
పిడుగు పడి ముగ్గురు దుర్మరణం
జయపురం: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి ఒడియపెంట పంచాయతీ పొరిడిగుడ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడి ముగ్గురు మృతి చెందగా.. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వర్షం పడుతున్న సమయంలో వారు ఓ గుడిసెలో తల దాచుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడడంతో అందులో ఉన్న ముగ్గురూ మృతి చెందారు. మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. చనిపోయిన వారిలో బుద్దా మండంగి(60) ఆమె మనుమరాలు కొశా మండంగి(18)తో పాటు కుంబారిగుడ గ్రామానికి చెందిన అంబిక (35) ఉన్నారు. హింగు మండంగి అనే మరో మహిళ గాయపడ్డారు. ఆమెను లక్ష్మీపూర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల కిందట కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి అంపావల్లి పంచాయితీ ప్రాంతంలో పిడుగు పడి ముగ్గురు మరణించిన విషయం విదితమే. ఆ సంఘటన మరుకవ ముందే లక్ష్మిపూర్ సమితిలో ఈ సంఘటన జరిగింది.