ఎట్ట​కేలకు ఎంగేజ్‌మెంట్‌ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్‌ ఫేం | Arya Badai Gets Engaged To Fellow Bigg Boss Alum DJ Sibin | Sakshi
Sakshi News home page

ఎట్ట​కేలకు ఎంగేజ్‌మెంట్‌ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్‌ ఫేం

May 17 2025 3:23 PM | Updated on May 17 2025 5:54 PM

Arya Badai Gets Engaged To Fellow Bigg Boss Alum DJ Sibin

మలయాళ  టీవీ నటి,  యాంకర్‌ బిగ్‌బాస్‌ ఫేం ఆర్య  బాబు (ఆర్య బదై)  తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో  పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య  బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్‌ డిజైనర్‌ సిబిన్ బెంజమిన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన  వార్తను ఇద్దరూ ఇన్‌స్ట పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్‌ అభినందనలు తెలిపారు.

 
'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్'  అంటూ ఆర్య తన ఎంగేజ్‌మెంట్‌ వార్తను అభిమానులతో షేర్‌చేసింది. మలయాళం బిగ్ బాస్  2 లో ఆర్య, సిబిన్‌ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో  కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!

‘‘సిబిన్‌ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది.  ఇది అస్సలు ప్లాన్‌ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా,  నా కూతురు ఖుషీకి  ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్‌గా  ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం   నీచేతుల్లో..’’   అని పోస్ట్‌ పెట్టింది ఆర్య.

ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!

అటు సిబిన్‌ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు.  ఫోటోను షేర్ చేశాడు.  ఆర్యను   ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ...  నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో  హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.

కాగా   కాంచీవరం.ఇన్‌కు  ఫౌండర్‌ సీఈవోగా  ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి  ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో  ఆర్య, రోహిత్‌ విడిపోయారు.  ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్‌తో ప్రేమలో పడింది.  వీరు  చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు  తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు.  మరోవైపు సిబిన్‌కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement