
30 నుంచి మా సమిలాయి దుర్గ జాతర
రాయగడ: స్థానిక పాయికొ వీధిలో మా సమిలాయి దుర్గా అమ్మవారి వార్షిక జాతర ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ జాతరలో అమ్మవారి ఘటా లు ఊరేగింపు, ప్రత్యేక పూజలతో పాటు వివి ధ సాంసృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అమ్మవారి మందిరం ముస్తాబయ్యింది.
హైకోర్టుకు వేసవి సెలవులు
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టుకు ఈ నెల 19 నుంచి జూన్ 16 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణ కోసం ఈ నెల 20, 23, 27, 30, జూన్ 3, 4, 10, 13 తేదీలలో ధర్మాసనాలు పని చేస్తాయి. సెలవుల కాలంలో ఏకసభ్య ధర్మాసనం అత్యవసర కేసుల విచారణ చేపడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
విక్రయానికి సాగర్ మట్టి
జయపురం: జగన్నాథ్ సాగర్‌లో పూడిక తీసిన మట్టిని మున్సిపల్ అధికారులు విక్రయానికి పెట్టారు. సుమాు ఐదు వేల గనమీటర్ల మట్టి ఉంటుందని అంచనా వేశారు. దీన్ని విక్రయించడం ద్వారా మున్సిపాలిటికీ సుమారు రూ. మూడు లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక గనమీటర్ మట్టిని రూ. 58.50లుగా నిర్ణయించినట్టు మైనింగ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఓ ఒక ప్రకటన విడుదలైంది. జగన్నాథ్‌సాగర్ పనులు పునరుద్ధరించంటంతో ఆగర్ నుంచివచ్చిన మట్టిని వేలం వేసే బాధ్యతను మైనింగ్ విభాగానికి అప్పగించినట్టు మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి, సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి చెప్పారు. కాగా శనివారం నిర్వహించిన మట్టి వేలంలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల మధ్యే పాట సాగింది.
కార్యాలయం ఆవరణలో
మృతదేహం కలకలం
రాయగడ: జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చంద్రపూర్‌లో ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం బయట వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు అజాంబిల సహాని (53)గా గుర్తించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సహాని నాలుగేళ్ల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చారు. శనివారం ఉదయం అయన మృతదేహం కార్యాలయం బయట పడి ఉండటంతో గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
కొలువుదీరిన అగ్నిగంగమ్మ ఘటాలు
రాయగడ: స్థానిక పిట్లవీధిలో ప్రారంభమైన అగ్నిగంగమ్మ అమ్మవారి పండగలో భాగంగా శనివారం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు కొలువుదీరాయి. మందిరం పక్కనే గల ప్రత్యేక గదిలో వీటిని ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన భోగాలను భక్తులు సమర్పించారు. సాయంత్రం నుంచి పురవీధుల్లో ఘటాలు ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు మామిడి పండ్లు, బియ్యం, నగదును అమ్మవారి ఘటాల్లో వేసి మొక్కుకున్నారు.

30 నుంచి మా సమిలాయి దుర్గ జాతర

30 నుంచి మా సమిలాయి దుర్గ జాతర