TG: దీక్షలో ఉంటే డ్యూటీ చేయకూడదు | Police department imposes strict rules | Sakshi
Sakshi News home page

TG: దీక్షలో ఉంటే డ్యూటీ చేయకూడదు

Nov 25 2025 11:26 AM | Updated on Nov 25 2025 1:34 PM

Police department imposes strict rules

హైదరాబాద్ : మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మత పరమైన దీక్షలు తీసుకుంటే  పోలీసులు సెలవులు తీసుకోవాలని అంతేగాని డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని తెలిపింది. 

ఈ మేరకు డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని కంచన్ బాగ్‌ ఎస్సైకి మెమో జారీ చేసింది. పోలీసుల జట్టు, గడ్డం పెంచుకోకూడదని సివిల్ డ్రైస్ లో డ్యూటీ చేయకూడదని ఆదేశించింది.

అయ్యప్ప దీక్షలో ఉంటేనే నిబంధనలు గుర్తుకువస్తాయా?
తాజా తెలంగాణ పోలీస్‌ శాఖ ఆదేశాలపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకువస్తాయా? అంటూ ప్రశ్నించారు.  హిందూవులకే ఇలాంటి రూల్స్‌ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్‌ సమయంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలన్నారు రాజాసింగ్‌.

అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసులకు మెమో ఇవ్వడం దారుణమని వీహెచ్‌పీనేత శశిధర్ అన్నారు. గడ్డం పెంచుకున్న ముస్లింలకు ఈ విధంగా నోటీసులు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మాత్రం వారికి ఎందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారని పోలీసులను అడిగారు .  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement