ప్రతీజిల్లా అదనపు కలెక్టర్ వారంలో రెండుసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమావేశ వివరాలపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 48 వేల మంది చేరినట్టు సీఎం తెలిపారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గదులను నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల వంట చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా ఇంటర్లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు. -
మొగులు.. దిగులు..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్ ముగిసిపోతున్నా.. సరైన వర్షాలు లేక లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కురిసిన తొలకరి జల్లులకు మురిసి విత్తనాలు వేసిన రైతులు.. కొన్నిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కులు చూస్తున్నారు. ఆకాశంలో మబ్బులు కన్పించగానే ఆశగా చూస్తున్నారు గానీ ఫలితం ఉండటం లేదు. వర్షాలు పడకపోవడం..ఈ సీజన్లో సాగయ్యే పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలపై ఆధారపడి చాలా జిల్లాల్లో వేసిన ఆయా పంటల విత్తనాలు అనేక ప్రాంతాల్లో మొలకెత్తలేదు. ముఖ్యంగా పత్తి, మక్క మొలకలు రాలేదు. కొన్నిచోట్ల మొలిచినా నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి వృధా అవుతుండగా..అనేకచోట్ల రైతులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూ రెండోసారి, మూడోసారి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్ని, భూమి చదును చేసి, విత్తనాలు వేసిన ఒక్కో పత్తి రైతు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. 8 జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 190 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, 90 మండలాల్లో వర్షపు చుక్క పడలేదు. ఈ జిల్లాల్లో 60 నుంచి 72 మిల్లీ మీటర్ల వరకు లోటు వర్షపాతం ఉండగా, ముందస్తు వానలతో పలు మండలాల్లో పత్తి, మక్కలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు వర్షాలు పడిన తర్వాత వేద్దామని చూస్తుండగా, ఆలస్యంగా వేసిన విత్తనాలతో పంట దిగుబడి రాదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తి, మక్క పంటల పరిస్థితి దారుణం రాష్ట్రంలో 70 నుంచి 100 శాతం వర్షాభావ పరిస్థితుల కారణంగా.. వర్షాధార పంటలుగా వేసిన పత్తి, మక్క ఇతర మెట్ట పంటల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో కేవలం 0.3 ఎంఎం వర్షం కురిసింది.. అంటే ఒక్క తుంపర కూడా లేదని నివేదికలు చెప్తున్నాయి. ఇదే పరిస్థితి చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్‌పహాడ్, చివ్వెంలలో ఉంది. ఖమ్మంలో కామేపల్లి, యాదాద్రి భవనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, కనగల్, పెద్దవూర, కరీంనగర్లో చిగురుమామిడి, కరీంనగర్ రూరల్, వేములవాడ, సంగారెడ్డిలో పుల్కల్, జిన్నారం, మెదక్‌లో మనోహరాబాద్, నార్సింగ్, సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, మిరుదొడ్డి, హుస్నాబాద్, జనగామ జిల్లాలో కొడకండ్ల, జఫర్ఘడ్, వరంగల్‌లో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లిలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో కమలాపూర్, ఐననోలు, మహబూబాబాద్ జిల్లాలో గార్ల, గూడూరు, కేసముద్రం, చిన్నగూడూరు, పెద్దవంగర, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, కమాన్‌పూర్, సుల్తానాబాద్, జగిత్యాలలో బీఆర్‌పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనపూర్, గోరి కొత్తపల్లి, మహదేవ్పూర్, టేకుమట్ల, మంచిర్యాల రూరల్, భద్రాద్రిలో పినపాక, ఇల్లెందు, గుండాల మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కన్నా తక్కువ పత్తి సాగు రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది ఈ సమయానికి 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అది ఈసారి కేవలం 29.89 లక్షలకే పరిమితమైంది. వేసిన పంటల్లో అధికంగా పత్తి 22.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా సుమారు 9 లక్షల ఎకరాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే సాగు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 2.75 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో సగటున 1.10 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఇంకా విత్తనాలు వేయలేదు. అత్యధిక వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సూర్యాపేటలో గత సంవత్సరం ఇప్పటివరకు 46 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి కేవలం 7 వేల ఎకరాల్లో సాగు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి సాగు గత ఏడాదితో పోల్చుకుంటే సగం కూడా కాలేదు. మిగతా పంటల పరిస్థితీ ఇదే.. పత్తితో పాటు మొక్కజొన్న, జొన్నలు, కందులు, సోయాబీన్ విత్తనాలు వేసిన రైతులు కూడా వానలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుతడి పంటలైన ఇవి మొలకెత్తడానికి, మొలకెత్తిన విత్తనాలు మొక్కలుగా పెరగడానికి వర్షం తప్పనిసరి. అయితే విత్తనాలు నాటిన తరువాత వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల మొక్కలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం – 2025 సాగు ప్రణాళిక (ఎకరాలలో...) – సాగు అంచనా :1,32,44,305 – గతేడాది ఈ సమయానికి సాగు: 38,06,097 – ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు: 29,89,562 – పత్తి సాగు అంచనా: 4893016 – గత ఏడాది ఇదే సమయంలో: 2858337 – ఇప్పటివరకు సాగైన పత్తి విస్తీర్ణం: 22,84,474 – మొక్కజొన్న సాగు అంచనా : 5,21,206 – గత ఏడాది ఇదే సమయంలో: 1,25,235 – ఇప్పటివరకు సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 1,17,309 లక్ష నష్టం..ఇంకో లక్ష అప్పు చేయాల్సిందే ఇతను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన కౌలు రైతు బాల్నె చిన్న కొమురయ్య. రోహిణి కార్తెలో కురిసిన తొలకరి వర్షం నేపథ్యంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.30 వేలకు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి విత్తనాలు నాటాడు. భూమి దున్నేందుకు, విత్తనాలకు మరో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవలేదు. దీంతో 20 శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా వర్షం లేకపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ఎండిపోతున్నాయి. దీంతో వర్షాలు పడి కాలం కలిసొస్తే మళ్లీ భూమి దున్ని విత్తనాలు పెట్టాల్సిందేనని, మళ్లీ లక్ష రూపాయల అప్పు వెతుక్కోవాల్సిందేనంటూ కొమురయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కజొన్న మొలకెత్తలే.. ఈ ఫొటోలోని మహిళా రైతు పేరు పావని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్త తండాకు చెందిన ఈమె ఎకరం పొలంలో పత్తి, మరో ఎకరంలో మొక్కజొన్న విత్తనాలు పెట్టింది. విత్తనాలు వేసి 25 రోజులు దాటినా చినకు పడకపోవడంతో రెండు పంటలు మొలకెత్తలేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల పెట్టుబడి పెట్టింది. బుధవారం కొద్దిగా కురిసిన వానతో అక్కడక్కడ కొన్ని పత్తి విత్తనాలు మొలకెత్తాయి. అయితే ఇప్పటివరకు ఎండిన నేపథ్యంలో 70 శాతానికి పైగా సాల్లలోనీ పత్తి మొక్కలు పీకేసి మళ్లీ గింజలు పెడదామని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికి రెండుసార్లు నాటినా.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బానోతు వీరన్న తనకు ఉన్న రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తాడు. దున్నినందుకు, విత్తనాలకు, కూలీలకు సుమారు రూ.20 వేలు ఖర్చయింది. ఆ తర్వాత తేలికపాటి జల్లులు తప్ప వర్షాలు పడలేదు. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నాలుగు రోజులు క్రితం మళ్లీ దుక్కి దున్ని మరోసారి విత్తనాలను కొనుగోలు చేసి కూలీలతో నాటించాడు. గత మూడు రోజులుగా తేలికపాటి చినుకులే పడడం వల్ల అవి కూడా మొలకెత్తే పరిస్థితి కని్పంచడం లేదని వీరన్న వాపోతున్నాడు. వానాకాలం మొదటి దశలోనే అప్పుల పాలవుతున్నానని చెప్పాడు. గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు నెలకింది పడ్డ వానలకు ఐదు ఎకరాల్లో పత్తి పెట్టినం. పత్తి గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు. దీంతో మొలకలు రాలేదు. మళ్లీ విత్తనాలు వేసేందుకు దున్నుతున్నాం. రూ.35 వేలు అదనంగా పెట్టుబడి అవుతోంది. – సిలువేరు లచ్చయ్య, రైతు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా కురవాల్సిన సమయంలో పడట్లేదు మే నెలలో వర్షాలు కురవడంతో నాకున్న 3 ఎకరాలు దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేసిన. సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టిన. విత్తనాలు వేసి దాదాపు 25 రోజులు గడిచినా వర్షాలు పడకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడ్డాయి. కురవాల్సిన సమయంలో పడట్లేదు. జూన్‌లో ఇప్పటివరకు వర్షాలే కురవలేదు. విత్తిన పత్తి విత్తనాలను చీమలు తినేసి ఉంటాయి. అదే జరిగితే మళ్లీ పెట్టుబడి పెట్టి పత్తి గింజలు కొని విత్తాలి. –బాదావత్ చంటినాయక్, పూసలతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా -
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను చీఫ్ కంట్రోలర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చీఫ్ కంట్రోలర్ వేధింపులను భరించలేక మంత్రి సీతక్కకు ఆ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. అర్ధరాత్రి వీడియో కాల్స్, జిల్లా టూర్లతో వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.చీఫ్ ఇంజనీర్ వేధింపులు భరించలేక పలువురు మహిళలు ఉద్యోగం మానేసినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా మంత్రి శాఖలో మహిళలపై వేధింపుల అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీగల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. లీగల్ ఫైట్ చేయడానికి రోడ్‌మ్యాప్‌ను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. సత్వరమే నాగార్జున సాగర్‌లో పూడికతీతకు ఆదేశాలు ఇచ్చాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ పనులను పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తాం’’ అని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. -
హైదరాబాద్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
సాక్షి,హైదరాబాద్: లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే తమ భాగస్వామితో కలిసి జీవిస్తున్నారు. దీనిని లివింగ్ రిలేషన్ షిప్ అని అంటారు.తాజాగా, ఈ లివింగ్ రిలేషన్ షిప్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లివింగ్ రిలేషన్ షిప్ వల్లే ప్రేమ హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ వీహెచ్ మీడియాతో మాట్లాడారు.‘హై టెక్ సిటీలో కొలివింగ్ను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నా. ఒకే హాస్టల్లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు.హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలి. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం వీటి మీద దృష్టి పెట్టాలి. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి. ఇప్పుడు సొంత భర్తను, కూతురు తల్లిని చంపడం అనేది దారుణం. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుతున్నాయి. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్. సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుంది.నక్షలైట్ల హత్యల విషయంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతారు. ప్రేమ హత్యలపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇలాంటి ప్రేమ హత్యల్ని హ్యూమన్ రైట్స్ టేక్ అప్ చేయాలి. సైకాలజిస్టులు, ఇంటలెక్చవల్స్ ఆలోచన చేయాలి. ఎక్కడో తప్పు జరుగుతుందో తెలుసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. -
తెలంగాణ లాసెట్ ఫలితాలు వచ్చేశాయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లా సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం మధ్యాహ్నం రిజల్ట్స్‌ను విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఒక్క క్లిక్‌తోనే లాసెట్ ఫలితాలను అందిస్తోంది.ఎల్ఎల్బీ(ఐదు, మూడేళ్ల కోర్సు)తోపాటు ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు (Telangana LAW CET 2025 Results) నిర్వహిస్తారని తెలిసిందే. జూన్ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్‌కు మొత్తంగా 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్ఎల్బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకు 13,491 మంది చొప్పున అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.👉ఫలితాల కోసం క్లిక్ చేయండిబాలకిష్ట రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. లా సెట్ , పీజీ లా సెట్ ఫలితాలు విడుదల చేశాం. ఈసారి లా సెట్, పీజీ లా సెట్ లో 66.46 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన లా సెట్, పీజీ లా సెట్ పాస్ పర్సంటేజ్ తగ్గింది. కానీ, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 లా కాలేజీల్లో 9,388 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కొత్తగా శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ లో కొత్తగా లా తరగతులు ప్రారంభిస్తున్నాం అని తెలిపారాయన. -
Formula-E Race Case: ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్.. ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. -
హైదరాబాద్: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.సీలింగ్ ప్యాన్‌కు కర్టన్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్య సాధనకు యువత శ్రమించాలి: మిస్టర్ ఇండియా-2025 రాకేష్
యువత లక్ష్య సాధన కోసం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని మిస్టర్ ఇండియా-2025 టైటిల్ విజేత రాకేష్ అర్నే అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుడారు. మోడలింగ్ రంగంతో పాటు సామాజిక సేవలో భాగస్వామిగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఫిట్నెస్ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకూ అవసరమని తన అనుభవాల ద్వారా యువతకు సందేశం ఇచ్చారు. త్వరలోనే ఫిట్నెస్, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తానని పేర్కొన్నారు.రైతు కుటుంబంలో పుట్టి..1995 ఆగస్టు 25న జన్మించిన రాకేష్, సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి యాదయ్య సామాజిక సేవకుడిగా, తాత వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు స్ఫూర్తినిచ్చారు. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసిన రాకేష్, 9 సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నిష్ణాతుడైన ఆయన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నారు.రాకేష్ ఆర్నె స్థాపించిన రక్ష గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 34 సార్లు రక్తదానం, 47 మంది బాల కార్మికుల రక్షణ, 77 మంది వృద్ధులకు ఆశ్రయం, అనాథలు, అంధులు, వికలాంగులకు సహాయం, ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) కోసం కృషి చేస్తున్నారు. మలేషియాలో జరిగిన మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
హైదరాబాద్ : రేపటి నుంచి ఆషాఢ మాసం బోనాలు
ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారం భమవుతున్నాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబ స్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను ఇప్పటికే మం జూరు చేసింది. పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.బంగారు బోనమెత్తనున్న శ్యామల, నిషా క్రాంతి, అవికఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల- సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహ కాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ సిద్ధమైంది. కాగా.. ఈసారి బంగారు బోనం ఏడు గుళ్లకు కాకుండా.. కేవలం మూడు దేవాలయాలకు మాత్రమే పరిమి తమవుతోంది. గోల్కొండ జగదాంబ అమ్మవా రితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిషా క్రాం తి బంగారు బోనాన్ని సమర్పించనుంది. ఇక విజ యవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా... మరో జోగిని అవికా పెద్దమ్మ తల్లి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ నిర్వహకుల ద్వారా సమర్పించనున్నారు.బంగారు బోనం షెడ్యూల్ ఇలా..👉 : జూన్ 26న గోల్కొండ అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగం గా గోల్కొండ ఆ మ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు.👉 : భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున శ్రీ జగదాంబికా అమ్మవా రికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు.👉 : 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారికి 2వ బంగారు బోనం..👉 : జులై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోసం👉 : జూలై 4 న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం👉 : జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహం కాళి అమ్మవారికి 5వ, బంగారు బోనం..👉 : 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు బోనం👉 : జూలై 17న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. -
‘సర్పంచ్’ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(సర్పంచ్) నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను సైతం పరిగణలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. అందులో భాగంగానే మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.పిటిషనర్ల తరపు వాదనలు..గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి.తెలంగాణ ప్రభుత్వం తరఫున..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ..రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక.. ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున... ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ..రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.ఈసీ, ప్రభుత్వ అభ్యర్థన..మొత్తంగా.. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్ 23వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
తేజేశ్వర్ కేసు.. ఎట్టకేలకు తిరుమలరావు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్‌తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే..జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
ఎనిమిది నెలల ఇన్‌స్టా పరిచయం.. కుమార్తె రాసిన మరణ శాసనం!
సాక్షి, జీడిమెట్ల: ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ నంటూ ప్రియుడిని బెదిరించిన పదో తరగతి బాలిక.. కన్నతల్లినే హత్య చేయించిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం కలకలం రేపింది.ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి 16 ఏళ్ల క్రితం దమ్మన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి కూతురు (15) ఉంది. 13 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మనస్విని (12) అనే కూతురు జన్మించింది. రవి సైతం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంజలి కొన్నేళ్లుగా తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కళాకారిణిగా పని చేస్తూ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడు నెలలుగా షాపూర్‌నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది. షాపూర్‌నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పెద్ద కుమార్తె 10వ తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇన్‌స్టాలో పరిచయంతో.. అంజలి పెద్ద కుమార్తె (15)కు నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)కు ఇన్‌స్ట్రాగాంలో పరిచయం ప్రేమకు దారితీసింది. 8 నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో అంజలి తొలుత అంగీకరించి.. ఆ తర్వాత వద్దని వారించింది. తమ ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడంతో బాలిక ఈ నెల 19న శివతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు అంజలి తన కూతురు కనిపించడం లేదంటూ శివపై అనుమానం వ్యక్తం చేస్తూ జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు అమ్మాయిని తీసుకుని స్టేషన్‌కు రావాలని చెప్పడంతో ఈ నెల 21న శివతో పాటు బాలిక పీఎస్‌కు వచ్చారు. బాలికను తల్లితో ఇంటికి పంపించారు. ప్రేమను నిరాకరించిందని.. ఇంటికి వెళ్లిన తర్వాత శివను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కూతురును అంజలి బెదిరించింది. శివపై కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ కొట్టింది. తమ ప్రేమకు అడ్డొస్తోందనే కసితో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఆమెను చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తాను అనుకున్నట్లుగానే తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని శివను కోరింది. చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో యువకుడు ఒప్పుకోవడంతో.. బాలిక తన చెల్లెలిని మరో ఇంటికి పంపించింది.సోమవారం సాయంత్రం 5 గంటలకు శివ, తన తమ్ముడిని (16) తీసుకుని షాపూర్‌నగర్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే కురీ్చలో కూర్చున్న అంజలిని ఒక్కసారిగా తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్నీ బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. శివ సోదరుడు అంజలి చేతులు పట్టుకోగా శివ చున్నీతో మెడకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తన తల్లి కిందపడి తలకు దెబ్బతగలంతో చనిపోయిందని అందరినీ నమ్మించాలని బాలిక పథకం పన్ని, శివను, అతని సోదరుడిని పంపించేసింది. బతికే ఉందని.. మళ్లీ రప్పించి.. కొద్దిసేపటి తర్వాత అంజలి మెల్లగా కదలసాగింది. అప్పటికే చిన్న కుమార్తె మనస్విని ఇంటికి రాగా.. అమ్మ ఇంట్లోకి రావొద్దని చెప్పిందంటూ సోదరిని బాలిక బయటే కూర్చోబెట్టింది. 108కు కాల్ చేసినట్లు నటిస్తూ విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది. నల్లగొండ వెళ్లేందుకు ఎల్బీనగర్లో ఉన్న శివ మళ్లీ తన సోదరుడిని తీసుకుని రాత్రి 7.30 గంటలకు షాపూర్‌నగర్ వచ్చాడు. ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నిన్ను కాపాడతాను ఆంటీ’ బాలిక మనస్విని ముందు నటించాడు. వేరే ఆంటీని పిలుచుకు రావాలంటూ ఆమెను ఇంట్లోంచి పంపించారు. తిరిగి అంజలి మెడకు చున్నీ బిగించారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.రాత్రి 10 గంటలకు తన తల్లి చనిపోయిందని పెద్ద కుమార్తె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేశ్‌కు విషయం తెలిసింది. ఈ నెల 19న బాలిక అదృశ్యమైన కేసు జీడిమెట్లలో నమోదు కావడంతో ఇది కచి్చతంగా హత్యేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెండు బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడి(15)ని హైదరాబాద్ సంతోష్ నగర్‌లోని ఓ చికెన్ సెంటర్లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారణ చేయగా.. అంజలిని తామే చంపివేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లిని పూర్తిగా చంపే వరకు ఇంటి బయటే కాపలా కాసిందని, తల్లి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ‘క్షమించు మమీ’ అంటూ నిందితురాలు బాలిక రోదించిందని స్థానికులు తెలిపారు. అంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కాదు.. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మకు దూరపు బంధువే తప్పా మునిమనవరాలు కాదని కుటుంబ సబ్యులు తెలిపారు. దీనిపై మీడియాలో వార్తలు నిజం కావన్నారు. -
‘మీ సేవ’లో ఇసుక బుకింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలే నేరుగా ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గవర్నెన్స్‌కు ఆన్లైన్ వేదికగా ఉన్న ‘మీ సేవ’ద్వారా ఇసుక బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సులభ రీతిలో పారదర్శకంగా, సమర్థవంతంగా ఇసుకను సరఫరా చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇసుక బుకింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం వల్ల సరఫరాలో జాప్యం తగ్గుతుందని, అక్రమాలను నివారించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నూతన విధానంలో పౌరులు వాహనం రకం, ఇసుక పరిమాణం, ఏ స్టాక్‌యార్డ్ (ఇసుక రీచ్), దేనికి వినియోగిస్తారు, ఏ తేదీన కావాలి వంటి వివరాలను ఎంచుకోవచ్చు. ఆన్లైన్ చెల్లింపు ద్వారా బుకింగ్ పూర్తి చేసుకుని ఇసుకను ఎంచుకున్న చిరునామాకు డెలివరీ అయ్యేలా మీ సేవలో ఆప్షన్ ఇచ్చారు. పౌరులు సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ ఉండే వీఎల్ఈ సంబంధిత పౌరుడి మొబైల్ నంబరుతోపాటు ఇతర వివరాలను నమోదు చేస్తారు. తర్వాత ఇసుక డెలివరీ వివరాలు (జిల్లా, మండలం, గ్రామం లేదా సమీప కాలనీ, పిన్ కోడ్) అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్ చెల్లింపుతో బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి వర్సెస్ సాంకేతిక విద్యామండలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ఈ విభాగాల మధ్య అగాధం పెరుగుతోంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వడానికి మొత్తం రంగం సిద్ధమైన తరుణంలో సాంకేతిక విద్యామండలి మోకాలొడ్డింది. ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించేది లేదంటూ కరాఖండీగా తేల్చిచెప్పినట్టు సమాచారం. వాస్తవానికి కిందిస్థాయి అధికారులు మంగళవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రభుత్వం కూడా అనుమతించిందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు. అయితే ఈ సమాచారం బహిరంగపర్చడంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య అధికారులు మండి పడుతున్నారు. తమను సంప్రదించకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇస్తామన్న ప్రచారం సరికాదన్నారు. ఈ తరహా ప్రకటనలు చేయడంపై సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అసలు షెడ్యూల్ ఇవ్వాల్సింది తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు అంటున్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల నెలన్నర ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. అవునంటే.. కాదంటూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్, అనుబంధ గుర్తింపు, సీట్ల పెంపుపై యూనివర్సి టీల వీసీలు, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యామండలి అధికారుల మధ్య ఏమాత్రం సమన్వయం కుదర డం లేదు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొత్తం యూనివర్సిటీలు పూర్తి చేశా యి. గుర్తింపు ఇవ్వడానికి సిద్ధమైన తరుణంలో విద్య, సాంకేతిక విద్య ఉన్నతాధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తారు. కాలేజీలను పూర్తిగా తనిఖీ చేసేందుకు కమిటీ వేయాలంటూ సాంకేతిక విద్యామండలి ప్రభుత్వం వద్ద కొత్త వాదన లేవనెత్తింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలివ్వడంతో అఫ్లియేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కౌన్సెలింగ్‌లో కాలేజీలు పాల్గొనాలంటే ముందు గుర్తింపు ఇవ్వాలి. ఇంత వరకూ కమిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు రాలేదు. అప్పటి వరకూ గుర్తింపు ఇవ్వకుండా ఆపడం ఏమిటని వీసీలు అంటున్నారు. ఉన్నతాధికారులు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారని, వీసీలపై పెత్తనం చెలాయించే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఓ యూనివర్సిటీ వీసీ అన్నారు. ఫీజుల వ్యవహారంపైనా ఇదే పేచీ కొనసాగుతోంది. ప్రైవేట్ కాలేజీల ఆడిట్ నివేదికలు పరిశీలించిన ఎఫ్ఆర్సీ తుది నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఫీజులు ఖరారైనట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించడంతో సాంకేతిక విద్యామండలి అధికారులకు ఆగ్రహం వచ్చింది. అసలు ఫీజులు ఎలా పెంచుతారంటూ సాంకేతిక విద్య అధికారి ఒకరు అభ్యంతరం లేవనెత్తారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం వరకూ చేరవేశారు. దీంతో ఫీజుల ఖరారు ఆగిపోయింది. జీవో రాకుండా కౌన్సెలింగ్ కుదరదు ఫీజులపై ప్రభుత్వం జీవో ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. అప్పటి దాకా కౌన్సెలింగ్ వాయిదా వేయాలని చెబుతున్నారు. అయితే, ఉన్నత విద్యామండలి మాత్రం ఫీజుల వ్యవహారంతో పనిలేకుండానే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఒకవేళ ఫీజులు పెంచితే ఆ తర్వాత కాలేజీలు వసూలు చేసుకోవచ్చనే షరతును కౌన్సెలింగ్ షెడ్యూల్లో పెడతామని తెలిపింది. ఫీజుల వ్యవహారంపై ప్రైవేట్ కాలేజీలు కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే జీవో ఇవ్వకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ నెలాఖరు వరకూ కొత్త సీట్లపై స్పష్టత ఇస్తుంది. కొత్త సీట్ల వ్యవహారం తేలకుండా రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహించడం సరికాదని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఒకవేళ కొత్త సీట్ల పెంపు అనివార్యమైతే ఆఖరి కౌన్సెలింగ్‌లో వీటిని పొందుపరిస్తే సరిపోతుందని ఉన్నత విద్యామండలి అంటోంది. ఇలా భిన్న వాదనల మధ్య కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే న్యాయ సలహా తీసుకోవాలనే ఆలోచనలో సాంకేతిక విద్యామండలి ఉంది. -
శ్రీధర్ బినామీలపై ఏసీబీ ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ శాఖ ఈఈ నూనె శ్రీధర్ బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. శ్రీధర్ తన అక్రమార్జనను బినామీల పేరిట దాచినట్టు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడు వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు అనుమతితో ఈ నెల 20 నుంచి నూనె శ్రీధర్‌ను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణలో పలు కీలక వివరాలు సేకరించారు. మంగళవారం చివరి రోజు విచారణలో బినామీల గురించే ఎక్కువసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం ఒక ఎస్బీఐ బ్యాంకు లాకర్ తెరిపించగా, మంగళవారం మరికొన్ని లాకర్లను తెరిపించారు. అందులో కొన్ని ఆస్తి పత్రాలు గుర్తించారు. ఎవరెవరి పేర్లపై ఈ ఆస్తులు ఉన్నాయి..? వారికి శ్రీధర్‌తో సంబంధాలు ఏంటి..? అన్నది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం నూనె శ్రీధర్ ఆస్తులు రూ.200 కోట్లకుపైనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. లాకర్లలో పట్టుబడిన డాక్యుమెంట్ల ప్రకారం అది మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీధర్ కస్టడీ ముగియటంతో బినామీలకు నోటీసులు జారీచేసిన వారిని సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. -
దడ పుట్టిస్తున్న జూనోటిక్ డిసీజెస్
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణ పెరిగిపోవటం, జంతు– మనిషి సాన్నిహిత్యం అసాధారణంగా పెరగటంతో మనషుల్లో ‘జూనోటిక్ డిసీజెస్’(జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు) పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 75–80 శాతం దాకా వైరస్లు ఇలాగే మనుషులకు వ్యాపిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. భారత్ గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంక్రమణ వ్యాధులతో పోరాడుతున్నా.. ఇటీవల జూనోటిక్ వ్యాధుల వ్యాప్తి వేగం పెరిగింది. కరోనా, డెంగ్యూ, రేబిస్, నిఫా వైరస్, లెప్టోస్పైరోసిస్, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీ ఫీవర్), స్వైన్ ఫ్లూ, ఎబోలా, ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, హెపటైటిస్–ఈ, మలేరియా వంటి వ్యాధులు మనుషులను పీడిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ముందుగా పర్యావరణ విధ్వంసాన్ని, విచక్షణారహితంగా వన్యప్రాణులకు నష్టం చేయడాన్ని తగ్గించాలని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్లూŠఎఫ్ ఇంటర్నేషనల్) సంస్థ ‘కోవిడ్–19: అర్జంట్ కాల్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ నేచర్’అనే నివేదికలో సూచించింది. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు మానవాళిని ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనుషుల్లో ఇన్ఫెక్షన్లు సోకడం ద్వారా వ్యాపించే మొత్తం 1,200 వ్యాధుల్లో 816 (75 శాతం) జూనోటిక్ డిసీజెస్‌లేనని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో జూనోటిక్ వ్యాధుల తీవ్రతకు ఉదాహరణలు.. » 2025 నాటికి భారత్‌లో నమోదైన కరోనా కేసులు 4.5 కోట్లు.. 2021లో దేశంలో కరోనా మరణాలు 5.33 లక్షలు» రేబిస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో మనదేశంలోనే 36% ఉంటున్నాయి.» 2023–24లో దేశంలో విజృంభించిన మొత్తం వ్యాధుల్లో 47% జూనోటిక్ డిసీజ్‌లే.» నిఫా వైరస్ 2018 నుంచి ప్రతి ఏడాది కేరళలో విజృంభిస్తూనే ఉంది.» 2024లో కుక్క కాట్లు ఆంధ్రప్రదేశ్‌లో 2,45,174, తెలంగాణలో 1,21,997 నమోదయ్యాయి. రేబిస్ వల్ల కర్ణాటకలో 2024లో 42 మంది మరణించారు. » 2024లో డెంగ్యూ కేసులు తెలంగాణలో 10,077, కర్ణాటకలో 32,000, తమిళనాడులో 26,740 వెలుగు చూశాయి.» గతేడాది చికున్ గున్యా (సస్పెక్టెడ్) కేసులు తెలంగాణలో 13,592 రికార్డయ్యాయి.జూనోటిక్ వ్యాధుల పెరుగుదలకు కారణాలుఅనియంత్రిత పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, సహజ వనరులపై మనుషుల మితిమీరిన జోక్యంవ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు» వన్ హెల్త్ సర్వైలెన్స్ గ్రిడ్ ఏర్పాటు» రాష్ట్రస్థాయిలో డిజిటల్ మోడల్ ఆస్పత్రులు, వెటర్నరీ క్లినిక్స్, ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్‌ను ఒకే డాష్‌బోర్డ్‌తో అనుసంధానించటం.» రోగ లక్షణాలు బయటపడకముందే నీటి నమూనాలు, గాలిలో వ్యాధి జన్యువుల పర్యవేక్షణ.» సంయుక్త బృందాల ద్వారా ఎకో సర్వేలు, రోగ నిర్ధారణ పరీక్షలు.» కొత్త వైరస్‌లను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయటం.» పిల్లలు, రైతులు, శ్రామికులు, వలసదారులకు ప్రత్యేక హెల్త్ ఎడ్యుకేషన్.తెలుగు రాష్ట్రాల్లో హెల్త్‌కేర్ వ్యవస్థ బలాబలాలు బలాలు» సర్వేలు, అధ్యయనాల్లో వృద్ధి: గతేడాది నుంచి రేబిస్‌ను నోటిఫయబుల్ వ్యాధిగా గుర్తించడం వల్ల డేటా సేకరణ మెరుగైంది.ఐసీఎంఆర్ జోక్యం: తెలంగాణ, పంజాబ్, అస్సాంలలో కబేళాల్లో జూనోటిక్ పాథోజెన్లపై రియల్‌టైం మానిటరింగ్ ప్రారంభించారు.ఒకే వైద్య విధానంపై దృష్టి: హైదరాబాద్ కేంద్రంగా పశుసంరక్షణ, పర్యావరణం, హెల్త్ డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. బలహీనతలు» క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం» బలహీనమైన గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థ» మనుషుల్లో రోగనిరోధకత తగ్గిపోవటంకబేళాల్లో బయోసేఫ్టీ ప్రొటోకాల్ తప్పనిసరి చేయాలిరాబోయే రోజుల్లో జూనోటిక్ డిసీజెస్ వ్యాప్తి తీవ్రంగా పెరగబోతోంది. కొన్ని వ్యాధులు స్థానిక ప్రాంతాలకే పరిమితమైతే, కొన్ని మహమ్మారులుగా మారి ఇతర దేశాలకు కూడా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. వీటి నుంచి రక్షణకు వ్యక్తిగత, కమ్యూనిటీ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిలో చర్యలు చేపట్టాలి. వ్యక్తిగత రక్షణకు మాస్కులు ధరించటం, నివసించేచోట గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, తాజా పండ్లు, కూరగాయలు తినటం, 6–8 గంటలపాటు నిద్ర ద్వారా రోగనిరోధక వ్యవస్థను పరిరక్షించుకోవాలి. వన్యప్రాణులు, పెంపుడు జంతువులు, మనుషుల్లో ‘మైక్రోబియల్ సర్వైలెన్స్’ను పటిష్ట పరచాలి. కబేళాల్లో బయోసేఫ్టీ ప్రొటోకాల్‌ను తప్పనిసరి చేయాలి. – డాక్టర్ కె. శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు. -
టైటిల్ వివాదాలు ‘సివిల్’లోనే తేల్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో దశాబ్దాల నుంచి ఉన్న ఆస్తి వివాదానికి సంబంధించిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 కింద జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తీవ్రమైన టైటిల్ వివాదాల పరిష్కారం కోసం ఆయా వ్యక్తులు సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశిస్తూ పలు పిటిషన్లను కొట్టివేసింది. అసలైన రికార్డులు లేకపోవడం, పత్రాల ప్రామాణికతకు సంబంధించి విరుద్ధమైన వాదనలు ఉన్నప్పుడు.. అలాంటి వివాదాలను పరిష్కరించడానికి సివిల్ దావానే సరైన మార్గమంటూ జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. షేక్‌పేట్ గ్రామం (ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4) సర్వే నంబర్ 396 (సవరించిన సర్వే నం. 225)లోని ఏడెకరాలకు సంబంధించి దశాబ్దా లుగా వివాదాలున్నాయి. ఈ భూమి తొలుత హైదరాబాద్ మాజీ ప్రధాన మంత్రి (దివాన్) మహారాజా సర్ కిషన్ పెర్షాద్ యాజమాన్యంలో ఉంది. తర్వాత ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో జూబ్లీహిల్స్ గైరా జిరాయట్టి పట్టాగా నమోదై ఉంది. కాగా, మహారాజా కిషన్ పెర్షాద్ చట్టబద్ధమైన వారసులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత యజమానుల పూర్వీకులకు అనుకూలంగా అమలు చేసిన అమ్మకపు పత్రాలు చెల్లవని పేర్కొన్నారు. అర్బన్ ల్యాండ్ (సీలింగ్, నియంత్రణ) చట్టం–1976 కింద పొందిన అనుమతులు మోసపూరితమన్నారు. ప్రస్తుత యజమానులు ప్రెస్టీజ్ గ్రూప్‌నకు అనుకూలంగా అమలు చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్, జీపీఏని రద్దు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. ఈ తీర్పు ప్రభావం ఉండదు.. ప్రతివాదులైన.. ప్రైవేట్ కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థ (ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్) యూఎల్సీ అనుమతుల తర్వాత నాటి హక్కుదారు అసదుల్లా ఖాన్ వారసుల నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశామని వాదించారు. ‘1937 నాటి రిజిస్టర్డ్ పత్రాల ద్వారా అసలు యజమానుల నుంచి టైటిల్‌ను తెలుసుకున్నాం. యూఎల్సీ నుంచి ఆమోదం పొందిన తర్వాత వారు 1980లో భూమిని విక్రయించారు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. యూఎల్సీ రికార్డులు అందుబాటులో లేవని, వివాదాస్పద ఫొటో కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రభుత్వం అంగీకరిస్తోందన్నారు.మోసం ఆరోపణలకు సివిల్ విచారణ అవసరమని.. టైటిల్ వివాదాలు, వారసత్వ సమస్యలను సివిల్ కోర్టే నిర్ణయించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డులు మాత్రమే యాజమాన్యాన్ని ఇవ్వవని తేల్చిచెప్పారు. రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ.. పరిష్కారం కోసం సివిల్ కోర్టును సంప్రదించవచ్చంటూ స్వేచ్ఛనిచ్చారు. సివిల్ కోర్టు విచారణపై ఈ తీర్పు ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. -
విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల పఠనాసక్తి, వారిలోని సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని బేస్‌లైన్ టెస్ట్‌గా చెబుతున్నారు. పరీక్ష నిర్వహణ, విద్యా సామర్థ్యాల పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్సీఈఆర్టీ మంగళవారం జిల్లా అధికారులకు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీటిని నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడుసార్లు జరిగే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, చివరలో ఇంకోసారి పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్‌గా జరిగే పరీక్షలకు ఇవి భిన్నంగా ఉంటాయనిఅధికారులు తెలిపారు. పాఠశాలహెచ్ఎంలు ప్రతీ విద్యార్థికి సంబంధించిన మార్కులను యాప్‌లో పొందుపరుస్తారు. వీటి ఆధారంగా విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు? ఏ జిల్లాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఎస్సీఈఆర్టీ పరిశీలించి, విద్యార్థుల స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.పరీక్ష విధానం ఇదీ.. ఈ ప్రక్రియ మొత్తం ఎస్సీఈఆర్టీ నేతృత్వంలోనే నడుస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి పరిశీలన ఈ విభాగమే చూస్తుంది. ఇది తరగతి వారీగా మారుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో అనర్గళంగా చదవడం, రాయడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి. దీని ఆధారంగానే పరీక్ష నిర్వహిస్తారు. పిల్లలు సరళ పదాలు, గుణింతాలు ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను చదవాలి. తెలుగు పదాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో చదివితేనే ఆ విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్యలు గుర్తించడం కూడికలు, తీసివేతలు సమస్యల సాధన, 3, 4, 5 విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారం వంటివి చేయాలి. 6–10వ తరగతి వారికి పాఠ్యాంశాల్లో కనీస ప్రశ్నలు వస్తాయి. ఇందులో విద్యార్థి ఎంత వేగంతో సమాధానం ఇస్తున్నాడు? ఇచ్చేదాంట్లో సరైన సమాధానం శాతం ఎంతమేర ఉందనే దాన్ని సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటారు. 9, 10 తరతుల విద్యార్థులను కొంత తికమక పెట్టే రీతిలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు, సంవత్సరంలో నిర్వహించే పరీక్షలకు ఏ సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. -
2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. ‘1994–2004 వరకు పదేళ్లు టీడీపీ, 2004–2014 వరకు పదేళ్లు కాంగ్రెస్, 2014–23 వరకు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇక 2023–33 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా. పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకునే బాధ్యత నాది.మీరు భవిష్యత్తు నాయకులను తయారు చేయండి..’అని సీఎం కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలిచ్చే కార్యక్రమం మంగళవారం గాం«దీభవన్‌లో జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీ పదవులు పొందిన వారికి అభినందనలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పదవులకు న్యాయం చేయాలి..లేదంటే తప్పిస్తారు ‘పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వంలో మీరూ భాగస్వాములవుతారు. రాజకీయంగా ఎదగడానికి ఈ పదవులు, వేదికలే ఉపయోగపడతాయి. ప్రభుత్వ బాధ్యతల కంటే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వేలాది మంది పోటీ పడినా ఈ పదవులు మీకే దక్కినందుకు వాటికి న్యాయం చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు అంగీకరించలేదు. అంగీకరించి బాధ్యతలు తీసుకున్నవారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయినంత మాత్రాన ఇక రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అవుతుందని అనుకోవద్దు. మీరు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే రాజకీయంగా ముందుకెళతారు. లేదంటే ఎన్నికల ముందు తప్పిస్తారు..’అని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో చాలా అవకాశాలు ‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి, కష్టపడి కార్యకర్తలను గెలిపించిన వారికి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా పరిణామాలు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. 2029లో మీలో చాలామందికి అవకాశాలు వస్తాయి. అప్పటికల్లా సిద్ధంగా ఉండండి..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలా చేస్తే పార్టీకి తిరుగుండదు: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కా లంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్క సంక్షేమ పథకాల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నేతలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అవును..అంతా అక్క కష్టమే..జగ్గారెడ్డి దంపతులపై సీఎం చలోక్తి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, నాయిని రాజేందర్‌రెడ్డిలు పార్టీలో ఎలా ఎదిగారో సీఎం వివరించారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డికి కీలకమైన టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. జగ్గారెడ్డి అందులో తనదేమీ లేదని అనడంతో.. ‘అవును.. నిర్మలక్కకు పదవి రావడంలో జగ్గారెడ్డికి సంబంధం లేదు. ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కష్టపడ్డారు.. అందుకే పెద్ద కార్పొరేషన్‌కు చైర్మన్ అయ్యారు. అంతా అక్క కష్టమే..’అంటూ సీఎం చలోక్తి విసిరారు. -
ఇదేం పద్ధతి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అటు రాష్ట్ర మంత్రులు, ఇటు పార్టీ నేతలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశ పరచడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ పదవులను కార్యకర్తలకు ఇప్పించడంలో జాప్యం జరిగితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన రేవంత్.. దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీలు లాంటి పదవులు నేరుగా తాను ఇవ్వలేనని, ఇన్చార్జి మంత్రులు షార్ట్‌లిస్ట్ చేసి పంపితే తాను ఫైనల్ మాత్రమే చేయగలనని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ పదవులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని, ఇలాంటి చర్యల ద్వారా కార్యకర్తలను నిరాశకు గురిచేయవద్దని చెప్పారు.వీలున్నంత త్వరగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలని, పార్టీ నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నామినేటెడ్ పదవులను ఫైనల్ చేద్దామని అన్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ పీఏసీ భేటీ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌తో పాటు పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్ని కలు, బీసీల కులగణన, ఎస్సీల వర్గీకరణ, సంస్థాగత నిర్మాణం గురించి చర్చించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్.. తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. వాళ్లను చూసి ఇంకొకరొస్తారు ఎవరంటే వాళ్లు వచ్చి గాం«దీభవన్‌లో ధర్నాలు చేస్తే ఆఫీసు నిర్వాహకులు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందంటూ కొందరు యాదవ సంఘాల ప్రతినిధులు గొర్రెలను తీసుకొచ్చి ధర్నా చేయడంపై సీరియస్‌గా స్పందించారు. పార్టీలో ప్రాధాన్యం కావాలని, మంత్రి పదవులు ఇవ్వాలని ఏ సామాజికవర్గానికి చెందిన వారయినా అడగొచ్చని, తనతో పాటు పార్టీ అధ్యక్షుడికి వినతిపత్రాలు ఇవ్వొచ్చని, డిమాండ్ చేయవచ్చని, కానీ ఓ సామాజిక వర్గం పేరుతో వచ్చి గాం«దీభవన్‌లో ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షాల చేతికి తామే ఆయుధాలిచ్చినట్టు అవుతుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన వారిని చూసి రేపు ఇంకొకరు వచ్చి ధర్నా చేస్తారని, ఇలాంటి ధర్నాలకు గాం«దీభవన్‌లో అవకాశం ఇవ్వకూడదని అన్నట్టు తెలిసింది. ఇన్చార్జి మంత్రులు గ్రామాలకు వెళ్లాలి క్షేత్రస్థాయిలో ఇన్చార్జి మంత్రులు చేయాల్సిన పనులు చేయాలని, లేదంటే గ్రామాలకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే తాను వెళ్లడం వల్ల ఉపయోగం లేదని, గ్రామాలకు వెళ్లాల్సింది ఇన్చార్జి మంత్రులేనని స్పష్టం చేశారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంస్థాగత నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని చెప్పారు. ‘జూబ్లీహిల్స్’పై చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఎన్నిక చాలా కీలకమని, ఈ అంశంపై పార్టీ ఫోకస్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. అయితే కీలకమే కాదని, ఖచ్చితంగా గెలిచి తీరాలని మీనాక్షి స్పష్టం చేశా రు. ఉప ఎన్నికకు పార్టీ సిద్ధం కావాలని, ఆ నియోజకవర్గంలో చేయాల్సిన అన్ని కార్యక్రమాల రోడ్‌మ్యాప్‌ను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తయారు చేయాలని సీఎం సూచించారు. అభ్యరి్థని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తామంటే తాము అభ్యర్థులమని ఎవరూ చెప్పకూడదని పీసీసీ అధ్యక్షుడు ఆదేశించారు.మేనిఫెస్టోలో పెట్టలేదు: భట్టి.. కాదు పెట్టాం: శ్రీధర్‌బాబు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా తాము అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో పెట్టామంటూ పుస్తకం చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నాయి కానీ, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేసే పథకాలు కూడా రూపొందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు.పదవులు, ప్రాధాన్యతలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తదితరులు మాట్లాడారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’అనే పుస్తకాన్ని రేవంత్, మీనాక్షి ఆవిష్కరించారు. ‘వైఎస్ రచ్చబండ’లాంటి కార్యక్రమం కావాలి ప్రభుత్వ పరంగా చేసింది చెప్పుకోలేకపోతున్నామని సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్ పీఏసీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కారణంగా ఎవరికి లబ్ధి కలుగుతుంది, ఎవరికి కలగడం లేదనే అంశాలపై గ్రామాల్లోనే చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. కాగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని అభినందించారు. రాష్ట్రంలో గోల్డెన్ పాలన సాగుతోందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మహేశ్‌గౌడ్ అన్నారు.ఏఐసీసీ కూడా తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గణాంకాలతో సహా భట్టి వివరించారు. సమావేశం అనంతరం పీఏసీ నిర్ణయాలను మంత్రి వాకిటి శ్రీ«హరి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి భట్టి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో చేసిన కార్యక్రమాలను పీఏసీ అభినందించిందని, గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించిందని చెప్పారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని కూడా పీఏసీ నిర్ణయించినట్లు తెలిపారు. -
చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్ విసిరారు. ‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్‌కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. కేసీఆర్ సూచనలతో హరీశ్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్ మాట్లాడారు. నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం ‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 2018లో వ్యాప్కోస్ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ‘బీఆర్ఎస్ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్‌లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్ అన్నారు. మీకు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్? ‘కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా తొలి ప్రాధాన్యత రైతులే ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. కేసీఆర్ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి భారీ ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్‌లో భారీ ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో.. గత ఏడాది అక్టోబర్‌లో ఆమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్‌లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపాలికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
జీహెచ్ఎంసీ ఆస్తులెన్నంటే..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీకి ఎన్నో ఆస్తులున్నాయి. వాటిల్లో కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, చెరువులు, పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, ఆటస్థలాలు, ఫంక్షన్‌హాళ్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితరమైనవెన్నో ఉన్నాయి. అయినా తమకున్న ఆస్తులేమిటో, ఏవి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఏ దుస్థితిలో కునారిల్లుతున్నాయో, ఏ అక్రమార్కుల కబ్జాలో చిక్కుకున్నాయో, ఎక్కడ ఏ ప్రైవేటు పెత్తనంతో ఉన్నాయో కూడా జీహెచ్ఎంసీ అధికారులకు తెలియదు.అంతెందుకు ఒక పార్కు సమీపంలోని స్థలం కబ్జా అయితే అది జీహెచ్‌ఎంసీదా, కాదా, అనేది మేయర్‌కు సైతం తెలియలేని పరిస్థితుల్లో ఆ ఆస్తులున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆస్తులను గుర్తించే పని చేపడుతోంది. ఆస్తిపన్ను ఆదాయం పెంచుకునేందుకు ప్రజల ఆస్తుల సర్వే చేపట్టిన జీహెచ్ఎంసీ (GHMC).. తమ ఆస్తుల్ని కూడా తెలుసుకునేందుకు పనిలోపనిగా ‘డ్రోన్ బేస్డ్ జీఐఎస్ సర్వే’ను ప్రారంభించింది. వీటి సర్వే ఇలా... సర్వేలో భాగంగా ఆటస్థలాలు, పార్కులు, పబ్లిక్ టాయ్లెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల వివరాలు క్రోడీకరించి.. వాటిని జియో మ్యాపింగ్ కూడా చేశారు. అక్షాంక్ష, రేఖాంశాలతో సహ మ్యాపింగ్ చేయడంతో ఇక జీహెచ్ఎంసీ ఆస్తులు ఏ లొకేషన్లో, ఏ స్థితిలో ఉన్నాయో కూడా అధికారులు తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. కానీ, కమ్యూనిటీ హాళ్ల వంటి వాటి సర్వే ఇంకా చేపట్టలేదు. చాలా వరకు కమ్యూనిటీ సెంటర్లు స్థానిక లీడర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడైనా జీహెచ్ఎంసీకి ఏదైనా అవసరం వచ్చినా వాటి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక వెతుక్కునే పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీ హాళ్ల విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.కట్టుదిట్టమైన చర్యలు మొత్తానికి జీహెచ్ఎంసీ ఆస్తుల్ని జీఐఎస్ పోర్టల్‌లో మ్యాపింగ్ చేస్తున్నారు. వాటిని కబ్జాల పాలు కాకుండా, జులాయిలు తిష్టవేయకుండా చూస్తామని, అద్దెల కివ్వడం, అవసరమైన సేవలందించడం ద్వారా ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్.. 1,48 గజాలు.. రూ.33 కోట్లు -
రైలు ప్రమాదాలకు చెక్.. కవచ్ 4.0 ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: పరస్పరం రైళ్లు ఢీకొనకుండా నిరోధించేందుకు సాంత పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రైల్వే రూపొందించిన కవచ్ సాంకేతిక తదుపరి వెర్షన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కవచ్ 3.2 వెర్షన్ ఉండగా, ఇటీవల 4.0 వెర్షన్‌ను రూపొందించారు. రైల్వే అనుబంధ సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) అభివృద్ధి చేసిన ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ట్రయల్స్‌కూ దక్షిణ మధ్య రైల్వే పరిధినే ఎంపిక చేయటం విశేషం. సనత్‌నగర్–వికారాబాద్–వాడీ సెక్షన్‌ను కవచ్ 3.2 వెర్షన్ ప్రయోగాలు, ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, ఇప్పుడు ఆధునిక వెర్షన్ కోసం సనత్‌నగర్–వికారాబాద్, రఘునాథ్‌పల్లి–మౌలాలీ సెక్షన్లను ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.దక్షిణ మధ్య రైల్వే (south central railway) జోన్ పరిధిలో 6,600 రూట్ కి.మీ.కు గాను 4,655 కి.మీ.లలో కవచ్ 4.0 ఏర్పాటుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే జోన్ పరిధిలో 1465 కి.మీ. మేర కవచ్ 3.2 వెర్షన్ ఏర్పాటై ఉంది. ఇప్పుడు దీన్ని కొత్త వెర్షన్‌తో అప్‌గ్రేడ్ చేయటంతోపాటు మిగతా ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. 4.0 వెర్షన్ ప్రయోగాల కోసం ఎంపిక చేసిన సనత్‌నగర్–వికారాబాద్ సెక్షన్లో 63 కి.మీ. మేర పాత వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఈ పరిధిలో కొత్త వెర్షన్ ట్రయల్స్ మొదలయ్యాయి. రఘునాథ్‌పల్లి– మౌలాలీ సెక్షన్ పరిధిలో పాత వెర్షన్ లేదు. ఇప్పుడు ఈ సెక్షన్ పరిధిలోని 86 కి.మీ.లో కొత్త వెర్షన్ ఏర్పాటు చేసి ట్రయల్స్ ప్రారంభించారు.కొత్త వెర్షన్ సరే.. ఈ జాప్యమేంటి? కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుష్కర కాలంగా కవచ్ వ్యవస్థపై ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయోగాల కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పాటు చేసిన 1,465 కి.మీ. తప్ప దేశంలో మిగతా చోట్ల దీన్ని ఏర్పాటు చేయలేదు. ఈలోపు కవచ్ 4.0 (Kavach 4.0) ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రయోగాలు, ట్రయల్స్‌తో మళ్లీ జాప్యం తప్పేలా కనిపించటం లేదు. కవచ్ 4.0 వెర్షన్ కోసం బల్లార్షా – కాజీపేట – విజయవాడ, విజయవాడ – గూడూరు, విజయవాడ – దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట (Renigunta) సెక్షన్లకు సంబంధించి 1,618 కి.మీ.కు టెండర్లు పిలిచారు.కొత్త వెర్షన్లో రైలును మరింత వేగంగా, తక్కువ నిడివిలో సురక్షితంగా బ్రేక్ వేసి ఆపే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పాత దానిలో సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ ఉండగా, కొత్త దాంట్లో ఇంటెలిజెంట్, డైనమిక్ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నారు. 4.0లో గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో, డ్రైవర్‌కు క్లియర్ విజువల్, అథెంటికేటెడ్ అలర్ట్స్ ఇవ్వగలదు. దీన్ని హ్యాక్ చేయటం అంత సులువు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వినియోగంలో ఉన్న యాంటీ కొలిజన్ సిస్టమ్స్ సరసన నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్- 1,48 గజాలు.. రూ.33 కోట్లు -
ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్ సీరియస్
హైదరాబాద్: ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంచార్జ్ మంత్రులకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్.. ఫండ్స్‌ను సైతం ఇంచార్జ్ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు.ఈరోజు(మంగళవారం, జూలై 24) పీసీసీ రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలo గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి.. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లు,జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. -
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్‌లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. -
ట్యాపింగ్ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారు: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు ప్రశ్నించి ఈటల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం సాగదీస్తారు?. ఎంత కాలం విచారణ జరుపుతారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకెంత కాలం విచారిస్తారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకమే అక్రమం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. అనేకసార్లు నా ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ నేతలే కాదు.. జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లూ ట్యాప్ చేశారు. గవర్నర్ ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు?. ఎవరి అండతో ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్న చట్టపరంగా శిక్షించాలి.. అని ఈటల డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. బీజేపీ లీగల్ సెల్‌తో కలిసి సిట్ కార్యాలయానికి సాక్షిగా ఇవాళ్టి విచారణకు ఈటల హాజరయ్యారు. బీజేపీ నేత ప్రేమేందర్ స్టేట్మెంట్ను కూడా అధికారులు నమోదు చేశారు. -
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్‌స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది. -
రీల్స్ కోసం.. బైకుపై ఎనిమిది మంది
హైదరాబాద్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేసి..సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా స్టంట్లు చేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్‌గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ మనీషా
అంబర్‌పేట: కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ టి.మనీషా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒప్పందం ప్రకారం రెండోవిడత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్–16 పరిధిలోని గోల్నాక వార్డు కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మనీషా సర్కిల్ పరిధిలో నల్లకుంట డివిజన్ ఏఈగా కొంత కాలం పని చేసి ప్రస్తుతం గోల్నాక డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఓ అభివృద్ధి పనిని కాంట్రాక్టర్ దక్కించుకుని పూర్తి చేశాడు. దాని బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ ఏఈని అడుగగా ఆమె రూ.15 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.5 వేలు ఇచ్చాడు. రెండో విడత అందించేందుకు ముందు అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం గోల్నాక వార్డు కార్యాలయంలో ఏఈకి డబ్బులు అందించాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏఈ మనీషా ఏసీబీకి పట్టుబడక మందు అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తి కాకముందే అనుమతి తీసుకుని బయటకు వచ్చి ఏసీబీకి పట్టబడడం గమనార్హం. -
విరివిగా.. విదేశీ మద్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) దందా నడుస్తోంది. వాయు, రోడ్డు అనే తేడా లేకుండా వీలున్నన్ని మార్గాల్లో ఈ అక్రమ మద్యం తెలంగాణలోకి విచ్చలవిడిగా ప్రవే శిస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండిపడుతోంది. విదేశీ, ఇండియన్ మేడ్ ఫారి న్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) ముసుగులో జరుగుతున్న ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ దందాతో ఏటా ఖజానాకు రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు నష్టం వస్తోందని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. అయితే ఆదాయం పెంపు పేరుతో లిక్కర్, బీర్ల ధరలను పెంచుతున్న ప్రభుత్వం ఈ దందాను అరికట్టే విషయంలో మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడ అనుమతుల్లేని పార్టీలు జరిగినా, పెద్ద మొత్తంలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం కూడా పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. వీఐపీలే కాదు..ముఠాలు కూడా ఎన్డీపీఎల్ రాష్ట్రంలోకి అనేక మార్గాల్లో ప్రవేశిస్తోంది. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు లీటర్ల వరకు మద్యం ఉండొచ్చనే నిబంధన ఉంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల నుంచి మద్యం తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో వీఐపీలు ఎక్కువగా విదేశాల నుంచి మద్యాన్ని తెచ్చుకుంటారు. వీరికి తోడు ఈ మద్యం కోసం రాష్ట్రంలో ముఠాలు కూడా ఏర్పడ్డాయి. ఇతర దేశాల్లో ఖరీదైన విదేశీ మద్యం బాటిల్ రూ.12వేలు ఉంటుందని సమాచారం. అయితే, అదే మద్యాన్ని తెలంగాణలో రూ.25వేల వరకు అమ్మే వీలుంది. అదే బ్రాండ్ మద్యం ఇక్కడ అంత ధర పలుకుతుంది. దీంతో విదేశాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల వివరాలను సేకరించి వారితో తప్పనిసరిగా మద్యం తెప్పించేలా ఈ ముఠా సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లేదంటే ఎయిర్‌పోర్టుల్లోనే ప్రయాణికులతో మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. ఈ మ ద్యాన్ని బయట అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. ఢిల్లీ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. హరియాణా, గోవా ల్లోనూ తెలంగాణతో పోలిస్తే మద్యం ధ రలు చాలా తక్కువ. ఇక్కడ ఐఎంఎఫ్ఎల్ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల నుంచి రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో మద్యం తెప్పిస్తున్నారు. ఏకంగా కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ బుక్ చేసి మరీ ఎన్డీపీఎల్ తెప్పిస్తున్నారని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. ఈవెంట్ మేనేజర్లు, పారీ్టల నిర్వాహకుల పేర్లతో ఈ మద్యాన్ని విచ్చలవిడిగా ఆమ్ముకుంటున్నా, ఎక్సైజ్ వర్గాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేవలం ప్రత్యేక డ్రైవ్‌లకు మాత్రమే ఎక్సైజ్ శాఖ పరిమితం కావడం గమనార్హం. ఆ డ్రైవ్‌లు ముగియగానే మౌనం వహించడం, ఎన్ఫోర్స్మెంట్ టీంల దాడులు సరిగా జరగకపోవడం, సరిహద్దు చెక్‌పోస్టులు నిరీ్వర్యంగా మారడం ఎందుకనే ప్రశ్నలకు ఆ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. స్పెషల్ డ్రైవ్‌లు సరిపోతాయా? రాష్ట్రంలో డ్యూటీ చెల్లించని మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్‌లు మాత్రమే సరిపోవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. గతంలోనూ ఈ రకమైన డ్రైవ్‌లు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల కూడా ప్రత్యేక దాడులు నిర్వహించింది. సీనియర్ అధికారి షానవాజ్ ఖా సిం నేతృత్వంలో ఈ నెల 3వ తేదీ నుంచి వారం రో జుల పాటు ఎక్కడికక్కడ నిఘా పెట్టి విదేశీ మద్యం అమ్ముతున్న వారిని పెద్ద ఎత్తున గుర్తించింది. వారి వద్ద నుంచి రూ.లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఈ డ్రైవ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ సెలబ్రిటీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం పట్టుబడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎల్‌ను నియంత్రించి ఎక్సైజ్ ఆదాయానికి గండి పడకుండా ఉండాలంటే స్పెషల్ డ్రైవ్ నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడికక్కడ నిఘా పెంచాలని, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద చెక్‌పోస్టులు పెట్టాలని, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటేనే ఎన్డీపీఎల్ అరికట్టడం సాధ్యమవుతుందనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. మరి, ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే...! -
హైదరాబాద్.. తగ్గేదేలేద్..!
తగ్గేదే లేదు.. ఆఫీస్ స్పేస్ అయినా.. ఉద్యోగాలైనా.. టాప్ నగరాల్లో మన హైదరాబాద్ ఉండాల్సిందే. ‘వి ఆర్ సిటీ 2024’ పేరుతో ‘అన్ బాక్సింగ్బీఎల్ఆర్ ఫౌండేషన్ ’ రూపొందించిన నివేదిక ఇదే చెబుతోంది. ఖరీదైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కొత్తగా జత కూడిన ప్రధాన ఉద్యోగాల సంఖ్య పరంగా దేశంలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఆసక్తికర విషయం ఏమంటే.. 7 ప్రధాన నగరాల్లో 2018–23 మధ్య కార్మికుల్లో మహిళల వాటా అత్యధికంగా దాదాపు రెండింతలు పెరిగింది హైదరాబాద్‌లోనే. అలాగే 2019–23 మధ్య 6.3 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్ స్పేస్ తోడై టాప్–5 స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీయంగా అయిదేళ్లలో అత్యధికంగా 27 నగరాలు, పట్టణాలకు విమాన సేవలను బెంగళూరు విస్తరిస్తే, హైదరాబాద్ 18 కేంద్రాలతో టాప్–2లో పోటీపడుతోంది. ఇంటి రుణం సగటు అధికంగా ఉన్న టాప్–3 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పాటైన కంపెనీల సంఖ్య పరంగానూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. -
నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా నగలు, నగదు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరబోతున్నారు. సోమవారం నాలుగో రోజు కస్టడీలో భాగంగా నూనె శ్రీధర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించారు. మొదటి మూడు రోజులు సహకరించనప్పటికీ సోమవారం పలు ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ముందుంచి ప్రశ్నించడంతో శ్రీధర్ నోరువిప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిపించగా వాటిలో భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు, నగదును ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం లాకర్లలో లభ్యమైన బంగారు ఆభరణాల విలువే రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని తెలిసింది. అయితే అందులోని ఆస్తుల వివరాలు ఏమిటో తెలియరాలేదు. కోర్టు ఆదేశం ప్రకారం మంగళవారంతో శ్రీధర్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన వివరాల ఆధారంగా శ్రీధర్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరికి ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్‌నగర్‌లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్‌పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్‌ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. -
సాగు అంతంతే
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఇంకా పుంజుకోలేదు. వాస్తవానికి మే నెలలోనే ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో మురిసిపోయిన రైతులు.. అప్పుడు కురిసిన వర్షాలకు పత్తి, మక్కలు, జొన్నలు సాగు చేశారు. ఆపై వరుణుడి జాడ లేకపోవడంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల ఎండిపోయాయి. రెండురోజులుగా కురుస్తున్న తేలకపాటి వర్షాలతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద చాలా చోట్ల నార్లు పోసి, దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 33 వేల ఎకరాల్లో వరి సాగైంది. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి లభ్యత, నీటి విడుదలపై స్పష్టత రాకపోవడం, వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడంతో మెజారిటీ చోట్ల దుక్కులు దున్నడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. పత్తి, జొన్న, మక్కలు, ఇతర తృణధాన్యాల సాగుతోపాటు కంది, పెసర, సోయాబీన్ వంటి పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ వానాకాలంలో కోటి 35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 20 లక్షల ఎకరాల్లో లోపే వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే...ఆరు లక్షల విస్తీర్ణం తక్కువగా ఉంది. – గత సంవత్సరం ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, అదిప్పుడు 16 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. వర్షాలు లేకపోవడం వల్లనే పత్తి సాగు విస్తీర్ణం పెరగలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. – పత్తి తర్వాత అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో సోయాబీన్ 1.25 లక్షల ఎకరాల్లో సాగైంది. – మక్కలు సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేయగా, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఉంది. విత్తనాలు, ఎరువులపై ఆందోళన పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ శాఖలు చేసిన ఆపరేషన్ కొంత విజయవంతమైంది. జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ, సీడ్ సర్టిఫికేషన్ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో చాలా చోట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నిషేధిత బీటీ–3 విత్తనాలను కూడా సీజ్ చేశారు. అయినా ఇంకా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నిజామాబాద్ తదితర చోట్ల నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. – ఎరువులకు సంబంధించి రైతుల్లో ఆందోళన మొదలైంది. పత్తితోపాటు వరికి యూరియా, డీఏపీ అవసరం కాగా, యూరియా కేటాయింపులకు తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జూన్ నెలాఖరు వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 3 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ఇటీవలే తిరిగి ప్రారంభం కావడంతో సమస్య ఉండదని మార్క్‌ఫెడ్ జీఎం విష్ణు ‘సాక్షి’కి తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం యూరియా 9.8 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు డీఏపీ కూడా ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ సీజన్‌కు కేటాయించింది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో యూరియా, డీఏపీ కేటాయింపుల కన్నా ఎక్కువ అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు యూరియా సరఫరా చేయడం లేదని, సన్న యూరియాతో ఇబ్బందులు ఉన్నట్టు రైతులు వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచారు కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచింది. పంటల సాగు మొదలు పెట్టాలనుకుంటున్న రైతులకు యూరియా కొరత సమస్యగా మారింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచితే బాగుంటుంది. – కాలసాని నరసింహారెడ్డి, జమాండ్లపల్లి దొడ్డు యూరియా సరఫరా చేయాలి సహకార సంఘాల్లో మొత్తం దుమ్ముతో కూడిన సన్నపు యూరియానే సరఫరా చేస్తున్నారు. పొలాల్లో చల్లడానికి ఇది ఏమాత్రం అణువుగా ఉండదు. చల్లడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రైతులకు అనువుగా ఉండే దొడ్డు యూరియాను సరిపడా సకాలంలో సరఫరా చేస్తే బాగుంటుంది. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి -
ప్రభుత్వం కన్నా పార్టీనే ప్రధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటం కంటే పార్టీ బలంగా ఉండటమే ప్రధానమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఉద్ఘాటించారు. పార్టీ బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని, సంస్థాగత నిర్మాణం చాలా కీలకమన్నారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం గాందీభవన్‌లో క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు కోసం జిల్లాల వారీగా నియమించిన పరిశీలకులతో వారు విడివిడిగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కూడా పాల్గొన్నారు. కొన్ని కమిటీలు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కూడా ఈనెల 30లోపు పూర్తి చేయాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్ సూచించారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రారంభమవుతుందని, ఈ నియామకాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి ఏఐసీసీ పరిశీలకులు వస్తారని చెప్పినట్లు తెలిసింది. పలువురు పరిశీలకులు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను వివరించారు. కొన్నిచోట్ల కార్యకర్తల అసంతృప్తిని వారి దృష్టికి తెచ్చారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్నాయని, కొన్నిచోట్ల ఆధిపత్య పోరు, సమన్వయ లోపం ఉన్న అంశాన్ని వివరించారు. అన్యాయం చేయం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పీసీసీ నియమించిన పరిశీలకులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో 80 శాతం పాత కాంగ్రెస్ వారికే ఇచ్చామని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న వారికి కూడా ప్రాధాన్యతనిచ్చామన్నారు. 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలనే ప్రాతిపదికను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, కొన్ని సమీకరణలు, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వచి్చన వారికి ఇచ్చామని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే కొంత రాజీపడక తప్పదని వివరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేసే ప్రసక్తే లేదని, అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవుల్లో వారికి తప్పకుండా అవకాశమిస్తామన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారం కోసం రోజూ గాం«దీభవన్‌లో పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల్లో ఎవరో ఒకరు కచి్చతంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండాలన్నారు. పదేళ్లు ఎక్కడో కూర్చుని ఇప్పుడు గ్రామాలకు వెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తామంటే కుదరదని, ప్రజాదరణ ఉన్నవారికే స్థానిక ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి, మహేశ్ గౌడ్ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీ సమావేశం సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, పవన్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.నేడు గాంధీభవన్‌కు సీఎం రేవంత్ గాంధీభవన్‌లో మంగళవారం కూడా కీలక సమావేశాలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. తర్వాత పార్టీ సలహా కమిటీ భేటీ కానుంది. అనంతరం టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాలకు మీనాక్షి నటరాజన్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
స్థానిక ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పు డు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తా మని చెప్పి, ఎందుకు చర్య లు చేపట్టలేదని అడిగింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు 25 రోజులు సమయం కావాలని సర్కార్ బదులిచ్చింది. అక్కడి నుంచి తమకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని ఎస్ఈసీ పేర్కొంది. అనంతరం పిటిషనపై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణు గోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి సోమవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను ఖరారు చేసి, వార్డు సభ్యులు, సర్పంచ్ల సీట్లను కులాల వర్గాల వారీగా ప్రకటించడానికి ప్రభుత్వానికి దాదాపు నెల రోజులు అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ తెలియజేశారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, అప్పటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు. ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికలు లేవు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్, జి.భాస్కర్‌రెడ్డి, సీహెచ్.నరేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చి.. నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని, ఎన్నికల ఆలస్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. కిషన్‌సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు. పరిపాలన ప్రక్రియలు, విధానపరమైన అవసరాలతో కలిగే జాప్యాలను కారణాలుగా చూపుతూ ఎస్ఈసీ ఆ తీర్పును ఉల్లంఘించజాలదని చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరిగేలా చూడటంలో ఎస్ఈసీ స్వతంత్రత, విధి అని నొక్కి చెప్పారు. విపత్తులు లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీలు లేదన్నారు. 2024, జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదని నివేదించారు. తాజా మాజీ సర్పంచ్‌లను పక్కన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243ఈ, 243కేను, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు కొందరు సర్పంచ్‌లు వ్యక్తిగతంగా నిధులు సమకూర్చారని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్కార్, ఎస్ఈసీ మరింత సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పిటిషన్లలో తీర్పును రిజర్వు చేసింది. -
2047కి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ’ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి రాత్రి 9.20 గంటల వరకు సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకునేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశిస్తున్న వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్‌తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్‌కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్ దిశా నిర్దేశం చేసింది. రైతుల సమక్షంలో సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. సీఎం రేవంత్‌రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.400 కోట్లను మంగళవారం జమ చేయనుంది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించింది. ఈ ఘనత సాధించిన శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహం వద్ద.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌తో పాటు మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌కు ఓకే హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను పరిశీలించింది. అనంతరం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ.ల పొడవు ఉండే ఈ అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఒక చుక్క గోదావరి జలాలను కూడా నష్టపోకుండా చిత్తశుద్ధితో పోరాడాలని నిర్ణయించింది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించగా, దాని ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ రూపొందించిందని మంత్రివర్గం పేర్కొంది. ఈ విషయాన్ని మరిచిపోయిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సిద్ధంచేసేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. విభజన వివాదాలపై మళ్లీ చర్చలు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయిన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీల ఆధ్వర్యంలో మళ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాయనుంది. ‘కాళేశ్వరం’ సమాచారాన్ని కమిషన్‌కు ఇవ్వనున్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తెలియజేయాలనుకున్నా, సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెల 30 లోగా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని గడువులోగా కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించింది. సీఎస్ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మేరకే బరాజ్‌లను నిర్మించినట్టు కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. నాటి మంత్రి హరీశ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బరాజ్‌ల నిర్మాణంపై నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాతే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈటల, హరీశ్‌రావు కమిషన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు మంత్రివర్గ సమావేశాల్లో అలాంటి నిర్ణయాలు ఏమీ జరగలేదని రుజువు చేసేందుకు గాను వాటికి సంబంధించిన మినిట్స్ కాపీలను కమిషన్‌కు ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలను పెంపొందించి 2036 ఒలంపిక్స్‌లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలపై త్రైమాసిక సమీక్ష పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించనుంది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించడానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు, క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆయన సేవలను వాడుకోనుంది. ఎంఎన్‌జే ఆస్పత్రి అప్‌గ్రేడేషన్, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. బాసర ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీ కింద మహబూబ్‌నగర్‌లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఏటా 180 మంది విద్యార్థులు చొప్పున 6 ఏళ్లలో 1080 మందికి అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్‌లో శాతవాహన వర్సిటీ కింద ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి 240 మందికి అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. శాతావహన వర్సిటీలో ఈ ఏడాది నుంచి చెరో 60 సీట్లతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. -
స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ (జూన్ 23, 2025న) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
‘నిన్ను సాయంత్రంలోగా చంపేస్తాం’.. ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.