కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్‌ స్పెషల్‌ ఏంటో తెలిస్తే..! | Cannes Film Festival 2025: Parul Gulati debut in a strapless hair-braided gown | Sakshi
Sakshi News home page

కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్‌ స్పెషల్‌ ఏంటో తెలిస్తే..!

May 17 2025 5:45 PM | Updated on May 17 2025 5:54 PM

Cannes Film Festival 2025: Parul Gulati debut in a strapless hair-braided gown

ప్రతిష్టాత్మక కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో (CannesFilmFestival-2025) నటి , వ్యవస్థాపకు రాలు పరుల్‌ గులాటి(Parul Gulati) బోల్డ్‌గా అరంగేట్రం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రముఖ దర్శకుడు అరి ఆస్టర్ తాజా చిత్రం ఎడింగ్టన్ ప్రపంచ ప్రీమియర్‌కు హాజరైన అందర్నీ ఆశ్చర్యపర్చింది.  పరుల్ గులాటి తన సొంత హెయిర్  ఎక్స్‌టెన్షన్ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తూ, ప్రదర్శిస్తూ  రెడ్ కార్పెట్‌పై నడిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్‌ మీద అందం, ధైర్యం, వ్యాపారాన్ని మిళితం చేసి జుట్టుతో  ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులతో ఐకానిక్ అరంగేట్రం  విశేషంగా నిలిచింది.  

పరుల్, అత్యంత ప్రత్యేకమైన, విచిత్రమైన దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించింది. కస్టమ్-మేడ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా జుట్టుతో తయారు చేసిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లో పరుల్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది.  ఈ దుస్తులను రూపొందించడానికి నెల కంటే ఎక్కువ సమయం పట్టిందని, దీనికి 12 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించిఆరు. ఈ డ్రెస్‌తో పాటు,  స్టేట్‌మెంట్ డైమండ్ చెవిపోగులు, బోల్డ్ చంకీ రింగ్, ఓపెన్-టో బ్లాక్ హీల్స్‌తో  హుందాగా  అడుగులు వేసింది. ఈ  స్పెషల్‌ కాస్ట్యూమ్‌కు  రిద్ధి బన్సాల్ తో పాటు ప్రఖ్యాత స్టైలిష్ , డిజైనర్ మోహిత్ రాయ్ కూడా జీవం పోశారు

తన లుక్ వెనుక ఉన్న భావోద్వేగ , సృజనాత్మక ఉద్దేశ్యాన్ని వివరించింది  ఈ బ్యూటీ.- " పూర్తిగా మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులను ధరించడం అంటే ఫ్యాషన్ సరిహద్దులను దాటడం మాత్రమే కాదు. ఇది నేనే అని చాలా బిగ్గరగా మాట్లాడే దుస్తులు.. నేను ‘నిష్ హెయిర్’ వ్యవస్థాపకురాలిగా నా స్వంత  బ్రాండ్‌ జుట్టును ధరిస్తున్నాను. నా దృష్టికి ప్రాణం పోసిన నా డిజైనర్ స్నేహితుడు మోహిత్ రాయ్ తో కలిసి..జడను జడగా అల్లిన కథ ఇది. కాన్స్ వంటి ఐకానిక్ వేదికపై నా సృజనాత్మక, వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం. రెడ్‌ కార్పెట్‌   తన కల’’ అని పేర్కొంది.

ఈ ప్రత్యేకమైన హెయిర్-మేడ్ డ్రెస్‌తో పరుల్‌ ప్రత్యేకంగా నిలబడటం మాత్రమే కాదు, మహిళలు తమ అందాన్ని నమ్మకంగా స్వీకరించేలా,  ఒక వ్యవస్థాపకురాలిగా పరుల్‌ ప్రయాణానికి సింబాలిక్‌గా ఉందంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement