చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా న్యాయ సహాయ ప్రాధీకరణ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. పురపాలక సంఘంలో సాలిడ్ వ్యర్థాల నిర్వాహణపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా న్యాయ సర్వీసుల ప్రాధికరణ ఆధ్వర్యంలో పర్లాకిమిడి పురపాలక సంఘం కాన్ఫరెన్స్ హాల్‌లో న్యాయ సహాయ అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. సదస్సులో పురపాలక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మణ ముర్ము, డీటీవో రవీంద్ర కుమార్ దాస్, హెల్త్ ఆఫీసర్ ఎరుకోల వెంకటరమణ, స్వచ్ఛ కార్యకర్తలు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పోస్కో, పోష్ చట్టాలు, బాల్యవివాహాల చట్టం అమలుకు పురపాలక సిబ్బంది సహకరించాలని అన్నారు. నల్సా లీగల్ ఎయిడ్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనికై నల్సా టోల్‌ఫ్రీ నంబర్ 15100 డయల్ చేయాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు.
జిల్లా న్యాయ సహాయ ప్రాధీకరణ కార్యదర్శి బిమల్ రవుళో
చట్టాలపై అవగాహన అవసరం


