పారమారిబో: దక్షిణ అమెరికాలోని సూరినామ్‌లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో ఐదుగురు బాలలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని పారమారిబో సమీపంలో ఆదివారం ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా నిందితుడి పిల్లలు, అతడి పొరుగువారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకుని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు దాడికి దిగాడన్నారు.ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో అతడు గాయపడ్డాడని చెప్పారు. అతడికి మతిస్థిమితం లేదని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


