
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ ప్రపంచ అందాల పోటీల సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఆదివారం సాయంత్రం సండే ఫండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను తిలకించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
























