
నడకతో సంపూర్ణ ఆరోగ్యం
రాయగడ: స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నడకపై చైతన్య ర్యాలీని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు కె.సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో విద్యార్థులు, కాలనీ వాసులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోజూ ఉదయం నడవండి సంపూర్ణ ఆరోగ్యం పొందండి అనే నినాదాలతో నిర్వహించిన ర్యాలీలో భాగంగా క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎం. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రోగాలు దరి చేరకుండా ఉండాలంటే అందుకు ఆరోగ్య సూత్రంలో ప్రధానమైనది నడకేనని అన్నారు. ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి రోజూ నడవాలని అన్నారు.
ర్యాలీలో విద్యార్థులు, క్లబ్‌సభ్యులు