
మిడ్ డే మీల్ వర్కర్ల ఆందోళన
రాయగడ: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిడ్ డే మీల్ వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జిల్లాలోని గుణుపూర్ పాత బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చిన వీరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం ఒక వినతిపత్రంను సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాటకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మిడ్‌డే మీల్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడం లేదని వారంతా పేర్కొన్నారు. వీరి ఆందోళనకు ఎఐసిసిటియు మద్దతును తెలిపింది. సిపిఐ (ఎంఎల్) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగో కూడా పాల్గొన్నారు.