నొగొడాలో చీఫ్‌ సెక్రటరీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నొగొడాలో చీఫ్‌ సెక్రటరీ పర్యటన

May 14 2025 1:13 AM | Updated on May 14 2025 1:13 AM

నొగొడ

నొగొడాలో చీఫ్‌ సెక్రటరీ పర్యటన

క్రమం తప్పకుండా ఆరోగ్య అవగాహన శిబిరాలను నిర్వహించాలని అధికారులను కోరారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ఆరోగ్య సేవలు, సీ్త్ర మరియు శిశు అభివృద్ధి, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రముఖ కార్యదర్శి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగువ నొగొడా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. మమత యోజన లబ్ధిదారులతో మనోజ్‌ ఆహుజా సంభాషించారు. గతంలో మినహాయించబడిన అర్హులైన వ్యక్తులందరినీ ఈ పథకంలో చేర్చాలని అధికారులను ఆదేశించారు.

కాలియాపాణి నుంచి నొగొడా వరకు ప్రభుత్వం రోడ్లు, నీరు, సౌర దీపాలు, ఇతర సౌకర్యాలను కల్పించింది. రోడ్ల మరమ్మతు, వీధి దీపాల ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను ప్రకటించారు. 2018 సంవత్సరం నుంచి బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల ఆరోగ్య సంరక్షణ, అవసరమైన సేవలు అక్కరకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఖనిజ నిధి వనరులతో మొరాయించిన బస్సు రవాణా సౌకర్యం పునరుద్ధరణకు అధికారులకు ఆదేశించారు. ఈ నిధుల సద్వినియోగంతో గిరిజన యువతకు ఆటో రిక్షాలు అందజేయాలని స్థానిక జిల్లా కలెక్టరుకు తెలిపారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సక్రమ అమలు, ఏడాది పొడవునా నీటి లభ్యత కోసం చెరువులు వంటి జలాశయాలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. గత మూడేళ్లుగా గ్రామంలో మూసిన గిరిజన హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ ఆహుజా జాజ్‌పూర్‌ జిల్లా సుకిందా మండలం నొగొడా గ్రామాన్ని సందర్శించారు. నొగొడా ఒక ఆదర్శ గిరిజన గ్రామంగా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన ముఖాముఖి చర్చించారు. ప్రధానంగా ప్రజా సంక్షేమానికి సంకల్పించిన ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణ, వాస్తవ లబ్ధిని క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. రాష్ట్రంలో నొగొడా గ్రామం ఆకలి చావుల ప్రాంతంగా తీవ్ర కలకలం రేపింది. 2016లో పోషకాహార లోపం కారణంగా ఈ ప్రాంతంలో జువాంగ్‌ గిరిజన సమాజంలో 19 మంది పిల్లలు మరణించడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ కార్యదర్శి సందర్శనలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, తాగునీటి శాఖ కార్యదర్శి గిరీష్‌ ఎస్‌ఎన్‌ మరియు జాజ్‌పూర్‌ కలెక్టర్‌ పి.అన్వేష రెడ్డి, వివిధ శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామస్తులతో ఆయా శాఖలు, విభాగాల కార్యాచరణ సాఫల్యత విశ్లేషణ కోసం మాట్లాడారు.

సుభద్ర యోజన పథకం కింద గిరిజన మహిళలకు పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేటప్పుడు

నొగొడాలో చీఫ్‌ సెక్రటరీ పర్యటన1
1/1

నొగొడాలో చీఫ్‌ సెక్రటరీ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement