ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌ | - | Sakshi
Sakshi News home page

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌

May 18 2025 1:04 AM | Updated on May 18 2025 1:04 AM

ఓపీసీ

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌

రాయగడ: ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సోషల్‌ మీడియా విభాగం చైర్మన్‌గా గుణుపూర్‌ ఎమ్మెల్యే సత్యజీత్‌ గొమాంగొ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సాధారణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. సత్యజీత్‌ నియామకంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

సేవాభావం అలవరుచుకోవాలి

పర్లాకిమిడి: సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పేదలకు, అణగారిన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ను కిట్‌ విశ్వవిద్యాలయం చైర్మన్‌, ఫౌండర్‌ అచ్యుతా సామంత్‌ ఏర్పాటుచేశారని కలెక్టర్‌ బిజయ కుమార్‌ దాస్‌ అన్నారు. స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాల హాలులో శనివారం ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ సంస్థ 12వ వార్షికోత్సవాన్ని కలెక్టర్‌తో పాటు ఎస్పీ జ్యోతింద్రనాథ్‌ పండా ప్రారంభించారు. అనంతరం అచ్యుతా సామంత్‌ రాసిన ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌– ఎ వే ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి, అధ్యాపకులు సంబిత్‌ కుమార్‌ పాణిగ్రాహి, ధీరజ్‌ పట్నాయిక్‌, గిరిధర్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

కొండను ఢీకొన్న కంటైనర్‌

రాయగడ: కొరాపుట్‌ జిల్లాలోని రాలేగెడ్డ ఘాట్‌ రోడ్డులో ఓ కంటైనర్‌ అదుపు తప్పి పక్కన కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో పది పశువులు మృతి చెందగా.. డ్రైవరు, హెల్పర్లకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి కొరాపుట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌లో పశువులను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా రాలేగెడ్డ మలుపులో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌ 1
1/3

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌ 2
2/3

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌ 3
3/3

ఓపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా సత్యజీత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement