కాబూల్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని సామెత ఇప్పుడు ఆఫ్గాన్ దేశంలోని క్షౌరకులుకు సరిగ్గా సరిపోతుంది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడం ఏమోగాని అక్కడి క్షౌరకుల కుటుంబాలు జీవన ఆధారం లేక తల్లడిల్లిపోతున్నాయి.తాలిబన్ల చట్టం ప్రకారం పురుషులు గడ్డం తీసుకోవడం నేరం అని ఓకవేళ గడ్డాలు తీస్తే 15 నెలల దాకా జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆదేశంలో ప్రస్తుతం హెయిర్ డ్రెస్సింగ్స్ పైనే ఆదారపడాల్సి వస్తుందని తెలిపారు
తాలిబన్ల చట్టాన్ని ఒకవేళ ఎవరైనా మగవారి గడ్డం తీస్తే వారికి 15 నెలల జైలుశిక్ష వేయడంతో పాటు ఇతర కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రజలు గడ్డం తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు.అంతేకాకుండా ఇటీవల కొంతమంది యువకులు అక్కడ వెస్ట్రన్ హెయిర్ స్టైల్ చేసుకున్నారని ఆరోపణలతో వారిని తీవ్రంగా కొట్టారని ఆరోపణలున్నాయి. దీంతో అక్కడి హెయిర్‌డ్రెస్సర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొంతమందైతే ప్రజల ఇళ్ల కెళ్లి పురుషులని కటింగ్ అయినా చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.2021లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంటి తమ జీవనోపాధి పెద్దఎత్తున దెబ్బతిందని అక్కడి క్షౌరకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


