
కుల గణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్ని కల్లో లబ్ధి కోసమే తన విధా నాన్ని మార్చుకుందను కున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం తప్పక మెచ్చుకోవాలి. అయితే, సామా జిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమే కానీ పరిష్కారం కాదు; సాధనమే కానీ సమా ధానం కాదు. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయ ఆర్థిక, సామాజిక, కుల మత గణన జరగాలి. కులగణన వల్ల దేశంలో ఏ కులస్థులు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో, ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన డానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వా నికి నిజాయితీ ఉంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు.
ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగు తాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికే కాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వంటి అమూర్త, సామూహిక ఉను కులు ఉండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే ఉంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ కూడా ఉండదు. ప్రతి కులానికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సిఉంటుంది.
దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషే«ధితమైన విగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్నీ, వ్యాపారా లనూ; ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటోలు వంటి వాటిలో చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం ప్రకటనలు చేస్తు న్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యాపారుల్ని హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తున్నాం.
ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతు న్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతు న్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వే షన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా?దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రద మైన అంశం. టెలీకమ్యూనికేషన్స్, ఐటీ, రెన్యూవ బుల్ ఎనర్జీ, మౌలికరంగ నిర్మాణాలు, ఇ–కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా స్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్– గ్యాస్, పెట్రో కెమి కల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, గనులు, సహజ వన రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది. వీటి యాజ మాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాం అంటారా? వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుద్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగు తున్నాయి. ఒకవైపు సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం 2025లో భారత స్థూల జాతీయోత్పత్తి నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతోంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుందనే అంచనా ఉంది.
‘ఆక్స్ ఫామ్ సంస్థ ఇటీవల ప్రకటించిన‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్భ్రాంతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 77 శాతం ఓ పది శాతం ధనికుల చేతుల్లో ఉందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఉందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేద రికం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.సంపద పంపిణీలో అసమానత్వం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమిటంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్య వాదం కూడా ఉంది. 39వఅధికరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచా లని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ రెండేళ్ళ క్రితం బీజేపీ చాలా హంగామా చేసింది. అటు ఆదే శిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ ఉన్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టీ మాట్లాడడం లేదు.
-డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు