
కొరాపుట్‌లో ‘ఎయిమ్స్’ ఏర్పాటు చేయాలి
జయపురం: కొరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) శాటిలైట్ కేంద్రం ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క కోరారు. గురువారం భువనేశ్వర్‌లో ఎయిమ్స్ పదవ ప్రతిష్టా సమావేశంలో ఎయిమ్స్ సభ్యులైన భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షొడంగి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్కలు పాల్గొన్నారు. ఎయిమ్స్ భువనేశ్వర్ సమగ్ర వికాసం, ఉత్తమపాలన, ఉత్తమ వైద్య సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో ఎయిమ్స్ శాటిలైట్ కేంద్రం ఏర్పాటు చేయాలని కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను సమావేశం ఆమోదించిందని ఉల్క తన సొంత సోషల్ మీడియాలో సూచన ప్రాయంగా వెల్లడించారు. అతిత్వరలోనే కొరాపుట్ లోక్‌సభ పరిధిలో ఒక ఎయిమ్స్ శాటిలైట్ కేంద్రం ఏర్పాటు జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బాలేశ్వర్‌లో ఇటువంటి సెటలైట్ కేంద్ర ఏర్పాటు జరిగిందని వెల్లడించారు.
ఎంపీ సప్తగిరి శంకర ఉల్క విజ్ఞప్తి

కొరాపుట్‌లో ‘ఎయిమ్స్’ ఏర్పాటు చేయాలి