
యువకుడిపై దుండగుల దాడి
జయపురం: దుండగుల దాడిలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురైనట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు. గాయపడిన యువకుడు స్థానిక క్రిస్టియన్‌పేటకు చెందిన సమీర్ గుణియగా గుర్తించారు. క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం సమీర్ గుణియ 26వ జాతీయ రహదారి స్వాతంత్య్ర సమరయోధురాలు దివంగత లక్ష్మీ పండ జంక్షన్ వద్ద కూర్చొని ఉండగా, కొంతమంది దుండగులు వచ్చి కత్తితో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జోరుగా రోడ్డు పనులు
పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని ఫారెస్టు గేటు నుంచి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా పాతకోర్టు జంక్షన్ వరకు తారురోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విన్నపాలు మేరకు పనులు చేపడుతున్నారు. సుమారు రూ.9 కోట్లతో పనులు జరుగుతున్నట్లు ఎస్‌ఈ అభిషేక్ శెఠి తెలియజేశారు.
16 నుంచి
అగ్ని గంగమ్మ పండగ
రాయగడ: స్థానిక పిట్టలవీధిలో అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక పండగలు ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్నాయి. 5 రోజుల పాటుగా జరిగే ఈ పండగలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మందిరం ముస్తాబయ్యింది. హిందూ, ముస్లింలు కలిసి సాంప్రదాయబద్ధంగా పండగను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.
విద్యాదాస్‌కు ప్రతిష్టాత్మకఅవార్డు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితిలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ అగ్రగామికి చెందిన జాయింట్ డైరక్టర్ విద్యాదాస్‌కు ప్రతిష్టాత్మకమైన భగవాన్ మహావీర్ ఫౌండేషన్ అవార్డు లభించింది. చైన్నెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందుకున్నట్లు సోమవారం తెలియజేశారు. విద్యారంగంలో చేసిన సేవలకు గానూ ఈ అవార్డును ప్రకటించినట్లు ఆమె తెలిపారు. అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహం అందించారన్నారు.

యువకుడిపై దుండగుల దాడి

యువకుడిపై దుండగుల దాడి

యువకుడిపై దుండగుల దాడి