
కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: కుర్రకారు కండల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం ఉత్తరాంధ్ర జోనల్‌స్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు కన్నులపండువలా సాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ శరీర సౌష్టవ పోరులో అండర్– 50 నుంచి 85 కేజీల విభాగం, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పోటీల ప్రదర్శనలో కుర్రకారు జోరు ప్రదర్శించారు. స్టార్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు వి.విజయ్‌కుమార్, బి.ప్రసాద్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 80 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీకాకుళానికి చెందిన దివ్యాంగ బాడీబిల్డర్ తుపాకుల అనీల్‌కుమార్ విశేషంగా ఆకట్టుకున్నాడు. జాతీయ దివ్యాంగుల బాడీబిల్డింగ్ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని రిఫరీలు భరోసా ఇచ్చారు.

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు