బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి! | do you know Regrowing hair on a bald head is possible | Sakshi
Sakshi News home page

బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!

May 17 2025 9:59 AM | Updated on May 17 2025 11:56 AM

do you know Regrowing hair on a bald head is possible

వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.

అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. 

ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 

ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!

మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్‌ ప్యాచ్‌ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. 

సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement