సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలో త్వరలో జరగనున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం–2025కు సంబంధించిన లోగోను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదివారం శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమలరావు, ప్రసాద్, కీర్తి, రామకృష్ణ, రాము, మాదారపు వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ మాదిగ, విశ్వేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ కణితి సూర్యనారాయణ, ఎలయన్స్ క్లబ్ సభ్యులు జామి మన్మధరావు పాల్గొన్నారు.
కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శంభాజీ షిండే ఆదివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అంతరాలయంలో పూజలు చేయించారు. ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు స్వామి చిత్రపటం, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు
బస్సు నుంచి జారిపడి
వృద్ధురాలికి గాయాలు
వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడాం బస్టాండ్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొనప లక్ష్మీ గాయాలపాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీ సోంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామం వచ్చేందుకు కాశీబుగ్గలో బస్ ఎక్కింది. అంతరకుడ్డ వెళ్లేందుకు చినబడాం బస్టాండ్ వద్ద దిగుతుండగా బస్సు ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీని స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆవిష్కర్ సీజన్–3 హాక్‌థాన్ సాంకేతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమాజ హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాటి ప్రయోజనాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్, యాప్ అభివృద్ధి, ఐఓటీ, డైటా సైన్స్ తదితర అంశాలతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఎంపికై న ప్రాజెక్టుల నిర్వాహకులకు సోమవారం బహుమతులు అందజేయనున్నారు.
గోల్ షాట్‌బాల్ పోటీల్లో ప్రతిభ
కంచిలి: తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థర్డ్ ఫెడరేషన్ కప్ గోల్ షాట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. కంచిలి మండలం జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్యామల విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రులు తరిణి–తులసి వ్యవసాయ కూలీలు. పోటీలో ప్రతిభ కనబరిచిన శ్యామలను జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, వైఎస్సార్ సీపీ నేతలు కప్పల యుగంధర్, మెండ ప్రకాశరావు, మురళి అభినందించారు.
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ


