
దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2024 అక్టోబర్ 21వ తేదీన నవరంగపూర్ జిల్లా తెంతులికుండ్ సమితి పాత్రోపుట్ గ్రామం మార్గంలో జరిగిన దొంగతనంలో శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సబ్బీర్ అహమ్మద్ నేడు వెల్లడించారు. 2024 అక్టోబర్ 21 వ తేదీన సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో తెంతులికుంటి సమితి పాత్రోపుట్ గ్రామం సహింసు బిశాయి బైక్ పై వెలుతున్న సమయంలో రంగమఠిగుడ గ్రామం సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను ఆపి కత్తి చూపి అతడిని దోచుకున్నారు. అతడి మొబైల్ ఫోను కూడా తీసుకు పోయారు. ఈ విషయంఫై బిశాయి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో నిందితులను గుర్తించి వారిని ఈ నెల 16 వ తేదీన అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 5 సెల్ ఫోనులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు.అరెస్టు అయిన వారు మఝిగుడ గ్రామం దిలు బర్బరి(18)బాబి హరిజన్(21) లు అని వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరచినట్లు వెల్లడించారు. నిందితులపై మరో నాలుగు దొంగతనం కేసులు ఉన్నటగ్లు అధికారి వెల్లడించారు.