జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులపై సమీక్ష
జయపురం: జయపురంలో చారిత్రక జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కావటంతో ఆ పనులను జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ అధికారి, సాగర్‌లో మట్టి, బురద వెలికి తీసే కాంట్రాక్టర్లతో బాహిణీ పతి చర్చించారు. వర్షాకాలంలో కూడా పునరుద్ధరణ పనులు జరగాలని ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి స్పష్టం చేశారు. సాగర్‌లో బుర ద పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక వాహనం రప్పిస్తామని ఆయన వెల్లడించా రు. బురద తీసే సమయం రాత్రి 9 గంటల వరకు ఉండగా ఆ సమయాన్ని 12 గంటల వరకు కొనసాగించాలని ఆదేశించారు. జగన్నాథ్ సాగర్‌ను రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆయన వెల్లడించారు. రెండోసారి పునరుద్ధరణ పనుల కోసం 9 కోట్ల 45 లక్షలు వ్యయపు అంచనా ను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. సాగ ర్ పునరుద్ధరణ పనులు 45 రోజుల్లో పూర్తి చేస్తా మని కాంట్రాక్టర్ సంస్థ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులను ఆర్ అండ్ బి ఇంజనీర్, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్, మున్సిపాలిటీ ఇంజినీ ర్లు పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, అదనపు కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సా హు, ఇంజనీర్ అజయ కుమార్ జానీ, జూనియర్ ఇంజనీర్ ప్రతాప్ చంధ్ర ఆచార్య, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్ సుప్రభ కువార్, ఆర్ అండ్ బి ఇంజినీర్ విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులపై సమీక్ష


