Orissa
-
మిడ్ డే మీల్ వర్కర్ల ఆందోళన
రాయగడ: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిడ్ డే మీల్ వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జిల్లాలోని గుణుపూర్ పాత బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చిన వీరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం ఒక వినతిపత్రంను సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాటకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మిడ్డే మీల్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడం లేదని వారంతా పేర్కొన్నారు. వీరి ఆందోళనకు ఎఐసిసిటియు మద్దతును తెలిపింది. సిపిఐ (ఎంఎల్) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగో కూడా పాల్గొన్నారు. -
సముద్రంలో వ్యక్తి గల్లంతు
రణస్థలం : మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సరదాకు స్నానానికి వెళ్లి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్ (31), ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ కలిసి కందివలస గెడ్డలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీరు బాగోలేదని సమీపంలోని దోనిపేటలో సముద్ర స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి తొలుత నీలాపు రమణ మునిగిపోతుండగా గమనించిన సూర్యనారాయణ, సంతోష్‌లు కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యనారాయణ, రమణ ఒడ్డుకు చేరుకున్నా సంతోష్ మాత్రం మునిగిపోయాడు. చాలాసేపు వెతికినా సంతోష్ జాడ కానరాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. జె.ఆర్.పురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాలించినా సంతోష్ ఆచూకీ దొరకలేదు. సంతోష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమారులు సిద్దార్ధ, హర్షవర్దన్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ గల్లంతయ్యాడని తెలిసి తల్లిదండ్రులు రాము, సరస్వతి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి గతంలో పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్‌లో కెమిస్ట్‌గా పని చేసి హైదరాబాద్ వెళ్లాడు. మళ్లీ స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగం సాద్ధిద్దామనే ఉద్దేశంతో నెల రోజుల కిందట గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పునరావాస కాలనీ పనులకు కమిటీలు టెక్కలి: సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసితుల కోసం నౌపడ సమీపంలో తలపెట్టిన పునరావాస కాలనీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో మంగళవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలనీ పనులు వేగవంతానికి అధికారులతో కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రాజా , డ్వామా పీడీ సుధాకర్‌రావు, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖాధికారులు పాల్గొన్నారు. తెలుగు మీడియం రద్దు దుర్మార్గం శ్రీకాకుళం: రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యా బోధన రద్దు చేయటం దుర్మార్గమని రాష్ట్ర ఎడ్యుకేషన్ సబ్ కమిటీ, జన విజ్ఞానవేదిక కన్వీనర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని సంస్కరణల పేరిట నాశనం చేస్తోందని, ఇటువంటి చర్యలను ఉపాధ్యాయ సంఘాలు ఉపేక్షించవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోతే ప్రభుత్వ విద్యా రంగం నాశనం అవుతుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యను బలోపేతం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని మండిపడ్డారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు టీచర్లను కేటాయించాలని, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని కోరారు. కూటమి ప్రభుత్వం 9రకాల పాఠశాలలను ఏర్పాటు చేయటం నష్టదాయకమన్నారు. పాఠశాలలను కుదించటం, సెక్షన్లు తగ్గించటం, ఒకే మీడియం అమలు చేయటం, పాఠశాలలు మూసివేయటం కారణంగా వేలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగాన్ని సంక్షోభంలోని నెట్టేస్తున్న నిర్ణయాలను మానుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఈనెల 21న, రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23న చేపట్టనున్న పోరాట కార్యక్రమాలను ఉపాధ్యాయలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంలో పనిచేస్తున్న కెప్టెనన్(డ్రైవర్లు)ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షితంగా తల్లీబిడ్డలను చేర్చుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య,టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, సిబ్బంది కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
లింగరాజు ఆలయంపై డ్రోన్ విహారం
భువనేశ్వర్: ఏకామ్ర క్షేత్రం లింగ రాజు ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యం స్థానికుల దృష్టికి వచ్చింది. ఈ సమాచారం ప్రసారం కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ దేవస్థానంపై డ్రోన్ సంచారం పూర్తిగా నిషేధించినట్లు రాష్ట్ర పోలీస డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఇటీవల ప్రకటించారు. ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టే దృశ్యం గమనించిన వెంటనే ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రాష్ట్రంలో నిషేధిత ఆలయ శిఖరాలపై డ్రోన్ల సంచారం తరచు చోటు చేసుకోవడం కలవరపరుస్తోంది. ఈ ఏడాది జనవరి 28న పూరీ శ్రీ జగన్నాథ ఆలయ శిఖరంపై నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు. శ్రీ మందిరం నీలచక్ర సమీపంలో డ్రోన్ దాదాపు 25 నిమిషాల పాటు చక్కర్లు కొట్టినట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. అంతకు ముందు జనవరి 5న ఇటువంటి సంఘటన శ్రీ మందిరం శిఖరాన చోటు చేసుకుంది. తాజాగా స్థానిక లింగరాజు దేవస్థానం శిఖరంపై డ్రోన్ సంచారం రాష్ట్రంలో భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా నిలిచింది. -
అమ్మ పండగలో అపశ్రుతి
సాలూరు: పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారి పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఉయ్యాల కంబాలు, సోమవారం తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. మంగళవారం సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ వేడుకగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిరిమానును తిలకించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మంగళవారం సిరిమానోత్సవం జరుగుతున్న క్రమంలో అపశ్రుతి దొర్లింది. విరిగిన అమ్మవారి అంజలి రథచక్రం మంగళవారం సాయంత్రం భక్తజనం నడుమ సిరిమానోత్సవం ప్రారంభమైంది. జన్నివారు సిరిమానును అధిరోహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జై శ్యామలాంబ అంటూ చేసిన నామస్మరణ నడుమ సిరిమాను నాయుడు వీధి రామమందిరం నుంచి కదిలింది. సాయంత్రం 4.05 గంటలకు సిరిమాను ప్రారంభ ముహుర్తం కాగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సిరిమాను వద్ద కట్టిన తాళ్లు తెగిపోగా వెంటనే వాటిని సరి చేశారు. దీంతో సిరిమాను కదిలింది. కొద్ది సేపటికి బోసు బొమ్మ సమీపంలో రూరల్ సీఐ కార్యాలయం వద్దకు చేరుకోగా అంజలి రథం ఎడమ చక్రం విరిగింది. దీంతో సిరిమానోత్సవం తాత్కాలికంగా ఆగింది. వేరే చక్రం తీసుకువచ్చి ఏర్పాటు చేస్తామని వెల్లడించిన నిర్వాహకులు సుమారు రాత్రి 9 గంటల సమయంలో నూతన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సిరిమానోత్సవంలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే శ్యామలాంబ తల్లే తమను మన్నించాలని భక్తులు వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, పీవో శ్యామలాంబ అమ్మవారిని జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో అశుతోష్ శ్రీవాస్తవ అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిమాను ఊరేగింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శ్యామలాంబ అమ్మవారి పండగ నేపథ్యంలో పట్టణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు, నృత్యాలు, బళ్ల వేషాలు, తప్పెటగుళ్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రతి చోట భక్తుల సందడి కనిపించింది. ఏర్పాట్లపై కలెక్టర్ అసహనం పట్టణంలో శ్యామలాంబ పండగను భక్తులు తమ స్థాయి కొలది ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ ఏర్పాట్లు నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పట్టణానికి తరలివచ్చారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల్లోనే పార్కింగ్‌లతో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శ్యామలాంబ ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ విరివిగా అందించే ఏర్పాట్లు చేయలేదు. దీన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పండగలో కొరవడిన ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. రూరల్ సీఐ కార్యాలయ సమీపంలో విరిగిన అంజలి రథచక్రం నిరుత్సాహ పడిన భక్తజనం ఘనంగా శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం -
అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడుతా..
కొరాపుట్: అవసరమైతే కాంగ్రెస్ పార్టీని విడిచి ప్రజల తరఫున పోరాటం చేస్తానని కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కొరాపుట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంత కొఠియా సమస్య పరిష్కారంపై ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. తన సొంత పంచాయతీ సమస్యపై తాను మౌనంగా ఉండడం సరికాదన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ కమిటీ చైర్మన్‌గా ఉన్నానన్నారు. కొఠియా సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాన్నారు. అది విఫలం అయితే దండకారణ్య పర్వతమాల వికాస్ పరిషత్ పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు. దండకారణ్యంలో ఉన్న అవిభక్త కొరాపుట్ జిల్లాలతో పాటు ఆంధ్రాలోని అరుకు ప్రాంతంలోని రెండు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. తమకు రాజకీయ పదవులు కొత్త కాదన్నారు. తన మేనమామ మల్లు శాంత రెండు సార్లు, మేనత్త చంద్రమ శాంత ఒకసారి, తన తండ్రి పంగి మసురు శాంత ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందిన విషయాన్ని జయరాం పంగి గుర్తు చేశారు. మాజీ ఎంపీ జయరాం పంగి -
వెంటాడిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి ● పెంటూరులో విషాదఛాయలు నరసన్నపేట: సత్యవరంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వంతెనపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి పిన్నింటి దొరబాబు(38) మృతి చెందారు. శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామంలో అమ్మవారి పండగలకు వెళ్లి స్వగ్రామం నందిగాం మండలం పెంటూరుకు ద్విచక్ర వాహనంపై మామయ్య సనపల సీతారాంతో కలిసి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే దొరబాబు మృతి చెందగా.. సీతారాంకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. మూడు రోజుల్లో విధుల్లోకి.. దొరబాబు అస్సాం రైఫిల్ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. బంధువుల కుమార్తె పెళ్లికి వారం రోజులు సెలవుపై వచ్చారు. వివాహ వేడుక రెండు రోజుల కిందటే కాగా, శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో అమ్మవారి పండగలకు వెళ్లారు. మరో మూడు రోజుల్లో తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో మృత్యువు వెంటాడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దొరబాబుకు భార్య కాంచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: కుర్రకారు కండల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం ఉత్తరాంధ్ర జోనల్‌స్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు కన్నులపండువలా సాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ శరీర సౌష్టవ పోరులో అండర్– 50 నుంచి 85 కేజీల విభాగం, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పోటీల ప్రదర్శనలో కుర్రకారు జోరు ప్రదర్శించారు. స్టార్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు వి.విజయ్‌కుమార్, బి.ప్రసాద్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 80 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీకాకుళానికి చెందిన దివ్యాంగ బాడీబిల్డర్ తుపాకుల అనీల్‌కుమార్ విశేషంగా ఆకట్టుకున్నాడు. జాతీయ దివ్యాంగుల బాడీబిల్డింగ్ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని రిఫరీలు భరోసా ఇచ్చారు. -
‘ఎండీయూ వాహనాల రద్దు అన్యాయం’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో బండిలో ఉన్న కంప్యూటర్ కాటా సర్వీస్ ఇంజినీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఇంజినీర్ బి.అనంతకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినా డ, ఒంగోలు, ఏలూరు తదితర జిల్లాలకు ఎంవిఆర్ టెక్నాలజీ తరఫున నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమ బతుకుల్లో నీళ్లు చల్లడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబాలతో రోడ్డున పడతామన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మరోమారు ఆలోచన చేయాలని కోరారు. చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యం సోంపేట: సోంపేట ప్రాంతంలోని చిత్తడినేలల్లో వెలకట్టలేని జీవవైవిధ్యం ఉందని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ యారడి కృష్ణమూర్తి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా సోంపేట చిత్తడి నేలల జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని లోకానాథేశ్వర కళాసీ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకలు, మత్స్య సంపద, వివిధ రకాల పాములు, మత్స్యకారులు, రైతుల జీవన విధానం ఫొటో లు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ సోంపేట మండలంలోని చిత్తడి నేలలు మానవాళికి వెలకట్టలేని సంపద అని అన్నారు. ఈ నేలలను రక్షించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, నాగు, కోదండ, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా సర్వే చేపట్టాలి నరసన్నపేట: గ్రామాల్లో భూముల రీసర్వేను పక్కాగా చేపట్టాలని సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ (విజయవాడ) డీఎల్డీఎల్ కుమార్ సూచించారు. మండలంలోని నడగాంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీటీ కృష్ణారావు మాట్లాడుతూ నడగాంలో 1,679 ఎకరాలు ఉన్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే చేయాలని, తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ అప్పలస్వామి పాల్గొన్నారు. -
నడకతో సంపూర్ణ ఆరోగ్యం
రాయగడ: స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నడకపై చైతన్య ర్యాలీని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు కె.సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో విద్యార్థులు, కాలనీ వాసులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోజూ ఉదయం నడవండి సంపూర్ణ ఆరోగ్యం పొందండి అనే నినాదాలతో నిర్వహించిన ర్యాలీలో భాగంగా క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎం. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రోగాలు దరి చేరకుండా ఉండాలంటే అందుకు ఆరోగ్య సూత్రంలో ప్రధానమైనది నడకేనని అన్నారు. ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి రోజూ నడవాలని అన్నారు. ర్యాలీలో విద్యార్థులు, క్లబ్సభ్యులు -
అగ్నిగంగమ్మకు ప్రత్యేక పూజలు
రాయగడ: స్థానిక పిట్టలవీధిలోని అగ్నిగంగమ్మ అమ్మవారి వార్షిక పండుగలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళవారం పసుపుతో అలంకరించారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లనితల్లిగా గుర్తింపు పొందిన అమ్మవారికి ప్రతీ ఏడాది వార్షిక పండుగలో ఈవిధంగా ముస్తాబు చేస్తారు. పట్టు వస్త్రాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. పికప్ వ్యాన్ బోల్తా ● ఇద్దరికి స్వల్పగాయాలు రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి కర్లకోన కూడలిలో పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలొ వ్యాన్ డ్రైవర్, హెల్పర్‌కు స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కళ్యాణసింగుపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాయగడ నుంచి పచారి వస్తువుల లోడుతో కళ్యాణసింగుపూర్ వైపు వెళ్తుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. నత్తనడక నిర్మాణాలపై ఎమ్మెల్యే ఆగ్రహం కొరాపుట్: ¯]l™èl¢-¯]l-yýlMýS °Æ>Ã-×ê-ÌSOò³ ¯]lº-Æý‡…-VŠæ-ç³NÆŠ‡ ½gôæï³ GÐðl$ÃÌôæÅ VúÈ Ôèæ…MýSÆŠ‡ Ð]l$hj B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. V>…«©-¯]l-VýSÆŠæ, C^éaÐ]l† VýS$yýl {ç³fË$ GÐðl$Ã-ÌôæÅ¯]l$ ™èlÐ]l$ {´ë…™é-ÌSMýS$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… BàÓ-°…-^éÆý‡$. 2023 í³{¿ýæ-Ð]lÇÌZ {´ëÆý‡…-¿ýæ-OÐðl$¯]l ™èlÐ]l$ {´ë…™èl…ÌZ° Æøyýl$z, {Oyðl¯óli 糯]l$Ë$ ¯ólsìæMîS ç³NÆý‡¢-Ð]lÓ-Ìôæ§ýl° GÐðl$Ã-ÌôæÅMýS$ Ý린MýS$Ë$ ^èl*í³…-^éÆý‡$. 糯]l$Ë$ ç³NÇ¢-M>-MýS-´ù-Ð]l-yýl…™ø Ð]lÆ>ÛM>-ÌS…ÌZ ™éÐ]l¬ Cº¾…§ýl$Ë$ ç³yýl$-™èl$-¯é²Ð]l$° Ðé´ùĶæ*Æý‡$. ç³Çíܦ† ç³Ç-Ö-Í…-_¯]l GÐðl$ÃÌôæÅ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. Ððl…r¯ól Ð]l¬°Þç³ÌŒæ GWjMýS*Å-sìæÐŒæ BïœçÜÆŠæ, C…h±-Æý‡Ï¯]l$ í³Í-í³…-^éÆý‡$. ™èl„ýS׿… °Æ>Ã׿… ç³NÇ¢ ^ólõÜÌê ™èlW¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° ీ B§ól-Õ…^éÆý‡$. శ్మశాన వాటిక ప్రారంభం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఐఎంఎస్, టి.స్యూల్ సమీపంలో పురపాలక సంస్థ, ఒడిశా సూక్ష్మ పరిశ్రమల నిగమం సంయుక్తంగా నిర్మించిన ఆదర్శ శ్మశాన వాటికను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి మంగళవారం ప్రారంభించారు. పురపాలక సంస్థ అధ్యక్షుడు మానోజ్ కుమార్ బారిక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి అధికారి నరేశ్ చంద్ర శభరో మాట్లాడుతూ.. శ్మశాన వాటికను రూ. 1.50 కోట్లతో నిర్మించినట్టు పేర్కొన్నారు. ఇక్కడ శివుని విగ్రహం, పార్కు, గోదాం, మంచినీటి కోసం బోరును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఉపాధ్యక్షురాలు కవిత మోహంతి, కార్యనిర్వాహక అధికారి కె.అశోక్ చక్రవర్తి , పురపాలక ప్రతినిధి విజయ్ కుమార్ మహారాణా పాల్గొన్నారు. -
ముగిసిన వెలుపలి చందన యాత్ర
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని చందన యాత్ర తొలి విడత మంగళవారంతో ముగిసింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆరంభమైన ఈ యాత్ర నిరవధికంగా 42 రోజులు కొనసాగుతుంది. తొలి 21 రోజులు వెలుపలి చందన యాత్రగా శ్రీ మందిరం నుంచి స్వల్ప దూరంలో నరేంద్ర సరోవరంలో అత్యంత ఆనందోత్సాహాలతో కొనసాగింది. శ్రీ మందిరం నుంచి నరేంద్ర సరోవరం వరకు దారి పొడవునా భక్తులు పలు రీతుల్లో భక్తి భావాల్ని చాటుకున్నారు. కళాకారులు శాసీ్త్రయ నృత్య, సంగీత గీతాలాపన తదితర కార్యక్రమాలతో దేవుళ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిత్యం సంధ్య వేళలో పల్లకిలో ఉత్సవ మూర్తులు సరోవరం నడి బొడ్డున ఉన్న చందన వేదికకు చేరు కుని శోభాయమానమైన అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించి నౌకా విహారంతో భక్తుల్ని మురిపించారు. 20వ రోజున అత్యధికంగా 21 సార్లు సరోవరంలో చుట్టు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. చివరి రోజు సంధ్య వేళలో నౌకా విహారం లేకుండా చందన వేదికపై దేవదేవుళ్లు పసుపు పొడి కలిపిన నీటితో ఉత్సాహభరితంగా చందన యాత్రలో పాల్గొన్నారు. వెలుపలి చందన యాత్ర 21వ రోజున శ్రీరామకృష్ణ, మదన మోహన్‌లు పసుపు నీరు పిచికారీ చేసుకుని ఆహ్లాదభరితంగా చందన యాత్రకు తెరదించారు. నేటి నుంచి లోపలి చందన యాత్ర ఆరంభం అవుతుంది. 21 రోజుల పాటు నిరవధికంగా శ్రీ మందిరం లోపలి ప్రాకారంలో చందన యాత్ర కొనసాగుతుంది. న్యూస్‌రీల్ -
రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు లేవు
జేఎన్.1 లక్షణాలు గొంతు నొప్పి ముక్కు కారటం దగ్గు అలసట తేలికపాటి జ్వరం● ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా భువనేశ్వర్: దేశంలో కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నిఘా ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కొత్త జేఎన్ 1 సబ్‌వేరియంట్ దాఖలాలు లేకున్నా ఆరోగ్య శాఖ అధికారులు బహుళ రోగ పీడితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ కొత్త కరోనా వైరస్ జాతి కొత్త వేరియంట్ కాదని, ఇప్పటికే చెలామణిలో ఉన్న ఓమిక్రాన్ జాతికి ఉప వంశం అని స్పష్టం చేశారు. మాస్కు ధారణ మంచిదే పరిస్థితి తీవ్రమైతే కేంద్ర ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. తదనంతరం రాష్ట్ర ప్రజలకు సముచిత సూచనలు జారీ అవుతాయి. గత వ్యాప్తి మాదిరిగానే, మూత్ర పిండాల వ్యాధి లేదా క్యాన్సర్ వంటి సమస్యాత్మక అనారోగ్యాలు ఉన్నవారు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు. తక్షణం భయపడాల్సిన అవసరం లేదని, పాజిటివ్ గుర్తింపు జరిగితే జీనోమ్‌ను సీక్వెన్న్స్ కోసం నమూనాలను ఉన్నత నిర్ధారణ పరీక్షలకు సిఫారసు చేసి తగిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం, చేతుల పరిశుభ్రతను పాటించడం, అనవసరమైన ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండడం శ్రేయోదాయకమని హితవు పలికారు. 257 యాక్టివ్ కోవిడ్ –19 కేసులు ఈ నెల 19 నాటికి మన దేశంలో 257 యాక్టివ్ కోవిడ్ –19 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం తేలికపాటివే. ప్రస్తుతానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఎటువంటి కొత్త సలహాలు, మారక్గదర్శకాలు జారీ చేయలేదు. సమీప దేశాలలో అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ముంబైలో ఇటీవల 2 కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించినట్లు సమాచారం. వారిలో మూత్రపిండాల వైఫల్యంతో 14 ఏళ్ల బాలుడు, దీర్ఘకాలంగా 54 ఏళ్ల క్యాన్సర్ పీడితుడు ఉన్నట్లు ఖరారు చేశారు. -
భారీ మొత్తంలో కలప పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా అటవీ శాఖ వారు కోరుకొండ సమితి ఎంవీ 41 గ్రామానికి చేందిన ధనుర్జయ్ ఢాలీ, పాలకొండ గ్రామానికి చెందిన గంగా మాడీలు కలప తరలిస్తుండగా పట్టుకున్నారు. మల్కన్‌గిరి అటవీ శాఖ రేంజర్ రమేష్ చంధ్ర రౌత్ నేతృత్వంలో, సరోజ్ స్వాయి, స్క్వాడ్ సిబ్బంది కూంబింగ్ పనులు మొదలుపెట్టారు. సోమవారం రాత్రి నిందితులు రెండు ట్రాక్టర్లలో లోడ్ చేసిన కర్రలను తరలిస్తున్నారు. అటవీ శాఖ ఆపి తనిఖీ చేయగా సరైన పత్రాలు చూపలేకపోయారు. దీంతో కర్రలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. -
లారీ డ్రైవర్లపై దాడి
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. లారీలు ఆపి నిద్రిస్తున్న డ్రైవర్లుపై కొంతమంది దాడి చేసి అలజడి సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సుజిత్కుమార్రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తంసింగ్, విజయ్‌కుమార్ యాదవ్‌లు చైన్నె నుంచి కోలకత్తా మార్గంలో వెళ్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఉన్న డాబా వద్ద ఆగారు. లారీలను సర్వీస్ రోడ్డువైపు పార్కింగ్ చేసి భోజనాలు అనంతరం తమ లారీల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు వ్యక్తులు మొదటగా విజయ్‌కుమార్ యాదవ్‌ను లేపి కత్తి చూపించి బెదిరించారు. సకాలంలో అప్రమత్తమైన విజయ్‌కుమార్ ఒక్కసారిగా లారీ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత సుజిత్‌కుమార్ రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తం సింగ్‌లను లేపి రాళ్లతో లారీ అద్దాలు పగులగొట్టి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.28వేలు నగదు లాక్కొని తామరాపల్లి వైపు పొలాల గుండా వెళ్లిపోయారు. అనంతరం డ్రైవర్లు కేకలు వేయడంతో డాబా సిబ్బంది వచ్చి గాయాల పాలైన వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించారు. దాడి లో పాల్గోన్న వారంతా తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని, అందరూ 30 ఏళ్లలోపు వారేన ని బాధితులు చెబుతున్నారు. అనంతరం నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. నగదు, సెల్ఫోన్లతో పరారైన దుండగులు పెద్ద తామరాపల్లిలో అర్ధరాత్రి అలజడి వాహనదారుడినీ వదల్లేదు.. నందిగాం: సుభద్రాపురం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి ఉండగా కొంతమంది దాడి చేశారు. తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పెట్రోల్ అపహరణ.. నందిగాం మండలంలోని సుభద్రాపురం పరిధి గుండా వెళ్తున్న ఐఓసీఎల్ పైపులైన్ నుంచి కొంత మంది పెట్రోల్ దొంగతనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పైపులైన్‌కు ఉండే ఓపెన్‌లో చిన్న పాటి మోటార్ ఇంజన్ పెట్టి పెట్రోల్ తోడేసినట్లు తెలుస్తోంది. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు అందగా హెచ్‌సీ రమణ కేసు నమోదు చేశారు. గతంలో కాశీరాజుకాశీపురం వద్ద ఇలాగే పెట్రోల్ చోరీ జరిగిన ట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే నందిగాం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు ఘోరంగా వైఫల్యం చెందాయని, లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ తీరుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. -
ఒడియా చలన చిత్ర రంగం బలోపేతానికి సన్నాహాలు
భువనేశ్వర్: ఒడియా చలన చిత్రం రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత వాటాదారులు సమావేశమయ్యారు. స్థానిక సంస్కృత భవన్లో సోమవారం ఈ సమావేశం జరిగింది. ప్రముఖ ఒడియా చలనచిత్ర నటుడు, దిగొపొహండి నియోజక వర్గం ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చలన చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు, రచయితలు, సంగీ తకారులు సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడి యా సినిమా రంగం వృద్ధి, మెరుగుదలపై వీరంతా పలు అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వార్షిక ప్రధానోత్సవాన్ని సకాలంలో నిర్వహించడం సినీ రంగం కళాకారుల్ని ఉత్సాహపరుస్తుంది. నగదు పురస్కారాల పరిధి, 33 అవార్డు విభాగాల విస్తరణతో చలన చిత్ర రంగం కళాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. కొత్త చలనచిత్ర విధానాన్ని రూపొందించి చలన చిత్ర నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయడంతో చలన చిత్ర నిర్మాణానికి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఒడిశా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పనితీరును బలోపేతం చేసి కళింగ స్టూడియో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల సంఖ్యను పెంచి ప్రేక్షకులకు సరసమైన ధరలకు టికెట్లు అందించాలని అభ్యర్థించా రు. ప్రఖ్యాత సినీ నటులు అరిందమ్ రాయ్, శ్రిత మ్ దాస్, సబ్యసాచి మిశ్రా, హరిహర్ మహపాత్రో, నటి అర్చితా సాహు, పింకీ ప్రధాన్, అను చౌదరి, సంగీత విద్వాంసుడు దేబాశిష్ మహాపాత్రో, పంచానన్ నాయక్, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దీప్తి మిశ్రా, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక శా ఖ డిప్యూటీ కార్యదర్శి, దివ్య ప్రసాద్, సాహిత్యం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ దేవయాని భుంయ్యా, ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హొత్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఇస్కాన్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య ప్రదర్శన
పర్లాకిమిడి: స్థానిక డెప్పో ఒడియా వీధి నామహాట్టో కేంద్రం తరఫున ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకూ సమ్మర్ క్యాంపు ఇస్కాన్ ఆధ్వర్యంలో టౌన్ హాల్లో నిర్వహించారు. ముగింపు సమావేశంలో బృందావనం నుంచి విచ్చేసిన కృష్ణ భక్తులు పాద ప్రతాప్ రుద్రదాస్, ఇస్కాన్ ప్రభు పాద పంచరత్న దాస్‌లు ఆదివారం విచ్చేశారు. ముఖ్యఅతిథిగా పురపాలక అధ్యక్షురాలు నిర్మలాశెఠి విచ్చేశారు. ఒకటి నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలు ఆధ్యాత్మిక సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. సుమారు 300 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. -
జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులపై సమీక్ష
జయపురం: జయపురంలో చారిత్రక జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కావటంతో ఆ పనులను జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ అధికారి, సాగర్‌లో మట్టి, బురద వెలికి తీసే కాంట్రాక్టర్లతో బాహిణీ పతి చర్చించారు. వర్షాకాలంలో కూడా పునరుద్ధరణ పనులు జరగాలని ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి స్పష్టం చేశారు. సాగర్‌లో బుర ద పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక వాహనం రప్పిస్తామని ఆయన వెల్లడించా రు. బురద తీసే సమయం రాత్రి 9 గంటల వరకు ఉండగా ఆ సమయాన్ని 12 గంటల వరకు కొనసాగించాలని ఆదేశించారు. జగన్నాథ్ సాగర్‌ను రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆయన వెల్లడించారు. రెండోసారి పునరుద్ధరణ పనుల కోసం 9 కోట్ల 45 లక్షలు వ్యయపు అంచనా ను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. సాగ ర్ పునరుద్ధరణ పనులు 45 రోజుల్లో పూర్తి చేస్తా మని కాంట్రాక్టర్ సంస్థ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులను ఆర్ అండ్ బి ఇంజనీర్, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్, మున్సిపాలిటీ ఇంజినీ ర్లు పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, అదనపు కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సా హు, ఇంజనీర్ అజయ కుమార్ జానీ, జూనియర్ ఇంజనీర్ ప్రతాప్ చంధ్ర ఆచార్య, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్ సుప్రభ కువార్, ఆర్ అండ్ బి ఇంజినీర్ విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శిశు సంక్షేమ కమిటీ పర్యటన
జయపురం: తొమ్మిది మంది సభ్యులతో కూడిన మహిళా, శిశు సంక్షేమ హౌస్ కమిటీ కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తోంది. శాసన సభ్యురాలు మహి ళా, శిశు గృహ కమిటీ అధ్యక్షురాలు సీమారాణి నా యిక్ నేతృత్వంలో రెండు దినాల పర్యటన నిమిత్తం వచ్చిన కమిటీకి జయపురం విమానాశ్రయంలో కొరాపుట్ కలెక్టర్ వి,కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ శర్మ, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, జయపురం సబ్ కలెక్టర్ శొశ్య రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.సీమా రాణి నాయిక్ నేతృత్వంలో శాశన సభ్యులు ప్రమీళ మల్లిక్, బర్షా సింగ్ బారిహ, సుజాత సా హు, సంజలి ముర్ము, ఉపాసన మహాపాత్రో, సుభా షిని జెన, మనోరమ మహంతి, షోపియ పిర్దెస్ అధికారులతో మాట్లాడారు. వారు తమ పర్యటన లో దుదారి లోగల కాఫీ తోటలు, మండియ(ఛోళ్లు) ప్రోసెసింగ్ యూనిట్లను పర్యటించి స్వయం సహాయక గ్రూపు మహిళా సభ్యులతో మాట్లాడి వా రి సమస్యలను తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు దేవమాళీ పర్వత పర్యాటక ప్రాంతంలో విడిది చేశారు. -
మైదానం అభివృద్ధికి వినతి
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల మైదానం అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గజపతి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని ఇదివరకు సమర్పించారు. దీనిపై ‘సాక్షి’తో పాటు అనేక పత్రికల్లో కళాశాల మైదానం దీనస్థితిపై కథనాలు వచ్చాయి. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు లేఖ రాశారు. మహారాజా కళాశాల ఒడిశాలో హెరిటేజ్ భవనం అని, ఇక్కడ స్పోర్ట్స్ మైదానం అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు క్రీడాకారులకు కల్పించాలని కోరుతూ రాసిన వినతిని ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్‌కుమార్ (చిట్టి) భువనేశ్వర్‌లో మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు అందజేసినట్టు తెలియజేశారు. దీనిపై డీఆర్డీఏ శాఖ రూ.95 లక్షలతో ప్రతిపాదనలు డైరెక్టర్ ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక సమితి కార్యాలయం సమావేశ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్ అధ్యక్షతన వినతులు స్వీకరించారు. మొత్తం 15 వినతులు వచ్చాయి. వీటిలో ఎనిమిది వ్యక్తి గత..ఏడు గ్రామసమస్యలుగా అధికారులు గుర్తించారు. స్వీకరించిన సమస్యలను త్వరగా పరిష్కరించేందు కు కృషి చేయాలని నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్‌కుమార్ ప్రధాన్, ఆర్టీవో శివశంకర్ చౌదరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ పాల్గొన్నారు. పి.అంతరాడలో.. పర్లాకిమిడి: జిల్లాలోని నువాగడ బ్లాక్ పి.అంతరాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జాయింట్ గ్రీవెన్సు సెల్‌కు జిల్లా కలెక్టర్ బిజయ కు మార్ దాస్ హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర కెరకెటా, నువాగడ బ్లాక్ అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్ హాజరయ్యారు. స్పందన కార్యక్రమంలో కెరడంగా, నువాగడ, లుహాంగర్, అంతరాడ నుంచి 46 అభియోగాలు వచ్చాయి. అందులో నాలుగింటిని అధికారులు పరిష్కరించారు. గ్రామసమస్యలపై వచ్చిన 33 వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బీడీవో లోకనాథ్ శోబోరో, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి సంతోష్ నాయక్ పాల్గొన్నారు. కలిమెల సమితిలో 27 వినతుల స్వీకరణ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్రసభరో నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై 27 మంది వినతులను అందజేశారు. వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్కళ కరాటే స్కూల్‌కు పతకాల పంట
జయపురం: భువనేశ్వర్‌లో ఈ నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో కొరాపుట్ జిల్లా సెమిలిగుడ ఉత్కళ కరాటే స్కూల్ విద్యార్థులు పతకాల పంట పండించారు. ఆ స్కూల్‌కు 19 పతకాలు లభించాయి. వాటిలో ఐదు బంగారు, తొమ్మిది వెండి, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రతినిధుల వెల్లడించారు. రుద్రాంశ కుమార్ శామల్ రెండు బంగారు, ఆకాంశ్య ప్రధాన్, దీప్తి నామదేవ్, తపశ్విణీ నాయిక్‌లు చేరో ఒక బంగారు పతకాలు సాధించారు. ఏంజిల్ అభిశిక్త మినియాక, శిబప్రతి చందన నాయిక్, నందినీ నాయిక్, తృప్తి రాణీ మహంతి, శుభమ్ నాయిక్, తపశ్విణీ, శృతి శిఖా సాహు, తృప్తి సంపూర్ణ దాస్ వెండి, అంకిత ఖొర,విద్యాశ్రీ నివేదిత మల్లిక్,శృతి, ఆకాంశ్య పటి, సంపూర్ణ కాంస్య పతకాలు సాధించారన్నారు. కొరాపుట్ జిల్లా కరాటే అసోసియేషన్, సెమిలిగుడ కరాటే స్కూలు నిర్వాహకులు, కరాటే అభిమానులు విజేతలకు అభినందించారు. -
పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా పోడియా సమి తి క్రిస్టియన్ వీధి, డైలీ మార్కెట్, శాంతి నగర్ వీధుల్లో నివసిస్తున్న గిరిజనులు నెల రోజులు గా వింత వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి మొదట చిన్న పిల్లల్లో కనిపించింది. పిల్లలకు కడుపు నొప్పి, చేతులు, కాళ్లు, ముఖం వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా యి. పోడియా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మందు లు వేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ వాపుల వల్ల చాలా మంది నడవలేక పోతున్నారు. శరీరం కూడా నలుపు రంగులోకి మారిపోతోంది. దీనిపై కొందరు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాన్ని పంపిస్తానని ఆయన తెలిపారు. ఆరేళ్లకే ఆయువు తీరింది పొందూరు: పొందూరు–చిలకపాలెం రహదారిలోని ఎరుకులపేట కూడలి వద్ద సోమవా రం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం గోకర్నపల్లి పంచాయతీ రంగనాథపేట గ్రామానికి చెందిన పేడాడ హరిబాబు, ఈశ్వరమ్మ దంపతులకు వెంకటసూర్య యువంత్(6) అనే కుమారుడు ఉన్నాడు. యువంత్ తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేటలో చిన్న తాతయ్యను చూసేందు కు వచ్చాడు. అక్కడి నుంచి చిలకపాలెం వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేట బస్టాప్‌కు బయలుదేరాడు. బస్టాప్ నుంచి రహదారి అవతలవైపు ఆటో ఆపేందుకు తండ్రి హరిబాబు వెళ్లాడు. తండ్రి దగ్గరకు వెళ్లాలనే ఆతృతతో తల్లి ఈశ్వరమ్మ చేయిని వదిలి బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బాలుడి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పొందూరులోని ప్రైవే టు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేకపోవడంతో 108 వాహనంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. తండ్రి హరిబాబు విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలుడి మృతితో రంగనాథపేటలో విషాద ఛా యలు అలముకున్నాయి. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవరుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాద సంఘటన బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రదేశంలో వద్ద ఇసుక ఉండటంతో ఇసుక ట్రాక్టర్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనంపై ఓడీ 33ఏ డీ2053 నంబరు ఉంది. దీంతో ప్రమాదానికి గురైన వారు ఒడిశావాసులుగా పోలీసులు భావిస్తు న్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సర్పాల సయ్యాట పొందూరు రూరల్ : మండల కేంద్రం పొందూరులోని అఫీషియల్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బేత కృష్ణారావు ఇంటి పక్కన సోమవారం సాయంత్రం నాగుపాము, జెర్రిపోతులు సయ్యాట ఆడాయి. ఒక్కసారిగా పాములు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
విశాల్ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా
రాయగడ: స్థానిక ఎఫ్‌సీఐ సమీపంలోని విశాల్ మేగా మార్ట్ షోరూంలో సోమవారం ఫుడ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ జ్యోతి ప్రకాష్ సోరేన్ నేతృత్వంలో ఆ శాఖకు చెందిన మరో ఇద్దరు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. వస్తువుల కాలవ్యవధి పూర్తయినప్పటికీ వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఒక లక్ష రూపాయలను జరిమానాగా విధించారు. వివరాల ప్రకారం.. సంగ్రామ్ పట్నాయక్ అనే వినియోగదారుడు ఈ నెల 14వ తేదీన విశాల్ మేగా మార్ట్‌లో 1463 రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు. ఇందులో భుజియ (మిక్చర్)ప్యాకట్ కాల వ్యవధి పూర్తయినట్టు గుర్తించి విషయాన్ని వెంటనే మేగా మార్ట్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే ఈ వస్తువు తమ వద్ద లేదని.. కాలవ్యవధి పూర్తయిన వస్తువులు తమ మార్ట్‌లో విక్రయించడం లేదని దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో పట్నాయక్ స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ మేరకు తనిఖీలు నిర్వహించి మేగా మార్ట్ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ జరిమానా విధించారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో కొన్ని కాలపరిమితి అయిన వస్తువులను సీజ్ చేసిన అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. -
కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ విస్తరణ
జయపురం: ఇంతవరకు నాలుగు జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ త్వరలో నాలుగు ముక్కలు కానుంది. త్వరలోనే నవరంగపూర్, రాయగడ, మల్కనగిరి జిల్లాలలో స్వతంత్య్ర కేంద్ర సహకార బ్యాంక్‌లు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర సహకార మంత్రాలయం విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఈ విషయం రాష్ట్ర సహకార పరిచాలన కమిటీ డైరెక్టర్ సిద్ధార్థ్ దాస్, కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యనిర్వాహక అధికారికి లేఖ ద్వారా తెలిపారు. 1992లో అవిభక్త కొరాపుట్ నాలుగు జిల్లాలుగా విభజించినా 1950 మార్చ్ 15 వ తేదీన ఏర్పాటు చేసిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్)నేటి వరకు కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్‌గానే నాలుగు జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. వాస్తవానికి 1950లో నెలకొల్సిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ మొదట నవరంగపూర్‌లో ఏర్పాటు చేశారు. 1972 ఆగస్టు 23న నవరంగపూర్ నుంచి జయపురానికి తరలించారు. కేసీసీ బ్యాంక్ కొరాపుట్, రాయగడ, మల్కన్‌గిరి, నవరంగపూర్లలో తన శాఖలను విస్తరించారు. కొరాపుట్ జిల్లాలోని 14 సమితుల్లో 140 పంచాయతీల్లో గల 1944 గ్రామాలలో 10 కేసీసీ బ్యాంక్ శాఖలు 97 ల్యాంపులు నెలకొల్పారు. వాటిలో 1,28,988 మంది సభ్యులు ఉన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న నవరంగపూర్ జిల్లాలో గల ఓ సమితుల్లో 111 గ్రామ పంచాయతీలలో కేసీసీ బ్యాంక్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో నవరంగపూర్, ఉమ్మరకోట్ ప్రజలే కాకుండా 982 గ్రామాల లో 1,07,729 మంది బ్యాంక్ ఖాతాదారులుగా ఉన్నారు. ఈ జిల్లాలో 4 కేసీసీ బ్యాంక్ శాఖలతో పాటు 91 లేంపులు పని చేస్తున్నాయి. అదేవిధంగా మల్కన్‌గిరితో పాటు 1045 గ్రామాలలో కేసీసీ బ్యాంక్ తన సేవలు అందిస్తోంది. ఈ జిల్లాలో గల 4 బ్యాంక్ శాఖలు, 55 లేంపులలో 70,050 మంది ఖాతాదారులు ఉన్నారు. అదేవిధంగా రాయగడ జిల్లాలో రెండు పట్టణాలతో పాటు 2657 గ్రామాల్లో 5 బ్యాంక్ శాఖలు, 95 లేంపులలో 77,258 ఖాతాదారులు సేవలు పొందుతున్నారు. ఆ నాలుగు జిల్లాల బాధ్యతలను కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్, జయపురం నిర్వహిస్తోంది. -
భువనేశ్వర్‌లో త్వరలో ఎన్ఐఏ శాఖ ఏర్పాటు
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శాఖను త్వరలో ఒడిశాలో ఏర్పా టు చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత స్థానిక వీఎస్ఎస్ నగర్లో ఈ శాఖ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. పోలీసు సూపరింటెండెంటు హోదాతో సమానమైన స్థాయి అధికారిని ఈ శాఖ అధిపతిగా నియమిస్తారు. ఎన్ఐఏ శాఖ ఒడిశాలో నేర, ఉగ్రవాద కార్యకలాపాలను త్వరగా దర్యాప్తు చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, గౌహాతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్, జమ్మూ, చండీగఢ్, రాంచీ, చైన్నె, ఇంఫాల్, బెంగళూరు, పాట్నాలలో జాతీయ దర్యాప్తు సంస్థ 15 శాఖలను కలిగి ఉంది. పింక్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు భువనేశ్వర్: మహిళా యాత్రికులు, భక్తుల భద్రత, రక్ష ణ, మద్దతు, ఆపద సమయంలో పోలీసులు ఆసరాగా నిలిచేందుకు పింక్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. శ్రీ జగన్నాథ ఆలయం ఉత్తర ద్వారం వద్ద ఈ కేంద్రం పని చేస్తుంది. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. -
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన చైన్‌స్నాచర్
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గురండి, కాశీనగర్, పర్లాకిమిడి పట్టణంలో జనవరి మాసం నుంచి ఇప్పటివరకూ జరిగిన చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడు నవీన్ కుమార్ ఎట్టకేలకు ఆదర్శ పోలీసు అధికారుల చేతికి చిక్కాడు. ఈ వివరాలను సోమవారం ఆదర్శపోలీసు స్టేషన్లో ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పర్లాకిమిడి, కాశీనగర్, గురండి పోలీసు స్టేషన్ల పరిధిలోని ఏడోమైలు పరిధిలో మొత్తం ఐదు బంగారు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వృద్ధ మహిళలే టార్గెట్‌గా వారి వెంటనే బైక్‌పై అనుసరించి నిర్జీవ ప్రాంతంలో వారి మెడలోని బంగారు చైన్లను తెంచి పారిపోవడం నవీన్ చాకచక్యంగా చేసేవాడు. నిందితుడు ఉప్పలూరి నవీన్ కుమార్ స్వగ్రామం మందస మండలం (శ్రీకాకుళం) సొండిపూడి గ్రామమని ఎస్పీ పండా తెలియజేశారు. నిందితుడు నవీన్ కుమార్ స్థానిక పెద్ద బ్రాహ్మణవీధిలో కూడా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వస్త్రాల వ్యాపారం కూడా చేసేవాడని తెలియజేశారు. దొంగిలించిన బంగారు వస్తువులను మందస గ్రామంలో తన చెల్లెలు ఇంట్లో దాచేవాడని దర్యాప్తులో తేలిందని అన్నారు. నిందితుడు నవీన్ కుమార్‌పై పర్లాకిమిడి, గురండి పోలీసు స్టేషన్‌లోని కేసులే కాకుండా మందస, మెళియాపుట్టిలో కూడా ఉండవచ్చని పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 73.15 గ్రాముల బంగారు వస్తువులు, ఒక చరవాణి, గ్లామర్ బండి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జీఎన్ పండా తెలియజేశారు. అరెస్టయిన నిందితుడ్ని సోమవారం జిల్లా కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసి ప్రశాంత్ భూపతి, గురండి పోలీసు స్టేషన్ అధికారి ఓం నారాయన్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ పటిష్టతకు కృషి
రాయగడ: జిల్లాలో బీజేపీ పటిష్టతకు నాయకులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సమితి స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలొ కళ్యాణసింగుపూర్ సమితి బుడాగుడ పంచాయతీలోని కుంభారిగుడలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కాలీరాం మాఝి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేడీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణ సింగుపూర్ మండల శాఖ అధ్యక్షుడు అజిత్ పాణిగ్రహి, సహదేవ్ జాని తదితరులు పాల్గొన్నారు.కొరాపుట్ మున్సిపల్ కార్యాలయానికి తాళాలు కొరాపుట్: కొరాపుట్ మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లు స్వయంగా తాళాలు వేశారు. సోమవారం కార్యాలయ పని వేళల్లో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు అందరూ చేరుకుని ప్రధాన మార్గానికి తాళాలు వేశారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన మున్సిపల్ కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇలాటి ముఖ్యమైన పోస్టును ఇన్చార్జిలతో ప్రభుత్వం నడిపిస్తోంది. దీని వల్ల పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై పలుమార్లు కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. చివరకు కౌన్సిలర్లు స్వయంగా తాళాలు వేసి నిరసనకి దిగారు.ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు ఏర్పాటుభువనేశ్వర్: రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం ప్రతిపాదించి ప్రవేశ పెట్టిన పథకాల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత విభాగం మంత్రి అధ్యక్షతన 12 మంది సభ్యులతో ఈ బోర్డు కార్యకలాపాలు కొనసాగిస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల పునరావాసం, సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాల రూపకల్ప న, ఉత్తమ ప్రయోజనాల పరిరక్షణ ఈ బోర్డు ప్రధాన కార్యాచరణగా దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత విభాగం మంత్రి అధ్యక్షుడు, విభాగం కార్యదర్శి ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ మెంబరు కార్యదర్శి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, పంచాయతీ రాజ్–తాగు నీరు, గృహ నిర్మాణం–పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి–సాంకేతిక విద్య, ఉన్నత విద్య, పాఠశాలలు–సామూహిక విద్య శాఖల నుంచి ఒక్కో ప్రతినిఽధి, జిల్లా కలెక్టర్ల వర్గం నుంచి ముగ్గురు, రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌జెండర్ వర్గం నుంచి ఇద్దరు, సంఘ సంస్కర్తల వర్గం నుంచి 2 మంది చొప్పున ప్రతినిధులు బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తారు. త్రైవార్షిక ప్రాతిపదికన రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ (టీజీ) సంక్షేమ బోర్డు పని చేస్తుంది. టీజీ అభ్యర్థుల కనీస అర్హతలు ● జిల్లా స్థాయిలో నమోదు ఆధారిత గుర్తింపు కార్డు పొంది ఉండాలి. ● వయసు 25 సంవత్సరాలు పైబడాలి. ● గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. ● టీజీ వర్గంతో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. తాగునీటి సమస్యపై వినతి జయపురం: తాము తాగునీటికి కటకటలాడుతున్నామని తమ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి కాఠపొడ గ్రామ పంచాయతీ గదబగుడ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. బొయిపరిగుడ బీడీఓ కార్యాలయానికి వచ్చి మెమోరాండం సమర్పించారు. బీడీఓ లేక పోవటంతో అదనపు బీడీఓ నివేదిత దండసేనకు అందజేశారు. 200 కుటుంబాలకు రెండే బావులు ఉన్నాయని, అందులోనూ ఒకటి పాడైపోయిందని తెలిపారు. వేసవిలో తాగునీటి వసతి కల్పించాలని కోరారు. -
ఎయిడ్స్ మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ
అరసవల్లి: అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖకార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత ఆధ్వర్యంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నివారణాధికారి డాక్టర్ టి.శ్రీకాంత్ సమక్షంలో ఎయిడ్స్ మృతులను స్మరించుకుంటూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ‘ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని గుర్తుంచుకుంటాం.. మేం మాట్లాడతాం..మేం నడిపిస్తాం..’ అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ సీహెచ్,అప్పలనాయుడు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పి.మోహిని, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం, సామాజికవేత్త వెంకటస్వామి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మరోసారి పోరుబాటకు సిద్ధమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన అసంబద్ధ రీఅపోర్షన్ ఉత్తర్వులు 19, 20, 21లకు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 21న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, మజ్జి మదన్మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. 9 రకాల పాఠశాలలను తీసుకురావడం వెనుక ఉద్దేశమేంటని.. కనీసం ప్రభుత్వానికై నా తెలుసోలేదా తమకు తెలియడంలేదని ప్రశ్నించారు. అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను గందరగోళానికి నెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను మ్యాన్యువల్‌గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమన్నారు. వీటికి నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎస్.కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, పిసిని వసంతరావు, బి.రవి, బి.వెంకటేశ్వర్లు, దుప్పల శివరాంప్రసాద్, సత్యనారాయణ భాస్కరరావు, లక్ష్మణరావు, మురళి, ప్రతాప్‌కుమార్, శరత్‌బాబు, మేరీప్రసాద్, రమేష్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా
చెరువును కప్పేస్తున్నారు.. సంతబొమ్మాళి: అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే వాటికి వంత పాడుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సంత బొమ్మాళి మండల ఉపాధి ఏపీవో పంగ నరసింహమూర్తి స్వగ్రామైన చెట్లతాండ్ర గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న పెద్ద చెరువును కప్పేస్తున్నారు. టాక్టర్ల ద్వారా మట్టిని తరలించి పూర్తిగా కప్పేస్తున్నారు. ఈ చెరువులో నీరు పంట భూములకు ఎంతగానో ఆసరాగా నిలిచేదని, ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబధనలకు విరుద్ధంగా చెరువులో పనులు జరుగుతున్నా ఏపీవో పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు తప్పుపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇచ్చాపురం రూరల్: ఒకప్పుడు మండలంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు..చెట్లు, గుట్టలతో ఆహ్లాదరక వాతావరణ దర్శనమిచ్చేది. ప్రస్తుతం కొంతమంది బడా నాయకులు పంట పొలాలు చదును పేరుతో అక్రమ మార్గంలో మట్టి దందా జోరుగా సాగిస్తున్నారు. మట్టిని తరలించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి, కేశుపురం, హరిపురం, కొళిగాం, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, ఈదుపురం, అరకబద్ర, మశాఖపురం, బిర్లంగి, మండపల్లి పంచాయతీ తదితర ప్రాంతాల్లో గట్టు చప్పుడు కాకుండా పంట భూములను తవ్వేసి దర్జాగా ఇటుక బట్టీలు, ప్లాట్లకు వేసుకుంటున్నారు. తేలుకుంచి తదితర గ్రామాల పరిధిలో దేవదాయ శాఖ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. అనుమతులేవీ..? పచ్చని పంట పొలాల్లో పాగా వేసి నాలా కన్వర్షన్ చేసుకోకుండా, స్థానిక సంస్థలతో అనుమతులు తీసుకోకుండా కొందరు మట్టి తవ్వకాలు చేపడుతూ ప్లాట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించాలంటే తొలుత ఆ భూమిని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూమిగా (నాలా కన్వర్షన్) చేసుకోవాలి. మండలంలో ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు. మండలంలో సుమారు పాతిక వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటి కోసం జేసీబీ వాహనాలు ఉన్న యజమానులు ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చర్యలు తప్పవు.. సొంత పొలాల్లో సైతం మట్టి తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధం. మైనింగ్ శాఖాధికారుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేవదాయ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపితే ఎండోమెంట్ శాఖాధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలి. పంట పొలాల్లో నాలా కన్వర్షన్ లేకుండా ప్లాట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎన్.వెంకటరావు, ఇచ్ఛాపురం తహసీల్దార్ అనుమతులు లేకుండా జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు ఇటుక బట్టీలు, ప్లాట్లకు అమ్మకాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని అధికార యంత్రాంగం -
అథ్లెట్లకు ఐడీ కార్డులు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఐడీ కార్డులను అందజేయడంతో పాటు వారి ప్రగతి, గణాంకాలు, ట్రాక్ రికార్డులన్నీ అందులోనే నమోదు చేస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) విధానాలకు అనుగుణంగా ఆన్లైన్లో క్రీడాకారుల ఎంట్రీలను నమోదుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా ఎంట్రీలు జరిగేవని.. ఇకపై స్కూల్ సర్టిఫికెట్, స్టడీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంట్రీ నమోదు చేయనున్నట్లు స్పష్టం చేవారు. 2025–26 సీజన్‌కుగాను స్టేట్ షెడ్యూల్ వెలువడలేదని, వచ్చిన వెంటనే జిల్లాస్థాయి ఎంపికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, నౌపడ విజయ్‌కుమార్, బీవీ రమణ, పి.తవిటయ్య, కె.గోపి, కె.హరిబాబు, కె.మాధవరావు, సుజాత, బి.నారాయణరావు, మురళి, రామారావు, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, పాలకొండ తదితర క్లబ్స్ నుంచి పీడీలు, కోచ్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా.. అల్లర్లు, అలజడులు సృష్టించేందుకు యత్నించినా పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరించారు. నేరాల కట్టడిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఆదివారం వివిధ పోలీస్స్టేషన్లలో షీట్లు నమోదైనవారిని ఎస్‌హెచ్‌వోలు పిలిపించి మాట్లాడారు. నేర ప్రవృత్తి మాని సత్ప్రవర్తనతో మెలగాలని, కబ్జాలకు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడరాదని హితవుపలికారు. పేకాట డెన్లు నిర్వహించరాదని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించరాదని, అక్రమ రవాణా చేయరాదని చెప్పారు. కాగా, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్‌లో 39 మంది రౌడీషీటర్లుండగా, ఒకటో పట్టణ పరిధిలో 36 మంది ఉన్నట్లు సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యావ్యవస్థలో ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల వెన్నెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు భైరి అప్పారావు, తంగి మురళీమోహన్రావు, పప్పల రాజశేఖరరావు, దానేటి కేశవరావు, దుప్పల శివరాంప్రసాద్, సురేస్సింగ్, వెంకటరమణ, శ్రీనివాస్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చిలకపాలేంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆదివారం నిర్వహించారు. మొదటి షిఫ్టులో 242 మందికి 239 మంది, రెండో షిఫ్టులో 242 మందికి 239 మంది హాజరయ్యారు ఐక్యవేదిక ఉద్యమాన్ని విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఉద్యమాలలో ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి చిన్నబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కొన ఊపిరితో కొనసాగుతోందన్నారు. తొమ్మిది రకాల స్కూల్ వ్యవస్థతో గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని అనేక మంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని, పాతపద్ధతిలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వ్యవస్థలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, రేషనలైజేషన్‌లలో అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ అసిస్టెంట్లను ఎలిమెంటరీ పాఠశాలకు కేటాయించడం, రెండు మూడుసార్లు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగకపోవటం, హైస్కూల్లో సెక్షన్‌కు 54 మందిని పరిగణించడం తగదన్నారు. ఐక్య వేదిక ఇచ్చిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర విద్యాశాఖలో జరుగుతున్న అసంబద్ధమైన, అస్తవ్యస్త నిర్ణయాల పట్ల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల విద్యార్థుల మానసిక, సృజనాత్మక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు. -
బ్లడ్ బ్యాంకుల్లో.. నిల్వలు నిల్!
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిపోయాయి. దీంతో అత్యవసర వేళల్లో రక్తం అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్లు తదితర బాధితులకు రక్తం అందించలేని పరిస్థితి ఏర్పడిండి. ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయా చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. కార్యాలయాలు, గ్రామాల్లో ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా అవసరాలకు తగ్గట్లు నిల్వలు సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో కొన్ని రకాల బ్లడ్ యూనిట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయని, రక్తదాతలు స్పందించాలని కోరుతున్నారు. దాతలు ముందుకు రావాలి యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామైక్య సంఘాలు, మానవతా మూర్తులు స్పందించాలి. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. శిబిరాలు నిర్వహించడానికి అవకాశం లేని వారు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. శిబిరం ఏర్పాటు చేయదలచుకుంటే 94404 90525 నంబరును సంప్రదించాలి. – పి.జగన్మోహనరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ అత్యవసర వేళల్లో రక్తం అందక అవస్థలు రక్తదాతలు ముందుకు రావాలని నిర్వాహకుల పిలుపు -
3 సెంట్ల స్థలం.. 200 మంది జనాలు
రణస్థలం: భూ వివాదం నేపథ్యంలో రణస్థలం టీడీపీ నాయకులు బల ప్రదర్శనకు దిగారు. భారీగా మద్దతుదారులను తీసుకొచ్చి తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల.. టీడీపీ నాయకుడు, కృష్ణపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముల్లు కృష్ణ, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు మధ్య కొన్నాళ్లుగా 3సెంట్ల భూమి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వారం కింద కృష్ణ తాను కొనుగోలు చేసిన 3సెంట్ల స్థలాన్ని చదును చేస్తుండగా ఆనందరావు వర్గీయులు అడ్డుకున్నారు. స్థలం సర్వ హక్కులు తమకే ఉన్నాయని గొడవ పడ్డారు. ఈ వివాదంపై ఇరువురు జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఆదివారం కృష్ణ తన అనుచరులతో మరోసారి స్థలం బాగు చేస్తుండగా ఆనందరావు వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. ఇరువర్గాలకు చెందిన సుమారు 200 మంది జనం చేరడంతో తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పినా వినలేదు. ఎస్సై చిరంజీవి మరికొంత మంది సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. మూడు సెంట్ల స్థలం కోసం ఇంత రభస చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పత్రాలు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఇరువర్గాలకు చెప్పి పంపించేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రెవెన్యూ అంశం కావడం వల్ల తహసీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. ఎటువంటి గొడవలు పడకుండా ఇరువర్గాలపై బైండోవర్ నమోదు చేస్తున్నామని తెలిపారు. బల ప్రదర్శనకు దిగిన టీడీపీ నాయకులు రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతంపై ఎస్సై ఆగ్రహం -
అంతా ఇష్టారాజ్యం!
నౌపడలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్ సంతబొమ్మాళి: జిల్లాలో అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నౌపడలో అక్రమ లేఅవుట్ వెలిసింది. ఓవైపు సంబంధిత స్థలం విషయమై కోర్టులో కేసు ఉన్నా.. మరోవైపు కన్వర్షన్ చేయకుండా, పంచాయతీ అనుమతి లేకున్నా లేఅవుట్లోని ప్లాట్లను లక్షల రూపాయల్లో విక్రయించడానికి సిద్ధం చేసేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నౌపడలో సర్వేనెంబర్ 486–3లో 82 సెంట్లు, 486–4లో 5 సెంట్లు కలిపి మొత్తం 87 సెంట్ల విస్తీర్ణంలో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌ను వేశారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిబంధనలకు తూట్లు.. నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసేముందు వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అధికారులు అనుమతి పొందాలి. అనంతరం ప్లాట్లు వేసేముందు ప్లానింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అధికారులు లేఅవుట్లోని భూములను పరిశీలించి అనుమతులు ఇస్తారు. అలాగే సామాజిక అవసరాల నిమిత్తం 10 శాతం భూమిని పంచాయతీకి కేటాయించాల్సి ఉంది. డ్రైనేజీలు, రోడ్లు కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలి. అయితే స్థానికంగా అవేమీ కనిపించడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లో ప్లాట్లు అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. కోర్టులో కేసు.. సర్వే నెంబర్ 485–3 సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తనకు అన్యాయం చేశారని పలికిల శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పత్రాలను సైతం రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ పరిస్థితిలో లేఅవుట్ ఎలా వేశారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కన్వర్షన్ చేయలేదు.. లేఅవుట్ ఏర్పాటు చేసే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కన్వర్షన్ అయ్యాకే లేఅవుట్ పనులు ప్రారంభించాలి. నౌపడలో సర్వే నెంబర్ 486–3,4లో కన్వర్షన్ కోసం దరఖాస్తు చేయలేదు. కోర్టు పరిధిలో ఉంటే సంబంధిత పత్రాలు తహసీల్దార్‌కు అందజేయాలి. – ముంగులు, వీఆర్వో, నౌపడ అనుమతులు లేవు.. నౌపడలో వేసిన లేఅవుట్లకు ఎటువంటి పంచాయతీ అనుమతులు లేవు. ఇంతవరకు పంచాయతీ అధికారులను ఎవరూ సంప్రదించలేదు. – యు.ఉమాపతి, పంచాయతీ కార్యదర్శి, నౌపడ నౌపడలో అక్రమ లేఅవుట్ కోర్టులో కేసు ఉన్నా.. అనుమతులు లేకపోయినా అమ్మకానికి సిద్ధం -
సివిల్స్ ర్యాంకర్‌కు సత్కారం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మట్టిలో పుట్టిన మాణిక్యం రావాడ సాయి మోహిని మానస అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.ఆర్.రజినీ అన్నారు. సివిల్స్‌లో 975వ ర్యాంక్ సాధించిన రావాడ సాయి మోహిని మానసను ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్ దళిత, ఉద్యోగ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ శ్రమ, పట్టుదల, నిరంతర అధ్యయనం, తల్లిదండ్రులు ప్రోత్సాహమే నా విజయానికి కారణమని చెప్పారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు రావాడ ప్రకాశ్, ఉషారాణి, రైల్వే అధికారి కుందన రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రిటైర్డ్ జైల్ శాఖ డీఎస్పీ బత్తిన కృష్ణారావు, డాక్టర్ జగదీష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల శాఖ అధికారి కంబాల రవిరాజా, అసోసియేషన్ నాయకులు బత్తిలి మురళీకృష్ణ, పొన్నాడ రుషి, రుంకు అప్పారావు, రుంకు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
చంపాఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం
● బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి ● ఇద్దరికి గాయాలు పర్లాకిమిడి: జిల్లాలోని ఆర్.ఉదయగిరి బ్లాక్ చంపాఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ప్రైవేటు బస్సు (విక్రాంత్), ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ పరస్పరం ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బరంపురం నుంచి గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి నుంచి కెరడం గ్రామానికి వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్డింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సంజయ్ బోడోరయి ప్రాణాలో కోల్పోగా జోష్టో బోడోరయితో, రింకురయితోకు తీవ్రగాయాలయ్యాయి. వీరు వివాహా కార్డులు పంపిణీ చేయడానికి ఆర్.ఉదయగిరి నుంచి శనివారం బయలుదేరారు. క్షతగాత్రులను ఖోజురిపద ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. సంజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్.ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారి ఇంటిలో దొంగతనం
జయపురం: నందపూర్ పోలీసు స్టేషన్ పరిధి లమతాపుట్ సమితి పెట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక వ్యాపారి ఇంటిలో దొంగతనం జరిగింది. ఆ ఇంటిలో రూ.50 వేలు నగదు తో పాటు లక్షల విలువైన బంగారు నగలు, 2 మొబైల్ ఫోన్లు దొంగిలించారు. దీనిపై బాధితుడు నందపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు ఒక టీమ్‌ను నియమించారు. వ్యాపారి డొంబురు గతన్ తన ఫిర్యాదులో రాత్రి ఒంటి గంటన్నర సమయంలో తన కిరాణా షాపునకు కొంత మంది దుండగులు ముఖాలు కప్పుకొని వచ్చి సీసీ కెమెరాలు కప్పివేశారని తెలిపారు. అనంతరం ఐదుగురికి పైగా ఉన్న దుండగులు మారణాయుధాలతో ఇంటి వద్దకు వచ్చి ముందు తలుపు విరిచి లోపల ప్రవేశించారని తెలిపారు. తనను బెదిరించి డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సైంటిఫిక్ టీమ్‌తో వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుని రెండు పోలీసు టీమ్‌లతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. -
యూట్యూబర్ విచారణ
భువనేశ్వర్: పాకిస్థాన్‌తో రాష్ట్రంలో ఉన్న ఓ యువతికి సంబంధం ఉన్నట్లు ప్రసారం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్సు వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆ యువతిపై నిఘా కేంద్రీకృతం చేశారు. ఆమెతో సహా కుటుంబీకుల్ని దర్యాప్తు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విచారణ నిరవధికంగా కొనసాగుతోంది. ఆ యువతి ఇంటిలోనే దర్యాప్తు వర్గాలు అంచెలంచెలుగా విచారణ చేపడుతున్నాయి. విచారణ తుది నివేదిక ఈ గందరగోళ పరిస్థితిని తేటతెల్లం చేస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్‌కు రహస్య సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈమె గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూరీ సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ మందిరం, బీచ్‌తో సహా వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించింది. జ్యోతి మల్హోత్రా పూరీ సందర్శనలో ఆమెకు ప్రియాంక సేనాపతి సహాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రియాంక పాకిస్తాన్ వెళ్లిందని కూడా ప్రసారమైంది. ఈ విషయంపై పూరీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రియాంక సేనాపతి పూరీలోని కాళికా దేవి సాహిలో ఉంటుంది. ఈమె యూట్యూబర్ పూరీ సందర్శనలో జ్యోతి మల్హోత్రాకు సహాయం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ వార్త తనను ఉలికిపాటునకు గురి చేసిందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె తెలిపింది. తండ్రి మాటల్లో .... ప్రియాంక తండ్రి మాట్లాడుతూ తన కుమార్తెకి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రియాంక యూట్యూబర్‌గా ఉన్నప్పుడు జ్యోతి మల్హోత్రాను కలిసిందని, జ్యోతి పూరీకి వచ్చినప్పుడు, ప్రియాంక సహాయం కోరిందని, జ్యోతి మల్హోత్రా సందర్శనకు ప్రియాంక సహాయం చేసిందని తెలిపారు. ప్రియాంక కూడా వ్లాగ్ కోసం పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లిందని వివరించారు. తన కుమార్తె దర్యాప్తునకు సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తానని, అమాయకులతో పాటు సహకరిస్తానని ప్రియాంక తండ్రి తెలిపారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో తనకున్న సంబంధాన్ని ఒడియా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి స్పష్టం చేసింది. సేనాపతికి మల్హోత్రాతో సంబంధం ఉందని నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఆమె బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు మల్హోత్రా యూట్యూబ్ ద్వారా పరిచయం ఉందని, ఈ పరిచయం యూట్యూబ్ కంటెంట్ రూపకల్పనకు మాత్రమే పరిమితం అని అన్నారు. ఆమైపె (జ్యోతి మల్హోత్రా) ఉన్న తీవ్రమైన ఆరోపణల గురించి తనకు తెలియదని, ఆమె శత్రుదేశం కోసం గూఢచర్యం చేస్తుందని తెలిసి ఉంటే సంబంధం కొనసాగించేదాన్ని కాదని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక సేనాపతి ప్రకటించారు. ‘ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే, నేను పూర్తిగా సహకరిస్తాను. దేశానికే మొదటి ప్రాధాన్యత‘ అని ఆమె ముగించారు. అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణకు సహకరిస్తానన్న యూట్యూబర్ -
బీజేపీ పాలన వార్షికోత్సవానికి సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి సారిగా భారతీయ జనతా పార్టీ పాలన పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సర్కారు పాలన త్వరలో తొలి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఈ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. జూన్ 11 నుంచి 13 వరకు వరుసగా 3 రోజులపాటు వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ పథకాల విజయాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రజానీకం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు వేడుకగా నిర్వహించనున్నారు. ఈ విజయాల గురించి ప్రజలకు తెలియజేసి వివిధ విభాగాల్లో అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఈ చొరవ లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించిన రెండో సన్నాహక సమావేశం ప్రఽభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన స్థానిక ఖారవేల భవన్‌లోని సమావేశం హాల్లో జరిగింది. సమావేశంలో అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, సాధారణ పాలన, ప్రజాభియోగాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, ఇతర సీనియర్ కార్యదర్శులు, కమిషనర్లు మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. లోగడ గత నెల 25న వార్షికోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రెండో సన్నాహక సమావేశం జరిగింది. ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను ప్రదర్శించడం, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వార్షికోత్సవం లక్ష్యం. స్థానిక జనతా మైదాన్‌లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా మరియు మండల స్థాయి కార్యకలాపాలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విజగ గాథలతో ప్రగతి ప్రభ అనే పుస్తకం విడుదల చేస్తుంది. -
పూరీని విడిచి వెళ్లవద్దు
దర్యాప్తు పూర్తయ్యే వరకు పూరీని విడిచి వెళ్లవద్దని దర్యాప్తు వర్గాలు ప్రియాంకకు ఆదేశాలు జారీ చేశాయి. పూరీ జిల్లా పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుంది. ఒడిశా పోలీసులు హరియాణా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జ్యోతి మల్హోత్రాతో ప్రియాంక పరిచయం, పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సందర్శన కోణంలో విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రియాంకను పూరీ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. పాకిస్తాన్ గూఢచర్యంకు సంబంధించి బహుముఖ కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినిత్ అగర్వాల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల సంప్రదింపులతో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మరో వైపు హరియాణా పోలీసులతో సంప్రదిస్తున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
రాణిగుడఫారంలో చోరీ
రాయగడ: స్థానిక రాణిగుడఫారం డీఎఫ్ఓ రెండో కాలనీలో నివసిస్తున్న బసంత కుమార్ స్వయి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళాలను విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 12 తులాల వెండి పట్టీలు, 60 వేల రూపాయల నగదును దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైంటిఫిక్ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బసంత కుమార్ స్వయి డీఎఫ్‌వో రెండో కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం కుటుంబంతో కలిసి పనిమీద కటక్ వెళ్లాడు. ఆదివారం తెల్లవారున ఇంటి యజమాని గౌరి శంకర్ పాత్రో ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అనంతరం చొరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. -
మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు
జయపురం: స్థానిక జిల్లా కోర్టు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైనుంచి జారిపడి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముశీదాబాద్ యూశిఫ్ షేక్(20), రాయిబుల్ షేక్(28), మహ్మద్ ఆసన్(26), ఆలమిన్ షేక్(26) స్లాబ్ వేసేందుకు పనిచేస్తుండగా అకస్మాత్తుగా వెదురు విరిగి కిందకు పడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి చేర్చారు. వారు ఒక కాంట్రాక్టు కంపెనీ తరఫున పనిచేస్తున్నారు. అయితే వారికి రక్షణ పరికరాలు సమకూర్చకపోవటం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. నవరంగపూర్ సరిహద్దులో పులికూన సంచారం జయపురం: నవరంగపూర్ జిల్లా–చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక చిరుతపులి పిల్ల సంచరిస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఏసీఆర్ పోలీసు రెండో శిక్షణ కేంద్రం సిటిజేడబ్ల్యూ కాలేజ్ ప్రాంతంలో చిరుత పులి పిల్ల సంచరిస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందు వల్ల ప్రజలు భయపడుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా తారాప్రసాద్ జయపురం: జయపురం ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత తారాప్రసాద్ బాహిణీపతిని జాతీయ కాంగ్రెస్ కమిటీ ఒడిశా ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించింది. జయపురం కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాహిణీపతికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కూలిన కాల్వర్టు కొరాపుట్: కొరాపుట్–రాయగడ మధ్య కల్వర్టు కుప్ప కూలింది. ఆదివారం ఈ మార్గంలో డుమ్రిపొదర్–తోయాపుట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఒక్కసారిగా కిందకు జారింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రమాద సంకేతంగా రాళ్లు పెట్టారు. నిత్యం భారీ వాహనాలు తిరిగే మార్గం కావడంతో వాహనదారులు అప్రమత్తంగా కల్వర్టు దాటుతున్నారు. సూపర్ స్పెషలిస్ట్ క్లినిక్ ప్రారంభం జయపురం: కొరాపుట్లోగల సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రిలో శనివారం సూపర్స్పెషలిస్ట్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వి.కీర్తి వాసన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. వైద్య కళాశాల డీన్, హాస్పిటల్ అధికారి డాక్టర్ ఫ్రొఫెసర్ సుకాంత కుమార్ సాహు, హాస్పిటల్ రిజిస్ట్రార్ రంజన్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజి, న్యూరోలజి, నెఫ్రాలజి విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు, సూపర్‌స్పెషలిస్టు క్లినిక్‌ను సందర్శించారు. -
బైక్, వ్యాన్ ఢీకొని మహిళ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్పిల్‌వే సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటననలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సీబిమాన్ ఏరియా లడోలియాంబ్ గ్రామం నుంచి కమలలోఛన్ ఖోరా అతని భార్య హసమాతి ఖోరా ద్విచక్ర వాహనంపై చిత్రకొండ సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరుగు వస్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన పికాప్ వ్యాన్ బలంగా ద్వీచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పైనుంచి దంపతులిద్దరూ పడిపోయారు. హసమాతి తలకు బలమైన గాయం తగలడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఐఐసీ ముకుందో మేల్క ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హసమాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా రోదించారు. -
120 లీటర్ల మద్యం స్వాధీనం
● ఇద్దరు అరెస్ట్ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి భలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో గల పుష్పాలీ గ్రామంలో నివసిస్తున్న సుదర్శన్ దాస్ అనే యువకుడు లైసెన్స్ లేకుండా విదేశీ మద్యం విక్రయిస్తున్నాడని తెలిసి పోలీసులు ఆదివారం ఉదయం దాడి చేశారు. 50 లీటర్ల విదేశీ మద్యంతో పోలీసులకు పట్టుబడ్డాడు. మురికిగూడ గ్రామానికి చేందిన రాజేంద్ర గౌడ్ అనే యువకుడు లైసెన్స్ లేకుండా 70 లీటర్ల విదేశీ మద్యంతో పట్టుబడ్డాడు. ఇద్దరిపై కోరుకొండ ఏఎస్ఐ అజిత్ కుమార్ టాక్రీ కేసు నమోద్ చేశారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
మర్లభ ఘాటి వద్ద బస్సు ప్రమాదం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ మర్లబ ఘాటీ దిగుతుండగా ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో భువనేశ్వర్ నుంచి ఆర్.ఉదయగిరి మీదుగా పర్లాకిమిడి వస్తుండగా ఇస్పాత్ అనే ప్రైవేటు బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి. వీరిని రాయగడ బ్లాక్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వాస్పత్రికి ఉదయం తరలించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం బరంపురం మెడికల్‌కు తరలించారు. ప్రస్తుతం పర్లాకిమిడిలో కొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి రాయఘడ పోలీసు అధికారులు చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మర్లబ ఘాటి వద్ద ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయి. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆటోలకు క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్, ఓనర్ వివరాలు, ఆటో ప్రయాణించే దిశ, రోడ్డు మార్గం, లోకేషన్ తదితర పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 26 వేల ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 20 వేల ఆటోలు రవాణా లో ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు డ్రైవర్లు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్‌తో ఈ సురక్ష యాప్‌ను రానున్న రోజుల్లో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం ఈ సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్ రూపకల్పన చేసిన ఐటీ కోర్ ఏఎస్ఐ బి.రమేష్, ఉత్తమ ఆటో డ్రైవర్లు భాస్కరరావు, శ్రీనివాసరావులను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ విజయ సారధి, అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఎంవీ ఐ.గంగాధర్, సీఐలు పైడిపునాయడు, ఇమ్మనుల్ రాజు, ఈశ్వర్రావు, అవతారం, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో ఎన్సీసీ పాత్ర కీలకం
భువనేశ్వర్: క్రమశిక్షణ, వ్యక్తిత్వ నిర్మాణం, నిస్వార్థ సేవ దృక్పథంతో బాధ్యతాయుతమైన పౌరులను ఆవిష్కరించడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) శక్తివంతమైన యువ ఉద్యమని, ఈ రూపకల్పనలో నాయకత్వ లక్షణాలతో కూడిన బలమైన యువతరం వెలుగు చూస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. శనివారం స్థానిక ఓయూఏటీ ఆడిటోరియంలో రాష్ట్ర శాఖ ఎన్సీసీ డైరెక్టరేట్ నిర్వహించిన ఎన్సీసీ – ఏ ఫోర్స్ మల్టిప్లైయర్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. జాతీయ భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకారాలు, యువతరం పురోగతి, డిజిటల్ సాధనాలు, విధానాల వినియోగం తీరును వివరించారు. బలమైన సమైక్య దేశం నిర్మించడానికి ఎన్సీసీ దోహదపడుతుందన్నారు. సాయుధ దళాలతో యువత అనుసంధానం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం అంశాల్ని ఈ సదస్సు చర్చించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి యువత ప్రాధాన్యత, మహిళలకు సాధికారత కల్పించడంలో ఎన్సీసీ నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. కార్యక్రమంలో సాయుధ దళాల అధికారులు, విద్యావేత్తలు, క్యాడెట్లు, అసోసియేట్ ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. -
ఓపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా సత్యజీత్
రాయగడ: ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం చైర్మన్‌గా గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. సత్యజీత్ నియామకంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సేవాభావం అలవరుచుకోవాలి పర్లాకిమిడి: సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పేదలకు, అణగారిన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఆర్ట్ ఆఫ్ గివింగ్‌ను కిట్ విశ్వవిద్యాలయం చైర్మన్, ఫౌండర్ అచ్యుతా సామంత్ ఏర్పాటుచేశారని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాల హాలులో శనివారం ఆర్ట్ ఆఫ్ గివింగ్ సంస్థ 12వ వార్షికోత్సవాన్ని కలెక్టర్‌తో పాటు ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా ప్రారంభించారు. అనంతరం అచ్యుతా సామంత్ రాసిన ఆర్ట్ ఆఫ్ గివింగ్– ఎ వే ఆఫ్ లైఫ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి, అధ్యాపకులు సంబిత్ కుమార్ పాణిగ్రాహి, ధీరజ్ పట్నాయిక్, గిరిధర్ పండా తదితరులు పాల్గొన్నారు. కొండను ఢీకొన్న కంటైనర్ రాయగడ: కొరాపుట్ జిల్లాలోని రాలేగెడ్డ ఘాట్ రోడ్డులో ఓ కంటైనర్ అదుపు తప్పి పక్కన కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో పది పశువులు మృతి చెందగా.. డ్రైవరు, హెల్పర్లకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి కొరాపుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌లో పశువులను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా రాలేగెడ్డ మలుపులో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. -
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం
రాయగడ: ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఓపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. ఓపీసీసీ కోశాధికారిగా సిద్దార్థ్ స్వరూప్ దాస్, ఉపాధ్యక్షులుగా తారాప్రసాద్ బాహిణీపతి, రమేష్ జెన్నా, సంతక్షష్ సింగ్ సాలూజా, దేవాశీష్ పట్నాయక్, సీఎస్ రజీన ఎక్కా, లలటుందు మహాపాత్రొ, సస్మిత బెహరాలు నియమితులయ్యారు. సాధారణ కార్యదర్శులుగా అశోక్ దాస్, అప్పలస్వామి కడ్రక, ప్రఫుల్ల ప్రధాన్, మంగూ ఖిల్లా, పవిత్ర సావుంత, నీలమాధవ హికక, సువర్ణ నాయక్, సయ్యద్ యాషిర్ నవాజ్, బిజయానంద చవులియ, మధుస్మిత శెఠి, కార్యదర్శులుగా తులేశ్వర్ నాయక్, సస్మిత పండా, శిల్పశ్రీ హరిచందన్, దేవాష్మ్రిత శర్మ, లక్ష్మీధర్ సింగ్, దిలీప్ దురియా, రూపక్ తురుక్, సింహాచల్ గిరి ఉలక, మానిషా త్రిపాఠి, సక్కా సుజిత్, మోహన్ హేంబ్రమ్, అనిమా మింజ్‌లు నియమితులయ్యారు. ఓపీసీసీ అధ్యక్షుడిగా ఇదివరకే భక్తచరణ్ దాస్ నియమితులైన విషయం తెలిసిందే. ప్రసాదం పవిత్రతను కాపాడాలి భువనేశ్వర్: పూరీ జగన్నాథుని అన్న ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శ్రీ మందిరం అధికార యంత్రాంగం పేర్కొంది. స్వామి దర్శనం తర్వాత ప్రధాన దేవస్థానం సముదాయం ఆనంద బజారు ప్రాంగణంలో కొనుగోలు చేసిన మహా ప్రసాదాన్ని నేలపై కూర్చుని తినడమే ఆచారంగా వస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల స్థానిక హోటల్లో డైనింగ్ టేబుల్‌పై జగన్నాథుని మహా ప్రసాదం తింటున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఈబీసీల అభివృద్ధికి కృషి భువనేశ్వర్: వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఎస్ఈబీసీ) విద్యార్థులకు 11.25 శాతం రిజర్వేషన్లను అమలు చేసినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో వెనుకబడిన తరగతులకు విద్యాభ్యాసానికి వీలు కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేసినందుకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సూరత్ బిస్వాల్ నేతృత్వంలో ఓబీసీ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాక నిర్ణయం వల్ల వెనుకబడిన తరగతుల విద్యార్థులు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సత్కారం పర్లాకిమిడి: రాష్ట్ర సెకండరీ బోర్డు టెన్త్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన ప్రజ్యోతి చౌదురి (566/600) విద్యార్థినీ, తండ్రి నిత్యానంద చౌదురి, తల్లి నమితా చౌదురికి ఎంబీడీ పబ్లిషర్స్ తరఫున శనివారం సత్కరించారు. అనంతరం ఎంబీడీ పబ్లికేషన్స్ 2025–26 విద్యాసంవంత్సరం శాంపిల్ టెక్ట్స్ పేపర్లను పలువురికి గంజాం, గజపతి, కంధమాల్ మార్కెటింగ్ మేనేజరు నిహార్ రంజన్ పండా అందజేశారు. కార్యక్రమంలో మహాంత రామానంద దాస్, సరస్వతీ శిశు మందిర్ ఆచార్యులు దుర్గాప్రసాద్ సాహు పాల్గొన్నారు. 13 అడుగుల కింగ్‌కోబ్రా పట్టివేత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ 23 గ్రామంలోని ఓ టైర్లు మెకానిక్ షాప్‌లో 13 అడుగుల కింగ్‌కోబ్రా పాము స్థానికులను శనివారం భయపెట్టింది. షాప్ యజమాని సరోజిత్ కోయల్ పామును చూసిన వెంటనే కలిమెల స్నేక్ రిస్క్యూ వలంటీర్ రాకేష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయనతోపాటు రాజేంద్రప్రసాద్ సాహు రెండు గంటలు శ్రమించి పామును పట్టుకున్నారు. దీని పొడవు 13 అడుగులు ఉండగా ఏడు కిలోల బరువు ఉంది. అనంతరం పామును ఎంఈ–12 గ్రామ అడవిలో వదిలేశారు -
దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2024 అక్టోబర్ 21వ తేదీన నవరంగపూర్ జిల్లా తెంతులికుండ్ సమితి పాత్రోపుట్ గ్రామం మార్గంలో జరిగిన దొంగతనంలో శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సబ్బీర్ అహమ్మద్ నేడు వెల్లడించారు. 2024 అక్టోబర్ 21 వ తేదీన సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో తెంతులికుంటి సమితి పాత్రోపుట్ గ్రామం సహింసు బిశాయి బైక్ పై వెలుతున్న సమయంలో రంగమఠిగుడ గ్రామం సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను ఆపి కత్తి చూపి అతడిని దోచుకున్నారు. అతడి మొబైల్ ఫోను కూడా తీసుకు పోయారు. ఈ విషయంఫై బిశాయి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో నిందితులను గుర్తించి వారిని ఈ నెల 16 వ తేదీన అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 5 సెల్ ఫోనులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు.అరెస్టు అయిన వారు మఝిగుడ గ్రామం దిలు బర్బరి(18)బాబి హరిజన్(21) లు అని వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరచినట్లు వెల్లడించారు. నిందితులపై మరో నాలుగు దొంగతనం కేసులు ఉన్నటగ్లు అధికారి వెల్లడించారు. -
ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
రాయగడ: రానున్న వర్షాకాలంలో ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జిల్లా స్థాయి ప్రకృతి విపత్తు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్, ఎమర్జెన్సీ అధికారి మనోజ్ కుమార్ నాహక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్ మాఝి, బీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కడ్రక. పక్కనే కలెక్టర్ పట్వారీ తదితరులు -
ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
మల్కన్‌గిరి: ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమ్తంగా ఉండాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటెల్ అధ్యక్షతన శనివారం జిల్లా స్థాయి ప్రకృతి విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశంల జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలంలో నీటి ముంపు ప్రాంతాల ప్రజలకు 24/7 సేవలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, మంచినీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు, పాము, కుక్కకాటు మందులపై అధికారులు చర్చించారు. ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక శాఖ ద్వారా నీటి పంపింగ్, విద్యుత్ సరఫరాపై సమావేశంలో చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ అన్నారు. సమావేశంలో నవరంగ్‌పూర్ ఎంపీ బోలాభద్ర మాఝి, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమారీ టాంగులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గోవిందపాత్రో, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి, ఆదివాదీ సమాజ మహాసంఘ అధ్యక్షుడు బంధు ముదులీ, ఘనశ్యాం మడ్కమి పాల్గొన్నారు. -
ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: పూరీ – హతియా తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏసీ బోగీ దెబ్బతింది. నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తారు. రెంగాలి, ఝార్సుగుడ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం వేకువజాము 5.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు గల కారణం తెలియలేదు. అనంతరం రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు నిందితులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. సమీప స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ సుదూర రైళ్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వుతున్నారు. దక్షిణ్ విహార్ ఎక్స్‌ప్రెస్, రౌర్కెలా – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపైనా ఇటువంటి రాళ్ల దాడి జరిగింది. -
ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు
● ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా నరసన్నపేట: జల జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా తెలిపారు. శనివారం నరసన్నపేట వచ్చిన ఆయన స్థానిక ఆర్డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయంలో నరసన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా జిల్లాలో రూ.813 కోట్లు విలువైన 1,793 పనులను ప్రభుత్వం రెన్యూవల్ చేసిందన్నారు. రెన్యూవల్ పనుల్లో 1,546 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 800 పనులకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లు వేశారని వివరించారు. మరో 746 పనులకు టెండర్లు రావాల్సి ఉందన్నారు. వీటికి కూడా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే జిల్లాలో దాదాపుగా జల జీవన్ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 5.34 లక్షల గృహాలు ఉన్న ట్లు లెక్కలు ఉన్నాయని, వీటిలో 2.12 లక్షల గృహాలకు కుళాయిలు వేయడం జరిగిందన్నారు. వచ్చే మార్చి నాటికి కనీసం మరో 2 లక్షల గృహాలకు కుళాయిలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గొట్టా నుంచి నీటి సరఫరాకు ప్రతిపాదనలు ప్రస్తుతం గొట్టా బ్యారేజీ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని, ఇది విజయవంతంగా రన్ అవుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాలు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల ప్రజలకు కూడా గొట్టా బ్యారేజీ నుంచి తాగునీటి సరఫరాకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీంట్లో మొదటి విడతగా రూ.900 కోట్లతో నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకు అనుమతుల రావొచ్చని పేర్కొన్నారు. కాగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో ప్రస్తుతం మొదటి ఫేజ్‌లో రూ.5.15 కోట్లతో జల జీవన్ పనులు జరుగుతున్నాయని, రెండో ఫేజ్‌లో మిగిలిన భాగాలకు కుళాయిలు వేయడానికి రూ.9.06 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి నరసన్నపేటలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ రంగ ప్రసాద్, డీఈ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్టు
జయపురం: ఒక యువకుడుని హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ శనివారం తెలిపారు. అరెస్టయినవారిలో క్రిష్టియన్‌పేటకు చెందిన ఆదిత్య ఖోశ్ల, రితేష్ ఘాఢ, కొత్తవీధికి చెందిన కిరణ్ ఖొర, గోపబంధునగర్‌కు చెందిన శివ నాయిక్ ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి ఒక పదునైన కత్తి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం క్రిష్టియన్‌పేట బిజురాజ్నగర్ వాసి సమీర్ గుణియ బయటకు వెళ్లాడు. 26వ జాతీయ రహదారి లక్ష్మీ పండ కూడలి వద్ద అతను నిలబడి ఉండగా దుండగులు వచ్చి డబ్బులు అడిగారు. అతడు డబ్బులు ఇవ్వక పోవడంతో అతడిని దుర్భాషలాడి చంపుతామని బెదిరించారు. అతడు తిరగడబటంతో వారు సమీర్‌ను కత్తితో పొడిచారు. అతడి వద్దగల ఏడు వేల రూపాయలు, మొబైల్ ఫోనుతీసుకు పోయారని బాధితుడు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన సమీర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. నిందితులు నలుగురిని గాలించి పట్టుకొని అరెస్టు చేశామన్నారు. -
అపార్ట్మెంట్ నిర్మాణంపై జేసీకి ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక ఇందిరానగర్‌లో కో–ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణ పనులు గురించి జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి పంచాయతీ సర్పంచ్ బి.శంకర్, వార్డు సభ్యులు కేసీహెచ్‌బీ గుప్త, బీఎల్ శర్మ, ఆర్.శ్రీధర్‌లు తీసుకెళ్లారు. శనివారం జేసీ నర సన్నపేట పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ నిర్మాణ పనులకు అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా పనులు జరుగుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయనకు తెలియజేశారు. సుడా షార్ట్‌ఫాల్‌లో పెట్టి స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. దీనికి జేసీ స్పందించి వెంటనే సుడా అధికారులకు తన మొబైల్ నుంచి మెసేజ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మరోపక్క సుడా ఇచ్చిన స్టాప్ ఆర్డర్ ప్రకారం పనులు నిలిపివేయాల్సింది పంచాయతీ ఈవోనే అని సుడా అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రత్యేక జీవో ఉందని చెబుతున్నారు. అలాగే మరో వార్డు సభ్యుడు బోయిన సతీష్, స్థానిక నాయకులు తాలాభక్తుల గోవిందరావు, రామకృష్ణలు హోల్డ్‌లో ఉన్న బొరిగివలస రెవెన్యూ పరిధిలోని 18/1 సర్వే నంబర్‌ను సరిచేయాలని కోరారు. దీనివలన నరసన్నపేటలో 13 వీధులకు చెందిన ప్రజలు క్రయవిక్రయాలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే స్థానిక లెపర్సీ కాలనీలో మంచినీటి సమస్య ఉందని భాగ్యం, లక్ష్మిలు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈవోకు ఆదేశించారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా న్యాయ సహాయ ప్రాధీకరణ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. పురపాలక సంఘంలో సాలిడ్ వ్యర్థాల నిర్వాహణపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా న్యాయ సర్వీసుల ప్రాధికరణ ఆధ్వర్యంలో పర్లాకిమిడి పురపాలక సంఘం కాన్ఫరెన్స్ హాల్లో న్యాయ సహాయ అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. సదస్సులో పురపాలక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మణ ముర్ము, డీటీవో రవీంద్ర కుమార్ దాస్, హెల్త్ ఆఫీసర్ ఎరుకోల వెంకటరమణ, స్వచ్ఛ కార్యకర్తలు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పోస్కో, పోష్ చట్టాలు, బాల్యవివాహాల చట్టం అమలుకు పురపాలక సిబ్బంది సహకరించాలని అన్నారు. నల్సా లీగల్ ఎయిడ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనికై నల్సా టోల్‌ఫ్రీ నంబర్ 15100 డయల్ చేయాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. జిల్లా న్యాయ సహాయ ప్రాధీకరణ కార్యదర్శి బిమల్ రవుళో -
దుబాయ్ కంపెనీ చేతికి సేవా పేపర్ మిల్లు!
జయపురం: కొన్ని నెలలుగా మూతపడి ఉన్న సేవా పేపరు మిల్లు తిరిగి ఉత్పత్తి ప్రారంభించే దిశగా యాజమాన్యం పావులు కదుపుతోంది. ప్రస్తుత హైదరాబాద్ యాజమాన్యం దుబాయి కంపెనీకి నిర్వహణ అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం భువనేశ్వర్‌లో పరిశ్రమల విభాగ కార్యదర్శి హేమంత శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జయపురం సమితి గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లు రెండు నెలల్లో తిరిగి తెరిచేందుకు నిర్ణయించారు. సమావేశంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, దుబాయ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని తోటపాలేం గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన దీర్ఘాసి ఈశ్వరరావు (50) సైకిల్ మీద వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న స్కూటర్ ఈనెల 7వ తేదీన ఢీకొంది. దీంతో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వరరావు శనివారం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు నివేదిక ఆధారంగా ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో జవాన్ మృతి ఆమదాలవలస: మున్సిపాలిటీలోని ఆరో వార్డు టి.మన్నయ్యపేటకు చెందిన గొద్దు మోహనరావు (46) అనే బీఎస్ఎఫ్ జవాన్ గుండెపోటుతో మరణించాడు. న్యూఢిల్లీ లోని బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే తోటి సైనికులు మోహనరావును సమీపంలోని ఆస్పత్రికు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహం ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు, అక్కడ నుంచి స్వగ్రామానికి చేరుకోనుంది. మోహనరావుకు భార్య సంధ్య, కుమార్తె జాస్మిని, కుమారుడు శశాంక్ ఉన్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పశువుల వాహనం స్వాధీనం ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం నుంచి విశాఖప ట్నం వైపు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం రాత్రి చిలకపాలేం సమీపంలో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. 25 పశువులు అక్రమంగా తరలిస్తుండడంతో వాహనం సీజ్ చేశా రు. పశువులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. పశువులను సంరక్షణ కోసం విజయనగరం గోశాలకు తరలించినట్లు ఎస్ఐ సందీప్‌కుమార్ తెలిపారు. ఏపీఈఏపీ సెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రం యూనిట్‌గా నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్–2025 (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెలవు రోజుల్లో మినహా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా 19, 20 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిస్తారు. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు చేపడతారు. జిల్లాలో నాలుగు ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిప్టులో పరీక్షలు నిర్వహిస్తారు. అధికారులు ఈ మేరకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ, చిలకపాలేంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ, టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్‌లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎంపీసీ, బైపీసీ స్ట్రీముల్లో 18,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు నుంచే అనుమతిస్తారు. గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య కాశీబుగ్గ: పలాస మండలంలోని లొత్తూరు పంచాయతీ తొసరాడ గ్రామానికి చెందిన సవర వసంతి (22) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంటి వద్ద వసంతి ఖాళీగా ఉండడంతో తల్లి సవర మహాలక్ష్మి ఏదైనా పనిచేసుకోవాలని సూచించారు. దీంతో కోపంతో శుక్రవారం గడ్డిమందు తాగింది. దీంతో హుటాహుటిన పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
30 నుంచి మా సమిలాయి దుర్గ జాతర
రాయగడ: స్థానిక పాయికొ వీధిలో మా సమిలాయి దుర్గా అమ్మవారి వార్షిక జాతర ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ జాతరలో అమ్మవారి ఘటా లు ఊరేగింపు, ప్రత్యేక పూజలతో పాటు వివి ధ సాంసృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అమ్మవారి మందిరం ముస్తాబయ్యింది. హైకోర్టుకు వేసవి సెలవులు భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టుకు ఈ నెల 19 నుంచి జూన్ 16 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణ కోసం ఈ నెల 20, 23, 27, 30, జూన్ 3, 4, 10, 13 తేదీలలో ధర్మాసనాలు పని చేస్తాయి. సెలవుల కాలంలో ఏకసభ్య ధర్మాసనం అత్యవసర కేసుల విచారణ చేపడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. విక్రయానికి సాగర్ మట్టి జయపురం: జగన్నాథ్ సాగర్‌లో పూడిక తీసిన మట్టిని మున్సిపల్ అధికారులు విక్రయానికి పెట్టారు. సుమాు ఐదు వేల గనమీటర్ల మట్టి ఉంటుందని అంచనా వేశారు. దీన్ని విక్రయించడం ద్వారా మున్సిపాలిటికీ సుమారు రూ. మూడు లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక గనమీటర్ మట్టిని రూ. 58.50లుగా నిర్ణయించినట్టు మైనింగ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఓ ఒక ప్రకటన విడుదలైంది. జగన్నాథ్‌సాగర్ పనులు పునరుద్ధరించంటంతో ఆగర్ నుంచివచ్చిన మట్టిని వేలం వేసే బాధ్యతను మైనింగ్ విభాగానికి అప్పగించినట్టు మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి, సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి చెప్పారు. కాగా శనివారం నిర్వహించిన మట్టి వేలంలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల మధ్యే పాట సాగింది. కార్యాలయం ఆవరణలో మృతదేహం కలకలం రాయగడ: జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చంద్రపూర్‌లో ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం బయట వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు అజాంబిల సహాని (53)గా గుర్తించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సహాని నాలుగేళ్ల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చారు. శనివారం ఉదయం అయన మృతదేహం కార్యాలయం బయట పడి ఉండటంతో గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కొలువుదీరిన అగ్నిగంగమ్మ ఘటాలు రాయగడ: స్థానిక పిట్లవీధిలో ప్రారంభమైన అగ్నిగంగమ్మ అమ్మవారి పండగలో భాగంగా శనివారం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు కొలువుదీరాయి. మందిరం పక్కనే గల ప్రత్యేక గదిలో వీటిని ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన భోగాలను భక్తులు సమర్పించారు. సాయంత్రం నుంచి పురవీధుల్లో ఘటాలు ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు మామిడి పండ్లు, బియ్యం, నగదును అమ్మవారి ఘటాల్లో వేసి మొక్కుకున్నారు. -
గజరాజుల హల్చల్
● నియమగిరి అడవుల్లో 27 ఏనుగుల సంచారం ● బిక్కుబిక్కుమంటున్న పరిసర గ్రామాల ప్రజలు రాయగడ : నియమగిరి పర్వత ప్రాంతంలోని అడవుల్లో ఏనుగులు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఎప్పుడు గ్రామాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తాయో తెలియక పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని నియమగిరి పర్వత ప్రాంతాలైన సింగారి, పార్శాలి, సునాఖండి, పొలమ, ఖరొజొడ, కరంజి, టిటిమస్కా, గుమ్మ, లంబ, తొట, లేఖాపొదొరొ, డంగిమట్టి, పొట్టంగిపొదొరొ, చాటికొన గ్రామాలు ఉన్నాయి. వీరంతా డొంగిరియా తెగకు చెందిన ఆదిమజాతి ప్రజలే. రెండు రొజులుగా కలహండి అటవీ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 27 ఏనుగుల గుంపు ఇక్కడ సంచరిస్తున్నాయి. గ్రామాల పరిధిలోని మామిడి, పనస, అరటి వంటి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రాత్రివేళల్లో చొరబడి తెల్లవారే సరికి సమీప అడవుల్లోకి వెళ్లిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్నిసార్లు తాగునీటికోసం గ్రామాల్లొకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని వాపోతున్నారు. రంగంలోకి ప్రత్యేక దళం.. నియమగిరి అడవుల్లో ఏనుగుల సంచారం సమాచారం అందుకున్న కళ్యాణసింగుపూర్ అటవీ రేంజ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు రేంజర్ చందన్ గొమాంగొ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక దళం పరిశీలన చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఏనుగుల వల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా, పంట నష్టం మాత్రం ఎక్కువగానే ఉందని గుర్తించామన్నారు. వేసవి తీవ్రతకు తాగునీటిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి చేరుకుంటున్నాయని, త్వరలోనే వీటిని అడవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
తనయుడికి తలకొరివి పెట్టిన తల్లి
సంతబొమ్మాళి: కన్న కొడుక్కి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సుగ్గువానిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆకాశలక్కవ రం పంచాయతీ సుగ్గువానిపేట గ్రామానికి చెందిన పైల శాంతారావు (22) అనే యువకుడు 15 రోజు ల క్రితం వరికోత మిషన్‌తో కలిసి లారీలో వలస కూలీగా రాజమండ్రి వెళ్లారు. వరి కోతలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద డ్రైవర్ నిద్ర వస్తుందని వాహనం ఆపి నిద్రపోయారు. శాంతారావు డ్రైవర్‌కు చెప్పకుండానే లారీ కింద నిద్రపోయాడు. ఇతనిని గమనించని డ్రైవర్ గురువారం వేకుజామున లారీ తీయడంతో శాంతారావు పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చారు. తండ్రి లేకపోవడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తలకొరివి పెట్టారు. రోడ్డు ప్రమాదంపై నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమాదైనట్లు పోలీసులు తెలిపారు. -
చోరీ సొత్తు స్వాధీనం
ఎచ్చెర్ల: లావేరు మండలం పెద్దకొత్తకోట ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లో ఈ నెల 3న చోరీకి గురైన 2 తులాల 3 గ్రాముల బంగారం వస్తువులు, ఇత్తడి వస్తువులను రికవరీ చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అదపాక గ్రామానికి చెందిన ముద్దాయి పిన్నింటి చంద్రరావు (పోలారావు) పాత కుంకాం గ్రామంలో మామిడితోటలో కాపలాగా ఉండేవాడు. తోడల్లుడు, మరో వ్యక్తితో కలిసి ఈ నెల 3న పెద్దకొత్తకోట గ్రామానికి వెళ్లి దొంగతనం చేశారు. డీఎస్పీ వివేకానంద ఆదేశాల మేరకు సీఐ అవతారం, లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, సిబ్బంది రంగంలోకి దిగి క్లూస్‌టీం ఇచ్చిన సమాచారంతో చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రరావు వద్ద ఇత్తడి సామాన్లు, అతని భార్య, మరదలు వద్ద బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చంద్రరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదపాకలో పాత నేరస్తులు చాలా మంది నేరాలు చేయడం మానేసి కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారని, కానీ కొందరు తిరిగి నేరాలు చేయడం ప్రారంభించారని చెప్పారు. దీనివల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇలాంటి వ్యవహారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయనతో పాటు లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
కుప్పకూలిన ఉపాధి వేతనదారుడు
టెక్కలి: సీతాపురం పంచాయతీ వలియాసాగరం గ్రామంలో శుక్రవారం ఉపాధి పని చేస్తున్న పైల ధనుంజయరావు ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ధనుంజయరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఏపీఓ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని వేతనదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే పంచాయతీలో ఇటీవల క్షేత్ర సహాయకుడి తొలగింపు విషయంలో రాజకీయం ప్రమేయం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్చార్జి క్షేత్ర సహాయకుడు నియామకం విషయంలో మండల స్థాయి అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేశారంటూ పలువురు వేతనదారులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో సీతాపురం పంచాయతీ ఉపాధి హామీ పనుల్లో మరోసారి రచ్చ చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నరసన్నపేట నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తున్న లాగేజ్ వ్యాన్ హరిశ్చంద్రాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఎన్.ఉమా, పి.లోకేష్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశీలన, పరిశుభ్రతతో డెంగీ నివారణ
భువనేశ్వర్: ప్రాణాంతక డెంగీ మహమ్మారిని సులభ రీతిలో నివారించడం సాధ్యమేనని ప్రముఖులు ప్రబోధించారు. రాష్ట్ర స్థాయి జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకుని ఆరోగ్య శాఖ ప్రముఖులు ఈ విషయాన్ని వివరించారు. పరిశీలన, పరిశుభ్రతతో డెంగీ నివారణ ఈ ఏడాది నినాదంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంపొందించి ప్రభావవంతమైన డెంగీ నివారణ వ్యూహాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిందని తెలిపారు. స్థానిక కంబైండ్ హెల్త్ డైరెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వర్చువల్ మాధ్యమంలో పాలుపంచుకున్నారు. వెక్టర్ బోర్న్ డిసీజెస్ అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రభా కర్ సాహు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా, అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రమీల బొరాల్, వైద్య విద్య శిక్షణ సంస్థ అదనపు డైరెక్టరు డాక్టర్ బ్రజకిషోర్ దాస్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డెంగీ నివారణలో సమాజ భాగస్వామ్యం యొక్క అవసరాన్ని ప్రజారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జితేంద్ర మోహన్ బబర్త తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డెంగీ నివారణ నినాదం, చైతన్య సందేశంలో చైతన్య రథం సేవల్ని ప్రముఖులు ప్రారంభించారు. -
రైలు ఢీకొని యువతి మృతి
రాయగడ: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువతి మృతి చెందింది. మృతురాలు సదరు సమితి పరిధిలొని కొత్తపేటకు చెందిన సబియా మాఝి (18)గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సబియ కొత్తపేటకు సమీపంలోని వీరనారాయణపూర్కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మధ్యలో ఉన్న ట్రాక్‌ను దాటుతుంది. అదే సమయంలో రైలు రావడాన్ని చూసి పట్టాలు దాటేందుకు పరుగెత్తగా కాలి చెప్పు ఒకటి ఉండిపోయింది. దానిని తీసుకెళ్లేందుకు వెళ్లగా అదే సమయంలో రైలు ఆమెను ఢొకొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రబీ ధాన్యం కొనుగోలు చేయలేదని రైతుల ఆందోళన మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఈ ఏడాది రబీ పంటల సాగుకు కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రెండో పంట కలిసి వస్తోంది ఆశపడ్డా రు. ధాన్యం పంట బాగా కలిసి వచ్చింది. అయితే నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మార్కెట్లో ధర పలకడం లేదని కోరుకొండ సమితి రైతులు తమ అవేదన వ్యక్తం చేశారు. మల్కన్‌గిరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ధాన్యం ధర క్వింటా రూ. 3,100 ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేయడం లేదు. ప్రధానం మల్కన్‌గిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో పొలాల్లో నే ధాన్యం మూలుగుతున్నాయి. వీటికి రైతు కుటంబసభ్యులంతా పొలాల్లోనే కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబా టు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకో వాలని రైతుల కోరుతున్నారు. పాత నేరస్థులపై నిఘా టెక్కలి: టెక్కలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా వేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం టెక్క లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో దత్తత కానిస్టేబుల్, మహిళా పోలీసుల సమన్వయంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. కానిస్టేబుల్‌కు వడదెబ్బ కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యుగంధర్ శుక్రవారం బందోబస్తు విధుల్లో ఉండగా ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించా రు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాణసంచా దుకాణంలో చోరీ ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఇబ్రహింబాద్ పంచాయతీ పరిధిలో కింతలి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్లో ప్రవేశించి తాళాలు పగల కొట్టి లాకర్లోని నగదు చోరీ చేశాడు. రూ.10 వేలు వరకు నగ దు ఉంటుందని యజమానులు చెబుతున్నా రు. శుక్రవారం ఉదయం షాపు వద్దకు వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో యజమా ని వావిలపల్లి శ్యామలరావు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం
భువనేశ్వర్: ఒడిశా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమని, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడితే ఎదుగదల అసాధ్యమని, అందుకే రాష్ట్రాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. తయారీకి అవసరమైన ముడి పదార్థాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర పారిశ్రామికీకరణ సామర్థ్యా న్ని సఫలీకృతం చేసుకుని ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మలచడం సులభతరమేనని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. రాష్ట్రం ఖనిజ ఉత్పత్తులను వ్యాట్ విధానాన్ని అవలంబించింది. వ్యవస్థాపకత ద్వారా వేగవంతమైన పారిశ్రామికీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. ఖనిజ వనరులతో తులతూగే రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి జాతీయ ఖనిజ వనరులలో రాష్ట్ర వాటా 41.9 శాతంతో అగ్రగామిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. స్థానిక ఓయూఏటీ కృషి శిక్షా సదన్‌లో శుక్రవారం నిర్వహించిన ఓఎంసీ 70వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సుకు ఓఎంసీ బలమైన పనాదిగా నిలిచింది. ప్రకృతిపరమైన ఖనిజ వనరులను బాధ్యతాయుతంగా అన్వేషిస్తూ క్రమబద్ధీకరణతో తవ్వకాలు చేపట్టి ఈ సాఫల్యత సాధించిందని అభినందించారు. ఓఎంసీ 60 దశకంలో కేవలం రూ. 1 కోటి ఆర్థిక లావాదేవీలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 23,600 కోట్ల ఆర్థిక లావా దేవీల స్థాయికి చేరిందని అన్నారు. ఈ లావాదేవీ పూర్తిగా ఖనిజాల ఉత్పత్తి, అమ్మకం ద్వారా సాధ్యం చేసుకుందన్నారు. నేడు జాతీయ స్థాయిలో ఖనిజ ఉత్పత్తి కంపెనీలలో ఓఎంసీ 5వ అగ్ర స్థానంలో ఉందని, దేశ వ్యాప్తంగా లాభాలను ఆర్జించే ఆదర్శ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా స్థిరపడిందని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మార్గదర్శిగా నిలిచి దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బొడొబిలొ డుబుణ ఇనుప ఖనిజ గనులు, తిరింగి కొండ ప్రాంతంలో గనులు తవ్వకం పునఃప్రారంభించారు. ఈ ప్రాంతంలోని రెంగాలిబెడా ఆర్ఆర్ కాలనీకి విద్యుత్ సరఫరా, కొయిడా మైనింగ్ ప్రాంతంలో ఉన్న ఓఎంసీ గనుల లో 900 కిలో వాట్ పీక్ సోలార్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కంపెనీ పనితీరును మరింత మెరుగుపరచడానికి నాలుగు ఐటీ విభాగా లు స్థాపించినట్లు ప్రకటించారు. వాటిలో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్), ఓఎంసీ ఫైనా న్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎఫ్‌ఎంఎస్), ఓఎంసీ ప్లాట్ ల్యాండ్ యుటిలైజేషన్ సిస్టమ్ (ఓప్లస్) మరియు ఓఎంసీ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్ట మ్ (ఓఆర్ఎంఎస్) వంటి మాడ్యులర్ సిస్టమ్‌లు ఉన్నాయి. 2023–24, 2024 –25 సంవత్సరాలకు ఉత్తమ మైనింగ్ రంగం, ఉత్తమ గని, సురక్షితమైన గని అనే మూడు విభాగాలలో ముఖ్యమంత్రి అవా ర్డులను అందజేశారు. 3 విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ముఖ్యమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సీఎస్ఆర్ ఆధారిత కార్యక్రమాల ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక రంగం ముఖచిత్రం ఆవిష్కరణతో ఓఎంసీ పాత్రను ప్రసంశించారు. నేటి నుంచి ఓఎంసీ ఆధీనంలో 18 గనులు పనిచేయడం ప్రారంభించాయని అన్నారు. ఈ చర్య ఖనిజాలను ఉత్పత్తి చేయడంతో బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్ర ఆవిష్కరణకు పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓఎంసీ అధునాతన తయారీ, అత్యాధునిక సాంకేతికత ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తుందన్నారు. సహజ వనరులను సద్వినియోగపరచుకుని బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థకు ఎదిగామని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ అన్నారు. ఓఎంసీ నిరంతర అభివృద్ధ్ధి ప్రక్రియలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో నిమగ్నం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గనులు, ఉక్కు శాఖ అదనపు ప్రధా న కార్యదర్శి, ఓఎంసీ చైర్మన్ సురేంద్రకుమార్, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సుధాంశు మోహన్ సమ ల్, కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఓఎంసీ 70వ వ్యవస్థాపక దినోత్సవం బొడొబిలొ ’డుబునా’ ఇనుప ఖనిజ గని పునఃప్రారంభం -
మురపాకలో నాలుగు పూరిళ్లు దగ్ధం
ఎచ్చెర్ల: లావేరు మండలం మురపాకలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గార రాములమ్మ, లావేటి లక్ష్మీ, మామిడి ఈశ్వరరావు, లావేటి రాములమ్మలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాన్లు, రూ.70 వేలు నగదు, బంగారం కాలిపోయాయి. అందరూ ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ముందుగా లావేటి రాములమ్మ ఇంటివద్ద మంటలు చెలరేగి వరుసగా ఉన్న ఇల్లు కాలిపోయాయి. స్థానిక యువత స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపుచేశారు. లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ప్రతినిధి పెయ్యిల లక్ష్మణరావు నాలుగు ప్యాకెట్లు బియ్యం, రూ.2 వేలు తక్షణ సహాయం అందించారు. ఎంపీటీసీ ప్రతినిధి తేనెల సురేష్, స్థానిక నాయకులు మడ్డి కనకయ్య, జల్లేపల్లి శారది తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
పర్లాకిమిడి: ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ప్రాణా లు కోల్పోయిన వీర సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పర్లాకిమిడి కాంగ్రెస్ కార్యాల యం ఎదుట శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను మట్టికరిపించిన అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వర్ చంద్ర మఝి, సంజయ్ అధికారి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాస్మిన్ షేక్ సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయ ణ పాత్రో, అశోక్ అధికారి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పనులు పూర్తయ్యేనా?
సగం భూమి పోయింది.. తాతలతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి 3 ఎకరాలు. ఇందులో ఎకరాన్నర భూమి రిజర్వాయర్‌లో కలిసి పోయింది. ఇల్లు పోయింది. 2008లో ఎకరాకు రూ.2.30 లక్షలు ఇచ్చారు. అవి అప్పుడే ఖర్చయిపోయాయి. ఉన్న భూమి వదల్లేను. ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు. – దాసరి తాతారావు, రైతు, రేగులపాడు, పలాస మండలం వచ్చే ఏడాదికి నీరు నిల్వ వచ్చే ఏడాది జూన్‌కల్లా ఆఫ్‌షోర్‌లో 0.521 టి.ఎం.సిలు నీటిని నిల్వ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆఫ్‌షోర్ సామర్ధ్యం 1.864 టి.ఎం.సిలు. అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. రోజుకు 8000 క్యూబిక్ మీటర్ల మట్టిపనిని చేస్తున్నాం. ఇప్పటి వరకు 45 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.శేఖరబాబు, ఈఈ, వంశధార ప్రాజెక్టు పలాస: మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎప్పటికప్పుడు పనులు ప్రారంభించడం.. కొన్నాళ్లు కొనసాగడం.. తర్వాత నిలిచిపోవడంతో పరిపాటిగా మారింది. అరకొర నిధులు నేపథ్యంలో ఈసారి కూడా పనులు పూర్యయ్యేది అనుమానమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్వద్ద ఎర్త్‌బండ్ పనులు జరుగుతున్నాయి. 17 ఏళ్లుగా కొనసాగుతూ.. రేగులపాడు నుంచి నందిగాం, మెళియాపుట్టి మండలాలకు ఆర్.ఎం.సి, పలాస మండలానికి ఎల్.ఎం.సి కాలువల ద్వారా మొత్తం 24,500 ఎకరాలకు సాగునీరు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు 2008లో రూ.128 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులకు రూ.456 కోట్లు అంచనా వేశారు. అయినా పనులు మాత్రం జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2021లో ఈ పనులకు రూ.850 కోట్లు అంచనా వేసి పనులు ప్రారంభించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసాలు కల్పించారు. రిజర్వాయర్ సంబంధించిన పనులు కూడా కొంతమేర జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓటాన్ అకౌంట్ బడ్జెటులో రూ.30 కోట్లు కేటాయించారు. తాజాగా ఇప్పుడు మరో రూ.90 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఎర్త్ బండ్ పనులు ప్రారంభమయ్యాయి. మెళియాపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయ నది నుంచి వరద కాలువను 13.6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులో 7 కిలోమీటర్ల పని పూర్తి చేశారు. మిగిలినది అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం ఎర్త్ బండ్ పనులతో పాటు కుడికాలువ మెయిన్ కెనాల్ పనులతో పాటు వరదకాలువలో డీవాటరింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు, సుమారు 17 ఏళ్లు పూర్తవుతున్నా నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల సమస్యలు ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాల్సిందే. ఎట్టకేలకు ఆఫ్‌షోర్ పనులు పునఃప్రారంభం అంచనాలు పెరగడమే తప్ప పూర్తికాని వైనం ఎక్కడికక్కడే నిర్వాసితుల సమస్యలు -
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సరిహద్దున ఉన్న బైపారగూఢ పంచాయతీ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నయాగడ నుంచి మల్కన్‌గిరి వస్తున్న ఓ వాహనం చెట్టును ఢీకొట్టి నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వేసవి సెలవులు కావడంతో నయాగడ నుంచి బంధువుల ఇంటికి సుజిత్ కుమార్ సింగ్ సామంత్ (45), పద్మినీ సింగ్ సామంత్ (42), ప్రియాంశు (10), అంబికాబానా దాస్(65), శశి బెహర (65) గురువారం బయల్దేరారు. వీరు మల్కన్‌గిరిలో ఉంటున్న ప్రదీప్ కుమార్ సింగ్ సామంత్ ఇంటికి వస్తున్నారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా కారు చెట్టును ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డ్రైవర్ విభూతి భూషన్ బెహర నిద్రమత్తులో చెట్టును ఢీకొన్నట్టు గుర్తించారు. మృతులు విభూతి భూషన్ బెహర (44), అంబికా బానా దాస్, శశి బెహర మృతదేహాలను బపారగూఢ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రులను కొరాపూట్ లక్ష్మణ్ నాయిక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పద్మినీ ఆస్పత్రిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మల్కన్‌గిరి నుంచి ప్రదీప్ కుమార్ సింగ్ సామంత్, బావమరిది రాజేంద్ర జెన సామంత్ ఇద్దరు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైపారగూఢ పోలీసులు సంఘటనపై కేసులు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. -
ఆర్థిక సాయం అందజేత
రాయగడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్లోచన్ పండ కుటుంబానికి రాయగడ ప్రెస్ యూనియన్ ఆర్థిక సాయం అందించింది. ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు అమూల్య రత్న సాహు, కార్యదర్శి శివాజీదాస్, యూనియన్ ముఖ్య సలహాదారుడు సురేష్ దాస్లతో పాటు సభ్యులు శుక్రవారం అతని స్వగ్రామం ఖిలింగిలో కుటుంబ సభ్యులను కలిసి రూ.40 వేలు అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఆక్రమణలు తొలగింపు రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. సమితి కార్యాలయానికి అనుకొని ఉన్న సుమారు 20 దుకాణాలను అధికారులు తొలగించారు. మునిగుడ తహసీల్దార్ ఎం.అనురాధ ఆదేశానుసారం అదనపు తహసీల్దార్ సుభేందు సాహు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు మధ్య ఈ తొలగింపు కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. అయితే గత కొనేళ్లుగా ఇక్కడ చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వ్యాపారులు తమకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించాలని కోరారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా వీరు తీసుకెళ్లారు. అయితే సమితి కార్యాలయంతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా ఉన్న ఈ దుకాణాలను తొలగించాలని ఇదివరకే వ్యాపారస్తులకు ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ, అందుకు స్పందించకపోవడంతో ఈ తొలగింపు కార్యక్రమం అనివార్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.నాటుసారా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు జయపురం: నాటు సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు జయపురం అబ్కారిశాఖ అధికారి హిరన్ సుబ్రత్ శుక్రవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి గొడొపొదర్ గ్రామానికి చెందిన భాస్కర హరిజన్, పాత్రోపుట్ వాసి ఘాశీ గొలారిలుగా గుర్తించామన్నారు. తెలిగుడ, పాత్రోపుట్ గ్రామాల్లో దాడులు నిర్వహించగా 21 లీటర్ల సారాతో ఇద్దరూ పట్టుబడినట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.మైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు జయపురం: బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాష చంద్రరౌత్ శుక్రవారం వెల్లడించారు. అరెస్టు అయిన వ్యక్తి కొరాపుట్ నాయిక కాలనీ నివాసి సునీల్ ఖొరగా వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపినట్లు చెప్పారు. బాధితురాలైన బాలికను శిశు సురక్షా కమిటీ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం జయపురం పట్టణం మైనర్ బాలిక గత ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంభ సభ్యులు బయపడ్డారు. వారు అన్ని చోట్ల వెతికినా బాలిక జాడ తెలియక పోవటంతో లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లభించిన ఆధారాల మేరకు మైనర్ బాలికను కనుగొన్నారు. సునీల్ బాలికను అపహరించి అత్యాచారం జరిపినట్లు గుర్తించారు. -
అకాల వర్షాలకు ‘రాష్ట్ర నిర్దిష్ట విపత్తు’ గుర్తింపు
● 10 శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేటాయింపుభువనేశ్వర్: ఏటా ప్రకృతి విపత్తులతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటుంది. ప్రధానంగా రైతుల వెతలు వర్ణనాతీతం. ఈ విపత్కర వాతావరణ పరిస్థితి ప్రభావాన్ని విపత్తుగా గుర్తించి విపత్తు స్పందన సహాయం ప్రకటించాలని బాధిత వర్గం దీర్ఘ కాలంగా అభ్యర్థిస్తోంది. వీరి అభ్యర్థనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇది రైతులకు కొంత మేరకు ఊరట కలిగించింది. తరచుగా విస్తృతమైన పంట నష్టాన్ని కలిగించే అకాల వర్షాన్ని రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆమోదించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అకాల వర్షాల కారణంగా పంటలకు జరిగిన నష్టానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డీఆర్ఎఫ్) నుంచి సహాయం పొందగలుగుతారు. ఎస్డీఆర్ఎఫ్ వార్షిక కేటాయింపులో గరిష్టంగా 10 శాతం వరకు నిధుల్ని అకాల వర్షాల నష్ట పరిహారంగా చెల్లించేందుకు అనుమతించడం విశేషం. గత ఏడాది డిసెంబర్ నెలలో అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో 22 వేల 791 హెక్టార్ల విస్తీర్ణపు పొలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ విపత్తుకు 6 లక్షల 66 వేలకు పైగా రైతులు ప్రభావితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా ప్రత్యేక రాష్ట్ర విపత్తుగా ప్రకటించి పీడిత వర్గానికి ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో రైతులకు సాగు పెట్టుబడి సబ్సిడీ రూపంలో రూ. 291 కోట్ల సహాయం అందజేసి ఆదుకుంది. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో అకాల వర్షాలను శాశ్వతంగా రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. దీని కోసం రైతులకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి సహాయం అందుతుందని అభయం ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది విపత్తులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా గుర్తించింది. వాటిలో పిడుగుపాటు, వడగాడ్పులు, సుడి గాలులు, భారీ వర్షం, పడవ ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, పాము కాట్లు చోటు చేసుకున్నాయి. అకాల వర్షాన్ని ఈ జాబితాలో చేర్చడంతో రాష్ట్ర నిర్దిష్ట విపత్తుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్రాన్ని ప్రభావితం చేసే తుఫానులు, కరువులు, భూకంపాలు, వరదలు వంటి ప్రముఖ జాతీయ విపత్తులు కేంద్ర ఆమోదం పొందిన విపత్తుల జాబితాలో కొనసాగుతున్నాయి. ఆ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత వర్గాలకు సముచిత సహాయ సహకారాలు అందుతున్నాయి. -
పిడుగు పడి ముగ్గురు దుర్మరణం
జయపురం: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి ఒడియపెంట పంచాయతీ పొరిడిగుడ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడి ముగ్గురు మృతి చెందగా.. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వర్షం పడుతున్న సమయంలో వారు ఓ గుడిసెలో తల దాచుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడడంతో అందులో ఉన్న ముగ్గురూ మృతి చెందారు. మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. చనిపోయిన వారిలో బుద్దా మండంగి(60) ఆమె మనుమరాలు కొశా మండంగి(18)తో పాటు కుంబారిగుడ గ్రామానికి చెందిన అంబిక (35) ఉన్నారు. హింగు మండంగి అనే మరో మహిళ గాయపడ్డారు. ఆమెను లక్ష్మీపూర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల కిందట కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి అంపావల్లి పంచాయితీ ప్రాంతంలో పిడుగు పడి ముగ్గురు మరణించిన విషయం విదితమే. ఆ సంఘటన మరుకవ ముందే లక్ష్మిపూర్ సమితిలో ఈ సంఘటన జరిగింది. -
కొరాపుట్‌లో ‘ఎయిమ్స్’ ఏర్పాటు చేయాలి
జయపురం: కొరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) శాటిలైట్ కేంద్రం ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క కోరారు. గురువారం భువనేశ్వర్‌లో ఎయిమ్స్ పదవ ప్రతిష్టా సమావేశంలో ఎయిమ్స్ సభ్యులైన భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షొడంగి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్కలు పాల్గొన్నారు. ఎయిమ్స్ భువనేశ్వర్ సమగ్ర వికాసం, ఉత్తమపాలన, ఉత్తమ వైద్య సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో ఎయిమ్స్ శాటిలైట్ కేంద్రం ఏర్పాటు చేయాలని కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను సమావేశం ఆమోదించిందని ఉల్క తన సొంత సోషల్ మీడియాలో సూచన ప్రాయంగా వెల్లడించారు. అతిత్వరలోనే కొరాపుట్ లోక్‌సభ పరిధిలో ఒక ఎయిమ్స్ శాటిలైట్ కేంద్రం ఏర్పాటు జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బాలేశ్వర్‌లో ఇటువంటి సెటలైట్ కేంద్ర ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. ఎంపీ సప్తగిరి శంకర ఉల్క విజ్ఞప్తి -
పెంపుడు తల్లి హత్య
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ప్రేమ మైకంలో..పర్లాకిమిడి: ప్రేమ మైకంలో ఓ యువతి తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది. ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు. పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.న్యూస్‌రీల్ పర్లాకిమిడి తెలుగు సొండి వీధిలో ఘటన ఇద్దరు నిందితుల అరెస్టు, కోర్టుకు తరలింపు -
యువకుడి దారుణ హత్య
భువనేశ్వర్: కొబ్బరి బొండాల వివాదం పూరీ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రాణాల్ని బలిగొంది. ఈ వివాదంతో మొషాణీ చండీ గుడి దగ్గర బీభత్సమైన హత్యాకాండ చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి కున్నా బెహరా అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కక్షదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడు చనిపోయాడు. ఈ సంఘటనపై లిపున్ భోయ్, కొంత మంది సహచరులపై ఫిర్యాదు నమోదైంది. కొబ్బరి బొండాల కోత కారణంగా హత్య జరిగిందనే ఆరోపణ బలంగా వ్యాపించింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక బసేలి సాహి ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. -
అగ్ని గంగమ్మ పండగ ప్రారంభం
● ఆహా.. ఏం హాయివేసవి తాపంతో జనజీవనం అల్లాడిపోతోంది. మూగజీవాలు కూడా ఎండకు తాళలేకపోతున్నాయి. హిరాకుడ్ వన్య ప్రాణుల మండలం సంబల్పూర్ జంతు ప్రదర్శన శాలలో ఈ దృశ్యం తారసపడింది. చల్లని ఐసు దిమ్మను అక్కున చేర్చుకుని ఈ భల్లూకం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతోంది. చూపరులను ఈ దృశ్యం ఆకట్టుకుంది. – భువనేశ్వర్రాయగడ: స్థానిక పిట్టలవీధిలోని అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక పండగ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. సాయంత్రం అమ్మవారి పాదా లు తీసుకువచ్చే కార్యక్రమంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక కేఎన్కే సమీపంలోని అమ్మవారి పాదాల గుడి నుంచి సాంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం మందిరంలో పాదాలను ఉంచ డంతో పండగకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల పాటుగా జరగనున్న ఈ పండగలో భాగంగా ఆఖరి రోజున మల్లెలు (అగ్గిపై నడవడం) తొక్కే కార్యక్రమం ప్రధాన ఘట్టం. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పండగలో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. హిందూ, ముస్లింలు కలసి ఈ పండగను ప్రతీ ఏడాది జరుపుతుండడం విశేషం. -
పరాక్రమ విజయ దివస్ ర్యాలీ
పర్లాకిమిడి: ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత భారత సేనలకు అభినందనలు తెలియజేస్తూ గజపతి జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్ ‘పరాక్రమ విజయ దివస్’ పేరిట గురువారం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన ర్యాలీలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి హైస్కూల్ జంక్షన్, మార్కెట్, పాతబస్టాండు, కొత్త బస్టాండు, ప్యాలెస్ మీదుగా ఫారెస్టు కార్యాలయం వరకూ ఈ మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ పరాక్రమ విజయ దివస్ ర్యాలీలో ఏడీఎం ఫాల్గుణ మఝి, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక అధికారి లక్ష్మణ ముర్ము, తహసీల్దార్ నారాయణ బెహారా, డీసీపీయూ అరుణ్‌కుమార్ త్రిపాఠి, జిల్లా క్రీడా కోఆర్డినేటర్ సురేంద్ర పాత్రో తదితరులు పాల్గొన్నారు. రాయగడ: ఆపరేషన్ సిందూర్ విజయవంతమవ్వడంతో పట్టణంలొ గురువారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన పరాక్రమ యాత్రలో భాగంగా నిర్వహించిన బైకు ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ పరూల్ పట్వారి కలెక్టర్ కార్యాలయం ఎదుట జెండా ఊపి ఈ కార్యక్రమానికి శుభారంభాన్ని పలికారు. అనంతరం బైకు ర్యాలీ పట్టణంలో గల సమితి కార్యాలయం మీదుగా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి యూటర్న్ తీసుకుని మెయిన్ రోడ్డు మీదుగా స్థానిక గాంధీపార్క్ వరకు కొనసాగింది. ర్యాలీలొ సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా పాల్గొన్నారు. జయపురం: దేశ సమైక్యత, సంఘీభావానికి గురువారం జయపురంలో మునిసిపాలిటీ నేతత్వంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పరాక్రమ శోభాయాత్ర అద్దం పట్టింది. మన దేశ రక్షణలో తామంతా ముందుంటామని ప్రజలు నినాదాలు చేశారు. వేలాది ప్రజలతో నిర్వహించిన బైక్ ర్యాలీని ఒడిశా ఆర్థిక మంత్రి సురేష్ పూజారి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గోండ్, కామర్ష్ , ట్రాన్స్పోర్ట్, స్టీల్, మైనింగ్ మంత్రి భిభుతి భూషణ జెన, ఫిషరీష్, యానిమల్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్‌ప్రీనియర్స్ మంత్రి గోకులానంద మల్లిక్‌లు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పరాక్రమ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నెక్షా షోరూం బరిణిపుట్ నుంచి బయలు దేరిన శోభాయత్ర పట్టణంలో ప్రధాన రహదారుల మీదుగా విక్రమవిశ్వవిద్యాలయం క్రీడా మైదానం చేరుకుంది. విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన సభలో రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి వీర సైనికులకు నివాళులర్పించేందుకు శోభాయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, జయపురం సబ్ కలెక్టర్ అక్కవర శొశ్యా రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమర్ మహంతి తదితరులు పాల్గొన్నారు. మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో గురువారం స్థానిక బిజూ పట్నాయిక్ ఇండోర్ స్టేడియం నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకు త్రివర్ణ యాత్ర నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ త్రివర్ణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 200 మీటర్ల జాతీయ జెండాతో త్రివర్ణ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి డిఐపిఆర్ఓ ప్రమిళా మాఝి తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
శ్రీకాకుళం రూరల్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినక ర్ పుండ్కర్ అన్నారు. సంసిద్ ఆదర్శ్ గ్రామ యోజ నలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండల పరిధి లోని నైరా గ్రామంలో గురువారం పర్యటించారు. స్థానిక సచివాలయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక శాఖలపై సమీక్షించారు. స్థానిక రైతు లు పండిస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధిపై ఆరా తీశారు. పాడిపంటలు, వ్యవసాయ ఉత్పత్తులు మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీడీఓ బి.శైలజ, నైరా సర్పంచ్ అరవల రామ్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏఈపై కలెక్టర్ ఆగ్రహం.. ఎలక్ట్రికల్ ఏఈపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సూర్యఘర్ పథకానికి ఎన్ని కనెక్షన్లు ఏర్పాటు చేశారని, విద్యుత్ కెపాసిటీ, ప్రతిపాదనలు ఏమేరకు నిర్వహించారని ప్రశ్నించగా ఏఈ సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఏఈని సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాభసాటి ఉత్పత్తులపై దృష్టి సారించండి నైరా గ్రామ సందర్శనలో కలెక్టర్ -
బైక్ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల–మల్కన్‌గిరి ప్రధాన రహదారి ఖిల్గూఢ గ్రామం కూడలి వద్ద గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డుడుమేట్ల పంచాయతీ డంగాగూఢ గ్రామానికి చెందిన పరదేశీ హల్వా, భీమ హల్వా ఒక బైక్‌పై వస్తున్నారు. నూవగూఢ గ్రామానికి చెందిన సంభారు మాడీ బైక్‌పై నుంచి పడిపోయారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేరుగైన వైద్యం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోరుకొండ ఏఎస్ఐ ప్రదీప్ కుమార్ ఖీలో ఇతర సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై చర్యలు
రయగడ: రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్రనాయక్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని కలెక్టర్ సమావేశం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఆర్టీఓ శివశంకర్ చౌదరి, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై సంబంధిత అధికారుల దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రధాన రహదారుల్లో ప్రమాద నివారణ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా రేడియం లైట్లు, తదితరమైనవి అత్యవసరంగా ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక బాకురు గుడ వద్ద గల నాగావళి ప్లానిటోరియం సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు షాపింగ్ మాల్ల వద్ద ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ తనిఖీలు. ట్రాఫిక్ బంధనలు ఉల్లఘించిన వారిపై కొరఢా ఝలిపిస్తున్నామని ఆర్టీఓ శివశంకర్ చౌదరి అన్నారు. ఈ ఏడాది ఏప్రెల్ నాటికి అతివేగంగా వాహనాలు నడిపే 15 మందిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే 965 మందికి జరిమానా విధించి వారి వద్ద రూ.9.65 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపే 294 మందిని గుర్తించి వారి నుంచి రూ. 3.2 లక్షలు జరిమానాను విధించామని వివరించారు. ఇతరత్ర నియమాలు ఉల్లంఘించిన మరో 233 మంది వద్ద రూ.1.81 లక్షలను వసూలు చేశామన్నారు. -
‘జగన్నాథ దామా’ పేరు పెట్టడం తగదు
జయపురం: పశ్చిమబెంగాల్లోని దిగాలో నిర్మించిన జగన్నాథ్ మందిరానికి జగన్నాథ్ దామా అని పేరు పెట్టడాన్ని ఉత్కళ సమ్మిళిని కొరాపుట్ జిల్లాశాఖ తీవ్రంగా వ్యరేకించింది. గురువారం జయపురం ఉత్కళ సమ్మిళిని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బినోద్ మహపాత్రో మాట్లాడారు. హిందూ, సనాతన ధర్మం ప్రధాన గురువు ఆదిశంకరాచార్యుల సమయంలో దేశంలో నాలుగు దామాలు ఉండేవన్నారు. వాటిలో ఒకటైన పూరీ జగన్నాథ్ దామం ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు. దిగాలో నిర్మించిన జగన్నాథ మందిరానికి జగన్నాథ్ దామా అని నామకరణం చేయటం తగదన్నారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ జగన్నాథ క్షేత్రం ఒక విశ్వాసం, ఒక ధర్మ పీఠమన్నారు. ప్రపంచంలో అన్ని చోట్లా జగన్నాథ మందిరాలు నెలకొల్పారని, మందిర ప్రతిష్టపై ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దిగాలో నిర్మించిన జగన్నాథ మందిరానికి జగన్నాధ్ దామం అని పేరు పెట్టడం మంచిది కాదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మోహణ చరణ మఝి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరవింద పాడీ, పూరీ గజపతికి లిఖత పూర్వకంగా తెలియజేయటాన్ని ఉత్కళ సమ్మిళిని స్వాగతిస్తుందని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి వెంటనే కలుగుజేసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉత్కళ సమ్మిళిని జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పరమేశ్వర పాత్రో పాల్గొన్నారు. -
రైలు ఢీకొని యువకుడికి గాయాలు
కాశీబుగ్గ: కాశీబుగ్గ ఎల్సీ గేట్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అపస్మారక స్థితిలో విశ్రాంత ఉద్యోగి శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం ఓ ప్రయాణికుడు దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు గమనించారు. వెంటనే కాంప్లెక్స్ ఔట్‌పోస్ట్ హెచ్‌సీ ఎన్.శ్రీనివాసరావుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన వచ్చి పక్కనే ఉన్న దుస్తులను పరిశీలించగా ఆధార్‌కార్డు, ఫోన్ నంబరు లభించాయి. వాటి ఆధారంగా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామానికి చెందిన తులసీదాస్ వెంకటస్వామి మల్లపురెడ్డిగా గుర్తించా రు. విశ్రాంత ఉద్యోగి అని, కుటుంబ సభ్యులు ముంబైలో ఉంటున్నట్లు తెలుసుకుని వారికి సమా చారం అందించారు. ఇటీవల కంచిలి మండలం పెద్దపోలేరులో జరిగిన పండగలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించి 108 రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ సెక్యూరి టీ గార్డు జి.రామారావు తదితరులు ఉన్నారు. -
18 కేజీల గంజాయి పట్టివేత
కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి 18 కేజీల 550 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సుజిత్ సూర్జియా అనే వ్యక్తి గుణుపూర్ నుంచి పలాస మీదుగా బరంపురం వెళ్లే ఉమా ఎక్స్‌ప్రెక్స్ బస్సుకు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. పర్లాకిమిడికి చెందిన పుస్కో పొరిచా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పొరిచా తాను ఇచ్చే గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేయమని సుజిత్ కు చెప్పగా అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు 18.550 కేజీల గంజాయిని తరలిస్తుండగా పలాసలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. సుజిత్‌తో వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు. -
అంబోదళలో దాహం కేకలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబోదళలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో బుధవారం మహిళలంతా కలిసి పంచాయతీ కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలిపారు. అంబోదళలో పాయికో, గౌడ వీధుల్లో 150కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరి తాగునీటి సౌకర్యార్థం ఉండే సోలార్ గొట్టపుబావి గత మూడేళ్లుగా మరమ్మతులకు గురయ్యింది. అదేవిధంగా ఉన్న రెండు గొట్టపు బావుల్లో ఒకటి పాడైపోయింది. దీంతో తాగునీటికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పందించిన పంచాయతీ అధికారులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
యాత్రికులకు అస్వస్థత
● మృతి చెందిన వృద్ధురాలు ఇచ్ఛాపురం: తీర్థయాత్రకు బయల్దేరిన చిత్తూరు వాసులకు విషాదం ఎదురైంది. యాత్రికులు అస్వస్థతకు గురి కాగా ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా, పె ద్ద పంజాని మండలం పరిధి లో గోనుమాకన్నపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన 46 మంది ఓ ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా ఈ నెల 8న తీర్థయాత్రలకు బయల్దేరారు. దారిలో స్వయంగా భోజనాలు సిద్ధం చేసుకుని తినేవారు. కాశీ, అయోధ్య దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 13న సాయంత్రం ఒడిశా స మీపించేసరికల్లా వీరిలో 30 మందికి వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. గురువారం ఇచ్ఛాపురం చేరుకునేసరికి ఇంకా ఎక్కువ మంది అస్వస్థతకు గుర య్యారు. దీంతో వీరు అదే బస్‌లో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరారు. వీరిలో పిచ్చుగల్లు మునిలక్ష్మమ్మ (69) ఆస్పత్రికి వచ్చేలోపే చనిపోయారని వైద్యులు పి.దేవేంద్రరెడ్డి తెలిపారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వా రు కోలుకుంటున్నారు. మృతురాలి చెల్లి తోటి గంగులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేశారు. -
విద్యార్థుల కోసం కొత్త ఒప్పందం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ఈ నేపథ్యంలో ఇర పక్షాలు అనుబంధ దస్తావేజులపై సంతకాలు చేసి అంగీకారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యవంశీ సూరజ్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల సమక్షంలో సమక్షంలో విభాగం మండల కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అరవింద్ అగర్వాల్, భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు, ఒప్పంద పత్రంపై సంతకాలు చేసి అవగాహన కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో వివిధ కళాశాలల అధ్యక్షులు, విద్యార్థులు వర్చువల్ చానెళ్ల ద్వారా హాజరయ్యారు. ఈ అవగాహన ఒప్పందంపై (ఎంఓయూ) సంతకం చేయడం వల్ల రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించి ఆర్థిక అక్షరాస్యత మెరుగదల సాధ్యమవుతుంది. దీనితో పాటు, విద్యార్థులు భవిష్యత్‌లో వివిధ ఉపాధి అవకాశాలను కూడా పొందగలుగుతారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు రెండు రకాల కోర్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. ఇవి విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా వారి ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తాయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీని వల్ల విద్యార్థులు భవిష్యత్‌లో ఆర్థిక రంగంలో వివిధ ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలు కలుగుతుంది. ఆర్ట్సు, సైన్స్, కామర్స్, వివిధ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కొత్త కోర్సులు కలిసి వస్తాయి. ఈ కోర్సులు విద్యార్థులకు సంప్రదాయ కెరీర్లను కొనసాగించడానికి అవకాశాలను అందించడమే కాకుండా, కొత్త కెరీర్ ప్రణాళిక, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని మంత్రి వివరించారు. గురువారం జరిగిన భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంతో కుదిరిన అవగాహన ఒప్పందం రాబోయే రోజుల్లో విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అదనంగా జాతీయ విద్యా విధానం – 2020 ఆధారంగా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిని నిర్ధారించడం ద్వారా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని ఉన్నత విద్యా మంత్రి సూర్యవంశీ సూరజ్ అభిప్రాయపడ్డారు. -
రూ.కోట్లు వృథా.. తీరని వ్యధ!
● చుక్కనీరివ్వని కడగండి రిజర్వాయర్ ● రైతులకు తప్పని ఇక్కట్లు ● స్పందించని పాలకులు, అధికారులు కడగండి జలాశయంకు కుడి, ఎడమ కాలువల నిర్మా ణం పూర్తయితే ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి మండలా ల్లోని 580 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం జంబాడ, వలసపాడు, బొర్రంపేట, ముంగెన్నపాడు, కరకవలస, మల్లికార్జునపురం, శ్యామలాపురం, కుశమల పాడు రెవెన్యూ గ్రామాల్లోని పంట భూములకు సాగునీరు అంతుంది. కుడి కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం వలసపాడు, బొర్రంపేట, జంబాడ, సరుబుజ్జిలి మండలంలోని గోనెపాడు, అమృతలింగానగరం, బప్పడాం, సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. కడగండి రిజర్వాయర్ ఎల్.ఎన్.పేట : కడగంటి జలాశయం.. రెండు మండలాల రైతుల చిరకాల స్వప్నం. ఈ జలాశయం నిర్మాణం పూర్తయి రెండు దశాబ్దాలు కావస్తున్నా కుడి, ఎడమ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో కళ్ల ఎదుటే నీరు వృథాగాపోతున్నా ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో రైతులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులకు, అధికారులకు వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే వారేరీ? ఎల్.ఎన్.పేట మండలం జంబాడ–బొర్రంపేట గ్రామాల మధ్య కొండల మధ్య నుంచి కడగండి గెడ్డ ప్రవహిస్తుంటుంది. కొండల్లో కుండపోతగా వర్షం కురిస్తే కడగండి గెడ్డ వారం పాటు నిండుగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతానికి వృథాగా వెళ్లిపోతుంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు అందిస్తే వంద ల ఎకరాలు సశ్యశ్యామలం అవుతాయని, రెండు పంటలను పండించుకోవచ్చని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జూలై 20న జలయజ్ఞంలో భాగంగా ‘నీటి పారుదల శాఖ ప్రత్యేక పరిశోధనా విభాగం, ఐఆర్‌డీఎఫ్–9’లో రూ.195.16 లక్షలు (సుమారు రూ.2కోట్లు) నిధులు మంజూరు చేశారు. 580 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 81 ఎకరాల్లో చేపట్టిన జలాశయం నిర్మాణం పనులు 2007 నాటికి పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణం కోసం 2008లో టెండర్లు పిలిచారు. భూసే కరణ చేయకపోవటంతో కాలువ పనులు నిలిచిపోయాయి. 2009లో వైఎస్సార్ మరణానంతరం రిజర్వాయర్‌ను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నిధులున్నా నిర్లక్ష్యం.. రిజర్వాయర్‌కు కుడి, ఎడమ కాలువల నిర్మాణంతో పాటు రైతుల వద్ద సేకరించి భూమికి పరిహారం చెల్లించాలని రైతులు అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో గతంలో రూ.4.06 కోట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.1.45కోట్లు భూసేకరణ కోసం, రూ.1.72 కోట్లు, కాలువల నిర్మాణం కోసం మిగిలిన నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. రిజర్వాయర్ లోపలి భాగంలో భూములు ముంపు బారిన పడుతున్నాయని, వాటిని ముంపు నుంచి తప్పించేందుకు గట్టు పెంచేందుకు రూ.89 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన పనులు గాలికి వదిలేశారు. 580 గ్రామాలకు సాగునీరు.. ఇప్పటికై నా స్పందించాలి.. కడగండి జలాశయం నిర్మా ణం పనులు పూర్తి చేసి 20 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు సెంటు భూమికి కూడా చుక్కనీరు అందలేదు. రిజర్వాయ ర్ నిండినా నీరు వృథాగా పోతుంది. దిగువన పంట భూములు నీట మునిగి రైతులు నష్ట పోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కాలువల పనులు పూర్తి చేయాలి. – మామిడి నీలంనాయుడు, రైతు, బొర్రంపేట, ఎల్.ఎన్.పేట -
పరలా వీధి ఘటనలో మరో ఇద్దరు మృతి
పర్లాకిమిడి: పట్టణంలో రెండోవార్డు పరలా వీధిలో బుధవారం శుభాషిష్ పాణిగ్రాహి కుటుంబం విషం తాగి బలవర్మణానికి పాల్పడిన సంఘటన పాఠకులకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో కోడుకు బిజయానంద పాణిగ్రాహి (7) మృతి చెందగా, కూతురు ప్రియదర్శిని(11), తండ్రి శుభాషిష్లను బరంపురం మెడికల్‌కు తరలించారు. అయితే గురువారం ఉదయం బరంపురం మెడికల్‌లో చికిత్స పొందుతూ కూతురు ప్రియదర్శిని పాణిగ్రాహి (11), తండ్రి శుభాషిష్ కూడా మృతి చెందినట్టు ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. పిడుగులు పడి 9 పశువులు దుర్మరణం జయపురం: పిడుగులు పడి 9 పశువులు దుర్మరణం పాలయ్యాయి. ఈ సంఘటన చందాహండి సమితి పటఖలియ గ్రామంలో బుధవారం జరిగింది. బుధవారం సాయంత్రం వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో కొంత మంది పశువుల కాపర్లు ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. హఠాత్తుగా పిడుగులు పశువులపై పడ్డాయి. దీంతో ఆవులు, ఎద్దులు, ఆవుదూడలు మరణించినట్లు తెలిసింది. రాజకోట గ్రామం మానసింగ్ గౌఢకు చెందిన రెండు ఎద్దులు, బదలిపాణి గ్రామం అందారు శాంత ఒక ఆవు, ఆవు దూడ, మిశ్ర శాంత పదన శాంతల ఒక్కొక్క ఎద్దు, పాత్ర శాంత ఆవు, ఆవుదూడ, అలాగే రాజేంధ్ర శాంతకు చెందిన ఎద్దు మరణించాయని పటఖలియ గ్రామం పంచాయతీ మాజీ సర్పంచ్ హర పూజాయి వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల అరెస్టు మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెలలో నివాసం ఉంటున్న సత్యవతి అనే మహిళ సైబర్ మోసానికి గురయ్యారు. కొన్ని రోజుల కిందట ఆమెకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి లాటరీలో స్కూటీ గెలిచారని చెప్పారు. మరో ఇద్దరితో కూడా మాట్లాడించి స్కూటీ కోసం రూ.10500 చెల్లించాలని చెప్పారు. దీంతో ఆమె ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించారు. ఆ తర్వాత వారు ఫోన్ ఎత్తకపోవడంతో బాధితురాలు ఏప్రిల్ 24 న బలిమెల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ కేసు నమోద్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందతులు జగత్సింగిపూర్ జిల్లా బొరికిన గ్రామానికి చెందిన వారుగా తెలియడంతో అక్కడకు వెళ్లి బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నిహార్ రంజాన్ సాహు, సుశీల్ మహంతి, నారాయణ సేనాపతిలపై కేసు నమోద్ చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ముగిసిన ఉత్సవాలు రాయగడ: జిల్లాలోని రామనగుడ గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. గత ఐదు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి వేషధారణలో ఆదివాసీ మహిళ గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ప్రత్యేక ఘట్టంగా గుర్తింపు పొందింది. అమ్మవారి ప్రతిరూపమైన ఖండా (కత్తి)ని చేతపట్టుకుని మహిళ ఊరేగింపులో పాల్గొంది. ఈ సమయంలో అమ్మవారి పాదాలు తాకితే ఎటువంటి దుష్టశక్తుల దరిచేరవన్న నమ్మకంతో ఆ ప్రాంత వాసులు, ముఖ్యంగా చిన్నపిల్లలను నడిచే మార్గంలో పడుకోబెట్టారు. వారిని దాటుకుంటూ కత్తి పట్టుకుని మహిళ నడుచుకుంటూ వెళ్లిన ఘటంతో ఉత్సవాలు ముగిశాయి. -
మాశ్యామకాళీ ఊరేగింపు
పర్లాకిమిడి: పట్టణంలో మాస సంక్రాంతి సందర్భంగా కాయగూరల మార్కెట్‌ను గురవారం బంద్ చేశారు. మాశ్యామకాళీ విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థి కాంగ్రెస్ శక్తి మార్చ్ భువనేశ్వర్: రాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్ గురువారం శక్తి మార్చ్ కార్యక్రమం నిర్వహించింది. దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆ శాఖ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ తెలిపారు. 1971లో భారత దేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాకిస్తాన్‌ను రెండు భాగాలుగా విభజించి బంగ్లాదేశ్ ఆవిష్కరణతో పాకిస్తాన్‌కు ఖంగు తినిపించారు. వర్ధమాన పరిస్థితుల్లో అందుకు భిన్నంగా అమెరికా ఒత్తిడితో వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడం విచారకరమని అన్నారు. అప్పట్లో ఇందిరా గాంధీపై అమెరికా ఒత్తిడి తెచ్చిన మన దేశ వ్యవహారాల్లో వేరొకరి ప్రమేయం అవాంఛనీయమని దేశ గౌరవ ప్రతిష్టలకు పట్టంగట్టారని తెలిపారు. అందుకే రాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం మార్చ్ నిర్వహించినట్లు వివరించారు. ముగిసిన పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీజీ సెట్ –2025 దరఖాస్తులు స్వీకరణ గడువు ముగిసింది. మా ర్చి 31న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రూ. 2000 అదనపు రుసుముతో ఈ నెల 20 వరకు, రూ. 4000 అదనపు రుసుము తో 24 వరకు, రూ.10,000 అదనపు రుసుము తో 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీరిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు కూడా ఏపీ పీజీసెట్ – 2025 ద్వారానే నిర్వహిస్తారు. నేడు డెంగీ అవగాహన ర్యాలీ అరసవల్లి: జాతీయ డెంగీ నివారణ దినోత్స వం సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాల యం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి పి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత బృందం ఈ ర్యాలీని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏడు రోడ్ల కూడలి లో ప్రతిజ్ఞ అనంతరం కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. రైలు ఢీకొని ఆవు మృతి టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులో రైల్వే గేటు సమీపంలో గురువారం రైలు ఢీకొని ఆవు మృతిచెందింది. గుణ్‌పూర్ నుంచి పూరి వైపు వెళ్తున్న రైలు టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి పట్టాలపైకి ఆవు రావడంతో ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో ట్రైన్ ఇంజిన్‌కు చెంది న కొన్ని భాగాలు సైతం విరిగి పడ్డాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. టెక్కలి ఎంజేపీ విద్యార్థినికి ప్రశంసలు టెక్కలి: టెక్కలి ఎంజేపీ ఏపీ బాలికల పాఠశాలకు చెందిన జె.నవ్య ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ లో జరిగిన అభినందన సభలో ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పూసపాటి సుధారాణి తెలిపారు. బీసీ సంక్షేమ శాఖామంత్రి ఎస్.సవిత, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఎంజేపీ ఏపీ పాఠశాలల సెక్రటరీ మాధవీలత, పూర్వపు సెక్రటరీ కృష్ణమోహన్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. -
నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్
భువనేశ్వర్: నేతాజీ ధైర్యం అజేయమని, అఖండ భారత దేశం కోసం దృఢమైన సంకల్పంతో భారత జాతీయ సైన్యం నాయకత్వం, స్వేచ్ఛాయుతమైన, లోతైన జాతీయ నైతిక విలువల్ని నిక్షిప్తం చేసుకుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి కొనియాడారు. గురువారం కటక్ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. భారత దేశపు వర పుత్రుల్లో ప్రముఖునిగా నేతాజీ సుభాష్ చంద్రబోసు జీవన సాఫల్యం నిత్యం చైతన్య జ్యోతిగా ప్రజ్వలిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీ జన్మ స్థల భవన సముదాయం వెలుపల, లోపల ఉన్న విగ్రహం, ఫొటో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. -
ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులే వారధులు
భువనేశ్వర్: మండలాలు ప్రభుత్వ పాలన సాఫల్యత ప్రతిబింబింప జేసే అద్దాలని, ప్రజలు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందడం ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనం అవుతుందని సీఎం మోహన్ చరణ్ మాఝి అన్నారు. గురువారం స్థానిక లోక్ సేవా భవనన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రముఖ అభివృద్ధి అధికారులు (సీడీఓ), మండల అభివృద్ధి అధికారులు (బీడీఓ) సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేయడంపైనే ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. అన్ని అభివృద్ధి పనులు ప్రజలకు అక్కరకు దోహదపడితే మండల, జిల్లా స్థాయి పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. ఈ దిశలో సీడీఓ, బీడీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ముఖ్యమైన పాత్రధారులని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్ మినహా మండల స్థాయిలో ప్రముఖ అభివృద్ధి అధికారులు, మండల అభివృద్ధి అధికారులు ప్రధాన బాధ్యతను నిర్వహించడం అనివార్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు ప్రజల కోసమేనని, అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటి వారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ముఖ్య సేవకుడిగా భావించి ప్రజాసేవకు కృషి చేస్తున్నట్లు అధికారుల్ని ప్రోత్సహించారు. అవినీతి లేదా నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలు గ్రామాల అభివృద్ధి లేకుండా దేశం అభివృద్ధి చెందదని ప్రబోధించారని అన్నారు. బాపూజీ దార్శనికత ఆధారంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.. ప్రభుత్వ ప్రణాళికలను ప్రజలకు సరిగ్గా చేరదీసి కొత్త ప్రభుత్వ పాలన విధానం దృక్పథం మరియు బాధ్యతాయుత భావానికి సీడీఓ, బీడీఓలు సారథ్యం వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, పంచాయతీరాజ్ మరియు తాగు నీటి శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి గిరీష్ ఎస్ఎన్, తాగునీరు, పారిశుధ్య శాఖ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్, 30 జిల్లాల ముఖ్య అభివృద్ధి, 314 మండలాల అభివృద్ధి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎక్కడి వాహనాలు అక్కడే..
● కొత్తరోడ్డు–నందగిరిపేట మధ్య ట్రాఫిక్ జామ్ ● వందల సంఖ్యలో నిలిచిన వాహనాలు ● ఎండలో ప్రజల నరకయాతన ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన శ్రీకాకుళం–పాలకొండ–పార్వతీపురం రహదారి బుధవారం స్తంభించిపోయింది. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు నాలుగు లైన్ల రోడ్లుగా ఇటీవల అభివృద్ధి చెందుతున్న ఈ రహదారిలో పలుచోట్ల కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. ఇదే క్రమంలో ఆయా గ్రామాల పరిధిలో అమ్మవార్ల పండగలు బుధవారం జరగడంతో భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా కొత్త రోడ్డు సమీపంలోని చర్చి వద్ద ఉన్న ప్రధాన కాలువ కల్వర్టు పనులు కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఇక్కడ నిత్యం వాహనాలు నిలిచిపోతున్నాయి. రాయిపాడు జంక్షన్ వద్ద కల్వర్టు ఒకవైపు తవ్వకాలు జరపటం చర్చి వద్ద ఉన్న కల్వర్టు ప్రాంత పక్క రహదారిని మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే రహదారి సమీపంలో ఆమదాలవలస మండలం వంజంగి, గట్టుముడిపేట గ్రామాల్లో అమ్మవారి పండుగలు నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి కొత్త రోడ్డు ప్రాంతం నుంచి నందగిరిపేట వరకు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. బస్సులు, లారీలు, కార్లలో గంటల తరబడి ఉండిపోయారు. ఆసుపత్రులకు రోగులను తరలించే అంబులెను్ుస్ల సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. సుమారు మూడు గంటల పాటు ద్విచక్ర వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రధాన రహదారిపైకి వచ్చి భారీ వాహనాలను కొత్త రోడ్డు నుంచి సింగుపురం వైపు చింతాడ మీదుగా తరలించడంతో కొంతమేర ఊరట లభించింది. -
ఉద్దాన విధ్వంసాన్ని సహించేది లేదు
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజల ఆస్తులను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టి పచ్చని ఉద్దాన ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో బుధవారం కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుపచ్చ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కార్గో ఎయిర్‌పోర్టు పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రజల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయులుగా చేయడం సరికాదన్నారు. ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడిపంటలను నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి సాగిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మేలును ఆకాంక్షిస్తే వెంటనే కార్గో ఎయిర్‌పోర్గ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఉద్దాన ప్రజలకు మేలు కలిగించే ఉద్దాన పంటల ఆధారిత పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, శివారు భూములకు సాగునీరు అందించే పనులపై దృష్టిపెట్టాలన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మౌనం వీడి ఉద్దాన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీడి రైతు పోరాట కమిటీ అధ్యక్షుడు తెప్పల అజయ్‌కుమార్, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కోనారి మోహన్‌రావు, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి, కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు కుసుమ, దానేష్, చలపతి, పి.అరుణ, ధర్మారావు, జోగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
తవ్వేస్తున్నారు!
దర్జాగా.. ● గోవిందపురం కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలింపు ● అనుమతులు లేకపోయినా టిప్పర్ల ద్వారా రవాణా ● ఇదేంటని ప్రశ్నించిన సర్పంచ్‌పై దురుసు ప్రవర్తన సంతబొమ్మాళి: మండలంలోని గోవిందపురం సర్వే నెంబర్ 71లో కొండపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా దౌర్జన్యంగా టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. లక్షల రూపాయలను సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తరలింపుపై ప్రశ్నించిన స్థానిక సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు నిర్వాహకులు విశ్వసముద్రం సంస్థ ద్వారా మూలపేట పోర్టు పనులకు గ్రావెల్‌ను తరలిస్తున్నామని చెబుతున్నారు. ఆర్డర్ కాపీ చూపించాలని కోరగా..ఆర్డీవో వద్దకు వెళ్లి అడగండంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి సర్వే నెంబర్ 71లో ఉన్న ఈ కొండను గ్రామానికి చెందిన మండపాక నర్సింగరావు 2020–30 సంవత్సరం వరకు లీజుకు తీసుకున్నారు. ఏటా హెక్టార్‌కు రూ.65వేలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు లీజుదారు చెబుతున్నారు. తనకు లీజుకిచ్చిన గ్రావెల్ కొండను ఇతరులు తరలించుకుపోతున్నారని జిల్లా మైన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం ఏడీ అశోక్ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. సీజ్ చేసిన గంటలోపే మళ్లీ గ్రావెల్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ గ్రావెల్‌ను తరలించుకుపోవడంపై విమర్శఽలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. న్యాయపోరాటం తప్పదు.. కింజరాపు కుటుంబీకుల కనుసన్నల్లోనే గ్రావెల్‌ను ఎటువంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. లీజుదారుడైన నన్ను సంప్రదించకుండా దౌర్జన్యంగా గ్రావెల్ తీసుకెళ్తున్నారు. జిల్లా మెన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాను. – మండపాక నర్సింగరావు, లీజుదారుడు, వల్లేవలసదురుసుగా సమాధానం.. అక్రమంగా గ్రావెల్ తరలించుకుపోవడంతో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాను. మీకు ఎటువంటి అనుమతులు ఉన్నాయో పత్రాలు చూపించండని కోరాం. ఆర్డీవో దగ్గర పర్మిషన్ ఆర్డర్ ఉంది వెళ్లి చూసుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. – ఆర్.రామిరెడ్డి, సర్పంచ్, గోవిందపురం -
సమస్యలు పరిష్కరిస్తే సహకరిస్తాం
జయపురం: తమ సమస్యలు పరిష్కరిస్తేనే యాజమాన్యానికి సహకరిస్తామని గగణాపూర్ సేవా పేప రు మిల్లు రెండు కార్మిక యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. బుధవారం ప్రథమ, ద్వితీయ యూనియన్ల నేతలు జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్ బృందావన సెట్టికి, జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. 2020 ఫిబ్రవరి 26వ తేదీన మిల్లు అమ్మకం సమయంలో జరిగిన బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మిల్లులోని నాలుగు యూనియన్లు కలిసి ఒక వర్కింగ్ కమిటీ ఆఫ్ యూనియన్స్గా ఏర్పడి సమస్యల పరిష్కారానికి పోరాడామన్నారు. అయి తే ప్రస్తుతం యాజమాన్యం రెండు యూనియన్లతో కార్మికులను పీడిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మిక నేతలు ప్రదీప్ పంజియ, సరోజ్ సు వార్, వంశీధర మహుంకుడో, కె.సత్యనారాయణ, అలేక్ పాత్రో, ఉమా శతపతి, రోహిత్ థోమస్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
పర్లాకిమిడి: తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను విషంతాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రెండో వార్డు పరలా వీధిలో నివాసముంటున్న శుభాషిస్ పాణిగ్రాహి బుధవారం ఉదయం ఏదో కారణం వలన తన కు మార్తె ప్రియదర్శినీ పాణిగ్రాహి (11), కుమారుడు బిజయానంద పాణిగ్రాహి (7)లకు విషం ఇచ్చాడు. అనంతరం తానుకూడా విషం సేవించాడు. వీరు మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో పో లీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో విషంతాగి అచేతనంగా నురగలు కక్కుతూ ముగ్గురూ పడి ఉండడం గమనించి స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం కుమారుడు బిజయనందన్ పాణిగ్రా హి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అ యితే తండ్రి శుభాషిస్, కూతురు ప్రియదర్శినీ ఆరో గ్యం విషమించడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. ఇంతకుముందు శుభాషిస్ భార్య కుటుంబ కలహాల వలన మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఈబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకటన
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మాఝి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల్లో ఎస్ఈబీసీ విద్యార్థులకు 11.25 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో ప్రవేశా ల్లో సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఎస్ఈబీసీ కేటగిరీ విద్యార్థు లు ప్రవేశాల్లో 11.25 శాతం సీట్ల రిజర్వేషన్ పొందుతారు. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రి మండలి తాజా తీర్మానంతో విద్యా సంస్థల్లో సమగ్ర రిజర్వేషను పరిమితి 56 శాతానికి చేరింది. -
నరేంద్ర పుష్కరిణిలో యువకుడు మృతి
భువనేశ్వర్: పూరీలోని పవిత్ర నరేంద్ర పుష్కరిణిలో బుధవారం మధ్యాహ్నం విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నానం చేస్తుండగా ఒక యువకుడు మునిగిపోయాడు. అతని వివరా లు తెలియాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ యువకుడు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం స్నానం చేయడానికి పుష్క రిణిలోకి దిగాడు. తిరిగి ఒడ్డుకు చేరుకోలేక సతమతం అయ్యాడు. ఈ విషయం స్థానికులు అగ్నిమాపక దళానికి తెలియజేశారు. వారు పుష్కరిణిలో గాలింపు చర్య నిర్వహించి నీట మునిగిన యువకుడిని ఒడ్డుకు చేర్చారు. తక్షణ మే పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తీసుకుని వచ్చినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. గతేడాది ఇలాంటి రెండు సంఘటనలు నమోదు అయ్యాయి. ఆకాశవాణి ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్ కవిటి: బెనారస్ హిందూ యూనివర్సిటీలో మృదంగం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇటీవల నిర్వహించిన ఆడిషన్లో ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా అర్హత సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయని సత్యవరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం కవిటి మండలం కుసుంపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నారాయణపురం ఆయకట్టుకు నిధులు మంజూరు ఎచ్చెర్ల క్యాంపస్: ఖరీఫ్‌లో సాగునీటి సమస్య పరిష్కారానికి నారాయణపురం ఆయకట్టుకు రూ.34.63 లక్షల నిధులను జలవనరులు శాఖ అధికారులు మంజూరు చేశారు. జంగిల్ క్లియరెన్స్, ఇసుక పొరల తొలగింపు, షట్టర్లు, మదుముల మరమ్మతులకు ఈ నిధులు వినియోగిస్తారు. సజావుగా సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇసుక వాహనాలు సీజ్ కొత్తూరు: మండలంలోని అంగూరు ఇసుక ర్యాంపు(ఆకులతంపర) వద్ద బుధవారం జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నట్లు తహశీల్దార్ కె.బాలకృష్ణ తెలిపారు. నది మధ్యలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రొక్లెయిన్, జేసీబీ, లారీలు, ట్రిప్పర్లు మొత్తం ఆరు వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉపాధి వేతనదారుడికి పాముకాటు మెళియాపుట్టి: మండలంలోని చాపర పంచాయతీలో పరిధిలో బుధవారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా డోల అప్పడు అనే 60 ఏళ్ల వృద్ధుడు పాముకాటుకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ఫీల్డ్ అసిస్టెంట్ సింహాచలంకు తెలియజేయడంతో హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి కాశీబుగ్గ/ఇచ్ఛాపురం : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లారోడ్డు రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జి.ఆర్.పి. పోలీసుస్టేషన్ ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇచ్చాపురం–సుర్లారోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య ఎగువ లైనులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతుడి వయసు 55–60 ఏళ్లు ఉండవచ్చని, కాషాయ రంగు టీషర్టు, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడని, చేతి కర్ర, సంచి ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9440627567 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. 55 పశువులు పట్టివేత రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఐదు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 55 పశువులను జె.ఆర్.పురం పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల నుంచి విశాఖపట్నం గోవధశాలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. పశువులను విజయనగరం జిల్లా గుజ్జంగివలసలోని గో–సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
రబీ వరి కొనుగోళ్లు ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవారం నుంచి రబీ వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా వరి సేకరణ సమయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యా దు వస్తే సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అధికారులకు ఆదేశించారు. వరి కొ నుగోళ్లు ఆరంభం పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ఆహార సరఫరా సంస్థ సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మండిల్లో వరి సేకరణ ప్రక్రియ, సీసీ టీవీ వ్యవస్థ పర్యవేక్షణ, మండి నుంచి మిల్లుకు వెళ్లే వాహనాల ను ట్రాక్ చేయడం, అనుబంధ ప్రత్యక్ష ఫుటేజ్ ఏర్పాటును మంత్రి పర్యవేక్షించారు. మండిల్లో రైతులు మరియు నోడల్ అధికారులతో మంత్రి సంభాషించి వారి సౌకర్యాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించాలని అవగాహన కల్పించారు. వరి సేకరణకు సంబంధించి ఏ రైతు నుంచి అయినా ఫిర్యాదు అందితే దాన్ని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించారు. -
ప్రాణాలు తీసిన పిడుగులు
● రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతిజయపురం: కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి అంపావల్లి పంచాయతీ కందపుటాబంద్ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు గ్రామంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. వారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా పిడుగుపడి మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో తండ్రి గమేల్ కృష్ణ, అతడి కుమార్తె గమేల్ కొమి(13), మహిళ గమేల్ తుంబయలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వర్షం పడిన సమయంలో వారంతా ఒక చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు చెట్టుపై పడడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపినట్లు పొట్టంగి తహసీల్దార్ బహుదేర్ సింగ్ దరువ వెల్లడించారు. పిడుగుపడి బాలుడు మృతి రాయగడ: పిడుగుపడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్ పరిధి వంటామడలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాలుడు సన్యాసి హిమిరిక (15)గా గుర్తించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో తమ కుటుంబీకులకు వ్యవసాయం పనుల్లో సహకరించేందుకు సన్యాసి తమ గ్రామానికి సమీపంలో పంట పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ఒక చెట్టు కింద నిలబడిన సన్యాసిపై పిడుగుపడడంతో సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
● ముగిసిన ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధి హరిదాస్‌పూర్‌లో ఉత్సవాలు ముగిశాయి. వారం రోజులుగా గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా చేపడుతున్న బలిజాత్ర పూజలను బుధవారంతో ముగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా థింసా నృత్యం చేశారు. పంటలు పుష్కలంగా పండాలని, ఎటువంటి దుష్టశక్తులు తమ గ్రామంలోకి ప్రవేశించకూడదని ఇష్టదైవాన్ని పూజిస్తారు. పండగ ప్రారంభం రోజున ఒక దగ్గర తాము పండించిన ధాన్యాన్ని కొంచెం వేస్తారు. వారం రోజుల్లో అవి మొలకెత్తుతాయి. వీటిని వారు దైవంగా భావించి పూజిస్తారు. అనంతరం వాటిని సమీపంలోని నదిలో నిమజ్జనం చేస్తారు. -
విగ్రహం ధ్వంసంలో నా ప్రమేయం లేదు
● పెంట పంచాయతీ సర్పంచ్ విశ్వనాథ్ స్పష్టీకరణరాయగడ: చందిలి పోలీసుస్టేషన్ పరిధి టంపరగుడ కొండపై బుద్ధుడి విగ్రహం ధ్వంసమైన ఘటనలో తన ప్రమేయం లేదని పెంట పంచాయతీ సర్పంచ్ ఎ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. ఈనెల 12వ తేదీన అర్థరాత్రి టంపరగుడ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయంపై బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితు జకసిక పెంట పంచాయతీ సర్పంచ్‌పై చందిలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సర్పంచ్ విశ్వనాథ్ మంగళవారం పెంట పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తనపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. కొద్దిరోజుల క్రితం టంపరగుడ గ్రామ (కొండ కింద)లోని స్థలంలో అభిపలక అనే వ్యక్తి ప్లాటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కొండపై బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేస్తే తమ ప్లాట్లకు మంచి ధర పలుకుతుందని భావించి అక్కడ విగ్రహం ఏర్పాటు చేశారని వివరించారు. అయితే కొండ ప్రాంతం రాష్ట్ర రెవెన్యూ విభాగానికి చెందినదని అయితే టంపరగుడ గ్రామ ప్రజలు ఆ కొండపై జీడి, మామిడి వంటి పంటలను పండించుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా కొండపై విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఒకవేళ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే అభిపలక అనే వ్యక్తి సొంత స్థలంలో ఏర్పాటు చేసుంటే తాము కూడా సహకరించేవాళ్లమని పేర్కొన్నారు. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసేంత దుర్మార్గులము కాదని పేర్కొన్నారు. వారే విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారే దానిని ధ్వంసం చేసి తిరిగి తమపై బురద జల్లేవిధంగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అనంతరం టంపరగుడ గ్రామస్తులతో కలిసి జితు జకసికపై ఫిర్యాదు చేశారు. -
విద్యుత్ స్తంభంపై మంటలు
జయపురం: కొరాపుట్ జిల్లా సెమిలిగుడ – నందపూర్ మార్గంలో ఒక విద్యుత్ స్తంభంపై బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ విభాగ ఎస్డీవోకు సమాచారం అందజేశారు. విద్యుత్ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సునాబెడ ఎస్డీవో గోపాల కృష్ణ ప్రధాన్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. షడ్భుజ గౌరంగ రూపం పవిత్ర వైశాఖ కృష్ణ పక్షం ప్రతిపాద తిథి పురస్కరించుకుని పూరీ శ్రీజగన్నాథుని ప్రతినిథి మదన మోహనుడు షడ్భుజ గౌరంగ రూపంలో దర్శనమిచ్చాడు. స్వామి వెలుపలి చందన యాత్రలో భాగంగా 13వ రోజున నరేంద్ర పుష్కరిణి చందన మండపంపై ఈ అలంకారంలో స్వామి నవకాంతులు వెదజల్లాడని భక్తులు మురిసిపోయారు. – భువనేశ్వర్ -
సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
పర్లాకిమిడి: పర్లాకిమిడి సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. మొత్తం 155 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా శతశాతం ఉత్తీర్ణత సాధించారు. స్కూల్ టాపర్‌గా 98 శాతం మార్కులు సాధించి పార్థసారధి సాహు నిలవగా, 97.8 శాతం మార్కులతో తత్సత్ పాణిగ్రాహి రెండోస్థానంలో నిలిచాడు. 90 శాతం మార్కులు ఎనిమిది మంది విద్యార్థులు సాధించారు. అలాగే ప్లస్ టూ ఫలితాల్లో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ టాపర్‌గా కుమారి తనూజా సమంత్ 92 శాతం మార్కులు సాధించింది, అలాగే 91.67 శాతం మార్కులతో రెండోస్థానంలో శుభలగ్న పాఢి నిలిచింది. మొత్తం 135 విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 90 మంది ఫస్ట్‌క్లాస్‌లో పాసైనట్లు ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి తెలియజేశారు. -
రోడ్డు నిర్మించాలని వినతి
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ ఖర్చబడి పంచాయతీ పరిధి గోవిందపూర్ మామిడితోట జంక్షన్ నుంచి గోంగరి గావ్, బి.రైసింగి వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు మోహనా సమితి చైర్మన్ రాజీవ్ శొబొరో ఆధ్వర్యంలో మోహనాలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోహనా బీడీవో రాజీవ్ దాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 75 ఏళ్లుగా ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.జయపురంలో ఇంటింటా సర్వే జయపురం: జయపురం సమితి, మున్సిపాలిటీలో 18 ఏళ్లలోపు నిరక్షరాస్యులు, డ్రాపౌట్స్ సర్వేను ఇంటింటా నిర్వహించారు. మొత్తం 15 క్లస్టర్లు ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంగ్రహించిన వివరాలను టేబులైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. టేబులైజేషన్ పూర్తయితే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఆక్రమణలపై చర్యలు తీసుకోండి పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ సిద్ధమణుగు పంచాయతీ పరిధి చిత్రకార్ లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపురం గ్రామస్తులు వినతిపత్రాన్ని కలెక్టరేట్లో పాలనాధికారికి బుధవారం అందజేశారు. ఆ భూమిలో ఇదివరకు గ్రామానికి సామాజిక కేంద్ర భవనం నిర్మించాలనుకున్నామని తెలిపారు. అయితే కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ కాశీనగర్ తహసీల్దార్‌కు సైతం మరో వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌ను కలిసినవారిలో లక్ష్మీకోరాయి, ఎం.గోవింద తదితరులు ఉన్నారు. నదిలో మునిగి బాలుడు మృతి మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి ఎంపీవీ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు శబరీ నదిలో మునిగి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంపీవీ గ్రామంలో అర్జున్ మీరాజ్ కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు ఏడేళ్ల నాయన్ మీర్జా సెలవులు కావడంతో తోటి పిల్లలతో కలిసి స్నానానికి గ్రామానికి సమీపంలోని శబరీ నదికి వెళ్లాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి వారిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఇద్దరిలో ఒకరిని మాత్రమే రక్షించగలిగాడు. ఈ విషయం తెలిసిన తండ్రి అర్జున్ కూడా నీటిలో దూకి వెదికారు. అయితే కొంతదూరంలో బాలుడు తేలుతూ కన్పించాడు. వెంటనే బాలుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్లగా అక్కడ వైద్యులు బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు. వెంటనే పోడియా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. -
విద్యార్థులకు నడక పోటీలు
రాయగడ: నడకతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ సభ్యులు నడక పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సాయిప్రియ నగర్ కాలనీలో నిర్వహించిన ఈ పోటీల్లో హుస్సేన్ ఖాన్ ప్రథమ స్థానం, హరున్, కె.రుచితేష్లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నడవడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు పేకే ప్రధాన్, కె.వైకుంఠరావు, బిజయ్ చంద్రపాత్రో, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. -
నవ్వించడం ఒక కళ
ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం రాయగడ: నవ్వించడం ఒక కళ అని, నవ్వడంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి అన్నారు. మంగళవారం క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్వడం, నవ్వించడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన లాఫర్స్ క్లబ్ ఆ దిశగా భవిష్యత్ ప్రణాళికలతో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రతీ వారం కనీసం ఒక ప్రాంతంలో ఇటువంటి తరహా నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అందుకు సభ్యులంతా సుముఖత వ్యక్తం చేశారు. నవ్వు వల్ల కలిగే లాభాలు వంటి అంశాలతో ర్యాలీలను నిర్వహించి చైతన్య పరిచేందుకు సభ్యులు సహకరించాలన్నారు. సమావేశంలో క్లబ్ కార్యదర్శి లాల్ బిహారి లెంక, దశరథి రాజ్‌గురు, అభిమన్యు నాయక్, తదితరులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: స్థానిక బిజూపట్నాయక్ శాంతి ఉద్యానంలో విద్యార్థులతో నవ్వుల కార్యక్రమం నిర్వహించారు. బలంగీర్ జిల్లాలో ప్రసిద్ధ సంస్థ నిఝరిణ ినిర్వహించిన నవ్వుల కార్యక్రమాన్ని ఆ సంస్థ కార్యదర్శి బిరంచి నారాయణ దాస్ పర్యవేక్షించారు. ముఖ్యఅతిథిగా అధ్యాపకులు డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ హాజయ్యారు. నవ్వటం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, బెలూన్లతో ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనంలో అరూష్ పట్నాయక్ ప్రథమ బహుమతి, అభిప్స్ ద్వితీయ బహుమతి సాధించారు. భారత సైనికులు చేపట్టిన సిందూర్ ఆపరేషన్‌పై ప్రశ్నలు అడిగారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. గౌరవ అతిథిగా సమాజసేవి ప్రమోద్ కుమార్ రౌళో, అభినేష్ శాంతపాత్రో, అంశిత్ పట్నాయక్, అంశుమాన్ పండా, అర్ణభ పట్నాయక్, అభిస్ప సాహు పాల్గొన్నారు. -
మత్య్సకార గ్రామాల్లో కూటమి చిచ్చు
సంతబొమ్మాళి: ప్రశాంతంగా ఉండే మత్స్యకార గ్రామాల్లో కూటమి పార్టీలు చిచ్చుపెడుతున్నాయని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. మండలంలోని జగన్నాథపురం తీరప్రాంత గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామంలో అక్రమ కేసుల బాధితులైన సర్పంచ్ జోగి రాములమ్మ, ఉప సర్పంచ్ కొమర రామారావు, లండ రామారావులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారిని భయబ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. మహిళ సర్పంచ్ జోగి రాములమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు గొడవపడితే ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులపైన, ఆ సమయంలో గ్రామంలోనే లేని సర్పంచ్ రాములమ్మపైన అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. సీఐ నిర్వాకంతోనే అక్రమ కేసులు టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు నిర్వాకం వలనే వైఎస్సార్సీసీ నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దయ్యబట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు తమకు కావాల్సినవారిని అన్ని శాఖల్లో నియమించుకొని తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీకు చెందిన నాయకులను ఆర్థికంగా నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పనులు చేసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆర్థికంగా నష్టపరిచినా, అక్రమ కేసులు బనాయించినా భయపడకుండా పార్టీకి అండగా నిలిచిన సర్పంచ్ రాములమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదర్శమని కొనియాడారు. టీడీపీ నాయకుల దాడులకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందన్నారు. కింజరాపు కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన వేల కోట్లను జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.రామిరెడ్డి, ఎన్ని మన్మథరావు, చింతల రాజులు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు సంపతిరావు హేమసుందరరాజు, అట్ల రాహుల్, సత్తారు సత్యం, కాళ్ల సంజీవరావు, పుక్కల లక్ష్మణరావు, మురళి పాల్గొన్నారు. కక్ష సాధింపులకు ప్రతి చర్యలు తప్పవు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు సరికాదు వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ -
నలుగురిపై గృహ హింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: ముద్దాడ గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మంగళవారం ఆమె భర్త ముత్యాలరావు, ముగ్గురు కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు. భార్యభర్తలు మధ్య ఇటీవల గొడవలు రావడం, భర్త అప్పులు చేయడం, కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకు రావాలని ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో అనితకు వివాహం కాగా, కుమార్తె ఉంది. ప్రస్తుతం కన్నవారు ఇంటి వద్ద దుప్పలవలసలో ఉంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 అంబులెన్సులో ప్రసవం మందస: మండలంలోని సింగుపురం గ్రామానికి చెందిన రాయవలస భారతి 108 అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు మంగళవారం జన్మినిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారతి పురిటి నొప్పులతో బాధపడుతుండగా వారి బంధువులు 108కు సమాచారం అందించారు. దీంతో మందస 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్‌లు గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమెకు సిబ్బంది ప్రసవం చేయడంతో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అనంతరం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పిడుగుపాటుకు మహిళ మృతి కొత్తూరు: మండలంలోని దిగువ మల్లెలుగూడకు చెందిన యువతి సవర చిన్నారమ్మ (30) పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ మంగళవా రం తెలియజేశారు. చిన్నారమ్మ మేకలు కాపుకు వెళ్లగా సోమవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి తమ్ము డు సవర రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కారు బోల్తా రణస్థలం:మండలంలోని విశాఖపట్నం వైపు నుం చి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు పైడిపేట జాతీ య రహదారిపై మంగళవారం బోల్తా పడింది. అయితే కారులో ఉన్నవారికి చిన్న,చిన్న గాయా లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడినప్పుడు జాతీయ రహదారిపై నీరు నిలబడిపోవడం వలన కారు బోల్తా పడిందని, తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్‌పురం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. గంజాయితో ఇద్దరు అరెస్టు జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద గంజాయితో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశామని రణస్థలం సీఐ అవతారం మంగళవారం తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. వాండ్రంగి గ్రామానికి చెందిన మీసాల జగన్నాథరావు, శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన యారగళ్ల పవన్ కుమార్‌లు ద్విచక్రం వాహనం ద్వారా 2 కేజీల 300 గ్రాముల గంజాయి తరలించేందుకు ఉండగా స్థానిక ఎస్ఐ వై.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. అలాగే గంజాయి విక్రయిస్తున్న కరిజాం లచ్చన్న, మీగడ గోపిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నాని వెల్లడించారు. వీరిని త్వరలోనే అరెస్టు చేసి విచారిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం ● క్షతగాత్రుల్లో జిల్లాకి చెందిన ముగ్గురు వ్యక్తులు పోలాకి: ప్రకాశం జిల్లా తిమ్మనాపాలెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. చైన్నె నుంచి వస్తున్న బస్సు ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్రకు చెందిన ఎరువుల డీలర్లను కేపీఆర్ కంపెనీ మహాబలిపురంలో ఈనెల 12వ తేదీన జరిగిన బిజినెస్ మీటింగ్‌కు మూడు బస్సుల్లో తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా అందులో ఒక బస్సు ప్రమాదానికి గురైంది. కేపీఆర్ కంపెనీ శ్రీకాకుళం ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో పాటు నరసన్నపేట, సంతకవిటికి చెందిన ఇద్దరు డీలర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. ముగిసిన అంత్యక్రియలు శ్రీకాకుళం రూరల్: గురజాడ విద్యాసంస్థల్లో మూడు దశాబ్ధాలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పులఖండం శ్రీనివాసరావు అంత్యక్రియలు మంగళవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడుతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒక సాహితీవేత్తను, పరిపాలన దక్షుడిని కోల్పోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వీరితో పాటు విద్యాసంస్థల డైరక్టర్ రంగారావు, వి.మహేష్, ఐక్యూ ఏసీ మర్తాండ తదితరులు సంతాపం ప్రకటించారు. -
తస్మాత్ జాగ్రత్త..!
సరుబుజ్జిలి: వేసవిలో ఉష్టోగ్రతలు తారాస్థాయికి చేరడంతో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలుచోట్ల పిడుగులు పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే ప్రజలు భయపడుతున్నారు. పొలాల్లో పనులు చేసుకొనే రైతులు, పశువుల కాపరులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో ఇళ్లకు సమీపంలో పిడుగులు పడుతుండడంతో గృహోపకరణాలు కాలిపోయి తీవ్ర నష్టాలు ప్రజలు చవిచూస్తున్నారు. దీంతో పిడుగుపాటు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయకూడదు ● వర్షం కురిసేటపుడు చెట్లకింద ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండరాదు. ● మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంతకన్న తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగుపడే అవకాశముంది. ● మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు. ● గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి, సెల్‌ఫోన్ ఉంటే స్విచ్చాఫ్ చేయాలి. ● ఒక వేళ ఇవి ఉంటే రేడియన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశముంటుంది. ● వర్షంపడే సమయంలో విద్యుత్ తీగలు కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ● అలాగే అటువంటి సమయాల్లో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు. ● గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మెరుపులు, ఉరుములతో భయందోళనకు గురవుతారు. అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను 1 అడుగుపైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – బమ్మిడి జ్యోతిర్మయి, వైద్యాధికారి, పురుషోత్తపురం పీహెచ్సీ పెరుగుతున్న పిడుగుపాటు ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్న పిడుగులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు -
సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం
భువనేశ్వర్: స్థానిక ఖారవేల భవన్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మనోజ్ ఆహుజా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రముఖ కార్యదర్శులు హాజరయ్యారు. ప్రజాహిత పథకాల అమలు, సిబ్బంది సంక్షేమం, సాంఘిక భద్రత కార్యకలాపాల్ని ఈ సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ కొత్త పథకాల అమలు, వివిధ విభాగాలలో ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత పదవీ విరమణ ప్రయోజనాలు, ఫించను మంజూరు వంటి అంశాల్ని కార్యదర్శులతో చర్చించారు. కార్యదర్శుల జిల్లా సందర్శనలు, తదనంతర నివేదికల రూపకల్పన వంటి కీలకమైన అధికారిక చర్యల్ని ప్రముఖ కార్యదర్శి సమీక్షించారు. ఈ సమావేశానికి అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, అదనపు ప్రధాన కార్యదర్శులు సత్యబ్రత సాహు, సురేంద్ర కుమార్ మరియు హేమంత్ శర్మలతో పాటు వివిధ శాఖల ప్రముఖ కార్యదర్శులు, కమిషనర్లు మరియు కార్యదర్శులు హాజరై చర్చలలో పాల్గొన్నారు. -
ఆరోగ్య ప్రదం
ఔషధ గుణం.. ముంజులను విక్రయిస్తున్న రైతు ● తాటి ముంజులతో శరీరానికి పుష్కలంగా విటమిన్లు ● వేసవిలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం ● కామెర్లు, ఎసిడిటీ తీవ్రతను తగ్గించే గుణంవజ్రపుకొత్తూరు: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, ఈ కాలంలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతులను నివారించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. ఇవి ఐస్ యాపిల్‌గా విశేష ప్రాచుర్యం పొందాయి. తాటి ముంజుల సీజన్ ప్రారంభం కావడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ తాటి ముంజులు శరీరంలోని చెక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి గిరాకీ పెరిగింది. ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో తాటిచెట్లు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటి చెట్లు నరికేస్తుండడంతో భవిష్యత్‌లో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది. – ఆరోగ్య ప్రదాయిని ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటి ముంజులు కల్తీ లేనివి, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాటి ముంజులు సేకరించేవారు కరువయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతు కూలీలు తాటి ముంజులను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. జిల్లాల్లోని శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, హరిపురం, ఇచ్ఛాపురం పట్టణాల్లో ఎక్కువగా విక్రయాలు చేపడుతున్నారు. తాటి ముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80ల నుంచి రూ.120ల వరకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటి ముంజుల ప్రియులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రయోజనాలు ● తాటి ముంజుల్లో విటమిన్లు, పాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలేబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి తాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. ● తాటి ముంజులు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటి ముంజలను తినడం వల్ల చెడు కొలెస్త్రాల్ తగ్గించుకుని మంచి కలెస్ట్రాల్‌ను వృద్ది చేసుకోవచ్చు. ● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండడం వలన అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కల్పించి శరీరం బరువు పెరగకుండా చేస్తుంది. ● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ● ఆహారంలో సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. ● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● తాటి ముంజులను గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమట కాయలను నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉండడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంచి ఎసిడిటీ, కామెర్ల తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఏడాదికి ఒక్కసారైనా తినాలి తాటి ముంజ కల్తీలేని స్వచ్ఛమైన పోషకాహారం. వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు తాటి ముంజులు లభ్యమవుతాయి. ఇవి తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందనడంలో సందేహం లేదు. మా ప్రాంతంలో కోసేవారు లేకపోవడంతో ఇచ్ఛాపురం, హరిపురం పలాస, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి తెప్పించుకుని తింటాం. కొన్నిసార్లు పలాస– విశాఖ పాసింజర్ ట్రైన్లలో సైతం విక్రయాలు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఎక్కువ తీసుకుంటాం. ఐస్ యాపిల్‌గా పిలిచే తాటి ముంజలను ఏడాదికి ఒకసారైనా తిలనాలని కోరిక ఉంటుంది. – ఎం.కృష్ణారావు, బ్రాహ్మణతర్ల, పలాస మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది తాటి ముంజలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. లేతవి, జెల్లీలా ఉన్నవి తింటే రుచిగా ఉంటాయి. మా ఊరులో ఉన్న చెట్లు నుంచి గెలలను తీసి కోసుకుని తింటాం. పైగా వేసవిలో చల్లదనం ఇచ్చి దాహార్తిని తీరుస్తుంది. సరదాగా గడుపుతూ తోటల్లోకి చేరి, కొండ పక్కన ఉన్న తోటల్లో తాటిచెట్లు నుంచి కాయలను తీసి కుర్రాళ్లమంతా పంచుకుని తింటాం. అదో తియ్యని జ్ఞాపకం. – డి.ఢిల్లీరావు , అమలపాడు, వజ్రపుకొత్తూరు -
ఓఎస్ఆర్టీసీలో కొత్త ఏసీ బస్సులు
జయపురం: జయపురం ఓఎస్ఆర్టీసీ డిపోలో పాత బస్సులు పక్కన పెట్టి ఆయా రూట్లలో కొత్త ఎయిర్‌కండిషన్ లక్ష్మీ బస్సులు ప్రవేశ పెట్టారు. ఆయా రూట్లలో 10 ఎయిర్‌కండిషన్ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు తక్కువ చార్జీలతో ఎయిర్ కండిషన్ బస్సులు ప్రవేశ పెట్టిన విషయం విదితమే. అయితే ప్రైవేట్ బస్సుల యజమానుల రూట్ల విషయం, టైమింగ్‌లపై అభ్యంతరం తెలపటంతో కొద్ది నెలల కిందట అవి నిలిచిపోయాయి. లక్ష్మీ ఎయిర్‌కండిషన్ బస్సులు నడిపేందుకు అనుమతి లభించటంతో నేటి నుంచి జయపురం–కాశీపూర్, జయపురం– కొటాగాం, జయపురం–పర్లాకిమిడి, జయపురం–గుణుపూర్, జయపురం–కొటియ, జయపురం– మల్కనగిరి, భవానీపట్న – మోటు వయా జయపురం, ఇంధ్రావతి జానభాయి వయా జయపురం రూట్లలో కొత్త బస్సులు ప్రారంభించారు. అందుకు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత బస్సులలో కిలోమీటర్ కు 92 పైసలు చార్జీ ఉండగా కొత్తగా వేసిన లక్ష్మీ ఎయిర్ కండిషన్ బస్సులకు కిలోమీటర్‌కు కేవలం 55 పైసలు కావటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో పునర్నిర్మాణంలో ఉన్న శ్రీజగన్నాథ మందిరానికి పుష్పాంజలి పాఢి రూ.3,00,101 విరాళంగా అందజేశారు. మంగళవారం ఆలయ కమిటీకి చెక్కును అందజేశారు.ఘనంగా బుద్ధ జయంతి జయపురం: కొరాపుట్ జిల్లాలో మొదటి సారి బుద్ధ జయంతి వేడుకలు జరిగాయి. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి అవుంలి గ్రామ కూడలి వద్ద సోమవారం సాయంత్రం వేడుకలు చేశారు. అవుంలి పార్క్ లోగల భారీ బుద్ధ విగ్రహానికి పూజలు చేశారు. శాంతి, అహింస, ధర్మం, కారుణ్యం తదితర విలువలు బోధించారు. ఉత్సవంలో అవుంలి సర్పంచ్ హీరామణి పూజారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 20న అఖిల భారత సమ్మె పర్లాకిమిడి: ఈ నెల 20వ తీదీన రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సమ్మెను ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక దండుమాలవీధిలో సీపీఎం కార్యాలయంలో అఖిల భారత కిసాన్ సభ నాయకులు బంగారయ్య, బి.కె.ఎం.యు రాష్ట్ర కమిటీ సభ్యులు జోన్న సుభాష్ చంద్రరావు, టి.యు.సి.సి పైల మురళీకృష్ణ, ఏ.ఐ.కె.ఎం.ఎస్ కేదార్ శబర, ఏ.ఐ.టి.యు.సి కార్యదర్శి దండపాణి రయితో, శ్రీనివాస్ బెహరా తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లు రద్దు చేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, స్కీమ్ వర్కర్లకు శ్రామిక హోదా ఇవ్వాలని, నిత్యావసర వస్తువులు అందించాలని, పలు డిమాండ్లతో ట్రేడ్ యూనియన్లు సమ్మె చేయనున్నాయని జోన్న సుభాష్ చంద్రరావు తెలిపారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 250 కిలోల గంజాయి స్వాధీనం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి పాతచిమాటపల్లి పంచాయతీ బండిగూఢ గ్రామంలో అడవిలో పది బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిపై ముందస్తు సమాచారం అందడంతో ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ సోమవారం సాయంత్రం సిబ్బందితో దాడి చేశారు. దీంతో మాఫియా అంతా పరారైపోయింది. పది బస్తాల్లో 250 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని తెలిపారు. చోరీ కేసులో ముగ్గురు అరెస్టు రాయగడ: చోరీ కేసుకు సంబంధించి జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీసులు మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి పికప్ వ్యాన్, 4 ఫోన్లు, 48 హెచ్‌బీఎల్ డ్రై సెల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నింతులను కోర్టుకు తరలించారు. నిందితుల వివరాలను వెల్లడించలేదు. -
కాశీపూర్‌లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌లో గల సమితి కార్యాలయం సమావేశం హాల్లో మంగళవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 43 వినతులను స్వీకరించారు. ఇందులో 32 వ్యక్తిగత సమస్యలు కాగా, 11 గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతులను త్వరిత గతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పట్వారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రకాంత్ మాఝి, జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మమత సాహు తదితరులు పాల్గొన్నారు. -
నొగొడాలో చీఫ్ సెక్రటరీ పర్యటన
క్రమం తప్పకుండా ఆరోగ్య అవగాహన శిబిరాలను నిర్వహించాలని అధికారులను కోరారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆరోగ్య సేవలు, సీ్త్ర మరియు శిశు అభివృద్ధి, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రముఖ కార్యదర్శి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగువ నొగొడా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. మమత యోజన లబ్ధిదారులతో మనోజ్ ఆహుజా సంభాషించారు. గతంలో మినహాయించబడిన అర్హులైన వ్యక్తులందరినీ ఈ పథకంలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. కాలియాపాణి నుంచి నొగొడా వరకు ప్రభుత్వం రోడ్లు, నీరు, సౌర దీపాలు, ఇతర సౌకర్యాలను కల్పించింది. రోడ్ల మరమ్మతు, వీధి దీపాల ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను ప్రకటించారు. 2018 సంవత్సరం నుంచి బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల ఆరోగ్య సంరక్షణ, అవసరమైన సేవలు అక్కరకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఖనిజ నిధి వనరులతో మొరాయించిన బస్సు రవాణా సౌకర్యం పునరుద్ధరణకు అధికారులకు ఆదేశించారు. ఈ నిధుల సద్వినియోగంతో గిరిజన యువతకు ఆటో రిక్షాలు అందజేయాలని స్థానిక జిల్లా కలెక్టరుకు తెలిపారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సక్రమ అమలు, ఏడాది పొడవునా నీటి లభ్యత కోసం చెరువులు వంటి జలాశయాలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. గత మూడేళ్లుగా గ్రామంలో మూసిన గిరిజన హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా జాజ్‌పూర్ జిల్లా సుకిందా మండలం నొగొడా గ్రామాన్ని సందర్శించారు. నొగొడా ఒక ఆదర్శ గిరిజన గ్రామంగా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన ముఖాముఖి చర్చించారు. ప్రధానంగా ప్రజా సంక్షేమానికి సంకల్పించిన ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణ, వాస్తవ లబ్ధిని క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. రాష్ట్రంలో నొగొడా గ్రామం ఆకలి చావుల ప్రాంతంగా తీవ్ర కలకలం రేపింది. 2016లో పోషకాహార లోపం కారణంగా ఈ ప్రాంతంలో జువాంగ్ గిరిజన సమాజంలో 19 మంది పిల్లలు మరణించడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ కార్యదర్శి సందర్శనలో రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ కార్యదర్శి గిరీష్ ఎస్ఎన్ మరియు జాజ్‌పూర్ కలెక్టర్ పి.అన్వేష రెడ్డి, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామస్తులతో ఆయా శాఖలు, విభాగాల కార్యాచరణ సాఫల్యత విశ్లేషణ కోసం మాట్లాడారు. సుభద్ర యోజన పథకం కింద గిరిజన మహిళలకు పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేటప్పుడు -
‘శాసనసభ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు, పొట్టంగి నియోజక వర్గం ఎమ్మెల్యే రామ చంద్ర కదమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన లేఖ జారీ చేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణపై తక్షణ చర్చలు జరపాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి తీవ్రతను పేర్కొంటూ పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై తక్షణ చర్చను కోరుతున్నట్లు లేఖలో వివరించారు. ప్రజా ప్రతినిధులు ఈ పరిణామాలను చర్చించడానికి, జాతీయ భద్రత, ఐక్యతపై మన నిబద్ధత పునరుద్ఘాటన నేపథ్యంలో చర్చ కోసం అసెంబ్లీ అత్యవసర సమావేశం ప్రత్యేకత సంతరించుకుందన్నారు. శ్రీ వారి వార్షికోత్సవానికి సన్నాహాలుభువనేశ్వర్: స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం నిర్వహణకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24న వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 20న కోయిల ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతుంది. 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత వార్షికోత్సవాలు జరుగుతాయి. సాయంత్రం పూట 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామి కల్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అధికార వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మద్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ వారి అన్న ప్రసాద వితరణ నిరవధికంగా కొనసాగుతుంది. సీబీఎస్సీ టెన్త్ ఫలితాల్లో పలువురి ప్రతిభ జయపురం: మంగళవారం ప్రకటించబడిన సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలో జయపురం మోడరన్ ఇంగ్లిష్ స్కూల్ వంద శాతం ఫలితాలు సాధించింది. ఆ పాఠశాల నుంచి 161 మంది పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో సౌమ్య మిశ్ర 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ పాఠశాలలో 11 మంది 90 శాతం మర్కులతో ఉత్తీర్ణులు అయ్యారని పాఠశాల వర్గాలు తెలిపాయి. పాఠశాల టాపర్ అయిన సౌమ్యమిశ్ర తాను ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో ఉన్నాని తన అభిప్రాయం వెల్లడించింది. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందిస్తూ మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పాఠశాల డైరెక్టర్ శ్రీమతి కుముద మాల మహంతి హితవు పలికారు. -
ఉక్కుర పంచాయతీలో స్పందన
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ ఉక్కుర పంచాయతీ కార్యాలయంలో గ్రామ పరిపాలన, స్పందన కార్యక్రమానికి కలెక్టర్ బిజయ కుమార్ దాస్ విచ్చేశారు. సోమవారం ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ జ్యోతేంద్ర కుమార్ పండా, జిల్లా పరిషత్ సీడీఎం శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. తరబ, ఉక్కుర, గైబ, గుమ్మా పంచాయతీల నుంచి 74 వినతులు అందగా, వాటిలో గ్రామసమస్యలు 42, వ్యక్తిగతం 32 ఉన్నాయి. వాటిలో నలుగురు నిస్సహాయులకు రూ.10వేలు చొప్పున రెడ్ క్రాస్ సహాయనిధి నుంచి కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ గ్రీవెన్సులో గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, సి.డి.యం.ఓ. డా.యం.యం.ఆలీ తదితరులు పాల్గొన్నారు. -
వీనులవిందుగా అన్నమయ్య కీర్తనల ఆలాపన
రాయగడ: అన్నమాచార్య సంకీర్తన మండలి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామ మందిర ప్రాంగణంలో సోమవారం సాయంత్రం అన్నమయ్య కీర్తనల ఆలాపన వీనులవిందుగా సాగింది. స్థానిక స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కూడా పలు కీర్తనలు పాడి అలరించారు. కార్యక్రమ నిర్వాహకురాలు పి.కల్యాణి, బి.అవంతి, జి.సులేఖ, ఎ.రమ్యశ్రీ, పి.గణపతి శాస్త్రి, కె.వర ప్రసాద్, గిరీష్ పట్నాయక్, తదితరులు అన్నమయ్య కీర్తనలు పాడి వినిపించారు. భళ్లమూడి నాగరాజు వందన సమర్పణ చేశారు. -
గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్వో బస్ సేవలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్లో బస్ సేవలు సొమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను ఇకపై గుణుపూర్ ప్రాంత వాసులు పొందనున్నారు. గుణుపూర్ నుంచి కటక్, కటక్ నుంచి గుణుపూర్ వరకు రెండు బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్‌లో ప్రయాణించేందుకు పురుషులకు 780 రూపాయలు టిక్కెట్టు ధర నిర్ధారించగా అదేవిధంగా మహిళలు ప్రయాణిస్తే వారికి టిక్కెట్లో 50 శాతం రాయితీ లభించనుందని సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర గనులు, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ జెన్న గుణుపూర్ సమీపంలోని మీనాజోల ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఆయన దృష్టికి సమస్యను గుణుపూర్ వాసులు తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పందించిన మంత్రి బస్ సేవలకు శ్రీకారం చుట్టడంతో ఆయకు ధన్యవాదాలు తెలియజేశారు. -
యువకుడిపై దుండగుల దాడి
జయపురం: దుండగుల దాడిలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురైనట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు. గాయపడిన యువకుడు స్థానిక క్రిస్టియన్‌పేటకు చెందిన సమీర్ గుణియగా గుర్తించారు. క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం సమీర్ గుణియ 26వ జాతీయ రహదారి స్వాతంత్య్ర సమరయోధురాలు దివంగత లక్ష్మీ పండ జంక్షన్ వద్ద కూర్చొని ఉండగా, కొంతమంది దుండగులు వచ్చి కత్తితో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోరుగా రోడ్డు పనులు పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని ఫారెస్టు గేటు నుంచి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా పాతకోర్టు జంక్షన్ వరకు తారురోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విన్నపాలు మేరకు పనులు చేపడుతున్నారు. సుమారు రూ.9 కోట్లతో పనులు జరుగుతున్నట్లు ఎస్ఈ అభిషేక్ శెఠి తెలియజేశారు. 16 నుంచి అగ్ని గంగమ్మ పండగ రాయగడ: స్థానిక పిట్టలవీధిలో అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక పండగలు ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్నాయి. 5 రోజుల పాటుగా జరిగే ఈ పండగలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మందిరం ముస్తాబయ్యింది. హిందూ, ముస్లింలు కలిసి సాంప్రదాయబద్ధంగా పండగను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. విద్యాదాస్కు ప్రతిష్టాత్మకఅవార్డు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితిలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ అగ్రగామికి చెందిన జాయింట్ డైరక్టర్ విద్యాదాస్కు ప్రతిష్టాత్మకమైన భగవాన్ మహావీర్ ఫౌండేషన్ అవార్డు లభించింది. చైన్నెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందుకున్నట్లు సోమవారం తెలియజేశారు. విద్యారంగంలో చేసిన సేవలకు గానూ ఈ అవార్డును ప్రకటించినట్లు ఆమె తెలిపారు. అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహం అందించారన్నారు. -
‘సమస్యలు పరిష్కరించాలి’
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిశోర్‌కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 15వ తేదీన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలని, ఉర్దూ మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జిటి, ఎస్ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎ స్ హెచ్ఎం పోస్ట్ అదనంగా కేటాయించాలన్నారు. అనంతరం యూటీఎఫ్ సంఘ పెద్దలు డీఈఓ తిరుమల చైతన్యకు, జిల్లా పరిషత్ సీఈఓకు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రాలను అందజేశారు. -
టెక్కలిలో కింజరాపు ట్యాక్స్
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ట్యాక్స్‌తో పెద్ద ఎత్తున దోపిడీ పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సోమవారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. గత ప్రభుత్వంలో ఎంతో పారదర్శకంగా ఏజెన్సీ వ్యవస్థతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఆ వ్యవస్థలను పక్కన పెట్టి విచ్చలవిడి గా కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో ఎ లాంటి లీజు అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమంగా కంకర తవ్వకాలు చేస్తున్నారని, దీనికి కింజరాపు ట్యాక్స్ కడితే చాలని తిలక్ దుయ్యబట్టారు. గోవిందపురం సమీపంలో సర్వే నంబర్ 71 లో వైఎస్సార్సీపీకి చెందిన మండపాక నర్సింగరావు అన్ని రకాల అనుమతులతో గ్రావెల్ క్వారీ నిర్వహిస్తుండగా, ఆ క్వారీలో మంత్రి అచ్చెన్నాయుడు, సోదరుడు హరిప్రసాద్ అక్రమంగా తవ్వకాలు చేసి కంకర తరలించేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న గ్రావెల్ తరలింపు ఆపకపోతే వచ్చే సోమవారం గ్రావెల్ క్వారీను ముట్టడిస్తామని తిలక్ హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారానికి కింజరాపు ప్రసాద్, మైనింగ్ వ్యాపారానికి ఆయన కుమారుడు సురేష్ డాన్లుగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం కింజరాపు కుటుంబానికి వెళ్తోందన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన మహిళా మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసుల ప్రవర్తన హేయమని తిలక్ మండిపడ్డారు. మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో కింజరాపు కుటుంబానికి పెద్ద ఎత్తున వాటాలు ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ -
అవి వైఎస్సార్ సీపీ హయాంలో వచ్చిన నిధులు
● ఎమ్మెల్సీ రామారావు కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని, ఈ పనుల నిధులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవేనని ఎమ్మెల్సీ నర్తు రామారావు గుర్తు చేశారు. మండల కేంద్రం కంచిలిలో గల ఎమ్మెల్సీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోంపేట మండలం బారువ కొండిరేవ బ్రిడ్జికి రూ.3కోట్ల 45 లక్షలు, మహేంద్రతనయ బ్రిడ్జికి రూ.14 కోట్ల 60లక్షలు, ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు నుంచి పెద్దలక్ష్మీపురం వరకు రూ.4కోట్ల 86లక్షలు ప్రధాన మంత్రి సడక్యోజన కింద తారు రోడ్డు వేయడానికి, బూర్జపాడు ఉప్పుటేరుపై రూ.10కోట్ల 50లక్షలతో వంతెన నిర్మాణానికి ఆనాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి, టెండర్లు పిలిచి, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ పనులు తాత్కాలికంగా ఆగాయని అన్నారు. ఈ పనులు తామే తెచ్చామని కూటమి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నా.. నిజానికి ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీలు పైల దేవదాస్‌రెడ్డి, డాక్టర్ నిమ్మన దాస్, బోర పుష్ప, కంచిలి జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, పార్టీ నేతలు నర్తు నరేంద్రయాదవ్, ఇప్పిలి కృష్ణారావు, తడక జోగారావు, దుర్గాసి ధర్మారావు, నర్తు ప్రేమ్‌కుమార్, డొక్కరి బలరాం, మడ్డు వెంకటరావు, కొత్తకోట శేఖర్, బల్లెడ సుమన్, గణప సింహాచలం, రాంపత్ని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమందిరం భద్రతకు సరికొత్త వాహనం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం భద్రత అనుక్షణం పటిష్టపరుస్తున్నారు. ఈ వ్యవస్థని అధునాతన సరంజామాతో విస్తరించే ప్రయత్నంలో భద్రతా విభాగం తలమునకలై ఉంది. ప్రసిద్ధ శ్రీజగన్నాథ ఆలయానికి భద్రతను పెంచారు. తాజా పరిస్థితుల దృష్ట్యా కమాండోలతో నిర్వహించే అత్యాధునిక రక్షణ వజ్ర వాహనం జోడించారు. ఆధునిక ఆయుధాలతో కూడిన ప్రత్యేక కమాండోలు దీనితో ప్రసిద్ధ ఆలయానికి రాత్రింబవళ్ళు 24 గంటల పాటు భద్రతను కల్పిస్తారు. అధునాతన ఆయుధాలతో సాయుధ కమాండోలను కూడా మోహరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి, యాత్రికులకు వారి భద్రత గురించి భరోసా కోసం ఈ చర్య దోహదపడుతుందన్నారు. -
వారెంట్లు, సమన్ల అమలుపై దృష్టి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : కేసులో కోర్టువారు జారీ చేసిన నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రతి పీఎస్‌లో ప్రోసెస్ రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర ఆధారాలు, సాంకేతికతను అనుసరించి ఎన్బీడబ్ల్యూదారులను గుర్తించి కోర్టులో హాజరుపర్చాలన్నారు. ముఖ్యంగా సంఖ్య తగ్గేలా చూ డాలన్నారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కె.విరమణ, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ శ్రీను, ఎస్ఐ నేతాజీ పాల్గొన్నారు. -
53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు
పాతపట్నం: పాతపట్నంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ.7,31,962లు వచ్చిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చెప్పారు. సహాయ కమిషనర్ కార్యాలయం దేవదాయ శాఖ అధికారి జీవీబీఎస్ రవి కుమార్ పర్యవేక్షణలో సోమవారం హుండీ ఆదాయం లెక్కింపు జరిగిందన్నారు. 53 రోజులగాను ఆదాయం వచ్చిందని చెప్పారు. లెక్కింపులో శ్రీవెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి సరుబుజ్జిలి: మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన దాసరి అప్పన్న (47) సోమవారం చిగురువలస సమీపంలో పిడుగుపాటుకు మృతి చెందాడు. ఆయన రోజూ లాగానే చిగురువలస పంచాయతీ పరిధిలోని తాడికొండ వద్ద గొర్రెల మందను నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాతావరణంలో ఒక్క సారి మార్పులు ఏర్పడి ఈదురుగాలులు, వర్షం కురిసి పిడుగుపడింది. పిడుగు ప్రభావానికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగన్నాథుని నిధులు కై ంకర్యం మందస: మందస మండలం సాబకోట గ్రామంలో జగన్నాథ స్వామి దేవాలయం నిధు లు కైంకర్యం అయ్యాయని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు సోమ వారం కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దేవస్థానం కోసం మందస రాజులు 25 ఎకరాలు ఇచ్చారని, 18 మంది రైతులు ఆ భూములు సాగు చేస్తూ శిస్తు చెల్లిస్తున్నారని, కానీ అధికారుల పర్యవేక్షణ లేక గుడి శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. కార్యనిర్వహణ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రికార్డుల్లో మాయ చేసి నిధులు కై ంకర్య చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. సాహితీవేత్త ‘పులఖండం’ కన్నుమూత శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం సాహితీ రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ పులంఖండం శ్రీనివాసరావు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. వృత్తిపరంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సాహి తీ రంగంలోనూ కృషి చేశారు. ముఖ్యంగా వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలను రమ్యంగా నిర్వహించారు. అష్టావధానం నిర్వహించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించేవారు. శ్రీనివాసరావు విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, బరంపురం యూనివర్సిటీలో ‘హరికథా వికాసం–ఉత్తరాంధ్రము’పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. పులఖండం మృతిపై సుమిత్ర కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తి చిన్నారువు, నక్కశంకరరావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, ఉపనిషన్మందిరం అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మానగేష్, కామేశ్వరరరావు, జంధ్యాల శరత్‌బాబు, నిష్టల నర్సింహమూర్తి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన నేత్రాలు సజీవం టెక్కలి: టెక్కలి చిన్నబజారుకు చెందిన వ్యాపారి కింతలి చిట్టిబాబు సోమవారం మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులు చిట్టిబాబు నేత్రాలను దానం చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కుమారులు తిరుమలకుమార్, సురేష్‌కుమార్, అల్లుడు నేతాజీ గుప్తా తదితరులు పట్టణంలో అభయం యువజన సేవా సంఘానికి సమాచారం అందజేశారు. వారు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావుకు సమాచారం ఇవ్వడంతో, మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం నుంచి వైద్య బృందం టెక్కలికి చేరుకుని చిట్టిబాబు నేత్రాల నుంచి కార్నియాలను సేకరించారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు 30 రోజులు జైలు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఏడురోడ్ల కూడలిలో ఈనెల 9న మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి సోమవారం కోర్టు 30 రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ నాగరాజు వెల్లడించారు. పోలాకి మండలానికి చెందిన ఇర్రి శ్రీను ఈనెల 9న మధ్యాహ్నం 2.05 గంటలకు ఏడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించిన ట్రాఫిక్ పోలీసులు శ్రీను పై కేసు నమోదు చేశారు. ఛలానాయే కదా.. కట్టేయొచ్చనుకుని కోర్టుకు వెళ్లిన శ్రీనుకు న్యా యమూర్తి 30 రోజుల జైలు శిక్ష విధించారు. -
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న తహసీల్దార్
కొత్తూరు: పొనుటూరు గ్రామంలోని వంశధార నది నుంచి ఒడిశాకు అక్ర మంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ పట్టుకున్నారు. ఇక్కడ అక్రమాలపై ‘దేవుడి పేరుతో దోపిడీ’ పేరిట సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి తహసీల్దార్ స్పందించారు. పొనుటూరు నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పొనుటూరు–రుగడ రోడ్డులో పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.పది వేలు చొప్పున అపరాధ రుసుం విధించారు. మరోసారి దొరికితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. -
జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టాండన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో ఒరిస్సా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఈనెల 1న కేంద్రం ఆయన బదిలీని ప్రకటించింది. జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద 1989 జూలైలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆయన ప్రధానంగా కర్ణాటక మరియు మద్రాస్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. లా ఆఫ్ రైట్స్, ఎన్నికల చట్టాలు, సర్వీస్ చట్టాలలో ప్రత్యేకత సాధించారు. భారత ఎన్నికల కమిషన్‌కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, 1999లో అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), కర్ణాటక వెటర్నరీ సైన్సెస్ యూనివర్సిటీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. 2014 సంవత్సరంలో ఆయన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులై 2018 సంవత్సరం ఫిబ్రవరి 14 వరకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందేవరకు ఆయన ఆ పదవిలో నిరవధికంగా కొనసాగారు. 2026 సంవత్సరం జూలై 19న తన పదవి నుంచి విరమణ చేయనున్నారు. -
113 మంది అనాథ పిల్లలు గుర్తింపు
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితిలో మహిళా, శిశు సంక్షేమ కార్యాలయ ప్రాంగణంలో శిశు మంగళ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒక ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించి 113 మంది అనాథ పిల్లలను గుర్తించారు ఈ క్యాంప్ ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం తరుపున ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించి, మంచి విద్యనందించి భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా శిశు సురక్ష అధికారి నారాయణ్ దాస్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శిశు మంగళ కమిటీ చైర్మన్ సంయుక్త ప్రధాన్, పోడియా సమితి అధ్యక్షురాలు రీనా రాణీ రాతౌ, చైల్డ్‌లైన్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధుడి విగ్రహం ధ్వంసం
రాయగడ: బుద్ధ పూర్ణిమ రోజున ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. చంపిగడు గ్రామ సమీపంలోని కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు ఆదివారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లగా అక్కడ విగ్రహం ధ్వంసమవ్వడం గమనించి ఆందోళన చెందారు. దీంతో గ్రామంలోని భగత్‌సింగ్ యువజన సంఘానికి చెందిన ప్రతినిధులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. హేయమైన చర్య శాంతికి ప్రతిరూపమైన బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ జిల్లా శాఖ అధ్యక్షుడు జితు జకసిక అన్నారు. దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు చందిలి పంచాయతీ సర్పంచ్‌తో కలిసి కొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రఘునాథ్ పట్నాయక్ సేవలు చిరస్మరణీయం
జయపురం: మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని జయపురం – మల్కన్‌గిరి మార్గంలోని పవర్ హౌస్ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జయపురం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొంది, కేబినేట్లో మంత్రిగా పదవులు చేపట్టారన్నారు. అలాగే లా రివిజన్ కమిషన్ చైర్మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే నల్కో, హాల్ ప్రాజెక్టులతో పాటు, జయపురం లా కళాశాల, మహిళా కళాశాలలు నెలకొల్పడడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నేత బినోద్ మహాపాత్రో, న్యాయవాది, కాంగ్రెస్ నేత మదన మోహన్ నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, దుర్గా శతపతి, బీజేడీ కౌన్సిలర్ బి.విష్ణువర్ధణ రెడ్డి, రఘునాథ్ పట్నాయిక్ కుమారులు ధిరెన్ మోహన్ పట్నాయక్, ప్రతీష్ పట్నాయక్, ప్రియూష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో సోమవారం ఉదయం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు చవిచూసిన ప్రజలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు, గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది.అగ్నికార్తెలు వల్ల పర్లాకిమిడి పరిసర ప్రాంతంలో ఉదయం నిప్పులు వంటి ఎండ కాస్తున్నది. ఉదయం భగభగ మండే ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, సాయంత్రం కొద్ది పాటి వర్షంతో ఉపశమనం పొదారు. క్రికెట్ టోర్నమెంట్ విజేత కేవిడి టీమ్ జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితి ఆసన పంచాయతీ చంజరాగుడలో నిర్వహించిన జయ మా క్రికెట్ టోర్నమెంట్ విజేతగా జయపురం సమితి కేవిడి గ్రామ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో కేవిడి టీమ్, జబాకావిడి టీమ్‌లు తలపడ్డాయి. టాస్ గెలిచిన జబాకావిడి జట్టు మొదట బ్యాటింగ్ చేసి 16 ఓవర్లలో 64 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 65 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కెవిడి టీమ్ 10.3 ఓవర్లలో ఛేదించి విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ మంత్రి పద్మిణీ దియాన్ చేతులమీదుగా ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ బీజేడీ బీజేడీ అధ్యక్షుడు బృంధావన మల్లిక్, సర్పంచ్ జయంతి కుసపొరియ, సమితి సభ్యుడు గోరీ హరిజన్ తదితరులు పాల్గొన్నారు. వందే భారత్ రైలు నడపాలి జయపురం: భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు నడుపుతున్న వందే భారత్ రైలుని కొరాపుట్, జయపూర్ల మీదుగా ఛత్తీష్గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ వరకు నడపాలని రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో కోరారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జగదల్పూర్, జయపురం, కొరాపుట్, విశాఖపట్నంల మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపితే నవరంగపూర్, మల్కన్‌గిరి, కొరాపుట్ జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు బీజేడీ సీనియర్ నేత బాలా రాయ్, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు బి.బాలంకిరావు, జయపురం బ్లాక్ బీజేడీ మాజీ అధ్యక్షుడు శివ పట్నాయక్‌లు ఉన్నారు. వైద్య సేవకులకు నైటింగేల్ ఆదర్శనీయం జయపురం: ఎంతోమంది వైద్య సేవకులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆదర్శనీయురాలని సామాజిక కార్యకర్త ప్రకాశ మహానందియ అన్నారు. స్థానిక ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏఎన్ఎం నర్సింగ్ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల సేవా దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ భొత్ర మాట్లాడుతూ.. క్షతగాత్రులు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలనుకునే నర్సులు నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నర్సు వృత్తి ఎంతో పవిత్రమైనది పేర్కొన్నారు. కార్యక్రమంలో జ్యోతిర్మయి, వణిత నాయిక్, శాంతి భొత్ర, పాయల్ నాయిక్, అంచల బెహర, అభిమన్య బెనియ తదితరులు పాల్గొన్నారు. -
సురక్షిత రథయాత్రే లక్ష్యం
● డీజీపీ యోగేష్ బహదూర్ భువనేశ్వర్: ఈ ఏడాది పూరీలో సురక్షితంగా రథయాత్ర నిర్వహించడమే లక్ష్యమని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా అన్నారు. రథయాత్ర సన్నాహాలు సమీక్షించేందుకు ఆయన సోమవారం పూరీ ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీమందిరంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్ర సజావుగా నిర్వహించడంలో భక్తజన సమూహ నియంత్రణ, వ్యూహాత్మక వాహనాల రవాణా వ్యవస్థ, ప్రముఖుల కదలిక మధ్య దర్శనం క్రమబద్ధీకరణ అత్యంత కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఆద్యంతాలు రథాలు లాగడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. అనంతరం పూరీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు సీనియర్ అధికారులతో లోతైన చర్చలు జరిపారు. శ్రీమందిరం భద్రత వ్యవస్థ సమీక్ష ఈ సందర్భంగా డీజీపీ శ్రీమందిరంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధానంగా ఆధునిక భద్రతా మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించారు. భద్రతా సమీక్షలో జనసమూహ నిర్వహణ వ్యూహాలు, సీసీటీవీ నిఘా కవరేజ్, శీఘ్ర ప్రతిస్పందన బృందాలు, స్థానిక పాలన యంత్రాంగంతో సమన్వయం యొక్క వివరణాత్మక విశ్లేషణతో భద్రతా కార్యకలాపల్ని సమీక్షించారు. రథయాత్రకు అశేష సంఖ్యలో తరలివచ్చే ప్రతీ భక్తుడు, యాత్రికుని భద్రత, రక్షణపై సమగ్ర యంత్రాంగం అంకితభావంతో కృషి చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య శ్రీమందిరం ప్రాంగణాల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఆలయం చుట్టుపక్కల కనీసం 240 మంది పోలీసు సిబ్బందిని ఉంచారు. 4 మంది సభ్యుల జాతీయ భద్రతా గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోల బృందం వార్షిక భద్రతా సమీక్షలో భాగంగా రథయాత్రతో సహా ప్రధాన పండుగల సమయంలో ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు రద్దీ నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ పరిస్థితులను తరచూ సమీక్షిస్తు సమయానుకూలమైన చర్యలతో భద్రతా వ్యవస్థని వ్యూహాత్మక పటిష్టపరిచే దిశలో సమగ్ర యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. -
సరికొత్త అవకాశాలు సృష్టించాలి
భువనేశ్వర్: సాంకేతికత ఆవిష్కరణలకు పరిమితం కాకుండా మానవాళి సాధికారతకు దోహదపడి సంక్లిష్ట అడ్డంకుల్ని అధిగమించి, సరికొత్త అవకాశాలను సృష్టించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవ వేడుక మరియు స్థానిక ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) 64వ వార్షిక సాంకేతిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు దేశ సాంకేతిక నైపుణ్యత యాత్రలో మే 11, 1998 అత్యంత కీలకమైన దినంగా పేర్కొన్నారు. భారతదేశం ఆపరేషన్ శక్తి కింద పోఖ్రాన్లో అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని, మన దేశాన్ని అణ్వాయుధ దేశాల ఉన్నత సమూహంలో ఉంచిందని చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేశారు. ఈ పరీక్షలు భారతదేశ శాసీ్త్రయ పరాక్రమాన్ని మరియు స్వదేశీయంగా అభివృద్ధి చెందిన అణు సాంకేతికతను ప్రదర్శించాయన్నారు. జాతీయ సాంకేతిక దినం భారతదేశ ఆవిష్కరణల ధైర్యానికి, నాయకత్వ స్ఫూర్తి పునరుద్ఘాటన వేడుకగా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణ లక్ష్యంతో కృషి చేస్తున్న తరుణంలో అంతరిక్ష అన్వేషణ నుంచి వాతావరణ మార్పులు వరకు మన ఆకాంక్షలకు సాంకేతికత వెన్నెముక అన్నారు. పరిశోధనల పాత్ర కీలకం జాతీయ అభివృద్ధిలో ఆవిష్కరణలు, పరిశోధనల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, యువకులు కలలు సాకారం చేసుకునే దిశలో ఆవిష్కరణలు చేసి సమగ్రతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కృష్ణచంద్ర పాత్రో, దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రని ప్రస్తావించారు. విద్యార్థులు మరియు యువతలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను పేర్కొన్నారు. ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) అధ్యక్షుడు వి.బి.సింగ్ కూడా సభలో ప్రసంగించారు. ఐఈఐ రాష్ట్ర శాఖ చైర్మన్ ప్రొఫెసర్ (డాక్టర్) సుధాంశు శేఖర్ దాస్, కార్యదర్శి సంగ్రామ్ కేశరి పట్నాయక్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం సంస్థ వార్షిక సంచికని ఆవిష్కరించారు. గవర్నర్ హరిబాబు కంభంపాటి ఘనంగా సాంకేతిక దినోత్సవం -
భాష భావ వ్యక్తీకరణకు మూలం
భువనేశ్వర్: భాష భావ వ్యక్తీకరణకు మూలమని సీఎం మోహన్‌చరణ్ మాఝీ అన్నారు. మయూర్భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్ పరిధిలోని మొహుళొడిహా ప్రాంతంలో సంతాలి భాషకు చెందిన అల్‌చికి లిపి శత వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. అల్‌చికి లిపి ఆవిష్కర్త గురు గోమ్కే పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి సందర్భంగా వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దండ్ బోస్ ప్రాంతంలో పండిట్ రఘునాథ్ ముర్ము నివాసాన్ని స్మారక తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని, ఆయన సమాధి స్థలానికి చారిత్రక స్మారక స్థలం హోదా కల్పిస్తామని ప్రకటించారు. అల్‌చికి లిపి శత వార్షికోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఒక ఏడాది పాటు నిరవధికంగా నిర్వహిస్తామన్నారు. సంతాలి భాషను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రూ.50 కోట్లతో భాష ప్రాచుర్యం పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన అన్ని పుస్తకాలు ప్రాచుర్యం పొందేలా చేయడానికి బరిపదలో అల్‌చికి లైబ్రరీ, పండిట్ రఘునాథ్ ముర్ము ఓపెన్ థియేటర్ మ్యూజియం మరియు తన కార్యాలయంలో ఒక వారసత్వ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాల సమగ్ర వ్యయ ప్రణాళిక రూ.50 కోట్ల ప్యాకేజీగా తెలియజేశారు. పండిత్ రఘునాథ ముర్ము రచనలు కేవలం అక్షర జ్ఞానానికి పరిమితం కాలేదని, సాంస్కృతిక పురోగతిలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కరించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ లిపికి, సంతాలి భాషకు నిరంతరం ప్రత్యేక ప్రాధాన్యతతో మద్దతు ఇస్తుందని సీఎం మోహన్ చరణ్ మాఝీ ఘనంగా అల్‌చికి లిపి శత వార్షికోత్సవంహామీ ఇచ్చారు. ప్రాథమిక విద్యలో సంతాలి భాషా సంస్థలను స్థాపించడం, పాఠ్యపుస్తకాల ప్రచురణ, ఉపాధ్యాయులకు శిక్షణ మరియు భాషా అభివృద్ధి కేంద్రాలను సృష్టించడం ద్వారా ఉజ్వల భవిష్యతు ఆవిష్కరణకు బలమైన మార్గం సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన వ్యక్తి రఘునాథ్ ముర్ము కార్యక్రమానికి హాజరైన ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ పండిత్ రఘునాథ్ ముర్ము ఒక అద్భుతమైన వ్యక్తిగా కీర్తించారు. అతను నిరంతరం సుగంధం వెదజల్లే భాషా పుష్పమని కొనియాడారు. రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి విభాగం మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపాత్రో పండిట్ ముర్మును విశేష శక్తులు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. అటవీ, పర్యావరణ మంత్రి గణేష్‌రామ్ సింగ్కుంటియా తన ప్రసంగంలో ఈ పండుగ కారణంగా నేడు చరిత్ర పునరుద్ధరించబడిందన్నారు. అనంతరం ప్రఖ్యాత సంతాలి భాషా పరిశోధకుడు చుండా సోరెన్‌కు గురు గోమ్కే అంతర్జాతీయ అవార్డుతో పాటు రూ.1 లక్ష నగదు పురస్కారాన్ని సీఎం ప్రదానం చేశారు. పండిట్ ముర్ము వారసుడు చునియన్ ముర్ము, ప్రఖ్యాత సంతాలి రచయిత్రి, పద్మశ్రీ డాక్టర్ దమయంతి బేషారాను సత్కరించారు. కార్యక్రమంలో మయూర్భంజ్ జిల్లా ఎంపీలు మమతా మహంత, నవచరణ్ మాఝీ, రాయ్‌రంగ్‌పూర్ ఎమ్మెల్యే జలెన్ నాయక్, సొరొసొకొణా ఎమ్మెల్యే భాదవ్ హంసదా, కరంజియా ఎమ్మెల్యే పద్మచరణ్ హైబురు, బరిపద ఎమ్మెల్యే ప్రకాష్ సోరెన్, బొడొసాహి ఎమ్మెల్యే సనాతన్ బిజులి, బంగిరిపోషి ఎమ్మెల్యే సంజిలి ముర్ము, పండిత్ రఘునాథ ముర్ము ట్రస్టు కార్యదర్శి ఇంజినీరు విశ్వేశ్వర టుడు తదితరులు పాల్గొన్నారు. -
‘వందే భారత్ నడపాలి’
జయపురం: వందేభారత్ రైలును కొరాపుట్ వరకు నడిపించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి మోహణ మాఝిలకు లేఖలు రాశారు. భువనేశ్వర్–విశాఖపట్నం–అరుకు–కొరాపుట్ దూరం 669 కిలోమీటర్లేనని, అందుకే భువనేశ్వర్–విశాఖపట్నం వందే భారత్ రైలును విశాఖపట్నం నుంచి అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడపాలని డిమాండ్ చేశారు. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే వందే భారత్ రైలు కేవలం 444 కిలోమీటర్ల దూరం లోగల విశాఖపట్నం కేవలం 5 గంటలలో చేరుతుందని, మరో 225 కిలోమీటర్లు పొడిగిస్తే మరో 4 గంటల్లో కొరాపుట్ చేరి తిరిగి 9 గంటలలో భువనేశ్వర్ చేరుతుందని వివరించారు. అందువల్ల కొరాపుట్ జిల్లాలో నందపూర్, లమతాపుట్ మొదలగు ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు నేరుగా భువనేశ్వర్ వెళ్లే సదుపాయం కలుగుతుందన్నారు. -
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్
కొరాపుట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్‌ను అవిభక్త కొరాపుట్ జిల్లాలో పేద, బలహీన, బడుగు, గిరిజనులు తేరపైకి తీసుకువచ్చారు. ఆదివారం జయపూర్ సంధ్యా పంక్షన్ హాల్లో దళిత, మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఐక్య వేదిక ప్రత్యేక సదస్సు నిర్వహించింది. నబరంగ్‌పూర్‌కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు లలిత్ మెహన్ నాయక్ మాట్లాడుతూ కొరాపుట్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాలోని గిరిజనులకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు ఇచ్చిందన్నారు. వారు షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉన్నట్లు రాజ్యంగం గుర్తించిందన్నారు. ఉపాధి అవకాశాలు మాత్రం అందడం లేదన్నారు. ఈ ప్రాంతంలోని వనరులను తీసుకుంటూ, పరిశ్రమలు నడుపుతూ ఉపాధి మాత్రం స్థానికేతరులకు ఇస్తున్నారని ఆరోపించారు. దండకారణ్య లిబరేషన్ ఆర్గనేజేషన్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు మనస్వని టక్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. పాలకులు ఇక్కడి వెనుకబడిన తరగతుల ప్రజలను ఆదుకోలేదన్నారు. తాము నెల రోజులలో అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన వేలాది మందితో ప్రత్యేక కొరాపుట్ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దళిత, వెనక బడిన, మహిళా, సీనియర్ సిటిజన్లు, తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత
కొరాపుట్: దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత అని నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పేర్కొన్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మండయ్ గ్రౌండ్స్ సమీపంలో డాల్ఫిన్ రిసార్టులో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చే శిబిరంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దివ్యాంగులైనందుకు చింతించవద్దన్నారు. ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం మార్వాడి యువ మంచ్ సహాకారంతో రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా దివ్యాంగులకు అమరుస్తున్నారు. ఈ శిబిరానికి ప్రభుత్వ సహకారం అందించిందన్నారు. గత మూడు రోజులుగా ఈ శిబిరానికి అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి వందలాది దివ్యాంగుల వచ్చి ఉచితంగా కృత్రిమ అవయవాలతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పలువురు బాల దివ్యాంగుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. -
శ్రీ క్షేత్రంలో వైభవంగా నృసింహ జయంతి
● రథ స్తంభాల తయారీకి అంకురార్పణ భువనేశ్వర్: పవిత్ర వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి పురస్కరించుకుని సంప్రదాయం ప్రకారం ఆదివారం శ్రీ క్షేత్రంలో నృసింహ స్వామి జయంతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీమందిరం ముక్తి మండపం సమీపంలోని నరసింహ స్వామి ఆలయంలో నరసింహుడి జయంతి ఉత్సహభరితంగా నిర్వహించారు. సాయంత్రం ధూపం తర్వాత దక్షిణ గృహం నుంచి నరసింహ విగ్రహం పల్లకిలో ఊరేగింపుగా జగన్నాథ వల్లభ మఠానికి చేరి ఉత్సవ పూజాదులు అందుకున్నాడు. హిరణ్యకశిపుని వధ అక్కడే జరుగుతుంది. నరసింహుడిని జగన్నాథుని రక్షకుడిగా అభివర్ణించారు. ఆయన నందిఘోష రథానికి రక్షకుడు. శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథంలోని తొమ్మిది పార్శ్వదేవతలలో నరసింహ కూడా ఒకరు కావడం విశేషం. కొనసాగుతున్న రథాల తయారీ పనుల్లో నృసింహ జయంతి పురస్కరించుకుని ఈ పార్శ్వ దేవత తయారీ పనులకు అంకురార్పణ జరిపారు. ఈ సందర్భంగా రథాల స్తంభాల తయారీకి రూపకార్ సేవకులు శ్రీకారం చుట్టారు. 12 అడుగుల పొడవైన దూలం రథ తయారీ శాలకు తరలించడంతో విశ్వకర్మ మహరణల పర్యవేక్షణంలో లాంఛనంగా ఆరంభ పూజాదులు నిర్వహించారు. రూపకార్ వడ్రంగులు రథ స్తంభాలపై పార్శ్వ దేవతల మూర్తుల ఆకృతుల్ని తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియంలో భాగంగా తొలుత జగన్నాథుని నందిఘోష్ రథం స్తంభానికి నృసింహ మూర్తి ఆకృతిని తీర్చిదిద్దే పనులను ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణం సమీపంలోని బుర్జా జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను వ్యాన్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో సందస గ్రామానికి చెందిన పర్షు గౌడ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని ఉమ్మర్ కొట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఉమ్మర్ కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమం -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలను(కొరాపుట్,రాయగడ, నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాలు)ను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన పలువురు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఒక కల్యాణ మండపంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఖనిజ సంపదకు జల సంపదకు, అటవీ సందకు నిలయమైన అవిభక్త కొరాపుట్ నేటికీ అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉందని, ముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలకు, విద్య, వైద్య, వ్యవసాయం, సాగునీటి వనరుల, నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు సంతృప్తికరమైన చర్యలు చేపట్టలేదని పలువురు విమర్శించారు. ఒడిశా రాష్ట్రం ఏర్పడి 89 ఏళ్లు గడిచినా అవిభక్త కొరాపుట్ అభివృద్ధిలో అభివృద్ధి చెందలేదన్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సమావేశంలో నాలుగు జిల్లాల నుంచి పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతిపాదిత కొరాపుట్ స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటు సంఘం నిర్వహించిన సమావేశానికి దళిత సమాజ్ నేత ప్రభీర్ పాత్రో అధ్యక్షత వహించారు. సమావేశంలో రజిత్ బిశ్వాల్, జగన్నాథ్ పంగి, లలిత మోహణ నాయిక్, ప్రభాకర హంతాల్, దబ్యాధన్ సున, మనోరంజన్ కార్తీక్, భగీరత్ నాయిక్, అశోక్ పంగి. సుధీర్ పాత్రో, ఉదిత్ కోశ్ల, సను అనుగు, ప్రహ్లాద్ హంతాల్, మాలతీ మఝి, మనశ్విణీ టక్రి తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ఇవ్వాలి
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025సాయుధ దళాలకు.. ● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభవపాటి హరిబాబుభువనేశ్వర్: ఉగ్రవాదానికి మతం లేదు, హింసకు గ్రంథం లేదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి స్థానిక రాజ్ భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో అన్నారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత సంస్థ అధిపతులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హాజరయ్యారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ డాక్టర్ కంభంపాటి ఇది అమాయక పౌరులపై జరిగిన దాడి మాత్రమే కాదు, భారత దేశం అనే భావనపై – మన ఐక్యత, ప్రజాస్వామ్యం, శాంతిపై – దాడి అని అన్నారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులతో కూడిన ఆపరేషన్ సిందూర్‌ను సాయుధ దళాలు ప్రారంభించాయని ఆయన సభకు తెలియజేశారు. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మన ధైర్యవంతులైన సైనికులు మరోసారి ముందంజ వేశారని పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో మనం వారి వెనుక దృఢంగా నిలబడాలని రాష్ట్ర గవర్నర్ కోరారు. మరణించిన వారి కోసం, గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన మత సంస్థలకు పిలుపునిచ్చారు. సంఘీభావ ప్రదర్శనలో జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సమావేశం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని, విశ్వాసం, భాష, ఆచారాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ మన దేశాన్ని, దాని విలువలను రక్షించుకునే విషయంలో మనం ఐక్యంగా ఉన్నామని ఆయన అన్నారు. డాక్టర్ హరిబాబు కంభంపాటి పౌరులు, సైనికులు సహా బాధితుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారత దేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదని ప్రపంచానికి సందేశం పంపుదామన్నారు. మన ఐక్యత, మనల్ని రక్షించే వారికి అచంచలమైన మద్దతు మన బలం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఉగ్రవాదం మానవాళిపై యుద్ధం అని తెలిపారు. దేశానికి అవసరమైనప్పుడల్లా అన్ని సమాజాలు ఎలా కలిసి వస్తాయో చరిత్ర చూపిస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్ ధైర్యం, త్యాగాన్ని ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. మన గొప్ప గుర్తింపు భారతీయులుగా ఉండటం, కులం, మతం లేదా మత సంబంధాలకు అతీతంగా మనమందరం భారతీయులమని ఆయన అన్నారు. ఈ సర్వ ధర్మ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా మరియు సీనియర్ రక్షణ సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
20 యూనిట్ల రక్త సేకరణ
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం గ్రీష్మ కాల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వేసవిలో రక్త కొరత నివారించేందుకు ఒడిశా రక్త దాత మహాసంఘం ఆహ్వానం మేరకు జయపురం ప్రతిమ అంబిక ట్రస్టు గ్రీష్మ కాల రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ట్రస్టు అధ్యక్షురాలు మమత బెహర ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పెహల్గాన్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల తుపాకుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులర్పించారు. శిబిరంలో ట్రస్టు కార్యకర్తలు, ఒడిశా రక్తదాత మహాసంఘ ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌళో శిబిరాన్ని పర్యవేక్షించారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్బ్యంక్ టెక్నికల్ బృందం దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మమతా బెహర మాట్లాడుతూ.. రక్త దానం బృహత్తరమైనదన్నారు. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు, గర్భిణులకు, సికిల్‌సెల్, అలోసెమియ, కేన్సర్ రోగులకు రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు. రక్తాన్ని దానం చేసేందుకు అర్హులందరూ ముందుకు రావాలన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తే కొరతను నివారించవచ్చునన్నారు. ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఒడిశా బ్లడ్ డొనేషన్ శిబిరానికి పూర్తి సహకారం అందజేశారు. శనివారం రాష్ట్రంలో ఒడిశా రక్తదాత మహాసంఘం 45 రక్తదాన శిబిరాలు నిర్వహించి 1755 యూనిట్ల రక్తాన్ని సేకరించిందని మహాసంఘ ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌళో వెల్లడించారు. ఈ సందర్భంగా రక్త దాతలకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. -
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
కొరాపుట్: స్వగ్రామంలోని దేవాలయాలను హైకోర్టు మాజీ జడ్జి దంపతులు సందర్శించారు. ఆదివారం నబరంగ్‌పూర్ పట్టణానికి చెందిన మధ్యప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుశీల్ పాల్, అతని సతీమణి మధ్యప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అంజలీ పాల్ స్వగ్రామంలో పర్యటించారు. పురాతన ఈశ్వర్ మందిరం, జగన్నాథ, బండారు ఘరణి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాల్ దంపతులు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం స్వస్థలం. ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు రాక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీముఖలింగంలో భక్తుల సందడి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వైశాఖిమాసం మొదటి ఆదివారం భక్తులు సందడి చేశారు. హిరమండలం పరిధి అంబా విల్లి త్రినాథ స్వామికి మొదటి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శ్రీముఖ లింగం తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా నలుమూలలతోపాటు పక్క రాష్ట్రాలైన వియనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చకులు గణ పతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు చేశారు. మరికొంద రు తమ కోర్కెలు తీరడంతో గోలెంలో బియ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌కు గాయాలు రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో క్లీనర్ సదాశివం కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే హైవే పోలీసులు అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ముమ్మరంగా తనిఖీలు శ్రీకాకుళం క్రైమ్ : దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలోను, ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణ, పేలుడు పదార్థాల గుర్తింపు, సంఘ విద్రోహక శక్తుల అడ్డుకట్ట, కొత్త, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. కళకళలాడిన కాంప్లెక్స్ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించింది. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తిరుగు ప్రయాణంలో కాంప్లెక్స్‌లో నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం క్యూలో బారులు తీరుతూ కనిపించారు. నాన్‌స్టాప్ బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు నాన్‌స్టాప్ బస్సుల స్థానంలో పల్లెవెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపారు. -
దేవుడి పేరిట దోపిడీ
● పొనుటూరులో ఇసుక దందా ● ఒడిశాకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● వరద గట్టును సైతం తవ్వేసిన వైనం కొత్తూరు: దేవుడి పేరు చెప్పి మరీ అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ఆ నాలుగు గ్రామాల టీడీపీ నేతలకు దేవుడు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆలయాలు నిర్మిస్తున్నామంటూ పొనుటూరు పంచాయతీ పరిధిలోని పాతపొనుటూరు, పొనుటూరు కాలనీ, కొత్తపొనుటూరు, బంకి గ్రామాలకు చెందిన కొంత మంది నేతలు ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. కొత్తూరు మండలంలోని పాత పొనుటూరుకు అనుకొని ఉన్న వంశదార నదిలో అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లే ఆంధ్రా వాహనాల నుంచి రూ.200, ఒడిశా వాహనాల నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అసలే అక్రమ ర్యాంపు. ఆపై అక్రమ వసూళ్లు కావడంతో స్థానికులు కూడా నిశ్చేష్టులవుతున్నారు. గత 8 నెలలుగా ఈ దందా సాగుతోంది. నాలుగు గ్రామాలకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రెవెన్యూ, మైన్స్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాస్తవానికి ఆంధ్రా నుంచి ఇసుక ఒడిశాకు రవాణా చేయకూడదని నిబంధన ఉన్నా.. ఒడిశాకు చెందిన ట్రాక్టర్లతో పొనుటూరు నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు. ఒడిశాకు తరలిస్తున్న ట్రాక్టర్ నుంచి రూ. 500ను దేవుడి పేరుతో గుంజుకుంటున్నారు. సాక్షాత్తు గ్రామ సచివాలయం పక్క నుంచే అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇదే పంచాయతీ పరిధి బంకి గ్రామం నుంచి నదిలో ఇసుక అక్రమ రవాణా కోసం పూర్తిగా వరద గట్టును తవ్వేశారు. నదికి వరదలు వస్తే వరద నీరంతా పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా వంశధార ఇంజినీరింగ్ అధికారులకు పట్టడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని, అక్రమ ఇసుక రవాణా ఆపాలని కోరుతున్నారు. ●తగిన చర్యలు తీసుకుంటాను పొనుటూరు వంశధారలో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చర్యలు తీసుకుంటాను. ఒడిశాకు ఇసుక తరలించకూడదు. దేవుడి పేరుతో అక్రమ వసూళ్లు చేయడం నేరం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్ కొత్తూరు