
నవ్వించడం ఒక కళ
ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం
రాయగడ: నవ్వించడం ఒక కళ అని, నవ్వడంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి అన్నారు. మంగళవారం క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్వడం, నవ్వించడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన లాఫర్స్ క్లబ్ ఆ దిశగా భవిష్యత్ ప్రణాళికలతో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రతీ వారం కనీసం ఒక ప్రాంతంలో ఇటువంటి తరహా నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అందుకు సభ్యులంతా సుముఖత వ్యక్తం చేశారు. నవ్వు వల్ల కలిగే లాభాలు వంటి అంశాలతో ర్యాలీలను నిర్వహించి చైతన్య పరిచేందుకు సభ్యులు సహకరించాలన్నారు. సమావేశంలో క్లబ్ కార్యదర్శి లాల్ బిహారి లెంక, దశరథి రాజ్‌గురు, అభిమన్యు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
జయపురంలో..
జయపురం: స్థానిక బిజూపట్నాయక్ శాంతి ఉద్యానంలో విద్యార్థులతో నవ్వుల కార్యక్రమం నిర్వహించారు. బలంగీర్ జిల్లాలో ప్రసిద్ధ సంస్థ నిఝరిణ ినిర్వహించిన నవ్వుల కార్యక్రమాన్ని ఆ సంస్థ కార్యదర్శి బిరంచి నారాయణ దాస్ పర్యవేక్షించారు. ముఖ్యఅతిథిగా అధ్యాపకులు డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ హాజయ్యారు. నవ్వటం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, బెలూన్లతో ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనంలో అరూష్ పట్నాయక్ ప్రథమ బహుమతి, అభిప్స్ ద్వితీయ బహుమతి సాధించారు. భారత సైనికులు చేపట్టిన సిందూర్ ఆపరేషన్‌పై ప్రశ్నలు అడిగారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. గౌరవ అతిథిగా సమాజసేవి ప్రమోద్ కుమార్ రౌళో, అభినేష్ శాంతపాత్రో, అంశిత్ పట్నాయక్, అంశుమాన్ పండా, అర్ణభ పట్నాయక్, అభిస్ప సాహు పాల్గొన్నారు.

నవ్వించడం ఒక కళ