breaking news
Designer Dress
-
పాక్ మాజీ ప్రధాని ఇంట పెళ్లి.. భారతీయ దుస్తులపై దుమారం
భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితంగానే ఉంటాయి. దేశ విభజన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గాం దాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి, రెండు దేశాలు యుద్ధానికి చేరువయ్యాయన్న భావన కూడా నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి కారణం వధువు భారతీయ ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించడం.ఎవరిదీ వివాహం?నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్, లాహోర్‌లో షాంజే అలీ రోహైల్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ, వధువు దుస్తులు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువయ్యాయి. జునైద్ సఫ్దర్‌కు ఇది రెండో వివాహం. ఆయన 2021లో అయేషా సైఫ్ ఖాన్‌ను వివాహం చేసుకోగా, ఇద్దరూ 2023 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఆకర్షణగా నిలిచిన పెళ్లి దుస్తులుమెహెందీ వేడుకలో షాంజే అలీ, భారతీయ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు జరీ వర్క్‌తో కూడిన ఆకుపచ్చ లెహంగా, డబుల్ దుపట్టాతో మెరిశారు. ప్రధాన వివాహ వేడుకలో ఆమె తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఎరుపు చీరను ధరించారు. తలపై ఎరుపు ముసుగు, జుట్టులో సొగసైన బన్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ఫొటోలను పాకిస్తాన్ సిటిజన్ మీడియా పోర్టల్ ‘డైలాగ్ పాకిస్తాన్’ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన మొదలైంది. పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది నెటిజన్లు, ఇంతటి రాజకీయ కుటుంబానికి చెందిన కోడలు పాకిస్తాన్ డిజైనర్లను పక్కన పెట్టి భారతీయ డిజైన్లను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కొందరు పాకిస్తాన్ నేతలు భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.అయితే మరికొందరు వధువును సమర్థిస్తూ, ఇది వివాహం పూర్తిగా వ్యక్తిగత అంశమని, తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్తాన్ డిజైనర్లు కూడా అంతే స్థాయిలో ప్రతిభావంతులేనని కొందరు అభిప్రాయపడ్డారు. -
కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్ స్పెషల్ ఏంటో తెలిస్తే..!
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో (CannesFilmFestival-2025) నటి , వ్యవస్థాపకు రాలు పరుల్ గులాటి(Parul Gulati) బోల్డ్‌గా అరంగేట్రం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ దర్శకుడు అరి ఆస్టర్ తాజా చిత్రం ఎడింగ్టన్ ప్రపంచ ప్రీమియర్‌కు హాజరైన అందర్నీ ఆశ్చర్యపర్చింది. పరుల్ గులాటి తన సొంత హెయిర్ ఎక్స్టెన్షన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ మీద అందం, ధైర్యం, వ్యాపారాన్ని మిళితం చేసి జుట్టుతో ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులతో ఐకానిక్ అరంగేట్రం విశేషంగా నిలిచింది. పరుల్, అత్యంత ప్రత్యేకమైన, విచిత్రమైన దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించింది. కస్టమ్-మేడ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా జుట్టుతో తయారు చేసిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లో పరుల్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది. ఈ దుస్తులను రూపొందించడానికి నెల కంటే ఎక్కువ సమయం పట్టిందని, దీనికి 12 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించిఆరు. ఈ డ్రెస్‌తో పాటు, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు, బోల్డ్ చంకీ రింగ్, ఓపెన్-టో బ్లాక్ హీల్స్‌తో హుందాగా అడుగులు వేసింది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్‌కు రిద్ధి బన్సాల్ తో పాటు ప్రఖ్యాత స్టైలిష్ , డిజైనర్ మోహిత్ రాయ్ కూడా జీవం పోశారుతన లుక్ వెనుక ఉన్న భావోద్వేగ , సృజనాత్మక ఉద్దేశ్యాన్ని వివరించింది ఈ బ్యూటీ.- " పూర్తిగా మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులను ధరించడం అంటే ఫ్యాషన్ సరిహద్దులను దాటడం మాత్రమే కాదు. ఇది నేనే అని చాలా బిగ్గరగా మాట్లాడే దుస్తులు.. నేను ‘నిష్ హెయిర్’ వ్యవస్థాపకురాలిగా నా స్వంత బ్రాండ్ జుట్టును ధరిస్తున్నాను. నా దృష్టికి ప్రాణం పోసిన నా డిజైనర్ స్నేహితుడు మోహిత్ రాయ్ తో కలిసి..జడను జడగా అల్లిన కథ ఇది. కాన్స్ వంటి ఐకానిక్ వేదికపై నా సృజనాత్మక, వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం. రెడ్ కార్పెట్ తన కల’’ అని పేర్కొంది.ఈ ప్రత్యేకమైన హెయిర్-మేడ్ డ్రెస్‌తో పరుల్ ప్రత్యేకంగా నిలబడటం మాత్రమే కాదు, మహిళలు తమ అందాన్ని నమ్మకంగా స్వీకరించేలా, ఒక వ్యవస్థాపకురాలిగా పరుల్ ప్రయాణానికి సింబాలిక్‌గా ఉందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. -
డిజైనర్ డ్రస్‌లో సిమ్రాన్ చౌదరి స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)


