breaking news
strict
-
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్‌కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్‌కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్‌కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్‌కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్‌ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్‌ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్‌కు అటాచ్ చేస్తారు. ప్లాన్‌లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్‌లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్‌లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్‌లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్‌లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్‌లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
31st నైట్.. మందుబాబులూ జాగ్రత్త..!
-
ఇక పకడ్బందీగా రీచ్‌లు
భద్రాచలం: జిల్లాలోని ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో టీఎస్ఎండీసీ, ఇరిగేషన్, మైనింగ్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాలోని ఇసుక రీచ్‌ల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ఇసుక రీచ్‌లను ఇతర శాఖాధికారులతో ఏర్పాటు చేసిన టీమ్ తరచుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ములకలపల్లి, ముదిగొండ, మధిర, బోనకల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నివేదిక మేరకు నిలిపివేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. వాజేడు మండలం మోడికుంట ప్రాజెక్ట్ వద్ద 20,280 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను టీఎస్‌ఎమ్‌డీసీ ద్వారా ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారికే విక్రయించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కొండాయిగూడెం, వీరాపురం, భద్రాచలం, ఇసుక రీచ్‌ల ద్వారా 10.47 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు టీఎస్ఎండీసీ నిర్వహించాలని తెలిపారు. 2013–14కు గాను సొసైటీల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున ఆదాయం వచ్చిన నిధుల నుంచి పరిపాలన ఖర్చుల నిమిత్తం రూ. 3, సభ్యులకు బోనస్‌గా రూ. 37 లు పంపిణీ చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం వచ్చిన 49 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ, టీఎస్ఎండీసీ డీఓ మల్లయ్య, డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి, మై¯Œ్స జేడీ నర్సింహారావు, మధుసూద¯ŒSరెడ్డి, ఇరిగేష¯ŒS ఎస్ఈ, అగ్రికల్చర్ ఏడీ, ఆర్టీఓ, గ్రౌండ్ వాటర్ డీడీ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యాన్ని సహించం
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి టీఎస్ఎంఆర్ఈఐ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్ బాన్సువాడ: మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రారంభించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్ స్పష్టం చేశారు. బాన్సువాడలోని మైనార్టీ గురుకులాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ గురుకులాకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు, భోజన ఏజెన్సీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయని, వారిపై ప్రత్యేకంగా విజిలెన్స్ నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు విధులను నిర్లక్ష్యం చేస్తే తొలగించి కొత్త వారిని నియమిస్తామన్నారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందన్నారు. గురుకులాలు ప్రారంభమై మూడు నెలలవుతోందని, ప్రారంభం కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. ఏడాదిలోపు ఒక్కో గురుకులానికి ఐదు ఎకరాల చొప్పున భూమి సేకరించి రూ.20కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామన్నారు. మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట విజిలెన్స్ అధికారులు వీరేశం, ఉస్మాన్ అలీ, పాండురంగం, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీముద్దిన్ బాబా, నాయకులు మహ్మద్ ఎజాస్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు తదితరులున్నారు. -
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు
ఎస్సై సంతోష్ తల్లి మతిచెందిన కేసులో ఐదుగురు కుమారులపై కేసు అశ్వాపురం : తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే కొడుకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై హెచ్చరించారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండికుంట గ్రామానికి చెందిన కందిమళ్ల సరోజనమ్మ అనే వద్ధురాలు.. తన కుమారులు పట్టించుకోవడం లేదనే మనోవేదనతో ఏడ్చి, ఏడ్చి మతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ఆ వద్ధురాలు నిరాహార దీక్ష చేస్తూ మతిచెందడం బాధాకరమన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న విషయం ఆలస్యంగా తెలిసిందని, ఆలోపే ఆరోగ్యం క్షీణించి సొమ్మసిల్లి పడిపోయిందని, వైద్యశాలకు తరలిస్తుండగా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొండికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి పసుపులేటి కష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మతదేహాన్ని భద్రాచలంలో పోస్టుమార్టం అనంతరం గ్రామ పెద్దలకు అప్పగించామని తెలిపారు. ఉన్నతధికారుల ఆదేశాల మేరకు వద్ధురాలు మతిచెందడానికి కారణమైన ఐదుగురు కుమారులు కందిమళ్ల సుధాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కష్ణారెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్‌రెడ్డిలపై ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేశామని వివరించారు. ఐదుగురు కొడుకులు ఉండి ఎవరూ లేని అనాథలా వద్ధురాలు మతిచెందడం దారుణమని ఎస్సై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘనటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ ఎస్సై కిరణ్, ఏఎస్సై వీరబాబు, కానిస్టేబుళ్లు మంగీలాల్, ఝాన్సీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 12 ఎంఎన్జి 26 : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎసై సంతోష్


