
ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: పూరీ – హతియా తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏసీ బోగీ దెబ్బతింది. నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తారు. రెంగాలి, ఝార్సుగుడ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం వేకువజాము 5.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు గల కారణం తెలియలేదు. అనంతరం రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు నిందితులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. సమీప స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ సుదూర రైళ్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వుతున్నారు. దక్షిణ్ విహార్ ఎక్స్‌ప్రెస్, రౌర్కెలా – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపైనా ఇటువంటి రాళ్ల దాడి జరిగింది.

ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి

ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి