యాంగూన్: మయన్మార్‌లో సైన్యం అధికార పగ్గాలు చేపట్టిన ఐదేళ్ల తర్వాత సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తొలి విడత పోలింగ్ జరిగింది. దేశం అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతుండగా, సైన్యం కన్నుసన్నల్లో ఎన్నిక తంతు జరుగుతోంది జనవరి 11, 25వ తేదీల్లో మరో 2 దఫాల పోలింగ్ అయ్యాక ఫలితాలొస్తాయి.
జాతీయ, ప్రాంతీయ శాసనసభల స్థానాల కోసం 57 పార్టీలకు చెందిన 4,800 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్లమెంటులో రాజకీయ ప్రాతినిథ్యం పొందే అవకాశమున్న 6 పార్టీలే పోటీ చేస్తున్నాయి. అంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోకస్రీ పార్టీని సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. సైన్యం అండదండలతో పనిచేస్తున్న యూనియన్ సాలిడారిటీ, డెవలప్‌మెంట్ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి.


