
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్‌మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్‌నగర్ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్‌లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్‌కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌కు రావాలని యజమానికి సూచించాడు.
అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్‌మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్‌లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.