రియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభుత్వం.. పాత బషర్ అల్-అసద్ చిత్రాలతో ఉన్న నోట్లను తొలగించి, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియ 2026 జనవరి 1 నుండి ప్రారంభమైంది. దీన్ని గతేడాది చివరి మాసంలో అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.
ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై సిరియా షౌండేషన్ పునర్నిర్మించి.. రెండు సున్నాలు తొలగించారు. ఈ నోట్ల ముద్రణను రష్యా కాంట్రాక్ట్‌కు తీసుకుంది. కొత్త నోట్లలో గోధుమ, నారింజలు, ఆలివ్, రోజాలు వంటి వ్యవసాయ చిహ్నాలు ఉన్నాయి. బషర్ అల్-అసద్ చిత్రాలను తొలగించి, కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ఆధ్వర్యంలో నోట్లను విడుదల చేశారు.
ఈ నోట్ల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం చూరగొంటుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా ఉంది. అయితే అంతర్జాతీయంగా ఈ కొత్త నోట్ల ముద్రణ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ.. కొత్త కరెన్సీకి అంగీకారం ఎంతవరకూ లభిస్తుందనేది మరొక ప్రశ్నగా మారింది. అయితూ అసద్ చిత్రాలను తొలగించడం ద్వారా కొత్త ప్రభుత్వం ప్రజలకు కొత్త ఆరంభం సంకేతం ఇచ్చింది..
మొత్తంగా, సిరియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఆర్థిక పునరుద్ధరణకు ఒక పెద్ద మైలురాయి అవుతుందని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, రాజకీయంగా కొత్త యుగానికి సంకేతమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తుంది.


