breaking news
International
-
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్‌లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్‌లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్‌కు వెళ్లినా ఆమె డల్లాస్‌లో పెరిగారు. దుబాయ్‌లో చదివారు. ఆమె అనేక జర్నల్స్‌ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్‌లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్‌లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్‌లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్‌తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం. -
‘షట్‌డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్‌డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్‌ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్‌ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్‌ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్‌డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్‌డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ -
మేయర్‌గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్‌స్టా పోస్ట్‌ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. -
దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్‌ను పొందవచ్చు. లేదా యాపిల్ గిఫ్ట్ కార్డులు పొందవచ్చు. యాపిల్ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్‌ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.క్రెడిట్ పాయింట్లువినియోగదారులు తమ పాత ఐఫోన్‌ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.పెరిగిన దొంగతనాలుమెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్‌లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.యాపిల్ ప్రతిస్పందనమెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్‌ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్‌లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం! -
సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో...
గ్రహాంతర వాసులు ఉన్నారా?...యుగాలుగా సాగుతున్న ఈ చర్చ...ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కారణం?ఎక్కడో ఖగోళ దూరాల నుంచి సూర్యుడివైపునకు దూసుకొస్తున్న ‘త్రీఐ-అట్లాస్’!ఏమిటిది? గ్రహాంతర వాసులకు దీనికి సంబంధం ఏమిటి? చూసేయండి...అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నాలుగు నెలల క్రితం ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. చిలీలోని అట్లాస్ అబ్జర్వేటరీ (వేధశాల) సుదూర విశ్వం నుంచి ఓ భారీ ఆకారం చాలా వేగంగా ప్రయాణిస్తూండటాన్ని గుర్తించింది. దానికి ‘త్రీఐ-అట్లాస్’ అని నామకరణం చేసింది. తోకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులను గుర్తించడం నాసాకు కొత్త కాదు. గతంలోనూ ‘1ఐ-ఔముమువా’, ‘2ఐ-బోరిసోవ్’ అనే రెండు ఖగోళ వస్తువులను గుర్తించింది. అయితే వీటితో పోలిస్తే... త్రీఐ-అట్లాస్ వ్యవహారం కొంచెం తేడాగా ఉండటంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగింది. మరిన్ని పరిశోధనలు చేపట్టారు. చాలా విషయాలు తెలిశాయి. మిస్టరీ మరింత పెరిగింది. గ్రహాంతర వాసుల నౌక ఏమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే...త్రీఐ-అట్లాస్ ప్రయాణిస్తున్న కక్ష్యను బట్టి చూస్తే ఇది కచ్చితంగా సౌర కుటుంబం అవతల పుట్టినదని స్పష్టమైంది. సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు దీని వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 కిలోమీటర్లకు చేరింది. గత నెల 29న సూర్యుడికి 20.4 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. త్రీఐ-అట్లాస్ చాలా ప్రత్యేకమైందని చెప్పేందుకు ఇవేవీ కారణం కాదు.. మంచు, దుమ్ము, రాళ్లతో తయారయ్యే తోకచుక్కల వెంబడి దుమ్ము, ధూళిలతో కూడిన ప్రాంతం కొంత ఉంటుంది. దీన్నే మనం తోక అంటూ ఉంటాం. సాధారణంగా అన్ని తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి కానీ త్రీఐ-అట్లాస్ తో సూర్యుడి వైపు ఉండటం విశేషం. రాకెట్ లాంటిది ప్రయాణిస్తోందా? లేక ఇంజిన్ నుంచి వెలువడే పొగలాంటిదా? అని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని స్పీడ్ పెరుగుతున్న తీరును గురుత్వాకర్షణ శక్తితో వివరించలేకపోవడం. ఆక్సిలరేటర్పై కాలు పెడితే వాహనం స్పీడు పెరిగినట్లుగా అన్నమాట. దీన్నిబట్టి త్రీఐ-అట్లాస్‌ను ఎవరో నడుపుతున్నారని అనిపిస్తోందని, సహజసిద్ధంగా ఇలా జరిగేందుకు అవకాశం లేదని నాసా గెలిలియో ప్రాజెక్టు అధ్యక్షుడు, ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లియోబ్ చెబుతున్నారు. చివరగా... సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న త్రీఐ-అట్లాస్‌లో కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి చాల ఎక్కువగా ఉందని, సూర్యూడి నుంచి చాలా దూరంగా ఉన్నా.. బాగా వెలిగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ తోకచుక్కల కంటే భిన్నం ఈ రెండు లక్షణాలు. అంతేకాదు... ఇది సౌర కుటుంబం కంటే పాతది కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులదేనా?త్రీఐ-అట్లాస్ గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌక అయ్యేందుకు అవకాశాలు ఎక్కువని అవి లోయెబ్ అంటున్నారు లోయెబ్ స్కేల్లో తాను త్రీఐ-అట్లాస్‌కు ‘నాలుగు’ మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర వాసులపై మరోసారి చర్చ మొదలైంది. త్రీఐ-అట్లాస్ వింత ప్రవర్తన, తయారైన తీరులను బట్టి ఇది మానవాతీత టెక్నాలజీ ఆవిష్కరణగానే చూడాలని కొందరు వాదిస్తూంటే.. మరికొందరు ఇలాంటి ఆకారాలు ఖగోళం మీద సహజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయో.. జీవం ఆవిర్భావానికి అవసరమైన కీలక మూలకలు విశ్వం మొత్తమ్మీద ఎలా వ్యాపించి ఉన్నాయో తెలుసుకునేందుకు.. గ్రహాలను దాటి ప్రయాణించడమెలా అన్న ప్రశ్నకు ఈ త్రీఐ-అట్లాస్ కొన్ని సమాధానాలు ఇవ్వవచ్చునని శాస్త్రవేత్తల అంచనా... త్రీఐ-అట్లాస్‌ను మీరూ చూడాలనుకుంటున్నారా..??? కనీసం ఎనిమిది అంగుళాల టెలిస్కోపు ద్వారా ఈ నెల మధ్య నుంచి ఆఖరు వరకూ తెల్లవారుఝామున తూర్పు దిక్కులో మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా చూసేయండి!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్‌గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్‌లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ! -
రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ వింత సమాధానం
వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్‌డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025 గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమివర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమివర్జీనియా గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్వర్జీనియా తొలి మహిళా గవర్నర్‌గా అబిగైల్ స్నాన్బర్గర్ రికార్డుసిన్సినాటి మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపుఅట్లాంటా మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికపిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్‌గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. -
Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి, వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.హష్మీ సొంత వెబ్సైట్లో.. ‘ఇతరుల జీవితాలను మెరుగు పరిచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని’ పేర్కొన్నారు. ఆమె గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి సారించారు. 1964లో హైదరాబాద్‌లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్‌పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్ల వయస్సులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు.గజాలా తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అక్కడ అతను ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. తరువాత సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం బోధనా వృత్తిని స్వీకరించారు. అతను స్వయంగా స్థాపించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశాడు. హష్మి తల్లి తన్వీర్ హష్మి హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చేశారు.హష్మి తన విద్యాభ్యాసం సమయంలో పలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందుకున్నారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్‌తో పాటు రిచ్మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ చెస్టర్‌ఫీల్డ్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. మొదట రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో, తరువాత రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో పనిచేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్ గానూ హష్మీ పనిచేశారు. -
Indonesia: 6.2 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు?
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5) శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు. -
ట్రంప్‌కు భారీ షాక్.. మమ్దానీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్‌లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025మమ్దానీ హామీ..జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్జీనియా గవర్నర్‌గా అబిగైల్ స్పాన్‌బెర్గర్
వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా మేయర్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ మంగళవారం జరిగిన వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో గెలిచారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే-సియర్స్‌ను ఓడించిన ఆమె 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.కామన్వెల్త్కు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలిచిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ విజయంతో తాము కామన్వెల్త్లోని ప్రతి మూలకు ఒక సందేశాన్ని పంపామని, దేశవ్యాప్తంగా ఉన్న మా తోటి అమెరికన్లకు తమ సత్తా చూపామని స్పాన్‌బెర్గర్ రిచ్మండ్ తన ఉత్సాహభరిత ప్రసంగంలో పేర్కొన్నారు.మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ గజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు. ఈ పదవిని దక్కించకున్న తొలిమహిళగా హష్మీ నిలిచారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) అధికారి అయిన స్పాన్‌బెర్గర్ ప్రచార సమయంలో దేశంలోని ఆర్థిక సమస్యలను ఎత్తిచూపారు. ఆమె అనుసరించిన వ్యూహం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఇతర డెమొక్రాట్లకు ఒక నమూనాగా ఉపయోగపడనుంది.తన ప్రచారంలో స్పాన్‌బెర్గర్ .. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. ఆమె రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమొక్రాట్లను ఏకం చేయడంలో సహాయపడింది. -
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అమెరికా (USA)లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కెంటకీ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని లూయిస్విల్లేలో టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్ ఫ్లైట్ నంబర్ 2976 విమానం హోనులులుకు మంగళవారం సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించినట్టు వెల్లడించింది. Please pray for my hometown of Louisville, KentuckyA plane crashed near the airport there pic.twitter.com/q2QaNOmfFH— Tim Jones (@TimothyJones92) November 4, 2025ఇక, విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా, ఈ విమానం మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందినది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. WATCH: UPS plane (UPS2976) crashes after takeoff from Louisville Muhammad Ali International Airport.Video validated by the Network pic.twitter.com/h9FtsLRumc— Faytuks Network (@FaytuksNetwork) November 4, 2025 -
‘ట్రంప్‌కు ప్రధాని మోదీపై గౌరవం అందుకే..’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్‌పై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక వార్త ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది. అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తరచూ మాట్లాడుతుంటారని, ఆయన ఇరు దేశాల వాణిజ్య చర్చలను కొనసాగిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.‘అధ్యక్షుడు, ఆయన వాణిజ్య బృందం భారతదేశంతో చర్చలు జరుపుతోందని, ప్రధాని మోదీపై అధ్యక్షునికి అమితమైన గౌరవం ఉందని, వారు తరచూ మాట్లాడుకుంటారని’ వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో అన్నారు. ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో జరిగే సమావేశంలో భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారని కరోలిన్ లీవిట్ తెలిపారు.కాగా భారత్.. రష్యన్ చమురు కొనుగోళ్లకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. మాస్కోలోని రెండు ప్రధాన ముడి చమురు ఎగుమతిదారులైన రోస్నెఫ్ట్, లుకోయిల్‌లపై వాషింగ్టన్ గత వారంలో ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్ చమురు దిగుమతులను తగ్గించాయి.ఇది కూడా చదవండి: మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్ -
ఫిలిప్పీన్స్‌లో ‘కల్మెగి’ విధ్వంసం
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘కల్మెగి’తుపాను హడలె త్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలో సెబు, ఈస్టర్న్ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్ ప్రావిన్స్ లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీసం 40 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. సెబు ప్రావిన్స్‌లో అత్యధి కంగా మరణాలు సంభవించాయన్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉందన్నారు. వరద చుట్టుముట్టడంతో ఇళ్లపైకప్పుల పైకి జనం చేరి, అక్కడే చిక్కుబడి పోయారు. రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.వరదల కారణంగా చెత్తాచెదారం రోడ్లపైకి భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేదాకా తామేమీ చేయలేకపో తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీళ్లలో కార్లు తేలియాడుతున్నాయన్నారు. గుయి మరస్ ప్రావిన్స్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న భీకర గాలులతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు. ఈస్టర్న్ సమర్‌లోని హొమొన్హొన్లో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రావిన్స్‌లో వరదలు సంభవించకున్నా, ఈదురుగాలులు మా త్రం జనాన్ని భయపెట్టాయి. మరో ఘటన, దక్షిణ ప్రాంత అగుసన్ డెల్ సుర్ ప్రావిన్స్‌లో మానవతా సాయం అందించేందుకు బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది.అందులో ఐదుగురు మిలిటరీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తు న్నామని అధికారులు చెప్పారు. అందులోని వారి క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది. కల్మెగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలో అలలు మూడు మీటర్ల వరకు ఎగసిపడవచ్చని, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చ రించింది. ఫెర్రీలను నిలిపివేయడంతో దీవుల మధ్య రాకపోకలు సాగించే 3,500 మంది ప్రయా ణికులు వంద పోర్టుల్లో ఎక్కడివారక్కడే నిలిచిపో యారు. 186 దేశీయ విమానసర్వీసులను అధికా రులు రద్దు చేశారు. దక్షిణ చైనా సముద్ర తీర దేశం ఫిలిప్పీన్స్‌లో ఏటా 20 వరకు తుపాన్లు సంభవిస్తుంటాయి. ఇవికాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం సర్వసాధారణం. -
‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) ఇప్పుడు బంగ్లాదేశ్‌లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ‘ఇస్కాన్’పై ఉగ్రవాద ముద్ర వేశాయి. అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్‌లోని పలు హిందూ దేవాలయాలను ఇస్లాంవాదులు తగులబెట్టారు. హిందూ వ్యతిరేక నినాదాల హోరుఇస్కాన్ ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మతఛాందసవాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాజధాని ఢాకా, చట్టోగ్రామ్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. ఇస్కాన్ ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు. ఈ నేపధ్యంలోనే చట్టోగ్రామ్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి. హెఫాజత్-ఎ-ఇస్లాం, ఇంతిఫాదా బంగ్లాదేశ్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌ను నిషేధించాలని పిలుపునిచ్చిన ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ గతంలో ముస్లిం మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండించింది. యూనస్ ప్రభుత్వం రాకతో..ఇటీవల ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదు సమీపంలో జరిగిన సమావేశంలో ఇంతిఫాదా బంగ్లాదేశ్ సంస్థ పలు డిమాండ్లను ప్రస్తావించింది. ఇస్కాన్‌ను నిషేధించడమనేది వాటిలో ప్రధానమైనది. ఢాకాకు చెందిన బంగ్లా దినపత్రిక దేశ్ రూపాంతర్ తెలిపిన వివరాల ప్రకారం అల్-ఖైదా అనుబంధ అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ) చీఫ్ జాసిముద్దీన్ రెహమానీ ఇటీవల ఇస్కాన్‌ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు. కాగా 2024, ఆగస్టులో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెహ్మాన్ ను జైలు నుంచి విడుదల చేశారు. పలు నేరాలకు పాల్పడిన అవామీ లీగ్‌ను నిషేధించిన విధంగానే, తీవ్రవాద సంస్థగా ఇస్కాన్‌ను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ చట్టోగ్రామ్ ర్యాలీలో ఒక ఇస్లాం వక్త ప్రసంగించినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ పేర్కొంది.1970 నుండి నిస్వార్థ సేవలు2024, ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌పై నిరసనలు పెరిగాయి. పలు ఇస్కాన్ దేవాలయాలు , కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. ప్రముఖ హిందూనేత కృష్ణ దాస్ ప్రభును అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 1970 నుండి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిస్వార్థ సేవలు అందిస్తోంది. 1971లో విముక్తి యుద్ధం, వరదల కాలంలో లక్షలాది మందికి ఉచితంగా ఆహారపానీయాలు అందించింది. మతంతో సంబంధం లేకుండా అక్కడి నిరుపేద పిల్లల కోసం అనేక పాఠశాలలను కూడా స్థాపించింది. వృద్ధాశ్రమాలను కూడా నిర్వహిస్తున్నది. ఇది కూడా చదవండి: బుడిబుడి అడుగులతో రోబో గోమాత -
భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు
న్యూయార్క్: ఇటీవల కాలిఫోర్నియాలో ముగ్గురు మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ కేసు మరో మలుపు తిరిగింది. అతను మద్యం మత్తులో వాహనం నడపడం లేదని, అది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమని విచారణలో తేలిందని యూఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రాథమిక నివేదికలో సదరు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు. యుబా సిటీకి చెందిన 21 ఏళ్ల జషన్‌ప్రీత్ సింగ్‌ను అక్టోబర్ 21న మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడనే అనుమానంతో అమెరికా పోలీసులు అరెస్టు చేసి, అతనిపై హత్యా నేరం మోపారు. నాడు కాలిఫోర్నియాలోని ఒంటారియోలో డ్రైవర్ జషన్‌ప్రీత్ సింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ జషన్‌ప్రీత్ సింగ్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో మత్తు కలిగించే పదార్థాలు ఏవీ లేవని నిర్ధారణ అయ్యింది. అయితే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన హత్యగా దీనిని గుర్తిస్తున్నట్లు శాన్ బెర్నార్డినో కౌంటీ అటార్నీ కార్యాలయం మీడియాకు తెలిపింది.డాష్‌క్యామ్ ఫుటేజ్‌లో నాడు సింగ్ రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో అధిక వేగంతో ట్రక్కును నడిపినట్లు తేలింది. ఇది ముగ్గురు ప్రాణాలను బలిగొన్న దారుణమైన విషాదం. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నిందితుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ పేర్కొన్నారు. సింగ్‌కు ఇప్పుడే బెయిల్ ఇవ్వలేమని, నేరం తీవ్రత, ప్రమాదం తీరు ఆధారంగా బెయిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా అక్రమ వలసదారుడైన సింగ్ 2022లో యూఎస్ దక్షిణ సరిహద్దును దాటాడు. అతని ఇమ్మిగ్రేషన్ విచారణ పెండింగ్‌లో ఉందని గత నెలలో ‘ఫాక్స్ న్యూస్’ పేర్కొంది. ఇది కూడా చదవండి: మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్ -
మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33 ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్‌లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు. -
లోకల్ గ్యాంగ్ హాలీవుడ్ రేంజ్ చోరీ
అది పారిస్‌లోని ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే మ్యూజియం.. కళలు, చరిత్రకు ప్రతీకగా నిలిచే లూవ్రె మ్యూజియం. అలాంటి చోట గత నెలలో జరిగిన 88 మిలియన్ యూరోలు (సుమారు రూ. 760 కోట్లు) విలువైన ఆభరణాల చోరీ యా వత్ ఫ్రాన్స్‌ను, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ అత్యంత నాటకీయమైన దోపిడీకి పాల్పడింది.. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా కాదని, సాధారణ చిల్లర దొంగలని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం విస్మయపరిచింది. సినిమాను తలపించే దొంగతనం దోపిడీ జరిగిన తీరు చూస్తే, అది పక్కా ప్రొఫెషనల్స్ పనే అని అంతా భావించారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.30 గంటలకు, మ్యూజియాన్ని సందర్శకుల కోసం తెరిచిన కొద్దిసేపటికే దొంగలు లోపలికి చొరబడ్డారు. లిఫ్ట్‌తో ఎంట్రీ నలుగురు దొంగలు దొంగిలించిన మెకానికల్ లిఫ్ట్ వాహనం సాయంతో మ్యూజియం బాల్కనీకి చేరుకున్నారు. 4 నిమిషాల్లో క్లీన్ స్వీప్ అక్కడి నుంచి నేరుగా ’గ్యాలరీ డి అపోలో’లోకి దూరి, డిస్క్ కట్టర్ ఉపయోగించి ప్రదర్శన షో కేసులను పగలగొట్టారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో అత్యంత విలువైన 8 నగలను దోచుకున్నారు. స్కూటర్లపై పరారీఉదయం 9.38 గంటలకు దొంగలు బయట సిద్ధంగా ఉంచిన రెండు స్కూటర్లపై పరారై, ఆ తర్వాత కార్లలోకి మారి పారిపోయారు. ఈ హడావిడిలో దొంగలు దొంగిలించిన ఒక కిరీటాన్ని మాత్రం కింద పడేసి వెళ్లారు. మిగతా ఏడు నగలు ఇప్పటికీ దొరకలేదు. నలుగురు పట్టివేత అరెస్ట్ అయిన నలుగురిలో.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పారిస్‌కు ఉత్తరాన ఉన్న పేద ప్రాంతమైన సీన్–సెయింట్–డెనిస్‌లో నివసించే స్థానికులేనని పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెకో స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు పురుషులు గతంలో కూడా అనేక దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవించినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరు వృత్తిపరమైన చిల్లర నేరగాళ్లే తప్ప, అంతర్జాతీయ మాఫియా ముఠాలకు చెందిన వారు కారు. వీరిలో ఒక జంట మాత్రం తమకు ఈ దొంగతనంతో సంబంధం లేదని వాదిస్తోంది. అరెస్టయిన ఇద్దరు పురుషులు మాత్రం.. తమ ప్రమేయాన్ని పాక్షికంగా అంగీకరించారు. ఈ నలుగురు కాక, ఈ దొంగతనాన్ని అమలు చేసిన ఒక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. చారిత్రక నగలు చోరీ చేసిన ఆభరణాలలో.. ఎంప్రెస్ యూజీనీ (నెపోలియన్ ఐఐఐ భార్య) ధరించిన బంగారు కిరీటం, మేరీ–లూయిస్ నెక్లెస్, చెవిపోగులు వంటి అత్యంత చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగిలించిన వస్తువులు ఇప్పటికే విదేశాలకు తరలిపోయి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నప్పటికీ.. వాటిని భద్రంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ప్రాసిక్యూటర్ వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత, ఫ్రాన్స్ దేశంలోని ఇతర సాంస్కృతిక సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక, లూవ్రె మ్యూజియం నిర్వాహకులు.. తమ విలువైన ఆభరణాలలో కొన్నింటిని మరింత భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌కు తరలించారు. ఏదేమైనా, ಲచోరీల చరిత్రలో, ఈ సైన్–సెయింట్–డెనిస్ గ్యాంగ్ తమ ’మెకానికల్ లిఫ్ట్’, ’స్కూటర్ ఎస్కేప్’ స్టయిల్‌తో ఒక నవ్వుల పేజీని లిఖించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయి
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది. ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు చైనా, పాక్‌లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్‌కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్హెడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు. -
ఆమె నిజమైన దేశభక్తురాలు: కాష్ పటేల్
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, భారతీయ మూలాలున్న కశ్యప్(కాష్) పటేల్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన ప్రేయసితో కలిసి ఎఫ్‌బీఐకి చెందిన జెట్‌లో ప్రయాణించడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో రాజకీయ ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు.కశ్యప్ పటేల్(45) తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్(26)తో కలిసి ఎఫ్‌బీఐకి చెందిన జెట్ విమానంలో అక్టోబర్ 25వ తేదీన పెన్సిల్వేనియాకు ప్రయాణించారు. అక్కడ ఓ రెజ్లింగ్ ఈవెంట్లో ఆమె గాన ప్రదర్శన ఇచ్చారు. ఈ విమాన ప్రయాణానికి అయిన ఖర్చు 60 మిలియన్ డాలర్లపైనే. దీంతో దుమారం రేగింది. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఓ పాడ్‌కాస్ట్‌లో మండిపడ్డారు. దేశం షట్‌డౌన్ ఉన్న టైంలో.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఇలా సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేయడం ఏంటి? అని నిలదీశారు. దీంతో కాష్ పటేల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఎఫ్‌బీఐకి చెందిన విమానంలో ప్రయాణించారని, పైగా అందుకు అయ్యే ఖర్చులు ఆయనే భరిస్తారని, వ్యక్తిగత ప్రయాణాల్లో విమానం వినియోగం పరిమితంగానే అదీ విధానాలకు అనుగుణంగా ఉంటుందని ఎఫ్‌బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తనపై వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు అసత్యమైనవని, రాజకీయంగా ప్రేరితమైనవని అన్నారు. నన్ను విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం దారుణం. అలెక్సిస్ నిజమైన దేశభక్తురాలు, నా జీవిత భాగస్వామి. ఆమెపై వచ్చిన ఆరోపణలు అతి నీచమైనవి. ఆమె దేశానికి చేసిన సేవలు చాలా మందికి పదే పదే జీవితాల్లో సాధ్యం కాదు. రాజకీయ వర్గాల్లో మాకు మద్దతు ఆశించాం. కానీ, వాళ్ల మౌనం వల్ల విమర్శలు పెరిగిపోతున్నాయి. నా కుటుంబం మీద ప్రేమే నా బలానికి మూలం. ఎఫ్బీఐను పునర్నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారాయన. ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి బెన్ విలియమ్సన్.. కాష్ పటేల్ విమాన ప్రయాణంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అవన్నీ అర్థం లేని కథనాలని కొట్టిపారేశారు. మరోవైపు.. తన విమాన ప్రయాణ వివరాలు లీక్ కావడంపై కాష్ పటేల్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ సీనియర్ ఉద్యోగి స్టీవెన్ పాల్మర్ (విమాన విభాగం అధిపతి) రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.న్యాయనిపుణుడైన కాష్ పటేల్, అమెరికన్ సింగర్ అయిన అలెక్సిస్ విల్కిన్స్లు 2023 జనవరి నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరి మధ్య వయసు తేడా 19 ఏళ్లు. అలెక్సిస్ విల్కిన్స్పై గతంలో ఇస్రాయెల్ గూఢచారి అనే ప్రచారం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలపై ప్రభావం చూపేందుకు ఆమె ప్రయత్నించిందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఆరోపణలు చేసిన కైల్ సెరాఫిన్పై అలెక్సిస్ 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు. -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్‌కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్‌ను వెనుజులా ప్రెసిడెంట్‌గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్‌తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
Afghanistan: 6.3 తీవ్రతతో భూకంపం.. ఏడుగురు మృతి
కాబూల్: ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్ ఎ షరీఫ్ సమీపంలో (నేడు) సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు మృతిచెందారని, 150 మంది గాయపడ్డారని, బాధితులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సమీమ్ జోయాండా ‘రాయిటర్స్’కు తెలిపారు. CCTV footage shows the moment a strong M6.3 earthquake struck Mazar-e-Sharif, Afghanistan, a short while ago. pic.twitter.com/NX0o04Ggi5— Weather Monitor (@WeatherMonitors) November 2, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం దాదాపు ఐదు లక్షల, 23 వేల జనాభా కలిగిన మజార్ ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ (17.4 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ‘రాయిటర్స్’ ఈ వీడియోలు, ఫొటోలను వెంటనే ధృవీకరించలేదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా జనం మరణించారని మానవతా సంస్థ ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్ -
ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తూ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తూ ఆఫ్రికన్ దేశం నైజీరియాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనిక చర్య తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యే నైజీరియాను అమెరికా ‘కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్’ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసపై తీవ్రంగా స్పందించారు. ఫ్లోరిడాలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను’’ అని తీవ్ర హెచ్చరికలే జారీ చేశారాయన. అంతకు ముందు.. శుక్రవారం కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. నైజీరియాలో క్రైస్తవత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ హింసకు రాడికల్ ఇస్లామిస్టులు కారణమని ఆయన ఆరోపించారు. ఇది ఆగకపోతే నైజీరియాకు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరిస్తూనే.. గన్స్-అ-బ్లేజింగ్ అంటూ అమెరికా సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. సీపీసీ అంటే..తాజాగా నైజీరియాను కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో చేర్చారు. ఆ వెంటనే ఆ జాబితా వెలువడడం గమనార్హం. సీపీసీని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తయారు చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (International Religious Freedom Act - IRFA) 1998 ప్రకారం.. ప్రతి ఏటా ఈ జాబితాను రివైజ్ చేస్తుంటారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి (U.S. Secretary of State) ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల మినహాయింపులు ఇవ్వవచ్చు. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నైజీరియా స్పందనఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టిన్బు వ్యాఖ్యానించారు. అయితే.. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని కోరారు. ‘‘ఆయన నైజీరియా పట్ల సానుకూలంగా ఉన్నారనే భావిస్తున్నాం. ఇరు దేశాధినేతలు కూర్చుని మాట్లాడుకుంటే.. ఉగ్రవాదాన్ని అణచివేయడం అంత కష్టమేమీ కాదు. ఆయన్ని త్వరలోనే మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు’’ అంటూ అధ్యక్ష సలహాదారు డేనియల్ బ్వాలా చెబుతున్నారు. నైజీరియాలో ఏం జరుగుతోందసలు.. నైజీరియాలో బోకోహరాం, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్( ISWAP) వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు గత కొంతకాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు.. మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా..ప్లాటూ, బెన్యూ, కడునా రీజియన్లలో క్రిస్టియన్లపై దాడులు పరిపాటిగా మారాయి. నైజీరియన్ సంస్థల కథనాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటిదాకా 600 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు ఇక్కడ. అయితే.. కొన్ని గ్లోబల్ సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7,000 దాకా ఉండొచ్చని చెబుతున్నాయి. అలాగే లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతర్యుద్ధాల కారణంగా అవి ఫలించడం లేదు. -
బీజింగ్‌లో రామాయణ నృత్య రూపకం
బీజింగ్: ప్రముఖ చైనా పండితుడు, దివంగత ప్రొఫెసర్ జి.జియాన్లిన్ అనువదించిన రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆది కావ్యం–మొదటి కవిత’అనే నృత్య రూపకాన్ని చైనా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భారత నాట్యంలో నిపుణురాలైన చైనా కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వంలో, 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్థానిక కళాకారులతో కూడిన బృందం ఈ నాటకాన్ని శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శించింది. ఇది ‘అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం’.. అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో అభివరి్ణంచింది. ఈ ప్రదర్శనను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ నృత్య రూపకాన్ని బీజింగ్‌లో ప్రదర్శించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ప్రదర్శించారు. గత నెలలో, రాయబార కార్యాలయం ’సంగమం–భారతీయ తాతి్వక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ చైనా పండితులు భగవద్గీత, భారతీయ నాగరికతా విలువలపై ప్రసంగించారు. -
భారత్‌పై ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదం
న్యూఢిల్లీ: భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో చేస్తున్న ఆర్థిక దాడిని యోగా గురువు బాబా రాందేవ్ తప్పుబట్టారు. ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్థిక యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి ఆర్థిక యుద్ధానికైనా ‘స్వదేశీ’యే సరైన పరిష్కారమని రాందేవ్ తెలిపారు. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంట మహనీయులు ఇదే విషయం చెప్పారన్నారు. ఆత్మ నిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబన స్వదేశీకి కీలకమన్నారు. అమెరికా అవలంభిస్తున్న విస్తరణ, సామాజ్రావాద ధోరణుల నేపథ్యంలో దేశీయంగా తయారైన ఉత్పత్తులు, వస్తువులను కొనడం ద్వారా అందరం అభివృద్ధి చెందుతామన్నారు. -
రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి
మాస్కో: ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్ట్నిక్ క్షిపణిని ప్రయోగించి ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాలపై భీకరస్థాయిలో దాడులు చేయగల పోసెడాన్ అణ్వస్త్ర డ్రోన్‌ను ప్రయోగించే సామర్థ్యమున్న ‘ఖబరోవ్స్క్’ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్ కాబట్టే పోసెడాన్ డ్రోన్‌ను ప్రళయకాల(డూమ్స్‌డే) క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలౌస్క్, నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మోసెయేవ్ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్విన్స్క్ నగరంలోని సేవ్మాష్ షిప్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండే ఖబరోవ్స్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థల మేలు కలయిగా చెప్పొచ్చు. శత్రుదేశాల నిఘా నుంచి సునాయసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలీకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్‌లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
తొలిసారి అమెరికాకు సిరియా అధ్యక్షుడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మధ్య భేటీ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్‌ను సిరియా తాత్కాలిక అధ్యక్షుడు ఆల్ షరా వాషింగ్టన్లో కలవనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సిరియా అధ్యక్షుడు అధికారికంగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడూ సిరియా అధ్యక్షుడికి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందలేదు. దీనికి కారణం వారి మధ్య ఉన్న శత్రుత్వమే. ఇరుదేశాల మధ్య గతంలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే తమ శత్రు దేశమైన సిరియాకు ఆహ్వానం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికా-సిరియాల సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉండేవి. సిరియాలోని అంతర్గత యుద్ధం, ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం, మానవ హక్కుల ఉల్లంఘనలకు సిరియా పాల్పడుతోందని అమెరికా విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆ దేశంపై కఠినపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరియాను తమ దారికి తెచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న అల్ షరాకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ప్రధానంగా ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా వంటి తదితర దేశాలు ఈ భేటీని నిశితంగా గమనించే అవకాశం ఉంది. 25 ఏళ్లలో తొలిసారి..ఈ ఏడాది మే నెలలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా భేటీ అయ్యారు. ఇది 25 ఏళ్లలో అమెరికా, సిరియాల మధ్య జరిగిన మొదటి సమావేశం. ఈ సమావేశం తరువాత సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. -
హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ
జెరూసలేం: హెజ్బొల్లా(Hezbollah),హమాస్‌లపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థల అగ్రనేతలను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఈక్రమంలోనే హెజ్బొల్లాకు చెందిన రద్వాన్ ఫోర్స్‌పై ఐడీఎఫ్ దాడికి దిగింది. ఈ దాడిలో రద్వాన్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు హెజ్బొల్లాకు ఆయుధాల సరఫరా, ఉగ్రవాద మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది.ఈ దాడి శనివారం రాత్రి రమాన్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఉత్తర కమాండ్ ఆధ్వర్యంలో వైమానిక దళాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. రద్వాన్ ఫోర్స్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఐడీఎఫ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలాంట్ (Yoav Gallant) స్పందించారు. హెజ్బొల్లా నిప్పుతో చెలగాటం ఆడుతోంది. వారు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. గత ఒప్పందం ప్రకారం, కాల్పుల విరమణ జరగాలి. హెజ్బొల్లా తన ఆయుధాలను సమర్పించి, దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని లెబనాన్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ సంస్థ అలాచేయడం లేదు. కాల్పులకు తెగబడుతోంది. దీనికి ప్రతిగా మేము మా దాడులను కొనసాగిస్తాం. అవసరమైతే మరింత ముమ్మరంగా స్పందిస్తాం. ఇజ్రాయెల్ తన భద్రతా చర్యలను గరిష్ట స్థాయిలో కొనసాగిస్తుంది. ఉత్తర ప్రాంత నివాసితులకు ముప్పు కలిగించే ప్రయత్నాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము’ అని ఆయన హెచ్చరించారు -
Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి
మెక్సికో: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో జరిగిన పేలుడులో 23 మంది మృతిచెందగా, మరో 11 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. హెర్మోసిల్లోలోని వాల్డోస్ స్టోర్‌లో పేలుడు సంభవించింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డ్యూరాజో ఒక వీడియో సందేశంలో తాము చూసిన బాధితుల్లో చాలా మంది మైనర్లని తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు, బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర, భద్రత, ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో స్పందించి, పరిస్థితిని నియంత్రించి, ప్రాణాలను కాపాడారని తెలిపారు. కాగా మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మృతులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను సోనోరా గవర్నర్ అల్ఫోన్సో డురాజోతో సంప్రదింపులు జరిపానని, సహాయక బృందాలను అప్రమత్తం చేయాలని కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌ను ఆదేశించానని తెలిపారు. Mis sentidas condolencias a las familias y seres queridos de las personas fallecidas en el incendio ocurrido en una tienda en el centro de Hermosillo.He estado en contacto con el gobernador de Sonora, Alfonso Durazo, para apoyar en lo que se necesite. Instruí a la secretaria de…— Claudia Sheinbaum Pardo (@Claudiashein) November 2, 2025సూపర్ మార్కెట్లో పేలుడు జరిగిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని అగ్నిమాపక విభాగం చీఫ్ తెలిపారు. రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ మాట్లాడుతూ విషపూరిత వాయువులను పీల్చడం వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని మీడియా నివేదికల్లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొన్నారు. పేలుడుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణం కాగవచ్చని మెక్సికన్ అధికారులు భావిస్తున్నారు. కాగా సోనోరాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగివుండవచ్చని పేర్కొంది. -
london: రైలులో కత్తిపోట్లు.. 9 మంది పరిస్థితి విషమం
యునైటెడ్ కింగ్డమ్: లండన్‌కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్డమ్ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రి షబానా మహమూద్ ధృవీకరించారు.ఈ రైలు.. డాన్‌కాస్టర్ నుండి లండన్‌లోని రద్దీగా ఉండే కింగ్స్ క్రాస్ స్టేషన్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. అలారం మోగిన వెంటనే, కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్డన్ రైల్వే స్టేషన్‌ను సాయుధ పోలీసులు, పోలీసు కార్లు అంబులెన్స్‌లు చుట్టుముట్టాయి. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు (బీటీపీ) ‘ఎక్స్’లో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఉగ్రవాద నిరోధక విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. రైలులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటన గురించి వివరించారు. ఒక పొడవైన కత్తిని పట్టుకున్న వ్యక్తిని చూసినట్లు ఒకరు ‘టైమ్స్’ వార్తాపత్రికకు తెలిపారు. ఆ సమయంలో అంతటా రక్తం కనిపించిందని, ప్రయాణికులు భయంతో వాష్‌రూమ్‌లలో దాక్కున్నారని తెలిపారు. మరొకరు ‘స్కై న్యూస్’తో మాట్లాడుతూ, రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడని, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూశామని చెప్పారు.BREAKING: Major incident unfolding as up to 10 people stabbed on a train in Huntington, Cambridgeshire. pic.twitter.com/KYC7aN68QQ— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) November 1, 2025 ఆందోళనకరం: ప్రధాని కీర్ స్టార్మర్యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఘటనను భయంకరమైనది.. ఆందోళనకరమైనదిగా పేర్కొన్నారు. బాధితుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని, అయితే వెంటనే ప్రతిస్పందించిన అత్యవసర సేవా విభాగాలకు ధన్యవాదాలు అని ఆయన ‘ఎక్స్’లో ఒక తెలిపారు. కాగా ఈ ఘటన మరోసారి యునైటెడ్ కింగ్డమ్లో పెరుగుతున్న కత్తి దాడుల ప్రమాదాలను ఎత్తిచూపింది. అధికారిక డేటా ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్లో 2011 నుండి తరహా దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో ఇటువంటి దాడులను జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు.ఇది కూడా చదవండి: Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం -
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్‌గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’ -
టాంజానియా అధ్యక్షురాలిగా సమియా హసన్ ఎన్నిక
కంపాలా(ఉగాండా): టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ అపూర్వ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని శనివారం అధికారులు ప్రకటించారు. ఎన్నికలు వివాదాస్పదంగా మారిన వేళ అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశ పరిపాలనా రాజధాని డొహొమాలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆమెను ఎన్నికల్లో విజేతగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీలో లేకుండా చేయడం, చిన్న పార్టీలకు చెందిన 16 మంది అభ్యర్థులను హస్సన్ ఎదుర్కోవడం తదితర అంశాల్లో ఈ ఎన్నికలపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అక్టోబర్ 29వ తేదీన ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావడంతోపాటు పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, మిలటరీతో తలపడ్డారు. ఈ ఘర్షణల్లో కనీసం 10 మంది చనిపోయినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జాన్ పొంబె ముగుఫులి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోవడంతో, ఉపాధ్యక్షురాలిగా ఉన్న హస్సన్ 2021లో అధ్యక్షురాలయిన సంగతి తెలిసిందే. -
లక్నోకు విశిష్ట గుర్తింపు
లక్నో: నవాబ్‌ల నగరం లక్నో కీర్తికిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. దూది పింజంలాంటి సుత్తి మెత్తని గలౌటీ కబాబ్‌లు, ఘుమఘుమల అవధ్ బిర్యానీ, మఖన్ మలాయ్ దాకా ఎన్నెన్నో నోరూరించే వంటకాలకు పేరెన్నికగన్న లక్నోకు యునెస్కో తన ‘పాకశాస్త్ర ప్రవీణ’ కంకణాన్ని కట్టబెట్టింది. ప్రాచీన సంప్రదాయ వంటకాలకు వారసత్వంగా కాపాడుకుంటూ భావి తరాలకు వాటిలోని కమ్మదనం, రుచి, ఘుమఘుమలను అందిస్తూ లక్నో తన ఆహార, ఆతిథ్య ప్రతిభను చాటిందని యునెస్కో శ్లాఘించింది. ఈ మేరకు ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ హోదాతో గౌరవించింది. ఆహార సంస్కృతి సంప్రదాయాలకు తోడు మేలైన దినుసుల మేళవింపుగా అద్భుతమైన రుచితో పలు రకాల వంటకాలకు లక్నో కేంద్రస్థానంగా మారిందని యునెస్కో పొగిడింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తాజాగా 58 నగరాలను తమ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్(సీసీఎన్)లో చేర్చగా అందులో లక్నో స్థానం సంపాదించుకుంది. దీంతో మొత్తం 100 దేశాల్లో ఇప్పటిదాకా ఈ జాబితాలో చేరిన నగరాల సంఖ్య 408కి పెరిగింది. వంటల రాజధాని లక్నోకు విచ్చేసే స్వదేశీ, విదేశీ పర్యాటకులకు ఏ మూలన చూసిన విశిష్టమైన ఆహారపదార్థాలు ఆహ్వానం పలుకుతాయి. చూడగానే నోట్లో లాలాజలం ఊరేలా చేస్తాయి. గలౌటీ కబాబ్, అవధ్ బిర్యానీ, ఎన్నో దినుసుల ఛాట్, గోల్గప్పాతోపాటు మఖన్ మలాయ్ వంటి తీపి పదార్థాలను రుచి చూసిన వాళ్లకే తెలుస్తుంది ఆ వంటకాల్లోని గొప్పదనం. భోజనప్రియులకు లక్నో ఒక స్వర్గం. అక్కడ స్థానిక వంటకాలకు కొదువే లేదు. శతాబ్దాలనాటి సంప్రదాయక వంటకాలకు ఎప్పట్నుంచో అంతర్జాతీయ పేరున్నా యునెస్కో వంటి ఐరాస అనుబంధ సంస్థ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. ‘‘భారత ఘన వారసత్వాల్లో ఆహార పదార్థాలూ ప్రధానమే. పాక నైపుణ్యంలో విలక్షణ భారతీయ శైలిని లక్నో శతాబ్దాలుగా అలాగే కొనసాగిస్తోంది’’ అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తంచేశారు. తిండిప్రియులకు లక్నో స్వర్గధామం. ‘‘ మెత్తని చికెన్, మటన్‌తో చేసే గలౌటీ(గలావతి) కబాబ్ నోట్లో వేయగానే కరిగిపోతుంది. సాధారణ స్థాయి మసాలా దట్టించిన ఈ కబాబ్ రుచి అసాధారణం. నగర చిరునామాగా ఎన్నో వంటకాలున్నాయి’’ అని లక్నోలోని అమీనాబాద్‌లోని ప్రఖ్యాత ఠండే కబాబ్ దుకాణం యజమాని మొహమ్మద్ ఉస్మాన్ చెప్పారు. ‘‘మలాయ్ గిలౌరీ లక్నోలో ఎంతో ఫేమస్. బంగాళాదుంపకు బదులు ఉడికించిన తెల్ల బఠానీల మసాలాతో పానీ కీ బతాషే రుచి చూస్తే అంతే ఇక. షీర్మల్, దవళవర్ణ బటర్ కుల్చా, నిహారీ, దాల్–గోష్త్, పత్థర్ కీ కబాబ్‌ల దాకా ఎన్నో వెరైటీ వంటకాలను ఇక్కడ రుచి చూడొచ్చు. -
నిర్బంధాన్ని ఒప్పుకోం
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత నౌకాయానం ఉండాలని భారత్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఎలాంటి నిర్బంధ విధానాలు సహించేది లేదని స్పష్టంచేశారు. కౌలాలంపూర్‌లో శనివారం ఆయన ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడీఎంఎం–ప్లస్) కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. ‘చట్టంపట్ల భారత్ తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్ (యూఎన్సీఎల్ఓఎస్)పై భారత్‌కు పూర్తి నమ్మకం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలన్న భారత ఆకాంక్ష ఏ దేశానికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రాంత దేశాల ఉమ్మడి భద్రత, ప్రయోజనాల కోసమే మేం ఈ విధానం అవలంభిస్తున్నాం. ఈ ప్రాంతం ఎలాంటి నిర్బంధాలు, బలప్రయోగాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. భవిష్యత్తులో భద్రత అనేది కేవలం సైనిక సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వనరులు పంచుకోవటంపై, డిజిటల్, భౌతిక మౌలిక వసతులపై, మానవతా సంక్షోభాలను కలిసికట్టుగా ఎదుర్కోవటంపై ఆధారపడి ఉంటుంది’అని పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా సైనిక బలప్రయోగానికి పాల్పడుతూ ఆ ప్రాంత దేశాలపై బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏషియాన్‌తో భారత్‌ది ఆర్థిక బంధం కాదు ఏషియాన్ దేశాలతో భారత్‌కు ఉన్నది ఆర్థిక బంధం మాత్రమే కాదని, అంతకుమించి సైద్ధాంతిక అనుబంధమని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఏషియాన్ నాయకత్వంలో ఈ ప్రాంత సమగ్ర భద్రత కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పరస్పర ప్రయోజనాలు కాపాడేందుకు ఏషియాన్‌తో భారత్ మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఏషియాన్ ప్లస్ దేశాలతో రక్షణ సహకారాన్ని భారత్ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామర్థ్య పెంపు కోసమేనని భావిస్తోందని పేర్కొన్నారు. ఈ రక్షణ సహకారాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ‘భద్రత, వృద్ధి, స్వయం సమృద్ధిలో ఈ బలమైన అంతర్గత సంబంధం ఇండియా, ఏషియాన్ మధ్య నిజమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది’అని తెలిపారు. -
అవి బందీల అవశేషాలు కావు: ఇజ్రాయెల్
జెరూసలేం: హమాస్ ఈ వారంలో రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేసిన అవశేషాలు బందీలవి కావని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న 30 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను గాజాలో అందజేసింది. ప్రతిగా శుక్రవారం హమాస్ శ్రేణులు ముగ్గురు బందీల అవశేషాలను రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఇజ్రాయెల్ అధికారులు పరీక్షలు జరిపి అవి బందీలవి కావని తేల్చారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ శనివారం ప్రకటించారు. ఆ అవశేషాలు ఎవరివనే విషయం తేలాల్సి ఉంది. అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక, 17 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. చిట్టచివరిగా 11 మంది మృతదేహాల అప్పగింత ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇజ్రాయెల్ అందజేసిన 225 మంది పాలస్తీనియన్ల మృతదేహాల్లో 75 మందిని మాత్రమే కుటుంబాలు గుర్తించాయని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. -
భారత్–రష్యా సంబంధాలను దెబ్బతీసే ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: భారత్–రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి ఆదేశాలను తాము ఇవ్వాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి తమ చిన్నారి సహా దొంగచాటుగా సొంత దేశం రష్యా వెళ్లిపోయిన మహిళ జాడ కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్న వేళ ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని విదేశాంగ శాఖ అక్టోబర్ 17వ తేదీన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రష్యా మహిళ తప్పించుకుపోవడంపై నేపాల్‌కు చెందిన వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు. నేపాల్, యూఏఈల మీదుగా ఆ మహిళ సొంత దేశం వెళ్లేందుకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ అధికారులు సాయపడినట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ విషయంలో రష్యా అధికారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినా సరైన ఫలితం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య సంబంధాలను దెబ్బతీసే ఏ ఉత్తర్వునూ మేం ఇవ్వదలుచుకోలేదు. కానీ, ఇది ఒక బిడ్డకు సంబంధించిన విషయం. తల్లితో ఉన్న ఆ చిన్నారి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడని మాత్రమే మేం ఆశించగలం. ఇది మానవ అక్రమ రవాణా కేసు కాకూడదని ఆశిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో విదేశాంగ శాఖ, ఢిల్లీ పోలీసులతో చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం రెండు వారాల గడువిచ్చింది. దేశంలో 2019 నుంచి ఉంటున్న ఆ మహిళ ఎక్స్–1వీసా గడువు ఎప్పుడో తీరిపోయింది. చిన్నారి కస్టడీ కేసు కోర్టులో ఉండటంతో ఎప్పటికప్పుడు వీసా కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చారు. అయితే, ఆమె అధికారుల కళ్లుగప్పి రష్యా వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ చిన్నారిని వారంలో మూడు రోజులపాటు తల్లి వద్ద, మిగతా రోజుల్లో తండ్రి కస్టడీలో ఉండేలా మే 22న కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కుమారుడిని తల్లి తన కస్టడీకి అప్పగించలేదని, వారిద్దరి జాడ తెలియడం లేదని తండ్రి కోర్టును ఆశ్రయించగా వెంటనే వారి ఆచూకీ కనుగొనాలని కోర్టు జూలై 17వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే, ఆమె దేశం విడిచి వెళ్లినట్లు జూలై 21వ తేదీన సమాచారమివ్వగా, ఇది తీవ్రమైన ధిక్కరణ అంటూ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఈజిప్ట్’ మ్యూజియం ప్రారంభం
కైరో: పిరమిడ్లు మొదలు మమ్మీలు, ఫారో చక్రవర్తుల దాకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈజిప్ట్ మరోసారి అంతర్జాతీయ పురావస్తు ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు బయల్దేరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం’ను దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్–సిసీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో పలు దేశాల అగ్రనేతలు, రాజకుటుంబీకులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల ఈజిప్ట్ ఘన చరిత్రను అందరికీ తెలియజేసేలా ఆనాటి రాజరిక సంబంధ అన్ని రకాల పురాతన వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈజిప్ట్‌ను పరిపాలించిన 30 రాజవంశాలకు సంబంధించిన ప్రాచీన వస్తుసంపదను సందర్శకులు ఈ మ్యూజియంలో చూడొచ్చు. దేశ పర్యాటక రంగానికి పునర్వైభవ తేవడంతోపాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యూజియంను నిర్మించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2005లో మొదలైంది. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత ఈ మ్యూజియం నిర్మాణం ముందుకు సాగనివ్వలేదు. పాక్షికంగా పనులు జరగడం, తర్వాత ఆగడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు ఇటీవలే మ్యూజియం నిర్మాణం పూర్తయింది. కైరో నగర శివారులో లక్షలాది మంది సందర్శకులకు అనువుగా సకల సదుపాయాలతో దీనిని కట్టారు. నవంబర్ 4వ తేదీ నుంచి సాధారణ పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు. ఈజిప్ట్ నాగరికత విశిష్టతన కళ్లకు కట్టేలా 1,00,000కుపైగా పురాతన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. కేవలం ఒక్క దేశ నాగరికతను చూపే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది రికార్డ్లకెక్కనుంది. ది గ్రేట్ గిజా పిరమిడ్‌కు అత్యంత సమీపంలో దీనిని కట్టారు. గాజు పలకలతో పిరమిడ్ ఆకృతిలో నిర్మించారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో..పిరమిడ్ ఆకృతిలో 2,58,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ.8,878 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియం కట్టారు. మలేరియా, ఎముక వ్యాధితో వేల ఏళ్ల క్రితం కన్నుమూసిన, శాపాలకు ప్రసిద్ధిచెందిన ఈజిప్ట్ యువరాజు కింగ్ టుటెంక్మెన్ మమ్మీ సహా ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. -
షెన్జెన్ వేదికగా తదుపరి అపెక్ శిఖరాగ్రం: జిన్‌పింగ్
బీజింగ్: వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సమాఖ్య(అపెక్) దేశాల నేతల శిఖరాగ్రానికి షెన్జెన్ వేదిక కానుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. శనివారం ఆయన దక్షిణ కొరియాలోని గియాంగ్జులో జరుగుతున్న అపెక్ సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ మేరకు అపెక్ దేశాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. పసిఫిక్ తీరంలో ఒకప్పుడు చేపల వేటకు మాత్రమే పరిమితమైన షెన్జెన్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయ స్థాయి నగరంగా మారిందని జిన్‌పింగ్ అన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని బలోపేతం చేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. సవాళ్లను ఎదుర్కొంటూ సుస్థిరమైన, సంపద్వంతమైన భవిష్యత్తును సృష్టించాలి’అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
నెల రోజుల్లో రూ. 62 వేల కోట్లు ఆవిరి
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో అగ్రరాజ్యంలో గత నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 62,100 కోట్లు) సంపద ఆవిరైపోయింది. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) అంచనాల ప్రకారం ఈ గణాంకాలు అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నాలుగు వారాలకు సంబంధించినవి. కాగా ఇదే తీరు కొనసాగితే ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడవచ్చని సీబీవో అంచనా వేసింది. పది లక్షల మంది పైగా ఉద్యోగులకు జీతభత్యాలు లేకపోవడం వల్ల షట్‌డౌన్ సమయంలో వస్తువులు, సరీ్వసుల కొనుగోళ్లు పడిపోతాయని పేర్కొంది.షట్‌డౌన్ ఎత్తివేత అనంతరం స్థూల దేశీయోత్పత్తి నెమ్మదిగా తిరిగి కోలుకున్నా, నష్టపోయిన సంపద మాత్రం ఇక రికవర్ కాదని పేర్కొంది. కీలకమైన బిల్లులకు సంబంధించి అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య రాజీ కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతబడింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 1976 నుంచి దాదాపు 10 సార్లు షట్‌డౌన్ పరిస్థితి ఎదురైంది. 2018 డిసెంబర్ 22 నుంచి 2019 జనవరి 25 వరకు 35 రోజుల పాటు సాగిన షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం మూతబడినప్పుడు, నిధులు లేకపోవడం వల్ల, కొన్ని ముఖ్యమైన విభాగాలు తప్ప, కీలకం కాని ఫెడరల్ సర్వీసులన్నీ నిలిచిపోతాయి. -
Egypt: ‘నాలుగో పిరమిడ్’ లేచింది.. ‘వారెవ్వా’ అనాల్సిందే!
కైరో: ప్రపంచ ప్రసిద్ది చెందిన పురాతన అద్భుతాలకు నిలయమైన ఈజిప్ట్ ఇప్పుడు మరో విశేష కట్టడాన్ని ఆవిష్కరిస్తోంది. గిజా పీఠభూమి పక్కన నిర్మితమైన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం (జెమ్) దీర్ఘకాల నిరీక్షణ తర్వాత నవంబర్ 4న ప్రజల సందర్శనార్థం స్వాగత ద్వారాలు తెరుస్తోంది. రూపకల్పనలో ఈ మ్యూజియం పిరమిడ్ల ప్రతిరూపంలా ఉండటంతో దీనిని స్థానికులు ‘నాలుగో పిరమిడ్’గా అభివర్ణిస్తూ, ఇది అందనంత ఎత్తున ఉండటంతో అంతెత్తున లేచిన నాలుగో పిరమిడ్ అని అంటున్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం2002లో అప్పటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రాజకీయ మార్పులు, 2011 తిరుగుబాటు, కోవిడ్ మహమ్మారి తదితర సవాళ్ల కారణంగా పలుమార్లు నిలిచిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత, $1 బిలియన్ వ్యయం(₹8,400 కోట్లు) తో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. మ్యూజియం విస్తీర్ణం 24,000 చదరపు మీటర్లు. ఇందులో 2,58,000 చదరపు అడుగుల శాశ్వత ప్రదర్శన స్థలం ఉంది. ప్రతీ ఏటా కనీసం ఐదు మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.పురాతన చరిత్రకు ఆధునిక మెరుగులుగిజా పీఠభూమిలోని ఖుఫు, ఖఫ్రే, మెన్‌కౌరే పిరమిడ్ల సమీపంలో నిలిచిన ఈ మ్యూజియం రూపకల్పనను ఐరిష్ సంస్థ హెనెగాన్ పెంగ్ ఆర్కిటెక్ట్స్ తీర్చిదిద్దింది. భవనాన్ని త్రిభుజాకార గాజుతో రూపొందించడంతో పక్కనే ఉన్న పిరమిడ్లకు ఒక చారిత్రక సౌందర్యం జత అయినట్లు కనిపిస్తోంది. భవనం మధ్యలో ఆరు అంతస్తుల భారీ మెట్లు, వాటి ఇరువైపులా ఫారోల విగ్రహాలు, దేవాలయాల అవశేషాలు, పురాతన సమాధులు ఏర్పాటు చేశారు. పై అంతస్తు నుండి మూడు పిరమిడ్ల దృశ్యం ప్రత్యక్షంగా కనిపించేలా దీనిని తీర్చిదిద్దారు.లక్ష కళాఖండాల మహాసేకరణజీఈఎం(జెమ్)లో మొత్తం లక్షకు పైగా పురాతన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో సుమారు సగభాగం ప్రదర్శనలో ఉండగా, మిగిలినవి ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ స్థావరాల్లో భద్రపరిచారు. ఈ కళాఖండాలు ఈజిప్టు ఫారోల 30 వంశాల కాలాన్ని, అంటే దాదాపు 5,000 ఏళ్ల నాగరికతను ప్రతిబింబిస్తాయి.రామ్సెస్ II విగ్రహం ప్రధాన ఆకర్షణమ్యూజియం ప్రధాన ద్వారం వద్ద 11 మీటర్ల ఎత్తయిన రామ్సెస్ ది గ్రేట్ విగ్రహం సందర్శకులను స్వాగతిస్తుంది. 19వ వంశానికి చెందిన ఈ రాజు క్రీ.పూ. 1279–1213 కాలంలో పాలించాడు. 1820లో మెంఫిస్ ప్రాంతంలో కనుగొన్న ఈ విగ్రహం అనేక ప్రదేశాకు తరలించాక, చివరకు జెమ్‌లో స్థిర నివాసం పొందింది.టుటన్ఖామున్ బంగారు సంపదమ్యూజియంలోని 1922లో పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ కనుగొన్న టుటన్ఖామున్ సమాధి నుండి వెలికితీసిన 5,000 విలువైన వస్తువులను తొలిసారిగా ఒకే ప్రదేశంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో బంగారుతో చేసిన సార్కోఫాగస్, ప్రసిద్ధ స్వర్ణ ముఖావరణం, ఆభరణాలు, పూజా వస్తువులు ఉన్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం టుటన్ఖామున్ 19 ఏళ్ల వయసులో మలేరియా, ఎముక సంబంధిత వ్యాధితో మరణించాడు.శాస్త్రవేత్తలకు స్వర్గధామంఈ మ్యూజియంలో అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిలో పురావస్తు శాస్త్రవేత్తలు శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లను సందర్శకులు కూడా చూడవచ్చు. ఇది ప్రపంచ మ్యూజియం రంగంలో అరుదైన ఆవిష్కరణగా భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్న ఈజిప్టు ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని సాంస్కృతిక పునరుద్ధరణ కేంద్రంగా భావిస్తోంది. పర్యాటక ఆదాయం పెరగడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుందని అనుకుంటోంది. ఈ గ్రాండ్ మ్యూజియం 2025, నవంబర్ 4న సందర్శకులకు తలుపులు తెరుస్తోంది. నాలుగో పిరమిడ్‌గా నిలిచిన ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం మరో చరిత్రను సృష్టించబోతోందనడంలో సందేహం లేదు. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్‌ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
ఇదెక్కడి న్యాయం?.. ట్రంప్‌పై విరుచుకుపడ్డ కమలా హారిస్
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెతతారు. అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో భారీ వ్యయంతో బాల్రూమ్ నిర్మించాలన్న ప్రణాళికను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని పట్టించుకోని ఈ చర్యను అసహ్యకరమైందిగా పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. జాన్ స్టీవర్ట్ నిర్వహించిన ది విక్లీ షో (The Weekly Show) పోడ్కాస్ట్లో పాల్గొన్న హారిస్ ఈ అంశంపై మాట్లాడుతూ ఊగిపోయారు. ‘‘ఆ మనిషి తన ధనిక మిత్రుల కోసమే బాల్రూమ్ నిర్మిలించాలనుకుంటున్నారు. ప్రభుత్వం షట్‌డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమేనా ఇది?. అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా? సిగ్గుందా??.. .. అమెరికాలో పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆహార సహాయం(SNAP) నిలిచిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలితో మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి?.. వాళ్ల గురించి ఆ మనిషి కనీసం ఆలోచించరా? అంటూ ఆగ్రహంతో కమలా హారిస్ ఊగిపోయారు(మధ్యలో కోపంతో ఆమె F*** పదం ఉపయోగించారు). వ్యవస్థను కదిలించడం వేరు, దాన్ని నాశనం చేయడం వేరు. ప్రజలు ఆకలితో బాధపడుతున్న సమయంలో ఈ విధమైన ప్రాజెక్టులు అసహ్యకరమైనవి అని అభిప్రాయపడ్డారు. చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతున్న సమయంలో స్నాప్(SNAP) బెనిఫిట్స్ ముగియబోతున్నాయి. కానీ అధ్యక్షుడు బాల్రూమ్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. ఇది అమానవీయం అని కమలా హారిస్ తేల్చేశారు. SNAP అంటే Supplemental Nutrition Assistance Program. ఇది అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఆహార సహాయ కార్యక్రమం, దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఫుడ్ స్టాంప్స్ లేదంటే EBT కార్డుల ద్వారా నెలకు కొన్ని డాలర్లు అందిస్తారు. ఈ డబ్బుతో వారు ఆహార పదార్థాలు కొనుగోలు చేయగలుగుతారు.ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ వింగ్‌లోని భాగాన్ని కూల్చేసి అత్యాధునికంగా బాల్‌రూమ్‌ను నిర్మించే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా. అయితే.. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ విరాళాలతోనే కట్టబతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హెల్త్ ఇన్సురెన్స్ సబ్సిడీ, ఫారిన్ఎయిడ్.. ఇతరత్రా ఫెడరల్ బడ్జెట్ విషయంలో మనీ బిల్లులపై సెనేట్‌లో ఏకాభిప్రాయం(13 సార్లు ఓటింగ్ జరిగినా) కుదరలేదు.దీంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాల్సిన పరిస్థితి అన్నమాట. దీంతో SNAP ఫుడ్ బెనిఫిట్స్, మిలిటరీ పే, ఇతర సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటితో షట్‌డౌన్ 31వ రోజుకి చేరుకుంది. పోలిమార్కెట్ బెట్టింగ్ అంచనాల ప్రకారం, నవంబర్ 16 తర్వాతే షట్‌డౌన్ ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. -
ఐరాసలో మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఆయన తాజాగా ప్రసంగించారు(Mithun Reddy UN Speech). న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రసంగాన్ని పోస్ట్ చేసింది.అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన భారత ప్రతినిధిగా మాట్లాడారు. పైరసీ, సాయిధ దోపిడి నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ అభ్యంతరాలను మిథున్‌రెడ్డి తెలియజేశారు. ఆయన ప్రసంగం.. ‘‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు మా దేశం కట్టుబడి ఉంది. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాం#IndiaAtUNHon’ble MP @MithunReddyYSRC delivered 🇮🇳’s statement on Report of the work of International Law Commission in the Sixth Committee. He highlighted India’s reservations on draft provision concerning Immunity of State Officials. Underscored the use of new… pic.twitter.com/urrgNyM2pM— India at UN, NY (@IndiaUNNewYork) October 31, 2025.. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. వ్యక్తిగత మానవ హక్కులు, న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం. అలాగే.. .. పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి. ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి.. స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠినమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్‌రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్‌క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్‌రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. -
ఉష మతం మారదు: జేడీ వాన్స్
మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన. తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని ఎక్స్ పోస్ట్‌లో వివరించారాయన. తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన. What a disgusting comment, and it's hardly been the only one along these lines. First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.Second, my… https://t.co/JOzN7WAg3A— JD Vance (@JDVance) October 31, 2025యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్లో జేడీ వాన్స్ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. ఉషా వాన్స్ నేపథ్యం.. జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జె.డి.వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్‌లో కార్పొరేట్ లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అయిన భర్త జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు. -
వేలానికి మరో బంగారు టాయిలెట్
న్యూయార్క్: ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటల్లాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్‌ను దుండగులు అపహరించుకుపోయారు. అలాంటిదే మరో బంగారు టాయిలెట్‌ను క్యాటల్లాన్ రూపొందించటంతో దానిని ఈ నెల 18న ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బే వేలం వేయనుంది. క్యాటల్లాన్ మొదట రూపొందించిన బంగారు టాయిలెట్ దాదాపు 100 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. దాని పేరు అమెరికా. అది గొప్ప ఆర్ట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దానిని మొదట 2016లో న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు దాదాపు లక్ష మంది సందర్శించారు. దానిని కొనుగోలు చేసేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తి చూపించారు. అయితే, దానిని బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచగా, 2019లో దొంగలు నాలుగు నిమిషాల్లోనే దోచుకెళ్లారు. ఎంత గాలించినా అది మళ్లీ కనిపించలేదు. దానిని దొంగలు కరిగించి బంగారాన్ని అమ్మేసి ఉంటారని భావిస్తున్నారు. అలాంటిదే మరో టాయిలెట్‌ను క్యాటల్లాన్ తయారు చేయటంతో ఈ నెలలో వేలం వేస్తున్నారు. దీనికి భారీ ధర పలుకొచ్చని భావిస్తున్నారు. క్యాటల్లాన్ బనానా ఆర్టిస్ట్‌గా కూడా ప్రసిద్ధి చెందారు. ఓ గోడపై టేపుతో అరటి పండును అతికించి ప్రదర్శనకు ఉంచటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. -
ఉషా వాన్స్ క్రైస్తవ మతం స్వీకరించాలని నా కోరిక
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ క్రైస్తవ మతస్థుడు. ఆయన భార్య ఉషా వాన్స్ హిందూ మతం ఆచరిస్తున్నారు. అయితే, తన భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతం స్వీకరించాలని తాను కోరుకుంటున్నట్లు జె.డి.వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె క్రైస్తవురాలిగా మారాలన్నదే తన కోరిక అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపీలో తాజాగా టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన భార్య ఉషా తనతోపాటు చర్చికి హాజరవుతోందని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒకరోజు ఆమె పూర్తిస్థాయిలో క్రైస్తవ మతం స్వీకరిస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను క్రైస్తవ నమ్ముతానని వెల్లడించారు. తన మతం, భార్య మతం వేర్వేరు అయినప్పటికీ తమ మధ్య ఎనాడూ ఎలాంటి విభేదాలు తలెత్తలేదని స్పష్టంచేశారు. ఆమె క్రైస్తవ మతంలోకి మారకపోయినా తనకు వచి్చన ఇబ్బందేమీ లేదన్నారు. ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు. మరోవైపు జె.డి.వాన్స్ తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హిందూ మత వ్యతిరేకి అంటూ కొందరు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. భార్యపై బలవంతంగా క్రైస్తవ మత విశ్వాసాలను రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఉషా వాన్స్ తెలుగు మూలాలున్న అమెరికన్ మహిళ. జె.డి.వాన్స్, ఉషా వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు క్రైస్తవ మతం పాటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే జె.డి.వాన్స్, ఉషా వాన్స్‌ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. -
ఎత్తు తగ్గి కుదుపులకు లోనైన విమానం..
టాంపా: విమానం ఎత్తులో ఆకస్మిక తగ్గుదల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కనీసం 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం మెక్సికోలోని కాంకున్ నుంచి టేకాఫ్ తీసుకున్న జెట్‌బ్లూ సంస్థ ఎయిర్ బస్ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత అకస్మాత్తుగా విమానం దిగువకు వచ్చింది. కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ప్రమాదాన్ని శంకించిన పైలట్ విమానాన్ని టాంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాయపడిన కనీసం 20 మంది ప్రయాణికులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కాగా, విమానంలో మొత్తం 162 సీట్లుండగా ప్రయాణికులెందరనే విషయంలో స్పష్టత లేదు. -
విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేరళ నర్సులు
దుబాయ్: కేరళలోని కొచ్చి నుంచి అబుదాబీ వెళ్తున్న ఇద్దరు పురుష నర్సులు తమతోపాటు విమానంలో ప్రయాణించే ఓ వ్యక్తి ప్రాణాలను సకాలంలో స్పందించి కాపాడారు. వయనాడ్ వాసి అభిజిత్ జీస్(26), చెంగన్నూర్‌కు చెందిన అజీశ్ నెల్సన్(29)లు ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్‌కి వెళ్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే ఓ ప్రయాణికుడు శ్వాసపీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వారిద్దరూ ఆయనకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. రెండు రౌండ్ల సీపీఆర్ చేపట్టారు. దీంతో, ఆయన శ్వాస కుదుటపడింది. విమానంలోనే ఉన్న ఆరిఫ్ అబ్దుల్ ఖాదిర్ అనే వైద్యుడు వారికి సాయంగా వచ్చారు. బాధిత ప్రయాణికుడికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. దీంతో, ఆయన నాడి తిరిగి సవ్యంగా కొట్టుకోవడంతోపాటు పరిస్థితి మెరుగైంది. ఈ విషయాలను ఓ ప్రయాణికుడి ద్వారా తెల్సుకున్నట్లు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. విమానం దిగిన అభిజిత్, అజీశ్ మామూలుగానే తమ విధుల్లో చేరిపోగా, మీడియా ద్వారా విషయం తెలిసిన బాధిత ప్రయాణికుడి కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై అభిజిత్, అజీశ్ స్పందించి, ఆరోజు జరిగిన ఘటనను వివరించారు. ఆ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించాం. దగ్గరికెళ్లి పరీక్షించగా, నాడి కొట్టుకుంటున్న జాడలే లేవు. గుండెపోటుకు గురయ్యారనే విషయం అర్థమయింది. అటువంటి సమయాల్లో చేపట్టాల్సిన సీపీఆర్‌కు వెంటనే ఉపక్రమించాం. దీంతో, పరిస్థితి మెరుగైంది. దీంతో ఊపిరి పీల్చుకున్నాం’అంటూ వివరించారు. ఇదంతా తమ వృత్తి ధర్మమని చెప్పారు. కాగా, బాధిత ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే సిబ్బంది వైద్య సాయం అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
మ్యూజియంలో దొంగలు పడ్డారు
ఓక్లాండ్ (కాలిఫోర్నీయా): అమెరికాలో చారిత్రక ప్రాధాన్యమున్న దాదాపు 1000 వస్తువులను దుండగులు అపహరించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ మ్యూజియం నుంచి ఈ నెల 15న ఈ వస్తువులను అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులు కాలిఫోర్నీయా చరిత్రకు సాక్ష్యాలుగా భద్రపర్చబడ్డవి అని పేర్కొన్నారు. ఈ చోరీపై దర్యాప్తు జరుగుతోందని మ్యూజియం డైరెక్టర్ లోరీ ఫోగర్టీ తెలిపారు. దొంగలు ఆ వస్తువులను ఎక్కడైనా విక్రయించటానికి ప్రయతి్నస్తే తమకు సమాచారం అందించాలని పురాతన వస్తువులను విక్రయించే మార్కెట్లు, దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు. ‘వారు కొల్లగొట్టింది మ్యూజియాన్ని మాత్రమే కాదు. ప్రజల సంపదను కొల్లగొట్టారు. మన సమాజాన్ని కొల్లగొట్టారు. వాటిని తిరిగి తెచ్చేందుకు ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం’అని లోరీ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీకి గురైన వస్తువుల్లో మెటల్ వర్క్ ఆభరణాలు, అమెరికా మూలవాసులు ఉపయోగించిన బుట్టలు, గతంలో కాలిఫోర్నీయా వాసులు నిత్యజీవితంలో వినియోగించిన వస్తువులు, అథ్లెటిక్స్ ట్రోఫీలు తదిర విలువైన వస్తువులు ఉన్నాయి. ‘దుండగులు భవనంలోకి ప్రవేశించి కనిపించిన వస్తువునల్లా తీసుకొని వచ్చిన దారినే వెళ్లినట్లు కనిపిస్తోంది’అని లోరీ తెలిపారు. చోరీకి గురైనవాటిలో ప్రముఖ లోహవస్తువుల కళాకారుడు ఫ్లోరెన్స్ రెస్నికోఫ్ రూపొందించిన అందమైన ఆభరణాలతోపాటు నగిషీలు చెక్కిన వాల్రస్ (సముద్ర జంతువు) దంతాలు ఉన్నాయి. చాలా వస్తువులు కాలిఫోర్నీయా 20వ శతాబ్దపు చరిత్రను తెలియజేసేవేనని లోరీ తెలిపారు. వాటిని ఇప్పటికే అమ్మేసి ఉంటారు చోరీ జరిగి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినందున దొంగలు వాటిని ఎక్కడో ఓ చోట అమ్మేసి ఉంటారని లాస్ఏంజెల్స్ పో లీస్ విభాగంలో కెపె్టన్‌గా పనిచేసి రిటైరైన జాన్ రోమెరో అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు వాటికోసం వస్తువుల రీసేట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లైన ఈబే, క్రెయిగ్స్లిస్ట్తోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను సేకరించే దుకాణాల్లో వెదకాలని సూచించారు. ‘దోపిడీ చేసినవారు వాటిని అమ్మేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు. వాటి విలువ తెలిసినవారు కాదు’అని పేర్కొన్నారు. -
మరో పదేళ్లు రక్షణ బంధం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్– అమెరికా కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘యూఎస్– ఇండియా మేజర్ డిఫెన్స్ పార్టనర్షిప్’పై కౌలాలంపూర్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీట్ హెగ్సెత్ శుక్రవారం సంతకాలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ (ఏషియాన్) సమావేశాల్లో భాగంగా రాజ్‌నాథ్, హెగ్సెత్ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య 2015లో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ ఏడాదితో ముగుస్తుండటంతో దాని స్థానంలో మరో పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తుంది. దీంతో ఆ దేశం నుంచి కీలకమైన రక్షణ సాంకేతికతోపాటు ఆయుధాల దిగుమతులకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి, కీలక నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి. రక్షణ బంధం ద్విగుణీకృతంతాజా ఒప్పందంతో భారత్– అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతుందని రాజ్‌నాథ్‌సింగ్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘భారత్–అమెరికా రక్షణ సంబంధాలకు ఈ డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ విధానపరంగా విస్తృతమైన మార్గదర్శనం చేస్తుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఈ ఒప్పందం ఉదాహరణ. హెగ్సెత్తో చర్చలు ఫలవంతం అయ్యాయి. రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారం ప్రధానమైనది’అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభం లాంటిదని హెగ్సెత్ తెలిపారు. సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం విషయంలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందం భారత్–అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయమని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా భారత్‌లో ఎఫ్414 జెట్ ఇంజన్ల ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందని వెల్లడించింది. రక్షణ రంగంలో సహకారంపై ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే పలు ఒప్పందాలు ఉన్నాయి. 2016లో ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్’, 2018లో కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రీమెంట్, 2020లో బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రీమెంట్ చేసుకున్నారు. -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్‌ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్‌ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
పాక్.. ఖబడ్దార్
తుర్కీయే(టర్కీ), ఖతార్‌ల మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణకు అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు తెర పడింది. ‘శాంతి కోసం ఇంకో అవకాశం..’ అంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటు తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం ఖరారు చేస్తూనే.. పాక్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాలిబాన్ తాత్కాలిక హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తమ అంతర్గత సమస్యలను ఆఫ్గానిస్తాన్‌పై మోపే ప్రయత్నాలు చేస్తే, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు ఆయన స్పష్టం చేశారు. ‘‘మీ సమస్య మీదే(తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ కార్యకలాపాల గురించి). పరిష్కారం కూడా మీ వద్దే ఉంటుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారు?.. .. ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నాం. యుద్ధ భూమిలో అఫ్గన్లు తమ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు. అలాంటిది మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు” అని ఆయన అన్నారాయన.గత కొన్నివారాలుగా పాక్-అఫ్గన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ తమ భూభాగంలో దాడులకు తెగబడుతోందని.. పౌరుల ప్రాణాలు తీస్తోందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించగా, అఫ్గన్ భూభాగంలో తలదాచుకున్న టీటీపీ ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నామని పాక్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఇరు వైపులా దాడులతో భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. ఈ మధ్యలో తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినా.. ఉల్లంఘనలు జరిగాయి. దీంతో ఖతార్, టర్కీ జోక్యం చేసుకుని ఇరుదేశాలకు ఓ ఒప్పందానికి తీసుకొచ్చాయి. నవంబర్ 6వ తేదీన ఇస్తాంబుల్ మరోమారు సమావేశమై ఒప్పందానికి తుదిరూపం దిద్దుతామని తుర్కీయే విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. గురువారం ప్రకటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టీటీపీ ఎలా పుట్టింది?.. ఆ ఒక్కడే పాక్‌ను ఎలా వణికిస్తున్నాడు? -
కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..
ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘పో బయటకు..’ సోదరుడికి షాకిచ్చిన బ్రిటన్ రాజు
బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్‌ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్సోర్ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్హమ్ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రిన్స్ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఒత్తిడి మేరకు ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 27వ తేదీన లిచ్‌ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్స్టీన్ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్స్టీన్పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం. -
వలసదారులపై మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను(వర్క్ పర్మిట్లు) అటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచి్చంది. దీంతో విదేశీ ఉద్యోగులు.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు–ఈఏడీ) పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై అటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు(ఈఏడీ) ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో ఈఏడీ పొడిగింపు కోసం ప్రతిఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతోపాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది. బైడెన్ నిర్ణయానికి మంగళం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(హెచ్–4 వీసాదారులు), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న ఎఫ్–1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాలవ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని జో బైడెన్ ప్రభుత్వ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడవులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్‌గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని యూఎస్ సిటిజెన్íÙప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టంచేసింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్(డాక్యుమెంటేషన్)లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. అసలు ఏమిటీ వర్క్ పర్మిట్? కొన్ని కేటగిరీల నాన్–ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్(ఈఏడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్–ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలంపాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి ఈఏడీ ఒక ఆధారం. గ్రీన్‌కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందినవారికి వర్క్ పర్మిట్‌తో అవసరం లేదు. అయితే, గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. హెచ్–1బీ వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. -
ట్రంప్, జిన్‌పింగ్ స్నేహగీతం
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఆరేళ్ల తర్వాత ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ఇరువురు నేతలు గురువారం బుసాన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించింది. మొత్తానికి అమెరికా, చైనాల మధ్య స్నేహ సంబంధాలకు ట్రంప్–జిన్‌పింగ్ భేటీ అద్దం పట్టింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని అమెరికాకు తిరిగివెళ్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. జిన్‌పింగ్‌తో ముఖాముఖి సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అన్నారు. మాదక ద్రవ్యాల(ఫెంటానిల్) తయారీకి అవసరమైన రసాయనాలు విక్రయిస్తున్నందుకు శిక్షగా చైనాపై ఈ ఏడాది మొదట్లో విధించిన 20 శాతం టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించబోతున్నట్లు తెలిపారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్‌లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్‌పింగ్ సైతం అమెరికాకు రాబోతున్నారని వెల్లడించారు. మరిన్ని అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై జిన్‌పింగ్‌తో చర్చించానని అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవన్నారు. టిక్‌టాక్ సమస్యను పరిష్కరించుకుంటాం: చైనా ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో టిక్‌టాక్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. టిక్‌టాక్ యజమాన్యాన్ని చైనా నుంచి అమెరికాకు బదిలీ చేయాలని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అప్పగించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా యాజమాన్యంలో ఉంటే అమెరికాలోని యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీనికి చైనా అంగీకరించడం లేదు. అమెరికాతో నెలకొన్న టిక్‌టాక్ సమస్యను కచి్చతంగా పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తామని పేర్కొంది. మరోవైపు అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించేలా చైనాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచి్చంది.అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు అమెరికా నుంచి ప్రతిఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ట్రంప్, జిన్‌పింగ్ చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్నారు. ఈరోజు నుంచి వచ్చే ఏడాది జనవరి దాకా చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయనుందని తెలిపారు. దీనివల్ల అమెరికా రైతులకు లబ్ధి చేకూరుతుందని బెసెంట్ వివరించారు. -
నెదర్లాండ్స్ ఎన్నికల్లో తేలని ఫలితం
ది హేగ్: నెదర్లాండ్స్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ ఫర్ ఫ్రీడం(పీవీవీ), ప్రతిపక్ష డెమోక్రాట్స్66(డీ66)లకు సమానంగా 26 చొప్పున సీట్లు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, 26 సీట్లు గెలుచుకోవడం డీ66 ఇదే మొదటిసారి. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏ ఒక్కటీ లేకపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు. కొన్ని మున్సిపాలిటీలు, దూరప్రాంతాల మున్సిపాలిటీలు, పోస్టల్ ఓట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వాటి లెక్కింపు ఎప్పటికి పూర్తయ్యేది స్పష్టం కాలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం 11 నెలలు మాత్రమే మనుగడలో ఉంది. వలస విధానాలపై అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం జూన్‌లో పడిపోయింది. దీంతో, తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పీవీవీకి గట్టి దెబ్బ తగిలింది. జేఏ21 అనే చిన్న పార్టీ గత పార్లమెంట్లో కేవలం ఒక్క సీటుండగా, ఈ ఎన్నికల్లో 9 సీట్లకు బలం పెంచుకుంది. తాజా ఫలితాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. -
సూడాన్‌లో నరమేధం
ఖార్టుమ్: సూడాన్‌లోని ఉత్తర దార్ఫుర్ ప్రాంతంలో ఉన్న ఎల్–ఫషేర్ నగరంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) మూకలు రక్తపు టేరులు పారిస్తున్నాయి. నగరంలోకి ఆదివారం ప్రవేశించిన ఈ బలగాలు వేలాది మంది పౌరులను నిర్బంధంలోకి తీసుకున్నాయి. వారిలో కనీసం 1,500 మందిని చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నగరంలోని సౌదీ ఆస్పత్రిని దిగ్బంధించి, మరో 460 మందిని బలి తీసుకున్నట్లు సమాచారం. భయకంపితులైన జనం ప్రాణాలరచేత బట్టుకుని పలాయనమవుతున్నారు. వారిని కూడా ఆర్ఎస్ఎఫ్ మూకలు వదలడం లేదు. చిత్రహింసల పాల్జేజి, చంపేస్తున్నారు. ఎలాగోలా తప్పించుకుని కాలి నడకన కనీసం 36 వేల మంది జనం అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోని టవిలా పట్టణానికి చేరుకున్నట్లు సమాచారం. 48 గంటల వ్యవధిలోనే 15 వేల మంది నగరం వీడినట్లు అంచనా. ఇప్పటికే అక్కడ గూడుకోల్పోయిన వారు 6.50 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఖననం చేసే వారు లేకపోవడంతో ఎల్–ఫషెర్ నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలే పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అక్కడ భయానక వాతావరణం నెలకొందన్నారు. కట్టుబట్టలతోనైనా తాము బయట పడటం అదృష్టమని చెప్పారు. ఆర్ఎస్ఎఫ్ సామూహిక జననానికి పాల్పడుతోందని సూడాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఎల్–ఫòషేర్లో నరకానికి మించిన దారుణ పరిస్థితులున్నాయని ఐరాస మానవీయ విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వ్యాఖ్యానించారు. ఎల్–ఫòషేర్ నగరాన్ని ఏడాదిన్నర కాలంగా ఆర్ఎస్ఎఫ్ దిగ్బంధించింది. ఆహారం, ఇతర అత్యవసరాలు అందకుండా చేసింది. సూడాన్ ఆర్మీ నగరం నుంచి ఉపసంహరించుకోవడంతో రెచ్చిపోతోంది. -
టాంజానియాలో వివాదాస్పదంగా ఎన్నికలు
నైరోబి(కెన్యా): టాంజానియాలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. గురువారం రెండో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1961 నుంచి అధికారంలో ఉన్న చమా చా మపిండుజి(సీసీఎం) మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నేతల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత టుండు లిస్సును దేశద్రోహం నేరం కింద జైలులో పెట్టారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లుహా ఎంపినాను సైతం అనర్హుడిగా ప్రకటించారు. దీంతో, ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసన్‌తో ఎన్నికల బరిలో చిన్నాచితకా పార్టీలకు చెందిన 16 మంది పోటీ పడ్డారు. వీరెవరూ ప్రచారం కూడా చేయలేదు. బుధవారం పోలింగ్ జరిగింది. జనం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కారులు ఒక బస్సుకు, గ్యాస్ స్టేషన్‌కు నిప్పంటించారు. పలు చోట్ల పోలీస్స్టేషన్లపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఘర్షణల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. దీంతో, ప్రభుత్వం బుధవారం సాయంత్రం వాణిజ్య రాజధాని దారెస్సలామ్‌లో కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ రాత్రి నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గురువారం ఉద్యోగులను ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరం కాని సిబ్బంది బయటకు రావద్దని సూచించింది. రహదారులపై ఆర్మీ అడ్డంకులను ఏర్పాటు చేసింది. సరైన పర్మిషన్లు లేని వారిని ఇళ్లకు పంపించి వేసింది. ప్రధాన ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను సైన్యం నిలువరించింది. కెన్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న మంగాంగా పట్టణంలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. గురువారం వెలువడిన మొట్టమొదటి ఫలితాల్లో 272 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల 96.99 శాతం ఓట్లు అధ్యక్షుడు హసన్‌కే పడినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఫలితాలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్రంగా స్పందించింది. ‘టాంజానియాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. నిష్పాక్షికమూ కాదు’అంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల కోసం గట్టిగా నిలిచి పోరాడాలని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చింది. -
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
బాల్టిమోర్: అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహా సభలను పురస్కరించుకుని బాల్టిమోర్‌లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన 'ఆటా' బాల్టిమోర్‌లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనుంది. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్‌లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్లో విజయవంతంగా జరిగింది.ఆటా మహాసభల కిక్-ఆఫ్ ఈవెంట్లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్-ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్, స్థానిక ఆర్గనైజింగ్ టీమ్‌లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్‌వర్క్, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు.బోర్డు సమావేశం, కిక్-ఆఫ్ ఈవెంట్‌ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీమ్, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారత, వ్యాపార నెట్వర్కింగ్ అమెరికాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మానవతా సేవను ప్రోత్సహించడానికి ఆటా అంకితమైందన్న విషయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించింది. ఇది 425,000ం చదరపు అడుగుల విస్తీర్ణంతో, అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లకు ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది.ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్‌గా మేరీలాండ్ కు చెందిన శ్రీధర్ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్‌గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్ కో ఆర్డినేటర్‌గా శరత్ వేములను, డైరెక్టర్ గా సుధీర్ దమిడి, కో కన్వీనర్ గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్ గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్ గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్ కిరణ్ అల తదితరులను నియమించింది.అలాగే మహాసభ కోర్ టీమ్‌కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్విల్లే, టెన్నెస్సీ, రఘువీర్ మారిపెద్ది- టెక్సాస్, విజయ్ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు -
ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు
కఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత(జెన్-జీ) చేపట్టిన ఆందోళనల్లో దహనమైన కార్లను ఇప్పుడు ప్రభుత్వం తుక్కు కింద జమకట్టి.. కిలోల్లా అమ్మేస్తోంది. ఆగస్టు నెలలో జెన్-జీ ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో యువత పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, ప్రభుత్వ అధినేతల ఇళ్లు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను దహనం చేసిన విషయం తెలిసిందే..! ఆందోళనలతో దెబ్బతిన్న వాహనాలను ఇప్పుడు తుక్కు కింద అమ్మడం తప్పితే.. ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటి శకలాలను పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల ఆవరణలో పెట్టడం వల్ల స్థలాభావం తప్పదని ప్రభుత్వ ఇంజనీర్లు పేర్కొన్నారు.కిలోకు రూ.45 రూపాయలుఅగ్నికి ఆహుతైన వాహనాల నుంచి ఇనుమును వేరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంజన్లు సక్రమంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. అయితే.. ఎందుకూ పనికిరాకుండా ఉన్న వాహనాల నుంచి సేకరించిన ఇనుమును తుక్కుగా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది. బన్వేశ్వర్లో నిర్ణయించిన వేలంలో ఓ స్క్రాప్ వ్యాపారి కిలోకు రూ.45 చొప్పున చెల్లించి, కార్ల తుక్కును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తొలి దశలో ఈ వాహనాల వేలం..తొలి దశలో సింఘా దర్భార్ వద్ద ఉన్న 145 కార్లు, 256 ద్విచక్ర వాహనాలు, రెండు బస్సుల స్క్రాప్‌ను వేలం వేయాలని నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రధాని కార్యాలయం, అధికారిక నివాసం సహా.. 22 చోట్ల వాహనాల శకలాలు పడి ఉన్నాయని ఆయన చెప్పారు. వాటన్నింటినీ దశల వారీగా వేలం వేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో 500 వాహనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల వద్ద దహనమైన కార్లు, వాహనాల తుక్కును తదుపరి దశలో వేలం వేయాల్సి ఉందని వివరించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకే తుక్కుగా కార్ల విక్రయం ప్రారంభమైందన్నారు. -
Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్‌లో భారీగా రక్తపాతం జరిగినట్లు అంతరిక్షం నుండి వెలువడిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్ఆర్ఎల్) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో గత వారంలో ఎల్ ఫాషర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు సంస్థ సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న అంతర్యుద్ధంలో సూడాన్ అతలాకుతలమైంది. సుడానీస్ ఆర్మీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య యుద్ధం 2023 ఏప్రిల్‌లో మొదలయ్యింది. గతంలో అధికారాన్ని పంచుకున్న ఈ రెండు యూనిట్లు ప్రజాస్వామ్యం వైపు మళ్లే సమయంలో, తమ బలగాలను ఏకీకృతం చేసే ప్రణాళికల విషయంలో విఫలమయ్యాయి. అక్టోబర్ 26న, ఉత్తర డార్ఫర్‌లోని ఎల్-ఫాషర్ నగరంలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో దాదాపు 40 వేల మంది మృతి చెందారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 🚨HUMAN SECURITY EMERGENCY🚨 El-Fasher has fallen to RSF. HRL finds evidence of mass killings including door-to-door clearance operations and objects consistent with reported bodies on berm entrapping El-Fasher.#KeepEyesOnSudan🛰️@AirbusSpace @Maxarhttps://t.co/1HApllgNL5 pic.twitter.com/yrCbM5HxeP— Humanitarian Research Lab (HRL) at YSPH (@HRL_YaleSPH) October 27, 2025సూడాన్‌లో సగం మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాధులు చుట్టుముట్టాయి. సోమవారం ప్రచురితమైన ఒక నివేదికలో ఎల్-ఫాషర్‌లోని దరాజా ఔలా పరిసరాల్లో వ్యూహాత్మకంగా మోహరించిన ఆర్ఎస్ఎఫ్ వాహనాలను హెచ్ఆర్ఎల్ గమనించింది. చిత్ర విశ్లేషణలో ఆర్‌ఎస్‌ఫ్ వాహనాల దగ్గర నేలపై పడివున్న మానవ శరీరాల పరిమాణానికి అనుగుణంగా ఉన్న వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఐదు ఎర్రటి రంగులో కనిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎఫ్ సెప్టెంబర్ 19న డ్రోన్లతో దాడి చేసి దాదాపు 78 హత్య చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యేల్ హెచ్ఆర్ఎల్.. ఎల్-ఫాషర్ నుండి పారిపోతున్న సమయంలో పౌరులు మరణించడాన్ని కూడా కనుగొంది. ఈ ప్రాంతం పూర్తిగా ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. వారి కార్యకలాపాల స్థావరంగా దీనిని ఉపయోగిస్తున్నారని యేల్ తన నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: Varanasi: ఉమ్మినా.. కుక్క మలాన్ని కడగకున్నా.. -
నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటు
భారతదేశంలోని అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) అంతర్జాతీయ విస్తరణలో భాగంగా 2026 నాటికి నైజీరియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో భారతదేశానికి చెందిన మొదటి ఐఐటీ క్యాంపస్ కానుంది.నైజీరియాలో ఎందుకు?నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 అమలులో భాగంగా విదేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విస్తరణ ద్వారా భారతదేశం తన అకడమిక్ సామర్థ్యాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ క్యాంపస్ ద్వారా భారత్, నైజీరియా మధ్య విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది.ఆఫ్రికా ఖండంలో శాస్త్ర, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోంది.నైజీరియా ప్రభుత్వం తమ దేశాన్ని ప్రాంతీయ సాంకేతిక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి విద్యాసంస్థ అయిన ఐఐటీ ఏర్పాటుతో ఈ లక్ష్యం వేగవంతమవుతుందని నైజీరియా విశ్వసిస్తోంది.నైజీరియా విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను అందించడానికి భారత ఐఐటీ ఉపయోగపడుతుంది. ఇది ‘బ్రెయిన్ డ్రెయిన్’(ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం) సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.ఈ క్యాంపస్ పనులు ఏ దశలో ఉన్నాయి?నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రణాళిక దశలో ఉన్నాయి. ఈ క్యాంపస్ సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (FGA)లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతాన్ని ‘నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్’ అని కూడా పిలుస్తారు. ఈ అకాడమీని భారత్ సహకారంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చనున్నారు. ఈ క్యాంపస్‌లో అధ్యాపకుల నియామకం, కోర్సుల రూపకల్పనను పర్యవేక్షించడానికి ఇండియా, నైజీరియాకు చెందిన సంయుక్త బృందం పని చేస్తుంది. 🚨 India is opening a IIT campus in Nigeria in 2026. pic.twitter.com/oPocRgVNhJ— Indian Tech & Infra (@IndianTechGuide) October 29, 20252026 నాటికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. క్యాంపస్ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను నైజీరియా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఈ క్యాంపస్‌లో ప్రవేశానికి సంబంధించిన కచ్చితమైన తుది వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే నవంబర్ 2023లో టాంజానియాలో భారత్ ఐఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు.. -
Louvre heist: ఎట్టకేలకు దొరికిన మ్యూజియం దొంగలు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూవ్ర్(లౌవ్ర్) మ్యూజియం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పారిస్ పోలీసులు ధృవీకరించారు. అయితే వీళ్లు పింక్ పాంథర్ ముఠా సభ్యులేనా? అనేది మాత్రం ఇంకా ధృవీకరణ కాలేదు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 19న పారిస్‌లోని లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది(louvre museum Heist). మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. కన్స్ట్రక్షన్ కార్మికుల వేషాలు దుండగులు ఓ భారీ క్రేన్ ద్వారా వెనకభాగం నుంచి లోపలికి చొరబడ్డారు. ఉదయం 10గం. ప్రాంతంలో సరుకు రవాణా ఎలివేటర్(Basket Lift) ద్వారా అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించి బయటపడ్డారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాల్లోనే జరిగిపోవడం గమనార్హం.ఆ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం అదుపులోకి తీసుకుంది అనుమానితులా? లేదంటే దొంగలేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. అలాగే నగల రికవరీ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చోరీకి సంబంధించి మరో ఇద్దరు, ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, వాళ్లే ఈ చోరీకి ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది. New footage shows thieves using chainsaws to execute robbery at The Louvre in Paris. A manhunt is now underway. pic.twitter.com/0w0Uu6MJyn— Pop Crave (@PopCrave) October 20, 2025పింక్ పాంథర్ ముఠా గురించి.. లూవ్ర్ మ్యూజియం చోరీ వెనుక పింక్ పాంథర్ ముఠా హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు కారణం.. చోరీ జరిగిన విధానమే!. 2001లో సెర్బియా బెల్గ్రేడ్ కేంద్రంగా డ్రాగన్ మైకిక్ అనే వ్యక్తి ఈ ముఠాను ప్రారంభించారు. ఆభరణా దొంగతనాలకు ఈ ముఠా పెట్టింది పేరు. స్మోక్ బాంబులు, గేట్‌వే కార్లు ఉపయోగిస్తూ సినీ ఫక్కీలో చోరీలు చేయడం ఈ ముఠా స్టైల్. అందుకే 1963లో వచ్చిన ది పింక్ పాంథర్ అనే సినిమా ఆధారంగా ఇంటర్‌పోల్ ఈ గ్యాంగ్‌కు ఆ పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నారని, యుగోస్లావియా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటిదాకా 370కి పైగా దొంగతనాలు చేయగా.. చోరీ చేసిన వాటి విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4200 కోట్లు) ఉండొచ్చని అంచనా. దుబాయ్ మాల్లో 2007లో పట్టపగలే చేసిన భారీ చోరీ, 2004లో టోక్యోలో కాస్ట్లీ డైమండ్ దొంగతనంతో పాటు లండన్, జెనీవా మ్యూజియాల్లో విలువైన చోరీలు చేసింది ఈ పింక్ పాంథర్ గ్యాంగ్. అయితే.. ఈ ముఠా చేసిన చోరీల్లో వస్తువులు రికవరీ కావడం చాలా తక్కువ. ఆభరణాలను ముక్కలు చేసి అమ్మేస్తుండడంతో చాలా కేసులు సాల్వ్కాకుండా ఉండిపోయాయి.ఇదీ చదవండి: చరిత్రలో కాస్ట్లీ దొంగతనం ఏదో తెలుసా? -
చైనాకు ట్రంప్ గుడ్‌న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. -
యూఎస్‌లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు
అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్‌గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.ఈఏడీ అంటే..అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్‌లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.జాతీయ భద్రతే లక్ష్యంగతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్‌లింక్ సర్వీసుల డెమో -
మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది
వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్‌లో గురువారం ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. BREAKING 🚨 China’s President stuns the world THANKING President Trump for promoting PEACE "Mr President you care a lot about world peace. You are very enthusiastic about settling regional hotspot issues”I AM IN TOTAL SHOCK 🔥 pic.twitter.com/yEkzCdigUf— MAGA Voice (@MAGAVoice) October 30, 2025చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్‌పింగ్ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. JUST IN: 🇺🇸🇨🇳 President Trump officially meets with Chinese President Xi Jinping to discuss trade deal. pic.twitter.com/lIB0O68Wo7— Watcher.Guru (@WatcherGuru) October 30, 2025తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్‌పింగ్) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో.. తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్-జిన్‌పింగ్‌ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్‌కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ట్రంప్‌కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్‌తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్‌లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్‌లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్‌ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
నేడు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ గురువారం దక్షిణ కొరియాలో సమావేశం కాబోతున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ బుధవారం వెల్లడించారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు. దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారు. అమెరికా–చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతికి నూతన వేగాన్ని కల్పిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నట్లు జియాకున్ తెలియజేశారు. సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షీ జిన్‌పింగ్‌తో ముఖాముఖి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
తాలిబన్లను తుడిచిపెట్టేస్తాం
ఇస్లామాబాద్: ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దేశంలో మళ్లీ ఉగ్రవాద దాడులు జరిగితే ఆ దేశంలో అధి కారంలో ఉన్న తాలిబన్లను తుడిచిపెట్టేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చ రించారు. సోదర దేశంగా శాంతి నెలకొల్పేందు కు ఆఫ్గనిస్తాన్‌కు ఒక అవకాశం ఇచ్చామని, కా నీ.. ఆ దేశంలోని కొందరు నేతలు చేస్తున్న ప్రక టనలు తాలిబన్ల సంకుచిత బుద్ధిని బయటపెడు తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు బుధ వారం ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘పాకిస్తాన్‌కు ఉన్న ఆయుధాల్లో చిన్న భాగాన్ని వాడినా తాలిబన్ల పాలనను అంతం చేసి, వారిని తిరిగి గుహల్లోకి తరమగలం. వాళ్లు అదే గనుక కోరుకుంటే.. గతంలో మాదిరిగానే తోకలు ము డుచుకుని తోరాబోరా గుహల్లోకి మళ్లీ పరుగులు తీయటం అక్కడి ప్రజలు చూస్తారు. తాలిబన్లు పోరాటాన్నే కోరుకుంటే.. వారి సర్కస్ ఫీట్లను ప్రపంచం మొత్తం చూస్తుంది. మీ ద్రోహాన్ని, అపహాస్యాన్ని చాలాకాలంగా భరిస్తున్నాం. ఇక భరించేది లేదు. పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా, ఆత్మాహుతి దాడి జరిగినా.. ఆ దుస్సాహసానికి తగిన ప్రతిఫలాన్ని రుచి చూస్తారు. మా శక్తిసా మర్థ్యాలను పరీక్షించాలని చూస్తే.. అదే మీ అంతం అవుతుంది. ఆఫ్గనిస్తాన్‌ను సామ్రాజ్యాల స్మ శానం అంటుంటారు కదా! పాకిస్తాన్ సామ్రాజ్యం కాదు. కానీ, ఆఫ్గనిస్తాన్ మాత్రం కచ్చితంగా వారి సొంత ప్రజల స్మశానమే. నిజానికి మీ దేశం సామ్రాజ్యాల స్మశానం కాదు. మీ చరిత్ర మొత్తం సామ్రాజ్యాల ఆట స్థలం’అని ఎద్దేవా చేశారు.చర్చలు విఫలంపాకిస్తాన్– ఆఫ్గనిస్తాన్ మధ్య కొద్దిరోజులుగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటాన్ని ఆపేయాలన్న పాకిస్తాన్ ప్రధాన డిమాండ్‌కు ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు అంగీకరించకపోవటంతో చర్చల్లో ప్రతిష్టంభణ ఏర్పడింది. టర్కీ మధ్యవర్తిత్వంతో గత శనివారం నుంచి జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయని పాకిస్తాన్ సమాచా ర శాఖ మంత్రి అత్తొల్లా తరార్ బుధవారం ప్రకటించారు. ఉగ్రవాదులను నిర్మూలించటంలో ఆఫ్గనిస్తాన్ నుంచి దీర్ఘకాలిక సహకారాన్ని ఆశించామని, సీమాంతర ఉగ్రవాద నిర్మూలన కోసం ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైనప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. దోహాలో తాలిబన్లు రాత పూర్వకంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరినా అటువైపు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆరోపించారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. చర్చల విఫలంపై తాలిబన్ల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు తమ ప్రజల భద్రత, శాంతి కోసం వీలైనన్ని మార్గాల్లో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి. -
బ్రెజిల్లో డ్రగ్స్ ముఠాలపై దాడులు
రియో: బ్రెజిల్లో అక్రమ మాదక ద్రవ్యాల ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రియో డి జెనీరో సిటీలో మంగళవారం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఎదురు తిరిగిన డ్రగ్స్ డీలర్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం 132 మంది మరణించడం గమనార్హం. ఈ దాడుల్లో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్నట్లు రియో డి జెనీరో స్టేట్ గవర్నర్ క్లాడియో క్యాస్ట్రో చెప్పారు. నగరంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ అని స్పష్టంచేశారు. దాడుల్లో 42 తుపాకులు సైతం లభ్యమైనట్లు అధికారులు వెలలడించారు. రియో సిటీలో వచ్చేవారం సీ40 ప్రపంచ మేయర్ల సదస్సు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ముఠాల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మాదక ద్రవ్యాలు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. వేలాది మంది పోలీసులు, సైనికులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దాడుల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలను అడ్డుకొనేందుకు డ్రగ్స్ డీలర్లు, అమ్మకందార్లు ప్రయతి్నంచారు. వారు డ్రోన్లతో ఎదురు దాడులు చేసేందుకు ప్రయతి్నంచారు. చివరకు పోలీసులు వారి ఆట కట్టించారు. 81 మందిని అరెస్టు చేశారు. -
మెలిసా ధాటికి 25 మంది మృతి
శాంటియాగో డి క్యూబా: మెలిసా తుపాను ధాటికి కరీబియన్ దేశాల్లో తీవ్ర నష్టం సంభవించింది. హైతీలో 25 మంది మృతిచెందారు. క్యూబా, జమైకా దేశాల్లో వరదలు ముంచెత్తాయి. హైతీలో లా డిగూ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సమీపంలోని జనావాసాలను ముంచెత్తింది. బుధవారం పదుల సంఖల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 25 మంది మరణించగా, చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాధితులను ఆదుకోవాలని గవర్నర్ జీన్ బెర్ర్టాండ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెలిసా ప్రభావం వల్ల జమైకాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గ్రాన్మా ప్రావిన్స్ వరద నీటిలో చిక్కుకుంది. ఇక్కడ 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు భవనాలు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల కారణంగా రహదారులు మూసుకుపోయాయి. బలమైన ఈదురుగాలులు వీచడంతో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. మరోవైపు క్యూబాలో 7.35 లక్షల మంది శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మెలిసా తుఫాను తూర్పు క్యూబావైపు ప్రయాణించి, క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
104 మందిని చంపేసి కాల్పుల విరమణ పాట!
డెయిర్–అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): పెద్దన్న పాత్రలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తదేనని తేలిపోయింది. బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమైందన్న సాకు చూపి ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులతో తెగబడింది. సంధి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి మొదలెట్టిన భూతల, గగనతల దాడుల్లో ఇప్పటిదాకా 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో దాడులు, ఇంతటి మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో పశ్చిమాసియాలో హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయని స్పష్టమైంది. ఇష్టారీతిగా దాడులు చేసి 104 మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకివచ్చిందని ప్రకటించడం గమనార్హం. -
మోదీ గొప్ప వ్యక్తి.. కిల్లర్
టోక్యో/సియోల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్–పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్ దారికొచ్చిందని, పాక్‌పై దాడులు నిలిపివేసిందని స్పష్టంచేశారు. కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్ జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు. -
ప్రభుత్వ వర్సిటీల్లో హెచ్–1బీని ఆపేయండి
న్యూయార్క్: స్థానిక అమెరికన్లకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ ప్రసంగాలిచ్చే అమెరికా అధ్యక్షుడి బాటలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ పయనిస్తున్నారు. హెచ్–1బీ వీసాదారులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఉద్యోగాల్లో నియమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని వర్సిటీలకు ఆయన సూచించారు. ఇప్పటికే ఈ మేరకు ఫ్లోరిడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఆదేశించానని ఆయన చెప్పారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఫ్లోరిడాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హెచ్–1బీ వీసాదారులు స్థానికులను తోసిరాజని అన్ని రకాల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. హెచ్–1బీ వీసాదారులంతా ఒకరకంగా వలస కూలీలు. మధ్యలో బ్రోకర్ల సాయంతో ఇక్కడికొచ్చి బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. వర్సిటీల ఆడిటింగ్‌లో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీల్లో విదేశీయులు అధ్యాపకులుగా, నిపుణులుగా, చివరకు స్విమ్కోచ్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. కనీసం స్విమ్కోచ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అమెరికన్ పనికిరాడా?. ఇకనైనా వర్సిటీలు ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించుకోవాలి’’ అని డీశాంటిస్ అన్నారు. -
మూడోసారి అవకాశం లేదట!
గ్వాంగ్జు (దక్షిణకొరియా): అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి కూడా పోటీపడాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేయటంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. మూడోసారి పోటీకి అవకాశం లేకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం దక్షిణకొరియాకు వెళ్తూ తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్‌లోని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్, రిపబ్లికన్ నేత మైక్ జాన్సన్ మంగళవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మూడోసారి పోటీ చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 22వ రాజ్యాంగ సవరణ ఏ అమెరికన్ పౌరుడు కూడా మూడోసారి అధ్యక్షుడు కావటాన్ని అనుమతించదని స్పష్టంచేశారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణను మళ్లీ సవరించి మూడోసారి అధ్యక్ష పదవికి అర్హత లభించేలా చట్టం చేయాలన్నా.. అది పదేళ్ల సుదీర్ఘ ప్రక్రియ అని పేర్కొన్నారు. మైక్ జాన్సన్ ప్రకటన గురించి మీడియా ప్రస్తావించగా ట్రంప్ నిర్వేదంగా మాట్లాడారు. ‘నేను చదివినదాన్ని బట్టి బహుషా నేను కొనసాగటానికి (మూడోసారి అధ్యక్షుడిగా) అనుమతి ఉండదట. ఇది చాలా దురదృష్టకరం. చూద్దాం ఏం జరుగుతుందో’ అని అన్నారు. కష్టమే కాదు.. అసాధ్యం మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగటానికి ఎవరికీ సాధ్యం కాదని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టంచేశారు. ‘నాకు తెలిసి అందుకు మార్గమే లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలో ఉన్న అడ్డంకులపై ఆయన (ట్రంప్)తో నేను చర్చించాను. ఈ విషయంలో ఇక వివాదాన్ని రాజేయలేం. ఆయనకు ఇంకా నాలుగేళ్ల సమయం (అధ్యక్షుడిగా) ఉంది’అని పేర్కొన్నారు. అయితే, తనకు మూడోసారి అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోయినా తన రిపబ్లికన్ పారీ్టలో ఆ పదవికి అర్హత ఉన్న అనేకమంది నేతలు ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో వంటివారు అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తెలిపారు. వచ్చేసారి ఉపాధ్యక్షుడిగా పోటీచేసి, తిరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా.. ‘అలా చేయటానికి అవకాశం ఉంది. కానీ నేను చేయను’ అని బదులిచ్చారు. -
మోదీతో అంత ఈజీ కాదు: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒస్పేసుకున్నారా?, త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్.. మోదీపై ప్రశంసలకు కారణం ఏమిటి?, భారత్‌తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారా?, వీటికి మరింత బలం చేకూరుస్తూ దక్షిణకొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.‘నాకు మోదీతో మంచి రిలేషన్ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్ చెప్పకనే చెప్పేశారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) సీఈఓల సమ్మిట్‌లోట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్.- పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్ అనుకరించారు. -
భారత్ వస్తున్న రష్యా చమురు నౌక యూటర్న్!
రష్యా చమురుపై అమెరికా ఆంక్షల నడుమ రష్యా నుంచి ముడి చమురును తీసుకుని భారత్ వస్తున్న నౌక అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. 'ఫ్యూరియా' అనే ఈ పెద్ద నౌక మంగళవారం డెన్మార్క్, జర్మనీ మధ్య మార్గం ద్వారా భారత్ వైపు వెళుతోంది. ఈ ఓడ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్ నెఫ్ట్ విక్రయించిన చమురును తీసుకువెళుతోంది.రష్యా చమురు కంపెనీలు రోస్ నెఫ్ట్, లుకోయిల్‌లను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన వారం తర్వాత ఈ యూ-టర్న్ సంఘటన జరిగింది. ఈ రెండు కంపెనీలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అక్టోబర్ 22న ఆంక్షలు విధిస్తూ కంపెనీలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.కాగా బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. ఫ్యూరియా ట్యాంకర్ అక్టోబర్ 20న రష్యాలోని బాల్టిక్ నౌకాశ్రయమైన ప్రిమోర్స్క్ నుండి సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును లోడ్ చేసుకుని బయలుదేరింది. తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం ఉపయోగిస్తున్న గుజరాత్‌లోని సిక్కా పోర్ట్‌ను ఈ నౌక తన గమ్యస్థానాన్ని ప్రకటించింది. ఈ నౌక నవంబర్ మధ్యలో భారత్ చేరుకుంటుందని భావించారు.తరువాత, నౌక తన గమ్యాన్ని ఈజిప్టులోని పోర్ట్ సైద్‌కు మార్చింది. రష్యా నుండి భారత్‌కు వేగవంతమైన మార్గం సూయజ్ కాలువ గుండా ఉంటుంది. కాబట్టి నౌకలు తరచుగా సూయజ్ కాలువ గుండా వెళ్లే ముందు పోర్ట్ సైద్‌ను తమ గమ్యస్థానంగా ప్రకటిస్తుంటాయి.అయితే ఈ ఫ్యూరియా నౌక వయస్సు కూడా సమస్య కావొచ్చు. ఫ్యూరియా ట్యాంకర్‌ను ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే నిషేధించాయి. ఈ ట్యాంకర్‌కు ఈ ఏడాది 23 ఏళ్లు నిండుతాయి. చమురు ట్యాంకర్ల సాధారణ పరిమితి 18 సంవత్సరాలు. అంతేకాకుండా డెన్మార్క్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ జలాల గుండా వెళుతున్న పాత ట్యాంకర్ల తనిఖీలను ముమ్మరం చేశాయి. -
అమెరికాలో పెరుగుదల Vs భారత్‌లో తగ్గుదల
ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్‌ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్‌లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.భారత్‌లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలుభారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపులో ఒత్తిడిభారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.అధిక టాలెంట్ సప్లైభారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్‌ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్‌ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలుభారత్లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.అధిక డిమాండ్యూఎస్ మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.ఈక్విటీ-ఆధారిత పరిహారంనివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్‌లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయంఅమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే.. -
ఎట్టకేలకు పెదవి విప్పిన పెద్దోడు
ప్రపంచ దేశాల నుంచి ఎంతో గౌరవమర్యాదలు అందుకునే బ్రిటన్ రాజ కుటుంబం.. నిగూఢ విబేధాలకూ కేంద్రంగా కూడా ఉంది. మరీ ముఖ్యంగా డయానా పిల్లలు ప్రిన్స్ విలియమ్, హ్యారీలు దూరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో హ్యారీ గురించి విలియమ్ చేసిన ఒక్క వ్యాఖ్య.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. యాపిల్ టీవీ షో(The Reluctant Traveller) లో భాగంగా యూజీన్ లెవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘హ్యారీ -నేను చిన్నతనంలో ఎదుర్కొన్న పాత పద్ధతులు మళ్లీ రాకూడదని ఆశిస్తున్నా. అలాంటి పరిస్థితులు తిరిగి రాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో ఏదైనా అద్భుతం జరగబోతోందా? అనే చర్చ జోరందుకుంది. విలియం, హ్యారీలు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-డయానా సంతానం. తల్లి డయానా ప్రమాదంలో మరణించాక గ్లోబల్ మీడియా దృష్టి ఇద్దరిపై ఉంటూ వచ్చింది. అయితే.. 2016 నుంచి ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నటి మేఘన్ మార్కెల్‌ను 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నాక అవి మరింత ముదిరాయి. ఈ క్రమంలో 2020లో హ్యారీ రాజ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుని భార్యతో అమెరికాకు వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2021లో ఓఫ్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ కుటుంబంపై హ్యారీ-మేఘన్‌లు చేసిన ఆరోపణలు ఆ గ్యాప్‌ను మరింత పెంచాయి. అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య మాటల్లేవ్!. ఈలోపు.. వీళ్లను కలిపేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. హ్యారీ అన్నతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా విలియమ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం ఒకటి ఉంది. ఈలోపు కొన్ని వార్తా సంస్థలు.. హ్యారీ ఒక్కడిగా వస్తేనే తాను మాట్లాడతానంటూ విలియమ్ షరతు పెట్టినట్లు కథనాలు ఇచ్చాయి. 2022 సెప్టెంబర్‌లో వీళ్ల నాన్నమ్మ క్వీన్ ఎలిజబెత్ మరణించిన సమయంలోనూ ఈ ఇద్దరు కలుసుకుంటారనే ప్రచారం జరిగింది. ఆ మధ్య తండ్రిని కింగ్ చార్లెస్-IIIని చూడడానికి వచ్చిన సమయంలోనూ అన్నతో హ్యారీ భేటీ అవుతాడనే ప్రచారమూ జరిగింది. చివరిసారిగా ఈ ఇద్దరూ 2024 ఆగస్టులో మామ లార్డ్ రాబర్ట్ ఫెలోస్ స్మరణ సభలో పక్కపక్కనే కనిపించినా మాట్లాడుకోలేదు.దీంతో.. విలియమ్ తాజా వ్యాఖ్యలతో అన్నదమ్ములు ఒక్కటవుతారా? అనే చర్చ నడుస్తోంది. అయితే.. అది కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదని.. రాజ కుటుంబంలో తరం మార్పునకు సంకేతంగా భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నతనంలో ఆ అన్నదమ్ములు ఎదుర్కొన్న మీడియా ఒత్తిళ్లు, కుటుంబ వ్యవస్థల లోపాల గురించే విలియమ్ మాట్లాడి ఉంటారని, తన పిల్లల కోసం, భవిష్యత్ రాజ కుటుంబం కోసం మంచి వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలు కచ్చితంగా హ్యారీ, మేఘన్‌లకు సర్ప్రైజేనని అంటున్నారు. View this post on Instagram A post shared by The Mirror (@dailymirror) -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్‌లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్‌గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్‌తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్‌లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
భారత్‌తో లోతైన చర్చలే జరిపాం: చైనా
చైనా-భారత్ నడుమ సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల సైన్యాలు ఈ మేరకు లోతైన చర్చలే జరిపినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వర్గాలు ఈ ప్రకటనను ధృవీకరించాల్సి ఉంది.పశ్చిమ సరిహద్దు ప్రాంతాల నిర్వహణపై కీలక చర్చలు జరిగాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో సైనిక , దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపింది. ఈ సమావేశం అక్టోబర్ 25వ తేదీన భారత వైపు ఉన్న ఒక నిర్దిష్ట సమావేశ స్థలంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే తరహాలో జూలైలో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చలు జరిగాయి. చైనా ఈ చర్చలను కూడా “స్పష్టమైన”విగా పేర్కొంది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుతంగా, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయని తెలిపింది.2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సైనిక మోహరింపుతో నాలుగేళ్ల పాటు ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. అయితే.. 2024 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం తర్వాత ఇండియా-చైనా సంబంధాలు మెరుగవుతున్న సూచనలు కనిపించాయి. ఈలోపు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య తియాంజిన్‌లో షాంగై సమ్మిట్ సందర్భంగా చారిత్రక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, “భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు” అని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకోవడం, పరస్పర గౌరవం, సహకారం అందించుకోవడంపై రెండు దేశాలు అంగీకరించాయని ఆ సందర్భంలో మోదీ తెలిపారు. ఈ భేటీ వేదికగా.. వాణిజ్య, పౌరవిమానయాన, పెట్టుబడుల పరంగా పరస్పర సహకారం పెంచేందుకు 12 అంశాలపై అవగాహన ఏర్పడింది.అయితే ఈ ఒప్పందాల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారతాయని భావించినప్పటికీ.. అలాంటిదేం కనిపించేదు. ప్రస్తుతం.. తూర్పు లడాఖ్‌లో LAC వెంబడి ఇరు దేశాలు సుమారు 50,000–60,000 సైనికులను మోహరించాయి. అయితే తాజా చర్చల పురోగతితో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: పాక్ ఇంక మారదా?.. మళ్లీ పిచ్చి ప్రేలాపనలు -
భారత్ కీలుబోమ్మగా ఆప్ఘనిస్తాన్.. 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి: పాక్ మంత్రి
ఇస్లామాబాద్: తుర్కియే వేదికగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ఘనిస్థాన్ నాయకత్వం భారత్ కీలు బొమ్మగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. అలాగే, ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ తీవ్రంగా హెచ్చరించారు.పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది. భారత్ చెప్పిన విధంగా కాబూల్ ప్రజలు తీగలను లాగుతూ, తోలుబొమ్మ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. భారత్ పశ్చిమ సరిహద్దులో ఓటమికి పరిహారం చెల్లించడానికి ఆఫ్ఘనిస్థాన్‌ను ఉపయోగిస్తోంది. భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చర్చలు విఫలమయాయి. కాబూల్ పవర్ బ్రోకర్లు భారత్ ప్రభావంతో చర్చలను దెబ్బతీశారు. పాకిస్తాన్‌తో భారత్ తక్కువ తీవ్రత గల యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటోంది. దీన్ని సాధించడానికి కాబూల్‌ను పాక్‌పై ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కాబూల్ కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.చర్చలు విఫలమైతే యుద్ధమే!ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమైతే ప్రత్యక్ష సంఘర్షణ తప్ప మాకు మరే ఆప్షన్ లేదని ఖవాజా అసిఫ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం.. మరో యుద్ధాన్ని భరించలేని ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. పాక్, ఆప్ఘన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ, నాలుగో దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు. దీంతో, జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించాయి. ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమని ఇరు దేశాలూ ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ బృందం నిర్మాణాత్మక చర్చలకు అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపింది. దీనిపై పాక్ స్పందిస్తూ ఆప్ఘన్లు.. మొండివైఖరి, ఉదాసీనత ధోరణి చూపారని ఆరోపించింది. తదుపరి చర్చలు ఆప్ఘన్ సానుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిజంగా ఈ చర్చలు విఫలమైతే భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత్‌లో దాడులకు నిధులు సమకూర్చడం, శిక్షణ సహా ఇతర రకాలుగా పాక్ సైన్యం మద్దతు ఇస్తోందని న్యూఢిల్లీ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది.భారత్, ఆప్ఘన్ సంబంధాలుఅక్టోబరు మొదటి వారంలో మొదటిసారి తాలిబన్ మంత్రి భారత్ పర్యటనకు విచ్చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆప్ఘన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్దరణకు మార్గం సుగమం అయ్యింది. విదేశాంగ మంతి అమిర్ ఖాన్ ముత్తఖీ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అనంతరం కాబూల్‌లోని టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి ఎంబసీగా మార్చాలని నిర్ణయించారు. అలాగే, పహల్గామ్లో ఉగ్రదాడిని ముత్తఖీ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. -
విరుచుకుపడిన ‘మెలిసా’
కింగ్స్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటిగా రూపుదాలి్చన ‘మెలిసా’ తుపాను మంగళవారం జమైకా దేశాన్ని వెన్నులో వణకుపుట్టే స్థాయిలో భీకరంగా తాకింది. జమైకాలో నైరుతి దిశలో ఉన్న ‘న్యూ హోప్’ ప్రాంతం వద్ద తుపాను తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలుల ధాటికి కరీబియన్ ద్వీపదేశం జమైకాలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయి దేశంలో సగం జనావాసాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతటా అంధకారం అలుముకుంది. రాజధాని నగరం కింగ్‌స్టన్‌లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.జమైకాలో తుపాన్లను నమోదుచేసే విధానం మొదలైన ఈ 174 ఏళ్లలో ఇంతటి భీకర తుపాను రావడం ఇదే తొలిసారి. కేటగిరీ–5 తుపాన్ అయిన మెలిసా ధాటికి మంగళవారం జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కనీవినీ ఎరుగని శక్తివంతమైన తుపాను దెబ్బకు దేశం చరిత్రలో ఎప్పడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవిచూడబోతోందని ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘తుపాను ఇప్పుడే తీరాన్ని తాకింది. వెంటనే దీని పూర్తి నష్ట తీవ్రతను అంచనావేయలేం’’ అని ఆయన అన్నారు. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరంచేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. తుపాను కారణంగా హైతీ దేశంలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్ దేశంలో ఒకరు మరణించారు.ఐక్యరాజ్యసమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యవసరాలను జమైకాకు తరలిస్తున్నాయి. సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, ప్రతి చుక్కా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను నిలిపేశారు. ఎయిర్‌పోర్ట్‌లు, ప్రజారవాణా స్తంభించిపోయింది. కింగ్స్టన్, సెయింట్ ఎలిజబెత్, క్లారెండన్ నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లికన్, బహమాస్పైనా ప్రభావం చూపింది.క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాన్‌కు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అవి చూసిన తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టంచేశారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు క్యూబా, బహమాస్ల వైపు వెళ్లాక తుపాను కొనసాగే అవకాశముందని అమెరికా హరికేన్ విభాగం పేర్కొంది. -
మనది స్వర్ణయుగ బంధం
టోక్యో: చైనాతో వాణిజ్య యుద్ధ భయాల వేళ.. ఆ దేశానికి చారిత్రక శత్రువు అయిన జపాన్‌కు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి జపాన్‌లో రెండురోజుల పర్యటనలో ఉన్న ఆయన జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయి తకాయిచితో అనేక అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం రోజంతా ఈ ఇద్దరు నేతలు వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు తకాయిచి ప్రయత్నించగా, జపాన్ నుంచి బలవంతంగానైనా పెట్టుబడులు రాబట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేసేందుకు తకాయిచిని ఒప్పించారు. తకాయిచితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జపాన్‌కు ట్రంప్ పలు హామీ ఇచ్చారు. ‘జపాన్‌కు సాయం చేసేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు చాలా బలమైన స్థాయిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. లంచ్ మీటింగ్‌లో భాగంగా ఇరువురు నేతలు అంతర్జాతీయ పరిణామాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఖనిజా లపై వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు. అమెరికాలో జపాన్ భారీ పెట్టుబడులుట్రంప్ తన సహజ ధోరణిలో జపాన్‌కు వరాలు ప్రకటిస్తూనే నిందలు కూడా మోపారు. జపాన్ అసలు అమెరికా వాహనాలను కొనటం లేదని ఆరోపించారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు లంచ్ మీటింగ్‌లో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన 150 ఫోర్డ్ ట్రక్కులకు కొనుగోలు చేస్తామని తకాయిచి ప్రకటించారు.అనంతరం టోక్యో సమీపంలోని అమెరికా సైనిక స్థావరం వద్ద ఉన్న అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్‌పై కూడా ట్రంప్, తకాయిచి సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా, జపాన్ కంపెనీల సీఈవోలకు ట్రంప్ విందు ఇచ్చారు. జపాన్ కంపెనీల సీఈవోలతో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ విందు సమావేశం నిర్వహించి భారీగా పెట్టుబడులు రాబట్టారు. వెస్టింగ్‌హౌస్, జీఈ వెర్నోవా సంస్థలు అమెరికాలో అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ట్రంప్‌కు శుభవార్తనోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలా డుతున్న ట్రంప్‌కు జపాన్ ప్రధాని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేస్తామని తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ తెలిపారు. ఈ ఏడాది పాకిస్తాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు, వ్యక్తులు ట్రంప్‌ను నామినేట్ చేసినా నోబెల్ కమిటీ ఆయనకు శాంతిపురస్కారం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ బుధవారం దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చలు జరుపనున్నారు. -
గాజాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
టెల్అవీవ్: గాజా ప్రాంతంపై భీకర దాడులు చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం తెలపగా, అలాగైతే బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతుందని హమాస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ గాజాలోని రఫాలో తమ బలగాలపై హమాస్ మంగళవారం కాల్పులు జరిపిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అంతేకాకుండా, ఇప్పటికే స్వా«దీనం చేసుకున్న బందీ అవశేషాలను మళ్లీ అప్పగించిందంటూ హమాస్‌ను తప్పుబట్టింది. ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని స్పష్టమవుతోందని, బదులుగా గాజాపై భీకర దాడులు చేపట్టాలని ప్రధాని నెతన్యాహూ ఆదేశించారు. అయితే, నెతన్యాహూ హెచ్చరిక కారణంగా మంగళవారం దొరికిన మరో బందీ మృతదేహాన్ని అప్పగింత ఆలస్యమవుతుందని హమాస్ తెలిపింది. ఇప్పటికీ 13 మంది బందీల మృతదేహాలు హమాస్ వద్ద ఉన్నట్లు అంచనా. -
ఘోర విమాన ప్రమాదం.. 12మంది దుర్మరణం
నైరోబి: కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం కెన్యాలోని క్వాలే కౌంటీలో విమానం కూలింది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న విమానం డయాని నుండి మాసాయి మారాలో కిచ్వా టెంబోకు బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమాన ప్రమాదాన్ని కెన్యా పౌర విమానయాన అథారిటీ (కేసీఏఏ) ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.‘డయాని నుండి కిచ్వా టెంబోకు వెళుతున్న 5Y-CCA రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విమానం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు , దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లారు’ అని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటనలో పేర్కొంది.పోలీసుల ప్రకారం.. విమాన ప్రమాదంలో మరణించిన 12 మంది ప్రయాణికులు పర్యాటకులని తేలింది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని పరిశీలించడానికి,దర్యాప్తు చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని కేసీఏఏ డైరెక్టర్ ఎమిలే ఎన్.రావు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విషాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుండి, తీరప్రాంతం పొగమంచు, మేఘాలతో కప్పబడి ఉండటం వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ కథనాల్లో హైలెట్ చేశారు. Kenya Civil Aviation Authority (KCAA) wishes to confirm that an aircraft registration number 5Y-CCA, on its way from Diani to Kichwa Tembo crashed at 0530Z. pic.twitter.com/GXBIe9TP1V— Kenya Civil Aviation Authority (@CAA_Kenya) October 28, 2025 -
‘భజనలో.. గోల్డ్ మెడల్ నీకేపో!’
ఒకవేళ భజన అనే పోటీ గనుక ఒలింపిక్స్‌లో ఉండి ఉంటే.. పాకిస్తాన్‌కు కచ్చితంగా ఆ పోటీల్లో గోల్డ్ మెడల్ వచ్చి తీరేదేమో!. విన్నర్ పోడియంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉండి ఉండేవారేమో!.. ఈ మాటలు అంటోంది ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విపరీతమైన ప్రశంసలు గుప్పించాడు. కంబోడియా–థాయ్‌లాండ్ మధ్య తాజాగా కౌలాలంపూర్ ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందం కుదరింది. ఈ నేపథ్యంలో.. శాంతి, స్థిరత్వానికి కృషి చేసే నాయకుండంటూ పాక్ ప్రధాని విపరీతమైన పొగడ్తలు గుప్పించారు. మొన్న గాజా శాంతి ప్రణాళిక.. ఇప్పుడేమో ఇది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో శాంతి కోసం ట్రంప్ చేసిన కృషి ప్రపంచాన్ని రక్షించింది. లక్షల మంది ప్రాణాలు పోకుండా నిలబెట్టింది అని షెహబాజ్ పేర్కొన్నారు.దీనిపై పాకిస్తాన్ మాజీ అమెరికా రాయబారి హుస్సేన్ హక్కానీ, షెహబాజ్ షరీఫ్‌పై వ్యంగ్యంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్‌ను పొగడటంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచే స్థాయిలో ఉన్నారంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫరీద్ జకారియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘ఇది ఒలింపిక్ క్రీడ అయితే, షరీఫ్ పోడియం మీద గోల్డ్ మెడల్‌తో నిలిచేవారు అని అన్నారు. ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులోనూ షరీఫ్ ట్రంప్‌ను విపరీతంగా పొడిగారు. ట్రంప్‌ను శాంతి పురుషుడిగా అభివర్ణిస్తూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ మాట్లాడారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిత్రమైన హవభావాలు ప్రదర్శించడం విపరీతంగా వైరల్ అయ్యింది. షరీఫ్ మాటలతో కడుపు నిండిపోయిన ట్రంప్ ‘ఇక మాట్లాడేం లేదని, ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ వ్యంగ్యంఆ స్పందించడం మరో కొసమెరుపు. అయితే షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను పాక్ పౌరులే భరించలేకపోయారు. అంతలా దిగజారి పొగడాల్సిన అవసరం ఏముందంటూ.. ప్రధానిని తిట్టిపోశారు కూడా. -
ఎలాన్ మస్క్ మరో సంచలనం
ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు. వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్ అంటూ ప్రకటించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version 0.1) ప్లాట్‌ఫారమ్‌ను ఇవాళ(అక్టోబర్ 28న) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని మస్క్ అంటున్నారు. అయితే.. ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. అంతేకాదు.. కొంత మంది ఇది వికీపీడియాతో పోలిస్తే కొత్తగా ఏం లేదని పెదవి విరుస్తున్నారు. పైగా ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా నుంచే తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. వికీపీడియాను జిమ్మీ వేల్స్ (Jimmy Wales), ల్యారీ సాంగర్ (Larry Sanger) కలిసి 2001 జనవరి 15న స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికలలో ఒకటి. ఇది ఒక ఫ్రీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎవరైనా సమాచారాన్ని పొందుపరచవచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. వికీపీడియాకు పోటీగా, నిజమైన సమాచారం కోసం కొత్త వేదికలు అవసరం అంటూ మస్క్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వికీపీడియాలోని సమాచారం విషయంలో స్పష్టత కొరవడింది. పూర్తిగా పక్షపాత ధోరణి కనిపిస్తోంది. అదే ఏఐతో అయితే అందుకు ఆస్కారం ఉండదని చెబుతూ ఇప్పుడు మస్క్ Grokipedia తీసుకొచ్చారు. -
విమానంలో కలకలం.. ప్రయాణికులపై భారతీయ విద్యార్థి దాడి
లుఫ్తాన్సా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ భారతీయ విద్యార్థి.. తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. పదునైన మెటల్ ఫోర్క్‌తో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడ్డాడు. షికాగో నుంచి జర్మనీకి ప్రయాణిస్తున్న విమానంలో ఘటన జరిగింది. నిందితుడిని ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా పైలట్లు విమానాన్ని బోస్టన్‌కు మళ్లించాల్సి వచ్చింది. అధికారుల సమాచారం మేరకు.. విమానం అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రణీత్ కుమార్.. 17 ఏళ్ల ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్‌తో దాడి చేశాడు. మొదట నిద్రలో ఉన్న ఓ యువకుడి భుజంపై ఫోర్క్‌తో గాయపరిచాడు. అనంతరం మరో యువకుడిపై తల వెనుక భాగంలో గాయపరిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై కూడా దాడి చేశాడు.ఈ ఘటన అనంతరం లుఫ్తాన్సా ఫ్లైట్ 431 బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనలో ప్రణీత్‌కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం అతను ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు. బోస్టన్లోని యూఎస్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రణిత్ కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థి వీసాతో అమెరికాలోకి ప్రవేశించాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అతడు అక్కడే ఉంటున్నట్లు సమాచారం. -
తుర్కియేలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
పశ్చిమ తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత 6.1గా నమోదైంది. రాత్రి 10:48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కొన్ని భవనాలు దెబ్బతినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. బాలికెసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఇస్తాంబుల్, బుర్సా, మానిసా, ఇజ్మిర్ వంటి నగరాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. టర్కీ భూకంపాలకు అత్యంత ప్రభావిత దేశాలలో ఒకటి. ఇది మూడు ప్రధాన భూకంప టెక్టానిక్ ప్లేట్ల మధ్యలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 53,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రేపు కూడా భూకంపనలు వచ్చే అవకాశముందని ఎఫ్ఏడీ తెలిపింది. ఇప్పటి వరకు బాలికెసిర్‌లో 14 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు.6.1 magnitude earthquake strikes Turkey, about 100 miles south of Istanbul, and reduces many buildings to rubble. pic.twitter.com/clxIFxXVzl— Mr. Lou Rage (@mrlourage) October 27, 2025 -
రాజ్యాంగ విరుద్ధమైనా.. ‘మళ్లీ నేనే!?’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) తన మనసులోని మాట బయటపెట్టారా?. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్నారా?. జపాన్ పర్యటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.వైట్‌హౌజ్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ తాజాగా ట్రంప్ మూడో దఫా పోటీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జపాన్ పర్యటనకు బయల్దేరే ముందు విమానం(Air Force One) వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. దానికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే. నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. అయితే.. ఆ వెంటనే ‘‘ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ.. ‘వాళ్లలో ఒకరు ఇక్కడే ఉన్నారు’ అని చమత్కరించారు. అలాగే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ప్రశంసిస్తూ.. అవును, జేడీ అద్భుతంగా ఉన్నాడు. ఉపాధ్యక్షుడు గొప్పవాడు. వీళ్లిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు.అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగనున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్షుడిగా అవుతారు. దీనికి ఒక ప్రణాళిక ఉంది. కఠినమైన అడ్డంకే ఉన్నా.. దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి. 2016, 2024లో ట్రంప్ సాధించారు. వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు. గతంలో ఫ్రాక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే.. 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ (22nd Amendment) ద్వారా రాటిఫై చేశారు. ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే, అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే, అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. స్టీవ్ బానన్, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నా.. న్యాయపరంగా అవి అమలులోకి రావడం అసాధ్యం. ఇదిలా ఉండగా.. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్‌లో ఈ మేరకు.. మలేషియా అద్భుతమైన దేశం. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశాం. ముఖ్యంగా థాయ్‌లాండ్ మరియు కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేదు! కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్‌కు బయల్దేరా అని పోస్ట్ చేశారు. -
మరో 50 మంది భారతీయులు వెనక్కి
అంబాలా/కురుక్షేత్ర: ఏజెంట్లకు 30–40 లక్షల రూపాయలు ముట్టజెప్పి చిట్టడడవులు, నదులు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి అక్రమ మార్గం(డంకీ రూట్)లో అమెరికాలోకి చొరబడిన పలువురు భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించి తిరిగి స్వదేశానికి పంపేసింది. దాదాపు 50 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం శనివారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌కు చేరుకుంది. తిరిగొచ్చిన వారిలో హరియాణా రాష్ట్రంలోని ఖైథాల్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, జింద్, పానిపట్ జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. తిరిగొచి్చన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. విదేశంలోనైనా సంపాదించి భారత్‌లోని తమ కుటుంబసభ్యులకు మెరుగైన జీవితం అందివ్వాలన్న తమ అమెరికా కల కలగానే మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అమెరికా వెళ్లేందుకు రూ.35 లక్షలు ఖర్చు చేశా. ఆ డబ్బంతా భారత్‌లో వ్యవసాయం చేసి సంపాదించా. ఎలాగోలా ఫ్లోరిడా సమీపంలోని జాక్సన్విల్లేలో పనిలో కుదిరా. వంట నేర్చుకున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం నన్ను అరెస్ట్‌చేసి వెనక్కి పంపేసింది. నా కుటుంబ బంగారు భవిష్యత్తు నాశనమైంది. నా డబ్బంతా వృథా అయింది. విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు కట్టేశారు. 24 గంటలపాటు అలాగే తీసుకొచ్చారు. దీంతో నా కాళ్లు ఇలా పూర్తిగా ఉబ్బిపోయాయి ’’అని 45 ఏళ్ల అక్రమ వలసదారుడు హర్జీందర్ సింగ్ వాపోయారు. ‘‘కెనడాలో ఉండేవాడిని. తర్వాత రెండేళ్ల క్రితం వర్క్ పరి్మట్‌తో అమెరికాకు వెళ్లా. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తుంటే అరెస్ట్‌చేసి భారత్‌కు పంపేశారు’’అని కల్సీ గ్రామవాసి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎకరం పొలం అమ్మి, సోదరుడు, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.57 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చా. డంకీ రూట్లో అమెరికా వెళ్లా. కానీ అక్కడ దొరికిపోయా.14 నెలలపాటు బంధించి ఇప్పుడు భారత్‌కు పంపేశారు’’అని నరేశ్ కుమార్ చెప్పారు. గతంలో హరియాణా, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్‌చేసి భారత్‌కు సాగనంపడం తెల్సిందే. -
నీతులు చెప్పేవాళ్లే పాటించట్లేదు
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్‌లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి. సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రితో భేటీభారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్‌లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్‌పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. -
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్‌మేట్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వీళ్లను ఏమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. మన దేశంలో 35 నుంచి 45 లక్షల మంది ద్వారా గత ఏడాది కాలంలో రూ.3,500 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఇలా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టేందుకు మన పొరుగు దేశం చైనా ఓ అద్భుతమైన ప్రణాళిక అమలు చేయబోతోంది. ఏదో ఒక వీడియోతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోవడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారింది. అలా భారత్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇదే అదనుగా తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లను కంపెనీలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాల్లో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో ఇప్పుడు వాళ్లదే కీలక పాత్ర. పైగా సెలబ్రిటీలకి బదులు తక్కువ బడ్జెట్‌తో ఆ పని చేస్తుండడం కంపెనీలకు కలిసొస్తోంది. ఫ్యాషన్, ఫిట్నెస్, ఫుడ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో విస్తృతంగా కంటెంట్ రూపొందిస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న ఓ వ్యక్తి ఓ కంపెనీ పరుపులను అదే పనిగా ప్రమోట్ చేయడం!. అయితే ఏఐ జమానాలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అందుకే చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రొఫెషనల్ విషయాలపై మాట్లాడాలంటే ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు తప్పనిసరి చేసింది. వైద్యం, ఆర్థికం, న్యాయం, విద్య వంటి సున్నితమైన రంగాల్లో కంటెంట్ రూపొందించే ముందు ఇన్ఫ్లుయెన్సర్లు తమ విద్యా అర్హతలు, శిక్షణ పత్రాలు లేకుంటే ప్రొఫెషనల్ అనుభవాన్ని చూపించాల్సి ఉంటుంది. అక్కడి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (ఉదాహరణకు.. Douyin, Weibo, Bilibili వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు) ఈ అర్హతలనూ ధృవీకరించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. ఇన్ఫ్లుయెన్సర్ల సో.మీ. అకౌంట్లను నిలిపివేయడమే కాదు.. శాశ్వత నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. అలాగే.. 100,000 యువాన్ (₹11 లక్షల వరకు) జరిమానా విధించబడుతుంది. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఈ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్‌లో ఇన్ఫ్లుయెన్సర్లు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రదర్శించడంపై కూడా నిషేధం.ఇన్ఫ్లుయెన్సర్ల వ్యక్తిగత అకౌంట్లు మాత్రమే కాదు.. వాళ్లు నిర్వహించే మల్టీ-చానల్ నెట్వర్క్ (MCN)లకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ సంస్థలు తమ టాలెంట్‌ను రాజకీయంగా, ప్రొఫెషనల్‌గా సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కంపెనీ బ్రాండ్లు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కంపెనీలు లేదంటే సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ లేబుల్స్‌ను తొలగించడం లేదంటే తారుమారు చేయడం కఠినమైన నేరంగా పరిగణిస్తారు. లేబులింగ్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తారు. భారత్‌లో ఇలా.. భారత్‌లో చైనా తరహా కఠిన నిబంధనలు (అర్హతల ధృవీకరణ, ప్లాట్‌ఫారమ్‌లపై బాధ్యత, భారీ జరిమానాలు) అమల్లో లేవు. కానీ.. స్పాన్సర్డ్ కంటెంట్‌కి డిస్క్లోజర్ తప్పనిసరిగా ఉంది. అంటే.. ఏఎస్సీఐ (Advertising Standards Council of India) ప్రకారం, #ad, #sponsored వంటి ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే, ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు బ్రాండ్ కూడా Consumer Protection Act (CCPA) ప్రకారం బాధ్యత వహించాలి. ఈ ఏడాదిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ గవర్నెన్స్ కౌన్సిల్ (IIGC).. నైతిక ప్రమాణాలు, కంటెంట్ నైతికత, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అయితే..ఏఐ ఆధారిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌సహా ఇతర దేశాలు కూడా చైనా విధించిన నిబంధనలను పరిశీలించే అవకాశం ఉంది. స్వేచ్ఛా భావప్రకటనకు ఇది అడ్డంకిగా మారుతుందన్న విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఇది అవసరమన్న వాదనలు కూడా ఉన్నాయి. -
Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయంవివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్‌పై భారతదేశంలో మనీలాండరింగ్‌తో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదేవిధంగా జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశం లేదని ప్రకటించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత తన నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదంగా మారింది. 2016, జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్ నాయక్ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ప్రభుత్వం జకీర్ నాయక్‌ను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది.2016లో జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ కేసుభారతదేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతనిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్ స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించే ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నవంబర్ 28-29 తేదీలలో బంగ్లాదేశ్‌కు రానున్నారు. ఈ కార్యక్రమం ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనుంది. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్ఐఏ తొలిసారిగా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్ నాయక్‌పై కేసు నమోదు చేసింది.జకీర్ అప్పగింతకు మలేషియా సహకారం?60 ఏళ్ల జకీర్ నాయక్ 2016లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లి, అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు.తనపై సాగుతున్నఅన్యాయమైన విచారణ నుండి సురక్షితంగా బయటపడేవరకూ తాను భారతదేశానికి తిరిగి రానని జకీర్ నాయక్ గతంలో వెల్లడించారు. కాగా తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్ నాయక్‌ను బహిష్కరించలేమని, భారత్‌కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది మొదట్లో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా మాట్లాడుతూ జకీర్ నాయక్ అప్పగింతకు సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం -
కూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్.. చైనా సముద్రంలో 30 నిమిషాల్లో..
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్ కుప్పకూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెండు వైమానిక వాహనాలు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు.వివరాల ప్రకారం.. అక్టోబర్ 26, 2025 సాయంత్రం 2:45 గంటలకు మొదటగా ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత అర గంట వ్యవధిలో అంటే.. 3:15 గంటలకు బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అదే సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదానికి గురైన, నావికా విమానం, హెలీకాప్టర్ రెండూ యూఎస్ నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం.అయితే, ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, సాధారణ కార్యకలాపాల్లో ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు.US Navy fighter jet and helicopter crash in the South China SeaThe US Navy announced in a statement that a Boeing F/A-18E and F/A-18F Super Hornet and an MH-60R Sea Hawk Helicopter separately crashed during operations from the aircraft carrier USS Nimitz in the South China Sea. pic.twitter.com/bX9dVaemTM— IRNA News Agency (@IrnaEnglish) October 27, 2025 -
యూకేలో భారత యువతిపై లైంగిక దాడి.. 45 రోజుల్లో రెండో ఘటన
లండన్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. అయితే, ఈ ఘటన జాతి వివక్షతోనే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి రోనన్ టైరర్ మాట్లాడుతూ..‘వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. శనివారం వాల్సాల్లోని పార్క్ హాల్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమెపై జాతి వివక్ష కారణంగానే ఇలా దాడి జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ నుండి వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు నేరస్థుడి ఫొటోను విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆధారాలను సేకరించే అధికార బృందాలు మా వద్ద ఉన్నాయి’ అని తెలిపారు.Another racially aggravated rape in West Midlands, UK of an Indian origin woman in her 20sThe suspect is described as White and in his 30s, with short hair. pic.twitter.com/3n1RVj6zW9— Journalist V (@OnTheNewsBeat) October 26, 2025సిక్కు యువతిపై లైంగిక దాడి..ఇక, యూకేలో భారత సంతతి ప్రజలపై జాత్యాహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, "మీ దేశానికి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యాహంకార వ్యాఖ్యలతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిని జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో, ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇచ్చారు.❗️BREAKING ❗️A woman was raped in a racially aggravated attack in Walsall, West Midlands.Police are investigating the rape of a woman which they are treating as a racially aggravated attack in Walsall last night.The attacker is described as white, in his 30s. pic.twitter.com/pk3fatJ4he— Narinder Kaur (@narindertweets) October 26, 2025ఈ అమానుష ఘటనను బ్రిటన్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. "ఇది అత్యంత హింసాత్మక చర్య. 'మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు' అని బాధితురాలితో అనడం దారుణం. కానీ ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది" అని పేర్కొన్నారు. మరో ఎంపీ జస్ అత్వాల్ స్పందిస్తూ, "దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ హేయమైన దాడి. దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ మంత్రి గర్భవతి!.. ప్రకటించిన ప్రధాని
ఆమె మొన్నీమధ్యే మంత్రి పదవి చేపట్టి.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే పదవి చేపట్టి నెల తిరగకకుండానే.. ఆమె నెల తప్పిందంటూ ఆ దేశ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఏకంగా 83 మంది పిల్లల్ని కనబోతోందంటూ విచిత్రమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అయితే.. ఆ ప్రకటన లోతుల్లోకి వెళ్తే అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అల్బేనియా ప్రధాని ఎడీ రమా(Edi Rama).. బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ (BGD) సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. మొన్నీమధ్యే తాను కేబినెట్లోకి తీసుకున్న మంత్రి డియోల్లా(Diella) గర్భవతి అని ప్రకటించారు. అయితే ఆమె మనిషి అనుకుంటే పొరపడినట్లే!. ఆమె ప్రపంచంలోనే ఏఐ ఆధారిత మంత్రి. సాంకేతిక రంగంలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. యూరప్ దేశమైన అల్బేనియా మాత్రం ఈ అధునాతన సాంకేతికతను వినూత్నంగా ఉపయోగిస్తోంది. అవినీతిని నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ ‘డియెల్లా’ను కేబినెట్ మంత్రిగా నియమించింది. ప్రపంచంలోనే ఈతరహా నియామకం జరగడం ఇదే తొలిసారి. అయితే.. ఆమె ద్వారా 83 మంది పిల్లలను పుట్టించి.. వాళ్లను పార్లమెంట్‌లోకి వదలబోతున్నారట. ఒక్కో సోషలిస్టు పార్టీ పార్లమెంట్ సభ్యునికి ఒక్కో సహాయకుడిగా కేటాయిస్తారట. ‘‘డియెల్లా ద్వారా మేము ఒక పెద్ద ప్రయోగం చేశాం. ఇప్పుడు ఆమె 83 పిల్లలతో గర్భవతి అయింది. పుట్టబోయే ఏఐ సంతానాన్ని సహాయకులు నియమించబోతున్నాం. వాళ్లు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని.. సభ్యులు గైర్హాజరైనప్పుడు జరిగిన చర్చలను నమోదు చేసి తగిన సూచనలు ఇస్తారు. ఉదాహరణకు.. మీరు కాఫీకి వెళ్లి తిరిగి రావడం మర్చిపోతే, ఈ పిల్లాడే మీకు ఆ హాల్లో ఏమి జరిగింది, ఎవరి మాటకు ప్రతిస్పందించాలో చెబుతాడు అంటూ అల్బేనియా ప్రధాని వివరించారు. పూర్తిగా తల్లి నుంచి సంక్రమించే జ్ఞానంతోనే ఆ పిల్లలు పని చేస్తారని అన్నారాయన. 2026 చివరినాటికల్లా ఈ వ్యవస్థను పూర్థిస్థాయిలో అమలు చేస్తామని ఎడీ రామా ప్రకటించారు.డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే ఆమెను అల్బేనియన్ సంప్రదాయ దుస్తులతో ముస్తాబు చేశారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే e-Albania అనే ప్లాట్ఫారంలో వర్చువల్ అసిస్టెంట్‌గా ఆమె సేవలు ప్రారంభించింది. ఆ సేవలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో.. సెప్టెంబర్‌లో కేబినెట్ పదవి కట్టబెట్టారు. అవినీతికి తావు లేకుండా.. ప్రస్తుతం ప్రభుత్వ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను డియెల్లానే తీసుకుంటోంది. ప్రతి పబ్లిక్ ఫండ్ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చేస్తోంది. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. ట్రంప్‌ను ఇలా చూడలే! -
పాక్ మాకు మిత్రుడే.. భారత్‌తో బంధం వదులుకోలేం: మార్కో రుబియో
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరిస్తున్న సమయంలో భారత్‌ను దూరం చేసుకోలేమని చెప్పుకొచ్చారు. భారత్‌తో ఉన్న చారిత్రాత్మక, బలమైన, ముఖ్యమైన సంబంధాలను పణంగా పెట్టబోమని తెలిపారు.మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో మార్కో రుబియో ఈరోజు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాక్‌తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్‌కు ఆందోళనలు ఉన్నాయి. వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలనేది భారత్ అర్థం చేసుకోవాలి. ఎన్నడూ భారత్‌తో బంధాలను మేం వదులుకోబోమని క్లారిటీ ఇచ్చారు.ఇదే సమయంలో పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో మాకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యం, దానితో ముడిపడిన అంశాల వరకు భారతీయులు ఎంతో పరిపక్వతతో ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాతో సంబంధాల్లేని కొన్ని దేశాలతో భారత్‌కు అనుబంధం ఉంది. అందువల్ల ఇదంతా పరిపక్వతతో కూడిన, ఆచరణీయ విదేశాంగ విధానం’ అని చెప్పుకొచ్చారు. అలాగే, రష్యాతో చమురు కొనుగోళ్ల సంబంధాలను మళ్లించుకునేందుకు భారత్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేసిందని చెప్పారు.ఇదిలా ఉండగా.. మలేషియా వేదికగా ఆసియన్ సదస్సు జరుగుతోంది. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
భారత్–చైనా మధ్య అయిదేళ్ల తర్వాత నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభం
న్యూఢిల్లీ: అయిదేళ్ల అనంతరం భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ విషయాన్ని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఆదివారం ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. మొదటి విమానం కోల్‌కతా నుంచి గ్వాంగ్ఝౌకు టేకాఫ్ తీసుకుందన్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్‌కతా–గ్వాంగ్ఝౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజూ నడుపుతామని ఇండిగో ప్రకటించింది. అదేవిధంగా, నవంబర్ 9వ తేదీ నుంచి షాంఘై–న్యూఢిల్లీ మార్గంలో వారానికి మూడు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 2020 జూన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య తూర్పులద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర ఘర్షణలు, కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాల మోహరింపులతో 2024 అక్టోబర్ వరకు తీవ్ర ఉద్రికతలు కొనసాగాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. డైరెక్ట్ విమానాల రాకపోకలతో తిరిగి ఈ సంబంధాలు తిరిగి గాడినపడతాయని భావిస్తున్నారు. -
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
సంరక్షణ.. సమస్యగా మారిన వేళ
భూ అయస్కాంత క్షేత్రం. రోదసీ నుంచి వేల కిలోమీటర్ల వేగంతో మనవైపు దూసుకొచ్చే సూక్షస్థాయి గ్రహశకలాలను మరింత వేగంగా లాగేసుకుని భూ వాతావరణంలో మండిపోయేలా చేసి వాటిని నాశనంచేసే అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా భూ అయాస్కాంత క్షేత్రానికి పేరుంది. అంతరిక్ష ప్రమాదాల నుంచి భూమిని, పరోక్షంగా మానవాళిని కాపాడుతున్న రక్షణ ఛత్రమది. వాస్తవానికి ఈ అయస్కాంత క్షేత్రం మన కంటికి కనిపించదు. అదృశ్యంగా ఉంటూ అందర్నీ కాపాడే ఇదే అయస్కాంత క్షేత్రం ఇప్పుడు చాలా చాలా నెమ్మదిగా ప్రమాదకారిగా పరిణమిస్తోందని భౌతికశాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి ‘స్వార్మ్’కృత్రిమ ఉపగ్రహ కూటమి సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు సమగ్రస్థాయిలో పరిశీలించారు. దీంతో భూ అయస్కాంత క్షేత్రం దక్షిణ అట్లాంటిక్ సముద్రంపై బలహీనపడుతోందని స్పష్టమైంది. 2014 ఏడాది నుంచి చూస్తే గత 11 ఏళ్లలో అక్కడ ఏకంగా యురప్ ఖండమంత పరిమాణంలో అయస్కాంత క్షేత్రం బలహీనపడిందని తేలింది. అంటే కృత్రిమ ఉపగ్రహాలు తమ కక్షలో తిరుగుతూనే ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించినప్పుడు వాటికి అయాస్కాంత క్షేత్ర రక్షణ బాగా తగ్గిపోతుంది. అంటే అంతరిక్ష నుంచి వెలువడే రేడియోధార్మికత అనేది నేరుగా ఉపగ్రహాలపై పడుతుంది. దాంతో శాటిలైట్‌లోని భాగాలు వేడెక్కి, బాగా దెబ్బతింటాయి. వాటి సామర్థ్యం సైతం క్షీణిస్తుంది. అప్పటికే అవి సేకరించిన డేటా సైతం నాశనంకావచ్చు. శాటిలైట్లు పనికిరాకుండా పోయే ప్రమాదముంది. దీంతో శాటిలైట్లతో భూమికి అనుసంధానం తెగిపోవచ్చు. అసలు ఈ అయాస్కాంత క్షేత్రం ఎక్కడిది? విశాలమైన రహదారి కింద పేద్ద డ్రైనేజీ కాలువ, అందులో వేగంగా మురుకు ప్రవహిస్తోందనకుందాం. ఆ మురుగు మనకు కనిపించకపోయినా కొన్ని మ్యాన్హోల్ల వద్ద వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. అచ్చం అలాగే మన భూమిలోపల అంటే 3,000 కిలోమీటర్ల లోతులో మొత్తం భూమి అంతటా ద్రవరూప ఇనుము ప్రవహిస్తోంది. అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్లే భూమి లోపలి ఈ ఇనుముకు సంబంధించిన అయాస్కాంత క్షేత్రం బయట గాలి ఆవరణలో పరుచుకుంది. ఈ అయస్కాంత క్షేత్రం దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో క్షీణిస్తోంది. దీనినే సౌత్ అట్లాంటిక్ అనామలీ(ఎస్ఏఏ)గా పేర్కొంటారు. 19వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలోని ఆగ్నేయ దిశలో దీనిని తొలిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆఫ్రికా ఖండం దిశగా క్షీణిస్తూ వస్తోంది. భూమి ద్రవరూప బయటి పొరకు, శిలాద్రవం ఉన్న పొరకు మధ్య వైవిధ్యాల కారణంగా అయస్కాంత క్షేత్రం ఈ ప్రాంతంలో క్షీణిస్తోందని స్పష్టమైంది. సైబీరియా వద్ద అయస్కాంత క్షేత్రం బలంగా, కెనడా సమీపంలో బలహీనంగా మారుతోంది. ఉత్తర ధృవ అయస్కాంత క్షేత్ర నాభి నెమ్మదిగా సైబీరియా వైపునకు మారుతుండటమే ఈ మార్పులకు కారణం. రక్షణాత్మక క్షేత్రానికి ఏ స్థాయిలో బీటలు పడుతున్నాయని ఎప్పటికప్పుడు విశ్లేషించడం ద్వారా కృత్రిమ ఉపగ్రహాలను, వాటిపై ఆధారపడిన పౌర, సైనిక సేవల పునరుద్ధరణ చర్యలను చేపట్టవచ్చు. – వాషింగ్టన్ -
భూమికి మరో చంద్రుడు !
న్యూఢిల్లీ: భూమికి చంద్రుడు మాత్రమే శాశ్వత సహజ ఉపగ్రహం. అయితే దీనికి తోడుగా కొన్నాళ్లపాటు భూమిని చుట్టేస్తూ తాత్కాలిక చందమామ ఒకటి కొత్తగా వచ్చి చేరింది. దీనికి 2025 పీఎన్7 అని నామకరణం చేశారు. వాస్తవానికి ఇది సహజ ఉపగ్రహం కాదు. చిన్నపాటి గ్రహశకలం మాత్రమే. తన కక్షలో వెళ్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే గత 60 ఏళ్లుగా ఇది భూమికి సమీపంగా ఉంటూ సూర్యుడి చుట్టూతా తిరుగుతోంది. అయితే భూమి నుంచి చూసినప్పుడు ఇది మన భూమి చుట్టూతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని ఖ్వాసీ మూన్‌గా పిలుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హవాయిలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్,ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ సాయంతో దీని జాడను కనిపెట్టారు. భూమి చుట్టూ పరిభ్రమిస్తు్తన్న ‘అర్జున’ గ్రహశకలాల కూటమిలో ఇది కొత్తగా వచ్చి చేరిందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం 20 మీటర్ల వెడల్పున్న దీనిని ఈ ఏడాది ఆగస్ట్‌లో కనిపెట్టారు. ఎనిమిది అంకె ఆకృతిలో లేదా గుర్రపు డెక్క ఆకృతిలో ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల కారణంగా దీని పథం ఇలా విభిన్న ఆకృతిలో ఉంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది ఒక దశలో భూమికి కేవలం 2,99,000 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. మరో దశలో గరిష్టంగా 1.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. సగటున ఇది 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురుత్వాకర్షణ బలాలకు లోనై ఇది భూమిపై పడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లిపోనుంది. -
రష్యా చమురుకు భారత్ రాం రాం!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు. ‘భారత్–పాక్ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్ తెలిపారు. -
సల్మాన్‌పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్‌ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. -
అద్వితీయ క్షిపణిని పరీక్షించిన రష్యా
మాస్కో: అపరిమితమైన దూరంలోని లక్ష్యాన్ని సైతం చేధించే అద్వితీయ క్షిపణి ‘బురేవేస్ట్నిక్’ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. అణుఇంజిన్ అందించే అసాధారణ శక్తితో ఇది గంటల తరబడి గాల్లో ప్రయాణించగలదు. ఆదివారంనాటి పరీక్షలో ఇది ఏకధాటిగా 15 గంటలపాటు గాల్లోనే దూసుకెళ్లిందని దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పుతిన్ ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో వర్చువల్ భేటీలో పుతిన్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం. తక్కువ ఎత్తులో అపరిమిత దూరాలకు ప్రయాణించే ఈ క్షిపణిని తయారుచేయబోతున్నట్లు 2018లో రష్యా తొలిసారిగా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి సమర్థతపై పశ్చిమదేశాలు అనుమానం వ్యక్తంచేశాయి. రెండేళ్ల క్రితమే పూర్తిస్థాయి క్షిపణిని తయారుచేశామని పుతిన్ చెప్పారు. అయితే 2016 ఏడాది నుంచి ఇప్పటిదాకా 13 సార్లు ఈ క్షిపణిని పరీక్షించగా రెండుసార్లు మాత్రమే పాక్షికస్థాయిలో లక్ష్యాన్ని చేధించిందని ఒక నిరాయు«దీకరణ ఉద్యమ సంస్థ పేర్కొంది. న్యూక్లియర్ ప్రొపల్షన్ యూనిట్‌ను తయారుచేయడం చాలా కష్టమైన వ్యవహారమని ఇంటర్నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ సంస్థ అభిప్రాయపడింది. అయితే తమ క్షిపణి 10వేల నుంచి 20వేల కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఆర్మీ చెబుతోంది. భూమి నుంచి కేవలం 50 లేదా 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండటం కారణంగా ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ఈ మిస్సైల్ రాకను గుర్తించలేవు. గాల్లో ఘన ఇంధన రాకెట్ బూస్టర్ల సాయంతో ప్రయోగించాక ఇది ప్రయాణాన్ని అణు ఇంజిన్‌తో కొనసాగిస్తుందని నాటో వర్గాలు అంచనావేస్తున్నాయి. దీనికి స్కైఫాల్ అని పేరుపెట్టుకున్నాయి. ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించిన జాయింట్ స్టాఫ్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ కేంద్రాన్ని సా యుధ బలగాల సుప్రీం కమాండర్ హోదాలో పుతిన్ పుతిన్ ఆదివారం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. చీఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వలేరీ గెరసిమోవ్ సారథ్యంలోని కమాండర్లతో పుతిన్ భేటీ అయ్యారు. కీలకమైన మార్గాల్లో 10,000 మందికిపైగా ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని వలేరీ పుతిన్‌కు వివరించారు. ఏకంగా 31 బెటాలియన్ల ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని తెలిపారు. -
తీమోర్కు సభ్యత్వం
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) సమావేశంలో కీలక పరిణా మాలు చోటు చేసుకు న్నాయి. 1990ల తర్వాత చేపట్టిన మొట్టమొదటి విస్తరణలో సమాఖ్య నూతన సభ్య దేశంగా తూర్పు తీమోర్ చేరింది. కాంబోడియా–థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణను మరింతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన జెండాల్లో తూర్పు తీమోర్ లేదా తిమోర్ లెస్టీ జెండాను కూడా చేర్చారు. తమ కల ఇప్పటికి నిజమైందని ఆ దేశ ప్రధానమంత్రి జనానా గుజ్మావో తెలిపారు. అదేవిధంగా, సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో సరిహద్దు సమస్యపై కాల్పుల విరమణను మరికొంతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కాంబోడియా– థాయ్‌లాండ్ ప్రధానులు హున్ మనెట్, అనుతిన్ చర్న్విరకుల్లు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బందీలుగా ఉన్న 18 మంది కాంబోడియా సైనికులను థాయ్‌లాండ్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలు మోహరించిన భారీ ఆయుధాలను ఉపసంహరించుకుంటాయి. ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించేందుకు ఆసి యాన్ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనగా కాంబోడియా, థాయ్ నేతలు పేర్కొనగా ట్రంప్..కౌలాలంపూర్ శాంతి ఒప్పందంగా దీనిని అభివర్ణించారు. ఈ రెండు దేశాలతోపాటు మలేసియాతోనూ తాము కీలక ఖనిజాలు సహా పలు ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. ట్రంప్‌తోపాటు చైనా ప్రధాని లీ క్వియాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జపాన్ నూతన ప్రధాని సనే తకాయిచీ, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా తదితర డజనుకు పైగా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, చైనాల నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సభ్య దేశాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.ట్రంప్–జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధంఆధునిక సాంకేతికతకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమ తులపై చైనా నిషేధం విధించడం, వాటిని తొలగించకుంటే మరో 100 శాతం టారిఫ్‌లు తప్పవంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు ఆసియాన్ సమా వేశాల సందర్భంగా సడలిన జాడలు కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్ వేదికగా అమెరికా, చైనా ఉన్నత స్థాయి ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. చైనా వాణిజ్య ప్రతినిధి లి చెంగాంగ్ మీడియాతో మాట్లాడుతూ..రెండు పక్షాలు వివాదాస్పద అంశాలపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయని, సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా యని పేర్కొన్నారు. రెండు దేశాలు ఒప్పందం వైపు మొగ్గు చూపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు. భవిష్యత్తులో చైనాలో పర్యటించాలనుకుంటున్నానని, అదేవిధంగా జిన్‌పింగ్ ఫ్లోరిడాలోని తన మార్ ఇ లాగో రిసార్టుకు లేదా వాషింగ్టన్కు వస్తారని చెప్పారు. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్‌ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్‌లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్‌లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం
డబ్లిన్: ఐర్లాండ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం సాధించారు. శనివారం జరిగిన ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేథరీన్ కొన్నోలీ ఘన విజయం సాధించారు. ఆమె 63.4శాతం ఓట్లతో గెలుపొందగా.. ప్రత్యర్థి హీదర్ హంప్రీస్ 29.5శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.ఐర్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన కేథరీన్ కొన్నోలీకి గాల్వే ఎంపీగా సేవలందించిన అనుభవం ఉంది. అలాగే బారిస్టర్‌గా, క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూరోపియన్ యూనియన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలు, శాంతి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.‘నేను వినే అధ్యక్షురాలిని, ఆలోచించే అధ్యక్షురాలిని, అవసరమైనప్పుడు మాట్లాడే అధ్యక్షురాలిని అవుతాను. మనం కలిసి అందరికీ విలువ ఇచ్చే కొత్త గణతంత్రాన్ని నిర్మించగలము’ అని ప్రకటించారు. -
ఇదేదో భలే ఉందే.. డ్యాన్స్ చూస్తూ ట్రంప్ మార్క్ స్టెప్పులు
కౌలాలంపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులు తర్వాత మళ్లీ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్ డ్యాన్స్(Trump Dance Video) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్.. ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ట్రంప్ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.Such a beautiful arrival ceremony for President Trump in Malaysia 🇺🇸🇲🇾 - and he broke out the Trump Dance!🎥: @MargoMartin47 pic.twitter.com/igTo36ofBs— Monica Crowley (@MonicaCrowley) October 26, 2025దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్‌కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్ తన మార్క్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్‌తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
నీట మునిగిన 5 లక్షల ఐఫోన్స్.. రూ.4వేల కోట్ల నష్టం!
ప్రపంచ ప్రఖ్యాత షిప్పింగ్ కంపెనీ 'ఎవర్గ్రీన్'కు చెందిన ఒక పెద్ద కార్గో నౌక పెరూ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌకలో ఉన్న సుమారు 5,00,000 ఐఫోన్ 17 మొబైల్స్ సముద్రంలో మునిగిపోయాయి. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది?, జరిగిన నష్టం ఎంత అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.పెరూలోని ప్రారంభ షిప్పింగ్ లాగ్‌లు & సంబంధిత అధికారుల ప్రకారం.. ఎవర్గ్రీన్ నౌక చైనాలోని షెన్జెన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళుతుండగా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలోనే నౌక పెరూలోని కల్లావో ఓడరేవులో షెడ్యూల్ ప్రకారం ఆగింది. అయితే బలమైన గాలులు, శక్తివంతమైన అలల కారణంగా.. కంటైనర్లు పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 50 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు సమాచారం.సముద్రంలో మునిగిపోయిన కంటైనర్లలో.. యాపిల్ ఉత్పత్తులు ఉన్నాయా? అనే విషయంపై అటు యాపిల్ కంపెనీ.. ఎవర్గ్రీన్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ కంటైనర్లు దక్షిణ అమెరికా & ఉత్తర అమెరికా మార్కెట్లకు వెళ్లే ఐఫోన్ 17 యూనిట్లతో నిండి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రూ. 4,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.ప్రభావం ఇలా..ఐఫోన్ 17ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2025లో ప్రారంభించింది. అప్పటి నుంచి వీటికి రికార్డు స్థాయి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐదు లక్షల ఐఫోన్ 17లు నీటిపాలవ్వడం అనేది బాధాకరమైన విషయం. ఇది ఐఫోన్ 17 డెలివరీలను చాలా ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఉప్పునీటిలో కలిసిపోవడం వల్ల, సముద్రంలోని జలచరాలు కూడా హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి! -
అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.Former Interior Minister Aftab Sherpao Criticizes Khawaja Asif’s Remarks on Possible War with AfghanistanPakistan’s former Interior Minister and head of the Qaumi Watan Party, Aftab Sherpao, has called Khawaja Asif’s recent statement—that Pakistan could wage an open war against… pic.twitter.com/3u94aQcvss— Truth Lens (@truthlenns) October 26, 2025ఆసిఫ్‌కు కౌంటర్.. మరోవైపు.. మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి. చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 18,19 తేదీల్లో జరిగిన మొదటి చర్చల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్‌పై వేకువజామున జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దాడుల్లో ఒక భవనానికి నిప్పంటుకుంది. కూల్చిన క్షిపణి శకలాలు బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో సమీపంలోని వాహనాలు, భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు. పలు అపార్టుమెంట్ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను నాలుగు మిస్సైళ్లు, 50 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.పేట్రియాట్లు కొంటాం: జెలెన్స్కీనిత్యం భయపెడుతున్న రష్యా దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వెంటనే పేట్రియాట్ రక్షణ వ్యవస్థలను తమకు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా, యూరప్, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి త్వరలోనే 25 పేట్రియాట్ వ్యవస్థల ను కొనుగోలు చేయనున్నామన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్‌లో జరుగుతున్న యూరప్ దేశాల నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వేళ కాల్పుల విరమణ జర క్కుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీకి వారు హామీ ఇచ్చారు. -
ట్రంప్ విషయంలో అదే నిజమైంది.. అధ్యక్ష పోటీపై స్పందించిన కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఏదో ఒకరోజు అమెరికాకు అధ్యక్షురాలిని కావచ్చు అని అన్నారు. భవిష్యత్తులో శ్వేతసౌధంలో ఓ మహిళా అధ్యక్షురాలు ఉంటుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్లు వారి జీవితకాలంలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను. అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు.Kamala Harris tells the BBC that she may “possibly” run for president again:“I am not done. I have lived my entire career a life of service and it’s in my bones. There are many ways to serve. I have not decided yet what I will do in the future beyond what I am doing right now.” pic.twitter.com/96QUWYYQkj— Pop Crave (@PopCrave) October 25, 2025ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనపై స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమే అని ఇప్పుడు నిరూపితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్ న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో డెమోక్రట్ల తరఫున ఆశావహుల రేసులో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్‌ను పట్టించుకొని ఉంటే, తాను గత ఎన్నికల్లో పోటీపడేదాన్నే కాదని తెలిపారు. ఇక, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తరఫున కమల పోటీచేసిన విషయం తెలిసిందే. -
కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది.అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్‌పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్‌పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్‌పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్‌పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
థాయ్ రాజమాత సిరికిత్ కన్నుమూత
బ్యాంకాక్: నిరాశ్రయులు, పేదల కష్టాలు పోగొట్టేందుకు రాజ కుటుంబం తరఫున శాయశక్తుల ప్రయత్నించిన థాయ్‌లాండ్ రాజమాత, గతంలో రాణిగా సేవలందించిన సిరికిత్ కితియకారా తుదిశ్వాస విడిచారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో అక్టోబర్ 17వ తేదీన 93 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని థాయ్ లాండ్ రాజకుటుంబ వర్గాలు ప్రకటించాయి. హస్తకళలు సహా దేశవాళీ కళల పునరుజ్జీవానికి ఆమె తన వంతు కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. రాజకుటుంబం తరఫున చేపట్టే పలు ప్రాజెక్టులు ఈమె అజమాయిషీలోనే కొనసాగేవి. పదమూడేళ్ల క్రితం ఈమెకు పక్షవాతం రావడంతో అప్పట్నుంచి ఆరోగ్యం క్షీణించింది. ఆనాటి నుంచి బాహ్య ప్రపంచంలో కనిపించట్లేరు. ఆమె భర్త, రాజు భూమిబల్ అతుల్యతేజ్ 2016 అక్టోబర్‌లోనే పరమపదించారు. రాజమాత సిరికిత్ కుమారుడు మహా వజ్రలాంగ్‌కోర్న్ ప్రస్తుతం థాయిలాండ రాజుగా సేవలందిస్తున్నారు. ‘‘తల్లిగారికి థాయ్‌లాండ్ ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత ఘనంగా అంత్యక్రియలు చేపడతాం. రాజకుటుంబం, రాజకుటుంబ సేవకులు సహా థాయ్‌లాండ్‌వాసులు ఏడాదిపాటు సంతాపకాలాన్ని పాటించనున్నారు’’అని రాజు ప్రకటించారు. రాజమాత మరణవార్త తెలిసి వేలాది మంది అభిమానులు, పౌరులు శనివారం ఉదయమాన్నే ఛౌలాంగ్కార్న్ ఆస్పత్రి వద్ద గుమిగూడారు. ‘‘ఆమె లేని లోటు దేశంలో పూడ్చలేనిది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయపతాకాన్ని 30 రోజులపాటు అవనతం చేస్తాం. పౌర సేవకులు ఏడాదిపాటు సంతాప దినాలను పాటిస్తారు’’అని ప్రధానమంత్రి అనుతిన్ ఛార్న్విరాకుల్ ప్రకటించారు. యువరాజును పెళ్లాడి.. ఫ్రాన్స్‌లో థాయ్‌లాండ్ రాయబారిగా పనిచేస్తు న్న నఖత్ర మంగళ, బువా కితియకారా దంపతులకు 1932 ఆగస్ట్ 12న సిరికిత్ జని్మంచారు. ఈమె తల్లిదండ్రులు గత ఛక్రి రాజ్యవంశానికి చెందిన వాళ్లు. యుద్దకాలంలో బ్యాంకాక్‌లో చదుకుని రెండో ప్రపంచయుద్ధసమయంలో తండ్రితో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అదే సమయంలో విద్యాభ్యాసం కోసం థాయ్‌లాండ్ యువరాజు భూమిబల్ పారిస్‌కు వచ్చారు. కారు ప్రమాదంలో ఆస్పత్రి పాలవ్వగా పరామర్శించేందుకు వెళ్లిన సిరికిత్ అతనితో ప్రేమలో పడింది. అప్పు డు ఆమె వయసు కేవలం 16 ఏళ్లు. 1950లో వీళ్ల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. పట్టుకు పట్టం 1970వ దశకంలో సిరికిత్, ఆమె భర్త భూమిబల్ దేశీయ సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. గ్రామాల్లో పేదరికాన్ని పారద్రోలడంతోపాటు గిరిజనులను ఓపియం మత్తుమందు జాడ్యం నుంచి బయటపడేసేందుకు రాణి సిరికిత్ ఎంతో కష్టపడ్డారు. అందుకోసం కొండకోనల్లో పేదల ఇళ్లకు స్వయంగా వెళ్లేవారు. దీంతో అంతా ఆమెను తమ కన్నబిడ్డగా చూసుకునేవారు. అత్యంత స్టైలిష్ వస్త్రధారణలో కనిపించే సిరికిత్ ఎప్పుడూ పేదల ఇళ్లకు వెళ్తూ అందరికీ దగ్గరయ్యారు. ఇది కొందరు బ్యాంకాక్ సంపన్నులకు నచ్చలేదని గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976లో రాజరిక అభివృద్ధి ప్రాజెక్టులు మొదలుపెట్టగా వాటిని అమలు బాధ్యతల్ని ఈమె తీసుకున్నారు. పట్టు నేత, ఆభరణాల తయారీ, థాయ్‌లాండ్ సంప్రదాయ చిత్రలేఖనం, పింగాణీ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించారు. ఈ రంగాల్లో నైపుణ్యం సాధించేలా వేలాది మంది గిరిజనులకు తగు శిక్షణ ఇప్పించారు.ఆమె పుట్టినరోజే మాతృ దినోత్సవం సిరికిత్ పుట్టినరోజైన ఆగస్ట్ 12వ తేదీనే థాయ్‌లాండ్ వాసులు మాతృదినోత్సవం జరుపుకుంటారంటే ఆమెకు వాళ్లు ఎంతటి మహోన్నత గౌరవం ఇస్తారో ఇట్టే అర్థమవుతుంది. కాంబోడియా నుంచి వేలాదిగా వలసవచి్చన శరణార్థులను ఆమె ఆదరించి అక్కునచేర్చుకున్నారు. అడవుల నరికివేతను అడ్డుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. నిజానికి థాయ్‌లాండ్ దేశ రాజకీయాల్లో రాజకుటుంబం నేరుగా జోక్యంచేసుకోదు. రెండు సార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, చాలా రోజులు కొనసాగిన హింసాత్మక వీధి పోరాటాలు రాజకుటుంబం ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. అయితే 2008లో నిరసనకారుని అంత్యక్రియల్లో పాల్గొని రాజమాత తాము ప్రశ్నించదగ్గ ప్రజాస్వామ్య విధానాలకే కట్టుబడిఉంటామని పరోక్షంగా ప్రకటించారు. -
పాక్ గుండెల్లో ‘త్రిశూల్’
న్యూఢిల్లీ: భారత సైన్యం ‘త్రిశూల్’ విన్యాసాలకు సిద్ధమవుతోంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 10 దాకా త్రివిధ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా నిర్వహించే ఈ విన్యాసాల ద్వారా త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ ఆత్మనిర్భరతను చాటిచెప్పబోతున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇవి అతిపెద్ద సైనిక విన్యాసాలుగా రికార్డుకెక్కబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కసరత్తు అని చెప్పొచ్చు. భారత సైన్యం తలపెట్టిన ‘త్రిశూల్’ పట్ల పొరుగుదేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్(నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. మధ్య, దక్షిణాది గగనతలంలోని పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. అయితే, ఇందుకు కారణాలు ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సైనిక విన్యాసాల పట్ల పాక్ బెంబేలెత్తిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. త్రిశూల్‌కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ క్రీక్‌పై వివాదం త్రిశూల్ విన్యాసాల కోసం 28,000 అడుగుల ఎత్తువరకు గగనతలాన్ని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. త్రిశూల్ కోసం ఎంచుకున్న ప్రాంతం, అందుకోసం జరుగుతున్న సన్నద్ధత ‘అసాధారణం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో జరిగే ఈ విన్యాసాల్లో సదరన్ కమాండ్ కూడా చురుగ్గా పాల్గొనబోతుందని రక్షణ శాఖ తెలియజేసింది. ఎడారి, కొండలు, అడవులు, సముద్రం.. ఇలా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో విన్యాసాలు జరగబోతున్నాయి. సర్ క్రీక్‌పై భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. సర్ క్రీక్‌లో అవాంఛనీయ చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే పాకిస్తాన్‌ను హెచ్చరించారు. చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేలి్చచెప్పారు. సర్ క్రీక్ భారత్‌లోని గుజరాత్, పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్ మధ్యనున్న చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మానవ ఆవాసాలు లేవు. దీని పొడవు 96 కిలోమీటర్లు. భద్రత, సైనిక పరంగా రెండు దేశాలకు ఇది కీలకమైనది. సర్ క్రీక్‌లో సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. అందుకే పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిశూల్ విన్యాసాల కోసం భారత సైన్యం సర్ క్రీక్‌ను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు
సింగపూర్: భారతీయ స్టాఫ్ నర్సుకు జైలు శిక్ష పడిన ఉదంతం సింగపూర్‌లో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఒక పురుషుడిని వేధించినందుకు ఒక మేల్ నర్సుకు శిక్ష పడింది. సదరు మేల్ నర్సు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన దరిమిలా అతనికి శిక్ష ఖరారయ్యింది. ఒక సంవత్సరం, రెండు నెలల జైలు శిక్షతోపాటు, రెండు బెత్తం దెబ్బలను అతనికి శిక్షగా విధించారు.సింగపూర్‌లోని రాఫెల్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న భారతీయ స్టాఫ్ నర్సు ఏలిపె శివ నాగు(34) జూన్ 18న లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా తేలాడు. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం రాఫెల్స్ ఆసుపత్రికి వచ్చిన ఒక పురుష సందర్శకుడిని శివ నాగు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితుని వయస్సు తదితర వివరాలను కోర్టు పత్రాలలో గోప్యంగా ఉంచారు. జూన్ 18న బాధితుడు నార్త్ బ్రిడ్జ్ రోడ్‌లోని రాఫెల్స్ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న తన తాతను చూసేందుకు వచ్చాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా వివరించారు.తరువాత ఏలిపె శివ నాగు ‘డిస్ఇన్ఫెక్ట్’ చేస్తానంటూ బాధితుని దగ్గరకు వెళ్లి, తన చేతికి సబ్బు రాసుకుని అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా కోర్టులో తెలిపారు. ఈ ఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. జూన్ 18న ఈ ఘటన జరిగింది. జూన్ 21న బాధితుడు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ నేపధ్యంలో పోలీసులు శివ నాగును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆస్పత్రి యాజమాన్యం ఏలిపె శివ నాగును నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. -
‘మహిళ వేషంలో బిన్ లాడెన్’.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలంగా మారింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులతో అమెరికాకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషంలో టోరా బోరా కొండల నుండి తప్పించుకున్నాడని కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) మాజీ అధికారి జాన్ కిరియాకౌ తాజాగా వెల్లడించారు. 2001లో టోరా బోరా కొండలలో అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు మహిళా వేషం ధరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా సైన్యంలో రహస్యంగా చొరబడిన అల్ ఖైదా కార్యకర్త సహాయంతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషం వేసుకుని, టోరా బోరా నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. సీఐఏలో 15 ఏళ్లు పనిచేసి, పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన కిరియాకౌ, అమెరికాలో సైనిక శ్రేణుల్లో అల్ ఖైదా కార్యకర్తల చొరబాట్లను తెలియజేశారు. 9/11 దాడుల అనంతరం అమెరికా సంయమనంగా వ్యవహరించింది, ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు దాడులను చేపట్టేందుకు నెల్లాళ్లు వేచివుందన్నారు. ఈ తరుణంలోనే అల్ ఖైదా చొరబాటుదారునిగా తేలిన అనువాదకుడు ఉగ్రవాది బిన్ లాడెన్ తప్పించుకునేందుకు అవకాశం కల్పించాడని తెలిపారు. EP-10 with Former CIA Agent & Whistleblower John Kiriakou premieres today at 6 PM IST“Osama bin Laden escaped disguised as a woman...” John Kiriakou“The U.S. essentially purchased Musharraf. We paid tens of millions in cash to Pakistan’s ISI...” John Kiriakou“At the White… pic.twitter.com/pM9uUC3NIC— ANI (@ANI) October 24, 2025లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యూఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లిందని జాన్ కిరియాకౌ తెలిపారు. ఈ నేపధ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో చర్చలు జరిగాయని, అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యూఎస్ కార్యకలాపాలను అనుమతించాడని పేర్కొన్నారు. అదే సమయంలో సీఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కరే తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నాను. ఇది అమెరికా నిఘా వ్యవహారాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.భారత్-పాక్‌ల గురించి మాట్లాడిన జాన్ కిరియాకౌ 2002లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయని, పార్లమెంట్ దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. నాడు అమెరికా ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని అన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ దృష్టి అల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పైననే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వివరించారు.2008 ముంబై దాడుల గురించి కిరియాకౌ మాట్లాడుతూ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ మద్దతు కలిగిన కశ్మీరీ ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయన్నారు. పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్, ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని, అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుందని ఆయన కిరియాకౌ హెచ్చరించారు. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2011 మే 2న అమెరికా నేవీ సీల్ టీమ్ 6 పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో బిన్ లాడెన్‌ను హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. కేవలం 2001లో అమెరికా పట్టుకునేందుకు యత్నించిన సమయంలో లాడెన్ తప్పించుకున్నాడనేది మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. -
మన నగరాలకు ఫారిన్ అమ్మాయి రేటింగ్!
విదేశీయుల నోట్ల మన దేశం గొప్పదనం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అద్భుతమైన సంస్కృతి అని.. పండుగలు, ఆహారపానీయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూంటే విని గర్వంగా ఫీల్ అవుతూంటాము కూడా. కానీ.. మహిళల భద్రతకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మన గర్వం కాస్తా పటాపంచలవుతుంది. విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరిలు, సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు.. పిల్లికూతలతో వేధించే ఆకతాయిలు.. లైంగికదాడులకు పాల్పడే దుర్మార్గులు చాలామందే కనిపిస్తారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ సోలో ట్రావెలర్ ఎమ్మా కూడా ఇదే చెబుతోంది. భారతదేశం అద్భుతమైన దేశమే కానీ.. మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా.. దేశం మొత్తమ్మీద పలు నగరాల్లో పర్యటించిన తరువాత ఒక్కో నగరానికి ర్యాకింగ్ కూడా ఇచ్చింది. @discoverwithemma_ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఈ ర్యాంకింగ్స్‌ను పోస్ట్ చేసింది. ‘‘గొప్పలు చెప్పడం లేదు.. నిజాయితీగా నా అనుభవాలు ఇవి’ అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు... సహజంగానే విమర్శించిన వారు మరెందరో! ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇచ్చిందంటే...దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. పదికి పది మార్కులేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తరువాత ఎనిమిది మార్కులతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రెండోస్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం ఢోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావుడి, పరుగులు లేనేలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సరదాగానే గడిచింది కానీ.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు ఏడు. రాజస్థాన్‌లోని పుష్కర్, జైపూర్లు ఎమ్మా జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పుష్కర్ ఆధ్యాత్మిక శోభతో అలరారితే.. కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యమూ కలిగించాయని తెలిపింది. A female foreigner, discoverwithemma, who travelled to India, rated popular Indian cities on the basis of safety:Delhi : -1/10Agra : 3/10Jaipur : 5/10Pushkar : 6/10Udaipur: 8/10Mumbai : 6.5/10Goa : 8/10Kerala : 9/10 pic.twitter.com/FwVSsjKE9e— Mini Nair (@minicnair) October 24, 2025నిర్మాణశైలి విషయంలో జైపూర్ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి, చెడూ రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ.. గందరగోళాలతో కూడిందని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ.. అక్కడ శబ్ధ కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కాములకూ లెక్కలేదని వివరించింది. ఆఖరుగా... ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తమ్మీద అధ్వాన్నమైన నగరం... మన రాజధాని ఢిల్లీ నగరం! ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే మంచిదని సూచిస్తోంది ఎమ్మా. ఇకనైనా మేలుకోండి..ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలామంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజమ్ బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగు పరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూంటుందని విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేలు కొలుపుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎమ్మా పోస్టు తరువాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళ పర్యాటకులకు గైడెడ్ టూర్లు వంటి అంశాలపై ఇంటర్నెట్లో వెతకడం ఎక్కువ కావడం!. -
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్‌తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్‌లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025 -
రష్యా చమురు.. ఏకాకిగా భారత్?
అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్‌పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్‌నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్ ఆయిల్‌తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్‌లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్‌హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. -
కరీబియన్ జలాల్లో అమెరికా మళ్లీ దాడి
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్‌కు చెందిన వారేనన్నారు. ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్‌ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గురువారం అమెరికా సైనిక సూపర్సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు. -
ఇమ్రాన్ సోదరి పాస్‌పోర్టుపై నిషేధం
లాహోర్: జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు, బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని రావ ల్పిండిలోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లతో ఉగ్రవాద ఆరోపణలను ఎదుర్కొంటున్న అలీమా ఖాన్ విచారణకు రావాలంటూ పదేపదే పంపుతున్న నోటీసులను పట్టించుకోనందునే ఈ మేరకు ఆదేశాలిచి్చనట్లు కోర్టు తెలిపింది. అయితే, ఇతర కార్యక్రమాలు ఎక్కడున్నా తప్పకుండా హాజరయ్యే అలీమా ఖాన్..కోర్టుకు మాత్రం ఎందుకు రావడం లేదని విచారణ సందర్భంగా జడ్జి అంజాద్ అలీ షా ప్రశ్నించారు. కేసు విచారణను తదుపరి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఈ దఫా ఆమెను తప్పకుండా కోర్టులో హాజరుపర్చాలని అధికారులను ఆదేశించారు. -
ఉగ్ర బాధితులను, కారకులను ఒకే గాటన కట్టరాదు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన వారిని రక్షించేందుకు ఐరాస భద్రతా మండలిలో జరిగిన ప్రయత్నాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి ఎండగట్టారు. వ్యూహం పేరుతో ఉగ్రదాడి బాధ్యులను, కారకులను ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు. ఐరాస చర్యలు ఒక్కోసారి ఏకపక్షంగా మారుతున్నాయన్నారు. స్వయం ప్రకటిత ఉగ్రవాదులను ఆంక్షల ప్రక్రియ నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తుంటే నిజాయతీకి స్థానమెక్కడున్నట్లు?అంటూ జై శంకర్ ప్రశ్నించారు. తక్షణమే తగు రీతిలో సంస్కరణలను చేపట్టకుంటే ఐరాసతో ఎలాంటి ఫలితమూ ఉండదని స్పష్టం చేశారు. ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఎలాంటి అర్ధవంతమైన సంస్కరణను చేపట్టాలన్నా సంస్కరణ ప్రక్రియతోనే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సంస్కరణలను అమలు చేయడమే ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాదంపై స్పందించే విషయంలో ఐరాస ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జై శంకర్ అన్నారు. అమానవీయమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో తీర్మానానికి సాక్షాత్తూ కౌన్సిల్ సభ్యుడే అభ్యంతరం తెలిపారంటూ పరోక్షంగా ఆయన పాక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్). పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించుకుంది. అయితే, మండలిలో సభ్యురాలిగా కొనసాగుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వెలువరించిన తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేయడం గమనార్హం. గతంలో పలుమార్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను శాశ్వతసభ్య దేశమైన చైనా అడ్డుకుంది. అందుకే, ఉగ్రవాదులను ఆంక్షల చట్రం నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తున్నారంటూ జై శంకర్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలు కేవలం మాటలకే పరిమితమైన పక్షంలో అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతి మరింత అథోగతికి చేరుకుంటాయన్నారు. ఏదేమైనా ఈ సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, పురోగతితోపాటు శాంతి, భద్రతలకు భారత్ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐరాస 80వ అవతరణ దినోత్సవం సందర్భంగా జై శంకర్ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. -
బాలల సాహిత్యానికీ బుకర్
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్‌ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్‌గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది. -
‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు
ఇస్లామాబాద్: మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది. ఖులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్ నయీం అఫ్గాన్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్సైట్లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
జీవుల కోసం ‘సూపర్ ఎర్త్’
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? మనం ఉంటున్న భూగోళంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా కచి్చతమైన సమాధానం లేదు. అయితే, జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలోని ఈ గ్రహానికి ‘జీజే 251సీ’ అని పేరుపెట్టారు. అంతేకాకుండా దీన్ని ‘సూపర్ ఎర్త్’గా పరిగణిస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం. మనం నివసిస్తున్న భూగ్రహం కంటే నాలుగురెట్లు పెద్దది కావడం విశేషం. అక్కడ అధికంగా రాళ్లు రప్పలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అది ‘రాకీ ప్లానెట్’ అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించడం ఈ ఏడాది ఖగోళ పరిశోధనల్లో అతిపెద్ద మలుపుగా చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలను అ్రస్టానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే జీజే251సీ గ్రహం గోల్డిలాక్స్ జోన్లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలాకాలంగా అన్వేíÙస్తున్నామని పెన్సిల్వేనియా వర్సిటీ సైంటిస్టులు చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఈ పరిశోధన కొనసాగుతుండడం విశేషం. ఇందుకోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. సూపర్ ఎర్త్‌పై వాతావరణాన్ని క్షుణ్నంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆక్సిజన్ లేదా మీథేన్ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుందనడంలో సందేహం లేదు. -
సూర్యుడిలో భారీ పేలుడు
వాషింగ్టన్: సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతలి వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు(షాక్‌వేవ్స్) మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) ఢీకొట్టడంతో శుక్ర గ్రహం(వీనస్)లో స్వల్పభాగం దెబ్బతిన్నట్లు కనిపెట్టారు. సౌర ఉద్గారం తదుపరి లక్ష్యం ఏమిటి? మన భూగోళమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకన్‌కు దాదాపు 2,474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్‌వేవ్స్ వెలువడినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. 1972, 2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌరవ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లు అని కూడా అంటారు. భూమికి ఉన్నట్లుగా శుక్ర గ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్లు చెబుతున్నారు. షాక్‌వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే, ఈ తరంగాలు మరింత విస్తరించి, భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్, అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్(ఎన్ఓఏఏ) నిపుణులు స్పష్టంచేశారు. సూర్యుడి అవతలి వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎలాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్‌కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్‌ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్‌ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్‌ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్‌కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్‌ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
అమెరికాతో త్వరలో డీల్..!
బెర్లిన్/న్యూఢిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత చేరువ అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే రెండు దేశాలు పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం గత వారంలో వాషింగ్టన్కు వెళ్లి చర్చలు నిర్వహించడం తెలిసిందే. అయితే, భారత్ హడావిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదని . అమెరికా, ఐరోపా సహా పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలకు తుపాకీ గురిపెట్టినట్టు లేదా నిరీ్ణత గడువులోపే ముగించేయాలన్న హడావిడితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో మంత్రి బెర్లిన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు. దీర్ఘకాల దృష్టితోనే.. వాణిజ్య ఒప్పందాలను దీర్ఘకాల దృష్టితోనే భారత్ చూస్తుందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో కొత్త మార్కెట్లలో అవకాశాలపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ షరతులతో కూడిన పారదర్శక దీర్ఘకాల ఒప్పందాన్ని పొందుతోందా? అంటూ ఎదునైన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. జాతి ప్రయోజనాలు తప్పించి మరే ఇతర కోణంలోనూ భారత్ తన మిత్రులను నిర్ణయించుకోదు. ఈయూకి మిత్రుడి కాలేరంటూ నాతో ఒకరు అన్నారు. దాన్ని నేను అంగీకరించను. అలాగే, రేపు మరొకరు కెన్యాతో కలసి పనిచేయలేరని అంటారు. అది కూడా ఆమోదనీయం కాదు అని అన్నారాయన -
ఆదర్శాలతో అవతరించి...ఎన్నో విజయాలు సాధించి
రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్ర అశాంతిని అనుభవించింది. దీంతో శాశ్వతమైన శాంతి కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని, 1945 అక్టోబర్ 24న 51 దేశాలు కలిసి ‘ఐక్యరాజ్యసమితి చార్టర్’ (United Nations Charter) ను అమల్లోకి తెచ్చాయి. ఆ తరువాత అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. అంతర్జాతీయ శాంతిని కాపాడడం, దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పెంపొందిస్తూ, అంతర్జాతీయ సహకారాన్ని సాధించడం, మానవ హక్కులను పరిరక్షించడం, సుస్థిరాభివృద్ధిని సాధించడం, యుద్ధాలను నివారించడం ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ప్రధాన లక్ష్యాలుగా చెప్పవచ్చు. సాధించిన విజయాలుయుద్ధాలు, అంతర్గత ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన కోసం బలగాలను పంపి, వివాదాలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఉదాహరణకు, కొరియా, కాంగో, లెబనాన్, సూడాన్, సిరియా వంటి దేశాల్లో ఐక్యరాజ్యసమితి బలగాలు శాంతిస్థాపనకు ఎంతగానో కృషి చేశాయి. 1948లో ‘మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన‘ ను ఆమోదించడం ఈ సంస్థ గొప్ప విజయంగా చెప్పవచ్చు. అదేవిధంగా, ‘ప్యారిస్ ఒప్పందం’, ‘క్యోటో ఒప్పందం’ వంటి వాతావరణ మార్పుల నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విజయవంతమయ్యాయి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం పరిరక్షణ వంటి అనేక అంశాల్లో అంతర్జాతీయ చర్చలకు ఐక్యరాజ్యసమితి ఒక వేదికగా మారింది. యూఎన్డీపీ, యునెస్కో, యునిసెఫ్ వంటి ఉపసంస్థల ద్వారా, పేదరిక నిర్మూలన, విద్యా విస్తరణ, ఆరోగ్య సంరక్షణలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా పోలియో, మలేరియా, టీబీ వంటి వ్యాధుల నిర్మూలనలో యూఎన్ఓ విజయవంతమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం ద్వారా ప్రపంచంలో సమానాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం యూఎన్ఓ కృషి చేస్తోంది. ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీల) ద్వారా 2030 నాటికి ప్రపంచ అభివృద్ధికి లక్ష్యాలను నిర్ధారించింది. శరణార్థుల సమస్యలపై మరింత దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ప్రత్యేక లక్ష్యంగా గుర్తించి ఆ దిశలో కృషి చేసింది. దేశాల మధ్య అణు ఆయుధాల పరిమితులు, అణుసమర పరికరాల నియంత్రణలో ఐక్యరాజ్యసమితి కీలక పాలకురాలిగా నిలిచింది. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు ఆహారం అందిస్తోంది. అనేక విజయాలు సాధించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఐరాసను ఎందుకు స్థాపించారో ఆ లక్ష్యాల సాధనలో విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో విభజనల ఫలితంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. ముఖ్యంగా అమెరికా పెత్తనం ఎక్కువవ్వడం, నిధుల్లో ఆ దేశం కోత విధించడం వంటి కారణాలు ఐరాసను డమ్మీగా మార్చేస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడడంలో చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా వ్యవహరించాలి. లేకపోతే, మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు మరింత తీవ్రతరమవుతాయి. ఫలితంగా ప్రపంచం అశాంతిమయం అవుతుంది. VIDEO | Delhi: EAM S. Jaishankar, speaking at an event on the UN’s 80th anniversary at Jawaharlal Nehru Bhawan, says, "Even today, we are regrettably witnessing multiple conflicts. The Global South, in particular, has felt this pain. The 80th anniversary is a significant… pic.twitter.com/qWuexBYrL4— Press Trust of India (@PTI_News) October 24, 2025– డా. బి. లావణ్య, రాజనీతిశాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
మళ్ళీ పాతరోజుల్లోకి యువత
కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి కూరా.. నాటు పుట్టగొడుగులు.. అమ్మమ్మ ఊళ్లోకి వెళ్లి నాలుగురోజులు ఉండడం.. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యాయి..యువత కూడా వాటిని బాగానే ఆదరిస్తోంది.. చిరంజీవి.. నాగార్జున సినిమాలు రీ రిలీజ్ చేయడం.. అమ్మాయిలు.. పట్టు పరికిణీలు వేసుకోవడం.. వాలు జాడలు.. వెండిపట్టీలు.. ఇవన్నీ మళ్ళీ ట్రేండింగ్ అయ్యాయి.. ఇదేమాదిరి. కుర్రాళ్ళు కూడా పంచె లాల్చీ వేసుకోవడం.. బుర్ర మీసాలు పెంచడం.. కిర్రు చెప్పులు వేయడం.. ఊళ్ళో పందిరి కింద వెన్నెల్లో మంచం వేసి అమ్మమ్మ..తాతయ్యతో కబుర్లు చెప్పుకోవడం..కోడి పందాలు..ఊళ్ళోని పిల్లలతో గోళీలాట.. ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి.దీంతోబాటు కొంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ను అవలంబిస్తూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాదిరి బెల్ బాటమ్ ఫ్యాంట్లు వేయడం.. వాణిశ్రీ లెక్క సిగ ముడి వేయడం..ఇవి కూడా ట్రెండింగ్ ఉండేది కొన్నాళ్ళు. The striped underwear that our grandfather and great-grandfather wore is now internationally branded and priced between 2,500 and 11,000 rupees.🤔🤔🤨🤨 pic.twitter.com/V2Cs1DYEd9— Aviator Anil Chopra (@Chopsyturvey) October 23, 2025 అయితే ఇప్పుడు ఏకంగా మన తాతలు కాలంలో వేసుకునే గళ్ళ నిక్కర్ ఇప్పుడు అతి పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం ప్యాంట్లు.. పంచెకట్టు లోపల గళ్ళ నిక్కర్లు వేసుకునేవాళ్ళు..దానికి ఒక లాడా కూడా ఉండేది..దాన్ని లాగితే సులువుగా నిక్కర్ విప్పేసుకోవచ్చు..పైగా ఖద్దరు వస్త్రం కాబట్టి శరీరానికి సౌకర్యంగా ఉంటుంది.. చెమట పీల్చుతుంది.. వ్యవసాయ పనుల్లోనూ..నిద్ర పోయేటపుడు కూడా హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ నిక్కర్లు ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. హెచ్ అండ్ ఎం అనే కార్పొరేట్ బ్రాండింగ్ స్టోర్‌లో ఈ చెడ్డీలు అమ్మకానికి ఉంచారని వాటి ధర మాత్రం రూ.2500 నుంచి రూ.11,000 వరకు ఉందంటూ ఏవియేటర్ అనిల్ చోప్రా అనే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. మా తాతయ్య కాలంలో వేసుకునే గళ్ళ చెడ్డీలు మళ్ళీ వచ్చాయి కానీ ధర బాగా ఎక్కువే ఉంది అంటూ ఆయన చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.వాస్తవానికి ఆ చెడ్డి మహా అయితే ఓ రెండు వందలు ఉండచ్చు కానీ దాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు బ్రాండింగ్ చేసి ఏకంగా రూ.11,000 వరకు పెట్టి విక్రయిస్తుండగా యూత్ కూడా అంతే క్రేజీతో కొంటున్నారు. కొత్త ఒక వింత..పాత ఒక రోత అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాత బంగారానికే డిమాండ్ ఎక్కువ..దానిపైనే మోజు పెరుగుతోందని అర్థం అవుతోంది.సిమ్మాదిరప్పన్న -
పాకిస్తాన్‌కు మరో షాక్.. ఆప్ఘన్ ఎఫెక్ట్‌తో కిలో టమాటా ఎంతంటే?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయ్. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాకిస్తాన్ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యవసరాలపై దీని ప్రభావం పడింది. పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర (Tomato Prices) 600లకు చేరింది.పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్‌లో ప్రస్తుతం కిలో టమాటాల ధర (Tomato Prices) 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక, గురువారం టమాట ధర ఎనిమిది వందలకు సైతం చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. breaking news 1KG tomato price 800 RS in Pakistan pic.twitter.com/ZQfgKSNdwl— M.Shaheedyar (rh) ⏺ (@Shaheedyar0313) October 22, 2025ఇదిలా ఉండగా.. సాధారణంగా పాక్-ఆప్ఘన్ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు. ఆప్ఘన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్‌లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్‌లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్‌లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్‌కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్‌లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్‌లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్‌లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్‌లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు. -
పాకిస్తాన్లో ఎస్పీ ఆత్మహత్య.. భారత్ ఏజెంట్? ఆపరేషన్ సిందూర్‌లో సాయం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్ ఏజెంట్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయనే భారత్‌కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్.. గురువారం కూడా స్టేషన్‌కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్‌మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్‌మెన్ వెంటనే తేరుకుని.. అదీల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్‌లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.SP City of Islamabad Police Adeel Akbar was an agent of IndiaHe shot himself today .His inputs were very helpful during Op Sindoor.Thank you Adeel bhai , you have been a great help. pic.twitter.com/XZhcZTKZmn— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) October 23, 2025ఇక, అదీల్ అక్బర్ సియాల్కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్‌లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్ అక్బర్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అదీల్ అక్బర్.. మన సైన్యానికి ఇన్పుట్స్ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. -
హెచ్-1బీ వీసాలు.. వైట్‌హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాల(H-1B Visa) అంశంలో వైట్‌హౌస్ సంచలన ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Karoline Leavitt) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.హెచ్-1బీ వీసాల(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్ల వ్యవహారమై తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్ స్పందించారు. ఈ సందర్భంగా లివిట్ మాట్లాడుతూ..‘అమెరికాలో చాలాకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయి. అమెరికన్ల వేతనాలను హెచ్-1బీ వీసాలు తగ్గించేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి. అయితే, ట్రంప్ నిర్ణయంపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు అవకాశాలు అందడంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రాధాన్యం. దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. వీసా ఫీజుపెంపుపై కోర్టుల్లో వచ్చిన పిటిషన్లను ఎదుర్కొంటాం’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Washington, DC | On H-1B visas, White House Press Secretary Karoline Leavitt says, "The administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and to strengthen our visa system. For far too long, the… pic.twitter.com/9WLktOOaqd— ANI (@ANI) October 23, 2025హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది. ఫీజు రాయితీలు..ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తో సహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందని గ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
దోమలు.. ఐస్‌ల్యాండ్‌కు అరుదెంచిన వేళ..
న్యూఢిల్లీ: మశకం. దీనికి దోమ అని మరో పేరు కూడా ఉంది. భారత్‌లో ఏ వీధిలో ఏ మూలన చూసినా వేలాదిగా కనిపించి కసితీరా కాటువేసే ఈ దోమలు ఇప్పటిదాకా ఐస్‌ల్యాండ్‌లో లేవు. ఐస్‌ల్యాండ్ దేశ చరిత్రలో తొలిసారిగా దోమలను చూశామని గతవారం ఓ వ్యక్తి వెల్లడించడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఇప్పటిదాకా ఐస్లాండ్ వాసుల దరిచేరలేదు. ఇకపై తమ దేశంలోనూ దోమలు తిష్టవేస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఉరవడి తప్పదని స్థానికులు భయపడిపోతున్నారు. సాధారణంగా యూరప్ ఉత్తర ప్రాంతాల దాకా ఈ దోమలు ఉంటాయిగానీ ఐస్‌ల్యాండ్‌లో లేవు. దోమలను తమ ఇంట్లో గుర్తించామని గత వారం ఒక వ్యక్తి ప్రకటించారు. సంబంధిత దోమల ఫొటో లను తీసి స్థానిక పారిశుద్ధ్య విభాగ అధి కారులకు పంపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని క్యూలిసెటా యాన్వలాలా జాతి దోమలుగా గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాయి?ఈ అంశంపై నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐస్‌ల్యాండ్‌లో కీటక విభాగ నిపుణుడు డాక్టర్ మ్యాథియస్ ఆల్ఫ్రెడ్సన్ మాట్లాడారు. ‘‘ విదేశాల నుంచి వచ్చిన సరకు రవాణా లేదా వాణిజ్య నౌకలు లేదా షిప్పింగ్ కంటైనర్ల కారణంగా ఈ దోమలు ఐస్ల్యాండ్లోకి వచ్చి ఉంటాయి. క్యూలిసెటా దోమలు కాస్తంత చల్లని ప్రాంతాల్లోనూ మనగలవు. వాతావరణ మార్పులు, భూతాపోన్నతి వంటి దారుణ పరిస్థితులు కారణంగా ఐస్‌ల్యాండ్ సైతం వేడెక్కుతుంది. దీంతో ఇక్కడ తిష్టవేసిన వేడి వాతావరణమే, వాతావరణంలో అధిక తేమ, ఆర్థ్రత, వర్షభావ పరిస్థితులు సైతం కొత్తగా దోమ ఈ దేశంలో మనుగడ సాగించడానికి కారణం అయి ఉండొచ్చు’’ అని ఆయన విశ్లేషించారు.ఎవరు కనిపెట్టారు?ఐస్‌ల్యాండ్‌లోని కిడాఫెల్ అనే గ్రామంలో ద్రాక్షతోట పండించే బిజోర్న్ హజాల్ట్సన్కు కొత్తతరహా కీటకాలను పరిశీలించడమంటే ఎంతో ఇష్టం. గత ఆరేళ్లుగా తన తోటలో అధికమైన చిమ్మట పురుగులను త్వరగా పట్టుకునేందుకు ఒక వస్త్రానికి తీపి, రెడ్‌వైన్‌ల మిశ్రమాన్ని పూసి ఆ వస్త్రంలో చిక్కుకుపోయే పురుగులను గమనించడం ఓ వ్యాపకంగా పెట్టుకున్నాడు. అక్టోబర్ 16వ తేదీన కొత్త రకం కీటకం కనిపించడంతో అది ఖచ్చితంగా దోమ అని భావించి వాటిని వెంటనే కీటక నిపుణుడు మ్యాథియస్కు పంపించారు. విషయం తెల్సి ఆశ్చర్యానికి గురైన ఆయన వెంటనే బిజోర్న్ ఇంటికి చేరుకుని అక్కడ దోమల జాడను గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లి అధ్యయనం చేసి వాటిని క్యూలిసెటా యాన్వలాలా రకం దోమలుగా గుర్తించారు. ఆడ, మగ దోమలనూ విస్తరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈసారి ఐస్‌ల్యాండ్‌లో వసంతకాలంలో విపరీతంగా ఎండ కాయడంతో దోమల సంతతి పెరిగిందని ఆయన విశ్లేషించారు. -
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు. -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్‌ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్‌ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025


