
ఇస్కాన్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య ప్రదర్శన
పర్లాకిమిడి: స్థానిక డెప్పో ఒడియా వీధి నామహాట్టో కేంద్రం తరఫున ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకూ సమ్మర్ క్యాంపు ఇస్కాన్ ఆధ్వర్యంలో టౌన్ హాల్‌లో నిర్వహించారు. ముగింపు సమావేశంలో బృందావనం నుంచి విచ్చేసిన కృష్ణ భక్తులు పాద ప్రతాప్ రుద్రదాస్, ఇస్కాన్ ప్రభు పాద పంచరత్న దాస్‌లు ఆదివారం విచ్చేశారు. ముఖ్యఅతిథిగా పురపాలక అధ్యక్షురాలు నిర్మలాశెఠి విచ్చేశారు. ఒకటి నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలు ఆధ్యాత్మిక సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. సుమారు 300 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొన్నారు.

ఇస్కాన్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య ప్రదర్శన